చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తగిన మెజారిటీ సాధించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌కు ఈసారి 11 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. దీనిని గమనిస్తే ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ మరింత మెరుగుపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆ పార్టీ ఓట్ల శాతం 36.49 శాతంగా ఉంది. అదే సమయంలో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కు 28.08 శాతం ఓట్లు వచ్చాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) రెండు స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండూ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యాయి. రెండు సీట్లు గెలుచుకున్న ఐఎన్‌ఎల్‌డీ 2019తో పోలిస్తే ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది.
ఇది కూడా చదవండి: 32 ఓట్లతో దక్కిన విజయం
Comments
Please login to add a commentAdd a comment