rohtak
-
హిమానీ నార్వాల్ హత్య.. సమగ్ర దర్యాప్తునకు కాంగ్రెస్ డిమాండ్
చంఢీగడ్: హర్యానా కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమానీ నార్వాల్ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. శనివారం రాత్రి సమయంలో ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కనుగొనడంతో హిమానీ హత్య గావించబడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ఆరంభించారు.అయితే దీనిపై సమగ్ర కోణంలో విచారణ జరిపించాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ మేరకు హర్యానా కాంగ్రెస్ ఎంఎల్ఏ భరత్ భూషణ్ బర్రా.. పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డ వారికి కఠినమైన శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.సూట్ కేసులో మృతదేహంహర్యానాలోని రోహతక్ జిల్లాలో చోటు చేసుకున్న దారణం నిన్న(శనివారం) వెలుగులోకి వచ్చింది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె మెడపై గాయాలుండటం కూడా ఇదే హత్యేనని అనడానికి మరింత బలంగా చేకూర్చుతోంది.రాహుల్ తో కలిసి జోడో యాత్రలోఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. సోన్ పేట్ లోని కతారా గ్రామానికి చెందిన హిమానీ నార్వాల్.. కాంగ్రెస్ చేసిన ప్రతీ ర్యాలీలోనూ ఉత్సాహంగా పాల్గొనేది. దాంతో పార్టీ చేపట్టే సోషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొని ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయితాము మంచి కార్యకర్తను కోల్పోయామని హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంతలా దిగజారిపోయాయి అనడానికి నార్వాల్ హత్య ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. దీనిపై హై లెవెల్ దర్యాప్తు చేస్తే కానీ అసలు నిందితులు ఎవరు బయటకు రారని ఆయన పేర్కొన్నారు. నిందితులకు అమలు చేసే అత్యంత కఠినంగా ఉండాలన్నారు. మరొకసారి భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా శిక్ష అమలు చేయాలని భూపేందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఈ హత్యోదంతాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రికార్డులు చూస్తే రాష్ట్రం నేర చరిత్ర ఏ విధంగా తెలుస్తుందన్నారు. ప్రతి నిత్యం ఏదొక చోట మూడు నుంచి నాలుగు హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దొంగతనలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఆయన. -
కాంగ్రెస్ మహిళా కార్యకర్త దారుణ హత్య
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నార్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు దుండగులు. ఆమె మృతదేహం సూట్ కేసులో లభించింది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ బస్టాండ్ వద్ద సూట్ కేసు పడి ఉండటంతో తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. -
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్‌ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్‌కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్‌తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్‌లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్‌ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్
చండీగఢ్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం పేరిట డ్రామాలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారిని బీజేపీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆదివారం హరియాణాలోని రోహ్తక్లో పార్టీ కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడారు. అవినీతిపై మోదీ సర్కారు సాగిస్తున్న పోరాటమంతా నాటకమేనని ధ్వజమెత్తారు. నేరాలు, అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరుతున్నారని, దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీలో చేరి రక్షణ పొందుతున్న అక్రమార్కుల జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్లిన వారంతా అవినీతిపరులు కాదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఈడీ కేసుల భయంతో బీజేపీలో చేరినవారే అసలైన అవినీతిపరులని తేలి్చచెప్పారు. -
‘మన్ కీ బాత్’కు 23 కోట్ల శ్రోతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–రోహ్తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే.. 100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం–రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ చెప్పారు. మన్ కీ బాత్ 100వ ఎడిషన్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. ఎక్కువ మంది టీవీ చానళ్లలో, మొబైల్ ఫోన్లలో వీక్షించనున్నారు. కేవలం 17.6 శాతం మంది రేడియోల్లో వినబోతున్నట్లు సర్వేలో తేలింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. -
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి... రూ.2.11 కోట్లు, కారు
రోహ్తక్: ధర్మపాల్ అలియాస్ కాలా.. హరియాణా రాష్ట్రం రోహ్తక్ జిల్లా చిరీ గ్రామ వాస్తవ్యుడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విజ్ఞప్తి మేరకు పోటీ చేశాడు. కేవలం 66 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఈ ఓటమి గ్రామస్తులను కదిలించింది. ఆయనకు మద్దతుగా నిలిచారు. ధర్మపాల్‌ను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించారు. అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించి, రూ.2.11 కోట్ల నగదు అందజేశారు. అంతేకుండా ఖరీదైన స్కార్పియో కారు కూడా బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే నగదు, కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ చెప్పారు. గ్రామస్తుల ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. జనం కోసమే తాను జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. ఆయన గతంలో లఖాన్ మాజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా పనిచేశాడు. -
అ అంటే.. అమ్మ.. ఆ అంటే... ఆర్మీ.. ‘ఎన్డీయే’ ఎగ్జామ్ టాపర్ ఈమె!
‘డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలా?’ అనే అజ్ఞాత ఆశ్చర్యం మొన్న. ‘అమ్మాయిలు అద్భుతమైన విజయాలు సాధించగలరు’ అనే ఆత్మవిశ్వాసం నిన్న. ‘అవును. అది నిజమే’ అని చెప్పే వాస్తవం ఇవ్వాళ... ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది ఎంత వాస్తవమో తెలియదుగానీ, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పర్చుకోవడంలో ఇంటి వాతావరణం బలమైన ప్రభావం చూపుతుందని బలంగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా షానన్ ధాకను సగర్వంగా చూపవచ్చు. షానన్ది హరియాణాలోని రోహ్తక్ ప్రాంతంలోని సుందన గ్రామం. ఆ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఆర్మీలో ఉండడం విశేషం. తాత చంద్రభాను ధాక ఆర్మీలో సుబేదార్. తాతయ్య తనకు ‘ఆర్మీ కథలు’ చెప్పేవాడు. అవి కల్పిత కథలు కాదు. నిజజీవిత కథలు. సాహసజ్వాలను తట్టిలేపే కథలు. నాన్న విజయ్‌కుమార్ ఆర్మీలో నాయక్ సుబేదార్. చిన్నప్పుడు తాను ఏదైనా సందర్భంలో భయపడితే... ‘మనది ఆర్మీ ఫ్యామిలీ. అలా భయపడవచ్చా!’ అని ధైర్యం చెప్పేవాడు....ఇలా తనకు తెలియకుండానే ‘ఆర్మీ’ అంటే ఇష్టం ఏర్పడింది. అదొక బలమైన ఆశయం అయింది. PC: The Indian Express ‘భవిష్యత్‌లో నువ్వు ఏంకావాలనుకుంటున్నావు?’ అని టీచర్ అడిగితే తనతో పాటు చాలామంది ‘సోల్జర్’ అని చెప్పేవారు. అయితే తాను తప్ప అలా చెప్పిన వారెవరూ ఆ తరువాత కాలంలో ఆర్మీ గురించి ఆలోచించలేదు. వేరే చదువుల్లోకి వెళ్లిపోయారు. తల్లి గీతాదేవి గృహిణి. ‘నేను ఆర్మీలో పనిచేస్తాను’ అని ఆమెతో అన్నప్పుడు– ‘శభాష్’ అని భుజం తట్టడం తప్ప– ‘ఆడపిల్లలు సైన్యంలో ఎందుకు తల్లీ’ అని ఏరోజూ చిన్నబుచ్చలేదు. అక్క ఆర్మీలో నర్స్‌గా పనిచేస్తోంది. రూర్కి, జైపుర్, చండీమందిర్(పంచ్‌కుల) ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుకుంది షానన్. తాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష గురించి ప్రిపేరవుతున్న సమయంలో ‘సీటు రావడం అంతా ఈజీ కాదు’ అనే ఒకేఒక్క మాట తప్ప మరేది వినిపించలేదు. కానీ ఆ మాటలను మనసులోకి తీసుకోకుండా ఎన్డీఏ పరీక్షలో మెరిట్ జాబితాలో ఆల్ ఇండియా ర్యాంక్(ఏఐఆర్) దక్కించుకొని అమ్మాయిల విభాగంలో టాప్‌లో నిలిచింది. ఎప్పుడు సమయం దొరికినా కుటుంబంతో కలిసి సొంత గ్రామం సుందనకు వెళుతుంటుంది షానన్. ఆ ఊరివాళ్లు చిన్నప్పుడు ఆమెను ‘ఆర్మీ ఆఫీసర్’ అని పిలిచేవారు. వారి ఆత్మీయ పిలుపు నిజం కాబోతుంది. ‘సైన్యంలో ఉన్నత స్థాయిలోకి చేరాలనేది నా కల’ అంటుంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ గర్ల్ కెడెట్స్ ఫస్ట్ బ్యాచ్‌లో భాగం అవుతున్న షానన్. షానన్‌తో పాటు మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన దివ్యాన్షి సింగ్, కనిష్క గుప్తాలకు కూడా అలాంటి కలలే ఉన్నాయి. బిహార్‌లోని చిన్న పట్టణానికి చెందిన దివ్యాన్షిసింగ్ ‘మెరిట్ జాబితాలో చోట సంపాదించడం నాలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఇది భవిష్యత్ విజయాలకు పునాది అవుతుందని ఆశిస్తున్నాను’ అంటుంది. ‘కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు...అనే మాటను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు మాత్రం కష్టపడడం ద్వారా వచ్చే ఫలితాన్ని స్వయంగా చూశాను’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన కనిష్క గుప్తా. నిజానికి వారి కుటుంబంలో, బంధువులలో ఆర్మీలో పనిచేసిన వారు ఎవరూ లేరు. చిన్న వ్యాపార కుటుంబం వారిది. ‘గతంతో పోల్చితే ఎన్డీఏపై అమ్మాయిలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇది శుభపరిణామం’ అంటున్నారు ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసిన అశోక్ శర్మ. చదవండి: Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి -
యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!
యువ గాయనిని అపహరించి.. ఆపై 12 రోజుల తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆమె మృతదేహం అండర్వేర్పై మాత్రమే లభించడంతో.. అత్యాచారం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో పోలీసుల పాత్రపైనా వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత.. దారుణ హత్యకు గురైంది. రోహ్తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పాతిపెట్టిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల అనంతరం .. ఆ మృతదేహం దివ్యదే అని నిర్ధారించారు. హర్యాన్వీ సింగర్ సంగీత అలియాస్ దివ్య ఇండోరా మే 11 నుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత ఆమె పేరెంట్స్.. స్థానిక పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పని చేసే రవి, రోహిత్‌లు.. మ్యూజిక్ ఆల్బమ్ చేసే వంకతో ఆమెను ఎత్తుకెళ్లి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా.. రోహ్తక్ మెహమ్ సమీపంలోని ఓ హోటల్లో ఆ ముగ్గురు కలిసి భోజనం చేసిన ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆదివారం(22, మే) భైరోన్ భైని గ్రామంలోని బర్సాతి డ్రెయిన్ దగ్గర్లోని ఫ్లై ఓవర్ సమీపంలో.. తవ్వకాలు చేస్తుండగా నగ్నంగా పాతిపెట్టి ఉన్న ఓ యువతి మృతదేహాన్ని చూశామంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరీక్షల నిర్ధారణ అనంతరం బాధితురాల్ని హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరాగా గుర్తించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. దివ్య తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. దివ్య ప్రాణాలతో దక్కి ఉండేదని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు నిందితుల అరెస్ట్ విషయంలోనూ జాప్యం చేస్తున్నారంటూ న్యాయం కోసం స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ తరుణంలో.. పోలీసులు ఈ వ్యవహారంలో ఓ వ్యక్తిని అరెస్టు చేశామని, మరొకరని త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. దివ్య ఇండోరా మరణంతో.. హర్యాన్వీ గ్రూపులు నివాళులు అర్పిస్తున్నాయి. -
Pink Cafe: చాయ్‌తోపాటు.. మీ సమస్యలకు పరిష్కారం కూడా..
‘చాయ్ చాయ్ కోసమే కాదు...సామాజిక విశ్లేషణకు కూడా’ అనడానికి సజీవ సాక్ష్యం ఈ పింక్ కేఫ్. హరియాణాలోని రోహ్తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు, గృహిణులు ‘పింక్ కేఫ్’ ప్రారంభించారు. దీని వెనుక ‘పథ్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ చొరవ ఉంది. స్థూలంగా చెప్పాలంటే...ఇది మహిళల కోసం మహిళల చేత ఏర్పడిన కేఫ్. ఈ కేఫ్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ హాట్ టాపిక్ల గురించి చర్చించుకోవచ్చు. భావాలను పరస్పరం పంచుకోవచ్చు. తమ బాధలకు పరిష్కార మార్గం వెదుక్కోవచ్చు. ‘గతంలో ఏదైనా సమస్య వస్తే నాలో నేను కుమిలిపోయేదాన్ని. దీంతో బాధ మరింత పెరిగేది. పింక్‌కేఫ్ పరిచయమయ్యాక వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది పరిచయమయ్యారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పింక్కేఫ్కు వస్తేచాలు ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికుతుంది’ అంటుంది నీలిమ అనే అమ్మాయి. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ఒకే కేఫ్ ఒక్కోరోజు ఒక్కో వేదికలా మారుతుంది. ఒకరోజు మహిళా రచయిత్రులు, కవయిత్రులు, సంగీతకారులు తమలోని సృజనను ఆవిష్కరించుకునే వేదిక అవుతుంది. ఒక రోజు ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపే కౌన్సెలింగ్ సెంటర్ అవుతుంది. ఒకరోజు...పేద మహిళలకు ఉపాధి మార్గాలను సూచించే వేదిక అవుతుంది. హక్కులు, ఆరోగ్యం, అనుభవాలు, పరిష్కారాలు... ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకు ఈ పింక్‌కేఫ్ ఒక చుక్కాని. ఔత్సాహిక కళాకారులకు భుజం తట్టే వేదిక. ఉదా: రంజనికి కవిత్వమంటే ఇష్టం. తాను రాసిన కవిత్వాన్ని పుస్తకంగా వేసుకోవాలనేది ఆమె కల. అయితే తనకు అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో కల కలగానే ఉండిపోయింది. ‘పింక్ కేఫ్’ పరిచయమ య్యాక... ఒకరోజు తన కవితలను అక్కడ వినిపించింది. అవి నచ్చిన ముగ్గురు కలిసి కవిత్వాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం చూసి రంజని ఎంతగానో మురిసిపోయింది. ‘ఈ కేఫ్ మొదలు పెట్టినప్పుడు కాలక్షేపం కబుర్లకు తప్ప ఎందుకు అన్నవాళ్లు... ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇది చాలు పింక్‌కేఫ్ విజయం గురించి చెప్పడానికి’ అంటుంది పింక్ కేఫ్ మొదలు కావడానికి కష్టపడిన మహిళల్లో ఒకరైన సునీత. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్
సాక్షి, ముంబై: హర్యానాలోని రోహ్తక్లో ఒక అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటేందుకు తొందరపడిన ఒక మహిళ అంతే చాకచక్యంగా ప్రాణాలను కాపాడుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. పట్టాలపై రైలు నిలిచి ఉండగా, దానికిందినుంచి పట్టాలను దాటేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ఇంతలో సిగ్నల్ లభించడంతో రైలు అకస్మాత్తుగా కదలడం ప్రారంభించింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన మహిళ బుర్ర శరవేగంగా పనిచేసింది. అనూహ్యంగా కదిలే రైలు కింద చిక్కుకుపోయిన ఆమె కదలకుండా రైల్వే ట్రాక్‌పై అలాగే పడుకుని ప్రాణాలను దక్కించుకుంది. కీలక సమయంలో గందరగోళానికి గురి కాకుండా సమయస్ఫూర్తిగా ప్రవర్తించిన వైనం ప్రశంసంలందుకుంటోంది. అయితే ఇలాంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని రైల్వేఅధికారులు కోరుతున్నారు. సంయమనం పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. -
షాకింగ్ : కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్‌లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్‌గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
డాక్టర్ పక్కన ఉండగానే...
చండీగఢ్ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో నిరూపించే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. డాక్టర్ పక్కన ఉండగానే ఓ వ్యక్తి చేతికి ప్యూన్ కుట్లు వేశాడు. వివరాలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి రోహతక్ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్ అతడిని పట్టించుకోకుండా పక్కన కూర్చుండిపోయాడు. సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాడు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి ప్యూన్ని పిలవగా.. గాయపడిన వ్యక్తి చేతికి అతడు కుట్లు వేశాడు. ఈ తతంగాన్నంతా ఆస్పత్రిలో ఉన్న ఓ రోగి బంధువు సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నవంబరు 10న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న వైద్యులను ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్యను పెంచేందుకు ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతుంటే డాక్టర్లు ఇలా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు. -
బాలికను హత్య చేసి గోనే సంచిలో వేసి..
-
వణుకుతున్న పంజాబ్
సాక్షి, చండీగఢ్ : ఉత్తర భారతం చలికి గజగజ వణుకుతోంది. ఎన్నడూ లేనంత స్థాయిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో అతితక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. పంజాబ్‌లోని అదమ్‌పూర్‌లో సోమవారం అతి తక్కువగా 3.7 డిగ్రీల సెల్సీయెస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇవే గణాంకాలు బుధవారం నాడు కూడా నమోదయ్యాయి. హర్యానాలో కూడా.. సగటు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అమృత్‌సర్‌లో 5.4 డిగ్రీలు, ఫరీద్కోట్, గురుదాస్‌పూర్‌లలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా లూధియానాలో 5.8, హల్వారాలో 5.9, పఠాన్‌కోట్‌లో 7, చండీగఢ్, పాటియాలలో 8.5 డిగ్రీలు నమోదయ్యాయి. హర్యానాలోని హిస్సార్‌లో 6.1, కర్నాల్ ఏరియాలో 6.5, రోహతక్‌లో 6.4, అంబాలా, సిర్సాలో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. -
ఆ మూడు పరోఠాలు తింటే మొనగాళ్లే
రోహ్తక్ : అది ఢిల్లీ-రోహ్తక్ బైపాస్ రోడ్డు. అక్కడ ఓ బిజీ పఠోఠా సెంటర్ దర్శనిమిస్తుంది. ఆ హోటల్ యాజమాని బోర్డు మీదే ఓ బంఫరాఫర్ ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన చేసే ఛాలెంజ్‌లో మీరు గెలిస్తే చాలూ 5100 రూపాయల నజరానాతోపాటు.. జీవితాంతం అక్కడ ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది. అయితే బరిలోకి దిగే ముందు మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఆషామాషీ పరోఠాలు కావు. ఏదో మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లు అరచేతిలో పట్టే సైజుతో ఉండవు. ఆ ఒక్కో పరోఠా బరువు సుమారు కేజీ దాకా ఉంటుంది. పరిమాణం 1 అడుగు పొడవు, 6 అంగుళాల మందం ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఓడిపోతే ఆ మూడు పరోఠాల ఖర్చుకు అయ్యే సొమ్మును కక్కాల్సి ఉంటుంది. ఇలాంటి మూడు పరోఠాలను మూడు కేజీల పిండితో తయారు చేస్తారు. ఎంతో మంది ముందుకు వచ్చిన ఈ భారీ పరోఠాలను 50 నిమిషాల్లో తినడం తమ వల్ల కాదంటూ తులెత్తేస్తారంట. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సవాల్లో ఎవరూ గెలుపు సాధించలేకపోయారని హోటల్ యజమాని చెబుతున్నారు. హిందుస్థాన్ కా సబ్ సే బడా పరోఠా అని బోర్డు మీద వాటి ఫోటోలు చూశాక కూడా మీరు ఛాలెంజ్‌ను స్వీకరించి గెలిస్తే మాత్రం మీరు నిజంగా మొనగాళ్లేనని ఆయన అంటున్నారు. -
డేరాలో దొంగలు
సాక్షి, రోహతక్ : హర్యానాలోని డేరా సచ్ఛా సౌధలో శనివారం దొంగలు పడ్డారు. దొరికిన విలువైన వస్తులును చేజిక్కించుకుని పారిపోయారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని దొబాడలో ఉన్న డేరాలో దొంగలు శనివారం చొరబడ్డారు. గుర్మీత్ విలువైన దుస్తులు, బూట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు డేరా అధికారులు చెబుతున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన వాటిలో ప్రధానంగా సీసీటీవీలు, కంప్యూటర్, పరుపులు, పలు హార్డ్ డిస్క్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ తరువాత.. డేరా కార్యాలయాల దగ్గర ప్రభుత్వం అత్యంట పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అంతేకాక డేరాకు కూడా సొంత సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఇటువంటి భద్రత మధ్య దొంగలు డేరాలోకి ప్రవేశించడపై పోలీసులు, అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు రోహ్తక్ రేంజి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవదీప్ విర్క్ తెలిపారు. -
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
-
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
- 20 ఏళ్ల కారాగారశిక్ష విధించిన సీబీఐ కోర్టు రోహ్తక్: అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోహ్తక్ జైలులో చేపట్టిన ప్రత్యేక విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్.. తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన కోర్టు.. ఆ మేరకు సోమవారం కఠిన శిక్షను ఖరారు చేసింది. బోరున విలపించిన గుర్మీత్: తనకు 20 ఏళ్ల శిక్ష పడగానే డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ ఒక్కసారిగా బోరున విలపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. రంగురంగుల దుస్తులు మాయం: శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. శిక్షకు ముందు 10 నిమిషాలు: గతవారం సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణ రోహ్తక్ జైలులోనే జరిగింది. జడ్జి జగ్దీప్ సింగ్ ఆదేశాల మేరకు అధికారులు జైలులోనే ఏర్పాట్లుచేశారు. చివరిసారిగా ఇరుపక్షాలూ చెరో 10 నిమిషాలు వాదించేందుకు జడ్జి అవకాశం కల్పించారు. దేశానికి గుర్మీత్ ఎంతో సేవచేశారు: డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. సీబీఐ వాదన: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. -
కనిపిస్తే కాల్చివేత.. రూమర్లు నమ్మొద్దు
రోహ్టక్:రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు శిక్షలు ఖరారు కానున్న నేపథ్యంలో పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్టక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. ‘రోహ్టక్లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తాం. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం లాంటివి చేసినా కాల్చివేయటం జరుగుతుంది. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం’ అని అతుల్ తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని ఆయన అన్నారు. ఇక గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అతుల్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశామని ఆయన చెప్పారు. హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఆ వార్త నిజం కాదు: ఢిల్లీ పోలీసు శాఖ న్యూఢిల్లీ: రామ్ రహీమ్ సింగ్ శిక్ష ఖరారు నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించిన విషయాన్ని ఢిల్లీ పోలీస్ శాఖ ఖండించింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని, ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారని వాట్సాప్ లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ పీఆర్వో మధుర్ వర్మ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలంతా ఉత్తవేనని మధుర్ తేల్చేశారు. అయితే అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం మాత్రం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీడియాపై దాడుల నేపథ్యంలో వారికి పోలీసులతో రక్షణ కల్పించినట్లు మధుర్ తెలిపారు. -
భారత క్రికెటర్ తండ్రిపై కత్తితో దాడి!
రోహ్తక్: క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్తక్లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి68 ఏళ్ల ఓం ప్రకాశ్ రోహతక్ కాథ్‌మండి సమీపంలో తన కిరాణ దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్‌డ్రింక్స్, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి.. తిరిగి వచ్చి ఓంప్రకాశ్‌పై దాడి చేశారు. 'వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో కడుపులో పొడిచారు. వారు దుకాణంలోని డబ్బునంతా తీసుకొని వెళ్లారు. రూ. 7వేల వరకు పట్టుకొని పోయారు' అని ఓంప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దుండగులు గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి.. బయటనుంచి మూసేసి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా చివరి ఓవర్ వేసి.. భారత్ జట్టుకు బౌలర్ జోగిందర్ శర్మ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
యువతి ధైర్య సాహసాలకు ఎస్పీ ప్రశంసలు
రోహ్తక్: తన వస్తువులు చోరీ చేసిన దొంగను ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని, అతడి ఆట కట్టించింది. నిందితుడిని పోలీసులకు పట్టించి శభాష్ అనిపించుకుంది. ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం కూడా అందుకోవడంతో స్థానికంగా ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఆ వివరాలిలా ఉన్నాయి... డింపి గులాటీ అనే యువతి హర్యానాలోని రోహ్తక్లో నివాసం ఉంటోంది. పీఎన్బీ మెట్‌లైఫ్‌లో ఆమె ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆమె పని మీద తన స్కూటీపై ఝజ్జర్ రోడ్డువైపుగా వెళ్తోంది. సునారియాకు చెందిన సందీప్ సింగ్ అనే దొంగ తన బైకుపై ఆమెను కాసేపు ఫాలో అయ్యాడు. ఆమె స్కూటీకి దగ్గరగా తన బైకును పోనిచ్చిన నిందితుడు.. డింపి బ్యాగును చోరీచేసి పరారయ్యేందుకు యత్నించాడు. ఆ దొంగను వెంబడించిన ఆ ధైర్యవంతురాలు కొద్దిసేపట్లోనే తన స్కూటీతో అతడి బైకును ఢీకొట్టి నిలువరించింది. అతడు కింద పడగానే అలర్ట్ అయిన డింపి.. సాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. జరిగిన ఘటనతో కంగుతిన్న నిందితుడు ఇటుకతో తానను తానే గాయపరుచుకుని యువతిని బెదిరించి, ఆమెను దోషిగా చిత్రీకరించాలని చూశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని చోరుడు సందీప్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై 379బీ, 511, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన బ్యాగులో నగదుతో పాటు విలువైన బ్యాంకు కార్డులు ఉన్నాయని దొంగను పట్టుకోవడం తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని డింపి పేర్కొంది. యువ ఉద్యోగిని డింపి సాహస చర్యను రోహ్తక్ ఎస్పీ పంకజ్ నైన్ ప్రశంసించారు. డింపిని తన కార్యాలయానికి పిలిపించి వ్యక్తిగతంగా అభినందించారు. మహిళలకు డింపి చర్య స్ఫూర్తిగా నిలవాలని, అందరూ ఆమెలాగే ధైర్యంగా ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో భూప్రకంపనలు
-
ఢిల్లీలో భూప్రకంపనలు
న్యూఢిల్లీ: భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4: 25 గంటలకు సుమారు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 పాయింట్లుగా నమోదైంది. భూకంప కేంద్రం హరియాణాలోని రోహ్తక్ సమీపంలో భూమిలోపల 22 కిలోమీటర్ల లోతులో ఉందని భూకంప అధ్యయన సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రేప్ చేసి.. ముక్కలుగా నరికి..
హరియాణాలో మరో నిర్భయ ఘటన సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేశారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత 9వ తేదీన సోనిపట్‌లో మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు.. రోహ్తక్కు కారులో తరలించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు సోనిపట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. 11వ తేదీన రోహ్తక్లో మృతదేహాన్ని గుర్తించామని, బాధిత మహిళ ముఖంపైన, పలుచోట్ల కుక్కలు కరిచినట్లు పేర్కొన్నారు. ‘ఆ మహిళపై తొలుత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఇటుకతో తీవ్రంగా కొట్టారు. ఆమె ముఖాన్ని బండరాయికేసి కొట్టారు. తలకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది’ అని ఎస్సై అజయ్ మలిక్ వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేసినట్లు మలిక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ రెండు రోజుల కస్టడీకి తరలించారు. బాధితురాలికి సుమిత్ పరిచయస్తుడేనని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బాధిత మహిళను కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ‘హత్యాచార’ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోనిపట్‌లో మహిళను అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పదించారు. దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. మరో మూడు నెలల్లో హరియాణ వాసుల డేటాబేస్ పూర్తవుతుందని వెల్లడించారు. -
మరో నిర్భయ ఘటన.. మహిళ దారుణహత్య
హరియాణాలో ఘోరం జరిగింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది రోజులకే దాదాపు అలాంటి ఘటనే మరింత ఘోరంగా జరిగింది. ఓ మహిళపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, తర్వాత ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె తలను ఛిద్రం చేసేశారు. ఆమె తలను తమ వాహనంతో తొక్కించేశారు. ఈ ఘోరం హరియాణాలోని రోహ్తక్ జిల్లాలో జరిగింది. నిర్భయ ఘటనలో జరిగినట్లే.. అత్యాచారం చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను ఛిద్రం చేశారు. ఈ ఘటన మే 9వ తేదీన జరిగినా.. నాలుగు రోజుల తర్వాత రోహ్తక్లోని ఐఎంటీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ తన ఆఫీసుకు వెళ్తుండగా ఏడుగురు వ్యక్తులు ఆమెను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. నిర్భయ ఘటనలో జరిగినట్లే అత్యాచారం చేసిన తర్వాత ఏదో పదునైన వస్తువు దూర్చడంతో ఆమె శరీరంలోని అంతర్గత భాగాల్లో కూడా తీవ్రమైన గాయాలు అయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు మే 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించగా, చివరకు ఐఎంటీ ప్రాంతంలో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ముఖాన్ని గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఆమె తల మీద నుంచి వాహనం పోనిచ్చారని పోలీసులు చెప్పారు. ఈ ఘోరంలో తమ పక్కింటి వాళ్ల హస్తం ఉండి ఉంటుందని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే నిందితులు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. -
కేజ్రీవాల్ పై షూ విసిరాడు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం షూ విసిరేశాడు. హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లాలో ఆప్ నిర్వహస్తున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని ర్యాలీలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దుండగుడు కేజ్రీపై షూ విసిరాడు. దీంతో ఒక్కసారిగా ర్యాలీలో కలకలం రేగింది. చెప్పు విసిరిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో కూడా కేజ్రీపై పలుమార్లు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
కార్లో డబ్బు.. అదుపులో ఎయిర్‌ఫోర్స్ అధికారి
న్యూఢిల్లీ: పెద్ద మొత్తంలో పాత, కొత్త నోట్లను కలిగి ఉన్న భారత వైమానిక దళ అధికారి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రోహతక్ జిల్లా బహ్వక్బార్పూర్ గ్రామానికి చెందిన పరమ్ జీత్‌గా గుర్తించారు. ఢిల్లీ నుంచి రోహతక్ వచ్చిన ఎయిర్ ఫోర్స్ అధికారి పరమ్ జీత్‌ను పోలీసులు మధ్యలో అడ్డగించారు. ఆయనను తనిఖీ చేయగా రూ.11.08లక్షల పాత, కొత్త డబ్బు లభించింది. తొలుత మాములుగానే ఆయనను తనిఖీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తన వద్ద డబ్బు ఉందనే కంగారులో ఆర్యా నగర్ వద్ద ఏర్పాటు చేసిన నాకాబంది వద్ద తన కారును ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడిని వెంబడించిన పోలీసులు చివరకు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అసలు విషయం తెలిసింది. అయితే, ఈ డబ్బు ఎక్కడిది అనే విషయంలో వివరణ ఇవ్వలేకపోయారు. ఈ డబ్బులో రూ.3లక్షలు కొత్తవి ఉండగా.. రూ.116లక్షలు పాత కరెన్సీ.. మిగితా మొత్తం కూడా రూ.50, రూ.20, రూ.10 నోట్లలో ఉన్నాయి. అయితే, ఈ నెలాఖరున తన భార్య పుట్టిన రోజు ఉందని, ఆమెకు బహుమతిగా కారును ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్డరిచ్చే క్రమంలో భాగంగా ఈ డబ్బు తీసుకెళుతున్నట్లు తెలిపాడు. అయితే, పోలీసులు మాత్రం ఈ డబ్బుకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే వదంతులతో ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
రోహ్తక్ సందర్శించనున్న ప్రకాష్ సింగ్ కమిటి
ప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలోని జాట్ కమిటి శుక్రవారం రోహ్తక్ సందర్శించనుంది. జాట్ రిజర్వేషన్ల ఆందోళన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కమిటి జిల్లాలోని వివిధ విభాగాల అధికారులను కలిసి సమాచారాన్ని సేకరించనుంది. ఆందోళన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారి వివరాలను కూడ ఈ సందర్భంగా తెలుసుకోనుంది. అదే సమయంలో సమాజంలోని వివిధ విభాగాల ప్రజలను కూడ కమిటి సభ్యులు కలసి అధికారుల పాత్రపై ఆరా తీయనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆందోళన ప్రభావితన ప్రాంతాల్లో ఉదయం పది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పర్యటించనున్న కమిటి... మధ్యాహ్నం మూడు గంటలనుంచీ, సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసు, సివిల్ అధికారులతో సమావేశమవ్వనుంది. అనంతరం 5వ తేదీ కూడ పలువురు ప్రజలను కలసి సమాచారం సేకరించిన సభ్యులు సాయంత్రం నాలుగ్గంటల సమయంలో మీడియాకు వివరాలను సంక్షిప్తంగా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాట్ల రిజర్వేషన్ ఆందోళనపై.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ అధ్యక్షతన హర్యానా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
గ్యాంగ్‌రేప్‌ల పై త్రిసభ్య కమిటీ
ఛండీగఢ్/న్యూఢిల్లీ: జాట్ల ఉద్యమం జరుగుతున్న సమయంలో సోనీపట్ జిల్లాలోని ముర్తాల్ వద్ద మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు హరియాణా ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఒక డీఐజీ సహా ముగ్గురు మహిళా పోలీసు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ర్ట అదనపు చీఫ్ సెక్రటరీ పీకే దాస్ తెలిపారు. ఈ కమిటీలో డీఐజీ రాజ్శ్రీ సింగ్, డీఎస్పీ భారతీ దబాస్, డీఎస్పీ సురిందర్ కౌర్ సభ్యులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యాచారానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అత్యాచారాలకు సంబంధించి ఫిర్యాదులు, సమాచారం అందించాలనుకునేవారు 18001802057 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోల రూపంలో ఆధారాలు ఏమైనా ఉంటే తమకు పంపించాల్సిందిగా పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం కానీ ఫిర్యాదులు కానీ తమకు అందలేదని హరియాణా డీజీపీ వైపీ సింఘాల్ పేర్కొన్నారు. అయితే ఏ చిన్న సమాచారం అందినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 30కి చేరిందని తెలిపారు. ముర్తాల్ అత్యాచార బాధితుల్లో ఢిల్లీకి చెందిన వారు ఎవరైనా ఉంటే న్యాయం కోసం తమ కార్యాలయంలో కాని, లేదా 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ సూచించారు. ఆందోళనల్లో భాగంగా జాట్ లు 17 వేల చెట్లను నరికేశారు. -
మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత!
చండీగఢ్: రిజర్వేషన్ల కోసం జాట్ కమ్యూనిటీ చేపట్టిన ఉద్యమం ఉధృత రూపం దాల్చటంతో హర్యానాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉన్నటువంటి రోహ్తక్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకు బీసీ లేదా ఓబీసీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆరు రోజులుగా జాట్లు చేస్తున్న నిరసణ కార్యక్రమాల్లో పలు హిసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రోహ్తక్లో జాట్లు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం హింసాత్మకంగా మారడంతో 15 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వదంతులు వేగంగా వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జాట్ల ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
9వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి..!
రోహ్తక్: కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న 9వ తరగతి బాలికపై హరియాణాలోని రోహ్తక్లో దారుణం చోటుచేసుకుంది. బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు ఆమెపై నడుస్తున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గురవారం సాయంత్రం కోచింగ్ క్లాస్ నుంచి తిరిగొస్తుండగా బాలికను ఇద్దరు వ్యక్తులు కారులో అపహరించుకుపోయారు. ఆ తర్వాత బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి.. దాదాపు ఆరు గంటలపాటు తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించి బాలికను విడిచిపెట్టారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
అత్యాచారం కేసులో 8 మంది అరెస్టు
చంఢీగఢ్: ఓ యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. వివరాలు.. రోహ్తక్ జిల్లాలోని ఓ గ్రామంలో నేపాలీ మహిళ (28)ను ఈనెల ఒకటో తేదీ సాయంత్రం మద్యం మత్తులో అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఆ యువతి అపస్మారన స్థితిలోకి వెళ్లినా కూడా మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాదాపు మూడు గంటల సేపు ఆ యువతిని రేప్ చేసి అనంతరం హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజేష్ అలియస్ గుచ్చడు, సునీల్ అలియస్ షీలా, సర్వార్ అలియస్ బిల్లు, మన్బీర్, సునీల్ అలియస్ మధ, పవన్, పర్మోద్ అలియస్ పాదాం, సతోష్ లను విచారించి అరెస్టు చేశామని ప్రత్యేక విచారణ బృందం చీఫ్ అమిత్ భాటియా చెప్పారు. తొమ్మిదో నిందితుడుగా ఉన్న సోంబీర్ హత్య చేసిన తరువాత ఢిల్లీకి పరారయ్యాడు. తోటి నిందితులను అరెస్టు చేశారని తెలుసుకున్న కొద్ది గంటల్లోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు. -
రోహ్తక్ అక్కచెల్లెళ్ల మరోసాహసం!
చండీగఢ్: హర్యానాలో గత వారం ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించిన ముగ్గురు ఆకతాయిల భరతంపట్టి వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకుంటున్న రోహ్తక్ అక్కచెల్లెళ్లు ఇద్దరూ మరో సహసం చేశారు. సుమారు నెల కిందట ఇదే తరహాలో పోకిరీలకు బుద్ధిచెప్పిన ఉదంతం తాజాగా బయటపడింది. రోహ్తక్లోని హుడా పార్కుకు వెళ్లిన ఆ అక్కచెల్లెళ్లను అక్కడ ఓ బల్ల మీద కూర్చున్న కొందరు పోకిరీలు వేధించారు. దీంతో ఆగ్రహించిన అక్కచెల్లెళ్లు పోకిరీలతో వాగ్వాదానికి దిగారు. చివరకు అక్కచెల్లెళ్లలో ఒకరు ఓ ఆకతాయిని చితక్కొట్టింది. దాంతో మిగిలిన పోకిరీలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దశ్యాలను చిత్రీకరించిన పార్కులోని ఓ వ్యక్తి 30 సెకన్ల ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పలు వార్తాచానళ్లు సైతం మంగళవారం ఆ వీడియోను ప్రసారం చేశాయి. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అక్కచెల్లెళ్లను ప్రశ్నించగా, ఆకతాయిలు పారిపోయినందునే కేసు పెట్టలేదన్నారు. అలాగే ప్రచారం కోసమే తాము వీడియోలను బయటపెడుతున్నట్లు వ స్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. అది తప్పుడు కేసు: గ్రామస్తులు ఆర్టీసీ బస్సులో అక్కచెల్లెళ్లపై వేధింపులకు పాల్పడిన ఆసన్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అక్కడి గ్రామస్తులంతా వెనకేసుకొచ్చారు. యువకులను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఉదంతంపై మంగళవారం సమావేశమైన వారు ఆ యువకులకు మద్దతు పలకాలని నిర్ణయించారు. బస్సులో సీటు విషయమై అక్కచెల్లెళ్లు, ముగ్గురు యువకుల మధ్య గొడవ తలెత్తిందంటూ వారు మీడియాకు తెలిపారు. బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నిన్న ప్రకటించారు. ** -
తిరగబడ్డ యువతులకు సన్మానం
రోహ్తక్ అక్క చెల్లెళ్లను గౌరవించనున్న హర్యానా సర్కారు చండీగఢ్: బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది. వీరికి నగదు బహుమతి అందచేయనున్నట్లు హరియానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఇటీవల హరియానాలో కళాశాలకు వెళుతున్న యువతుల పట్ల ముగ్గురు పోకిరీలు అసభ్య చేష్టలకు దిగటంతో తీవ్రంగా ప్రతిఘటించి బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మిగతా ప్రయాణికులు చేష్టలుడిగి చూస్తున్నా బాధితుల్లో ఓ యువతి బెల్టుతో నిందితులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను హరియానా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కుల్దీప్, మోహిత్, దీపక్‌లను డిసెంబర్ 6 వరకు రిమాండ్‌కు తరలించారు. యువతులకు కేంద్ర మంత్రుల ప్రశంసలు యువతులంతా రోహ్తక్ అక్కచెల్లెళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి ఉమా భారతి సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు అన్ని రకాలుగా ముప్పు ఉందని ఈ సంఘటనతో తేలిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, కన్ల్సాకి చెందిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోగా విడుదల చేయాలని గ్రామస్తులు హెచ్చరించా రు. తమ గ్రామ యువకులపై తప్పుడు కేసులో బనాయించారని ఆరోపించారు. ఇది వేధింపుల కేసు కాదని, సీట్ల గురించి వివాదమన్నారు. -
తిరగబడ్డ ఆడబిడ్డలు:- చర్చ
-
తిరగబడ్డ ఆడబిడ్డలు!