Rupee Value
-
రూపాయి నేలచూపులు!
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 85.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ ఉద్ఘాటించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. పెద్దమొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని మాత్రం గుర్తుంచుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రూపాయి విలువ తగ్గిపోవడానికి కారణాలివే..1. రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 75 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు అమెరికా, చైనా వంటి మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కొంతకాలం వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. -
రూపాయి భారీ పతనానికి కారణాలు
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.కారణాలివే..1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రపంచ పరిణామాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారం మార్కెట్లో స్థిరీకరణ (కన్సాలిడేషన్) అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు స్థూల ఆరి్థక గణాంకాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వచ్చే వారం రోజుల్లో 3 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్, ఆమ్కే ఫిన్ ట్రేడ్ పబ్లిక్ ఇష్యూలు జూలై 19న, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీఓ జూలై 20న ప్రారంభం కానున్నాయి. బక్రీద్ సందర్భంగా నేడు (సోమవారం) ఎక్సే్చంజీలకు సెలవు. ‘‘వివిధ మంత్రిత్వ శాఖలు ప్రకటిస్తున్న ‘అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళిక’లను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే సాంకేతికంగా నిఫ్టీకి 22,800–23,100 శ్రేణిలో కీలక మద్దతు లభించే వీలుంది. కొనుగోళ్లు జరిగి 23,600 స్థాయిని చేధించగలిగే 24,000 మైలురాయిని అందుకోవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కేంద్రంలోని కొత్త ప్రభుత్వం మూలధన వ్యయాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందనే ఆశలతో గతవారం అభివృద్ధి ఆధారిత రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 77,145 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పంది. నిఫ్టీ 175 పాయింట్లు బలపడి 23,490 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కాగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రపంచ పరిణామాలు బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, నార్వేల కేంద్ర బ్యాంకులు ఈ వారంలో ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు వెల్లడించనున్నాయి. దాదాపు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపొచ్చనేది ఆరి్థకవేత్తల అంచనా. యూరోజోన్ మే ద్రవ్యోల్బణం డేటా మంగళవారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) బుధవారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పరపతి సమావేశం గురువారం, అమెరికా జూన్ ప్రథమార్థపు సేవా, తయారీ రంగ గణాంకాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.గతవారంలో రూ.11,730 కోట్ల పెట్టుబడులు ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఆచూతూచి వ్యవహరించిన విదేశీ ఇన్వెస్టర్లు తరువాత దేశీయ మార్కెట్లోకి బలమైన పునరాగమనం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, రానున్న బడ్జెట్లో ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయనే ఆశలతో భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. గత వారం (జులై 14తో ముగిసిన వారం)లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల్లో రూ.11,730 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో నికర అమ్మకాలు (జూన్ 1– 14 వరకు) రూ.3,064 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు ఈ నెలలో (జూన్ 14 వరకు) ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్ లో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ‘‘దేశంలో సంకీర్ణ కూటమి ఉన్నప్పటికీ, వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం విధాన సంస్కరణలు, ఆరి్థక వృద్ధి కొనసాగింపుపై అంచనాలను పెంచింది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ మేనేజర్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. -
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. కారణం..
దేశంలో విదేశీ మారకం నిల్వలు(ఫారెక్స్) క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.82 బిలియన్ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.అంతకుముందు వారంలో ఈ నిలువలు 5.401 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీపడిపోతున్న రూపాయిఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్బీఐ తెలిపింది. డాలర్‌తోపాటు యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే..
సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ సుమారు రూ.83 వద్ద ఉంది. అమెరికాతోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ కూడా రూపాయి కంటే ఎక్కువే. అందుకే ఆయా దేశాల్లో పర్యటించాలన్నా.. అక్కడే స్థిరపడాలన్నా బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. కానీ, కొన్ని దేశాల్లో అక్కడి కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉంది. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వియత్నాం-డాంగ్ దక్షిణాసియాలో ఉండే వియత్నాం దేశానికి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. ఇక్కడ అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ 295.4 వియత్నాం డాంగ్‌గా ఉంది. అంటే రూ.100 వియత్నాం కరెన్సీలో 29,540 డాంగ్‌లతో సమానం. లావోస్-లావోటియన్ కిప్ థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలకు పొరుగున ఉండే లావోస్‌లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. లావోస్ కరెన్సీ లావోటియన్ కిప్. మన ఒక్క రూపాయి.. 248.16లావోటియన్ కిప్తో సమానం. అంటే భారతీయ కరెన్సీ రూ.100కి లావోస్ కరెన్సీలో విలువ 24,816.34. ఇండోనేషియా-రుపియా ఇండోనేషియా కూడా ఆసియా ఖండంలో భాగమే. అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదొకటి. పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఇండోనేషియన్ రుపియా. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 187.95 రూపియాలు. అంటే మన దగ్గర రూ.100 ఉంటే, ఇండోనేషియాలో 18,795 రుపియాలతో సమానం. ఉజ్బెకిస్థాన్-సోమ్ మధ్య ఆసియాలో.. ఇస్లామిక్ దేశాల సరసన ఉన్న ఉజ్బెకిస్థాన్‌లో ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక అవశేషాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఉజ్బెకిస్థానీ సోమ్. మన రూపాయి విలువ అక్కడ 148.23సోమ్స్గా ఉంది. అంటే రూ.100 ఉంటే, ఉజ్బెకిస్థాన్‌లో 14,823 సోమ్స్ ఉన్నట్లే. కాంబోడియా-కాంబోడియన్ రియల్స్ చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తోన్న ఆసియా దేశం కాంబోడియా. అక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. ఆ దేశ కరెన్సీ కాంబోడియన్ రియల్స్ కాగా.. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 49.03గా ఉంది. అంటే భారత కరెన్సీ రూ.100 ఉంటే, కాంబోడియా కరెన్సీలో 4903.70 రియల్స్‌తో సమానం. కొలంబియా-పెసో దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం.. కరేబియన్, పసిఫిక్ సముద్రాల తీరంలో ఉంటుంది. పర్యాటకంగా ఈ దేశం అంతగా అనువైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయట. ముఖ్యంగా మనుషుల్ని అపహరిస్తుంటారు. అందుకే ఈ దేశంలో పర్యటించేవారిని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా.. ఈ దేశ కరెన్సీని కొలంబియన్ పెసోగా పిలుస్తారు. ఒక రూపాయి విలువ అక్కడ 47.60 పెసోలుగా ఉంది. అంటే రూ.100 ఉంటే, అది 4760.15 పెసోలతో సమానం. దక్షిణ కొరియా-కొరియన్ వాన్ తూర్పు ఆసియా దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఈ దేశంలో సినిమాలు, కె-పాప్ సంగీతం, ఫ్యాషన్, టెక్నాలజీ రంగం, కాస్మోటిక్ సర్జరీలు చాలా పాపులర్. ఈ దేశపు కరెన్సీ సౌత్ కొరియన్ వాన్. ఇక్కడి ఒక్క సౌత్ కొరియన్ వాన్తో రూపాయి మారకం విలువ చూస్తే.. ఒక రూపాయి 16.11వాన్లతో సమానం. అంటే రూ.100 ఉంటే దక్షిణ కొరియా కరెన్సీలో 1610.82 వాన్ ఉన్నట్లు. గమనిక: ఈ కరెన్సీ విలువలు జనవరి 18, 2024వ తేదీ ప్రకారం ఇవ్వబడ్డాయి. నిత్యం వీటి విలువ మారుతోంది. గమనించగలరు. -
కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ఇండియన్ రూపాయి సుమారు పదేళ్లపాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలను, పాలకులను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చింది. గ్లోబల్, దేశీయ పరిస్థితులు 2013లో రూపాయి పతనానికి దారితీశాయి. నాటి నుంచి ఇంచుమించు స్థిరంగా కొనసాగిన భారత కరెన్సీ- ఈసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తీవ్ర ఆటుపోట్లకు గురైంది. 2021 నుంచి దాదాపు 12 శాతం నష్టపోయింది. అయితే 2023లో దాదాపు కన్సాలిడేషన్‌లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి కొంతకాలంగా పతనమవుతూ వచ్చింది. డాలరు బలపడటం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వు 2023లో వడ్డీరేట్లను మొదట్లో కొంతమేర పెంచినా తదుపరి వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని సానుకూలంగా స్పందించింది. భారత దిగుమతుల్లో అత్యధికం ముడిచమురే కావడంతో, పెరిగిన ధరల కారణంగా వాణిజ్యలోటు ఏర్పడింది. మదుపరులు ఈక్విటీ, రుణాల రూపంలో ఉన్న విదేశీ ప్రైవేటు పెట్టుబడులను డాలర్లలోకి మార్చుకోవడంతో రూపాయి విలువ పడిపోయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైంది. నవంబర్ చివరి నుంచి డిసెంబర్ నెలలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి చేరుకోవడంతో తిరిగి ఎఫ్ఐఐలు మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా నెల రోజుల నుంచి రూపాయి కన్సాలిడేషన్‌లో ఉంది. రూపాయి పతనానికి ఈ ఏడాదిలో కొంత విరామం లభిస్తుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. గతంలో మన కరెన్సీ పతనానికి దారితీసిన పరిస్థితుల తీవ్రత 2024లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ తన చమురు అవసరాలకు సుమారు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. నిజానికి ముడిచమురు వినియోగం దేశ ఆర్థికప్రగతికి చిహ్నం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. మన చమురు దిగుమతులు దేశ మొత్తం దిగుమతుల్లో 30శాతం వరకు ఉన్నాయి. తగ్గనున్న కరెంటు ఖాతా లోటు.. భారత కరెంటు ఖాతాలో సింహభాగం సాఫ్ట్వేర్ ఎగుమతులు, ప్రైవేటు బదలాయింపులదే. భవిష్యత్తులో ఈ రెండింటి వాటా ఇంకా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దిగివస్తున్న ముడిచమురు ధరలతో వస్తు వాణిజ్యలోటు తగ్గుముఖం పట్టడం; సాఫ్ట్వేర్, ప్రైవేటు బదలాయింపులు పెరగడం- కరెంటు ఖాతా లోటును కొంతవరకు పరిష్కరించగలుగుతాయి. కొత్త ఏడాదిలో ముఖ్యంగా ముడిచమురు వాణిజ్య లోటు తగ్గడం, కరెంటు ఖాతా లోటు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల రాక వంటి బలమైన ఆర్థిక పరిస్థితులు రూపాయిని బలోపేతం చేస్తాయని చెప్పవచ్చు. మాంద్యం ప్రభావం ఇలా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులతో కొన్ని దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో మాంద్యం మరింత తీవ్రంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం. 2024లో ఇది 2.9 శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గతంలో వెల్లడించింది. ఈలోగా డాలరు సాధారణంగానే బలపడుతుంది. 2001 మాంద్యం సమయంలో డాలరు సూచీ ఆ ఏడాది జనవరిలో 108గా ఉండగా జులై నాటికి 121కు పెరిగి, ఆ తరవాత తగ్గింది. అలాగే 2008-09 మాంద్యం కాలంలో డాలరు సూచీ 71 నుంచి 89కు ఎగబాకి ఆ తరవాత కిందికి వచ్చింది. అంటే సాధారణంగా మాంద్యం సమయంలో డాలరు తొలుత బలపడి, తరవాత బలహీనపడుతుంది. ఇదీ చదవండి: ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే.. మిగతా దేశాలపై ఉన్నట్లే ఒకవేళ భారత్‌పైనా మాంద్యం ప్రభావం ఉంటుందని భావించినా- మాంద్యం మధ్యకాలం నుంచి విదేశీ పెట్టుబడులు భారత్‌లో విశేషంగా ప్రవహించి ఆ ప్రవాహం కొన్నాళ్లు కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది. 2008-09 సంక్షోభ సమయంలో భారత్ నుంచి 1200 కోట్ల డాలర్ల మేర ఈక్విటీ వెనక్కి తరలిపోయింది. 2009లో మార్చి-జూన్ మధ్య మాంద్యం తిరోగమనం పట్టడంతో తిరిగి ఈక్విటీ రూపంలో పెట్టుబడులు భారత్‌లోకి రావడం మొదలయ్యాయి. అదే ఏడాది మార్చి- డిసెంబరు కాలంలో 1800 కోట్ల డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. దీన్ని బట్టి మాంద్యం తీవ్రరూపం దాల్చినా స్వల్పకాలమే ఉంటుందని చెప్పవచ్చు. -
రూపాయి పతనానికి కారణాలు ఇవేనా..?
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 83.2625 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా మాట్లాడుతూ..ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయన్నారు. రూపాయి మారకపు విలువ కనిష్ఠస్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 83.2625 వద్ద ట్రేడవుతుంది. రూపాయి ధర 83.25కు చేరగానే ఆర్బీఐ జోక్యం చేసుకుని.. అంతకు దిగజారకుండా చర్యలు తీసుకుంటుందని అంచనా. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్లు శుక్రవారం దాదాపు 6శాతం పెరిగాయి. మిడిల్ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల బ్యారెల్ ముడిచమురు ధర 91 యూఎస్ డాలర్లకు చేరింది. ప్రభావం ఇలా.. రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గుతాయి. అంతే తప్ప విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది. ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..! కారణాలివే.. 1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు. 2. ముడిచమురు ధర 91 డాలర్ల పైకి చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ పైపైకి ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది. 3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. 4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించుకొని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడిచమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే, రూపాయి పతనం ఆగుతుంది. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
బలహీన బాటలో రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. -
మందగమనంలో ఆర్థిక వ్యవస్థ
దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పలు సందర్భాలలో సంక్షోభాల వలయంలో చిక్కుకొన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితి అన్నింటికంటే దయనీయంగా ఉంది. సంక్షోభం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా సర్వవ్యాపితంగా కనిపిస్తోంది. సెంచరీ దాటిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదవుతున్నా కిందకి దిగడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిందంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే! దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పి చాలాకాలమే అయింది. నూనెలు, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, గోధుమలు వంటి నిత్యావసరాల ధరలు పైపైకి పోతున్నాయి. నిరుద్యోగం తీవ్రంగా ఉంది. ఎరువుల ధరలు పెరగడంతో వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనా వల్ల మందగించిన పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు కొంత మెరుగయినప్పటికీ ఆశించిన స్థాయిలో లేదు. దేశంలో దిగుమతులు పెరిగాయి. ఎగు మతులలో క్షీణత నమోదవుతోంది. ఫలితంగా కరెంట్ ఎకౌంట్ బ్యాలెన్స్‌లో లోటు పెరిగిపోతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇక, రూపాయి శీఘ్రంగా పతనం అవుతూ సెంచరీ కొట్టే దిశగా సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న పన్నులు, సెస్సులు అంతకంతకూ పెరిగిపోతున్నా, ఇబ్బడి ముబ్బడిగా విదేశీ రుణాలు తీసుకొంటున్నా, బడ్జెట్ అవసరాలను తీర్చలేక కేంద్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఆర్థికరంగం ముఖచిత్రం ఇంత ఘోరంగా తయారవుతుంటే, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించకుండా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అమెరికా డాలర్ బలపడటం వంటి బయటి అంశాలే కారణమని ఎటువంటి వెరపు లేకుండా సమర్థించు కోవడం అందర్నీ నిశ్చేష్టుల్ని చేస్తోంది. ఎవరు అధికారంలో ఉన్నా... సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. కానీ, వాటిని ఎదుర్కొని ప్రతికూల పరిణామాల ప్రభావం ప్రజలపై దీర్ఘకాలం పాటు పడకుండా చూడడమే ప్రభుత్వ బాధ్యత. కేంద్రంలోని ఎన్డీయే తీరు ఎంత బాధ్యతారహితంగా ఉన్నదంటే.. తమ తప్పుల్ని గత పాలకుల పాపాలుగా చూపి చేతులు దులుపుకొనే ప్రయత్నమే చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున 90 డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ. దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 కిందికి దిగడం లేదు. 2013లో బ్యారెల్ ధర 140 డాలర్లు పలికినపుడు కూడా లీటర్ పెట్రోల్ రూ. 70 కే లభించిం దికదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించడానికి ధర పెంచాం అనే సమాధానం ఇస్తున్నారు. కశ్మీర్లో శాంతిభద్రతలు అదుపు తప్పితే.. అందుకు దేశ తొలి ప్రధాని నెహ్రూని నిందిస్తారు. ఆకలి సూచీలో భారత్ ర్యాంకు దిగజారిందంటే, అవన్నీ తప్పుడు లెక్కలని దబాయి స్తున్నారు. రూపాయి పతనానికి వింత భాష్యం చెప్పారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ 8 ఏళ్లలో దాదాపు 42 శాతం మేర పతనం అయింది. ఇటీవలికాలంలో విదేశీ మారకద్రవ్య నిల్వల నుండి దాదాపు ఒక బిలియన్ డాలర్లు వెచ్చించి పటిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేసినా రూపాయి బలపడలేకపోయింది. 642 బిలియన్ డాలర్ల మేర ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ మారకం నిల్వలు కేవలం 9 నెలల దిగుమతులకే సరిపోతాయి. కనీసం రెండేళ్ల దిగుమ తులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం ఉంటే... అది ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. వాస్తవం ఈ విధంగా ఉంటే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి క్షీణించలేదు... డాలర్ బలపడిం దంటూ చేసిన ప్రకటన క్రూర పరిహాసమే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు నిజంగానే ఇతర కరెన్సీల కంటే రూపాయి మెరుగ్గానే ఉందా? అని ప్రశ్నించు కొంటే సమాధానం దొరకదు. ఉదాహరణకు విదేశాలలో విద్యనభ్య సిస్తున్న భారతీయ విద్యార్థులు ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వసతి మొదలైన వాటికయ్యే ఖర్చును డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క బ్రిటన్‌లోనే పౌండ్లలో చెల్లిస్తారు. అంటే, ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మెరుగ్గా ఉందని చెçప్పుకొన్నప్పటికీ... చెల్లింపులన్నీ డాలర్లలో చేసేటప్పుడు అదనపు భారాన్ని ఎవరు మోస్తున్నట్లు? తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించుకోవడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేటునే పాటించాలి. కనుక రూపాయి పటిష్టంగా ఉంటే డాలర్‌కు 82 నుంచి 84 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నట్లు? రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ఉపసంహరించు కుంటున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, రుణ భారాన్ని తగ్గించుకొంటూ ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేసినప్పుడే పరిస్థితులు మెరుగ వుతాయి. విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవాలంటే దిగుమతుల్ని తగ్గించాలి. ప్రస్తుతం వాణిజ్య లోటు రూ. 2,600 కోట్ల డాలర్ల మేర ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముడి చమురు, ఎరువుల దిగుమతులకు అధిక శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్న నేపథ్యంలో పర్యాటకం, పారిశ్రామిక రంగాలను ప్రోత్స హించి విదేశీ కరెన్సీ రాబడి పెరిగేలా చూడాలి. అది జరగాలంటే... దేశంలో శాంతిభద్రతలు మెరుగవ్వాలి. మౌలిక సదుపాయాలు విస్తరించాలి. దిగుమతులలో అత్యధికంగా ఉన్న నూనెగింజలు, పప్పు ధాన్యాలను దేశీయంగానే సాగు చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు. ఈ అంశంలో నీతి ఆయోగ్ వెలువరించిన విధాన పత్రం ఏమయిందో తెలియదు. కాగా, ఇటీవల బియ్యం ఎగుమతులపై భారీ సుంకం విధించడంతో వాటి ఎగుమతులు మందగించి విదేశీ మారకద్రవ్యం ఆర్జించే అవకాశాలు తగ్గాయి. రష్యాతో చమురు దిగుమతుల ఒప్పందం కుదుర్చుకొన్నాక ఆ చెల్లింపులను డాలర్లలో కాక రూపాయిల్లోనే జరపడం కొంత ఊరట నిచ్చే అంశం. మేకిన్ ఇండియా ద్వారా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసు కొంటాం అని కేంద్రం నమ్మకంగా చెప్పిన విషయం ఆచరణలో తేలిపోయింది. చైనా ఆర్థికరంగంతో పదేపదే పోల్చుకొంటున్నప్పుడు, చైనా మాదిరిగా అన్ని రంగాలకు అవసరమైన యంత్రాలు, ఇతర సాధన సంపత్తిని ఎందుకు సమకూర్చుకోలేక పోతున్నామో సమీక్షిం చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపడంతో వేలాదిమంది రుణ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకొని ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ రంగ బ్యాంకుల బ్రాంచీల సంఖ్యను కుదించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి పరపతి సౌకర్యం మునుపటిలా సజావుగా అందడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీన్నిబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం సంపన్న వర్గాల సేవలకే పరిమితం అవుతున్నట్లు భావించాల్సి వస్తోంది. నిజానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతుంది. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. సెస్సుల ద్వారా రాష్ట్రాలకు వాటా ఇవ్వని ఆదాయం కేంద్రానికి సమకూరు తోంది. ఇదికాక, ఎల్ఐసీ వంటి పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా లభిస్తున్న నిధులు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, ‘పీఎం కేర్స్’కు అందుతున్న విరాళాలు... ఇవి చాలవన్నట్లు విదేశీ అప్పులు! ఈ విధంగా పెద్దఎత్తున కేంద్రానికి నిధులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో సరైన విధానం లేకపోవ డంతోపాటు, రాజకీయ వ్యూహాలపై అధిక సమయం వెచ్చిస్తూ దేశాభి వృద్ధిని నిర్లక్ష్యం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కల్లోలం తర్వాత పరిస్థితులు క్రమంగా కుదుటపడినప్పటికీ అన్ని రకాల సేవలు, వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో తమ ఆదాయాల్లో ఏమాత్రం పెరుగుదల లేని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లకు తక్షణం కేంద్ర ప్రభుత్వం ముగింపు పలకాలి. సి.రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?
ఒక దేశపు కరెన్సీ మారకం రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ సమానంగా ఉంటే, మారకాల సమస్య, ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్య మాత్రమే. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగుమతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. ఇటీవల తరచుగా వినిపిస్తున్న ఒక వార్త: ‘డాలరుతో మారకంలో రూపాయి విలువ పడి పోతోంది’–అని. రూపాయి ‘మారకం విలువ రేటు’లో మార్పునకి కారణాన్ని తెలుసుకోవా లంటే, ‘మారకం’ అంటే ఏమిటో, ‘మారకం విలువ’ అంటే ఏమిటో ముందు తెలియాలి. సరుకుల ‘మారకం’ అంటే, ఒక వ్యక్తిగానీ, ఒక దేశంగానీ, ఒక సరుకుని బైటికి ఇచ్చి, ఇంకో సరుకుని బైటినించీ తీసుకోవడమే. సరుకుకి ‘మారకం విలువ’ అంటే, ఆ సరుకుని తయారు చేయడానికి పట్టిన శ్రమ కాలమే. ఎక్కువ శ్రమ జరిగితే ఎక్కువ విలువ, తక్కువ శ్రమకి తక్కువ విలువ. ఏ సరుకుని తయారు చేయడానికైనా, మొదట ప్రకృతిలో దొరికే సహజ పదార్థం ఏదో ఒకటి వుండాలి. ప్రకృతి సహజ పదార్థం మీద శ్రమ జరిగితే, ఏదో ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువుని అమ్మకానికి పెడితే, అదే ‘సరుకు’. ఒక సరుకు తయారు కావడానికి జరిగిన శ్రమని కొలవడానికి వున్న సాధనం అది జరిగిన ‘కాలమే’. గంటలో, రోజులో, నెలలో, సంవత్సరాలో! సరుకుని, మారకం కోసం ఇవ్వడం అంటే, దాన్ని అమ్మడమే. అప్పుడు ఆ సరుకు వల్ల ‘కొంత డబ్బు’ వస్తుంది. ‘డబ్బు’ అంటే, సరుకుని తయారుచేసిన శ్రమ కాలమే– అని గ్రహించాలి. డబ్బుకి వెనక, ఆధారంగా వుండేది బంగారం అనే లోహం! బంగారం కూడా ఇతర సరుకుల లాగే, మొదట గనుల్లో దొరికే సహజ పదార్థం తోటీ, దానిమీద జరిగే శ్రమల తోటీ తయారవుతుంది. మారకం విలువ రేటునీ, తర్వాత ఆ రేటులో మార్పునీ తెలుసుకోవడానికి, మొదట ఇంత వరకూ చూసిన విషయాలు చాలు. 2 దేశాల డబ్బుల మధ్య మారకం విలువ రేటు ఏర్పడడానికి ఆధారం – ఆ 2 దేశాల డబ్బుకీ వెనక వుండే కొంత కొంత బరువుగల బంగారాలే. డాలర్ దేశపు డబ్బు వెనక 4 గ్రాముల బంగారం వుందనీ, రూపాయి దేశపు డబ్బు వెనక 2 గ్రాముల బంగారం వుందనీ అనుకుందాం. అప్పుడు ఒక డాలరు= 2 రూపాయలు అవుతుంది. ఇది, ఆ రెండు దేశాల డబ్బులకు వున్న మారకం విలువ రేటు. ఇది, ఆ దేశాల డబ్బు వెనక వున్న బంగారాల కొలతల్ని బట్టే! ఈ కొలతలు మారడానికి, వేరే వేరే కారణాలు కూడా వుండొచ్చు. 2వ ప్రపంచ యుద్ధకాలం తర్వాత, డాలర్ దేశంలో (అమె రికాలో), ఆర్థిక పరిస్థితులు ఇతర దేశాలలో కన్నా ‘అభివృద్ధి’ చెంది వున్నాయి. ముఖ్యంగా, ఆ నాడు ఏ దేశంలోనూ లేనన్ని బంగారు నిల్వలు డాలరు దేశంలో వున్నాయి. దానివల్ల, డాలరు దేశపు ఆధిక్యం పెరిగింది. అప్పట్నించీ ‘అంతర్జాతీయ ధనం’గా డాలరుని దాదాపు అన్ని దేశాలూ అంగీకరిస్తూనే వున్నాయి. వేరు వేరు దేశాల మధ్య ఎగుమతులతో, దిగుమతులతో ‘విదేశీ వర్తకాలు’ జరుగుతూ వుంటాయి. ఒక దేశం ఇంకో దేశానికి కొంత డబ్బు ఇవ్వవలిసి వస్తే, ఆ డబ్బు లెక్కని, ఆ 2 దేశాల డబ్బులకూ వున్న మారకం రేటు ప్రకారమే లెక్క చూడాలి. ఒక దేశం నించి, ఆ రెండో దేశం డబ్బుకి ఎన్ని డాలర్లు వస్తాయో కూడా లెక్క చూసి, ఆ డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక దేశపు కరెన్సీ మారకం విలువ రేటు ఎందుకు తగ్గుతుంది? దేశాల మధ్య ఎగుమతుల విలువలూ, దిగుమతుల విలువలూ సమానంగా వుంటే, వేరు వేరు దేశాల డబ్బు మారకాల సమస్య, కేవలం ఎకౌంట్లు చూసుకునే సాంకేతిక సమస్యగా మాత్రమే వుంటుంది. కానీ, 2 దేశాల మధ్య ఎగుమతులూ దిగు మతులూ సమానంగా వుండడం ఎప్పుడో గానీ జరగదు. భారత దేశం ఏ దేశానికి చెల్లించవలిసి వచ్చినా, సాధారణంగా డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, అప్పుడు భారత దేశానికి డాలర్లు అవసరం. ఆ డాలర్లు ఎంత మొత్తంలో కావాలీ – అనేది, భారత దేశం ఇతర దేశాలకు చేసిన ఎగుమతుల, దిగుమతుల విలువ ఎంతా– అనే లెక్క (కరెంట్ ఎకౌంటు) మీద ఆధార పడి వుంటుంది. గత కొంత కాలంగా, భారత దేశానికి దిగుమతుల కోసం (ఉదాహరణకి: క్రూడ్ ఆయిల్ కోసం) అయ్యే ఖర్చు ఎక్కువగా వుండడం వల్ల, భారత దేశం ఇతర దేశాల దిగుమతుల కోసం చెల్లించేదాన్ని ఎక్కువ డాలర్లలోనే చెల్లించాలి. కాబట్టి డాలర్లని కొనడం కోసం డాలర్లు అమ్మే కరెన్సీ మార్కెట్‌కి వెళ్ళాలి. డాలరు అనేది, బియ్యం లాంటి వాడకం సరుకు కాకపోయినప్పటికీ, అది కరెన్సీలను అమ్మే, కొనే మార్కెట్లో ఒక సరుకుగా అయింది. ఏ సరుకుకి అయినా, దాని సప్లై తక్కువగా వుంటే, అది దొరకడం కష్టం కాబట్టి దాని కోసం డిమాండ్ పెరిగి, దాని ధర పెరుగుతుంది. అలాగే, డాలర్లని కొనవలిసిన పరిస్థితిలో, దాని ధర తగ్గడమో, పెరగడమో జరుగుతుంది. ఈ దశలో, ఏ దేశం అయినా, ఇతర దేశాలకు చెల్లించవలిసిన దిగుమతుల డబ్బుని డాలర్లలోనే చెల్లించాలి కాబట్టి, డాలర్లకి డిమాండు ఎక్కువగా వుంటుంది. అప్పుడు డాలర్లని ఎక్కువ ధరలతో కొనాలి. అలాంట ప్పుడు ఒక డాలర్‌కి, గతంలో కంటే ఎక్కువ రూపాయిలు ఇచ్చి కొన వలిసి వస్తుంది. ఉదాహరణకి, డాలరు ధర పెరుగుతూ, పెరుగుతూ, కిందటి నెలలో 70 రూపాయిలు అయింది. ఆ ధర ఇప్పుడు 80 కూడా దాటేసింది. పత్రికల్లో, ‘‘డాలరు మిలమిల, రూపాయి వెల వెల!’’ అనే హెడ్డింగులు కనిపిస్తున్నాయి. అంటే, రూపాయి విలువ తగ్గుతూ, తగ్గుతూ పోతోంది. అంటే, డాలరుని ప్రతీసారీ ఎక్కువ రూపా యలతో కొనవలిసి వస్తోంది. అలా కొన్న డాలర్లని, దిగుమతుల చెల్లింపుల కోసం ఇవ్వాలి. రూపాయి దేశం, డాలర్ల కోసం, వేల వేల రూపాయల్ని ఖర్చు పెట్టెయ్యవలిసి వస్తుంది. (రూపాయి మారకం విలువ తగ్గిన ఈ సమస్య ఈ దేశంలోనే సరుకుల్ని కొనడానికి వర్తిస్తుందా? దీన్ని ఇక్కడ వివరించలేము.) ఈ సమస్యకు పరిష్కారం, వీలైనంత వరకూ ప్రతీ దేశమూ, తన దగ్గిరవున్న వనరులతో, కావలిసిన వస్తువుల్ని సొంతంగా తయారు చేసుకోవడమే! తప్పనిసరి వాటికోసం మాత్రమే వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడొచ్చు. కానీ, లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారీ విధానంలో, అది సాధ్యం కాదు. ఎందుకంటే, పెట్టు బడిదారుల మధ్య, ‘దేశంలో ఎన్ని సరుకుల్ని అమ్మగలం? విదేశాలకు ఎన్ని సరుకుల్ని అమ్మగలం?’ అనే ఒక సమష్టి ప్లానింగు వుండదు. సమష్టి ప్లానింగు వుండని చోట ఎగుమతులూ, దిగుమతులూ సమానంగా వుండవు. అలా వుండనప్పుడు మారకం రేట్లు కూడా స్థిరంగా వుండవు. రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి పతనం
-
రూపాయి డౌన్, అబద్ధాలు అప్.. రూపాయి పతనంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రూపాయి విలువ ఎన్నడూ లేనంత దిగజారింది. కానీ అబద్ధాలు మాత్రం ఎన్నడూ లేనంతగా పెరిగా యి. రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోను వెతకడంలో తీరిక లేకుండా ఉన్నారు. రూపాయి తన సహజ మార్గంలో వెళ్తోందని, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలన్నీ దేవుడి లీలలు అని మీకు చెప్తారు. విశ్వగురు వర్ధిల్లాలి అని నినదించమంటారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘రూపాయి విలువను ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి అంటూ జ్ఞానా న్ని అందజేస్తున్న భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. విశ్వగురు మోదీ మీ వాదనను అంగీకరించరు. ఆయన జ్ఞాన సంపదలోని కొన్ని ఆణిముత్యాలను మీ దృష్టికి తెస్తున్నా. ‘కేంద్రంలో అవినీతి పెరగడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. రూపా యి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది’ అంటూ 2013లో గుజరాత్ సీఎంగా మోదీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లను పదుల సంఖ్యలో కేటీఆర్ తన వ్యాఖ్యలకు జోడించారు. ప్రభుత్వ పనితీరుకు మన్ననలు.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట పండటంపై పంచాయతీరాజ్ మంత్రి దయాకర్‌రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక ‘పల్లె ప్రగతి’ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినా తమ ప్రభుత్వ పనితీరు అనేక మంది మన్ననలు పొందుతూ, మనసు చూరగొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,450 కోట్లు విడుదల చేయడంపై స్పందిస్తూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే రైతులకు జీవిత బీమా చేస్తోందని, ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 85 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించిందన్నారు. ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు వర్తించేలా రూ. 1,450 కోట్లు ప్రీమియంగా చెల్లించామన్నారు. సెర్బియా సదస్సుకు ఆహ్వానం... అక్టోబర్ 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే ‘బయోటెక్ ఫ్యూచర్ ఫోరమ్’సదస్సుకు హాజరు కావాలంటూ సెర్బియా ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సెర్బియా ప్రధాని అనా బ్న్రాబిక్కు కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రత్యేకించి బయో టెక్నాలజీ రంగంలో తెలంగాణ సామర్థ్యానికి ఈ ఆహ్వానాన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
విధాన చికిత్సతోనే ఆర్థికారోగ్యం
అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి వేగంగా పతనమవుతోంది. డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపాయలు వెచ్చించాలి. విలువ తగ్గిన కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రూపాయి విలువ పతనం మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమ లాభదాయికతను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం ద్వారా కేంద్రప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారక విలువ ఇటీవలి సంవత్సరాల్లో దిగజారిపోతూ వచ్చింది. దీంతో ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ నగదు బదిలీలు ప్రభావితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సాపేక్షిక బలం ఈ సంవత్సరం 5.9 శాతానికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలం వేగంగా పతనమవుతూ వస్తోంది. అంటే డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపా యలు వెచ్చించాలన్నమాట. రూపాయి విలువ పతనమవుతున్నదంటే, స్థూల ఆర్థిక ప్రాథమిక సూత్రాల బలహీనతకు అది సంకేతం. స్థూల ఆర్థిక చరాంకాల్లో వడ్డీ రేటు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణం, నిరు ద్యోగిత, మదుపు అనేవి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చాలినన్ని చర్యలు చేపట్టకపోవడం... రూపాయి పతనం సహా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు దిగ జారడాన్ని అనుమతించినట్టయింది. రూపాయి పతనమవుతున్న రేటు సమీప భవిష్యత్తులో భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనబోతోందన్న సంకేతాలను వెలువరిస్తోంది. మారకపు రేటు అస్థిరత్వం అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణా మాలతో నేరుగా ప్రభావితం అవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, చుక్కలనంటిన చమురు ధరలు, చమురు దిగుమతులపై భారతదేశం అత్యధికంగా ఆధారపడటం అనేవి స్వేచ్ఛాయుతంగా చలించే మార కపు రేటు వ్యవస్థలో రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విలువ తగ్గిపోయిన భారతీయ కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం మేరకు ముడి చమురు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ప్రపంచంలోనే చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం భారత్. ఏటా 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2021–22లో ఈ దిగు మతులు విలువ 119 బిలియన్ డాలర్లు. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మ కాలు డాలర్లలోనే జరుగుతున్నాయి కనుక డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది మన ఎగుమతు లకు సాయం చేసినప్పటికీ, దిగుమతులపై అధికంగా ఆధారపడటం కారణంగా భారత్ దెబ్బతింటోంది. దేశీయంగా చూస్తే, భారత్ ఇప్పటికే 9.6 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఇది దేశ స్థూలదేశీయోత్పత్తిలో 1.3 శాతానికి సమానం. రూపాయి బలహీనపడుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగవచ్చు. పైగా, జీడీపీలో 6.4 శాతం అధిక ద్రవ్యలోటు వల్ల 2022–23 సంవత్సరంలో భారత విదేశీ రుణం రూ. 1,52,17,910 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో 9.41 లక్షల కోట్ల మేరకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. లేదా ఇది మొత్తం రెవెన్యూ వ్యయంలో 29 శాతం. రూపాయి విలువ పతనం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. పైగా, ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి చేరడం, విదేశీ సంస్థాగత మదుపుదారులు 2022లో 28.4 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా డాలర్ మారక రూపాయి క్షీణించడానికి దారి తీసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల తాము పెట్టిన పెట్టుబడులకు తక్కువ రాబడులు రావడం లేదా లాభ దాయకత తగ్గిపోవడంతో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజు కుంది. లాభాలను ఆశించడంతోపాటు, తాము పెట్టుబడులను పెట్టా లంటే స్థిరమైన, నిలకడైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని విదేశీ సంస్థాగత మదుపుదారులు కోరుకుంటారు. మరోవైపున రూపాయి కొనుగోలు శక్తి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు అత్యధికంగా పెరిగి పోయాయి. అధిక ద్రవ్యోల్బణం రేటు రూపాయి విలువను దిగజార్చి వేసింది. అంటే జీవనవ్యయం పెరిగిపోయిందని అర్థం. దీని ఫలి తంగా ఉత్పత్తి ఖర్చులు, జీవన వ్యయం పెరిగి, పరిశ్రమలు, మదుపు దారులు లాభాలు సాధించే అవకాశం హరించుకుపోయింది. అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్లోని ‘హాట్ కరెన్సీ’తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ పెరగడాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక శక్తి నిర్ణయించబడుతుందని ఇది సూచిస్తుంది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థికవ్యవస్థగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కానీ ఇతర దేశాలతో సమానంగా భారత ఆర్థిక శక్తిని నిర్ణయించడంలో అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్ ముఖ్యపాత్ర వహిస్తుందని మరవరాదు. విధానపరమైన జోక్యం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయినట్లయితే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. రూపాయి విలువ పతనం వల్ల చెల్లింపుల సమస్య మరింత దిగజారిపోతుంది, మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమల లాభదాయిక తను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే భారతీయులపై భారం పెరిగిపోతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. నిరుద్యోగం అమాంతం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ సకాలంలో, కఠినమైన విధాన పరమైన జోక్యం చేసుకోవడం ద్వారానే డాలర్ మారక రూపాయి విలువ పతనాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకోవచ్చు. పెరిగిపోతున్న ఎక్స్చేంజ్ రేట్లను సమర్థంగా నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతకు మించి భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ పన్నులు అధికంగా ఉన్నాయి. వీటిని కుదించాల్సిన అవసరం ఉంది. డాలర్ల రూపంలో విదేశీ మారకద్రవ్యాన్ని 49 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపర్చడంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వలను 600 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పర్చడంలో ఆర్బీఐ సమర్థంగా పనిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉంచిన డాలర్లను విడుదల చేయడం ద్వారా మన కరెన్సీ విలువను స్థిరపర్చడానికి ఆర్బీఐ జోక్యం తోడ్పడుతుంది. మన రూపాయికి విదేశీ విలువ పైనే ఆర్థిక పురోగతి, ద్రవ్య సుస్థిరత ఆధారపడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మదుపు దారులు, ప్రవాస భారతీయ మదుపుదారులను ప్రోత్సహించాలంటే రూపాయి విలువకు విదేశాల్లో స్థిరత్వాన్ని ఆర్బీఐ కలిగించాలి. ఎందుకంటే ఆఫ్ షోర్ కరెన్సీ, ఇతర ద్రవ్యపరమైన రిస్కులు ఆర్థిక వ్యవస్థపై వేగంగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, బలమైన ఆఫ్‌షోర్ రూపీ మారక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, డాలర్ మారక రూపాయి అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆటు పోట్లను తగ్గించవచ్చు కూడా. దీనికి సంబంధించి ఉషా తోరట్ అధ్యక్షతన ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదిక సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంది. బలమైన దేశీయ, విదేశీ రూపీ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, అది స్థిరమైన ధరల నిర్ణాయకం లాగా వ్యవహరిస్తుందనీ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మన రూపాయిపై డాలర్ కలిగించే షాక్‌లను తట్టు కునేలా చేస్తుందనీ ఈ నివేదిక సూచించింది. కృష్ణ రాజ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్, బెంగళూరు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వరుసగా ఏడో సెషన్లో రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
-
రూపాయి పతనంపై అందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి పతనంపై ఆందోళనలను తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. రూపాయి విలువ బాగానే ఉందని, అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ క్షీణతపై ‘మరీ’ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి (డీఈఏ) అజయ్ సేథ్ మంగళవారం స్పష్టం చేశారు. బ్రిటీష్ పౌండ్, జపాన్ యెన్, యూరో వంటి అనేక ప్రపంచ కరెన్సీల మారకంలో భారత కరెన్సీ మెరుగ్గా ఉందని అన్నారు. ఈ పరిస్థితి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఈ కరెన్సీలలో భారత్ దిగుమతుల వ్యయాన్ని చౌకగా మార్చిందని కూడి వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది కూడా రాజ్యసభలో ఇదే తరహా ప్రకటన చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడినప్పటికీ బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్ యూరో వంటి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి బలపడిందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారకపు మార్కెట్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుందని, తీవ్ర అస్థిరత పరిస్థితులలో జోక్యం చేసుకుంటుందని ఒక లిఖితపూర్వక సమాధానంలో చతుర్వేది తెలిపారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్ ప్రాతిపదిక పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం మేర నమోదవుతుందన్న ధీమాను రాజ్యసభలో వ్యక్తం చేశారు. కారణం ఏమిటంటే... ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రూపాయి భారీ పతనానికి కారణాన్ని వివరిస్తూ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును కఠినతరం చేయడం వల్ల డాలర్‌పై రూపాయి పతనమవుతోందని అన్నారు. ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అమెరికాకు ప్రవహిస్తున్నాయని అన్నారు. దీనితో పలు దేశాల కరెన్సీలు పతన బాట పట్టాయని వివరించారు. నిజానికి పలు ఇతర కరెన్సీలతో పోల్చితే భారత్ కరెన్సీ పతనం తక్కువేనని అన్నారు. దేశంలోకి ఫారెక్స్ భారీగా రావడానికి ఆర్బీఐ రెండు వారాల క్రితమే విస్తృతమైన చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేస్తూ, ఈ దిశలో అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. డాలర్ మారకంలో రూపాయి మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తీవ్ర ఒడిదుడుకుల నివారణకూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఇంట్రాడేలో 80 దాటిన రూపాయి ఇదిలాఉండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో మొదటిసారి 80 దాటిపోయి, 80.05ను తాకింది. అయితే చివరకు క్రితంతో పోల్చితే 6పైసలు బలపడి 79.92 వద్ద ముగిసింది. రూపాయి విలువ సోమవారం (18వ తేదీ) మొదటిసారి 80ని తాకి చరిత్రాత్మక కనిష్టాన్ని చూసింది. అయితే అటు తర్వాత తేరుకుని 79.98 వద్ద ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ చరిత్రాత్మక కనిష్ట ముగింపు 79.9975. గత గురువారం (14వ తేదీ 18 పైసలు క్షీణతతో) ఈ స్థాయిని తాకింది. 2022లో ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి 7.5 శాతం (563 పైసలు) నష్టపోయింది. -
TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
KTR.. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పెద్దల అవినీతి వల్లే రూపాయి విలువ పడిపోతోంది. మొదటి సర్వే బీజేపీది, రెండో సర్వే కాంగ్రెస్‌ది.. కానీ, వారి షాకిస్తూ రెండు సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తుందనే తేల్చాయి. మా ప్రత్యర్థుల సర్వేలు కూడా మూడోసారి టీఆర్ఎస్ గెలుస్తుందని ఒప్పుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో గెలుస్తాము. నల్లగొండ, ఖమ్మంలో బీజేపీకి మండల స్థాయి నాయకులు లేరు. కాంగ్రెస్‌కు కూడా కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కట్టప్పల గురించి కేసీఆర్ వివరంగా చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. పార్లమెంట్లో అన్‌పార్లమెంట్ పదాలు వాడేది బీజేపీ నేతలే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ప్రధాని మోదీ ప్రైవేటు విజిట్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వస్తే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో మాకు ఎటువంటి పంచాయితీ లేదు. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్, రేవంత్ సిరిసిల్లకు వచ్చి ఏం చేస్తారు?. అందరు ప్రధానులు రూ. 56లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ ఒక్కరే 100 లక్షల కోట్ల అప్పులు చేశారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది?. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు’’ని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడి -
రూపాయి మళ్లీ రివర్స్‌గేర్..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 76.42 వద్ద ముగిసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాల్లో నడిచిన రూపాయి, బుధ, గురు వారాల్లో కొంత తేరుకుని 33 పైసలు లాభపడింది. అయితే మళ్లీ మూడవరోజు యథాపూర్వం నష్టాలోకి జారింది. దేశం నుంచి విదేశీ మారకపు నిల్వలు వెనక్కు మళ్లడం, డాలర్ ఇండెక్స్ (101) 25 నెలల గరిష్ట స్థాయికి చేరడం, మేలో జరిగిన ఫెడ్ ఫండ్ సమీక్షలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల (ప్రస్తుతం 0.25–0.50 శాతం శ్రేణి) వడ్డీరేటు పెరుగుతుందన్న వార్తలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. డాలర్ మారకంలో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 76.31 వద్ద రూపాయి ప్రారంభమైంది. 76.19 గరిష్ట–76.50 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి ఇవి రెండు చరిత్రాత్మక స్థాయిలు. తాజా అనిశ్చిత పరిస్థితులు రూపాయి బలహీనతకే దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉🏼: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్‌లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్‌పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్‌సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్‌కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. -
విదేశీ నిధుల ప్రవాహంపై రూపాయికి భరోసా!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది. రానున్న వారాల్లో జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్ ఇండెక్స్ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేసిందని ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్థమాన దేశాల్లో భారత్ కరెన్సీనే బుధవారం ప్రధానంగా బలపడింది. డాలర్‌పై చైనా యువాన్ ర్యాలీ (దాదాపు నాలుగు నెలల గరిష్టానికి అప్) మొత్తంగా ప్రాంతీయ కరెన్సీలకు మద్దతునిస్తోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలిప్ పార్మార్ పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ స్వల్ప లాభాల్లో 74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాల్లో 93.64పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
బంగారం మరింత దిగొస్తుందా?
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర ఫిబ్రవరి 5వ తేదీ శుక్రవారం 1,815 డాలర్ల వద్ద ముగిసింది. అంతక్రితం వారం (జనవరి 29) ముగింపుతో పోల్చితే దాదాపు 70 డాలర్లు పతనమైంది. వారం ట్రేడింగ్ ఒక దశలో 100 డాలర్ల మేర పతనమైంది. ఇప్పుడు బంగారం పయనంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మార్కెట్ నిపుణులు క్రిస్టోఫర్ లివీస్ అంచనాల ప్రకారం.. పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో 1,750 డాలర్ల దిగువకు పడిపోతే మరింత పతనం వేగంగా జరిగే అవకాశం ఉంది. 50 వారాల ఈఎంఏ (ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్) 1,786 డాలర్లకు గతవారం చివరిరోజు పసిడి తాకినప్పటికీ, ఆ స్థాయిలో మద్దతు తీసుకుని పైకి ఎగసింది. ఉపాధి అవకాశాలకు సంబంధించి అమెరికా గణాంకాలు పేలవంగా ఉండడం దీనికి కారణం. 1,750 డాలర్ల వద్ద తక్షణ మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని బంగారం నిలబెట్టుకోగలిగితే, 1,850 డాలర్ల స్థాయికి తిరిగి పసిడి ఎగసే అవకాశాలు ఉన్నాయి. వడ్డీరేట్లు, డాలర్ కీలకం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్స్ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్ కదలికల (5వ తేదీ డాలర్ ఇండెక్స్ ముగింపు 90.96), కరోనా వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వడ్డీరేట్లు పెరిగితే అది పసిడికి ప్రతికూల వార్తగా మారే అవకాశం ఉంది. వడ్డీరేట్ల పెరుగుదల డాలర్ బలోపేతం కావడానికి దారితీస్తుంది. ఈ అంశం కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్ ఇండెక్స్ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది. దేశీయంగా రూపాయి కీలకం దేశీయంగా పసిడి ధరలు డాలర్ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి బలోపేతం అయ్యే వీలుంది. అయితే తీవ్ర స్థాయిలో రూపాయి ప్రస్తుతం బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ. 5వ తేదీతో ముగిసిన వారంలో రూపాయి విలువ 72.93 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). భారత్ రూపాయి పటిష్టానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉందని వాట్ స్ట్రీట్ బ్రోకరేజ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇటీవలి తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక విడుదల సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా ఎకనమిస్టులు ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్తా గోద్వానీ చేసిన విశ్లేషణ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 మార్చి) జనవరి వరకూ ఆర్బీఐ తన ‘ఫారెక్స్ ఇంటర్వెన్షన్’ ద్వారా రూపాయి బలోపేతానికి 73.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మార్చి నాటికి మరో 20 బిలియన్ డాలర్ల వ్యయం చేసే అవకాశం ఉంది. ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే మినహా’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా. -
2021లో రూపాయి సగటు...75.50!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 2021 అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ సొల్యూషన్స్ మెరుగుపరిచింది.ఈ ఏడాది సగటున దేశీయ కరెన్సీ విలువ 75.50గా ఉంటుందని అంచనావేస్తోంది. ఇంతక్రితం అంచనా 77 కావడం గమనార్హం. 2022కు సంబంధించి కూడా అంచనాలను 79 నుంచి 77కు మెరుగుపరచింది. ప్రస్తుత స్థాయిల నుంచి సమీప భవిష్యత్తులో స్వల్పంగా మాత్రమే రూపాయి బలహీనపడుతుందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సోమవారం 9 పైసలు లాభపడి 73.02 వద్ద ముగిసింది. డాలర్ బలహీనత, ఫారెక్స్ పటిష్టత ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 89.88. 52 వారాల గరిష్టం 103.96) బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు ప్రస్తుతం రూపాయిని పటిష్టంగా కొనసాగిస్తున్నాయి. ‘‘డిసెంబర్ 2020 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల విలువ 578 బిలియన్ డాలర్లు. ఇది 19 నెలల దిగుమతులకు సరిపోతాయి. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి దోహదపడే అంశాల్లో ఇది ఒకటి. 2021లో ఎదురయ్యే ‘ఇంపోర్టెర్డ్ ఇన్ఫ్లెషన్’’ సవాలును ఇది భర్తీ చేస్తుంది. తద్వారా 2021లో భారత్ రికవరీ బాటను సంరక్షిస్తుంది’’ అని కూడా ఫిచ్ నివేదిక వివరించింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). బ్రెంట్, రెపో, ద్రవ్యోల్బణంపై ఇలా... ► 2020లో రూపాయి సగటు 74.10. కాగా 2020లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ సగటు 43.18 డాలర్లయితే, 2021లో 53 డాలర్లని ఫిచ్ అంచనావేస్తోంది. ► ఇక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 4 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని కూడా అంచనావేసింది. ► 2022–23 (ఏప్రిల్ 2022–మార్చి 2023) ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఫిచ్ లెక్కించింది. ఆహార, ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. కొనసాగుతున్న రికవరీ: నోమురా ఇండెక్స్ భారత్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత జనవరి 3వ తేదీతో ముగిసిన వారంలో చురుగ్గానే ఉందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ (ఎన్‌ఐబీఆర్‌ఐ) పేర్కొంది. డిసెంబర్లో సూచీ సగటు 91.7 అయితే, జనవరితో ముగిసిన వారంలో ఇది మరింత పెరిగి 94.5కు ఎగసింది. నవంబర్‌లో ఈ సూచీ 86.3 వద్ద ఉంది.