dollar exchange
-
రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!
న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక సిద్దాంతం. అయితే భారత్ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం. దీనికితోడు ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది. అన్ని రకాలుగా ఇబ్బందే... రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్ వంటి ఖర్చులు కూడా డాలర్–డినామినేట్ అవుతాయి. ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్ మారకంలో చైనీస్ యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే. చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్ కవర్ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్పుట్ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు. – సంజయ్ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్) నేషనల్ కమిటీ చైర్మన్అనిశ్చితిని భరించలేం.. రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య. – ఎస్ సి రాల్హాన్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) -
బాబోయ్ రూపాయ్
కీలక కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ మారకంలో రూపాయి విలువ నానాటికీ తగ్గిపోతోంది. తాజాగా బుధవారం 17 పైసలు పతనమై మరో కొత్త కనిష్ట స్థాయి 85.91కి క్షీణించి 86 స్థాయికి మరింత చేరువైంది. గతేడాది మొత్తం మీద చూస్తే రూపాయి విలువ 3 శాతం కరిగిపోయింది. అంతర్జాతీయంగా భౌగోళిక .. రాజకీయ అనిశ్చితి, మన మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతుండటం, పెరుగుతున్న వాణిజ్య లోటు .. ముడి చమురు రేట్లులాంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇలా రూపాయి రోజురోజుకూ సెంచరీకి దగ్గరవుతుండటం పలు వర్గాలను కలవరపెడుతోంది. రూపాయి పడిపోవడం కొన్ని ఎగుమతుల ఆధారిత రంగాలకు లాభించేదే అయినా.. దిగుమతుల ఆధారిత రంగాలకు మాత్రం బిల్లుల మోత మోగిపోతోంది. విదేశీ విద్య కూడా భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనంతో ప్రభావితమయ్యే అంశాలపై ప్రత్యేక కథనం. ఎగుమతి చేసే ఆటో కంపెనీలకు ఓకే.. వాహనాలను ఎగుమతి చేస్తున్న బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ వంటి దేశీ ఆటోమొబైల్ కంపెనీలకు రూపాయి క్షీణత లాభించనుంది. అలాగే, ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాల్లో కూడా ఎక్కువ భాగం ఎగుమతుల నుంచి వస్తుండటంతో వాటికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. భారత ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 33 శాతంగా ఉంటోంది. మరోవైపు, దిగుమతుల ఆధారిత లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వోలాంటి కంపెనీలకు మాత్రం రూపాయి పతనం ప్రతికూలమే అవుతుంది. ఐటీ, ఫార్మా హ్యాపీస్... దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రూపాయి క్షీణత బాగా లాభిస్తుంది. చాలామటుకు సంస్థల ఆదాయాలు డాలర్లలోనే ఉండటం వల్ల రూపాయి 1 శాతం క్షీణిస్తే ఐటీ కంపెనీల ఆదాయం సుమారు 0.5 శాతం, లాభం దాదాపు 1.5 శాతం పెరుగుతుందని అంచనా. మూడో త్రైమాసికంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 125 పైసలు పైగా పతనమైంది. దీంతో ఐటీ సంస్థల మార్జిన్లు 30–50 బేసిస్ పాయింట్లు (0.30–0.50 శాతం) వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో చైనా యువాన్, జపనీస్ యెన్, మెక్సికన్ పెసోలాంటివి కూడా పతనం కావడం వల్ల ఆకర్షణీయమైన రేటుకు సేవలు అందించడంలో మన సంస్థలకు పోటీ పెరిగిపోతోంది. ఇక ఫార్మా విషయానికొస్తే.. మన ఫార్మా ఎగుమతుల్లో మూడో వంతు వాటా అమెరికా మార్కెట్‌దే ఉంటోంది కాబట్టి ఎగుమతి కంపెనీలకు రూపాయి పతనం సానుకూలంగా ఉంటుంది. అయితే, రూపాయి క్షీణత వల్ల.. దేశీ మార్కెట్‌పై ఫోకస్ పెట్టే సంస్థలకు వ్యయాలు పెరుగుతాయి.దిగుమతులకు భారం.. చమురు, పసిడి మొదలైన వాటి కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. పెట్రోల్‌తో మొదలెడితే ప్లాస్టిక్, ఎరువుల వరకు మనకు నిత్యం అవసరమయ్యే అనేక ఉత్పత్తులు, సర్వీసుల్లో క్రూడాయిల్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయిల్ రేటు పెరిగిందంటే.. దానికి సంబంధమున్న వాటన్నింటి రేట్లూ పెరుగుతాయి. రూపాయి మారకం విలువ వచ్చే ఏడాది వ్యవధిలో సగటున ప్రస్తుత స్థాయిలోనే ఉంటే దిగుమతుల బిల్లు భారం ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 1.27 లక్షల కోట్లు) పెరగవచ్చని అంచనా. కరెన్సీ బలహీనపడటం వల్ల వంటనూనెలు, పప్పులు, యూరియా, డీఏపీలు మొదలైన దిగుమతులపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం భారత్‌లో అసెంబుల్ చేసే స్మార్ట్ఫోన్లలో 80–90 శాతం వరకు దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉంటున్నాయని, ఫలితంగా రూపా యి క్షీణత వల్ల స్మార్ట్ఫోన్లతో పాటు ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు ప్రియమవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎల్రక్టానిక్స్‌కు సంబంధించి కరెన్సీ విలువ 5 శాతం క్షీణిస్తే వ్యయాలు 2 శాతం పెరుగుతాయని అంచనా. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును కూడా వాడుతుంటారు. మారకం విలువ ఒక్క రూపాయి మారినా.. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే పవర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి చేసే విద్యుత్ వ్యయాలు యూనిట్‌కి 4 పైసల మేర మారిపోతాయి. విదేశాల్లో చదువు.. తడిసిమోపెడు.. చాలామటుకు అంతర్జాతీయ యూనివర్సిటీలు విదేశీ కరెన్సీల్లోనే (డాలరు, పౌండ్లు, యూరోల్లాంటివి) ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో రూపాయి బలహీనపడే కొద్దీ ఫీజుల భారం పెరుగుతుంటుంది. అలాగే విద్యాభ్యాసం కోసం అక్కడ నివసించే భారతీయ విద్యార్థుల రోజువారీ ఖర్చులు (ఇంటద్దె, ఆహారం, రవాణా మొదలైనవి) మన మారకంలో చూసుకుంటే పెరిగిపోతాయి. ఉదాహరణకు సగటున 50,000 డాలర్ల ట్యూషన్ ఫీజును పరిగణనలోకి తీసుకుంటే, గతేడాది రూపాయి విలువ 3 శాతం పడిపోవడంతో, జనవరిలో సుమారు రూ. 41.39 లక్షలుగా ఉన్న ట్యూషన్ ఫీజు .. డిసెంబర్ నాటికి రూ. 42.90 లక్షలకు పెరిగింది. అంటే డాలరు రూపంలో ఫీజు అంతే ఉన్నా.. రూపాయి విలువ పడిపోవడంతో కేవలం పన్నెండు నెలల్లో ఏకంగా రూ. 1.51 లక్షలకు పైగా భారం పెరిగినట్లయింది. సానుకూలం→ ఎగుమతి ఆధారిత రంగాలు → ఫార్మా→ ఐటీ సర్విసులు→ జౌళి→ ఉక్కు → రెమిటెన్సులు ప్రతికూలం → విదేశీ ప్రయాణాలు → విదేశీ చదువులు→ ధరల సెగ: ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కార్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవి → వ్యాపారాలు: కంపెనీలకు మార్జిన్ల ఒత్తిళ్లు. విస్తరణ ప్రణాళికలకు బ్రేక్. ఉద్యోగావకాశాలపై ప్రభావం, విదేశీ రుణాలు ప్రియం.– సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రూపాయి మరో కొత్త ఆల్‌టైం కనిష్టానికి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 8 పైసలు నష్టపోయి సరికొత్త కనిష్ట స్థాయి 84.50 వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో డాలర్ ఇండెక్స్(106.65) బలోపేతం మన కరెన్సీపై ఒత్తిడి పెంచిందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 84.41 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84.51 వద్ద కనిష్టాన్ని తాకింది. క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం తదితర అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. -
సానుకూల సంకేతాలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ ఎన్నికల అప్రమత్తత కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చివరి దశ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలూ ట్రేడింగ్ ప్రభావితం చూపొచ్చంటున్నారు. ఇక ప్రాథమిక మార్కెట్లో అవఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ‘‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’’ అని నిపుణులు తెలిపారు. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాజమాన్య వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. అమెరికా ఆర్థిక పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు. తన పెట్టుబడులను డాలర్ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది. 2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది. ఏమిటి మార్గం..? విదేశీ విద్య కోసం డాలర్ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు. తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. డాలర్ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దారి నేరుగా స్టాక్స్ ► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి. ► ఎన్ఎస్ఈ, ఐఎఫ్ఎస్సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు ► ఆర్బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ► కింగ్ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి. ► ఈ పెట్టుబడులు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూపాయి విలువ క్షీణత.. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్ ఫెడ్ వైఖరితో డాలర్ సరఫరా తగ్గుతుంది. అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ ధనుంజయ్ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ సైతం ఫారెక్స్ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు. ఫీజులపై రూపాయి ప్రభావం ‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్షిప్ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్ వరల్డ్ సీఈవో అనిర్బన్ సిర్కార్ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్షా చెప్పారు. 2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ట్యూషన్ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్ తదితర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. యూఎస్ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక ప్రయోజనాన్నిస్తుంది. ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్అండ్పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్అండ్పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది. -
బలహీన బాటలో రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. -
కొత్త రికార్డుల దిశగా సాగొచ్చు
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే.., ఈ వారం దేశీయ స్టాక్ సూచీలు తాజా జీవితకాల గరిష్టానికి చేరే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దేశీయంగా ద్రవ్యోల్బణ డేటా, అమెరికా మధ్యంతర ఎన్నికలు, విదేశీ పెట్టుబడులు కీలకమని చెబుతున్నారు. చివరి దశకు చేరుకున్న కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1097 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున ర్యాలీ చేశాయి. అమెరికా అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదువడంతో ఇకపై ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ‘‘గతేడాది(2021) అక్టోబర్ 19న సెన్సెక్స్ 62,245 వద్ద, నిఫ్టీ 18,604 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ వారాంతపు రోజున సెన్సెక్స్ జీవితకాల గరిష్టం ముగింపు(61,795) వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏడాది గరిష్టాన్ని(18,362) తాకింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే సూచీలు జీవితకాల గరిష్టాన్ని అందుకోవచ్చు. ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది. నిఫ్టీ 18,300 స్థాయిని నిలుపుకోలిగితే 18,600 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,000 –17,800, శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. ► ద్రవ్యోల్బణ డేటా దృష్టి అమెరికా ద్రవ్యోల్బణ డేటా వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి సారించాయి. డిసెంబర్ ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరికి మార్గదర్శకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 7.4%గా నమోదైంది. ఈ అక్టోబర్‌లో ఏడుశాతంలోపే ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. . ► కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల అంకం చివరి దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,400కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఓఎన్జీసీ, గ్రాసీం ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)తో నిఫ్టీ 50 ఇండెక్స్‌లో లిస్టయిన కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి పూర్తి అవుతుంది. వీటితో పాటు బయోకాన్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, ఐఆర్సీటీసీ, స్పైస్‌జెట్‌లు, ఆర్తి ఇండస్ట్రీస్, అబాట్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హుడ్కో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జ్యోతి ల్యాబ్స్, లక్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ► ప్రపంచ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనకు రెఫరెండంగా భావించిన మధ్యంతర ఎన్నికల ఫలితాలను ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు యూరో పారిశ్రామికోత్పత్తి డేటా, బ్రిటన్ నిరుద్యోగ రేటు మంగళవారం విడుదల అవుతాయి. అదే రో జున యూరోజోన్, జపాన్ జీడీపీ అంచనాలు వెల్లడికానున్నాయి. ఎల్లుండి(బుధవారం)బ్రిటన్ అక్టోబర్ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. ఈ మరుసటి రోజు యూరో జోన్ ద్రవ్యోల్బణం, జపాన్ వా ణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ఆర్థి క స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఎఫ్ఐఐలు వైఖరి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానపరమైన ఆందోళనలు తగ్గుముఖంపట్టడంతో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతవారంలో రూ.6,300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఎఫ్ఐఐలు తమ బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తే సూచీలు సులభంగా జీవితకాల గరిష్టాన్ని చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. దిద్దుబాటు సమయంలో కొనుగోళ్లు చేపడుతూ మార్కెట్‌కు అండగా నిలిచే సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ నవంబర్‌లో నికరంగా రూ.5600 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
పరిమిత శ్రేణిలోనే కదలికలు..
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తూ, పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ప్రపంచ పరిణామాలను పరిశీలిస్తే.. యూఎస్, ఐరోపా మార్కెట్లు తీరుతెన్నులు, డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై రాబడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టొచ్చంటున్నారు. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు నేడు(సోమవారం) గంట పాటు ప్రత్యేక ‘‘మూరత్ ట్రేడింగ్’’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. బలిప్రతిపద సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దేశీయ కార్పొరేట్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో గతవారం ప్రధాన సూచీలు రెండున్నర శాతం ఎగిశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1387 పాయింట్లు, నిఫ్టీ 391 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. ఈ వారంలో మూరత్ ట్రేడింగ్‌తో పాటు ఒకరోజు సెలవు కారణంగా ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడులకు ఆసక్తి చూపకపోవచ్చు. కావున కీలక సూచీలు పరిమిత శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అలాగే నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు సైతం చోటు చేసుకోవచ్చు. నిఫ్టీ 17900–18000 నిరోధ శ్రేణిని చేధిస్తే తదుపరి ర్యాలీకి అవకాశం ఉంటుంది. గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రభావం ముందుగా నేడు మార్కెట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఐఓసీ, టాటా పవర్, వేదాంత, ఎన్టీపీసీ, డాలర్ ఇండియా, గ్లాండ్ ఫార్మా, ఎస్బీఐ కార్డ్స్, టాటా కెమికల్స్ కంపెనీ ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధం, బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా పరిణామాలను ఈక్విటీ మార్కెట్ వర్గా లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తితో పాటు సెప్టెంబర్ నిరుద్యోగ రేటు, వాణిజ్య లోటు గణాంకాలను నేడు విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి అంచనాలను గురువారం ప్రకటించనుంది. యూరప్ సెంట్రల్ బ్యాంక్ గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం వడ్డీరేట్లను వెల్లడించనుంది. ఇటీవల దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు రికవరీ దిశగా సాగుతున్నాయి. భారత్ అధికంగా ఎగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 90డాల ర్లకు పైకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(అక్టోబర్ 27న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీ 17,400–18,000 శ్రేణిలో కదలాడొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి భారత ఈక్విటీ మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన మూడు నెలలుగా నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్ఐఐలు అనూహ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ అక్టోబర్ 21 నాటికి రూ.6వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది(2022)లో ఇప్పటి వరుకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ పెరుగుదల, బాండ్లపై రాబడులు పెరగొచ్చని అంచనాలతో రానున్న రోజుల్లో ఎఫ్ఐఐల భారత మార్కెట్లపై బేరీష్ వైఖరిని ప్రదర్శించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?
కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశ కరెన్సీని అయినా అమెరికన్ డాలర్‌తోనే పోల్చుతుంటారు. అందువల్ల డాలర్ అంటే బాగా విలువైన కరెన్సీ అనే భావన ఉండిపోయింది. నిజానికి అమెరికన్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు దాన్ని ఆమోదిస్తాయి. డాలర్లలోనే ప్రపంచ వాణిజ్యం జరుగుతుంటుంది కూడా. అందుకు ప్రతి కరెన్సీని, వాణిజ్యాన్ని డాలర్లతో పోల్చుతూ, లెక్కవేస్తూ ఉంటారు. అయితే, డాలర్ కన్నా విలువైన కరెన్సీలు కూడా ఉన్నాయి. దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీడీపీ, అభివృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా వాటి కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిదేశాల కరెన్సీ విలువ డాలర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కువైట్ దినార్‌కు 3.26 అమెరికన్ డాలర్లు వస్తాయి. అంటే రూ.270 అన్నమాట. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తితో సంపన్నంగా మారినవి, పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. కువైట్ దినార్ కంటే కూడా విలువైన కరెన్సీ ఒకటి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే గుర్తింపులేని ఓ చిన్నదేశం (మైక్రోనేషన్) ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా’కు చెందిన సెబోర్గన్ ల్యూగినో కరెన్సీ అది. ఈ కరెన్సీని స్థానికంగా లావాదేవీలకు, బ్యాంకుల్లో వినియోగిస్తారు. బయట ఎక్కడా చెల్లదు. ఇక్కడి బ్యాంకుల్లో కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం.. ఒక్కో సెబోర్గన్ ల్యూగినోకు ఆరు డాలర్లు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.498 అన్నమాట. ఒక డాలర్‌కు 42,350 ఇరాన్ రియాల్లు ప్రపంచంలో అత్యంత తక్కువ విలువైన కరెన్సీ ఇరాన్ రియాల్. ఒక డాలర్‌కు ఏకంగా 42,350 ఇరాన్ రియాల్స్ వస్తాయి. మన కరెన్సీతో పోల్చితే.. ఒక్క రూపాయికి 510 ఇరాన్ రియాల్స్ వస్తాయి. నిజానికి భారీగా చమురు ఉత్పత్తి చేసే ఇరాన్.. ఇతర దేశాల్లా సంపన్నంగా మారి ఉండేది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశి్చతి, అణు ప్రయోగాల వల్ల ఆర్థిక ఆంక్షల వల్ల పరిస్థితి దారుణంగా మారింది. -
బలహీన కరెన్సీల్లో రూపాయి
ముంబై: గత వారం రోజుల వ్యవధిలో అత్యంత అధ్వాన్నంగా పడిపోయిన వర్ధమాన దేశాల కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ వారం రోజుల్లో 2.4 శాతం క్షీణించింది. అయితే, 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మిగతా వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే మాత్రం రూపాయి గట్టిగానే నిలబడింది. 7.6 శాతం మాత్రమే పతనమైంది. ప్రస్తుతం 81.73 వద్ద ట్రేడవుతోంది. కొరియా కరెన్సీ వోన్ (–16.9 శాతం), ఫిలిప్పీన్స్ పెసో (–14.3 శాతం), థాయ్ బాహత్ (–13.3 శాతం), చైనా యువాన్ (–12.8 శాతం) మరింత భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం తదితర అంశాలు డాలర్ బలోపేతానికి దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీనివల్ల వర్ధమాన మార్కెట్లే కాకుండా సంప న్న మార్కెట్ల కరెన్సీలు కూడా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. యూరో 13.2 శాతం, పౌండ్ స్టెర్లింగ్ .. యెన్ చెరి 18.2 శాతం మేర క్షీణించడం ఇందుకు నిదర్శనమని వివరించింది. రూపాయిని స్థిరపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరింత అధిక స్థా యిలో వడ్డీ రేట్లను పెంచాల్సి ఉండవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు, విదేశీ మారక నిల్వలు (ఫారె క్స్) క్షీణించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. -
రూపాయి... పతనాల రికార్డు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ‘కనిష్ట పతన రికార్డులు’ కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి 77.93కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, దేశం నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు మళ్లడం, ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి బలహీనతలకు ప్రధాన కారణాలు. రూపాయి గురువారం ముగింపు 77.74. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 77.81ని చూసింది. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 77.81 వద్దే ప్రారంభమైంది. 77.79 స్థాయిని దాటి ఏ దశలోనూ బలపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 80 వరకూ బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.90 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.20 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ బేరల్‌కు 120 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలావుండగా, జూన్ 3తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వల పరిస్థితి 601.057 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం వారంతో పోల్చితే 306 మిలియన్ డాలర్లు తగ్గాయి. -
ఎకానమీకి ‘రూపాయి’ కష్టాలు.. సామాన్యులకు భారం..
ఒకవైపు మండిపోతున్న ముడి చమురు ధరలు, మరోవైపు తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల.. వెరసి మన రూపాయికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టాయి. ప్రధానమైన ఈ రెండింటితో పాటు ఇతరత్రా కారణాలతో దేశీ కరెన్సీ నిత్యం క్షీణిస్తోంది. కొత్త రికార్డు స్థాయిలకు పతనమవుతోంది. తాజాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 77.81కి పతనమైంది. చివరికి కొంత కోలుకుని అంతక్రితం రోజుతో పోలిస్తే 6 పైసల నష్టంతో 77.74 వద్ద క్లోజయ్యింది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 125 డాలర్ల పైన స్థిరపడితే మార్కెట్లు మరింత అతలాకుతలం కానున్నాయి. దీంతో దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం తీవ్రమైతే.. రూపాయిపై ఒత్తిడి ఇంకా పెరిగిపోతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తదితర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనకేంటి.. 2017 మేలో 64 రూపాయలు ఇస్తే ఒక అమెరికన్ డాలర్ లభించేది. కానీ ప్రస్తుతం అదే డాలర్‌కు 77 రూపాయలు పైగా ఇవ్వాల్సి వస్తోంది. అంటే గడిచిన అయిదేళ్లలో మన కరెన్సీ విలువ ఏకంగా రూ. 13 పైగా పడిపోయింది. డాలర్ రూపాయి పతనమైతే మనకేమిటి, పెరిగితే మనకేమిటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రోజువారీ కొనుగోళ్లన్నీ దీని విలువతోనే ముడిపడి ఉన్నాయి. రూపాయి కాస్త తగ్గితే ఎగుమతులపరంగా ప్రయోజనకరమే అయినా దిగుమతులు మొదలుకుని పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో, ద్రవ్యోల్బణం, ఈఎంఐలు, విదేశీ విద్యలాంటి అనేకానేక అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మన ఇంధన అవసరాల్లో 85 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. దీనికి డాలర్ల మారకంలో చెల్లించాలి. రూపాయి విలువ పడిపోయిందంటే మరిన్ని ఎక్కువ డాలర్లు ఇచ్చి క్రూడాయిల్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆయా ఉత్పత్తుల రేట్లు దేశీయంగా మరింత పెరుగుతాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం స్థాయికి ఎగిసింది. దీంతో ధరలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను అయిదు వారాల వ్యవధిలో దాదాపు 1 శాతం (0.90 శాతం) మేర పెంచింది. దీనికి తగ్గట్లుగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయడం ప్రారంభించాయి. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీలు, నెలవారీ వాయిదాల భారం మరింత పెరుగుతోంది. పెట్టుబడులపై ప్రభావం.. ఇక దేశీ కరెన్సీ క్షీణతతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటాయి. వారు తమ పెట్టుబడులను డాలర్ల రూపంలోనే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రూపాయికి డిమాండ్ మరింత పడిపోయి, కరెన్సీ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు కూడా క్షీణిస్తాయి. ఫలితంగా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. భారీ స్థాయి క్రూడాయిల్ రేట్లు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో సెంట్రల్ బ్యాంకులు కఠినతర విధానాలు అమలు చేస్తుండటం, మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తదితర అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. విదేశీ చదువు .. ప్రయాణాలు భారం.. విదేశాల్లో విద్య కోసం, విదేశీ ప్రయాణాల కోసం ప్లానింగ్ చేసుకునే వారిపైనా రూపాయి పతన ప్రభావం పడుతుంది. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 21 శాతం పైగా ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం విదేశీ విద్య కోసం రూ. 20 లక్షలు ఖర్చయితే ఇప్పుడు రూ. 24 లక్షలపైగా ఖర్చవుతుంది. ఇదే కాదు, విదేశీ ప్రయాణాలు కూడా భారం అవుతాయి. దేశీ కరెన్సీ మారకం విలువ పడిపోవడం వల్ల ఇతర దేశాల కరెన్సీలను కొనుగోలు చేసేందుకు మరిన్ని ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో విదేశీ యాత్రల కోసం మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. రూపాయి పతనం, పెరగడం ఎందుకు.. అంతర్జాతీయంగా కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా డాలర్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరో ప్రామాణికంగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకుల దగ్గర ఉన్న విదేశీ కరెన్సీల్లో డాలర్ వాటా 64 శాతంగాను, యూరోల వాటా 20 శాతంగాను ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బడా ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం భారీ స్థాయిలో భారత్ వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోను ద్రవ్యోల్బణం పెరిగిపోయి, వడ్డీ రేట్లు పెంచుతుండటంతో ఇన్వెస్టర్లు మన మార్కెట్లలోని పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటున్నారు. దీంతో పరిమిత స్థాయిలో లభించే డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ తగ్గుతోంది. ఇక ప్రత్యేకంగా భారత్ విషయానికొస్తే ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. క్రూడాయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటివి ఈ లిస్టులో ఉంటున్నాయి. వీటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటోంది. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉండటం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, మన కరెన్సీ విలువ క్రమంగా కరుగుతూ వస్తోంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ పరిణామాలతో క్రూడాయిల్ సహా పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే వాటిని భారత్ సహా దిగుమతి చేసుకునే దేశాల్లో రేట్లు మండిపోతున్నాయి. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్–రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్‌పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగించారు. ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో ఏప్రిల్ తొలి వారంలో ఎఫ్‌పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉన్నాయి. ‘భారత్‌లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్‌లు .. డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్ కుమార్ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు. -
రూపాయి.. క్రాష్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 54 పైసలు పతనమై 77.44కు పడిపోయింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో (శుక్రవారం) రూపాయి 55 పైసలు పతనమై 76.90కి చేరింది. అదే వరవడిని కొనసాగిస్తూ, సోమవారం ట్రేడింగ్‌లో బలహీనంగా 77.17 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ఒక దశలో 77.55 కనిష్టాన్ని చూసింది. చివరికి స్వల్పంగా 11పైసలు కోలుకుని 77.44 వద్ద ముగిసింది. క్రితం కన్నా ఇది 54 పైసలు పతనం. క్రితం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 109 పైసలు నష్టపోవడం గమనార్హం. రూపాయి కదలికలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి సోమవారం వరకూ ఇవి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. అటు తర్వాత రూపాయి స్వల్ప ఒడిదుడుకులతో 76 వరకూ బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం రెండు నెలలు తిరిగేసరికే రూపాయి మరింత కిందకు జారిపోవడం కరెన్సీ బలహీనతలను తెలియజేస్తోంది. ► అంతక్రితం కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92ని చూసింది. ముగింపులో 2020 ఏప్రిల్ 16వ తేదీన రికార్డు పతనం 76.87. ఆ తర్వాత కొంత బలపడినా, తిరిగి ఆ స్థాయిని కోల్పోడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ► అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 77.55 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 103.64 వద్ద ట్రేడవుతోంది. మరింత క్షీణత..! రూపాయి సమీప కాలంలోనే 77.80 స్థాయికి పతనం కావచ్చన్నది మా అంచనా. బలమైన డాలర్ ఇండెక్స్, అమెరికాలో ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుదల, ఆసియా సహచర కరెన్సీల బలహీనతల నేపథ్యంలో భారత్ రూపాయి విలువ తాజాగా రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఈక్విటీ మార్కెట్లను కూడా తీవ్ర అనిశ్చితికి, బలహీనతకు గురిచేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అధిక రేట్ల పెంపు అవసరాన్ని అంచనా వేస్తున్న పెట్టుబడిదారులు, ప్రస్తుతం మార్కెట్లో రిస్క్ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని మించి (2–6%) ద్రవ్యోల్బణం పెరుగుదల, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్ఐఐలు వెనక్కు మళ్లడానికి కారణం అవుతున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మే 4 మధ్యంతర పరపతి సమీక్ష రూపాయికి తక్షణం మద్దతును అందించలేకపోయింది. – రాయిస్ వర్గీస్ జోసెఫ్ కరెన్సీ అండ్ ఎనర్జీ రీసెర్చ్ అనలిస్ట్, ఆనంద్ రాఠి -
క్రూడ్ షాక్... రూపీ క్రాష్!!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ఒకేరోజు 76 పైసలు బలహీనపడింది. 76.93 స్థాయికి రూపాయి పతనమైంది. రూపాయి ఈ కనిష్ట స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఒక దశలో రూపాయి 84పైసలు నష్టంతో 77.01 స్థాయిని సైతం చూసింది. కదలికలు ఇలా... దేశీయ కరెన్సీ ముగింపు శుక్రవారం 76.17. సోమవారం ట్రేడింగ్‌లో తీవ్ర బలహీన స్థాయిలో 76.85 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రతి దశలోనూ బలహీనంగానే కదలాడింది. కారణాలు ఇవీ... ► రష్యాపై ఉక్రెయిన్ దాడులు. నాటో దళాలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధంలోకి వస్తాయన్న వదంతులు. ► దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం. బంగారం, వెండి వంటి సురక్షిత సాధనల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల మొగ్గు. ► క్రూడాయిల్ ధరల పెరుగుదల. ఇది దేశంలో ఆయిల్ సంక్షోభానికి తద్వారా పెట్రో ధరల మంటకు వెరసి ద్రవ్యోల్బణం, వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తీవ్రతకు, కరెంట్ అకౌంట్ (ఒక దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యాన్ని ప్రతిబింబించే గణాంకాలు)భారీ లోటుకు దారితీస్తాయన్న ఆందోళనలు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి.. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రూపాయికిపైగా బలహీనతతో 76.91 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిప దికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 99 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. 79 దిశగా పయనం..! అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టి ంగ్ సంస్థ–మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, సీఈఓ వ్యవస్థాపకుడు నిష్ భట్ పేర్కొన్నారు. క్రూడ్ ధరలు మరింత పైకి ఎగసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రూపాయిని సమీప కాలంలో 79 దిశగా బలహీనపరుస్తాయన్నది తమ అంచనా అని తెలిపారు. 2020 ఏప్రిల్ తర్వాత... రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కరోనా సవాళ్లు, ఆందోళనలు, లాక్డౌన్ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం వంటి అంశాలు దీనికి నేపథ్యం. 130 డాలర్లు దాటిన క్రూడాయిల్ ధర 2008 తరువాత గరిష్ట స్థాయి న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులుసహా పలు కీలక పరిణామాల నేపథ్యంలో సరఫరాలపై తలెత్తిన ఆందోళనలు సోమవారం క్రూడాయిల్ ధరలను 2008 గరిష్ట స్థాయిలకు చేర్చాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం పైగా లాభంతో 121.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 117.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ రెండు విభాగాల్లో ధరలు 130 డాలర్లు చూడ్డం గమనార్హం. 2008 తరువాత ఇంత తీవ్రస్థాయిలో క్రూడ్ ధరలు చూడ్డం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. ఐదు ప్రధాన కారణాలు..! ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే అవకాశాలను అమెరికా, యూరోపియన్ భాగస్వామ్య దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన చేశారు. రోజుకు దాదాపు 7 మిలియన్ బ్యారళ్ల ఉత్పత్తి లేదా ప్రపంచ సరఫరాలో 7 శాతం (ఉత్పత్తిలో 10%) ఎగుమతులతో ఇందుకు సంబంధించి రష్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికా మంత్రి తాజా ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాలకు సవాళ్లు తప్పవన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా నౌకాశ్రయాల నుంచి కజికిస్తాన్‌కు చెందిన చమురు ఎగుమతులకు కూడా తీవ్ర విఘాతం కలుగుతోంది. ► దీనికి తోడు లిబియా చేసిన ఒక కీలక ప్రకటన చమురు ధర తీవ్రత కారణమైంది. ఒక సాయు« ద సమూహం రెండు కీలకమైన చమురు క్షేత్రాలను మూసివేసిందని లిబియా జాతీయ చమురు కంపెనీ ప్రకటించింది. ఈ చర్య వల్ల దేశం రోజువారీ చమురు ఉత్పత్తి 3,30,000 బ్యారళ్లకు పడిపోయిందని ప్రకటించింది. ► ఇరాన్‌పై 2015 ఆంక్షల ఎత్తివేత చర్చల్లోకి ‘ఆ దేశంతో రష్యా వాణిజ్య సంబంధాలను లాగొద్దని’ అమెరికాకు రష్యా డిమాండ్ చమురు ధర భారీ పెరుగుదలకు కారణమైంది. దీనితో ఈ చర్చలపై అనిశ్చితి నెలకొంది. -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
ఆరంభం అదిరింది
ముంబై: కొత్త ఏడాది తొలిరోజు కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. దీంతో సూచీలు ఈ ఏడాది(2022)కి లాభాలతో స్వాగతం పలికాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మన మార్కెట్లు సానుకూలతలను అందిపుచ్చుకున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. దేశీయంగా డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి రికవరీ కలిసొచ్చింది. దేశంలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈ పరిణామాలతో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.., ఇన్వెస్టర్లు రిస్క్ వైఖరి ప్రదర్శిస్తూ కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి డిసెంబర్ 13వ తేదీ తర్వాత తొలిసారి 59వేల స్థాయి పైన 59,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు ర్యాలీ చేసి 17,626 వద్ద నిలిచింది. తద్వారా మూడు వారాల్లో సూచీలు అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. అలాగే సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. చిప్ కొరత కష్టాలను అధిగమిస్తూ వాహన కంపెనీలు పరిశ్రమ అంచనాలకు మించి అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.903 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే నష్టాలను రికవరీ చేసుకొని రూపాయి మూడు పైసలు బలపడి 74.26 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆర్థిక రివకరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఏడాది తొలి సెషన్లో లాభాల బాటపట్టాయి. బ్రిటన్, చైనా, జపాన్ ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. గతేడాదిలో 27 శాతం లాభాల్ని పంచిన అమెరికా మార్కెట్లు అదే జోష్‌ను కనబరుస్తూ లాభాలతో కదలాడుతున్నాయి. రోజంతా లాభాలే... స్టాక్ సూచీలు 2022 ఏడాది తొలి రోజు ట్రేడింగ్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 58,310 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 17,387 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విస్తృత కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,012 పాయింట్లు ర్యాలీ చేసి 59,266 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు దూసుకెళ్లి 17,647 వద్ద గరిష్టాల తాకాయి. ఇవి సూచీలకు ఆరు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చివరిదాకా కొనుగోళ్లకే కట్టబడటంతో సూచీలు ఏ దశలో వెనకడుగు వేయలేదు. రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో కొత్త ఏడాది తొలి రోజు రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లుగా నమోదైంది. ‘వ్యాక్సిన్ వేగవంతం చర్యల నుంచి బుల్ జోష్‌ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. కోవిడ్ సంబంధిత వార్తలు, ప్రపంచ మార్కెట్ల తీరు రానున్న రోజుల్లో సూచీ ల గమనాన్ని నిర్దేశిస్తాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ వరుసగా మూడో రోజూ బలపడటం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ సాంకేతికంగా అప్‌ట్రెండ్‌లో 17,750 స్థాయి వద్ద కీలక నిరోధం ఉండొచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు n డిసెంబర్లో ఉత్పత్తి పెరిగిందనే కంపెనీ ప్రకటనతో కోల్ ఇండియా షేరు ఆరు శాతానికి పైగా లాభపడి రూ.155 వద్ద స్థిరపడింది. n ఎన్సీడీల ద్వారా రూ.456 కోట్లను సమీకరించడంతో ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ షేరు ఐదుశాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది. n ఐటీ షేర్లలో భాగంగా టీసీఎస్ షేరు రాణించింది. బీఎస్ఈలో రెండు శాతం లాభపడి రూ.3,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రెండున్నర ర్యాలీ చేసి రూ.3829 వద్ద 13 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్‌లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్‌పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్‌సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్‌కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. -
రూపాయి డౌన్.. 16 నెలల తర్వాత కనిష్టానికి!
Indian Rupee Value Falling Reasons: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో పడిపోయింది. ఏకంగా 10 పైసలు బలహీనపడి 75.60కి పడిపోయింది. గడచిన 16 నెలల నెలల్లో (2020 జూలై 1 తర్వాత) రూపాయి ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల బయటకు వెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పటిష్టత వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు గ్లోబల్ ఎకానమీని వెంటాడుతుండడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడ్డం కూడా భారత్ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ట్రేడింగ్‌లో రూపాయి 75.45 వద్ద ప్రారంభమైంది. మొదట్లో వచ్చిన లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిపై భయాలు ఒకవైపు– వడ్డీరేట్లు పెరగవచ్చన్న అంచనాలు మరోవైపు నెలకొన్న నేనథ్యంలో డాలర్ ఇండెక్స్ కూడా పటిష్టంగా కొనసాగుతుండడం గమనార్హం. గత రాత్రి 11 గంటల సమయంలో.. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 75.65వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 96 ఎగువన ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కొత్త వేరియంట్ పరిణామాలు, దేశంలోకి విదేశీ నిధుల రాక వంటి అంశాలపై ఆధారపడి రూపాయి తదుపరి కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చదవండి: మూడో రోజూ ముందుకే! -
రూపాయికి క్రూడ్ సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో వరుసగా రెండవ రోజు 18 పైసలు బలహీనపడి 74.52 వద్ద ముగిసింది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి 50 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, ద్రవ్యోల్బణం భయాలు, సరళతర ద్రవ్య విధానానికి ముగింపు పడుతోందన్న సంకేతాలు, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలోపేత ధోరణి వంటి అంశాలు తాజాగా రూపాయి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 74.44 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 74.59 గరిష్ట స్థాయిని కూడా తాకింది. చివరకు బుధవారం ముగింపుతో పోల్చితే 18 పైసలు బలహీనపడి (బుధవారం ముగింపు 74.34) 74.52 వద్ద ముగిసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అమెరికాలో 1990 తర్వాత ఎన్నడూ లేనంత పెరగడంతో, వడ్డీరేట్లు పెరుగుదల అంచనాలు అధికమయ్యాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పెట్టుబడులు వెనక్కు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల బలహీనతకు దారితీస్తోంది. చైనాలో కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించి ద్రవ్య్లోల్బణం అంచనాకు మించి (12.03 శాతం) 26 ఏళ్ల గరిష్ట స్థాయి 13.05 %కి పెరగడం గమనార్హం. కాగా, డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 95పైన ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 82 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ ర్రూడ్ 83 డాలర్ల పైన ఉంది. -
75 చేరువకు రూ‘పాయె’
ముంబై: భారత్ రూపాయి విలువ డాలర్ మారకంలో బుధవారం భారీగా 54 పైసలు పడిపోయింది. 74.98 వద్ద ముగిసింది. గడచిన ఐదు నెలల్లో (ఏప్రిల్ 23 తర్వాత) రూపాయి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో పడిపోవడం కూడా ఆరు నెలల్లో ఇదే తొలిసారి. దీనితో వరుసగా గత తొమ్మిది ట్రేడింగ్ షెషన్లలో ఎనిమిది రోజులు రూపాయి నష్టాలను చవిచూసినట్లయ్యింది. దేశీయంగా ఈక్విటీల బలహీనతలకు తోడు అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయికి ప్రతికూలం అవుతున్నాయి. ట్రేడింగ్‌లో డాలర్ మారకంలో 74.63 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.54 కనిష్ట–74.99 గరిష్ట స్థాయిల్లో కదలాడింది. రూపాయి 75 స్థాయిని కాపాడుకోలేకపోతే మరింత పతనం తప్పకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ విశ్లేíÙంచారు. సమీప కాలానికి 73.95 వద్ద మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.82 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ భారీ లాభాల్లో 94.30 పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ) కాగా అంతర్జాతీయంగా నైమెక్స్ స్వీట్ క్రూడ్ బేరల్ ధర 78.64 వద్ద ట్రేడవుతుండగా, బ్రెంట్ విషయంలో ఈ ధర 82.50 వద్ద ఉంది. -
2021లో రూపాయి సగటు...75.50!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 2021 అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ సొల్యూషన్స్ మెరుగుపరిచింది.ఈ ఏడాది సగటున దేశీయ కరెన్సీ విలువ 75.50గా ఉంటుందని అంచనావేస్తోంది. ఇంతక్రితం అంచనా 77 కావడం గమనార్హం. 2022కు సంబంధించి కూడా అంచనాలను 79 నుంచి 77కు మెరుగుపరచింది. ప్రస్తుత స్థాయిల నుంచి సమీప భవిష్యత్తులో స్వల్పంగా మాత్రమే రూపాయి బలహీనపడుతుందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సోమవారం 9 పైసలు లాభపడి 73.02 వద్ద ముగిసింది. డాలర్ బలహీనత, ఫారెక్స్ పటిష్టత ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ (ప్రస్తుతం 89.88. 52 వారాల గరిష్టం 103.96) బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు ప్రస్తుతం రూపాయిని పటిష్టంగా కొనసాగిస్తున్నాయి. ‘‘డిసెంబర్ 2020 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల విలువ 578 బిలియన్ డాలర్లు. ఇది 19 నెలల దిగుమతులకు సరిపోతాయి. రూపాయి భారీ పతనాన్ని నిరోధించడానికి దోహదపడే అంశాల్లో ఇది ఒకటి. 2021లో ఎదురయ్యే ‘ఇంపోర్టెర్డ్ ఇన్ఫ్లెషన్’’ సవాలును ఇది భర్తీ చేస్తుంది. తద్వారా 2021లో భారత్ రికవరీ బాటను సంరక్షిస్తుంది’’ అని కూడా ఫిచ్ నివేదిక వివరించింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). బ్రెంట్, రెపో, ద్రవ్యోల్బణంపై ఇలా... ► 2020లో రూపాయి సగటు 74.10. కాగా 2020లో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ సగటు 43.18 డాలర్లయితే, 2021లో 53 డాలర్లని ఫిచ్ అంచనావేస్తోంది. ► ఇక బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 4 శాతం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని కూడా అంచనావేసింది. ► 2022–23 (ఏప్రిల్ 2022–మార్చి 2023) ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఫిచ్ లెక్కించింది. ఆహార, ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై కొంత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. కొనసాగుతున్న రికవరీ: నోమురా ఇండెక్స్ భారత్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత జనవరి 3వ తేదీతో ముగిసిన వారంలో చురుగ్గానే ఉందని జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా ఇండియా బిజినెస్ రిజంప్షన్ ఇండెక్స్ (ఎన్‌ఐబీఆర్‌ఐ) పేర్కొంది. డిసెంబర్లో సూచీ సగటు 91.7 అయితే, జనవరితో ముగిసిన వారంలో ఇది మరింత పెరిగి 94.5కు ఎగసింది. నవంబర్‌లో ఈ సూచీ 86.3 వద్ద ఉంది. -
రూపాయి.. హ్యాట్రిక్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించిం ది. మంగళవారం ముగింపుతో పోల్చితే 27 పైసలు లాభంతో 74.19 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 74.49 వద్ద ప్రారంభమైన రూపాయి, 74.09 స్థాయి గరిష్ట, 74.52 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. కారణాలు చూస్తే... ఆరు కరెన్సీలతో (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ట్రేడయ్యే– డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణి, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కరోనా వ్యాక్సిన్ సిద్ధమైపోయిందన్న వార్తలు రూపాయికి బలం చేకూర్చుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టరు (ఎఫ్ఐఐ) క్యాపిటల్ మార్కెట్లో బుధవారం నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. రూ.3,072 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత రెండు సెషన్లలో ఎఫ్ఐఐలు బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారనీ, దీనితో ఈ నెల్లో వీరి పెట్టుబడుల విలువ 5.1 బిలియన్ డాలర్లకు చేరిందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఫారెక్స్ అండ్ బులియన్ విశ్లేషకులు గౌరంగ్ తెలిపారు. మరింత పెరగాల్సిందే.. కానీ!: నిజానికి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున ప్రభుత్వ రంగ బ్యాంకులు జరిపిన కొనుగోళ్లు రూపాయి బలోపేతానికి పగ్గాలు వేశాయి కానీ, లేదంటే భారత్ కరెన్సీ మరింత బలపడి ఉండేదని విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు రిలయెన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కాగా, ఈ వార్త రాస్తున్న రాత్రి 7.41 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 92.40 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి విలువ లాభాల్లో 74.21 వద్ద ట్రేడవుతోంది. -
11,600 పాయింట్ల పైకి నిఫ్టీ...
బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 73.52 వద్ద ముగియడం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. నిఫ్టీ కీలకమైన 11,600 పాయింట్ల పైకి ఎగబాకింది. 83 పాయింట్లు లాభపడి 11,605 వద్ద ముగిసింది. ఫిబ్రవరి తర్వాత ఈ సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇక సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు.... రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఈ బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్బీఐ అభయం...: ఆర్థిక రికవరీ ఇంకా పుంజుకోలేదని, అయినప్పటికీ, నిధుల లభ్యత పెంచడానికి, వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయం ఇచ్చారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 4 శాతం లాభంతో రూ.640 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇండియన్ ఎనర్జీ ఎక్సే ్చంజ్,లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకా యి. లక్ష్మీ విలాస్ బ్యాంక్.గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ప్యాకేజీ ఆశలతో కొనుగోళ్లు
గత రెండు రోజుల్లో నష్టపోయిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కేంద్రం ఉద్దీపన చర్యలను ప్రకటించగలదన్న ఆశలు సానుకూల ప్రభావం చూపించాయి. అయితే సేవల రంగం గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటం, భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు అంచనాలు ఏమంత ఆశావహంగా లేకపోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసల మేర తగ్గడం.. లాభాలకు కళ్లెం వేశాయి. రోజంతా 812 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 232 పాయింట్ల లాభంతో 31,686 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 9,271 పాయింట్ల వద్దకు చేరింది. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... లాక్డౌన్ కారణంగా గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు భారీగా తగ్గాయి. మార్చిలో 49.3గా ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత నెలలో 5.4కు తగ్గింది. ఈ ఇండెక్స్‌కు సంబధించి గణాంకాలు మొదలైనప్పటినుంచి (డిసెంబర్, 2005)చూస్తే, గత నెలలో సేవల రంగంలో ఇదే అత్యంత భారీ పతనం. కాగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతే కాకుండా ఈ పెంచిన సుంకాన్ని కంపెనీలే భరించాలంటూ పేర్కొంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పతనమయ్యాయి. హెచ్‌పీసీఎల్6 శాతం, ఐఓసీ 3 శాతం, బీపీసీఎల్ 1 శాతం మేర నష్టాల్లో ముగిశాయి. ఈ షేర్లు ఇంట్రాడేలో 7–13% మేర పతనమయ్యాయి. ► స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆప్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా ఐటీసీలో ఉన్న వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ షేర్ 6 శాతం నష్టంతో రూ.164కు చేరింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ లాభాల్లో ఉన్నా వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీవీఆర్, ఓల్టాస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి...
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలహీన బాటను వీడడం లేదు. కరోనా కల్లోలం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, ఈక్విటీల భారీ నష్టాల వంటివి దీనికి కారణం. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి కదలికలను చూస్తే... 40 పైసలు నష్టంతో 76.46 వద్ద రూపాయి విలువ ముగిసింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.91 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపు విలువ 76.83 (2020, ఏప్రిల్ 21వ తేదీ). ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అనూహ్యరీతిలో తన ఆరు డెట్ ఫండ్ స్కీమ్‌లను మూసివేయడం శుక్రవారం రూపాయి పతనానికి నేపథ్యం. పెరిగిన విదేశీ మారక నిల్వలు... ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 3.09 బిలియన్ డాలర్లు పెరిగి (అంతక్రితం ఏప్రిల్ 10తో ముగిసిన వారంతో పోల్చితే) 479.57 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 6తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు లైఫ్‌టైమ్ హై 487.23 బిలియన్ డాలర్లు. -
మార్కెట్ లాక్డౌన్!
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్ సెషన్లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి విలువ ఏకంగా 76.30నీ చూసింది. వరుసగా 3 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి విలువ కొత్త కనిష్టాలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. బంగారం 80 డాలర్లు జంప్ మరోవైపు కోవిడ్ భయాలతో బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాసే సమయం రాత్రి 11.15కు 84 డాలర్ల లాభంతో 1,568 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు న్యూఢిల్లీ: కోవిడ్–19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా రూ.31,585 కోట్లకు బిడ్లను ఆర్బీఐ పొందింది. 5.16 శాతం కటాఫ్ రేటుకు అన్ని బిడ్లనూ ఆమోదించింది. మరో రూ.50,000 కోట్లకు రెండవ విడత వేలాన్ని మంగళవారం నిర్వహించనుంది. అవసరమైతే తదుపరి కూడా ఇదే విధమైన చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను పునఃకొనుగోలు (రీపర్చేజ్) ఒప్పందంపై బ్యాంకులు ఆర్బీఐ వద్ద తనఖాగా ఉంచి ఆ బాండ్ల విలువ మేరకు నిధులను పొందుతాయి. ఈ నిధులపై ఆర్బీఐ కేవలం రెపో రేటు (ప్రస్తుతం 5.15 శాతం) ప్రకారం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. కోవిడ్ నివారణకు యాక్సిస్, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్.. కోవిడ్–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల పౌరులుగా సామాజిక దూరం పాటించాలని కోరారు. కస్టమర్లు సాధ్యమైనంత వరకు బ్యాంక్‌లకు రావొద్దని, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అందుకే ఈ నెల 31 వరకు సేవింగ్, కరెంట్ ఖాతాలు, ప్రిపెయిడ్ కార్డ్స్ కస్టమర్లకు చార్జీలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా యాక్సిస్‌కు 4,415 శాఖలు, 12,173 ఏటీఎంలు, 2.6 కోట్ల మంది కస్టమర్లున్నారు. వేదాంత కూడా...: దినసరి కార్మికుల కోసం మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత రూ.100 కోట్ల ఫండ్ కేటాయించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో జీతాలు కుదించబోమని, తాత్కాలిక కార్మికులను సైతం తొలగించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ వన్ టైం ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. కరోనాపె యుద్ధంలో భాగంగా ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలు అండగా నిలవాలని వేదాంత రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. అవసరమైతే మరింత ఫండ్ కేటాయిస్తామని చెప్పారు. కార్మికులకు రిలయన్స్ అండ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్మికులకు అండగా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రూ.30,000లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులకు చేతిలో నగదు ఉండేలా నెలలో రెండుసార్లు వేతనం చెల్లించనుంది. కరోనా పాజిటివ్ రోగుల చికిత్సకై 100 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ సైతం అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ మాస్కుల తయారీ సామర్థ్యాన్ని రోజుకు లక్ష యూనిట్లకు పెంచింది. అలాగే సూట్స్, గార్మెంట్స్ వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తయారీని పెద్ద ఎత్తున చేపట్టింది. స్వచ్చంద సంస్థల సహకారంతో పలు నగరాల్లో జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత భోజనం అందిస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా అత్యధిక మంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేలా ప్రోత్సహించింది. -
రూపాయి చరిత్రాత్మక పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది. ► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. 74.70 గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది. ► భారత్ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి. ► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ► కోవిడ్–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 103 దాటేయడం గమనార్హం. ► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది. ► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన. -
చివర్లో టపటపా..!
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందన్న భయాలతో గురువారం కూడా స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది. వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 81 పైసలు పతనమై 75 మార్క్ ఎగువకు పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 29,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 501 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 581 పాయింట్ల నష్టంతో 28,288 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రోజంతా 742 పాయింట్ల రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 205 పాయింట్ల నష్టంతో 8,263 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. 2,656 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... ప్రపంచ మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో మన మార్కెట్ కూడా భారీ నష్టాలతోనే మొదలయ్యింది. సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 406 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. అరగంటలోనే సెన్సెక్స్ 2,155 పాయింట్లు పతనమై 26,715 పాయింట్ల వద్ద, నిఫ్టీ 636 పాయింట్లు క్షీణించి 7,833 పాయింట్ల వద్ద ఇంట్రా డే కనిష్టాలను తాకాయి. ఆ తర్వాత నుంచి నష్టాలు తగ్గుతూ వచ్చాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్ నష్టాలు 1,000 పాయింట్ల మేర రికవరీ కావడంతో మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్ లాభాల్లోకి మళ్లాయి. అయితే అది స్వల్పకాలమే కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 501 పాయింట్లు, నిఫ్టీ 106 పాయింట్ల మేర లాభపడ్డాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,656 పాయింట్లు, నిఫ్టీ 742 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. కాగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. గురువారం నాటి రూ. 4,623 కోట్ల నికర అమ్మకాలను కూడా కలుపుకుంటే, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ రూ.47,897 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. పెట్టుబడులన్నింటినీ నగదుగా మార్చుకోవాలనే తపనతో ఇన్వెస్టర్లు పుత్తడితో సహా పలు ఇతర పెట్టుబడి సాధనాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో షేర్లు, బాండ్లు, పుత్తడి, కమోడిటీలు అన్నీ పతనమవుతూ ఉన్నాయి. ప్యాకేజీలున్నా.... పతనమే వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్రకటించిన ఉద్దీపన చర్యలు... ప్రపంచ మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పి 8 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లలో అత్యధికంగా పతనమైన సూచీ ఇదే. యూరప్ కేంద్ర బ్యాంక్ 75,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభమైనా, ఆ త ర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు 1– 2% లాభాల్లో ముగిశాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి. ► దాదాపు 1,200కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 10 శాతం నష్టంతో రూ.2,746 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. యాక్సిస్ బ్యాంక్ 9.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 9 శాతం, టెక్ మహీంద్రా 8 శాతం, ఓఎన్జీసీ 7 శాతం చొప్పున క్షీణించాయి. ► మరోవైపు ఐటీసీ 7 శాతం లాభంతో రూ.162 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటొకార్ప్ షేర్లు 7.5 శాతం మేర ఎగిశాయి. భారత్ వృద్ధి క్యూ1లో 3.1 శాతమే: బీఓఎఫ్ఏ ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ త్రైమాసికం వృద్ధి అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ 48 గంటల్లో రెండవసారి ఏకంగా 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం 3.1 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదవుతుందని వివరించింది. 2020–21లో వృద్ధి రేటు 4.1%గా ఉంటుందని విశ్లేషించింది. బుధవారంనాడు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికను విడుదల చేస్తూ, జూన్ త్రైమాసికంలో భారత్ జీడీపీని 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 4%కి కుదించింది. గురువారం ఈ రేటునూ మరో 90 బేసిస్ పాయింట్లు కుదించడం గమనార్హం. ఇక 2020–21 భారత్ వృద్ధి రేటును 5.1%గా 48 గంటల క్రితం లెక్కకట్టిన ఈ సంస్థ తాజాగా ఈ అంచనాలకూ 100 బేసిస్ పాయింట్లు కోతపెట్టడం (4.1 శాతానికి) గమనార్హం. రిలయన్స్... 4 నెలల్లో 5 లక్షల కోట్లు హాంఫట్ వరుసగా ఐదో రోజూ రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయింది. ఇంట్రాడేలో 8 శాతం పతనమైన ఈ షేర్ చివరకు 5.3 శాతం నష్టంతో రూ.917 వద్ద ముగిసింది. ఈ ఐదు రోజుల్లో ఈ షేర్ 17 శాతం నష్టపోగా, మార్కెట్ క్యాప్ రూ.1,20,312 కోట్లు తగ్గింది. నాలుగు నెలల క్రితం (గత ఏడాది నవంబర్‌లో)ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం సగం విలువ హరించుకుపోయి రూ.5,81,374 కోట్లకు పడిపోయింది. కాగా ముకేశ్, ఆయన భార్య, పిల్లలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో తమ తమ వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. ప్రమోటర్ గ్రూప్ కంపెనీ నుంచే ఈ వాటాలను కొనుగోలు చేయడంతో రిలయన్స్ ప్రమోటర్ల షేర్ల హోల్డింగ్‌లో మార్పుచోటు చేసుకోలేదు. మొత్తం మీద ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అం బానీ, ఆయన పిల్లలు–ఆకాశ్, ఇషా, అనంత్‌లకు ఒక్కొక్కరికి 75 లక్షల షేర్లు ఉన్నాయి. -
బంగారం రూ.44,000 పైకి..
ముంబై: ఒకవైపు అంతర్జాతీయంగా పసిడి పరుగు, మరోవైపు దేశీయంగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌తో దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాములు ధర రూ.1,000కుపైగా పెరిగి రూ.44,000 దాటిపోయింది. న్యూఢిల్లీలో ధరలు రూ.1,155 ఎగసి, రూ. 44,383కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.50,000 కొంచెం అటు ఇటూ పలుకుతుండడం గమనార్హం. ప్రపంచ వృద్ధికి కోవిడ్–19 భయాలు, దీనితో తమ పెట్టుబడులకు బంగారాన్ని సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తుండడం, దీనికితోడు వృద్ధికి బలాన్ని ఇవ్వడానికి అమెరికా ఫెడ్‌సహా పలు సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానాలను అవలంభిస్తుండడం వంటి అంశాలు పసిడికి అంతర్జాతీయంగా బలాన్ని ఇస్తున్నాయి. రూపాయి... 17 నెలల కనిష్టం ఇదిలావుండగా, ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం మరో 20 పైసలు నష్టపోయి.. 73.39 వద్ద ముగిసింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ట్రేడింగ్ మొదట్లో 72.90 వద్ద ప్రారంభమైన రూపాయి, 74 పైసల కనిష్ట–గరిష్ట స్థాయిల మధ్య తిరగడం గమనార్హం. బుధవారం ఒక దశలో 73.64 స్థాయినీ చూసింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూలతలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. -
రూపాయికీ ప్యాకేజీ వార్తల జోష్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం మొట్టమొదటిసారి 72 దిగువకు పడిపోయింది. అయితే చివరకు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం ముగింపుతో పోల్చిచూస్తే, 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది. ఎఫ్‌పీఐ పారిన్ పోల్టిఫోలియో ఇన్వెస్టర్లపై సర్‌చార్జ్ తీసివేస్తారని, వృద్ధికి దోహదపడే చర్యలను ప్రభుత్వం ప్రకటించనుందని వచ్చిన వార్తలు, ఈ వార్తలతో లాభాల బాటన నడిచిన ఈక్విటీ మార్కెట్లు రూపాయిని బలోపేతం చేశాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సాయంత్రం పత్రికా సమావేశంలో ప్రసంగించనున్నారన్న ప్రకటన అటు ఈక్విటీ మార్కెట్లను ఇటు ఫారెక్స్ మార్కెట్‌ను ఒడిదుడుకుల బాటనుంచి స్థిరీకరణ దిశగా నడిపించాయి. అంతర్జాతీయంగా కీలక స్థాయికన్నా దిగువున ఉన్న క్రూడ్ ధరలూ రూపాయి సెంటిమెంట్‌కు కొంత బలాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. గురువారం రూపాయి ఎనిమిది నెలల కనిష్టం 71.81 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం టేడింగ్ మొదట్లో బలహీనతలోనే 71.93 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 72.05ను తాకింది. 71.58 గరిష్టస్థాయిని నేటి ట్రేడింగ్‌లో రూపాయి చూసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్‌కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్బీఐ చెక్ చెబుతోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్బీఐ కల్పించనుంది. టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్‌తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి. కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్‌పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్‌కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు కార్యరూపం రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్‌లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించాలని ఆర్బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ఫామ్‌పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్గా మార్చి ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది. జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాప్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్‌కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది. ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్‌కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్రేట్లు ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్‌గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్‌కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్‌కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ను స్పెక్యులేషన్‌కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు. -
ఒకేరోజు రూపాయి 59 పైసలు పతనం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు భారీగా 59 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.51 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్టం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత, దేశం నుంచి బయటకు వెళుతున్న విదేశీ నిధులు, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికా వృద్ధి సంకేతాలు, డాలర్ పటిష్టం వంటి అంశాలూ రూపాయికి బలహీనమవుతున్నాయి. రూపాయి బలహీనతలో 70.16 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూపాయి 70.53ను కూడా తాకింది. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే తాజా అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల పటిష్ట స్థాయి వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారుతున్నాయి. -
70 దిశగా రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. గత కొద్ది రోజులుగా 70–69 మధ్య కదులుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం 28 పైసలు తగ్గి 69.71 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడ్డం వరుసగా ఇది మూడవరోజు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు రూపాయి పతనానికి తోడవుతున్నాయి. వారం క్రితమే 70పైన ముగిసిన రూపాయి అటు తర్వాత క్రమంగా బలపడినా... తిరిగి బలహీన బాటలో నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
వారం మొత్తం ‘రూపాయి’కి లాభమే!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారంకూడా 15 పైసలు లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 69.22 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం రూపాయి పటిష్ట బాటన నడిచింది. 80 పైసలు లాభపడింది. గతవారంకూడా రూపాయి ఒకశాతంపైగా బలపడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం తాజాగా రూపాయికి కలిసి వస్తోంది. నిజానికి ఈ సానుకూల అంశంతో రూపాయి మరింత బలపడాల్సి ఉంది. అయితే విదేశీ నిధులు వెనక్కు వెళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై తగ్గిన సెంటిమెంట్ రూపాయి జోష్‌పై నీళ్లు జల్లుతున్నాయి. కాగా క్రూడ్ ధరలు, ఎన్నికల ఫలితంపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో మే నెల మొత్తం రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా. సమీప కాలంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని నాలుగు నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. -
మూడు రోజుల్లో 68పైసలు డౌన్
ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ తగ్గింది. సోమవారం ముగింపు (69.42)తో పోల్చితే 18పైసలు తగ్గి 69.60 వద్ద ముగిసింది. మూడురోజుల్లో రూపాయి 68 పైసలు నష్టపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయిపై ఈ మూడురోజుల్లో ప్రభావం చూపాయి. ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్‌ఫ్రైడే) కావడంతో అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఫారెక్స్ ట్రేడర్ల నుంచి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్ ఏర్పడింది. ఆయా అంశాల నేపథ్యంలో... రూపాయి మరింత బలహీనపడాల్సి ఉంది. అయితే దేశంలోకి భారీగా విదేశీ నిధులు, దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు కలిసి వస్తోంది. -
‘సెలవుల వారం’ అప్రమత్తత
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో ట్రేడర్లు పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్‌ఫ్రైడే) కావడం దీనికి కారణం. అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 25పైసలు తగ్గి, 69.42 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్‌లో 69.07 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.46ను కూడా చూసింది. శుక్రవారం రూపాయి ముగింపు 69.17. 74.39 గరిష్ట నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. రెండు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, రూపాయి మరీ పడిపోయే పరిస్థితి ఏదీ ప్రస్తుతానికి లేదని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుతం ఇది 68.50–70 శ్రేణి వద్ద స్థిరీకరణ పొందుతోందని వారు పేర్కొంటున్నారు. -
మెరిసిన డాలర్.. పెరిగిన క్రూడ్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 44 పైసలు పడింది. దీనితో 69.67కు రూపాయి జారింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ పటిష్ట ధోరణి, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు తాజాగా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడం కూడా రూపాయిపై ప్రభావం చూపింది. రూపాయి వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచీ కిందకు జారుతోంది. ఈ కాలంలో 126పైసలు పడింది. రూపాయి ట్రేడింగ్ 69.40 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 69.71 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. మరింత బలపడి గత నెల రోజులుగా 68–70 శ్రేణిలో తిరుగుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ రూపాయిపై వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో నైమెక్స్ క్రూడ్ ధర 64 వద్ద ట్రేడవుతుండగా, భారత్ దిగుమతి చేసుకునే బ్రెంట్ క్రూడ్ 71 వద్ద ట్రేడవుతోంది. ఈ రేట్లు 5 నెలల గరిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ 96.66 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 69.59 వద్ద ట్రేడవుతోంది. -
మూడో రోజూ రూపాయి పరుగు..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమ, మంగళ, బుధవారాల్లో రూపాయి 89 పైసలు లాభపడితే, ఒక్క బుధవారం 33 పైసలు పెరిగింది. 68.41 వద్ద ముగిసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ రూపాయి బలోపేత ధోరణి కొనసాగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్ బలహీనత ఇక్కడ రూపాయికి ప్రధానంగా కలిసివస్తోంది. ఉదయం 68.72 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.37ను కూడా తాకింది. రూపాయికి నిరోధం 68.50 వద్ద ఉంటే, ఆ స్థాయిపైన రూపాయి ముగియడం గమనార్హం. ఇదే విధమైన ముగింపులు మరో రెండు రోజులు కొనసాగితే, రూపాయి తిరిగి 67ను చూస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నేడు రేటు తగ్గిస్తే, మరింత బలోపేతం! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గిస్తే, రూపాయి మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు పెంచలేని పరిస్థితి ఉంటేనే దేశంలోనూ ఆర్బీఐ మరో పావుశాతం రేటు కోతకు నిర్ణయం తీసుకుంటుంది. ఫెడ్ ఫండ్ రేటు పెరగలేదంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి నిదర్శనం. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. రూపాయికి మరింత లాభం చేకూర్చే అంశం ఇది. రూపాయి పరుగుకు మరిన్ని కారణాలను విశ్లేషిస్తే... ► ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు. ► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు. ► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేయడం. ► వెరసి ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరును రూపాయి కనబరిచింది. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 18 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రెండోరోజూ... రూపాయి పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కిందకు జారింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 42 పైసలు తగ్గి, 69.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పటిష్టత దీనికి నేపథ్యం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనితో వడ్డీరేట్లు తగ్గిస్తూ, సరళతర ఆర్థిక విధానాలవైపు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసియా దేశాల కరెన్సీలూ ఒత్తిడికి గురవుతున్నాయి. ట్రేడింగ్‌లో 69.04 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 69.35నూ తాకింది. బుధవారం రూపాయి 2 పైసల నష్టంతో రూ.68.88 వద్ద ముగిసింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా 2 నెలల క్రితం గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్లు పడిపోవడంతో రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ తాజా కనిష్ట స్థాయిల నుంచి 13 డాలర్లకుపైగా పెరగడంతో ఆతర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. 2 నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమయ్యింది. తాజాగా 68.50 స్థాయిని చూసింది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
రూపాయి ‘బెస్ట్’!
న్యూఢిల్లీ: మొన్నటి వరకు ఆసియా ప్రాంతంలో బలహీనంగా కనిపించిన రూపాయి ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. ఆసియాలోనే వరస్ట్ పనితీరు నుంచి అత్యుత్తమ పనితీరు చూపించే స్థాయికి మారిపోయింది. కేవలం ఐదు వారాల్లోనే రూపాయి తన దిశను మార్చుకోవడం వెనుక మోదీ ఫ్యాక్టరే ప్రధానంగా పనిచేయడం ఆసక్తిదాయకం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడుల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి మోదీ నాయకత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఇవే అంచనాలు దన్నుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలోకి ఐదు వారాలుగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. దీంతో రూపాయి కళను సంతరించుకుంది. డాలర్ మారకంలో 70లోపునకు దిగొచ్చింది. మోదీ రెండోసారి విజయం సాధిస్తే రూపాయి మరింత బలపడుతుందని సింగపూర్‌లోని స్కాటియా బ్యాంకు కరెన్సీ స్ట్రాటజిస్ట్ గావోక్వి తెలిపారు. జూన్ చివరి నాటికి డాలర్‌తో రూపాయి 67 స్థాయికి పుంజుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వృద్ధి పడిపోతుండడంతో ప్రధాన సెంట్రల్ బ్యాంకులు డోవిష్ విధానాన్ని వ్యక్తీకరించడం కూడా విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన ఆసియా కరెన్సీల్లో రాబడుల కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడుల వెల్లువ... మార్చి నెలలో(18 నాటికి) విదేశీ ఇన్వెస్టర్లు భారత్ ఈక్విటీ మార్కెట్లో 3.3 (రూ.23వేల కోట్లు అంచనా) బిలియన్ డాలర్లను కుమ్మరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 5.6 బిలియన్ డాలర్లలో 50 శాతానికంటే ఎక్కువ కేవలం గత 3 వారాల్లోనే రావడం గమనార్హం. బాండ్లలో ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. డాలర్ల వెల్లువతో రూపాయి గతేడాది ఆగస్ట్ తర్వాత తిరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల్లో డాలర్లలో రుణాలు తీసుకుని రూపాయి ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వచ్చిన రాబడులు 3.8 శాతంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ క్యారీ ట్రేడింగ్ రాబడులు రూపాయిలోనే ఉండడం గమనార్హం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే త్వరలో జరిగే ఎన్నికల్లో 272 లోక్‌సభ స్థానాలను సాధిస్తుందని రెండు ఒపీనియన్ పోల్స్ అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘మార్కెట్లు మోదీ విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నాయి. ఉన్నట్టుండి మార్కెట్ వాతావరణం మారేందుకు మరే ఇతర అంశం లేదు’’ అని కోటక్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అనిద్య బెనర్జీ పేర్కొన్నారు. రూపాయి పట్ల ఆశావహ పరిస్థితి డెరివేటివ్ మార్కెట్లపైనా ప్రతిఫలిస్తోంది. నెలవారీ ఆప్షన్లలో రూపాయి కొనుగోలు కంటే విక్రయం 19 బేసిస్ పాయింట్లు అధికం ఉన్నాయి. ‘‘అంతర్జాతీయ పరిస్థితులు ఫెడ్, ఈసీబీ డోవిష్ ధోరణి దేశీయంగా మరింత మద్దతుగా మారాయి. బీజేపీ విజయావకాశాలపై విశ్వాసం పెరగడం, అదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల్లో రికవరీ నెలకొనడం రూపాయిని నడిపిస్తున్నాయి’’ అని నోమరా కరెన్సీ స్ట్రాటజిస్ట్ దుష్యంత్ పద్మనాభన్ తెలిపారు. రూపాయి మూడు నెలల అంతర్గత వోలటాలిటీ కూడా 5.87 శాతానికి పడిపోయింది. గతేడాది ఆగస్ట్ తర్వాత మళ్లీ ఇదే తక్కువ స్థాయి. ఇది రూపాయి బుల్లిష్ ధోరణిని తెలియజేస్తోంది. రూపాయి సమీప కాలంలో స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బార్క్లేస్ స్ట్రాటజిస్ట్ ఆశిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ కనుక మరలా విజయం సాధిస్తే ఈ ఏడాది మిగిలిన కాలంలో రూపాయి బలం చూపిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
రూపాయి... 6 రోజుల్లో 161 పైసలు రన్!
న్యూఢిల్లీ: రూపాయి అప్రతిహత పురోగమనం కొనసాగుతోంది. సోమవారం వరుసగా ఆరవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో 57 పైసలు లాభపడింది. 68.53 వద్ద ముగిసింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది. 2018 ఆగస్టు 1వ తేదీన రూపాయి ముగింపు 68.43. అప్పటి తర్వాత రూపాయి మళ్లీ తాజా స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. శుక్రవారం రూపాయి ముగింపు 69.10. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ ఎక్సే్చంజ్‌లో 68.92 వద్ద పటిష్టంగా రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 68.45న కూడా చూసింది. కారణాలను విశ్లేషిస్తే... ►ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ నరేం ద్రమోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు ►డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం. ►దీనితో ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంటుందన్న విశ్లేషణలు. ►వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు ఉంటుందన్న అంచనాలు. ►డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి. ►అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందన్న అభిప్రాయం. బుధవారం సమీక్ష సందర్భంగా రేటు పెంపు ఉండదన్న విశ్లేషణలు. ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్చంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేస్తోందన్న వార్త. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 14 డాలర్లకుపైగా పెరగడంతో మళ్లీ రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అయితే క్రూడ్ ధరల కత్తి ఇప్పటికీ వేలాడుతున్న విషయం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా అయితే కష్టమే... రూపాయి వేగవంతమైన రికవరీ, ఈ పరిస్థితుల్లో వచ్చే ఒడిదుడుకులు ఆందోళన కలిగించే అంశమే. ఒడిదుడుకుల నిరోధానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి. మారకపు విలువ అనిశ్చితి దేశీయ కరెన్సీ తీవ్ర ఒడిదుడుకులకూ కారణమవుతుంది. ఇది ఎగుమతిదారులకేకాదు. దిగుమతిదారులకూ తలనొప్పులు తెచ్చిపెడుతుంది. రూపాయి మరింత పెరిగితే ఎగుమతులు పెరగాలన్న కేంద్ర విధానానికీ విఘాతం కలిగిస్తుంది. ఇప్పటికే సతమతమవుతున్న ఎగుమతుల రంగానికి ఇది ఒక పెద్ద సవాలే. ఇతర పోటీ కరెన్సీలతో భారత్ ఎగుమతులు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటాయి. – గణేశ్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఆసియా కరెన్సీల్లోనే ఉత్తమ పనితీరు.. ఆసియా దేశాల కరెన్సీలన్నింటిలోనూ ఉత్తమ పనితీరు కనబరిచింది. వాణిజ్యలోటు సానుకూల స్థితి, విదేశీ నిధుల ప్రవాహం దీనికి కారణం. ఈ నెలల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 2.4 బిలియన్ డాలర్లు ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెట్టారు. దీనితో భారత్ మార్కెట్లో వారి నికర కొనుగోళ్లు 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నెల్లో రూపాయి డినామినేటెడ్ బాండ్లలో వారి హోల్డింగ్స్ 833 మిలియన్ డాలర్లు పెరిగాయి. – వీకే శర్మ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ -
వేగంగా రూపాయి రికవరీ!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో వేగంగా బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడితే, గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ రూపాయి లాభాల బాటన నడిచింది. గురువారం ముగింపు 69.34పైసలు అయితే, శుక్రవారం మరింత లాభంతో 69.28 వద్ద ప్రారంభమైంది. ఒకదశలో 69.03ను స్థాయిని కూడా చూసింది. రూపాయి పెరుగుదలకు పలు కారణాలున్నాయి. కారణాలు ఇవీ... ►ఎన్నికల అనంతరం దేశ ప్రధానిగా మళ్లీ మోదీనే పగ్గాలు చేపడతారన్న విశ్లేషణలు ► ఈ అంచనాల నేపథ్యంలో డెట్, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం. ► క్రూడ్ ఆయిల్ (ఈ వార్త రాసే 9 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర 66.68) ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా ఉండడం. ► దీనితో ద్రవ్యోల్బణం కట్టడి విశ్లేషణలు. ► వృద్ధి క్రియాశీలతకు రేటు తగ్గింపు అంచనా. ► డాలర్ ఇండెక్స్ కదలికలపై అనిశ్చితి ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– రేటు (ప్రస్తుత శ్రేణి 2.25–2.50) పెంపు విషయంలో అనిశ్చితి ► మూడేళ్ల ఫారిన్ ఎక్సే్ఛంజ్ స్వాప్ ఆక్షన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు బిలియన్ డాలర్ల లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) వ్యవస్థలోకి పంప్ చేస్తోందన్న వార్త. 74.39 కనిష్టం నుంచి... అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. . గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. -
రూపాయికి మరో 17పైసలు లాభం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా మూడవరోజూ బలపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 17 పైసలు లాభపడి 69.54 వద్ద ముగిసింది. ఈ ఏడాది ప్రారంభం రోజు జనవరి 1వ తేదీన రూపాయి 69.43 స్థాయిని చూసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థితిని చూడ్డం ఇదే తొలిసారి. గడచిన మూడు రోజుల్లో రూపాయి 60 పైసలు బలపడింది. బుధవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్ అమ్మకాలకు దిగారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు విశేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 12 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. గత రెండు నెలలుగా 72–70 మధ్య కదలాడింది. అయితే ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ తాజాగా రూపాయికి సానుకూలమవుతోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులూ రూపాయికి కలిసి వస్తోంది. -
రూపాయికి ‘విదేశీ నిధుల’ అండ
ముంబై: దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ పరుగులు రూపాయిని బలోపేతం చేస్తున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 18పైసలు బలపడి 69.71 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో ఈ స్థాయిని రూపాయి చూడ్డం ఇదే తొలిసారి. విదేశీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణిసైతం రూపాయికి కలిసి వస్తోంది. మంగళవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్ అమ్మకాలకు దిగారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. సోమవారం కూడా రూపాయి 30 పైసలు లాభపడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి పడిపోతూ రావడంతో రూపాయి కోలుకుని 2 నెలల క్రితం ప్రస్తుత స్థాయిని చూసింది. -
రూ.70.92కు జారిన రూపాయి
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 20 పైసలు కోల్పోయింది. ఫారెక్స్ మార్కెట్లో 70.92 వద్ద క్లోజయింది. మరోవైపు చమురు ధరలు పెరగడం, డాలర్ బలోపేతం కావడం గమనార్హం. జీడీపీ రేటు మూడో త్రైమాసికానికి కనిష్ట స్థాయి 6.6 శాతానికి తగ్గడం, అధిక చమురు ధరలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు బలహీనంగా కొనసాగుతుండటం వంటి అంశాలు రూపాయిపై ప్రభావం చూపించినట్టు పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ తెలిపారు. ఇంటర్బ్యాంకు ఫారీన్ ఎక్సే్ఛం జ్ (ఫారెక్స్)లో రూపాయి 70.75 వద్ద ప్రారం భం కాగా, ఇంట్రాడేలో 70.99 వరకు దిగజారి చివరికి 70.92 వద్ద ముగిసింది. అయితే, ఈ వారంలో మొత్తం మీద రూపాయి 22 పైసలు నికరంగా లాభపడటం గమనార్హం. -
రూపాయిని పడేసిన ‘దాడులు’
ముంబై: భారత్–పాక్ ఉద్రిక్తతల ప్రభావం బుధవారం రూపాయి విలువపై పడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 17 పైసలు తగ్గి 71.24 వద్ద ముగిసింది. పటిష్టంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మంగళవారం ముగింపు 71.08 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 71.49–70.94 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి బలహీనత వరుసగా ఇది రెండవసారి. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 12 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి ప్రస్తుతం 72–69.50 శ్రేణిలో స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రేటజీ హెడ్ వీకే శర్మ విశ్లేషించారు. -
1,300 డాలర్లపైన పసిడి పటిష్టమే!
అంతర్జాతీయంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్‌లో పసిడి ధర పటిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔన్స్ ధర 1,300 డాలర్లపైన కొనసాగినంతకాలం పసిడిది బులిష్ ధోరణిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది వారి విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో ధర ఒక దశలో 1,307 డాలర్లకు పడినా, అటుపై తిరిగి 1,318 డాలర్లకు చేరడం గమనార్హం. అయితే వారంవారీగా చూస్తే ఇది 4 డాలర్లు తక్కువ. 1,325 డాలర్ల వద్ద నిరోధమనీ, ఈ అడ్డంకిని అధిగమిస్తే, 1,340 డాలర్ల వరకూ పసిడి ధర పయనించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 2019, 2020ల్లో యూరోపియన్ యూనియన్ వృద్ధి మందగిస్తుందన్న వార్తలు గతవారం డాలర్ బలోపేతానికి ఊతం ఇచ్చాయి. అయితే వాణిజ్య యుద్ధం, అమెరికా వృద్ధికి సంబంధించి కీలక గణాంకాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు స్పీడ్‌పై అనిశ్చితి తొలగనంతవరకూ డాలర్ బలోపేత ధోరణి కొనసాగదని, ఇది పసిడి పెరుగుదలకు సానుకూల అంశమని విశ్లేషణ. శుక్రవారం డాలర్ ఇండెక్స్ ముగింపు 96.41. భారత్‌లోనూ అదే ధోరణి... ఇక భారత్‌లో చూస్తే, పసిడి ధర సమీపకాలంలో భారీగా తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ధర పెరుగుదలతోపాటు డాలర్ మారకంలో రూపాయి బలహీనధోరణి ఇందుకు ప్రధాన కారణం. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో పసిడి 10 గ్రాముల ధర రూ.33,242 వద్ద ముగిసింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల పసిడి ధర రూ.33,980 వద్ద ముగిసింది. -
ఈ ఏడాది 78 స్థాయికి రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 78 స్థాయిని చూసే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ కార్వీ తెలియజేసింది. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటులు దీనికి ప్రధాన కారణం కానున్నాయని సంస్థ తన వార్షిక కమోడిటీ, కరెన్సీ నివేదికలో పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు సైతం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా కార్వీ కమోడిటీస్ అండ్ కరెన్సీల విభాగం సీఈఓ రమేశ్ వరకేద్కర్ తెలిపారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 68– 69.50 శ్రేణి బేస్‌గా 73.70– 74.50 శ్రేణి కనిష్ట స్థాయికి రూపాయి చేరవచ్చు. ఈ స్థాయి కిందకు పడితే, ఖచ్చితంగా ఇదే ఏడాది రూపాయి 78 దిశగా పతనం అయ్యే అవకాశం ఉంది. ► ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితంపై తీవ్ర అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అటు విదేశీ వ్యవస్థాగత ఇన్వెస్టర్లు ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులకు తక్షణం దూరంగా ఉండే వీలుంది. ► 2017–18 పూర్థి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 48.72 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచే నాటికే ఈ విలువ 34.94 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే విధంగా రెండవ ఆరునెలల గణాంకాలూ నమోదయితే, క్యాడ్ దేశానికి తీవ్ర భారంగా తయారయ్యే అవకాశం ఉంది. ► ఒపెక్, రష్యాలు తమ ఉత్పత్తుల కోత నిర్ణయం తీసుకుంటే, అంతర్జాతీయంగా క్రూడ్ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా వృద్ధి భయాల వల్ల కాపర్, అల్యూమినియంసహా బేస్‌మెటల్ ధరలు బలహీనంగానే ఉంటాయి. ► సరఫరాల సమస్యల వల్ల పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది. ► అధిక పంట దిగుబడుల వల్ల సొయాబీన్ మార్కెట్లో ఈ ఏడాది రెండవ భాగంలో అమ్మకాలు ఒత్తిడి ఉండే వీలుంది. ► తక్కువ దిగుబడివల్ల జీర, చిక్కుడు ధరలు సానుకూలంగా ఉండవచ్చు. 71.56 వద్ద రూపాయి... డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం కేవలం ఒక్కపైసా లాభంతో 71.56 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.68–71.49 శ్రేణిలో తిరిగింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడు బల్లమీదకు ఎక్కింది. ఇప్పటికిప్పుడు రూపాయి 68 దిశగా బలపడే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. -
మళ్లీ 71కి జారిన రూపాయి....
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ పతనబాట పట్టింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ ఒకేరోజు 43 పైసలు క్షీణించి 70.92 వద్ద ముగిసింది. గడచిన నెల రోజుల్లో ఈ స్థాయికి రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. డిసెంబర్ 17న రూపాయి 71.56 వద్ద ముగిసింది. కారణాలు చూస్తే... ► శుక్రవారం వెలువడిన నవంబర్ పారిశ్రామిక ఉత్ప త్తి గణాంకాలను చూస్తే, కేవలం అరశాతం వృద్ధి నమోదయ్యింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి. ► విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం ప్రతికూల ప్రభావం చూపాయి. ► చమురు ధరలు కొంత తగ్గడం, ప్రధాన ప్రపంచ దేశాల కరెన్సీలపై డాలర్ బలహీనత వల్ల రూపాయి పతనం కొంత ఆగింది కానీ, లేదంటే మరింత పతనం జరిగేదన్నది విశ్లేషణ. ► అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తీవ్రతతో జారుడుబల్లపైకి ఎక్కింది. -
రూపాయి 34 పైసలు రికవరీ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 34 పైసలు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 71.56 వద్ద ముగిసింది. నవంబర్‌లో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు తగ్గినట్లు (అక్టోబర్‌లో 17.13 బిలియన్ డాలర్లు ఉన్న వాణిజ్యలోటు నవంబర్‌లో 16.67 బిలియన్ డాలర్లకు తగ్గింది) వెలువడిన గణాంకాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలోపేతం వంటి అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే గ్లోబల్ మార్కెట్లో ప్రధాన దేశాల కరెన్సీలతో డాలర్ బలహీనత కూడా రూపాయి పటిష్టతకు తోడయ్యింది. డాలర్ మారకంలో 71.84 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో 71.51ని తాకింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ 69 స్థాయిని చూసినా, ఆ స్థాయిలో ఎక్కువ రోజులు నిలబడకుండా, 71–72 స్థాయిలో తిరుగుతోంది. -
ఆర్థిక అనిశ్చితి నీడన రూపాయి!
ముంబై: రికవరీ అవుతోందనుకున్న రూపాయి... మళ్లీ పతన బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ డాలర్ మారకంలో 50 పైసలు పడి 71.32 వద్ద ముగిసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి అంశాల ప్రభావం రూపాయిపై పడుతోంది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత క్రమంగా కోలుకుంటూ, ఈ నెల ప్రారంభంలో దాదాపు 69.50 వరకూ రికవరీ అయ్యింది. క్రూడ్ ధరలు తగ్గడం, దేశంలోకి తాజాగా వచ్చిన విదేశీ నిధులు దీనికి కారణం. అయితే ఈ స్థాయిలో రూపాయి నిలబడలేక బలహీన ధోరణిలోకి జారింది. ఇందుకు ప్రధాన కారణాలను చూస్తే...అధ్యక్షుల సమావేశంతో ముగిసిపోయిందను కున్న అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భయాలు తిరిగి (చైనాకు చెందిన టెలికం దిగ్గజం హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంజూ కెనడాలో అరెస్ట్‌తో) ప్రారంభం కావడం. తగ్గాయనుకున్న క్రూడ్ ధరలు (ఒపెక్, రష్యా చమురు కోతల నిర్ణయంతో) తిరిగి పెరుగుతాయన్న ఆందోళనలు దీనితో కరెంట్ అకౌంట్ లోటుపై హెచ్చరికలు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుందన్న అంచనాలు. నేడు మరింత డౌన్? పలు బలహీన అంశాల నేపథ్యంలో రూపాయి సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 71.28 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.44కు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్ల భారీ పతనమూ రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ వార్తరాసే సమయం రాత్రి 8.30 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ బలహీనంగా 72.50 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషనలూ ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలకు ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకు ప్రధాన కారణమయ్యే అవకాశం ఉండగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు బిజేపీకి వ్యతిరేకంగా ఉంటే, పతనం మరింత వేగంగా ఉండవచ్చు. రూపాయి మళ్లీ 75వైపు పయనించే అవకాశం ఉందని కొన్ని సంస్థలు విశ్లేషణలు చేస్తున్న విషయం గమనార్హం. -
రూపాయి రయ్ రయ్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు 27 పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది. దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 5 బిలియన్ డాలర్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు, నవంబర్‌లో భారత్ ఈక్విటీల్లో 558 మిలియన్ డాలర్ల తాజా పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత వేగంగా కోలుకుంటూ వచ్చింది. -
ఏడు రోజుల తరువాత మళ్లీ బలహీనం
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 18 పైసలు బలహీనపడి 70.87 వద్ద ముగిసింది. గడచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 220 పైసలు బలపడింది. క్రూడ్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 25 డాలర్లు పతనం కావటం, విదేశీ నిధులు రావటం దీనికి కారణాలు. సోమవారం ప్రారంభంలో పటిష్ట ధోరణితో రూపాయి 70.48 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత ఎగుమతిదారుల డాలర్లను విక్రయించటంతో రూపాయి విలువ 70.30ను కూడా చూసింది. అయితే ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో కోలుకుంటూ వస్తోంది. నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర 50 దిగువకు పడిపోతే, రూపాయి మరింత బలపడుతుందన్న అంచనాలున్నాయి. -
7 రోజుల రికార్డు పరుగు!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పటిష్ట రీతిన బలపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో గురువారం ఒకేరోజు 77 పైసలు లాభపడి 70.69 వద్ద ముగిసింది. రూపాయి రికవరీ బాటన పయనించడం వరుసగా ఇది ఏడవరోజు. ఈ కాలంలో భారీగా 220 పైసలు లాభపడింది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను భారీగా విక్రయించడం కొనసాగిస్తున్నారు. గురువారం రూపాయి ప్రారంభం తోటే 71.12 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.68 వద్దకూ రికవరీ అయ్యింది. మంగళవారం రూపాయి ముగింపు 71.46. బుధవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు. బలోపేతానికి కారణాలు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్ ఇండెక్స్ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయపడ్డారు. -
రూపాయికి తగ్గిన చమురు సెగ
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఒకేరోజు 36 పైసలు బలపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ ఎక్సే్చంజ్‌లో 72.31 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తాజా గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లు పతనం కావడం... దీనితో దేశంపై దిగుమతుల బిల్లు భారం తగ్గే అవకాశాలు... కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–వెళ్లే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) అలాగే ధరల పెరుగుదల భయాలు తగ్గడం వంటి అంశాలు రూపాయి లాభానికి కారణాలు. దీనికితోడు కొన్ని విదేశీ కరెన్సీలపై డాలర్ బలహీనత, దేశీయ మార్కెట్లో దిగుమతిదారులు, బ్యాంకర్ల అమెరికా కరెన్సీ అమ్మకాల వంటివి కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచాయి. రూపాయి ట్రేడింగ్ ప్రారంభంలోనే మంగళవారం ముగింపుతో పోల్చితే పటిష్ట స్థాయిలో 72.18 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 71.99కి కూడా రికవరీ అయ్యింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) మార్కెట్లో రూ.277 కోట్ల నికర కొనుగోళ్లు జరిపినట్లు తొలి గణాంకాలు వివరించడం మరో అంశం. అక్టోబర్ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది. -
రూపాయి కోలుకుంటుంది
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్) నివారణకు అవసరమైన సమయంలో మరిన్ని చర్యల్ని తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం మాట్లాడుతూ... రూపాయి రికవరీ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరెన్సీ, స్టాక్ మార్కెట్ల పతనానికి విదేశీ అంశాలే కారణమన్నారు. సెన్సెక్స్ గురువారం 1,000 పాయింట్ల మేర ప్రారంభంలో పడిపోగా, డాలర్‌తో రూపాయి 74.45 స్థాయికి చేరటం గమనార్హం. ‘‘ముందు రోజు అమెరికాలో ఏం జరిగిందో మన దగ్గరా అదే పునరావృతమయింది. ప్రపంచ వృద్ధి రేటు, అమెరికా వృద్ధి రేటును వచ్చే ఏడాదికి ఐఎంఎఫ్ తగ్గించింది. ఈ రెండూ మార్కెట్లపై ప్రభావం చూపించాయి’’ అని ఆ అధికారి వివరించారు. అయితే భారత వృద్ధి రేటు పెరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొనటాన్ని ఆయన గుర్తు చేశారు. చమురు ధరలు క్షీణిస్తాయనేందుకు సంకేతాలు ఉన్నాయని, రూపాయిని అవి సానుకూల పరుస్తాయని చెప్పారు. ‘‘రూపాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, క్యాడ్ ఇవి ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. అయితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాకు తగిన విధానం అమల్లో ఉంది. ఈ అంశాలపై అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు. ఇతర దేశాల ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు ఎక్కువ నిలకడతో ఉన్నట్టు చెప్పారు. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధంతో మన ఆర్థిక వ్యవస్థకు లాభమేనని, విదేశీ మారక నిల్వలు తగినన్ని ఉన్నాయని ఆ అధికారి చెప్పారు. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరికొన్ని దిగుమతులపై సుంకాల పెంపు కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో కమ్యూనికేషన్ ఉత్పత్తులు, బేస్ స్టేషన్, డిజిటల్ లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిపై సుంకాలను 10% నుంచి 20%కి పెంచింది. కస్టమ్స్ టారిఫ్ చట్టం 1975లోని చాప్టర్ 85 కింద వచ్చే పలు వస్తువులపై దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించినట్టు పరోక్ష పన్నులు, సుంకాల మం డలి(సీబీఐసీ) నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ చాప్టర్ కింద ఎలక్ట్రికల్ మెషినరీ, ఎక్విప్మెంట్, సౌండ్ రికార్డర్లు, టెలివిజన్ ఇమేజ్ రికార్డర్లు, వీటి విడిభాగాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషిన్లు, ఏసీలు సహా 19 రకాల దిగుమతులపై సుంకాలు పెంచుతూ గత నెల 26న కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
74ను దాటిన రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు రోజుల నుంచీ ఏ రోజుకారోజు కొత్త కనిష్ట స్థాయిలకు జారిపోతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ శుక్రవారం ఒకదశలో 74.23కు జారింది. అయితే కొంత రికవరీతో 73.76 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో పోలిస్తే ఇది 18 పైసలు పతనం. ఈ రెండు ముగింపులూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇవి రెండూ గురువారానికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. సోమవారం నుంచీ వరుసగా జరిగిన నాలుగు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు) ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 128 పైసలు కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ దాదాపు 17% పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్ అకౌంట్ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి పతనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. ఆర్బీఐ పాలసీ కూడా నష్టానికి కారణమే! రూపాయి శుక్రవారం 74 దిగువకు పడిపోడానికి ఆర్బీఐ పాలసీ విధానమూ కారణమయ్యింది. వివరాల్లోకి వెళితే, అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ తన వడ్డీరేట్లను (వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతం) పెంచుతూ వస్తోంది. దీనితో ఈ బాండ్ల రేట్లు తగ్గుతూ, దీనిపై వచ్చే ఈల్డ్స్ (వడ్డీ) పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈల్డ్స్ నుంచి ప్రయోజనం పొందడానికి దేశంలోని విదేశీ పెట్టుబడులు మార్కెట్ నుంచి వెనక్కు వెళ్లడం ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి దేశంలోనూ రేటు పెంపు తప్పదని నిపుణులు విశ్లేషించారు. దీనికి భిన్నంగా రేటు యథాతథ స్థితి కొనసాగించడంతో దేశీయ కరెన్సీ సెంటిమెంట్ ఒక్కసారిగా దెబ్బతింది. డాలర్లకు డిమాండ్ తీవ్రమవడంతో రూపాయి కుదేలయ్యింది. -
రూపాయి... 74కు చేరువలో!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... ఆ తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇది బుధవారం ముగింపుతో పోలిస్తే 24 పైసలు ఎక్కువ. గురువారం ఇంట్రాడే, ముగింపు విలువలు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. సోమవారం నుంచీ వరుసగా జరిగిన మూడు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు) ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 110 పైసలు (1.51 శాతం) కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ 16 శాతం పడింది. బుధవారం మొదటిసారి రూపాయి 73 దిగువకు పడింది. 73.34 వద్ద ముగిసిన రూపాయి ఒకదశలో 73.42ను చూసి, రెండు అంశాల్లోనూ కొత్త రికార్డు స్థాయిలకు పడింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్ అకౌంట్ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. మరోవంక రూపాయి జారిపోకుండా నిరోధించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. -
73 దాటి రూ‘పాయే’
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోకుండా నిరోధించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి చర్యలు ఫలితం ఇవ్వలేదు. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి విలువ ఒకేరోజు 43 పైసలు పతనమయ్యింది. 73.34 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 73.42ను కూడా చూసింది. రూపాయి బలహీనత బాటలో ఇంట్రాడే, ముగింపు రెండూ కొత్త రికార్డులు కావడం గమనార్హం. రూపాయి ప్రారంభంతోటే 73.26 దిగువన ప్రారంభమైంది. గరిష్టంగా 72.90ని తాకింది. ఈ ఏడాది రూపాయి ఇప్పటి వరకూ 15 శాతం పతనమయ్యింది. ఇప్పటి వరకూ రూపాయి ఇంట్రాడే, ముగింపు కనిష్టం స్థాయిలు 72.99, 72.98. కారణాలు ఇవీ... ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడవుతున్న డాలర్ ఇండెక్స్ మళ్లీ పటిష్ట నిరోధం 95 స్థాయిని దాటి ట్రేడవుతోంది. ఈ వార్తరాసే 9 గంటల సమయానికి 95.35 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తీవ్రత తగ్గడం లేదు. నాలుగున్నర సంవత్సరాల గరిష్ట స్థాయిలో క్రూడ్ ధరలు ట్రేడవుతున్నాయి. బుధవారం రాత్రి 11 గంటలకు నైమెక్స్ బ్యారల్ ధర 2% ఎగసి 76.70 డాలర్ల వద్ద ట్రేడవుతుంటే, భారత్ దిగుమతుల్లో ప్రధానమైన బ్రెంట్ క్రూడ్ ధర 86.58 వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేటు పెం పుతో దేశంలో ఇన్వెస్ట్‌చేసే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వడ్డీగిట్టుబాటుకాని పరిస్థితి. ఫెడ్ రేటు పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో, ఈ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం తక్ష ణం విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెన క్కు తీసుకు వెళ్లిపోవడం భారీగా జరుగుతోంది. ఒకవైపు క్రూడ్ దిగుమతులకు వ్యయాలు పెరుగుతుండడం, విదేశీ నిధులు బయటకు వెళ్లిపోతుండడం వంటి పరిణామాలు కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై ఆందోళనలను సృష్టిస్తోంది. ఆర్బీఐ కీలక సమావేశం ప్రారంభం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ 5వ తేదీన పాలసీ రేట్లపై తమ విధానాన్ని ప్రకటించనుంది. అరశాతం వరకూ రేటు పెంపు ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలు ఇందుకు ఒక కారణం. అలాగే అమెరికా వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది రూపాయి బలహీనతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనూ రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ప్రత్యక్షంగా ఈసీబీలకు ఆయిల్ కంపెనీలు! డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతుండటంతో విదేశీ కరెన్సీని భారీగా వినియోగించుకునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల(ఓఎంసీ)కు కేంద్రం వెసులుబాటు కల్పించింది. వర్కింగ్ క్యాపిటల్కుగాను విదేశీ వాణిజ్య రుణాలను (ఈసీబీ) ప్రత్యక్షంగా ఎటువంటి అనుమతులూ లేకుండా ఆటోమేటిక్‌గా సమీకరించుకోడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతి నిచ్చింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయం నేపథ్యంలో... చమురు మార్కెటింగ్ కంపెనీలు ‘‘ఆటోమేటిక్ రూట్’’ ద్వారా గుర్తింపుకలిగిన రుణదాతల నుంచి మూడేళ్ల నుంచి ఐదేళ్ల మెచ్యూరిటీ కనీస సగటుతో వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం ఈసీబీలను సమీకరించుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం ఓఎంసీలు ప్రత్యక్ష లేదా పరోక్ష షేర్హోల్డర్లు లేదా గ్రూప్ కంపెనీ నుంచి సగటున ఐదేళ్ల మెచ్యూరిటీతో మాత్రమే ఈసీబీలను సమీకరించుకోగలుగుతున్నాయి. విదేశీ కరెన్సీ రుణాలకు సంబంధించి ప్రభుత్వ రంగ రిఫైనరీలకు ఒక్కొక్కదానికీ ఉన్న 750 మిలియన్ డాలర్ల పరిమితిని కూడా సెంట్రల్ బ్యాంక్ తొలగించింది. కొత్త నిబంధనల మేరకు వార్షిక విదేశీ కరెన్సీ రుణ పరిమితి 10 బిలియన్ డాలర్లుగా ఉంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తాయి. -
రూపాయి ‘బూస్ట్’కు ఆర్బీఐ చర్యలు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలోపేత చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తయారీ రంగంలో కంపెనీలు విదేశీ నిధుల సమీకరించుకోడానికి (ఈసీబీ) సంబంధించిన నిబంధనలను బుధవారం సడలించింది. అలాగే రూపీ డినామినేటెడ్ బాండ్లు (మసాలా బాండ్స్) మార్కెట్‌కూ ఇండియన్ బ్యాంక్‌లకు అనుమతినిచ్చింది. గత శనివారం రూపాయి బలోపేతానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం దీనికి నేపథ్యం. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) నిబంధనల సరళీకరణ కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. తాజా నిర్ణయంపై ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘‘ప్రభుత్వంతో సంప్రతింపుల అనంతరం తాజా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’’ అని ఈ నోటిఫికేషన్లో వివరించింది. దీని ప్రకారం... తయారీ రంగంలో ఉండి విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించుకోడానికి అర్హత ఉన్న కంపెనీలు ఏడాది కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితితో 50 మిలియన్ల అమెరికన్ డాలర్లు లేదా అంతకు సమానమైన ఈసీబీలను సమీకరించుకునే వీలుకలిగింది. ఇంతక్రితం కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితి మూడేళ్లుగా ఉండేది. మసాలా బాండ్ల విదేశీ మార్కెట్‌కూ నిబంధనలలోనూ మార్పులు చేసింది. ఇలాంటి బాండ్స్‌కు ప్రస్తుతం భారత బ్యాంకులు అరేంజర్ లేదా అండర్‌రైటర్‌గా మాత్రమే వ్యవహరించగలుగుతున్నాయి. ఇష్యూ అండర్‌రైటింగ్ సందర్భంలో బ్యాంకుల హోల్డింగ్ ఐదు శాతానికి మించి ఉండడానికి వీల్లేదు. అయితే ఇకపై బ్యాంకులు ఈ బాండ్లకు సంబంధించి కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి అరేంజర్స్, అండర్‌రైటర్స్‌గా ఉండడమే కాకుండా మార్కెట్ మేకర్స్, ట్రేడర్లుగా కూడా వ్యవహరించడానికి వీలుంది. -
ఏడు రోజుల పతనానికి విరామం!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి శుక్రవారం కొంత రికవరీ అయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం ముగింపుతో పోలిస్తే 26 పైసలు బలపడి, 71.73 వద్ద ముగిసింది. ఏడు రోజుల వరుస ట్రేడింగ్ సెషన్స్‌లో రూపాయి విలువ జారుతూ ఏ రోజుకారోజు కనిష్టాల్లో కొత్త రికార్డులను నమోదుచేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం రూపాయి పతనాన్ని శుక్రవారం కొంత నిరోధించినట్లు విశ్లేషణలున్నాయి. రూపాయిపై అంతర్జాతీయ అంశాలే తప్ప, దేశీయంగా ఎటువంటి ప్రతికూల ప్రభావాలూ లేవని, కరెన్సీ స్థిరత్వం త్వరలో సాధ్యమేననీ ప్రభుత్వ నుంచి వస్తున్న సానుకూల ప్రకటనలూ రూపాయి సెంటిమెంట్‌ను శుక్రవారం కొంత బలపరిచాయి. ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి ఒక దశలో 72.04ను దాటినా, ఆపై కోలుకుంది. గురువారం 71.99 చరిత్రాత్మక కనిష్టస్థాయి వద్ద ముగిసిన రూపాయి శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 71.95 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో రూపాయి 71.65 వరకూ రికవరీ అయ్యింది. గురువారం ట్రేడింగ్‌లో ఒక దశలో రూపాయి 72ను దాటిపోయి, 72.11ను చేరింది. చివరకు కొంత రికవరీతో 71.99 వద్ద ముగిసింది. ఇక క్రాస్ కరెన్సీలను చూస్తే, యూరో మారకపు విలువలో కొంత కోలకుని 83.70 నుంచి 83.25కు చేరింది. పౌండ్ విలువలో మాత్రం 93.08 నుంచి 93.19కి బలహీనపడింది. పెరిగిన ప్రభుత్వ రుణ భారం: కాగా, జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలానికి కేంద్ర ప్రభుత్వ రుణ భారం రూ.79.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంలో బాండ్ల జారీ ద్వారా పబ్లిక్ డెట్ 89.3 శాతంగా ఉందని తెలిపింది. మార్చి 2018 నాటి రుణ భారం రూ.77.98 లక్షల కోట్లు. -
71.21కి జారిపోయిన రూపాయి
ముంబై: దేశీ కరెన్సీ రూపాయి మరింత బక్కచిక్కిపోతోంది. తాజాగా సోమవారం ఫారెక్స్ మార్కెట్లో నూతన జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 21 పైసలు నష్టపోయి 71.21 వద్ద నిలిచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. జీడీపీ గణాంకాలకు తోడు సాంకేతిక దన్నుతో రూపాయి ఆరంభం గట్టిగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఫారెక్స్ మార్కెట్లో పరిస్థితి మారిపోయింది. ఇన్వెస్టర్లలో భయం నెలకొనడంతో రూపాయి తన విలువను కోల్పోయింది. ప్రభుత్వం ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్ 78 డాలర్లకు చేరడం ట్రేడింగ్ వాతావరణాన్ని మార్చేసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తే ఆ దేశం నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోయి, అది ధరలపై ప్రతిఫలిస్తుందన్న ఆందోళన పెరగడం చమురు ధరలకు ఆజ్యం పోయవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఒపెక్ నుంచి ఉత్పత్తి పెరిగినా అది పరిమితంగానే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 8.2 శాతానికి పెరిగిన విషయం గమనార్హం. నోట్ల రద్దు తర్వాత జీడీపీ వృద్ధి ఈ స్థాయిలో నమోదు కావడం సానుకూలమనే చెప్పుకోవాలి. అయినా రూపాయి పతనాన్ని ఇది నిలువరించలేకపోయింది. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెంపు, విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకోవడం తదితర చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినా గానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 11 శాతం మేర తన విలువను కోల్పోయింది. సోమవారం ఆసియాలో అత్యంత దారుణ పనితీరు రూపాయిదే. అస్థిర కరెన్సీ ఎగుమతులకు మంచిది కాదు: ఈఈపీసీ రూపాయి విలువ పతనం భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందన్న అంచనాలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) స్పందించింది. కరెన్సీ అస్థిరత అన్ని వేళలా ప్రయోజనాలు చేకూర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘కరెన్సీ స్థిరంగా ఉంటేనే ఎగుమతులకు సానుకూలం. అంచనాల ఆధారంగా కొనుగోలు దారులతో వ్యవహారాలు నిర్వహించేందుకు వీలవుతుంది. అస్థిరతలు, ఆటుపోట్లన్నవి ఏ వైపు ఉన్నా కానీ దాంతో ఉపయోగం ఉండదు’’ అని ఈఈపీసీ ఇండియా చైర్మన్ రవి సెహగల్ తెలిపారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధి జూలైలో ఒక అంకె స్థాయి 9.4 శాతానికి తగ్గిపోయిందని ఈఈపీసీ తెలిపింది. అంతకుముందు నెలల్లో ఉన్న పెరుగుదల నుంచి పడిపోయినట్టు వివరించింది. -
రూపాయి @ 71
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ 71ని చేరింది. గురువారం ముగింపుతో చూస్తే ఇది 26 పైసలు(0.37%) పతనం. ఇది రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ప్రారంభంలోనే గ్యాప్‌డౌన్‌తో 70.95 వద్ద ప్రారంభమైంది. అటు తర్వాత బలహీన ధోరణిలోనే కదలాడింది. కాగా, రూపాయి పతనం ప్రభుత్వ ఆర్థిక విధానాలు ‘వైఫల్యం’గా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా... అభివృద్ధి చెందుతున్న పలు దేశాల కరెన్సీలు బలహీన పడుతుండటంతో, రూపాయి బలహీనత దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇంకా అధిక విలువలోనే: ఎస్బీఐ రూపాయి ప్రస్తుత ధోరణి పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అభిప్రాయపడింది. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా ఒక ప్రకటన చేస్తూ, ‘‘రూపాయి కొంచెం పతనానికే ఎవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. ఇంకా రూపాయి అధిక విలువలోనే ఉంది’’ అని అన్నారు. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చిచూసినా, భారత్ కరెన్సీ ఇంకా మెరుగ్గానే ఉందని అన్నారు. 2019 మార్చి వరకూ రూపాయి 70–71 శ్రేణిలో ట్రేడవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నివేదిక పేర్కొంది. -
రూపాయి ఢమాల్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్లో ఒకేరోజు 49 పైసలు (0.70 శాతం) పడిపోయింది. 70.59 వద్ద ముగిసింది. రూపాయి మంగళవారం ముగింపు 70.10 కాగా, బుధవారం ట్రేడింగ్ ఒక దశలో రూపాయి 70.65 స్థాయికి కూడా పడిపోయింది. రూపాయి తాజా గణాంకాలు ముగింపులో, ఇంట్రాడేలో తాజా కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. బుధవారం ప్రారంభంతోనే గ్యాప్ డౌన్‌తో 70.32 వద్ద ప్రారంభమైంది. ముఖ్యాంశాలు చూస్తే... ►అమెరికా పటిష్ట వృద్ధి ధోరణి ‘డాలర్ బలోపేతం’ అంచనాలను పటిష్టం చేసింది. మున్ముందు డాలర్ మరింత పెరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. చమురు దిగుమతిదారుల నుంచి ‘నెలాంతపు’ డాలర్ల డిమాండ్ తీవ్రమయ్యింది. దీనితో రూపాయి భారీగా పడింది. ► దీనికి తోడు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ► ఆగస్టు 13 తరువాత రూపాయి ఒకేరోజు తీవ్ర స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. నాడు ఒకేరోజు 110 పైసలు (1.6%) బలహీనపడింది. ►ఇంతక్రితం రూపాయి ముగింపులో కనిష్టస్థాయి 70.16. సోమవారం (ఆగస్టు 27వ తేదీ) ఈ ఫలితం నమోదయ్యింది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 70.40 (ఆగస్టు 17వ తేదీ). అయితే అటు తర్వాత ట్రేడింగ్ సెషన్లలో కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నట్లు కనిపించినా, చివరకు రూపాయి మరింత కిందకే జారింది. ► క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు భయాలు రూపాయిని వెంటాడుతోంది. 2018–19లో ప్రభుత్వ ఆదాయం– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం 3.3 శాతం దాటుతుందన్న మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనాలూ రూపాయి పతనానికి దారితీశాయి. ► ఆగస్టు 17తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33.2 మిలియన్ డాలర్లు తగ్గి 400.8 బిలియన్ డాలర్లకు చేరడమూ రూపాయిపై ప్రతికూలత చూపుతోంది. గడచిన కొన్ని నెలలుగా భారత్ విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి 69 స్థాయిలో ఉన్నప్పుడు దీనిని ఈ స్థాయిలో నిలబెట్టడానికి డాలర్లను మార్కెట్లోకి ఆర్బీఐ పంప్ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మారకపు విలువను మార్కెట్ విలువకు వదిలేస్తున్నట్లు విశ్లేషణ. 68–70 శ్రేణిలో ఉంటుంది... డాలర్ మారకంలో రూపాయి సమీప కాలం లో 68–70 శ్రేణిలోనే ఉంటుందని భావిస్తున్నాం. డిమాండ్–సరఫరాల మధ్య నెలకొన్న కొన్ని అసమానతలే ప్రస్తుత రూపాయి బలహీన ధోరణికి కారణం. త్వరలో డాలర్ మారకంలో రూపాయి విలువ 68–70 శ్రేణిలో స్థిరపడుతుంది. –ఎస్సీ గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రేపటి జీడీపీ గణాంకాలపై దృష్టి... శుక్రవారంనాడు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలు వెలువడనున్నాయి. ద్రవ్యలోటు గణాంకాలూ వస్తాయి. సమీప భవిష్యత్తులో రూపాయి విలువను నిర్ణయించేవి ఇవే. సమీప కాలంలో రూపాయి 70.20–70.75 శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నా. –రుషబ్ మారూ, ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకర్స్ -
భారీగా కుదేలైన రూపాయి
ముంబై : రూపాయి విలువ రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సరికొత్త కనిష్ట స్థాయిల్లోకి కుదేలైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.32 మార్కును తాకి, ఇన్వెస్టర్లలో గుండె గుబేల్మనిస్తోంది. ఇప్పట్లో రూపాయి కోలుకునే అవకాశాలేమీ కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసియా కరెన్సీలు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనంతటికీ కారణం టర్కీ రాజకీయ సంక్షోభం. ఈ సంక్షోభం ప్రపంచ మార్కెట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ కరెన్సీలు, దేశీయ కరెన్సీ పాతాళంలోకి పడిపోతుండటంతో డాలర్ విలువ పైపైకి 13 నెలల గరిష్టంలోకి ఎగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి అత్యంత కనిష్ట స్థాయి 70.25 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత క్షీణిస్తూ ట్రేడవుతోంది. తాజాగా 43 పైసల్ ఢమాలమని 70.32 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో, వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టాన్ని తాకుతున్నట్టు విశ్లేషకులు చెప్పారు. టర్కీ కరెన్సీ లీరా కోలుకుని గ్లోబల్ మార్కెట్లు స్థిరత్వానికి వచ్చినప్పుడే రూపాయి విలువ కోలుకుంటుందని ఆనంద్ సేథి షేర్, స్టాక్ బ్రోకర్స్, రీసెర్చ్ విశ్లేషకుడు రుషబ్ మరు తెలిపారు. మరికొన్ని సెషన్ల వరకు రూపాయి విలువ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై విధించిన టారిఫ్‌లు, టర్కీ లీరాను దెబ్బతీస్తున్నాయని, ఈ ఒత్తిడి భారత రూపాయిపై పడుతుందని చెప్పారు. -
ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి
-
మొట్టమొదటిసారి భారీగా కుప్పకూలిన రూపాయి
ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మొట్టమొదటిసారి డాలర్‌కు మారకంలో 69 మార్కును చేధించిన రూపాయి ఆల్-టైమ్ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. బుధవారం ట్రేడింగ్ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మరింత క్షీణించింది. ప్రస్తుతం 79 పైసల మేర క్షీణించి 69.04గా ట్రేడవుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయని సంకేతాలు, ఈ రేట్ల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అటు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు సైతం కరెన్సీ ట్రేడర్స్‌ను కలవరపరుస్తున్నాయి. ఇక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు కూడా బలహీనంగా ట్రేడవుతుండటం రూపాయిని మరింత దిగజారుస్తోంది. రూపాయి విలువ 68.80-68.85 స్థాయిల వద్ద ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉందని, కానీ 68.86 మార్కు కంటే భారీగా రూపాయి పతనమైందని.. ఇక వచ్చే సెషన్లలో కచ్చితంగా రూపాయి భారీగా క్షీణిస్తుందని ఆనంద్ రతి కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారు అన్నారు. వెంటనే 70 నుంచి 70.50 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్ వాణిజ్య లోటు దేశమని, ఎమర్జింగ్ మార్కెట్లలో క్యాపిటల్ ఫ్లోస్ తగ్గితే, రూపాయి విలువ క్షీణించడం సాధారణమని హెచ్ఎస్బీసీ ఇండియా గ్లోబల్ మార్కెట్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ అధినేత, ఎండీ మనీష్ వాద్వాన్ తెలిపారు. మరోవైపు ఆయిల్ ధరలు కూడా పైపైకి ఎగుస్తున్నాయన్నారు. -
తగ్గనున్న బంగారం ధరలు
-
ఆభరణాల రంగం ‘మెరుపు’ తగ్గుతుందా?
ముంబై: డాలర్ మారకంలో రూపాయి బలహీనత, అధిక ధరలు వెరసి సమీప కాలంలో ఆభరణాల రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల అంతర్జాతీయ పసిడి ధర తగ్గినా, ఆ ప్రభావం దేశీయంగా ఉండదన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కేర్ రేటింగ్స్ విడుదల చేసిన అంశాల్లో ముఖ్యమైనవి... ♦ సమీప భవిష్యత్తులో రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పరిశ్రమలో ఎగుమతులు తగ్గుతున్నాయి. ♦ ఇక్కడ ఒక చిన్న ఆశాకిరణం కూడా కనిపిస్తోంది. చైనా ఇటీవల ఆభరణాలపై దిగుమ తి సుంకాలను తగ్గించింది. అవకాశాలను వినియోగించుకుంటే, దేశీయ పరిశ్రమకు ఇది ఒక సానుకూల అంశం. 2018 మే నెలలో ఈ రంగం ఎగుమతుల్లో అసలు వృద్దిలేకపోగా, 11 శాతం క్షీణత నమోదయ్యింది. -
రూపాయి.. రన్!
మూడు నెలల గరిష్ట స్థాయి • డాలర్ మారకంలో 66.85 పైసలు • అంతర్జాతీయ ట్రేడింగ్‌లో మరింత లాభం • నేడు మరింత బలపడే అవకాశం • డాలర్ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల దన్ను! • తాత్కాలికమేనంటున్న నిపుణులు ముంబై: అనూహ్య రీతిలో డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 ట్రేడింగ్ సెషన్ల నుంచి పరుగులు పెడుతోంది. ఈ సమయంలో డాలర్ మారకంలో దాదాపు 1.75 పైసలు బలపడింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫారెక్స్ మార్కెట్లో మూడు నెలల గరిష్ట స్థాయి 66.85 వద్ద ముగిసింది. భారత్ రూపాయి నవంబర్ 10 తరువాత ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఇంట్రాబ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో బుధవారం రూపాయి ముగింపు 67.19 పైసలు. క్రితం ముగింపుతో పోల్చితే రూపాయి దాదాపు 34 పైసలు (0.51%) లాభపడింది. కాగా భారత్‌లో ఫారెక్స్ ట్రేడింగ్ ముగిసిన తరువాత, అంతర్జాతీయ మార్కెట్లో సైతం రూపాయి భారీగా బలపడింది. తుది సమాచారం అందే సరికి మరో 20 పైసలు లాభపడి 66.65 సమీపంలో ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం సైతం రూపాయి జోరును కొనసాగించే అవకాశం ఉంది. ఈ పరుగు ఎందుకు... ⇔ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేనాటికి దాదాపు 14 సంవత్సరాల గరిష్ట స్థాయిలో 104 డాలర్లకు చేరింది. అయితే డాలర్ బలహీనపడాలన్న అమెరికా అధ్యక్షుని విధానానికి తోడు, అధిక స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడ్ అయ్యే డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 101 డాలర్ల దిగువ స్థాయిలో ట్రేడవుతోంది. ఈ ప్రభావం భారత్ కరెన్సీమీదే కాకుండా, మిగిలిన కొన్ని ఆసియా దేశాల కరెన్సీల బలోపేతానికి సైతం కారణమవుతోంది. ⇔ ఇక అమెరికా ఆర్థిక వృద్ధిపై నెలకొన్న అనుమానాలు డాలర్ బలహీనతకు దారితీస్తాయన్న అంచనాలు ఆ కరెన్సీ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు ఇప్పట్లో పెంచబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ⇔ భారత్‌లో బుధవారం పాలసీ సందర్భంగా ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే– రూపాయికి బ్రేక్‌లు పడతాయని భావించారు. అయితే ఇదీ జరగలేదు. రెపో రేటును 6.25 స్థాయిలోనే ఆర్బీఐ కొనసాగించింది. ⇔ డాలర్ మరింత బలహీనపడుతున్న అంచనాలతో బ్యాంకులు, ఎగుమతిదారులు సైతం ఆ కరెన్సీ భారీ అమ్మకాలకు దిగుతున్నారు. ఇది భారత్ కరెన్సీకి బలాన్ని ఇస్తోంది. బలపడితే ఏమిటి? రూపాయి బలపడితే ప్రధానంగా భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఎగుమతులకు తక్కువ డాలర్లు చేతికి అందుతాయి. సాఫ్ట్వేర్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువలరీ వంటి రంగాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నది నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే భారత్ ఎగుమతులు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ర్యాలీ స్వల్పకాలమే! ⇔ కాగా రూపాయి పరుగు స్వల్పకాలమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు చూస్తే ⇔ ఫార్వార్డ్ మార్కెట్లో డాలర్ ప్రీమియం స్థిరంగా కొనసాగుతోంది. కార్పొరేట్ నుంచి చెల్లింపుల ఒత్తిడి దీనికి కారణం. బెంచ్‌మార్క్ ఆరు నెలల ప్రీమియం జూలైకి సంబంధించి బుధవారం 154–156 పైసల శ్రేణి నుంచి 155.5–156.5 పైసల శ్రేణికి పెరిగింది. 2018 జనవరి ప్రీమియంసైతం 301–303 శ్రేణి నుంచి 305–306పైసలకు పెరిగింది. ⇔ ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితితో వచ్చే నెల రోజుల్లో డాలర్ బలపడే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుత 100 ఎగువ స్థాయి ఆ కరెన్సీకి బలోపేతమైన అంశమే. ⇔ 2016 సంవత్సరం మొదటి నుంచీ డాలర్ మారకంలో 66.2–68.7 శ్రేణిలో తిరుగుతున్న రూపాయి తన కదలిక బాటను మార్చుకునే అవకాశం ఉందని మరో బ్యాంకింగ్ సేవల దిగ్గజం– డీబీఎస్ నివేదిక ఒకటి అంచనావేసింది. ⇔ పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం సైతం సమీప కాలంలో భారత్ ఈక్విటీలు, రూపాయిపై ప్రతికూలత చూపుతాయని జపాన్ బ్రోకరేజ్‌సంస్థ నోమురా పేర్కొంది. ఇప్పటికిప్పుడు రూపాయి బలంగా ఉన్నా, సమీప కాలంలో కొంత బలహీనత ఖాయమని అంటోంది. -
ముడిచమురు మునిగింది..!
♦ బ్యారెల్ ధర 46.75 డాలర్లకు ♦ ఒకేరోజు 6.6 శాతం పతనం న్యూయార్క్: బ్రెగ్జిట్ దెబ్బకు ముడి చమురు (క్రూడ్) రేట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోనుందనే ఆందోళనలు తలెత్తటంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా డాలరు మారకం విలువ వివిధ కరెన్సీలతో దూసుకెళ్లడం కూడా క్రూడ్ పతనానికి కారణమయింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో శుక్రవారం లైట్ స్వీట్ క్రూడ్ ధర ఏకంగా 6.6 శాతం క్షీణించి బ్యారెల్‌కు 46.75 డాలర్ల స్థాయికి క్రాష్ అయింది. ప్రస్తుతం ఇది 5 శాతం మేర నష్టంతో 47.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర కూడా ఒకానొక దశలో 6.5 శాతం క్షీణించి బ్యారెల్‌కు 47.55 డాలర్లకు పడిపోయింది. కడపటి సమాచారం ప్రకారం 4.5 శాతం నష్టంతో 48.7 డాలర్ల వద్ద కదలాడుతోంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఎంసీఎక్స్‌లో కూడా క్రూడ్ రేటు భారీగా దిగజారింది. శుక్రవారం ఒకొనొక దశలో(ఇంట్రాడే) జూలై కాంట్రాక్టు ధర 4.4% దిగజారి ఒక్కో బ్యారెల్‌కు రూ.3,207 కనిష్టాన్ని తాకింది. -
రూపాయి.. రయ్ రయ్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 28 పైసలు(0.45 శాతం) లాభపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 61.42 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, ఎగుమతిదారుల డాలర్ల విక్రయాలు రూపాయి సెంటిమెంట్ బలపడ్డానికి కారణం. క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ (ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీ)దేశానికి మరింత పెరుగుతాయని బ్యాంకులు, ఎగుమతిదారులు భావిస్తున్నట్లు కూడా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. -
మూడో రోజు బలపడిన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో శుక్రవారం 35 పైసలు (0.56 శాతం) బలపడింది. 62.32 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 62.29 స్థాయిని సైతం తాకింది. రూపాయి గురువారం ముగింపు 62.67. వరుసగా మూడు రోజుల నుంచీ రూపాయి బలపడుతూ వస్తోంది. ఈ మూడు రోజుల్లో రూపాయి 125 పైసలు (1.97 శాతం) బలపడింది. డాలర్ అమ్మకాలు, దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వస్తాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. విదేశీ మార్కెట్లలో డాలరు బలహీనత కూడా రూపాయి విలువ పెరగడానికి కలసి వస్తోంది.