KTR.. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్‌ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్‌ఎస్ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు.
మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్‌లో అన్‌పార్లమెంట్ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు.
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్, రేవంత్ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడి
Comments
Please login to add a commentAdd a comment