exchange
-
సైనికుల్ని మార్చుకుందాం
కీవ్: నిర్బంధంలో ఉన్న సైనికులను మార్చుకుందామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాకు ప్రతిపాదించారు. రష్యా నిర్బంధంలోని తమ సైనికులను వదిలేస్తే పట్టుబడ్డ ఉత్తర కొరియా సైనికులను ఆ దేశానికి అప్పగించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను పట్టుకున్నామన్న ఉక్రెయిన్ ప్రకటనను దక్షిణ కొరియా ధ్రువీకరించడం తెలిసిందే. ‘‘మా దగ్గర మరింతమంది కొరియా సైనికులున్నారు. రష్యా పట్టుకున్న మా సైనికులను అప్పగిస్తే ఉత్తర కొరియాకు వారి సైనికులను అప్పగించడానికి సిద్ధం’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని గురించిన వాస్తవాలను బయట పెట్టేవారికి, శాంతి స్థాపనకు ప్రయత్నించే వారికి అవకాశం కల్పిస్తామన్నారు. బెడ్‌పై పడుకొన్న, దవడకు బ్యాండేజ్‌తో మంచంపై కూర్చున్న ఇద్దరు ఉత్తర కొరియా యుద్ధ ఖైదీల వీడియోను పోస్ట్ చేశారు. అందులో అనువాదకుల సహాయంతో జెలెన్స్కీ వారితో మాట్లాడుతూ కన్పించారు. ‘‘ఉక్రెయిన్‌తో పోరాడతామని నాకు తెలియదు. శిక్షణ మాత్రమేనని మా కమాండర్లు చెప్పారు’’అని ఆ సైనికులు చెప్పుకొచ్చారు. వారిలో ఒకరు ఉత్తరకొరియా తిరిగి వెళ్లాలని భావిస్తుండగా, అవకాశమిస్తే ఉక్రెయిన్‌లోనే ఉండిపోతానని రెండో సైనికుడు చెప్పాడు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి రష్యా, ఉత్తర కొరియా సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా ఇప్పటికే 10,000 మందికి పైగా సైనికులను పంపిందని ఉక్రెయిన్, అమెరికా, దక్షిణ కొరియా ఆరోపించాయి. దీన్ని ఆ దేశాలు కొట్టిపారేశాయి. కానీ రష్యా సైన్యం ఉత్తర కొరియా సైనిక సాయంపైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు. -
ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్ పాలసీ
న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ ఐకియా ఇండియా తాజాగా 365 రోజుల వరకు వర్తించే ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం ఐకియాలో హోమ్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ మనస్సు మార్చుకున్న పక్షంలో వాటిని ఒరిజినల్ ప్యాకేజింగ్ స్థితిలోనైనా లేదా అసెంబుల్ చేసిన స్థితిలోనైనా స్టోర్‌లో వాపసు చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం హోమ్ కలెక్షన్ సర్వీసును కూడా అందిస్తున్నట్లు సంస్థ కంట్రీ కస్టమర్ మేనేజర్ అలెక్జాండ్రా షెస్టాకోవా తెలిపారు. -
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
విశాఖ జూకు గుజరాత్ వన్యప్రాణులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్ది రోజుల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి మరికొన్ని కొత్త వన్యప్రాణులు రానున్నాయి. వీటి కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఇక్కడకు తీసుకురావడానికి జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏ) నుంచి అనుమతులు లభించాయి. కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా కొత్త జంతువులు, అరుదైన పక్షులను తీసుకువస్తున్నారు.రెండు నెలల కిందట కోల్‌కతా రాష్ట్రం అలీపూర్ జూ పార్కు నుంచి జంతు మార్పిడి విధానం ద్వారా జత జిరాఫీలు, ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, స్కార్లెట్ మకావ్స్ ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. మరికొన్ని వన్యప్రాణులను గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ఒకటి, రెండు వారాల్లో ఇక్కడకు తీసుకురానున్నారు. వాటి కోసం జూలో ఒక్కో జాతి జంతువులు, పక్షులు వేర్వేరుగా ఎన్క్లోజర్లు కూడా సిద్ధం చేశారు. ఆయా వన్యప్రాణులు చేరితే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది. కొత్తగా రానున్నవి ఇవే.. గ్రీన్ వింగ్డ్ మెకావ్ రెండు జతలు, స్కార్లెట్ మెకావ్స్ రెండు జతలు, మిలటరీ మెకావ్స్ రెండు జతలు, మీడియం సల్ఫర్ క్రెస్టెడ్ కాక్టూ రెండు జతలు, స్క్వైరల్ మంకీస్ రెండు జతలు, కామన్ మార్మోసెట్స్ రెండు జతలు, మీర్కాట్ ఒక జత, రెడ్ నెక్డ్ వాల్లబీ ఒక జత కొత్తగా ఇక్కడకు తీసుకురానున్నారు.ప్రత్యేక ఎన్క్లోజర్లు సిద్ధంవిశాఖ జూకు కొత్త వన్యప్రాణులు రానున్నాయి. గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి వాటిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశాం. –డి.మంగమ్మ, జూ క్యూరేటర్(ఎఫ్ఏసీ), ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
రూ. 2000 నోట్ల మార్పిడి బంద్!
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక మూసివేత కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. రూ. 2000 నోట్ల మార్పిడి ఈ సదుపాయం ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ గత ఏడాది అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్ల నుంచి, 2024 ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
వికాస్ లైఫ్‌కేర్ చేతికి స్కై 2.0
న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్ లైఫ్‌కేర్ లిమిటెడ్ తాజాగా దుబాయ్ సంస్థ స్కై 2.0 క్లబ్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది. 2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. స్కై 2.0 క్లబ్ హోల్డింగ్ సంస్థ బ్లూ స్కై ఈవెంట్ హాల్ ఎఫ్‌జెడ్–ఎల్ఎల్సీ(దుబాయ్)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్ బిజినెస్ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఇందుకు డీల్ కుదిరినట్లు తెలిపింది. -
ఇజ్రాయెల్-హమాస్: యుద్ధం వేళ కీలక పరిణామం!
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజావైపునకు దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. గాజాలో భూతల దాడులను మరింత తీవ్రంచేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య రాజీ కుదుర్చేందుకు మధ్యప్రాశ్చ్య దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, బంధీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలా రాజీకుదిర్చేలా యత్నిస్తున్నాయి. దీనికి హమాస్ వైపు నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. ఖైదీల మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. ప్రతిగా బంధీలుగా ఉన్న పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని షరతు విధించింది. తమ వద్ద బంధీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడిచిపెడతామని ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ప్రతినిధి అబు ఒబెయిడా చెప్పారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలన్నారు. అలా అయితే తక్షణమే ఖైదీల మార్పిడి ఒప్పందానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. #Gaza_Genocide Very heavy bombing / artillery strikes on Gaza tonight. It’s a densely packed city where over 50% of the population are under 18. pic.twitter.com/eV3n5yTaWF — Monty (@Monty1745) October 29, 2023 మరోవైపు గాజాలో భూతల దాడులను మరింత తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై విరుచుకుపడతామని తెలిపింది. ఉత్తర గాజాలో 150 సొరంగాలు, బంకర్లను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థపై కూడా దాడులు చేయడంతో దాదాపు 23 లక్షల మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొంటామని హమాస్ తెలిపింది. Israel is ARRESTING refugees in the West Bank. Israel claims to be fighting Hamas. Hamas is not in the West Bank.#FreePalaestine, 🇵🇸#FreeHamas#FreeGaza pic.twitter.com/MczCsoAbMO — Sikandar Akram (@mrsikandarakram) October 29, 2023 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. -
రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!
భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు. రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. -
ఆక్వా స్టార్టప్ కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: ఆక్వారంగంలో అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ ఆక్వాఎక్సేఛంజ్ ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో కలిసి ఆక్వా ఎక్సేఛంజ్ కో–పౌండర్ బండి కిరణ్‌కుమార్, సీఈవో పవన్‌కృష్ణ కలిసి ఇటీవల బెంగళూరులో జరిగిన జీ–20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్ సమ్మిట్–2023లో సాధించిన గ్లోబల్ అవార్డును చూపించారు. అవార్డు సాధించిన ఆక్వా ఎక్సేఛంజ్ ప్రతినిధులను అభినందించిన సీఎం.. చిన్న, సన్నకారు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేలా ఆలోచనలు చేయాలని సూచించారు. -
ఆప్ X కాంగ్రెస్: మాటల యుద్ధం.. విపక్షాల కూటమిపై అనుమానాలు..?
రాయ్‌పూర్: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణలు ప్రతిపక్షాల ఐక్యమత్యంపై ప్రశ్నలను మిగిల్చుతున్నాయి. ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలో విద్యా వ్యవస్థ ఎలా ఉండో చూడండని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఢిల్లీ స్కూళ్లలో వసతులు, ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోండని అన్నారు. రాష్ట్రంలో ఆప్‌ను అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. Why go to Raipur? Performance of our Chattisgarh govt will be compared with the previous Raman Singh govt. Let us choose a sector of your choice and compare the performance of Congress government in Delhi vs your govt here. Ready for a debate? रायपुर की उड़ान भरने से पहले… https://t.co/0wqOaOdOJO — Pawan Khera 🇮🇳 (@Pawankhera) August 19, 2023 ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పది తరగతులకు కలిపి ఒక్క టీచర్ ఉన్నారని అన్నారు. స్కూళ్లలో వసతులు దీనస్థితిలో ఉన్నాయని చెప్పారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆప్ పార్టీ పేరులోనే సామాన్యుడనే అర్థం ఉంటుందని, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ దేశ రాజధానితో ఛత్తీస్‌గఢ్‌ను ఎందుకు పోల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల పనితీరుతో ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూడాలని అన్నారు. ఢిల్లీలో అంతా చక్కగా ఉంటే కేజ్రీవాల్‌కు రాయ్‌పూర్ రావాల్సిన అవసరం ఏంటని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే
సాక్షి, అమరావతి: క్లీన్ నోట్ పాలసీలో భాగంగా కేంద్రప్రభుత్వం రూ.2 వేల నోటును మే 19న చెలామణిలోంచి ఉపసంహరించింది. సెప్టెంబరు 30 లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. దీంతో రూ.2 వేల నోట్లు ఉన్న వారందరూ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, చిన్న నోట్లు తీసుకుంటున్నారు. ఇలా నోట్లను మార్చుకుంటున్న వారిలో అత్యధికులు బడా బాబులే. సామాన్యుల నుంచి వస్తున్న నోట్లు చాలా తక్కువని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, మరికొన్ని చిన్న బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న నోట్లలో 90 శాతానికి పైగా వ్యాపారుల నుంచే వస్తున్నాయని వెల్లడించాయి. సిటీ యూనియన్ బ్యాంక్‌లో రూ.380 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు డిపాజిట్ అయితే.. అందులో 90 శాతంపైన వ్యాపారవేత్తలవేనని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు. అదే పెద్ద బ్యాంకుల్లో వస్తున్న డిపాజిట్లలో 50 శాతం పైన ధనవంతులవే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ.3,589 కోట్ల విలువైన నోట్లు వెనక్కి రాగా అందులో 40 శాతం పైన, యూకో బ్యాంకులో రూ.3,471 కోట్లు డిపాజిట్ అయితే అందులో 58 శాతం వ్యాపారవర్గాల నుంచే వచ్చినట్లు పేర్కొన్నారు. 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు నగదు కొరత రాకుండా రూ.2 వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరాలుగా రూ.2 వేల నోటు చెలామణి తగ్గడంతో వీటిని వెనక్కి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. బ్యాంకులకు చేరిన నోట్లను తిరిగి వెనక్కి ఇవ్వవొద్దని బ్యాంకులను ఆదేశించింది. దేశంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. వాటి ఉపసంహరణ అనంతరం జూలై 31 నాటికి 88 శాతం నోట్లు అంటే రూ.3.14 లక్షల కోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.14,000 కోట్లు విలువైన నోట్లు వచ్చాయి. పెద్ద మొత్తంలో నోట్లు వెనక్కి రావడంతో బ్యాంకుల వద్ద డిపాజిట్ల విలువ భారీగా పెరిగిపోతోంది. దీంతో బ్యాంకుల వద్ద నగదు లభ్యతను తగ్గించడానికి ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో (ఐసీఆర్ఆర్)ను 10 శాతం కేటాయించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకుల వద్ద ఒక్కసారిగా డిపాజిట్లు పెరిగిన సమయంలో తాత్కాలికంగా ఐసీఆర్ఆర్ను ఆర్బీఐ వినియోగిస్తుంది. -
నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన
భారతదేశంలో రూ. 2వేలు నోట్లను ఉపసంహరించుకోవడానికి ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నట్లు అందరికి తేవలిసిందే. అయితే ఈ సమయంలో కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గడువు పెంపుపై క్లారిటీ.. రూ. 2000 నోట్ల ఉపసంహరణకు సంబంధించి గడువు పొడిగిస్తారా? అనే ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బదులిస్తూ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. కావున నిర్దిష్ట గడువు లోపల తప్పకుండా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి.. లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇప్పటికే వెల్లడించిన గడువు (సెప్టెంబర్ 30) లోపల ఎవరైనా తమ వద్దే రెండు వేల నోట్లను అలాగే పెట్టుకుని ఉంటే నష్టపోవాల్సింది మీరే అని కూడా స్పష్టం చేసింది. (ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!) తిరిగి వచ్చిన నోట్లు.. ఇప్పటి వరకు సుమారు రూ. 2.72 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 2000 నోట్లు ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా మార్చుకోవాలని సూచిస్తోంది. గడువు పెంపులో మార్పు లేదు కావున ప్రజలు తప్పకుండా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలి / ఎక్స్చేంజ్ చేసుకోవాలి. -
పాత సామాన్లు కొంటాం..! పనిచేయని ఫోన్లు, పరికరాలు కొంటున్న ఫ్లిప్‌కార్ట్..
పనిచేయని పాత స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌కూలర్లు తదితర గృహోపకరణాలను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా పాతవి ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది . ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) తగ్గించడంతోపాటు పనికిరాని ఉపకరణాలను డిస్పోజ్ చేయడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అధీకృత విక్రేతలతో భాగస్వామ్యం ద్వారా రీఫర్బిష్మెంట్, రీసైక్లింగ్ లేదా సరైన డిస్పొజల్ ద్వారా ఈ-వ్యర్థాల సంస్కరణ బాధ్యతను ఫ్లిప్‌కార్ట్ చేపట్టింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న దేశంగా ఉన్న భారత్ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ఫ్టిప్‌కార్ట్ చెబుతోంది. ఈ ప్రోగ్రామ్ ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆఫర్లు, పని చేయని ఉపకరణాలను ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకోవడం, హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఉత్పత్తులను అందిస్తుంది. డేటా తొలగింపు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అదనంగా పాత మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రీఫర్బిష్ లేదా డిస్పోజ్ చేయడానికి ముందు వాటిలోని డేటా తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సమర్థవంతమైన సాంకేతిక ప్రక్రియలు, విస్తృతమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఒకే సారి కస్టమర్లకు అవాంతరాలు లేని సేవలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ రీ-కామర్స్ సీనియర్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. కొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ వద్ద ఉన్న పని చేయని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను ఇచ్చి కొత్త ఉత్పత్తులు కొనుక్కునేలా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు -
ఇంకా రూ. లక్ష కోట్లు రావాలి! రూ.2 వేల నోట్లపై కీలక సమాచారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే నెలలో రూ.2 వేల నోట్లను ఉపసంహరించింది. 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని లేదా ఏదైనా బ్యాంకు శాఖలో ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించిన రూ. 2,000 కరెన్సీ నోట్లను సెప్టెంబర్ చివరి నాటికి మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరిన ఆర్బీఐ ఇందు కోసం అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. కాగా ఇప్పటివరకు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కివచ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. మొత్తంగా రూ.3.6 లక్షల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉండగా మూడింట రెండు వంతులకు పైగా నోట్లు తిరిగి వచ్చాయి. అంటే ఇంకా దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. గడువు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా రూ.2,000 నోట్లను వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే! -
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసాలు..
సాక్షి, హైదరాబాద్: రూ.2వేల నోట్లను మార్పిడి చేసి ఇస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2వేల నోట్లను ఉపసంహరించడం తెలిసిందే. రూ.2వేల నోట్లను బ్యాంకులలో జమ చేసి ఇతర కరెన్సీ నోట్లు పొందాలని ఇప్పటికే సూచించింది. దీంతో కొన్ని రోజులుగా రూ.2వేల నోట్ల మార్పిడి పెరిగింది. ఇదే అదనుగా రూ.2వేల నోట్లను కమీషన్లకు మార్చి ఇస్తామని మోసగిస్తున్న వారి వలలో పడవద్దని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ప్రజల్లో ఈ తరహా మోసాలపై అవగాహన పెంచేందుకు ట్విట్టర్ ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకులకే వెళ్లాలని, కొత్తవారిని నమ్మి మోసపోవద్దని వారు సూచించారు. -
ఆర్ బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, బ్యాంకుల్లో నోట్లు మార్చుకునే ఛాన్స్
-
మార్గదర్శి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ
-
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
పాలిథీన్ చెత్తతో రండి.. గోల్డ్ కాయిన్‌తో వెళ్లండి
అనంతనాగ్(జమ్ము కశ్మీర్): ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. మనసు పెడితే.. చెత్త కూడా బంగారమే అవుతుంది!. నమ్మరా?.. అయితే.. ఆ సర్పంచ్ వైవిధ్యభరితమైన ఆలోచన, దాని వెనుక ఉన్న బలమైన కారణం.. ఏడాది కాలంలో ఆ ప్రయత్నంతో తన ఊరిలో తెచ్చిన మార్పు గురించి తెలుసుకోవాల్సిందే!. ఫరూఖ్ అహ్మద్ ఘనై.. పాలిథీన్ చెత్తతో వచ్చి గోల్డ్ కాయిన్‌తో వెళ్లమంటున్నాడు. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని కొండల మధ్య ఉండే సాదివారా అనే ఓ గ్రామానికి ఆయన సర్పంచ్. పైగా లాయర్ కూడా. పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. ఒక తీవ్రమైన సమస్యగా అర్థం చేసుకున్నాడాయన. శుభ్రత మీద ఇప్పుడు దృష్టిసారించకపోతే.. రాబోయే పదేళ్లలో సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులను కనుగొనలేరంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారాయన. ఇంట్లో పేరుకుపోయిన పాలిథీన్ చెత్తను బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, నీళ్లలో పడేస్తున్నారు గ్రామస్తులు. అది నేలలో కలిసిపోవడం జరగని పని. అందుకే శుభ్రత కోసం అధికారులు, ప్రభుత్వం శ్రమించే కంటే.. ప్రజలే దృష్టిసారించడం మేలని భావించాడాయన. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే.. వాళ్లకు ఆశ కల్పిస్తే ఎలా ఉంటుందని భావించాడు. అందుకే పాలిథీన్ చెత్తతో రండి.. బంగారు కాయిన్‌తో వెళ్లండి అనే పిలుపు ఇచ్చాడు. ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా, అంతకు మించి పాలిథీన్ చెత్త తీసుకొస్తారో.. వాళ్లకు ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు. అలాగే.. అంతకంటే కాస్త తక్కువ చెత్త వచ్చినవాళ్లకు సిల్వర్ కాయిన్ బహుకరిస్తున్నాడు. అంత చెత్త తెచ్చి ఎవరు ఇస్తాడని అనుకోకండి!. ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ఏడాదిలోనే ఎంతో మార్పు తెచ్చిందని సంబురపడిపోతున్నాడాయన. అంతేకాదు.. ఈ ఆలోచన జిల్లా అధికారులను సైతం కదిలించింది. అన్ని పంచాయితీల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా అభివృద్ధి అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. -
వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!
సామర్ధ్యం ఉండి.. ఐఫోన్‌ను కొనలేకపోయామే అని బాధపడుతున్న ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. గతేడాది మార్కెట్లో యాపిల్ శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర సంస్థలు భారీ ఎత్తున ఫోన్లను విడుదల చేశాయి. ఏ సంస్థ నుంచి ఎన్ని ఫోన్లు విడుదలైన అందులో ఐఫోన్‌కు ప్రత్యేకత వేరే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్‌ను వినియోగించాలని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ధర కారణంగా వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈకామర్స్ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ అమ్మకాలపై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. 2022 ఆగస్ట్ నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఆ సిరీస్‌లోని ఐఫోన్ 14 పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రీటైల్ మార్కెట్లో ఆఫోన్ ధర రూ.80 వేలు ఉండగా.. ఇప్పుడు అదే ఫోన్ పై రూ.5,910 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇలా ఫ్లిప్ కార్ట్‌తో పాటు ఇతర డిస్కౌంట్లతో ఆ ఫోన్ ధర రూ.50,990కి తగ్గింది. ఒకవేళ మీరు 128 జీబీ వేరీయంట్ ఐఫోన్ 14ను ఎక్ఛేంజీలో సైతం కొనుక్కోవచ్చు. ఫోన్ కండీషన్ బాగుండి, మేజర్ సమస్యలు లేకపోతే ట్రేడ్- ఇన్ డిస్కౌంట్ వ్యాల్యూ ఆధారంగా క్యాలిక్లేట్ చేసి మీ ఫోన్ పై ఎంత ఎక్ఛేంజీ ఇవ్వాలో నిర్ధారిస్తారు ఐఫోన్ ప్రతినిధులు. ఆఫోన్పై ఎక్ఛేంజ్తో రూ.23వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎగ్జిస్టింట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కింద 7శాతం డిస్కౌంట్, ఇతర బ్యాంక్‌లు ఇచ్చే ఆఫర్లు ఇలా మొత్తం కలిపితే రూ.40వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చని ప్లిప్ కార్ట్ తెలిపింది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి👉‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్! -
పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
700 ఖాతాల నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి. ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు. -
బలహీన బాటలో రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీన బాటలో పయనిస్తోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 38 పైసలు బలహీనపడి, 81.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా కరెన్సీ పటిష్టత, దేశీయ ఈక్విటీల్లో మిశ్రమ ధోరణి రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. రూపాయి విలువ బుధవారం 35 పైసలు తగ్గి 81.26కు పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 81.62 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.45 – 81.68 శ్రేణిలో కదలాడింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపా యి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. -
100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
న్యూఢిల్లీ:చిన్న పొరపాటు, నిర్లక్క్ష్యం ఒక్కోసారి భారీ ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఉదంతాలు గతంలో చాలానే చూశాం. తాజాగా పొరపాటుగా ఒక మహిళ ఖాతాలో మిలియన్ల డాలర్లను పంపించిన ఘటన ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇంకొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే దీన్ని గుర్తించడానికి సంస్థకు ఏకంగా ఏడునెలలు పట్టిందిట. (WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు) సింగపూర్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ క్రిప్టో డాట్‌కామ్ ఈ పొరపాటుచేసింది. అనుకోకుండా ఆస్ట్రేలియన్ మహిళ దేవమనోగారి మణివేల్ ఖాతాకు ఏకంగా 10.5 మిలియన్ల డాలర్లను సెండ్ చేసింది. అదీ కేవలం 100 డాలర్ల రీఫండ్‌కు బదులుగా ఇంత సొమ్మును ఆమె ఖాతాలో జమ చేసింది. గత ఏడాది మేలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆలస్యంగా పొరపాటును గ్రహించి చర్యలకు దిగింది. ఆమె ఖాతాలో అంత పెద్ద మొత్తంలో సొమ్మును జతచేశామంటూ లబోదిబోమంది. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభో అంటూ దేవమనోగారి మణివేల్ , ఆమె సోదరిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చదవండి: Starbucks: స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్, ప్రత్యేకత ఏంటంటే? ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే తనఖాతాలో వచ్చిన సొమ్ము ద్వారా గుట్టుచప్పుడుకాకుండా మెల్బోర్న్లో 1.35 మిలియన్ డాలర్లు విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసింది మణివేల్. ఆ తరువాత తెలివిగా ఆ ఇంటిని సోదరి పేరుతో బదిలీ కూడా చేసేసింది. దీంతోపాటు 4,30,000 డాలర్లను తన కుమార్తెకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంత చేసినా.. తప్పించుకోలేకపోయింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆస్తిని విక్రయించి, మిగిలిన డబ్బును వడ్డీతో సహా తిరిగి క్రిప్టో డాట్‌కాంకు ఇవ్వాలని ఆదేశించారు. -
ఐఫోన్ లవర్స్‌కు బంఫరాఫర్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 12పై డిస్కౌంట్లు ప్రకటించింది. యాపిల్‌కు చెందిన రీటెయిల్ ఔట్లెట్లలో ఈఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్లు పొందవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో రీటెయిల్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్, ఎక్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 12ను రూ.32వేలకే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ప్రీమియం ఫోన్లను అమ్మే యూనికార్న్ స్టోర్ ఐఫోన్12ని రూ.32వేలకే అందిస్తుంది. ఫోన్ అసలు ధర రూ.56,674 ఉండగా స్టోర్ 14శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేల తగ్గింపు, రూ.3వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కలిపి ధర ఉంటుందని ప్రకటన స్పష్టంగా పేర్కొంది. ఐఫోన్ 12ను కొనుగోలు కోసం హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.3వేల క్యాష్ బ్యాక్, పాత ఐఫోన్11 లేదా ఐఫోన్ ఎక్స్ ఆర్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.19,000 వరకు పొందవచ్చు. యూనికార్న్ స్టోర్ రూ.3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్‌కి రూ.20వేలు పొందగలిగితే పొందగలిగితే, మీరు దాదాపు రూ.33వేలకే ఐఫోన్ 12ని పొందవచ్చు. మీ పాత ఫోన్‌కు మీరు పొందే ధర పూర్తిగా మీ ఫోన్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లో బ్యాటరీ పనితీరు మందగించినా, లేదా స్క్రాచ్‌లు పడినా ఐఫోన్ ధర తగ్గుతుంది. ఐఫోన్ 12ఫీచర్లు ఐఫోన్ 12 నెక్ట్స్ జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో ఏ14 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో రికార్డింగ్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రొటక్షన్ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ను కలిగి ఉంది. చదవండి👉ఐఫోన్13 పై ఆఫర్ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్ చేసుకోవద్దు! -
డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్లాప్.. కొరవడిన నిఘా!
సాక్షి, హైదరాబాద్: ఆక్టోపస్‌లా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. స్టార్ హోటళ్లు, పబ్‌లలో డ్రగ్స్ సరఫరా వ్యవస్తీకృతంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ స్థాయి ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు తదితర అధికారగణంతో బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బలగాలు బెల్టు షాపులు, మద్యం విడి విక్రయాల నియంత్రణ వంటి సాధారణ ఉల్లంఘనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కీలకమైన నార్కోటిక్స్ నేరాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు, పబ్‌లు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు గంజాయి, కొకైన్, హాష్ ఆయిల్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కూడా నేర నియంత్రణలో ఆ శాఖ వైఫల్యానికి కారణమవుతోంది. ప్రధానంగా రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలకు, జిల్లాస్థాయి నిఘా విభాగాలకు, మొబైల్ టాస్క్ఫోర్సు బృందాలకు మధ్య సరైన సహకారం, సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులు అంకితభావంతో పని చేసినా వారికి సరైన ప్రోత్సాహం, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించడం లేదు. దీంతో నగరం నలుమూలలా డ్రగ్స్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్‌లో పోలీసుల తనిఖీల్లో కొకైన్ లభించడం ఎక్సైజ్ శాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మొక్కుబడి తనిఖీలు.. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించే మొక్కుబడి తనిఖీలు నెలవారీ మామూళ్ల కోసమే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అనేక చోట్ల పబ్‌లు, హోటళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసినా చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు తెరిచి ఉంచినా, మైనర్లను అనుమతించినా పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, సికింద్రాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘తమ వల్లనే మద్యం అమ్మకాలు పెరిగి భారీ ఆదాయం వచ్చినట్లు కొందరు అధికారులు తమ పనితనానికి నిదర్శనంగా చెబుతారు. కానీ వాళ్ల ప్రమేయం లేకుండానే అమ్మకాలు జరుగుతాయి. ఆదాయం వస్తుంది’ అని ఓ అధికారి చెప్పారు. అక్రమార్జనపై ఉన్న ధ్యాస నేరనియంత్రణలో లేకపోవడంతో మాఫియా జడలు విప్పుతోందనే విమర్శలున్నాయి. సీఎం ఆదేశించినా అంతే సంగతులు.. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదేశించినా ఆచరణలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. గతంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కీలక విధులు నిర్వహించిన కొందరు అధికారులను బదిలీ చేయడంతో చాలా నష్టం వాటిల్లింది. తాజాగా జరిగిన పదోన్నతులు, బదిలీలతో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ తిరిగి బలోపేతమయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. (చదవండి: ఆ మూడు టేబుళ్లే కీలకం!) -
అమెరికా స్టాక్స్‌లో భారతీయుల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్ కంపెనీల స్టాక్స్‌లో భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎక్సేంజీలో ట్రేడింగ్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో కలిసి అన్‌స్పాన్సర్డ్ డిపాజిటరీ రిసీట్స్‌ను (యూడీఆర్) అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ వెల్లడించింది. కస్టోడియన్ హోదాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు .. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిసీట్స్‌ను జారీ చేస్తుంది. డిపాజిటరీ ఖాతాలను తెరవడంతో పాటు సంబంధిత ఇతర కార్యకలాపాలను కూడా బ్యాంకు నిర్వహిస్తుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) ఎక్సేంజీలో ముందుగా అమెజాన్, మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్), ఆల్ఫాబెట్, టెస్లా, నెట్‌ఫ్లిక్స్, యాపిల్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్ వంటి 8 స్టాక్స్‌కి సంబంధించిన యూడీఆర్లలో ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. దీన్ని ఇతర దేశాల స్టాక్స్‌కు కూడా క్రమంగా విస్తరించనున్నట్లు ఎన్ఎస్ఈ సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు. -
ఆనంద్ మహీంద్రా కోరిక నెరవేరింది
దేశం గర్వించదగ్గ వ్యాపారదిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైతే సాయానికి సైతం వెనకాడని నైజం వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాది. అలాంటిది మాట ఇచ్చాక ఊరుకుంటాడా? ఆ మధ్య మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడు దత్తాత్రేయ లొహార్ అనే అతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఆ వాహనం ఇస్తే.. బదులుగా కొత్త బొలెరో వాహనం ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు మొత్తానికి ఆ పని చేసి చూపించారాయన. ‘‘కొత్త బొలెరో తీసుకుని తన వాహనాన్ని మార్చుకునే ప్రతిపాదనను అతను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. నిన్న అతని కుటుంబం బొలెరోను అందుకుంది. మేము అతని సృష్టికి సగర్వంగా బాధ్యత వహిస్తాం. ఇది మా రీసెర్చ్ వ్యాలీలో మా అన్ని రకాల కార్ల కలెక్షన్లో భాగంగా ఉండనుంది ఇక. స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. Delighted that he accepted the offer to exchange his vehicle for a new Bolero. Yesterday his family received the Bolero & we proudly took charge of his creation. It will be part of our collection of cars of all types at our Research Valley & should inspire us to be resourceful. https://t.co/AswU4za6HT pic.twitter.com/xGtfDtl1K0 — anand mahindra (@anandmahindra) January 25, 2022 సంబంధిత వార్త: బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే.. దత్తాత్రేయ లొహార్ స్వస్థలం మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! షోరూంలో దత్తాత్రేయ కుటుంబంతో సహా వాహనం అందుకున్న ఫొటోల్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 -
పాత సైకిల్ ఇస్తే కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చును..!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఊపందుకుంది. అధిక ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా భారత్‌లో ఆయా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా కొనుగోలుదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కాగా వెస్ట్‌బెంగాల్‌కు చెందిన గోజీరో మొబిలిటీ(GoZero Mobility) సరికొత్త ఆఫర్‌ను అందించనుంది. పాత సైకిల్‌ను ఇస్తే..! ఈ-బైక్స్‌పై అమ్మకాలను మరింత పెంచేందుకుగాను గోజీరో మొబిలిటీ "స్విచ్" అనే ఒక ఎక్సేచేంజ్ ప్రమోషన్‌ను మొదలు పెట్టింది. ఈ ప్రచారంలో భాగంగా కస్టమర్స్ ఏదైనా సంప్రదాయ సైకిల్‌తో కంపెనీకి చెందని ఎలక్ట్రిక్ ఈ-బైక్‌తో ఎక్సేచేంజ్ చేసుకోవచ్చునని గోజీరో పేర్కొంది. "స్విచ్" ప్రమోషన్స్‌లో భాగంగా...రూ. 7,000 నుంచి రూ. 25 వేల విలువైన ఏదైనా బ్రాండ్‌కు చెందిన సైకిల్‌తో కొత్త ఈ-బైక్‌ను సొంతం చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ 2022 జనవరి 10 నుంచి 2022 ఏప్రిల్ 9 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్సేచేంజ్‌తో సేకరించిన సైకిళ్లను తిరిగి ఈ-బైక్స్‌గా మార్చుతామని కంపెనీ సహావ్యవస్థాపకుడు సుమిత్ రంజన్ అన్నారు. గోజీరో స్విచ్ ప్రచారంలో ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్ ఈవీ ఆటోమార్ట్,ఆర్యేంద్ర మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. వీరి భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా గోజీరో ఈ-బైక్ అమ్మకాలను జరుపుతోంది. GoZero X-సిరీస్ ఈ-బైక్స్ ధర రూ. 34,999 నుంచి రూ. 45,999గా ఉండనున్నాయి. చదవండి: టయోటా హైబ్రిడ్ కార్ సరికొత్తగా..! పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..! -
సామాన్యుడికి ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
Anand Mahindra Offers Bolero To This Man Who Made four wheeler With Scrap: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చర్యలు ఎప్పుడూ ఆకట్టుకునేలా ఉంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బిజినెస్ టైకూన్.. అప్పుడప్పుడు సర్ప్రైజ్లు కూడా ఇస్తుంటాడు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మహీంద్రా ఆఫర్ ఇచ్చింది ఓ పేదకమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్‌ను తయారుచేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. అందుకే ఆ వీడియోను షేర్ తన ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్ మహీంద్రా. This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt — anand mahindra (@anandmahindra) December 21, 2021 ‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్’పై ప్రశంసలు గుప్పించాడు. హిస్టోరికానో యూట్యూబ్ ఛానెల్ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్. ఊరు మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: బాధ్యత కలిగిన పౌరులను చూశా! -
శ్రీరామ్ ఆటోమాల్.. ఎక్సేంజీలో భారత్ బెంజ్ ట్రక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహన రంగంలో ఉన్న దైమ్లర్ ఇండియా కమర్షియల్‌వెహికిల్స్ తాజాగా పాత వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదార్లు తమ పాత ట్రక్స్‌ను ఎక్సే్ంజ్ కింద భారత్ బెంజ్ శ్రేణి కొత్త, పాత వెహికిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. శ్రీరామ్ ఆటోమాల్ వేదికగా భారత్ బెంజ్, ఇతర ఓఈఎంల వాహనాలను విక్రయిస్తారు. -
గ్లోబల్ బులియన్ ఎక్ఛేంజీకి శ్రీకారం
న్యూఢిల్లీ: ప్రయోగాత్మక పద్ధతిలో గుజరాత్, గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బులియన్ ఎక్ఛేంజీ ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సీఏ) చైర్‌పర్శన్ ఇంజేటి శ్రీనివాస్ ఎఎక్ఛేంజీని పరిశీలనార్ధం తాజాగా ప్రారంభించారు. ఐఎఫ్ఎస్సీ వ్యవస్థాపక రోజు సందర్భంగా ఈ ఏడాది(2021) అక్టోబర్ 1 నుంచి బులియన్ ఎక్ఛేంజీ లైవ్ ట్రేడింగ్‌కు వేదిక కానుంది. ఆర్థిక సంస్థలు, ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసుల నియంత్రణ, అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం దేశీయంగా ఇది తొలి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్కాగా.. 2020–21 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతర్జాతీయ బులియన్ ఎక్ఛేంజీకి, క్లియరింగ్ కార్పొరేషన్, డిపాజిటరీ, వాల్ట్‌ల నిబంధనలను ప్రకటించారు. వీటిని 2020 డిసెంబర్ 11న నోటిఫై చేశారు. వీటితోపాటు కేంద్రం బులియన్ స్పాట్ ట్రేడింగ్, అండర్లైయింగ్ బులియన్ డిపాజిటరీ రిసీప్ట్స్ తదితర ఫైనాన్షియల్ ప్రొడక్టులు, సర్వీసులను సైతం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. -
రూపాయి.. అధరహో
ముంబై: చాలా రోజుల తర్వాత డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు నుంచి పెట్టుబడుల వరద పారడంతో రూపాయి క్రమంగా బలం పుంజుకుంది. డాలర్ మారకంతో పోల్చితే 17 పైసలు లాభపడింది. గత కొంత కాలంగా ఇండియన్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఆల్‌టైం హైలను తాకినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 238 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మరోవైపు అమెరికా మార్కెట్లో డాలర్ ఒడిదుడులకు లోనవుతోంది. ఫలితంగా గురువారం మార్కెట్లో డాలర్లతో పోల్చితే రూపాయి గణనీయంగా బలపడింది. ఏకంగా 17 పైసల వరకు విలువను పెంచుకుని 74.27 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.44 దగ్గర కొనసాగింది. -
మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
నేలకొండపల్లి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడి వినియోగం, తరలింపుపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ వారు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల ద్వారా విస్తృత తనిఖీలు చేస్తూ కట్టడి చర్యలు చేపట్టారు. మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదు చేస్తూ, నిల్వలు స్వాధీనం చేసుకుంటూ ఎన్నికలకు ముందు ప్రశాంత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు. జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టుల్లో 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, డిస్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా..సోదాలు ఉధృతమవుతున్నాయి. లక్షల రూపాయల విలువ చేసే మద్యం పట్టుకున్నారు. అక్రమ అమ్మకాలకు సంబంధించి 532మందిపై కేసులు నమోదు చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అనధికారికంగా జరిగే సరఫరాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఇవన్నీ చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులకు సంబంధించి పోలీసులు, ఎక్సైజ్ శాఖల వారు మధిర, నేలకొండపల్లి, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్ తదితర కేంద్రాల్లో ఇలా ఉమ్మడిగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం, ఇతరత్రా రాకుండా అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఇక వైన్స్లలో కూడా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగితే..ఆ లెక్కలు ఆరా తీస్తున్నారు. తద్వారా ముందస్తుగా మద్యం నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్‌కు ముందు మద్యం అమ్మకాల బంద్ ఉండనున్న నేపథ్యంలో..ఆ రోజుల్లో సరఫరా జరగకుండా ఇప్పటినుంచే పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.. ఎన్నికల దృష్ట్యా మద్యం అక్రమ తరలింపు నివారణకు ప్రత్యేక టీంల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఏపీ రాçష్టం నుంచి ఎలాంటి అక్రమ మద్యం, ఇతరత్రా వస్తువులు రాకుండా నిరంతరం నిఘా పెంచాం. మద్యం దుకాణాల్లో కూడా పరిమితికి మించి అమ్మకాలు జరపకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ నిల్వలు, మద్యం సరఫరా విషయం తెలిసిన వారు మాకు సమాచారం అందించండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వి.సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం -
హీరో వాహనాలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. మోడల్, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500 దాకా రేట్లను పెంచింది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం రూ. 40,000 నుంచి రూ. 1 లక్ష దాకా ఖరీదు చేసే స్కూటర్స్, బైక్‌లను విక్రయిస్తోంది. బుధవారం హీరో మోటోకార్ప్ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 3,104.50 వద్ద ముగిసింది. -
రూపాయి.. టపటపా!
న్యూఢిల్లీ: రూపాయి అంతకంతకూ పాతాళానికి పడిపోతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం చరిత్రాత్మక కనిష్ట స్థాయిలో... 69.05 వద్ద ముగిసింది. నిజానికి జూన్ 28వ తేదీ ఫారెక్స్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి విలువ 69.10ని తాకింది. అయితే డాలర్లను భారీగా అందుబాటులోకి తెస్తూ (ఆర్బీఐ) జోక్యంతో అదే రోజు కొంత కోలుకుంది. అయితే తాజాగా గురువారం ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పతనమై, ముగింపులో కూడా రికార్డు స్థాయిని నమోదుచేసుకుంది. ఒకేరోజు 43 పైసలు నష్టపోయింది. కారణాలు ఇవీ... ►అమెరికా ఆర్థిక రంగం పుంజుకుంటుందని, వడ్డీరేట్ల పెంపునకు తగిన వాతావరణం ఉందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్ పావెల్ అమెరికా సెనేట్ ముందు చేసిన ప్రకటన ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్‌కు ఊతం ఇచ్చింది. డాలర్ ఇండెక్స్ మళ్లీ కీలక నిరోధ స్థాయి 95ను దాటింది. ఇది రూపాయి పతనానికి దారితీసింది. ఈ వార్త రాసే సమయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 95.27 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ మారకంలో రూపాయి విలువ 69.08 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఒక దశలో డాలర్ ఇండెక్స్ 95.44ను సైతం తాకింది. ► మే 29 తరువాత ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో (43 పైసలు) పతనం కావడం ఇదే తొలిసారి. ►కేంద్రంపై అవిశ్వాసం శుక్రవారం చర్చకు వస్తుండడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ►రూపాయిని బలపరిచే విధంగా ఫారిన్ ఎక్సే్ఛంజ్ మార్కెట్లో ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదని ట్రేడర్లు, స్పెక్యులేటర్లు భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ►బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇది ఒక దశలో రూపాయిని 69.07 స్థాయికి సైతం పడగొట్టాయి. ► గురువారం డాలర్ మారకంలో చైనా కరెన్సీ యువాన్ మారకపు విలువ తగ్గింది. వాణిజ్య యుద్ధంలో పట్టు సాధించడానికి చైనా సెంట్రల్ బ్యాంకే ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనితో భారత్ కరెన్సీసహా పలు ఆసియా దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. -
రూపాయి.. జీవితకాల కనిష్టానికి!
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం బుధవారం జీవిత కాల కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. రూపాయి పతనం కావడం ఇది వరుసగా రెండో రోజు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం 68.74 వద్ద ముగిసింది. ఈ ముగింపుతో పోల్చితే గురువారం ఉదయం రూపాయి 6 పైసల నష్టంతో 68.80 వద్ద ఆరంభమైంది. అమ్మకాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్రాడేలో 69.01 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 21 పైసల నష్టంతో 68.95 వద్ద ముగిసింది. రూపాయి మరీ పతనం కాకుండా, 69 స్థాయిలో ముగియకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుందన్న సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. గత రెండు రోజుల్లో రూపాయి మొత్తం 38 పైసలు నష్టపోయింది. అమెరికా డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడం, విదేశీ నిధులు తరలిపోతుండటంతో రూపాయి క్షీణిస్తోందని నిపుణులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడంతో మన రూపాయితో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి పతనం... గత ఏడాది నల్లేరు మీద నడకలా సాగిన రూపాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పతనమవుతూనే ఉంది. గత నెల 28న జీవిత కాల గరిష్ట స్థాయి, 69.10ను తాకింది. ఇక ఈ నెల 2న జీవిత కాల కనిష్ట స్థాయి, 68.80 వద్ద ముగిసింది. ఆసియాలో అత్యంత అధ్వానంగా ఉన్న కరెన్సీల్లో మన రూపాయి కూడా ఒకటి. కరంట్ అకౌంట్ లోటు మరింత పైపైకి... ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో మన కరంట్ అకౌంట్ లోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనలు రేగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న మన ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముడి చమురు ధరలు తీవ్రమైన ప్రభావాన్నే చూపించగలవన్న భయాలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావమే చూపుతోంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచడంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందని, దీంతో ఆర్బీఐ అంచనాల కంటే అధికంగానే వడ్డీరేట్లను పెంచగలదన్న భయాలు నెలకొన్నాయి. -
మా దోపిడీ.. మా ఇష్టం
నెల్లూరు సిటీ: అధికారం మాది.. తా ము చెప్పిందే వేదం.. తాము చేసిందే చట్టం అన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మూడేళ్లుగా నగరపాలక సంస్థ పాలకవర్గం నిప్పో స్థల భూ మార్పిడిపై తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కొందరు టీడీపీ కార్పొరేటర్లు సైతం వ్యతిరేకించారు. ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కౌన్సిల్ సమావేశాల్లో అడ్డుకోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు రూ.1200 కోట్ల స్థల వ్యవహారం కావడంతో టీడీపీలో వ్యతిరేకించే కార్పొరేటర్లకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు పంపారు. దీంతో గత నెల 29న బడ్జెట్ సమావేశంతో పాటు సాధారణ సమావేశాన్ని నిర్వహించి ఆమోదించేందుకు అన్ని విధాలా రంగం సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా వ్యతిరేకించడంతో మేయర్ అబ్దుల్ అజీజ్ తప్పని పరిస్థితుల్లో సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారు. పదో తేదీన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని అజీజ్ ప్రకటించారు. అయితే నిప్పో స్థలానికి సంబంధించి మరోసారి వాయిదా వేయకుండా ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో ఈ నెల 12న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం. రూ.300 కోట్లకు డీల్ వేదాయపాళెం ప్రధాన రోడ్డులో 13.02 ఎకరాలను భూ మార్పిడి కింద నిప్పో నిర్వాహకులకు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.1200 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. మరోసారి ఎలాంటి ఆటంకాల్లేకుండా ఉండేందుకు ప్రైవేట్ వ్యక్తులు టీడీపీ నేతలు, అధికారులకు భారీగా ముడుపులు అందించినట్లు సమాచారం. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సైతం భారీగా ముడుపులు అందాయని సొంత పార్టీలోని కొందరు నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు నగదును వారి ఇళ్లకే పంపించారని సమాచారం. అధికారులు, నాయకులు, కార్పొరేటర్లు, చోటా నాయకులకు వారి వారి స్థాయిల్లో డబ్బుల పంపకాలు జరిగాయి. ఇలా మొత్తం రాష్ట స్థాయి నాయకుల నుంచి కిందిస్థాయి నాయకుల వరకు రూ.300 కోట్ల మేర పంపకాలు జరిగినట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఆరాటం నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి నాలుగేళ్లు దాటుతోంది. అయితే ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశాలను నాలుగు సార్లు మాత్రమే నిర్వహించిన ఘనత పాలకవర్గానిది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాల్సిన పాలకవర్గం ఏడాదికి ఒక సమావేశాన్ని నిర్వహించడమే కష్టంగా మారింది. అయితే ఇప్పుడు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఆరాటపడటం వెనుక భారీ స్కెచ్ ఉందని ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలు వరదలు, అనా రోగ్యం, తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని పాలకవర్గం ఇప్పుడు కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అర్ధరాత్రి వరకు మంతనాలు ఈ నెల 12న జరిగే కౌన్సిల్ సమావేశంలో నిప్పో అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేందుకు పాలకవర్గం పట్టుపట్టింది. ఈ క్రమంలో గురువారం రాత్రి 12 గంటల వరకు మేయర్ నివాసంలో కమిషనర్ అలీంబాషా, టౌన్‌ప్లానింగ్ డీసీపీ సూరజ్, ఇంజినీరింగ్ ఎస్ఈ రవికృష్ణంరాజుతో సమావేశమయ్యా రు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. నిప్పో అంశానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే ఏ విధమైన వ్యూహం తో పావులు కదపాలనే అంశంపై చర్చలు జరిపారు. మేయర్ నివాసానికి అధికారులను పిలిపించి చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కౌన్సిల్ ముందుకు నిప్పో!
నెల్లూరు నగరంలో నిప్పో కంపెనీ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ ముఖ్య నేతలు మొదలుకుని కార్పొరేటర్ల వరకు అందరూ దీనిపైనే చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టాలని భావించి కూడా నిర్ణయం వాయిదా వేసుకోవటంతో తీవ్రతర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఈనెల 10వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో నిప్పోపై చర్చించి, ఆమోదించాలని అధికార పార్టీ బలంగా యత్నాలు సాగించి క్యాష్ పైరవీలకు తెరతీయటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులోని పారిశ్రామిక వాడలో ఉన్న ఇండో నేషనల్ లిమిటెడ్ (నిప్పో) భూ మార్పిడి కోసం యజమానులు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 1973లో ఇండోనేషన్ లిమిడెట్ ప్రభుత్వం రెండు విడతలుగా 13.02 ఎకరాల భూమిని అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే భూమిని పరిశ్రమ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిప్పో యాజమాన్యం భూమార్పిడి చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం దీనిని పరిశీలించి అక్కడ నివాసాలు ఉన్నాయా లేక పరిశ్రమలు ఉన్నాయా ఈ భూమి దేనికి పనికి వస్తుందో పరిశీలించి నివేదిక పంపమని స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ క్రమంలో నుడాకు అక్కడి నుంచి నగరపాలక సంస్థకు ఈఫైల్ వచ్చింది. 1973 నుంచి నిప్పో నగరంలోని వేదాయపాళెం ప్రాంతంలో 1973లో నిప్పో కంపెనీ ఏర్పాటయింది. 13.02 ఎకరాల భూములను సర్వే నంబర్లు 2034–2, 2038–3, 2038–1, 2034–3, 2034–3, 2034–1, 2033–4, 2032–3, 2031–2, 2038–2, 2034–2 తదితర సర్వే నంబర్లలో 13.02 ఎకరాల భూమిలో నిప్పో ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంది. ఈ భూముల్లో నిప్పో బ్యాటరీలు తయారు చేస్తూ కొందరికి ఉపాధి కల్పించింది. అయితే ఈ పరిశ్రమను తడకు తరలించడంతో మూడేళ్లుగా ఆ భూములు ఖాళీగా ఉన్నాయి. అధికార పార్టీ నేతల పైరవీలు ఈక్రమంలో నిప్పో పరిశ్రమ ఉన్న 13.02 ఎకరాలను భూమార్పిడి చేయటానికి వీలుగా నగరపాలకసంస్థ న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుని కౌన్సిల్లో తీర్మానం చేసి, దానిని నుడాకు పంపాల్సి ఉంది. దీనిని అధికార పార్టీ నేతలు ఆదాయవనరుగా మలుచుకున్నారు. అధికార పార్టీ కీలక నేతలు ఇద్దరు తెరవెనక మంత్రాంగం నడిపి భారీగా దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఒక కార్పొరేటర్ క్రియాశీలకంగా రంగంలోకి దిగి అందరి మద్దతు కూడగట్టటానికి భారీ ప్యాకేజ్‌లు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని దానిలో సగ భాగం ఇప్పటికే చెల్లించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి ఆదేశాలు నిప్పో వ్యవహారం రెండు సార్లు కౌన్సిల్‌కు వచ్చి వెనక్కు వెళ్లడంతో నిప్పో సంస్థ నేరుగా మున్సిపల్ ముఖ్యకార్మదర్శి కరికాలవల్లవన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో 2017 డిసెంబర్ 12వ తేదీన కార్పొరేషన్ అధికారులు ఆ భూములను పరిశీలించి పూర్తి సమాచారం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలం నుడా పరిధిలో ఉండటంతో గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన నుడా వైస్‌చైర్మన్ ఢిల్లీరావుకు లేఖరాసి వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఢిల్లీరావు జనవరి 26వ తేదీన ఓ లేఖ రాస్తూ ఈ భూమార్పిడి పై కార్పొరేషన్ కౌన్సిల్లో ఆమోదించి ప్రతిపాదనలు అందించాలని కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. దీంతో కౌన్సిల్ ఫిబ్రవరి 6వ తేదీన కౌన్సిల్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. అయితే వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీనిని ప్రజా అవసరాలకు వినియోగించాలని జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బంద్ ప్రశాంతం నెల్లూరు రూరల్: ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సవరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ జిల్లాలో దళిత సంఘాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వద్దకు ఉదయం ఏడు గంటలకే దళిత జేఏసీ నేతలు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఉదయం 10.30 గంటల వరకు బస్టాండ్‌లోనే నిలిచిపోయాయి. సిటీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపేశారు. ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని సవరిస్తూ విచారణ తరువాతనే కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి సూచికగా ఎస్సీ, ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్‌లో రిజర్వేషన్ల జోలికి గానీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం జోలికి వస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రధాని నరేంద్రమోదీ తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపింరు. కార్యక్రమంలో ఎమ్యార్పీఎస్ నాయకుడు జి. రమణయ్య మాదిగ, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ, దళిత జేఏసీ నాయకులు కలివెల ఎలీషాకుమార్, మన్నేపల్లి దాసు, డక్కా రమణయ్య, అరుణకృపాకర్, కేవీపీఎస్ నాయకులు ఆలూరి తిరుపాలు, అల్లాడి గోపా ల్, మాలకొండయ్య పాల్గొన్నారు. -
బిట్‌కాయిన్‌పై ఐటీ ఫస్ట్ బిగ్ యాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: సంచలన వర్చ్యువల్ కరెన్సీ బిట్‌కాయిన్ వ్యవహారంలో దేశంలో తొలిసారి ఐటీ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బిట్‌కాయన్ ఎక్సేంజ్‌లపై ఆదాయ పన్ను శాఖ సర్వే నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాల నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దాదాపు తొమ్మిది ప్రధాన ఎక్సేంజీల కార్యాలయాలను అధికారులు సందర్శించారు. బెంగళూరుకు చెందిన ఐటీ విభాగం అదికార బృందాలు ఢిల్లీ, బెంగళూరు, ఘజియాబాద్, పునే, హైదరాబాద్, కొచ్చి, గురుగ్రావ్‌లోని ఎక్సేంజ్‌లలో బుధవారం తొలి ఉదయం నుంచి ఈ సర్వే చేపట్టారు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 133 ఎ ప్రకారం, పెట్టుబడిదారుల, వ్యాపారుల గుర్తింపు, తీసుకున్న లావాదేవీలు, కౌంటర్‌పార్టీల గుర్తింపు, సంబంధిత బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం లాంటి ఇతర సమాచారాన్ని సేకరించాయి. కాగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లలో "డిజిటల్ వాలెట్" రూపంలోదాచుకునే క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్. భారీ ర్యాలీతో ఈ బిట్‌కాయిన్ ఇటీవలి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2009లో తొలిసారి దీన్ని సృష్టించగా తాజాగా ఇది 20వేల డాలర్ల మార్క్ దిశగా పరుగులుపెడుతోంది. దీంతొ బిట్‌కాయిన్ బబుల్‌పై వివిధ దేశాల కేంద్ర బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ట్రేడర్లను, వర్చువల్ కరెన్సీల వ్యాపారులను హెచ్చరించింది. మరోవైపు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కరెన్సీ ప్రభావం పై అంచనా, సూచనల కోసం మార్చిలో ఇంటర్ డిసిప్లినరీ కమిటీని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. -
ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం
-
అన్నీ పాతనోట్లు.. రూ.4.4 కోట్లు!
-
అన్నీ పాతనోట్లు.. రూ.4.4 కోట్లు!
♦ ఎన్ఆర్ఐ కోటాలో మార్పిడికి ఓ ముఠా కుట్ర ♦ రూ.4.4 కోట్లు కూడగట్టిన ఎనిమిది మంది ♦ అరెస్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు సాధారణ గడువు ముగిసినా కొందరు నల్లబాబుల్లో ‘మార్పిడి’ఆశలు చావలేదు. ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) కోటాలో భారీ మొత్తంలో పాత నోట్ల మార్పిడికి ఎనిమిది మంది సభ్యుల ముఠా కుట్ర పన్నింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.500, రూ.1,000 డినామినేషన్లో ఉన్న రూ.4.4 కోట్ల పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. అప్పటికే ఐటీ నోటీసులు రావడంతో.. సీతాఫల్‌మండిలోని రవీందర్‌నగర్‌లో నివసించే పి.కళ్యాణ్ ప్రసాద్ రియల్టర్. ఇతని వద్ద నల్లధనం భారీగా ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.60 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకున్నాడు. దీంతో తన వద్ద మిగిలిన రూ.1.2 కోట్లను బ్యాంకులో జమ చేయలేదు. సాధారణ మార్పిడి గడువు ముగియడంతో వాటిని మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనిపై బిల్డర్, చార్డెడ్ అకౌంటెంట్ అయిన స్నేహితులు కె.హరినాథ్‌బాబు, వి.రాజేంద్రనాథ్‌ను సంప్రదించాడు. తక్కువ మొత్తం మార్చరనేసరికి.. వీరికి సమీప బంధువైన రాజు తనకు ఆర్బీఐలో పరిచయాలున్నాయని, ఎంత మొత్తమైనా మారుస్తానని నమ్మబలికాడు. ఎన్ఆర్ఐలకు పాత నోట్ల మార్పిడీకి జూన్ 30 వరకు గడువు ఉందని, మార్పిడి చేయిస్తానని నమ్మించాడు. చిన్న మొత్తాల మార్పిడి సాధ్యం కాదని, రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తనకు పరిచయం ఉన్న ఆర్బీఐ అధికారులు 65 శాతం కమీషన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తారని చెప్పాడు. పరిచయస్తులు, స్నేహితులతో కలసి.. కళ్యాణ్‌ప్రసాద్ వద్ద రూ.1.2 కోట్లే ఉండటంతో పరిచయస్తులు, స్నేహితులను సంప్రదించాడు. పాత నోట్లుంటే మార్చేసుకుందామని చెప్పాడు. దీంతో మరో ఐదుగురు ముందుకు వచ్చారు. పంజగుట్టవా సి మహ్మద్ ఫారూఖ్(సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి) రూ.39.9 లక్షలు, ఆసిఫ్నగర్వాసి మీర్జా ముజఫర్ (బియ్యం వ్యాపారి) రూ.52.38 లక్షలు, బంజారాహిల్స్‌కు చెందిన గౌతమ్ అగర్వాల్(ముత్యాల వ్యాపారి) రూ.1.46 కోట్లు, చింతల్‌కు చెందిన వై.సూర్యప్రసాద్(విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి) రూ.50 వేలు, ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ముస్తాఫా సిద్ధిఖీ(విద్యార్థి) రూ.5 లక్షలు తీసుకువచ్చారు. హరినాథ్ రూ.50 లక్షలు, రాజేంద్రనాథ్ రూ.42.23 లక్షలు సమీకరించారు. గౌతమ్, ఫారూఖ్ తమ స్నేహితులైన రిషబ్, అష్మీ, హసన్ వద్ద ఉన్న నోట్లూ తీసుకొచ్చారు. రాజు కోసం ఎదురుచూస్తుండగా.. ఈ ఎనిమిది మంది మొత్తం రూ.4.41 కోట్ల విలువైన పాత నోట్లతో శ్రీనగర్‌కాలనీలోని గౌతమ్ ఇంటికి చేరుకుని రాజు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో దాడి చేసి ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న రాజు కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కిన తర్వాత విచారణలో ఆర్బీఐ అధికారుల పాత్ర వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. -
పశ్చిమలోకి అశ్వారావుపేట
జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం వాటి సరిహద్దు ప్రాంతాల్లో భౌగోళికంగా ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సరిహద్దు గ్రామాల మార్పు, చేర్పులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు పంపించినట్టు అధికార వర్గాల భోగట్టా. ఇందుకు కేంద్రం అనుమతి ఇస్తే మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అశ్వారావుపేట, ఆ మండల పరిధిలోని ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేలా.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుందని సమాచారం. సమస్యల పరిష్కారానికే.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు మన జిల్లాలో విలీనమయ్యాయి. అయితే, కుక్కునూరు నుంచి జీలుగుమిల్లి వరకు గల ప్రధాన రహదారి, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. కుక్కునూరు చేరుకోవాలంటే.. తెలంగాణ పరిధిలోగల అశ్వారావుపేట, ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితి వాహనాల రాకపోకలు, రెవెన్యూ విషయాల్లో సరిహద్దు సమస్యలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా ఆ ఐదు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకు ప్రతిగా.. తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. జాతీయ రహదారి సమస్య ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో జాతీయ రహదారి సమస్య కూడా తలెత్తింది. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు గల ప్రధాన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. భద్రాచలం, కుక్కునూరు ప్రాంతాల్లోని రహదారి మినహా అశ్వారావుపేట వరకు గల మార్గమంతా తెలంగాణలో ఉంది. అంతేగాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన అశ్వారావుపేట, వినాయకపురం, నారాయణపురం, ఆసుపాకల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలోని గ్రామాలకు మరో రాష్ట్ర సరిహద్దులను దాటుకుని వెళ్లాల్సి రావడంతో çసమస్య తలెత్తుతోంది. నియోజకవర్గం ఏర్పాటులోనూ.. నియోజకవర్గం ఏర్పాటు విషయంలోనూ సమస్యలు తలెత్తడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు, గ్రామాలను పరస్పరం మార్చుకునేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే విలీన మండలాలు, కొత్తగా కలిసే మండలాలు, గ్రామాలతో మన జిల్లా నైసర్గిక స్వరూపం మారుతుంది. -
ప్రభుత్వ సాయం కోరిన టీటీడీ
తిరుమల: పాత కరెన్సీ నోట్లు మార్పిడికి ఈ రోజు చివరి తేది కావడంతో టీటీడీ అధికారులు నోట్లు మార్పిడి కోసం ప్రభుత్వ సహాయం కోరారు. టీటీడీ బోర్డు వద్ద ప్రస్తుతం రద్దైన నోట్లు రూ. 12.7 కోట్లు ఉన్నాయి. ఈ నోట్లను మర్చడానికి ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతో.. శ్రీవారి ఆదాయానికి నష్టం వాటిల్లనుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గడువు ముగియనుండటంతో ప్రభుత్వం నోట్ల మార్పిడిలో సాయం చేయాలని కోరారు. -
చెన్నై ఆర్బీఐలో పాత నోట్ల మార్పు
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ కలిగి ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి రద్దయిన పెద్ద నోట్లను స్వీకరించడానికి అధికారం అప్పగించిన 5 కార్యాలయాలలో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఒకటని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి మేఘవాల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా మంత్రి జవాబిచ్చారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వ తేదీ వరకూ దేశంలో లేని భారతీయ పౌరులకు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడానికి వ్యవధి ఇచ్చారన్నారు. దేశంలో నివశిస్తున్న పౌరులకు వ్యవధి కాలం మార్చ్ 31వరకూ ఉందని, బయట దేశాలలో నివశిస్తున్న పౌరుల కోసం జూన్ 30 వరకూ వ్యవధి ఉందని మంత్రి చెప్పారు. భారతదేశంలో నివశిస్తున్న అర్హులైన భారతీయ పౌరులకు నోట్ల మార్పిడి కి ద్రవ్య పరిమితి లేదని,ఎన్నారై లకు మాత్రం ఫెమా నిబంధనలకు లోబడి పరిమితి ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. గత నెలాఖరు నాటికి ఏపీ నుంచి 509 మంది, తెలంగాణ నుంచి 301 మంది పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వారు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడం చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు చెన్నై లోని రిజర్వ్ బ్యాంక్ సందర్శిచడంతో త్వరిత గతిన సేవలు అందించడానికి అనువుగా డాక్యుమెంట్లను ధృవీకరించడానికి 7 గురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారని, సరైన డాక్యుమెంట్లు ఉన్నవారి వద్దనుంచి రద్దయిన నోట్లను స్వీకరించడానికి ప్రత్యేకంగా 3 కౌంటర్లను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వివరించారు. నిబంధనల ప్రకారం రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని, దివ్యాంగులు,సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని మంత్రి చెప్పారు. -
పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ధర్మాసనం నాసిక్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. రద్దయిన పెద్దనోట్లను భారీమొత్తంలో డిపాజిట్ చేయడానికి అనుమతిని సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.371కోట్ల పాత కరెన్సీనోట్ల మార్పిడికి అనుమతించాల్సిందిగా పెట్టుకున్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టి పారేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్32 ప్రకారం ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. నోట్ల జమకు ఆర్బీఐ నిరాకరించిడంతో కో ఆపరేటివ్ బ్యాంకు సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. ఈ నోట్ల జమకు అనుమతిని నిరాకరిస్తే..లిక్విడిటీ రేషియో దెబ్బతింటుందని, తద్వారా నాసిక్ జిల్లాలో 281 తమ కార్యాలయాలు మూతపడతాయని బ్యాంకు వాదించింది. 2016, నవంబర్ 8-14 మధ్య తమ ఖాతాదారులు జమ చేసిన సొమ్ము ఇది అనీ, ఎక్కువగా రైతులకు రుణాలను అందించే బ్యాంకు శాఖలు మూసివేత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందన్న బ్యాంకు వాదించింది. కోఆపరేటివ్ బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలను వినిపించారు. ఇది ఇలా ఉంటో మరోకేసులో కూడా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు ఎపెక్స్ కోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఎన్పీఏగా ప్రకటించిన రాను ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిరన రూ. 10కోట్లను పాత కరెన్సీమార్పిడికి అనుమతిని నిరాకరించింది. -
మోసగాళ్ల ముఠా అరెస్ట్
గోపాలపురం: మోసగాళ్ల ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు ఆదేశాల మేరకు గోపాలపురం సీఐ జి.శ్రీనివాస్ సోమవారం ఇక్కడ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 13న గోపాలపురానికి చెందిన వ్యాపారి సు తాపల్లి రామకృష్ణ వద్దకు మేకా త్రినాథ్, దాట్ల రవీంద్ర అనే వ్యక్తులు వచ్చారు. రూ.4 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తే రూ.30 వేలు కలిపి రూ.500 నోట్లు ఇస్తామని రామకృష్ణను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన రామకృష్ణ రూ.4 లక్షలు తీసుకువచ్చారు. త్రినాథ్, రవీంద్ర అప్పటికే సిద్ధం చేసిన రూ.4.30 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను రామకృష్ణకు ఇచ్చారు. అయితే వీటిలో కొన్ని అసలు నోట్లు, తెల్ల కాగితాలు, చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు ఉండటంతో కంగుతిన్న రామకృష్ణ ప్రశ్నించేలోపు వీరు జారుకున్నారు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన రామకృష్ణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేయగా ముఠాలో 13 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇదే తరహాలో భీమోలు రోడ్డు పోలవరం కాలువ వద్ద ముఠా సభ్యులు చర్చించుకుంటుండగా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మేకా త్రినాథ్, కొండే ప్రభాకర్, ఏలేటి చంద్రశేఖర్, మానుకొండ వంశీ, చలసాని వెంకట్, కూరపాటి మధు, పసలపూడి రాజును అరెస్ట్ చేసి రూ. రూ.1.20 లక్షలు, స్కార్పియో కారు, ఇండికా డీఎల్ఎస్ కారు, ఆటో, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై యు.లక్ష్మీనారాయణ, హెచ్‌సీలు రాజేం దర్, వైఎస్ సత్యనారాయణ, ఏఎస్సై వై.జయబాబు, ఐటీ పార్టీ సిబ్బంది రాజశేఖర్, మధు, పోశిబాబు, దుర్గారావు, గోవిందు, రాజుకు రివార్డులకోసం ఎస్ఫీకి సిఫార్సు చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. -
పాతనోట్లను మారుస్తున్న ముఠా గుట్టు రట్టు
-
జూదాల్లో జోరుగా దొంగనోట్లు
ఆకివీడు(ఉండి) : జూదాల్లో దొంగనోట్లు జోరుగా చలామణి అయ్యాయి. అయిభీమవరం గామంలోని ఎఫ్‌సీఐ గిడ్డంగి ప్రాంతంలోని కోడి పందేల బరిలో ఏర్పాటు చేసిన పేకాట కేంద్రంలో సోమవారం నకిలీ రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. కోతాట ఆడుతుండగా కృష్ణా జిల్లా పెదలంక గ్రామానికి చెందిన ఒక యువకుడు రూ.2వేల నోటును పందెంగా కాశాడు. దీనిని దొంగనోటుగా గుర్తించిన తోటì జూదరులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే పేకాట కేంద్రంలో సుమారు రూ.లక్షకుపైగా దొంగనోట్లు చలామణి అయ్యాయని తెలుస్తోంది. దీంతో అందరూ తమకు వచ్చిన నోట్లను చూసుకోగా, చాలామంది వద్ద దొంగనోట్లు కనిపించాయి. వారంతా లబోదిబోమన్నారు. ఇదే అదునుగా పేకాట కేంద్రాన్ని ఒక్కసారిగా ఎత్తివేసి కోతాటలో జూదరులు పందెంగా కాసిన రూ.3 లక్షలను నిర్వాహకులు స్వాహా చేశారు. భీమవరం గ్రామానికి చెందిన ముదుండి గణపతిరాజు మాట్లాడుతూ.. కోతాట కేంద్రాన్ని ఎత్తివేయడంతో తాను రూ.లక్షా50 వేలు నష్టపోయాయని ఆవేదన చెందాడు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన చోడదాసి గంగయ్య కూడా దొంగనోట్లతో నష్టపోయినట్టు చెప్పాడు. పేకాట కేంద్రంలో గత మూడు రోజులుగా సుమారు రూ.10 లక్షల విలువైన దొంగనోట్లు చలామణి అయిపోయాయని సమాచారం. పట్టుబడిన వ్యక్తి ఏమయ్యాడు? దొంగనోటు పందెం కాసి పట్టుబడిన కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి ఏమయ్యాడో ఎవరికీ తెలియడం లేదు. అతనికి దేహశుద్ధి చేసిన నిర్వాహకులు పంపించివేశారని కొందరు చెబుతుండగా, పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చామని ఇంకొందరు చెబుతున్నారు. కొంత మంది కష్ణాజిల్లా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా జాద క్రీడ నిర్వాహకుల కన్నుసన్నల్లోనే జరిగిందని జూదరులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉం డగా కోతాటలో ఉండి మండలం పాందు వ్వకు చెందిన వ్యక్తి రూ.వెయ్యి పందెం కాయగా, రూ. 2 వేలు నోటు ఇచ్చారు. అది దొంగనోటని తరువాత తెలిసింది. దీంతో అతను లబోదిబోమంటున్నాడు. దొంగనోటు ఇలా.. పట్టుబడిన దొంగనోటులో తెల్లభాగం వద్ద గాంధీ బొమ్మ వాటర్ మార్క్ లేదు. కాగితం మధ్య భాగంలో మెరిసే థ్రెడ్(ఆర్బీఐ) సిల్కు దారం కూడా లేదు. కాగితం ఫోటోస్టాట్ పేపరుగా ఉంది. -
‘పిల్లల నోట్ల’తో పంగనామం
జంగారెడ్డిగూడెం : నోట్ల మార్పిడి పేరిట పిల్లలు ఆడుకునే నోట్లు ఇచ్చి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లతో ఉండాయించిన ఓ ముఠా ఘరానా మోసమిది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కమీషన్‌కు కక్కుర్తిపడి మధ్యవర్తిగా ఉన్న పాపానికి ఓ వ్యక్తి చిత్రవధ అనుభవిస్తున్నాడు. దీనిపై బాధితుడు దాట్ల రవీందర్ పోలీసులను ఆశ్రయించాడు. అతని కథనం ప్రకారం.. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన గిరిజనుడైన దాట్ల రవీందర్‌కు డిసెంబర్ 20న ఏలేటి శేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ వద్ద రూ.5లక్షల విలువైన రూ.500 పాత నోట్లు ఉన్నాయని, కొత్తనోట్లు కావాలని అడిగాడు. రూ.4 లక్షలు ఇస్తే మిగిలిన రూ.లక్ష కమీష¯ŒSగా తీసుకోవచ్చని ఆశ చూపాడు. దీంతో రవీందర్ తన వద్ద కొత్తనోట్లు లేవని, గోపాలపురానికి చెందిన సుతాపల్లి రామకృష్ణ వద్ద ఉన్నాయని, తాను మార్చి పెడతానని ఒప్పుకున్నాడు. సుతాపల్లి రామకృష్ణతో మాట్లాడి అతనికి పాత రూ.500 నోట్లు రూ.4.50 లక్షలు ఇచ్చేలా, మిగిలిన రూ. 50వేలు రవీందర్ కమీషన్‌గా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు డిసెంబర్ 21న సాయంత్రం గోపాలపురం గుడ్డిగూడెం రోడ్డులోని నిద్రగన్నేరు చెట్టు వద్దకు నగదు తీసుకుని రావాలని జంగారెడ్డిగూడెంలో సెల్‌షాపు నిర్వహిస్తున్న వెంకట్ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో రవీందర్, సుతాపల్లి రామకృష్ణ , త్రినా«థ్ అనే మరోవ్యక్తి రూ.4 లక్షలు (రూ.2వేల కొత్తనోట్లు) తీసుకుని వెళ్లారు. అక్కడకు వంశీ, కోన రవి అలియాస్ జాన్ అనే వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి మైకా కవర్లో ప్యాక్ చేసిన రూ.500 పాత నోట్ల కట్టలు తెచ్చి వీరికిచ్చి, వీరి నుంచి కొత్త రూ. 2వేల నోట్లు రూ.4లక్షలు తీసుకుని మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్లిపోయారు. మైకా కవర్లో ఉన్న బండిల్ తీసి చూసే సరికి అవి పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500నోట్లుగా గుర్తించారు. దీంతో అసలు నగదు ఇచ్చిన సుతాపల్లి రామకృష్ణ గోపాలపురంలోని ఒక టీడీపీ నేత వద్ద అదే రోజు రాత్రి పంచాయితీ పెట్టాడు. దీంతో దాట్ల రవీందర్‌తోపాటు అతనితో ఉన్న స్నేహితుడు ప్రసాద్‌ను టీడీపీ నేత పిలిపించి నిర్బంధించాడు. పోలీసులకు ఇవ్వాలని రవీందర్ నుంచి రూ.25వేలు తీసుకున్నాడు. అయినా వారిని వదలకుండా ఆ రోజు రాత్రంతా ఇద్దరినీ నిర్బంధించి తీవ్రంగా కొట్టాడు. డిసెంబర్ 22న సాయంత్రం వారి నుంచి రెండు ఖాళీ చెక్కులు, రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని వదిలారు. సుతాపల్లి రామకృష్ణ పోగొట్టుకున్న రూ.నాలుగు లక్షల్లో రూ.లక్షను డిసెంబర్ 31న రవీందర్ చెల్లించాడు. మిగిలిన సొమ్ము కోసం గోపాలపురానికి చెందిన టీడీపీ నేత రవీందర్‌ను వేధిస్తున్నాడు. దీంతో రవీందర్ ఈనెల 4న పోలీసులను ఆశ్రయించాడు. దొంగనోట్ల ముఠా పనే దొంగనోట్లు మార్చే కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి రవీందర్‌కు ఉచ్చువేసినట్ట తెలుస్తోంది. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న వ్యక్తులు గతంలో దొంగనోట్ల కేసులో అరెస్టైన వారే. ద్వారకాతిరుమల మండలం తూరల లక్షీ్మపురం గ్రామానికి చెందిన సుంకర ఆంజనేయులు, కోన రవి, జంగారెడ్డిగూడానికి చెందిన వెంకట్ , వంశీ, గోపాలపురం మండలం పెద్దగూడానికి చెందిన ఏలేటి శేఖర్, మధు, బుచ్చియపాలెంకు చెందిన కొండే ప్రభాకర్ ఒక ముఠాగా ఏర్పడి ఏలేటి శేఖర్ ద్వారా రవీందర్‌కు ఫోన్ చేయించి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లు కొట్టేశారు. 4న పోలీసులకు ఫిర్యాదు ఈనెల 4న రవీందర్ జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావుకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ గోపాలపురం పోలీసులకు కేసు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం మొత్తం తనకు తెలుసునని ప్రభాకర్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. తాను వ్యవహారం సెటిల్చేస్తానని, రూ. 4లక్షలు అంతా పంచేసుకున్నారని, తనకు రూ.లక్ష ఇస్తే వ్యవహారం సెటిల్ చేస్తానని రవీందర్‌కు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఇంతలో పూర్వం నుంచి దొంగనోట్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న సుంకర ఆంజనేయులును తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పోలీసులు విచారణ కోసం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500 నోట్లు గోపాలపురానికి చెందిన తెలుగుదేశం నాయకుడు తనవద్దే ఉంచుకుని రవీందర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. విచారణ చేస్తున్నాం నోట్ల మార్పిడి కేసును విచారణ చేస్తున్నాం. దీనిని లోతుగా విచారణ చేయాలని జంగారెడ్డిగూడెం సీఐ, గోపాలపురం ఎస్సైలను ఆదేశించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. దీనిపై ప్రత్యేక సిబ్బందిని కూడా నియమిస్తాం – జె.వెంకటరావు, డీఎస్పీ -
బ్యాంకర్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత మూడు రోజులపాటు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించి కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే. అయితే, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేశారు. వీరిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలు కాలేదు. తణుకు కేంద్రంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లధనాన్ని తెలుపు చేశారన్న పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతి నిధులు వివిధ మార్గాల్లో నల్లధనాన్ని మార్చగా, ఎక్కువ మంది బ్యాంకర్ల ద్వారా కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన అనుచరులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి ద్వారా బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో సొమ్ములను డిపాజిట్టు చేయించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఇంటికి రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను ఇచ్చారు. వీటిని మూడు బ్యాంకుల్లో జనధన్ ఖాతాలకు, డ్వాక్రా ఖాతాలకు, సేవింగ్స్ ఖాతాలకు మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్బీఐ, ఇతర ప్రధాన బ్యాంకులతోపాటు పలు ప్రైవేటు బ్యాంకుల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సొమ్మును తెలుపు చేసుకోగలిగారు. ఇదిలావుంటే.. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా జరిగిన అక్రమ లావాదేవీలు తాజాగా వెలుగు చూడటంతో ఇందుకు సహకరించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు వేటు వేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో ఒకే రోజు రూ.2.49 కోట్లు విత్‌డ్రాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. వీరితోపాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారుల పైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల తణుకు పట్టణంలో కొందరు వ్యాపారులు, బిల్డర్లతోపాటు బ్యాంకు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్దఎత్తున అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా వీరి నుంచి కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఆర్బీఐ, సీబీఐ అధికారులు జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తమ వ్యవహారాలు బయటకు పొక్కకుండా పలువురు ప్రజాప్రతినిధులు జాగ్రత్త పడుతుండగా.. ఎటుతిరిగి ఎటు వస్తుందోనని జిల్లాలోని బ్యాంకుల అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. -
రూపాయి మళ్లీ 68 దిగువకు
30 పైసల క్షీణతతో 68.22 వద్ద ముగింపు కొత్త ఏడాది తొలి రోజు రూపాయి బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం సోమవారం 30 పైసలు క్షీణించి 68.22 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో డాలర్ల కోసం డిమాండ్ బాగా ఉండటంతో రూపాయి ఈ స్థాయిలో పతనమైంది. విదేశీ నిధులు భారీగా తరలిపోతుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ట్రేడ్ కావడం, డాలర్ల కోసం దిగుమతిదారులు, కార్పొరేట్ల నుంచి డిమాండ్ భారీగా ఉండడం... రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయని ఫారెక్స్డీలర్ ఒకరు వ్యాఖ్యానించారు. వరుసగా ఆరో ఏడాదీ పతనం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(67.92) తో పోల్చితే సోమవారం 67.95 నష్టాల్లోనే ప్రారంభమైంది. ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఇంట్రాడేలో 68.25 కనిష్ట స్థాయిని తాకిన రూపాయి చివరకు 30 పైసల(0.44 శాతం) నష్టంతో 68.22 వద్ద ముగిసింది. ఇక గత ఏడాది రూపాయి 2.68 శాతం నష్టపోయింది. రూపాయి పతనం కావడం ఇది వరుసగా ఆరో ఏడాది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచిన నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. -
నల్ల వ్యవహారం బట్టబయలు
తణుకు : ఒకే ఆధార్ కార్డు.. 50 జిరాక్సు కాపీలతో నగదు మార్పిడి చేసిన వ్యవహారం బట్టబయలైంది. ఇతర ఖాతాల ద్వారా కొత్తనోట్లు బదిలీ చేసిన వ్యవహారం వెలుగుచూసింది. తణుకు ఎస్బీఐ ప్రధాన కేంద్రంగా సాగిన అక్రమ లావాదేవీలు బయటపడటంతో.. దీనికి బాధ్యుడిగా భావిస్తూ ఆ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. బడా బాబులకు నోట్లు కట్టబెట్టడానికి కొందరు బ్యాంకు అధికారులు సహకరిస్తున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా దర్యాప్తు మొదలైంది. సుమారు వారం రోజులపాటు తణుకు ఎస్బీఐ ప్రధాన శాఖలో ఆర్బీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 9, 10, 11 తేదీల్లో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు అధికారులు లావాదేవీలు జరిపినట్టు భావిస్తున్నారు. ఏజీఎం కృష్ణారావును గత బుధవారమే విజయవాడ కేంద్ర కార్యాలయానికి అటాచ్ చేసి టి.సునిల్‌కుమార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదినుంచీ అనుమానమే.. కొందరు నల్ల కుబేరులకు నోట్లు చేరవేతలో తణుకు పట్టణంలోని కొన్ని బ్యాంకులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇందులో తణుకు ఎస్బీఐ శాఖ ప్రధాన భూమిక పోషించినట్టు సమాచారం. సాధారణంగా ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు ఎస్బీఐ శాఖలను రిజర్వు బ్యాంకు చెస్ట్లుగా పిలుస్తుంటారు. రిజర్వు బ్యాంకు నుంచి నేరుగా ఇక్కడికే నగదు వస్తుంటుంది. అయితే నోట్ల్ల రద్దు అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తణుకు చెస్ట్‌లో రూ.10 కోట్లు పరిమితి కాగా సాధారణ రోజుల్లో రోజుకు రూ.10 కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం రోజుకు రూ.కోటిలోపు నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత 9, 10, 11 తేదీల్లో నగదు చెల్లింపుల్లో రిజర్వు బ్యాంకు నిబంధనలు పాటించాలనే ఆదేశాలున్నాయి. వాటిని బేఖాతరు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్టు భోగట్టా. నిబంధనల మేరకు ఖాతాలున్న వారికి వారానికి రూ.24 వేల చొప్పున నెలకు రూ. 96 వేలు పొందే అవకాశం ఉంది. కరెంట్ ఖాతాదారు వారానికి రూ.50 వేల చొప్పున నెలకు రూ.2 లక్షలు మాత్రమే తీసుకోవాలి. బ్యాంక్ ఖాతాలు లేనివారి నుంచి రోజుకు రూ.4 వేలు పాత నోట్లు తీసుకుని అదే మొత్తంలో కొత్త నోట్లు ఇవ్వాలనే నిబంధన విధించారు. పా¯ŒSకార్డు లేని వారి నుంచి రూ.49 వేలు పరిమితి వరకు డిపాజిట్లు చేయించుకున్నారు. అయితే బడాబాబుల నుంచి అందిన లక్షలాది రూపాయలను నమ్మకస్తుల ఖాతాల్లోకి రూ.49 వేలు చొప్పున పాత నోట్లు భారీగా డిపాజిట్ చేసి, తరువాత వారి ఖాతాలకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు ఎస్బీఐ ఏజీఎం కృష్ణారావు సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఏజీఎం కృష్ణారావు ఎవరెవరికి సహకరించారు, ఎంత మొత్తంలో నల్లధనం మారిందనే విషయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వ్యవహారం బట్టబయలు కావడంతో ఎవరి పేర్లు బయటకు వస్తాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పట్టణంలోని మరో జాతీయ బ్యాంకులోనూ ఈ తరహా అక్రమాలు జరిగాయనే ప్రచారం ఉంది. దీనిపైనా అధికారులు ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
ఆగని ఆర్బీఐ అధికారుల అక్రమాలు
బెంగళూరు: డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు అధి్కారుల అక్రమాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంకు సీనియర్ ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాల్సిన ఆర్బీఐ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగదు మార్పిడి చేస్తున్న మరో ఇద్దరు ఆర్ బీఐ సిబ్బందిని సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నైకా కాగా, మరొకరు స్పెషల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్మెంట్ ఏకే కేవిన్ అని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.1.99 కోట్ల పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపనలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా అక్రమ నోట్ల మార్పిడి కేసులో బెంగళూరు ఇది రెండవ కేసు. డిసెంబర్13 బెంగళూరులో ఆర్బీఐ అధికారి(రూ.1. 51కోట్లు)మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
నోట్ల మార్పిడి నిందితుల లొంగుబాటు
వెలుగోడు: నోట్ల మార్పిడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు బుధవారం వెలుగోడు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..ఈ నెల 9న నోట్లు మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఆత్మకూరు పోలీసులకు ఇద్దరు సభ్యులు పట్టుబడ్డారు. వీరిలో సంజీవగౌడ్, రవితేజారెడ్డి ఉన్నారు. మిగిలిన ప్రసాద్, సుధాకర్ పరారీలో ఉండగా, వారు బుధవారం పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్ఐ వివరించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డి, ఆంజనేయులును అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
పోలీసుల అదుపులో నోట్ల మార్పిడి ముఠా
- సినీఫక్కీలో చేజింగ్ - కొనసాగుతున్న విచారణ బండిఆత్మకూరు: నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సినీ ఫక్కీలో శుక్రవారం రాత్రి చేజింగ్ చేయాల్సి వచ్చింది. బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు వద్ద ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకోగా, వెలుగోడు వద్ద ఆర్టీసీ వాహనంలో వెళుతున్న మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని మొత్తం ఐదుగురుని విచారిస్తున్నారు. అంతేగాక తప్పించుకున్న మరో ముగ్గురు కోసం విచారిస్తున్నారు. అయితే ఈ చేజింగ్‌లో డబ్బు లెక్కపెట్టె మిషన్ వారి వద్ద లభించినట్లు, నగదు లభించలేదని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమాచార మిలా.. ఆత్మకూరులో శుక్రవారం రాత్రి నోట్ల మార్పిడి ముఠా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు వారిని వెంబడించగా వారు టయోటా వాహనంలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు పోలీసుల నుంచి వెలుగోడు, బండిఆత్మకూరు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. చేజింగ్ ఇలా.. వెలుగోడు పోలీసులు అప్రమత్తమై ట్రాక్టర్‌ను రోడ్డుకు అడ్డంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెప్పపాట కాలంలో టయోటా వాహనం ఆగకుండా వెళ్లింది. ఆ తర్వాత బండిఆత్మకూరు పోలీసులు సైతం వచ్చి బస్టాండ్ వద్ద వేచి చూశారు. దీంతో టయోటా వాహనంలో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై తమ వాహనాన్ని ఓంకార క్షేత్రం వైపు తిప్పారు. ఆ వాహనం అటువైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు బోలెరో వాహనంతో వెంబడించారు. ఈ క్రమంలో టయోటా వాహనం సింగవరం, సోమయాజులపల్లె గ్రామం దాటి తెలుగుగంగ కాల్వ ప్రధాన కట్టపై నుంచి మణికంఠాపురం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. టయోటా వాహనం వెళుతున్న సమాచారాన్ని ఎస్ఐ విష్ణునారాయణకు చేరవేశారు. దీంతో ఈర్నపాడు వద్దకు ఎస్ఐ చేరుకొని ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డుగా ఉంచి కాపు కాశారు. ఈ క్రమంలో కొద్ది సేపటికి టయోటా వాహనం వచ్చింది. వాహనంలో ఉన్న వ్యక్తులు దిగి పరిగెత్తే ప్రయత్నం చేశారు. వెంటనే ఎస్ఐ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు తప్పించుకొని పారిపోయారు. బనగానపల్లె వ్యక్తులు.. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు బనగానపల్లెలోని ఒక ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ క్రమంలో టయోటా వాహనంలో నుంచి దిగి తప్పించుకున్న ముగ్గురు వ్యక్తులు ఈర్నపాడు గ్రామంలోని ఒక వ్యక్తి బాత్రూంలో తల దాచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి వెళ్లినట్లు పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులకు పొలాల్లో డబ్బు లెక్క పెట్టే యంత్రం లభించినట్లు తెలుస్తోంది. ఎటువంటి నగదు దొరకలేదని సమాచారం. ఆర్టీసీ బస్సులో మరో ముగ్గురు వ్యక్తులు.. వెలుగోడు పోలీసులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదే సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం టయోటా వాహనంలో వెళ్తున్న వీరికి ఆర్టీసీ బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్న అనుమానితులకు గల సంబంధాల గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు టయోటా వాహనం దిగి ఆత్మకూరు సమీపంలో ఉన్న నల్లకాల్వ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, తాలూకా సీఐ మురళీధర్‌రెడ్డి శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారమంతా ఆత్మకూరులోని ఒక హోటల్లో నోట్ల మార్పి భారీ ఎత్తున జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
కొత్త నోటు.. ఇట్టే పట్టు!
డోర్ డెలివరీ వ్యాపారం – 10 శాతం కమీషన్ ఇస్తే చాలు – చర్చనీయాంశంగా మారిన ముఠా ఆగడాలు – భారీ మొత్తంలో కొత్త కరెన్సీ సర్క్యులేషన్ – మొదట్లో ఏకంగా 30 శాతం కమీషన్ రూ.500 మించి మందులు(మెడిసిన్స్) కొనుగోలు చేస్తే మీ ఇంటికే పంపుతాం. – ఓ మెడికల్ షాప్ ప్రకటన మీరు రూ.2 వేలకు మించి సరుకులు కొనుగోలు చేస్తే మీ ఇంటి వద్దకే సరుకులు తెచ్చిస్తాం. ఇవీ మార్కెట్లో సాధారణంగా కనిపించే వ్యాపార ప్రకటనలు. తాజాగా రూ.1.10లక్షల పాత కరెన్సీ ఇస్తే.. లక్ష రూపాయల కొత్త కరెన్సీ డోర్ డెలివరీ చేస్తాం అంటూ ఓ ముఠా ప్రచారం చేసుకుంటోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కొత్త కరెన్సీ రాకతో రోజుకో కొత్త తరహా వ్యాపారం తెరపైకి వస్తోంది. బ్లాక్ మనీని మార్చుకోవడం ఎంత సులువైన విషయమో రోజుకో కొత్త ప్రచారం చూస్తే అర్థమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని లక్షలు కావాలన్నా చెప్పండి.. మీ ఇంటి వద్దకే వచ్చి కరెన్సీ ఇస్తామంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎలాంటి తనిఖీల ఇబ్బంది లేకుండా కొత్తగా నిగనిగలాడే రూ.2వేల నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు రూ.2వేలకే గంటలకొద్దీ లైన్లలో వేచి చూస్తున్న సాధారణ జనం.. మరోవైపు లక్షలకు లక్షల కొత్త కరెన్సీని ఇంత సులభంగా కరెన్సీ ముఠా ఎలా తేగలుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొదట్లో 30 శాతం వరకూ ఉన్న కమీషన్ కాస్తా తాజాగా 10 శాతానికి పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 8 శాతం కమిషన్‌తోనూ నల్లధనాన్ని సులభంగా తెల్లధనం చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. కరెన్సీ మార్పిడి పేరుతో నకిలీ ముఠాలు కూడా జిల్లాలో సంచరిస్తున్నాయి. డబ్బున్న వాళ్లను గుర్తించి దోచుకునేందుకు కొత్త ఎత్తుగడతో తెరపైకి వస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు క్యూలు.. మరోవైపు...! – ఒకవైపు కేవలం రూ.2 వేల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏటీఎంలో వేచిచూస్తున్న సాధారణ జనం! – వచ్చిన జీతాన్ని తీసుకునేందుకు బ్యాంకు వద్ద క్యూలో ఉదయం నుంచి నిల్చుంటే కేవలం రూ.4 వేలు మాత్రమే ఇస్తామని చల్లగా మధ్యాహ్నం సమయంలో తేల్చిచెబుతున్న బ్యాంకర్లు!! – మరోవైపు లక్షా 10 వేలు ఇవ్వండి చాలు.. అక్షరాలా లక్ష రూపాయల కొత్త రూ.2 వేల నోట్ల కరెన్సీ ఇస్తామంటున్న ఏజెంట్లు!!! ఇదీ జిల్లాలో హెచ్చుమీరుతున్న కరెన్సీ ముఠా ఆగడాలకు సాక్ష్యం. అది కూడా నేరుగా ఇంటికే చేరుస్తామని(డోర్ డెలివరీ) కూడా చెబుతుండటం గమనార్హం. బ్యాంకుల చుట్టూ గంటలకు గంటలు తిరిగితే తప్ప రూ.2 వేలు సాధారణ జనం పొందలేకపోతుంటే...లక్షలకు లక్షలు కొత్త కరెన్సీ ఏ విధంగా కరెన్సీ ముఠా చేతికి వచ్చిందనే విషయం అర్థం కాని పరిస్థితి. అయితే, బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత సులభంగా కొత్త కరెన్సీ మార్కెట్లో లభించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారణ జరిగితే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, ప్రధానంగా బళ్లారి నుంచి భారీగా కొత్త నగదు జిల్లాలోకి వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. 30 శాతం నుంచి 8 శాతానికి.. వాస్తవానికి నోట్ల రద్దు ప్రకటన కొత్తలో ఏకంగా 30 శాతం కమీషన్ నడిచింది. అంటే పాత నోట్ల మొత్తం లక్ష రూపాయలు ఇస్తే.. రూ.70 వేల కొత్త కరెన్సీ ఇచ్చేవారు. అయితే, రానురాను సులభంగా కొత్త కరెన్సీ ముఠాకు వచ్చిపడుతోంది. దీంతో క్రమంగా కమీషన్ మొత్తాన్ని 30 నుంచి 20 శాతానికి.. ఆ తర్వాత 15 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 10 శాతం కమీషన్ నడుస్తోందని సమాచారం. ఇంకా బేరమాడితే 8 శాతానికి కూడా నగదును సులభంగా ఈ ముఠాలు మారుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే అదనుగా కరెన్సీ మారుస్తామంటూ నకిలీ ముఠాలు తెరమీదకు వస్తున్నాయి. నిరంతరం దాడులు చేస్తాం కరెన్సీ మారుస్తామంటూ కొన్ని ముఠాలు జిల్లాలో బయలుదేరాయి. జిల్లా అంతటా ఇప్పటికే అప్రమత్తం చేశాం. అందుకే ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నాం. కరెన్సీ ముఠాల గురించి పోలీసులకు సమాచారం ఇస్తాం. నకిలీ ముఠాలు కూడా బయలుదేరాయి. ఆదోని గ్యాంగు వద్ద కూడా నగదు లేదు. కేవలం రూమర్లను సృష్టించి.. డబ్బున్న వాళ్లను గుర్తిస్తున్నారు. – ఆకే రవికృష్ణ, జిల్లా సూపరింటెండెంట్ -
కేటుగాళ్లకు కొత్త నోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంటల తరబడి క్యూలో నిలబడితే.. చివరకు బ్యాంకర్లు దయతలిస్తే సామాన్యుడి చేతికొచ్చేది మహా అయితే రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే. బ్యాంకు ఏటీఎం ఎదుట క్యూలో నిలబడితే వచ్చేది రోజుకు ఒక్కటే నోటు. బాగా పలుకుబడి ఉంటేగాని బ్యాంకులో మూడు నాలుగు నోట్లు తీసుకోవడం సాధ్యం కాదు. ఇదీ వాస్తవ పరిస్థితి. కానీ.. కొంతమంది వద్ద లక్షలాది రూపాయల విలువ చేసే కొత్త నోట్ల కట్టలు ఉంటున్నాయి. పకడ్బందీగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరాల్సిన ఈ నోట్లు బయటకు ఎలా వస్తున్నాయన్నది అంతుబట్టడం లేదు. బ్యాంకుల సిబ్బంది, మేనేజర్ల సహకారం లేకుండా ఒక్క నోటు కూడా బయటకు రాదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలో మాత్రం చాలా సునాయాసంగా రూ.2 వేల నోట్ల కట్టలు బయటకు వచ్చేస్తున్నాయి. బ్యాంకు మేనేజర్‌కు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీష¯ŒS ఇస్తే ఎన్ని కావాలంటే అన్ని లక్షలు మార్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి జిలావ్యాప్తంగా ఉన్నట్టు ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వారం క్రితం రూ.24 లక్షల రూపాయలు మార్చుకునేందుకు యత్నించిన వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడకు చెందిన విజయ్ అగర్వాల్‌తోపాటు, కార్ యాక్ససరీస్ పనిచేసే అంచెల రవికుమార్ సహా 8మంది పోలీసులకు పట్టుబడ్డారు. అగర్వాల్, రవికుమార్ అనేవారికి ఏలూరులో మెకానిక్‌గా పనిచేసే రవితో పరిచయం ఉంది. అతను నాలుగు శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మార్చుకుంటానని చెప్పడంతో వారు ఏలూరు వచ్చారు. సోమవరప్పాడు పొలాల్లో ఉండగా పోలీసులకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రూ.24 లక్షల నగదు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే డబ్బులు మార్చుకునేవారు మాత్రం పట్టుపడలేదు. సుమారు రూ.రెండు కోట్లు మార్చుకునేందుకు డీల్ కుదిరిందని, ఈ ప్రయత్నంలో వారు పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరిగినా సూత్రధారులు బయటకు రాలేదు. పోలీసులు డబ్బులు దొరకగానే కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం వారి నుంచి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఏలూరు వ¯ŒSటౌ¯ŒSలోని సూర్యా అపార్ట్మెంట్లో ఎలబాక బాలకృష్ణ సహా ఐదుగుర్ని అరెస్ట్ చేసి రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వడ్రంగి మేస్రి్తగా పని చేస్తున్నాడు. అతని వద్ద అంత డబ్బు ఉండే అవకాశం లేదు. తాను వేర్వేరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నానని బాలకృష్ణ చెబుతున్నాడు. అప్పు తీసుకున్నా రూ.2 వేల కొత్త నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును కూడా గాలికి వదిలివేయకుండా లోతుగా దర్యాప్తు చేస్తే నోట్ల మార్పిడి వెనుక సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం తాడేపల్లిగూడెంలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తుండగా మాడెం గోపీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.3.56 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను లక్షకు 12 శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
నల్లధనం మార్చేవారిని వదలిపెట్టేది లేదు
ఆర్థికశాఖ హెచ్చరిక... న్యూఢిల్లీ: నల్లధనం మార్పిడిలో ఉన్న వారికి కేంద్ర ఆర్థిక శాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడేవారిని, అక్రమార్జనను సక్రమంగా మార్చుకునే వారిని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేసింది. చట్ట బద్ధమైన సంస్థలు ఇప్పటికే ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకునే పనిలో ఉన్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఫలితాలు ఇప్పటికే కనిపించాయని, రానున్న రోజుల్లో మరింత ప్రస్ఫుటమవుతాయన్నారు. పన్ను చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ఇటీవలే లోక్ సభలో ఓ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది చట్టరూపం దాలిస్తే నోట్ల రద్దు ప్రకటన తర్వాత లెక్కలు చూపని ఆదాయంతో పట్టుబడ్డ వారి నుంచి పన్నులు, జరిమానా రూపంలో 85 శాతం రాబట్టనున్నట్టు ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే తెలిపారు. -
నల్లధనం మార్పిడి ముఠా అరెస్ట్
సూర్యాపేట :నల్లధనం మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట ఎస్పీ పరిమళహననూతన్ అరెస్ట్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను, బట్టిపల్లి వెంకటరమణ, పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్య, లింగాల గ్రామానికి చెందిన కేసరి శోభ, నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన శానం వీరభద్రయ్య, గడ్డిపల్లికి చెందిన సంధ్యాల సతీష్‌తో పాటు కుత్బుషాపురం గ్రామ సర్పంచ్‌శ్రీనివాస్, గడ్డిపల్లి గ్రామ ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, ఆరెపురి నారాయణ, దేనుట్ల నాగరాజు, నీలకంఠ రాంబాబులు ముఠాగా ఏర్పడ్డారు.. స్వైపింగ్ మిషన్‌తో వ్యాపారం చేస్తున్న మహిళ, ఇరత బ్యాంకు ఖాతాదారులు 12 మంది ముఠాగా ఏర్పడి 10 నుంచి 30 వరకు పర్సంటేజీలు కట్‌చేసుకొని పాత నోట్లకు కొత్త నోట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వీరిలో ప్రధానంగా గడ్డిపల్లికి చెందిన గడగాని శ్రీను గతంలో ఎస్బీహెచ్లో డ్రైవర్‌గా పనిచేశాడని.. పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామానికి చెందిన కేసరి రంగారెడ్డి, బక్కయ్యగూడేనికి చెందిన సానం రామయ్యలు గతంలో బ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఈ నోట్ల మార్పిడికి పాల్పడ్డారని చెప్పారు. వీరంతా తమకున్న పరిచయాలతో 14 మంది బ్యాంకు ఖాతాదారుల పాస్‌బుక్‌లను తమ వద్దకు తీసుకుని వాటిల్లో బ్లాక్‌మనీ జమచేశారన్నారు. వెంటనే పలువురుకి రోజుకు రూ.200 నుంచి రూ.500 మేరకు కూలీ ఇచ్చి బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టేవారని.. ఇలా అకౌంట్లలో వేయడం. తిరిగి తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే రూ.4 లక్షలను పదిశాతం తీసుకుని రూ.3.60 లక్షలు చెల్లించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ముఠాను పట్టుకునేందుకు గరిడేపల్లి, పెన్‌పహాడ్ పోలీసుల ఆధ్వర్యంలో వీరిపై నిఘా ఏర్పాటుచేశామని.. ఈ నేపథ్యంలోనే ఈనెల 22న లింగాల పెట్రోల్ బంకు సమీపంలో డబ్బులు మార్పిడి చేస్తూ.. పట్టుబడ్డారని వివరించారు. వీరి వద్ద నుంచి రూ.3.10 లక్షల కొత్త నోట్లు, రూ.86. 500 వేలు రూ.వెరుు్య పాత నోట్లను స్వాధీనం చేసుకున్నామని. చెప్పారు. వీరిపై ఐపీసీ 406,409, 420, 180ఆర్/డబ్ల్యూ, 109, 511 కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సహించేది లేదని నోట్ల మార్పిడిలో కమీషన్లకు పాల్పడినవారితో పాటు అందుకు సహకరించిన వారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీహెచ్చరించారు. వీరికి సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కూడా ఆరా తీస్తున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాత కరెన్సీ నోట్లు..ఓ తీపి కబురు
న్యూడిల్లీ: పెద్దనోట్ల మార్పిడికి రాం రాం పలికిన ప్రభుత్వం నిర్ణయంతో దిగాలుపడిన ప్రజలకు ఆర్బీఐ కొంత ఊరటనిచ్చింది. రద్దయిన రూ.500 మరియు 1,000 కరెన్సీ నోట్లు మార్పిడి సదుపాయం రిజర్వ్ బ్యాంక్ ఇండియా కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అన్ని బ్యాంకుల్లోనూ రద్దయిన నోట్ల మార్పిడి సౌకర్యం అందుబాటులో లేనప్పటికీ.. తమ దగ్గర మార్చుకోవచ్చని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఈ పాత నోట్ల మార్పిడికి (మనిషికి రూ.2000 లు చొప్పున) అనుమతిని స్తున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ మార్పిడి సౌకర్యం ఇతర బ్యాంకుల కౌంటర్ల వద్ద అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. కాగా పాతనోట్ల మార్పిడిని ఇకపై రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ప్రకటన జారీ చేసింది. అలాగే రూ.500 పాత కరెన్సీ నోట్ల ద్వారా కొన్ని చెల్లింపులకు డిసెంబర్ 15 దాకా గడువును పెంచిన సంగతి తెలిసిందే. -
నోట్లు మార్పిడి కోసం RBI వద్ద ఇంక క్యూ
-
విశాఖలో కొత్త నోట్ల దందా గుట్టు రట్టు
-
ఆత్మకూరులో రూ. 2వేల దొంగనోట్లు
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో రూ. 2 వేల దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోమవారం ఆర్టీసీ కండెక్టర్‌ను దొంగ నోటుతో ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కండెక్టర్ శివుడు వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. శ్రీశైలానికి వెళ్లి వచ్చామని, కర్నూలు వెళ్లేందుకు రూ. 2వేలకు చిల్లర ఇవ్వాలని నకిలీనోటు ఇచ్చి చిల్లర తీసుకుని జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కండెక్టర్ కలెక్షన్‌ను చెల్లించేందుకు క్యాష్ కౌంటర్‌కు వెళ్లాడు. కంట్రోలర్ నోట్లను చెక్ చేస్తుండగా రూ.2వేల నకిలీ నోటు బయటపడింది. ఈ నకిలీ నోటు నంబర్ 9బీఎం 608080. తనకు దొంగనోటు ఇచ్చిన వ్యక్తి కోసం బస్టాండ్‌తో పాటు చక్రం హోటల్, ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు గుర్తించేందుకు గాలించినా ఎక్కడా కనిపించలేదు. దీంతో కండెక్టర్ తన సొంత డబ్బును కౌంటర్లో చెల్లించాల్సి వచ్చింది. -
డోర్‌డెలివరీ!
* ప్రజాప్రతినిధి అండతో నోట్ల మార్పిడి దందా * విజయవాడ కేంద్రంగా సాగుతున్న రాకెట్ * 30శాతం కమీషన్‌పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి * పోలీసుల అదుపులో ఓ ముఠా * కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు ! ‘రూ.లక్ష పాత నోట్లకు... రూ.70వేలు కొత్త నోట్లు... మంచి తరుణం మించిన దొరకదు.. వెంటనే రండి... ఎంతైనా మారుస్తాం.. మీకు అనువైన ప్రాంతానికే వస్తాం. ఏదైనా ఇబ్బంది వస్తే అన్న చూసుకుంటారు..’ ఇదీ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతున్న నోట్ల మార్పిడి దందా. పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు భారీ దందాకు తెరతీశారు. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొందరు బ్యాంకు అధికారులు వీరికి సహకరిస్తున్నారు. దీంతో బ్యాంకుల నుంచి దొడ్డిదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసుకున్నారు. అనంతరం ఐదు ముఠాలుగా ఏర్పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నోట్లమార్పిడికి తెరతీశారు. కోట్లలో నోట్లు మారుస్తూ భారీగా కమీషన్లు జేబులో వేసుకుంటున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఐదుగురు సర్వం తామై నోట్ల మార్పిడి దందాను సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న బడాబాబులు, వ్యాపారులతో మంతనాలు సాగిస్తున్నారు. 30 శాతం కమీషన్ఇస్తే... పెద్ద నోట్లను మార్పిడి చేసి కొత్త రూ.2వేల నోట్లు ఇస్తామని చెబుతున్నారు. ప్రధానంగా మద్యం, ఇసుక, వడ్డీ, బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కరెన్సీ దందా సాగిస్తున్నారు. అన్ని కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే.. టీడీపీ ప్రజాప్రతినిధి పరపతిని ఉపయోగించి బ్యాంకుల నుంచి కొత్త నోట్లను దొడ్డిదారిలో మార్పిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతి పరిధిలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు దొడ్డిదారిలో భారీగా పెద్ద నోట్లు మార్పిడి చేసినట్లు ఇప్పటికే రిజర్వు బ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల్లోనే రూ.9,650 కోట్లు మార్పిడి చేయడం గమనార్హం. కొందరు బ్యాంకర్లు అడ్డదారిలో బడాబాబులకు నోట్లు మార్పిడి చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్బీఐ ప్రాథమికంగా గుర్తించింది. విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులతో కూడిన రాకెట్‌కే అడ్డదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసినట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల అదుపులో ఓ ముఠా ! నోట్ల మార్పిడి దందాపై సమాచారం అందడంలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని ఓ ప్రాంతంలో నోట్ల మార్పిడి కోసం నిరీక్షిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారిలో టీడీపీ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఐదుగురిని విచారించడం ద్వారా మొత్తం రాకెట్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ! నోట్ల మార్పిడి ముఠాను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన ముఖ్య అనుచరుడిని విడిచిపెట్టాలని... మిగిలిన వారిపై కూడా నామమాత్రంగా కేసు నమోదు చేయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నగదు మార్పిడి ఇలా.. సెల్ఫోన్ల ద్వారా తమ పని సాగిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు దిన పత్రికపై తేదీ కనిపించేలా కొత్త రూ.2వేల నోట్ల కట్టలను ఉంచి ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతారు. తద్వారా అవి కొత్త నోట్లు అని నిర్ధారణ అవుతుంది. అనంతరం 30శాతం కమీషన్‌పై ఓ చోటకు చేరుకుని నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇలా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన నల్లకుబేరులు భారీగా నోట్లు మార్చుకున్నారు. మంత్రులదీ అదేదారి! నోట్ల మార్పిడిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తమ అనుచరులకు సాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి లిక్కర్ సిండికేట్లతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని అనుచరులు నోట్లు మార్చుకుని కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మంత్రి అండ ఉండటంతో ఆయన అనుచరులను కొందరు రియల్టర్లు, లిక్కర్ వ్యాపారులు సంప్రదించి గుట్టు చప్పుడుకాకుండా పెద్దనోట్లకుకమీషన్పై మార్చుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోనూ.... గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి రైతులకు రుణాలుగా ఇవ్వాల్సిన కొత్తనోట్లను తన అనుచరులకు ఇప్పించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి తన పరిధిలో ఉన్న పాల కేంద్రాల్లో పాత నోట్లు తీసుకోకుండా కట్టడి చేస్తూ... కౌంటర్లలో వచ్చే కొత్తనోట్లను తమ ఖాతాలో వేయించుకుని, తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకులకు జమ చేయిస్తున్నారని సమాచారం. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ప్రస్తుతం ఇదే పనిలో బిజీబిజీగా ఉన్న ట్లు తెలిసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యువరత్నం వివిధ వ్యాపార రంగాలకు చెందిన నల్లకుబేరులను కలిసి ఎన్ని కోట్ల రూపాయలైనా మార్చేస్తామని, 20 శాతం కమీషన్ ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం. -
RBI వద్ద పిల్లలతో పాత నోట్ల మార్పిడి దందా
-
దొంగను పట్టించిన పాత నోట్ల మార్పిడి
- బ్యాంకులో మార్చుకునేందకు వచ్చి పట్టుబడిన వైనం పాత నోట్ల మార్పిడితో బ్లాక్‌మనీ ఎంత బయటపడుతుందో ఏమో కానీ గతంలో చోరీకి పాల్పడిన ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదు నెలల క్రితం ఇంట్లో రూ. 2 లక్షలు అపహరించిన వ్యక్తి ఇప్పటి వరకు కొంత ఖర్చు చేయగా మిగతా నోట్ల మార్చుకునేందుకు బ్యాంకు వద్దకు వచ్చి పోలీలకు దొరికాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. - కర్నూలు కల్లూరులోని గీతానగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ కుమారుడు సాయి విజయ్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నాడు. ఇదే క్రమంలో జల్సాలకు అలవాటుపడి ఆటో ఫైనాన్స్ చెల్లించలేక అప్పుల పాలయ్యాడు. రుణాన్ని తీర్చేందుకు చోరీకి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం, జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌లో సబ్ పోస్టుమాస్టరుగా పని చేస్తున్న చంద్రునాయక్ కర్నూలు నిర్మల్‌నగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. 2016 జూన్ 3వ తేదీన తన మామ నానునాయక్ రూ.2 లక్షలు అప్పు ఉండటంతో చెల్లించాడు. ఆ మొత్తంతో పాటు బ్యాంకు పాసుబుక్కులు, పోస్టల్ ఆర్డీ బుక్కులు, ఏటీఎం కార్డులు బ్యాగులో పెట్టుకొని అదే రోజు రాత్రి నిర్మల్‌నగర్‌లో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో బ్యాగును మంచంమీద పెట్టి తలుపులు తెరిచి ఉంచి నిద్రపోయాడు. అదే సమయంలో అక్కడికి సమీపంలో ప్రయాణికుడిని దించేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సాయి విజయకుమార్ ఇంటి తలుపులు తెరిచి ఉంచడం గమనించి ఇంట్లోకి వెళ్లాడు. మంచం మీద బ్యాగును తీసుకుని ఉడాయించాడు. బ్యాగ్‌లో ఉన్న డబ్బును తీసుకుని మిగతా వస్తువులతో పాటు బ్యాగును కేసీ కెనాల్లో పారవేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో చేపట్టారు. ఇలా దొరికాడు: దొంగలించిన సొమ్ముతో అప్పులు కట్టుకోవడంతో పాటు అవసరాలకు ఖర్చు పెట్టాడు. అతని దగ్గర రూ. 83 వేలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద నోట్లు మార్పిడి చేసుకోవాల్సి రావడంతో సోమవారం కృష్ణానగర్ జంక్షన్‌లోని ఎస్బీఐ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో గస్తీలో ఉన్న నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు, సిబ్బంది సాగర్, శ్రీను, ఆచారి తదితరులు అతడిని విచారించారు. రూ. 83 వేలకు ఆధారాలు చూపాలని నిలదీయడంతో జూన్ నెలలో నిర్మల్‌నగర్‌లో చంద్రూనాయక్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. -
68 దిగువకు రూపాయి...
దాదాపు 9 నెలల కనిష్టానికి పతనం న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 68 దిగువకు పడిపోయింది. అమెరికా రేట్ల పెంపు అంచనాలు, డాలర్ పరుగు కొనసాగుతుండటంతో రూపాయి 31 పైసలు క్షీణించి 68.13 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. అంటే దాదాపు 9 నెలల కనిష్ట స్థాయికి రూపాయి క్షీణించింది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం కూడా ప్రతికూల ప్రభావం చూపిందని, కార్పొరేట్లు, దిగుమతిదారుల నుండి డిమాండ్ బాగా ఉందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. అమెరికా లేబర్ మార్కెట్ మెరుగుపడుతుండడం, పటిష్టమైన వృద్ధి కారణాల వల్ల త్వరలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడంతో అమెరికా డాలర్ 14 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇక భారత స్టాక్ మార్కెట్లో శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.926 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీ ఫారెక్స్ మార్కెట్లో గురువారం నాటి ముగింపు(67.82)తో పోల్చితే డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 68 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో కొత్త కనిష్ట స్థాయి 68.19ను తాకింది. చివరకు 31 పైసలు (46 శాతం) నష్టంతో 68.13 వద్ద ముగిసింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విధానాలు వృద్ధిని పెంచేలా ఉంటాయని, దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు పెరుగుతాయనే అంచనాలతో డాలర్ బలపడుతూ వస్తోంది. -
ఆపరేషన్ బ్లాక్‌మనీ
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : నల్లధనాన్ని మార్చుకునేందుకు అధికార పార్టీ నేతలు కొత్త వ్యూహం పన్నారు. డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుని పాత పెద్దనోట్లను మార్చే పనిలో పడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రూపులను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఆయా గ్రూపుల్లోని సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణం ఏమాత్రం ఉందో తెలుసుకుని వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. డ్వాక్రా మహిళలు పాత రుణం చెల్లిస్తే మరోసారి రుణం తీసుకునే అవకాశం ఉండటంతో.. తాము కట్టిన సొమ్మును కొత్త రుణం వచ్చాక తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు డీఆర్డీఏ అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ.. డ్వాక్రా గ్రూపులను తమకు అనుకూలంగా పనిచేయించేలా చూడాలని కోరుతున్నారు. జ¯ŒSధ¯ŒS ఖాతాలపై ఆంక్షలతో.. పేదలు, మహిళలు ప్రారంభించిన జ¯ŒSధ¯ŒS ఖాతాలను కొందరు నల్ల ధనం మార్పిడికి ఉపయోగించుకుంటున్నారనే అనుమానంతో ఈ ఖాతాల్లో రూ.50 వేలకు మించి పాతనోట్లను జమ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలను చెల్లించే ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వస్తున్నట్టు సమాచారం. నగదు రాలేదంటూ బోర్డులు చాలా బ్యాంకుల వద్ద నగదు ఇంకా రాలేదంటూ గురువారం ఉదయం బోర్డులు పెట్టారు. తపాలా కార్యాలయాల్లోనూ నగదు ఇవ్వలేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. లింగపాలెం మండలం కె.గోకవరం పోస్టాఫీసులో రూ.500, రూ.1000 పాతనోట్లకు చిల్లర ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మరోవైపు కొత్త నోట్లపై ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో వీటిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే ప్రబుద్ధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం పంచాయతీ పరిధిలోని గౌరీ శంకరపురం గ్రామానికి చెందిన పొలిమెరశెట్టి సత్యనారాయణ, బొబ్బేటి ఆనందరావు రూ.2 వేల నోటును కలర్ జిరాక్సు తీయించి, దాంతో మక్కినవారిగూడెంలోని మద్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. పెళ్లిళ్లకు ఊరట పెళ్లికి సంబంధించి ఆ కుటుంబ స్వీయ ధ్రువీకరణ, పా¯ŒS కార్డు వివరాలు సమర్పించి ఒకేసారి రూ.2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించడం కొంత ఊరటనిస్తోంది. వరుడు లేదా వధువు, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. పెళ్లి నిమిత్తం ఒకరి ఖాతా నుంచి మాత్రమే అనుమతించిన మేరకు డబ్బు తీశామని.. మరే ఖాతా నుంచి పెళ్లి పేరుతో నగదు తీసుకోలేదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సదరు వ్యక్తి బ్యాంకులో అందజేయాలి. పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేలు నగదు తీసుకునే అవకాశం కల్పించారు. -
మహానందీశ్వరుడి సాక్షిగా..
- రూ. లక్షల్లో నోట్ల మార్పిడి - అధికార పార్టీ నేత అండగా ఓ అధికారి కక్కుర్తి - సిబ్బంది భాగస్వామ్యం - 13 మందికి షోకాజ్ నోటీసులు మహానంది: నల్లకుబేరులు పెద్ద నోట్ల మార్పిడికి మహానంది క్షేత్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. ఓ అధికారి సహకారంతో నల్లడబ్బును తెల్లగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకున్న వారిలో ధర్మకర్తల మండలి సభ్యులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ తంతగంలో ఓ చిరుద్యోగి తన హవాను కొనసాగిస్తున్నాడు. గత ఆది, సోమవారాల్లో రెండురోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం సెలవురోజు కావడంతో సుమారు రూ. 4లక్షలు, కార్తీక పౌర్ణమి కావడంతో సోమవారం భక్తులరద్దీ అధికంగా ఉండటంతో రూ. 5లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో రూ. 9లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులరద్దీ, ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులనే నల్లకుబేరులు టార్గెట్ చేశారు. అధికార పార్టీ అండగా ఓ ఉద్యోగి కింది స్థాయి సిబ్బంది సహకారంతో రెండు రోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి చేసినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఎనిమిది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఏజేన్సీ ఉద్యోగులు కలిపి 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిలో స్థానిక అధికారపార్టీ నేతతో పాటు ఓ ఉద్యోగి బంధువు, మరికొందరు స్థానికులు ఉన్నారని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.అలాగే లోకాయుక్తను ఆశ్రయించి కేసు వేస్తామన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవు: శంకర వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్, మహానంది నోట్ల మార్పిడిలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజేన్సీ, ఔట్సోర్సింగ్, ఇతరులకు కలిపి మొత్తం 21 మందికి షోకాజ్‌నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాము.ఆది, సోమవారాల్లో కలిపి రూ. 2.64లక్షల మార్పిడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విచారణ అనంతరం బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు. -
ఐదు రోజుల్లో రూ.83,702 కోట్ల డిపాజిట్లు: ఎస్బీఐ
ముంబై: కేంద్ర ప్రభుత్వపు కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో గత ఐదు రోజుల్లో తమకు రూ.83,702 కోట్ల డిపాజిట్లు వచ్చాయని ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తెలిపింది. నవంబర్ 10 నుంచి 14 వరకు (సాయంత్రం 5 గంటల వరకు) రూ.4,146 కోట్ల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేశామని పేర్కొంది. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా బ్రాంచులు సోమవారం పనిచేయకపోరుునా కూడా, దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ బ్యాంకులు పనిచేశాయని తెలిి పంది. నవంబర్ 10 నుంచి ఎస్బీఐ బ్యాంక్ శాఖల ద్వారా జరిగిన విత్‌డ్రాయెల్స్ రూ.9,342 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఏటీఎం విత్‌డ్రాయెల్స్ రూ.1,958 కోట్లుగా నమోదయ్యాయని తెలిపింది. క్యాష్ డిపాజిట్స్ మెషీన్ల ద్వారా జరిగిన కస్టమర్ల డిపాజిట్లు రూ.4,654 కోట్లు (పాత నోట్లు)గా ఉన్నాయని వివరించింది. -
భారీగా నోట్లను మార్చుతూ బుక్కయ్యారు
-
పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల ద్వారా డివిజన్ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క హెడ్ పోస్టాఫీసులోనే రూ. 40 లక్షల మేరకు మార్పిడి చేశామన్నారు. సోమవారం గురునానక్ జయంతి సెలవు దినమైనా పోస్టాఫీసులు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఎస్బీ ఖాతాలకు రూ. 4.79 కోట్ల డిపాజిట్లు జమ కావడంతో మొత్తం డిపాజిట్లు రూ. 35 కోట్లకు చేరాయని వివరించారు. -
నోటుపాట్లు
- పోటెత్తిన బ్యాంకులు - తీవ్రమైన రూ.100 నోట్ల కొరత - నిప్పై మండిన ఉప్పు - పడిపోయిన వ్యాపారాలు కర్నూలు(అగ్రికల్చర్): నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని పనులు వదులుకొని కేవలం వేలాది మంది నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అక్కడ రూ. 2000 నోట్లు ఇస్తుండడంతో వాటిని ఎక్కడ మార్చుకోవాలని తెలియని పరిస్థితి. జిల్లాలో రూ.100 నోట్ల కోతర తీవ్రమైంది. కిరాణం షాపులు, పాల వాళ్లు ఇతరులు రూ.1000, 500 నోట్లను తిరçస్కరిస్తుండటంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉన్నట్టుండి శనివారం జిల్లాలో ఉప్పు నిప్పు అయింది. ఉప్పు ఇక దొరకదంట అనే ప్రచారం ఎక్కువగా జరుగడంతో జనం పరుగులు తీశారు. నిత్యావసర వస్తువులు ప్రధానంగా హైదరాబాద్, విజయవాడల నుంచి సరఫరా అవుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు పెద్దనోట్లను తీసుకోవడం లేదు. కింది స్థాయిలో వ్యాపారులు కూడా వినియోగదారుల నుంచి పెద్దనోట్లు స్వీకరించడం లేదు. దీంతో ఇప్పటికే నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో నగదు సమస్యలు పరిష్కారం కాకపోతే నిత్యావసర వస్తువులు లభించడం కష్టమవుతుందనే ప్రచారం సాగుతోంది. తీరని వందనోట్ల కొరత... బ్యాంకులకు రూ.500, 1000 నోట్ల డిపాజిట్లు పోటెత్తున్నా... రూ.100 నోట్ల కొరత తీవ్రం కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కొత్త రూ.500 నోట్లు ఎపుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రద్దు అయిన పెద్ద నోట్లను చేత పట్టుకొని మార్పుడికి బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. వందనోట్ల కొరత వల్ల ఏటీఎం సేవలు నామమత్రమే అయ్యాయి. కరెన్సీ కొరతనే ఇందుకు కారణం. బ్యాంకులకు ప్రజలు పోటెత్తుతున్నా నగదు మార్పిడి, విత్ డ్రాల్లో వంద నోట్లు 10 వరకు మాత్రమే ఇస్తున్నారు. జిల్లాకు వందనోట్ల అవసరం రోజుకు రూ.50 కోట్ల వరకు ఉన్నా బ్యాంకులు, ఏటీఎంల ద్వారా రూ.కోటి కూడా మార్కెట్లోకి రాపోవడంతో ఆర్థిక కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఏటీఎంలు 403 ఉన్నా 20 శాతం కూడా పనిచేయలేదు. మూడు రోజుల్లో రూ.1000 కోట్ల డిపాజిట్లు... మూడు రోజుల్లో బ్యాంకులు, పోస్టుపీసులకు పెద్ద నోట్లు రూ.1000 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు సమాచారం. నగదు మార్పిడి, విత్‌డ్రాకు ఎంత డిమాండ్ ఉందో డిపాజిట్లకు అంతే డిమాండ్ ఏర్పడింది. వీలైనంత త్వరగా పెద్దనోట్లను వదిలించుకోవాలనే ఆత్రుత ప్రజల్లో కనిపిస్తోంది. అందువల్లనే డిపాజిట్లు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులకు తరలివస్తున్నారు. పడిపోయిన వ్యాపారాలు... నగదు కొరతతో జిల్లాలో వ్యాపార లావాదేవీలు పడిపోయాయి. పసిడి వ్యాపారం నేలకు పాకింది. జిల్లా మొత్తం మీద బంగారం వ్యాపారం రోజు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. అటువంటిది మూడు రోజులుగా బంగారం వ్యాపారం జిల్లా మొత్తం మీద రూ.2కోట్లకు మించడం లేదు. కర్నూలులోని షరాఫ్ బజార్ కొనుగోలు దారులేక వెలవెల పోతోంది. కనీసం బోణీ కాని షాపులు ఉండటం గమానార్హం. కొందరు వ్యాపారులు ధరలు అనూహ్యంగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అన్ని రకాల వ్యాపారాలు పడిపోయాయి. జిల్లాలో ప్రధానంగా వస్త్ర వ్యాపారం, ఫర్నిచర్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్పోన్లు, ఎరువుల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద నోట్లు రద్దుకు ముందన్న వ్యాపారంతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం వ్యాపారం కూడా లేదు. -
సదా చిల్లర స్మరామి
= చిల్లర కొరతతో ‘వెయ్యి’పాట్లు = రూ. వంద కోసం గంటల పాటు పెట్రోలు బంకులో ఎదురుచూపులు = 40 శాతం తగ్గిన హోటళ్ల వ్యాపారం = టోల్గేట్ల వద్ద కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు = కలబుర్గిలో రూ.500 తీసుకుని రూ.400 ఇచ్చిన వైనం = సొమ్మును బంగారంలోకి మార్చుకోవడానికి పరుగులు సాక్షి, బెంగళూరు: పెద్దనోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడి మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారి పనులను వదులుకుని చిల్లర నోట్ల కోసం పెట్రోలు బంకులు, కమిషన్ ఏజెంట్లు, హోటల్స్ వద్ద క్యూలు కట్టారు. మరికొంతమంది అవసరం లేకపోయినా బంగారు నాణేలు, ఆభరణాలను కొనడానికి ఎగబడ్డారు. మరోవైపు కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బందికి సరైన సమాచారం లేకపోవడంతో బీఎంటీసీ ప్రయాణికులతో గొడవలకు దిగిన సంఘటనలు కూడా బెంగళూరు, మంగళూరుతో సహా పాటు కర్ణాటక వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించినా తాత్కాలిక ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఆందోâýæన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా డిపాజిట్ చేయడానికి కొంతమంది ప్రయత్నించగా మరికొంతమంది రోజువారి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవడానికి ఏటీఎంల వద్ద బారులు తీరారు. మంగళూరు వద్ద చాలా మంది వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్ముతో బంగారు నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేయడం కోసం జ్యువెలరీ షాపుల వద్దకు పరిగెత్తారు. కొంతమంది సొమ్మును అడ్వాన్స్ గా ఇచ్చి బంగారాన్ని బుధ, గురు లేదా మరోవారం తర్వాతనైనా అందించాల్సిందిగా దుకాణం యజమానులకు చెప్పడం కనిపించింది. ఇక బుధవారం ఉదయం నుంచే బెంగళూరుతో పాటు రాష్ట్రంలో పలు నగరాలకు, పట్టణాలకు కాయగూరలు, పూలు, పండ్లను రవాణా చేసే కే.ఆర్.మార్కెట్, రస్సెల్మార్కెట్, మల్లేశ్వరం, మడివాల మార్కెట్లో గందరగోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. అటు వినియోగదారులు తమ వద్ద ఉన్న సొమ్మును మార్పిడి చేసుకోవడానికి ప్రయత్నించగా వ్యాపారస్తులు తీసుకోలేదు. అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి సరుకును తీసుకుని ఆయా మార్కెట్లకు చేరుకున్న రైతులు, దళారులు కూడా మార్కెట్లోని వ్యాపారస్తుల నుంచి సొమ్ములు తీసుకోవడానికి వెనుకడుగు వేయడం కనిపించింది. వందకోసం రెండు గంటలు... చాలా మంది తమ వద్ద ఉన్న ఐదు వందలు, వెయ్యి నోట్లను మార్చుకోవడం కోసం పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. నగరంలోని ఓ బంకు సిబ్బంది బెత్లహాం అనే వ్యక్తి వద్ద రూ.ఐదు వందలు తీసుకుని రూ.వందకు పెట్రోలు పోసి మిగిలిన రూ. నాలుగు వందల కోసం క్యూలో నిలబెట్టారు. వినియోగదారుల నుంచి నాలుగు వంద నోట్లు వచ్చిన తర్వాత సదరు నోట్లను తనకు ఇస్తామని చెప్పినట్లు బెత్లహాం సాక్షితో పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలు ఇలా నిలబడ్డానని సదరు నోట్లు మరో రెండు రోజులు కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతాయని అందవల్ల విధిలేక ఇలా నిలబడాల్సి వచ్చిందని వాపోయారు. ఇలాంటి ఇబ్బందులు చాలా చోట్ల కనిపించాయి. = కొన్ని హోటల్స్‌లలో రూ.500, రూ.1000లకు చిల్లరు లేదు అని బోర్డు పెట్టడంతో వినియోగదాలు వెనక్కు వెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ వ్యాపారం 30 నుంచి 40 శాతం తగ్గిపోయిందని రాష్ట్ర హోటల్ యామజామాన్య సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. = కలబుర్గిలో కొంతమంది బృందంగా ఏర్పడి ఐదు వందలు తీసుకుని నాలుగు వందల రుపాయాలు ఇచ్చారు. వంద తక్కువైనా పర్వాలేదు రెండు రోజులు ఖర్చులకు సరిపోతాయన్న ఉద్దేశంతో చాలా మంది సదురు నోట్లను తీసుకోవడం కోసం ఎగబడ్డారు. = రైల్వే, బస్స్టేషన్లలో నోట్ల వినిమయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఈ నోట్ల వినిమయం ఎలా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కండక్టర్ రూ.500 నోట్లను తీసుకోకపోవడంతో చాలా చోట్ల ప్రయాణికులకు, బస్సు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి విధిలేక చాలా మంది ప్రయాణికులు బస్సుల నుంచి మధ్యలోనే దిగిపోయారు. = మంగళూరుకు చెందిన సత్యనారాయణ హీరేమఠ్ అనే వ్యక్తి వారం రోజుల్లో తన కుమార్తె పెళ్లి కోసం రూ. రెండు లక్షలు అప్పుగా తీసుకున్నారు. అన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఈ నోట్లు బుధవారం నుంచి చలామణిలో లేవు. పోనీ ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి నూతన నోట్లను తీసుకుందామంటే.. రోజుకు రూ.10వేలు, వారానికి రూ.20వేలు మాత్రమే విత్‌డ్రాయల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే పెళ్లికి అవసరమైన వస్తువులు కొనడానికి డబ్బు ఎలా సర్ధుబాటు చేయాలో తెలియడంల లేదని సత్యనారాయణ హీరేమఠ్ వాపోతున్నారు. = అత్తిబెలే, నైస్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, తుమకూరు రోడ్డు వద్ద టోల్గేట్ వద్ద వాహనదారులు ఇచ్చిన రూ.500, రూ.1,000 నోట్లను సిబ్బంది తీసుకోకపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. = కొంతమంది తమ వద్ద ఉన్న ఐదు వందలకు చిల్లర కోసం యాచకుల వెంట పడ్డారు. ఈ ఘటనలు ఎక్కువగా బెంగళూరులోని ఎంజీరోడ్, కోరమంగ వద్ద కనిపించాయి. సిగ్నల్స్ వద్ద యాచించే హిజ్రాల వద్ద కూడా రూ. ఐదు వందలు ఇచ్చి రూ. నాలుగు వందలు తీసుకోవడం కనిపించింది. = మరోవైపు బీదర్‌లో కొంతమంది ఐదు వందల నోటును గాడిదకు తినిపిస్తూ ప్రభుత్వ నిర్ణయం పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. మొదట బ్యాంకులో డిపాజిట్ చేయండి ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్లధనానికి అడ్డుకట్టుపడుతుందనడంలో సందేహం లేదు. అయితే దీని వల్ల గరిష్టంగా రెండు నెలల పాటు అన్ని రంగాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా అవగాహన చేసుకుని గరిష్టంగా రూ. రెండు కోట్ల నగదు (లిక్విడ్ అమౌంట్) ఉన్నవారికి ఒక సూచన. వంశపార్యంపర్యం కాని స్థిరాస్తుల అమ్మడం వల్ల వచ్చిన నగదు ఇంట్లో ఉంటే బ్యాంకులో డిపాజింట్ చేయడం మంచి నిర్ణయం. ఇందుకు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉంది. అటు పై సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని అవసరమైన పన్నులు చెల్లిస్తే డిపాజిట్ చేసిన సొమ్ములో కొంత వరకూ అయినా దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. -రాజేష్భట్, ఛార్టెడ్అకౌంట్ -
రూపాయి రికవరీ...
24 పైసలు లాభంతో 66.61 ముంబై: పాక్‌పై ఊహించని దాడుల నేపథ్యంలో గురువారం కుదేలైన రూపాయి శుక్రవారం రికవరీ అయింది. బ్యాంక్‌లు, ఎగుమతిదారుల తోడ్పాటు తో డాలర్‌తో రూపాయి మారకం 24 పైసలు బలపడి 66.61 వద్ద ముగిసింది. గురువారం పాక్‌పై దాడులతో రూపాయి 39 పైసలు పతనమైన విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో ఇదే అతి పెద్ద పతనం. డాషే బ్యాంక్ ఆర్థిక స్థితిగతులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, ఒడిదుడుకులకు లోనైనా . శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం రూపాయిపై సానుకూల ప్రభావం చూపించింది. బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం కలసివచ్చిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఫలితంగా దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులు జోరుగా రానున్నాయనే అంచనాలు రూపాయి బలపడటానికి తోడ్పాటునందించాయని పేర్కొన్నారు. -
రూ.307 కోట్ల ఎఫ్టీఐఎల్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా ఫైనాన్షియల్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఎఫ్టీఐఎల్)కు చెందిన రూ.306 కోట్ల విలువైన ఆస్తులను(మ్యూచువల్ ఫండ్స్) ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) గురువారం జప్తు(అటాచ్) చేసింది. ఈ మేరకు తమకు ఈడీ(ముంబై విభాగం) నుంచి ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయని ఎఫ్టీఐఎల్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీనిపై తదుపరి చర్యలకు తమ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌కు అనుమతులను పొందేవిషయంలో నిబంధనలను ఉల్లంఘించడం, వాస్తవాలను దాచిపెట్టడం, మోసం ఆరోపణలపై తాజాగా సీబీఐ జిగ్నేష్ షాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క, జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్లో 2013 ఆగస్టులో రూ.6,000 కోట్ల మేర స్కామ్ వెలుగుచూసినప్పటినుంచీ షాపై పలు అభియోగాలు నమోదవుతున్నాయి. స్కామ్ తర్వాత ఎఫ్‌టీఐఎల్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను విలీనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కార్పొరేట్ వ్యవహారాల శాఖ జారీ చేసిన తుది ఆదేశాల అమలుకు ఈ నెల 26 వరకూ బాంబే హైకోర్టు స్టే మంజూరు చేసింది.