చండీగఢ్: హరియాణా శాసనసభ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 2.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని హరియాణా ఎన్నికల కమిషనర్ పంకజ్ అగర్వాల్ శుక్రవారం చెప్పారు. 20,623 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,031 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు.
అలాగే ఈసారి ఏకంగా 464 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐఎన్‌ఎల్‌డీ–బీఎస్పీ, జేజేపీ–ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ, కాంగ్రెస్ నేత భూపీందర్‌సింగ్ హుడా, రెజ్లర్ వినేశ్ ఫోగాట్, జన నాయక్ జనతా పార్టీ అగ్రనేత దుష్యంత్ చౌతాలా తదితరులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment