హిమానీ నార్వాల్ హత్య.. సమగ్ర దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌ | Congress Demands Justice On Haryana Congress Worker Himari Death, More Details Inside | Sakshi
Sakshi News home page

హిమానీ నార్వాల్ హత్య.. సమగ్ర దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌

Mar 2 2025 9:18 AM | Updated on Mar 2 2025 3:49 PM

Congress demands justice On Haryana Congress worker Himari Death

చంఢీగడ్: హర్యానా కాంగ్రెస్ మహిళా కార్యకర్త  హిమానీ నార్వాల్ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.  ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది.  శనివారం రాత్రి సమయంలో ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కనుగొనడంతో హిమానీ హత్య గావించబడ్డ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ఆరంభించారు.

అయితే దీనిపై సమగ్ర కోణంలో విచారణ జరిపించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు హర్యానా కాంగ్రెస్ ఎంఎల్ఏ భరత్ భూషణ్ బర్రా.. పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ వారికి కఠినమైన శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

సూట్ కేసులో మృతదేహం
హర్యానాలోని  రోహతక్ జిల్లాలో చోటు చేసుకున్న దారణం నిన్న(శనివారం) వెలుగులోకి వచ్చింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష  ప్రాంతంలో పడేశారు దుండగులు.  ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది.  ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలంగా చేకూర్చుతోంది.

రాహుల్ తో కలిసి జోడో యాత్రలో
ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. సోన్ పేట్ లోని కతారా గ్రామానికి చెందిన హిమానీ నార్వాల్..  కాంగ్రెస్ చేసిన ప్రతీ ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. దాంతో పార్టీ చేపట్టే సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి
తాము మంచి కార్యకర్తను కోల్పోయామని హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంతలా దిగజారిపోయాయి అనడానికి నార్వాల్ హత్య ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. దీనిపై హై లెవెల్ దర్యాప్తు చేస్తే కానీ అసలు నిందితులు ఎవరు బయటకు రారని ఆయన పేర్కొన్నారు. నిందితులకు అమలు చేసే అత్యంత కఠినంగా ఉండాలన్నారు. మరొకసారి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా శిక్ష అమలు చేయాలని భూపేందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు.  బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్యోదంతాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రికార్డులు చూస్తే రాష్ట్రం నేర చరిత్ర ఏ విధంగా తెలుస్తుందన్నారు.  ప్రతి నిత్యం ఏదొక చోట మూడు నుంచి నాలుగు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దొంగతనలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement