
రోహ్‌తక్: హర్యానాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తేన భార్య వావాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంగా సదరు వ్యక్తిని భర్త దారుణంగా హత్య చేశాడు. అతడు బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్‌తక్‌లో జగ్‌దీప్ అనే వ్యక్తి హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. యోగా గురువైన హరిదీప్.. హర్యానాలోని మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధిస్తుంటాడు. అయితే, హరిదీప్.. జగదీప్ ఇంట్లో అద్దెకు ఉంటూ.. అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం హరిదీప్‌కు తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో హరిదీప్ తన స్నేహితులతో కలిసి జగ్‌దీప్‌ను కిడ్నాప్ చేశాడు. అనంతరం, హరిదీప్ బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. బోర్ వెల్ కోసం అని ముందుగానే కార్మికులకు చెప్పి ఏడు అడుగులు గొయ్యి తవ్వించాడు.
ఇదిలా ఉండగా.. హరిదీప్ చనిపోయిన పది రోజుల తర్వాత అతడు కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు వచ్చింది. దీంతో, దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో, జగదీఫ్ కాల్ డేటా, రికార్డింగ్‌లను పరిశీలించిన తర్వాత అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ హత్య ఉదంతం గతేడాది డిసెంబర్‌లో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన మూడు నెలల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఇక, తాజాగా ఈ ఘటన బయటకు రావడంతో స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment