
ఢిల్లీ: కాంగ్రెస్ నేత హిమాని నర్వాల్ దారుణ హత్య హర్యానాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా.. అతడు హిమానికి స్నేహితుడు అని తెలుస్తోంది.
హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఇక, పోలీసులు అతడి దగ్గర నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా హిమానికి స్నేహితుడి అని తెలిసింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు సమాచారం. హిమాని ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. హిమాని అతడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. హర్యానాలోని రోహతక్ జిల్లాలో శనివారం హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు దుండగులు. సంప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలం చేకూర్చుతోంది.
ఇక, హిమాని నర్వాల్ హత్యపై దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని నర్వాల్ హర్యానాలో ఒంటరిగా ఉంటుందని సాంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ తెలిపారు.
#WATCH | Rohtak, Haryana: Visuals of the accused who is arrested in Congress worker Himani Narwal murder case. pic.twitter.com/zSvHIEIP7a
— ANI (@ANI) March 3, 2025
బాధితురాలి తల్లి ఆరోపణలు
అంతకుముందు, బాధితురాలి తల్లి సవిత సంచలన ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కోసం తన కూతురు పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదన్నారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు తాను ఆమె అంత్యక్రియలు చేయనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment