
ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్‌లోనూ తగ్గింది. సోమవారం ముగింపు (69.42)తో పోల్చితే 18పైసలు తగ్గి 69.60 వద్ద ముగిసింది. మూడురోజుల్లో రూపాయి 68 పైసలు నష్టపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయిపై ఈ మూడురోజుల్లో ప్రభావం చూపాయి.
ఈ వారంలో రెండు రోజులు సెలవు దినాలు (17వ తేదీ బుధవారం మహవీర్ జయంతి , 19వ తేదీ శుక్రవారం గుడ్‌ఫ్రైడే) కావడంతో అంతర్జాతీయంగా అప్రమత్తత పాటించడానికి వీలుగా ఫారెక్స్ ట్రేడర్ల నుంచి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకోసం డిమాండ్ ఏర్పడింది. ఆయా అంశాల నేపథ్యంలో... రూపాయి మరింత బలహీనపడాల్సి ఉంది. అయితే దేశంలోకి భారీగా విదేశీ నిధులు, దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు కలిసి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment