ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు.
రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది.
Comments
Please login to add a commentAdd a comment