Pankaj Agarwal
-
నేడే హరియాణా ఎన్నికల సమరం
చండీగఢ్: హరియాణా శాసనసభ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని హరియాణా ఎన్నికల కమిషనర్ పంకజ్ అగర్వాల్ శుక్రవారం చెప్పారు. 20,623 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు.అలాగే ఈసారి ఏకంగా 464 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్ఎల్డీ–బీఎస్పీ, జేజేపీ–ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ, కాంగ్రెస్ నేత భూపీందర్‌సింగ్ హుడా, రెజ్లర్ వినేశ్ ఫోగాట్, జన నాయక్ జనతా పార్టీ అగ్రనేత దుష్యంత్ చౌతాలా తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. -
డిఫాల్టర్లపై చర్యలు
న్యూఢిల్లీ: చెల్లింపులలో విఫలమైన(డిఫాల్టర్లు) కొనుగోలుదారులపై చర్యలు తీసుకోమంటూ నేషనల్స్పాట్ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)ను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్ఎస్ఈఎల్ గత వారం ప్రభుత్వానికి సమర్పిం చిన ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న తొలి పేమెం ట్ రోజు కావడంతో కొంతమంది కొనుగోలుదారులు నగదు చెల్లింపులో విఫలమై ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. డిఫాల్టర్లపై నిబంధనల ప్ర కారం చర్యలను తీసుకోవడమేకాకుండా వారి వివరాలను కూడా ఇవ్వమంటూ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఎన్ఎస్ఈఎల్ గిడ్డంగులలో ఉన్న సరుకులపై ఆడిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి రూ. 5,600 కోట్ల సెటిల్మెంట్లకు హామీదారు(గ్యారంటర్) కావడంతో బాధ్యతలను పూర్తిచేయాల్సిందిగా కూడా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఆదేశించారు. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది.