న్యూఢిల్లీ: చెల్లింపులలో విఫలమైన(డిఫాల్టర్లు) కొనుగోలుదారులపై చర్యలు తీసుకోమంటూ నేషనల్‌స్పాట్‌ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్)ను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఈఎల్ గత వారం ప్రభుత్వానికి సమర్పిం చిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న తొలి పేమెం ట్ రోజు కావడంతో కొంతమంది కొనుగోలుదారులు నగదు చెల్లింపులో విఫలమై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. డిఫాల్టర్లపై నిబంధనల ప్ర కారం చర్యలను తీసుకోవడమేకాకుండా వారి వివరాలను కూడా ఇవ్వమంటూ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈఎల్ గిడ్డంగులలో ఉన్న సరుకులపై ఆడిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి రూ. 5,600 కోట్ల సెటిల్‌మెంట్‌లకు హామీదారు(గ్యారంటర్) కావడంతో బాధ్యతలను పూర్తిచేయాల్సిందిగా కూడా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఆదేశించారు.