
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం మరో 20 పైసలు కోల్పోయింది. ఫారెక్స్ మార్కెట్లో 70.92 వద్ద క్లోజయింది. మరోవైపు చమురు ధరలు పెరగడం, డాలర్ బలోపేతం కావడం గమనార్హం. జీడీపీ రేటు మూడో త్రైమాసికానికి కనిష్ట స్థాయి 6.6 శాతానికి తగ్గడం, అధిక చమురు ధరలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు బలహీనంగా కొనసాగుతుండటం వంటి అంశాలు రూపాయిపై ప్రభావం చూపించినట్టు పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ తెలిపారు.
ఇంటర్‌బ్యాంకు ఫారీన్ ఎక్సే్ఛం జ్ (ఫారెక్స్)లో రూపాయి 70.75 వద్ద ప్రారం భం కాగా, ఇంట్రాడేలో 70.99 వరకు దిగజారి చివరికి 70.92 వద్ద ముగిసింది. అయితే, ఈ వారంలో మొత్తం మీద రూపాయి 22 పైసలు నికరంగా లాభపడటం గమనార్హం.