
ప్రతీకాత్మక చిత్రం
కీలక సమయంలో గందరగోళానికి గురి కాకుండా సమయస్ఫూర్తిగా ప్రవర్తించిన వైనం ప్రశంసంలందుకుంటోంది
సాక్షి, ముంబై: హర్యానాలోని రోహ్‌తక్‌లో ఒక అసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటేందుకు తొందరపడిన ఒక మహిళ అంతే చాకచక్యంగా ప్రాణాలను కాపాడుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. పట్టాలపై రైలు నిలిచి ఉండగా, దానికిందినుంచి పట్టాలను దాటేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ఇంతలో సిగ్నల్ లభించడంతో రైలు అకస్మాత్తుగా కదలడం ప్రారంభించింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన మహిళ బుర్ర శరవేగంగా పనిచేసింది. అనూహ్యంగా కదిలే రైలు కింద చిక్కుకుపోయిన ఆమె కదలకుండా రైల్వే ట్రాక్‌పై అలాగే పడుకుని ప్రాణాలను దక్కించుకుంది.
కీలక సమయంలో గందరగోళానికి గురి కాకుండా సమయస్ఫూర్తిగా ప్రవర్తించిన వైనం ప్రశంసంలందుకుంటోంది. అయితే ఇలాంటి తొందరపాటు చర్యలకు దిగవద్దని రైల్వేఅధికారులు కోరుతున్నారు. సంయమనం పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.