నిఫ్టీ 20,000 స్థాయికి..? | Bull calls of Nifty At 20,000 getting louder says Market experts | Sakshi
Sakshi News home page

నిఫ్టీ 20,000 స్థాయికి..?

Published Mon, Sep 11 2023 6:49 AM | Last Updated on Mon, Sep 11 2023 7:12 AM

Bull calls of Nifty At 20,000 getting louder says Market experts - Sakshi

ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు,  20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు.

అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్‌ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్‌ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్‌ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్‌బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.

స్థూల ఆర్థిక గణాంకాల డేటా
దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్‌ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్‌ నిల్వల డేటా, డిపాజిట్‌ – బ్యాంక్‌ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది.  

నేడు రెండు లిస్టింగులు  
రత్నవీర్‌ ప్రెసిíÙన్‌ ఇంజరీంగ్, రిషిభ్‌ ఇన్‌్రసూ్టమెంట్‌ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్‌ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్‌ఆర్‌ కేబుల్, షమీ హోటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూలు  బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి.

విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు
వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడం, డాలర్‌ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్‌ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్‌ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement