buried alive
-
సజీవంగా పూడ్చేశారు.. వీధి కుక్కలే కాపాడాయి
ఉత్తరప్రదేశ్: ఒక యువకుడి ప్రాణాలను వీధి శునకాలు కాపాడిన విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్‌పై జూలై 18న అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.రూప్ కిశోర్ మృతి చెందాడని భావించిన నిందితులు ఒక ప్రాంతంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తవ్వాయి.. ఆ యువకుడి శరీరాన్ని కొరకడంతో స్పృహ వచ్చింది. దీంతో అతడు స్థానికుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.రూప్ కిశోర్ తల్లి స్పందిస్తూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. -
హిమాచల్, ఉత్తరాఖండ్‌లో భీకర వర్షం
షిమ్లా/డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొంచచరియలు విరిగిపడుతుండడంపై పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు సైతం కూలిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. వర్షాలు, కొండచరియల ధాటికి రాష్ట్రంలో కనీసం 51 మంది మరణించారని అధికారులు సోమవారం ప్రకటించారు. వీరిలో ఏడుగురు రాజధాని షిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు విరిగిపడడంతో రాళ్ల కింద చిక్కుకొని సజీవ సమాధి అయ్యారని వెల్లడించారు. ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. షిమ్లాలో ఈ శివాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. నిత్యం పద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే షిమ్లాలోని ఫగ్లీ ప్రాంతంలో కొండచరియల వల్ల ఐదుగురు మరణించారు. ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని అధికారులు రక్షించారు. అంతేకాకుండా చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా 752 రహదారులపై రాకపోకలను నిలిపివేశారు. సైన్యంతోపాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రాలో 273 మిల్లీమీటర్లు, ధర్మశాలలో 250 మిల్లీమీటర్లు, సుందర్‌నగర్‌లో 168 మిల్లీమీటర్లు, మండీలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 12 జిల్లాలకుగాను 9 జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షా దిగ్భ్రాంతి షిమ్లాలో కొండచరియలు విరిగిపడడం వల్ల ధ్వంసమైన శివాలయాన్ని ముఖ్యమంత్రి సుఖీ్వందర్‌సింగ్ సుఖూ సందర్శించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశలో వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో జనం మరణించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. కేదార్‌నాథ్‌కు రాకపోకలు బంద్ ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. కొండచరియలు విరిగి పడడంతో పలు ఇళ్లు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ప్రైవేట్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ధ్వంసమైంది. వర్ష బీభత్సం వల్ల రాష్ట్రంలో నలుగురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. పలుచోట్ల జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రికి రాకపోకలు నిలిచిపోయాయి. చార్దామ్ యాత్రను రెండు రోజుల పాటు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, రిషికేశ్‌లో అలకనంద, మందాకినీ, గంగా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్‌లో 435 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...
ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్ గాడ్జ్ట్లు ఆకర్షణీయంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్‌గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్ వాచ్ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది. వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్‌కి చెందిన యంగ్ సూక్ ఆన్ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్ క్యోంగ్ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్‌తో చుట్టి గ్యారెజ్ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సాయంతో అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది. ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్‌తో సీల్ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్ వాచ్ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది. (చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!) -
దారుణం.. దిబ్బను తవ్వి చూస్తే
లక్నో: ఉత్తప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని సోనౌరా గ్రామంలోని కొందరు ప్రజలకు ఓ హృదయవిదారకర ఏడుపు వినిపించింది. ఎవరో చిన్న బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేక ఏడుస్తున్నట్లు తోచింది. దాంతో గ్రామస్తులు ఆ ఏడుపు వినిపించే దిశగా ప్రయాణం చేసి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర ఆగారు. చుట్టూ పరికించి చూడగా ఇసుక, మట్టి కలిసిన ఓ దిబ్బ దగ్గర వారి చూపు ఆగిపోయింది. అక్కడ వారికి ఓ పసికందు కాలు కనిపించింది. దాంతో జనం జాగ్రత్తగా ఆ దిబ్బను తవ్వి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. వెంటనే ఆ పసివాడిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని శుభ్రం చేసి తగిన చికిత్స చేశారు. ప్రస్తుతం పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని.. కాకపోతే కాస్తా బురదను మింగాడని ప్రమాదం ఏం లేదని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు. -
కరోనా ఎఫెక్ట్ : వేల కోళ్లు సజీవ సమాధి
బెంగళూరు : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ తింటే కరోనా విస్తరిస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో.. ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెలగావిలోని గోకాక్‌కు చెందిన నజీర్ అహ్మద్ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్‌లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నజీర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి రూ. 6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా.. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నారు. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : కోడికి కరోనా బూచి) A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak, #Belagavi decided to bury #chicken from his #poultry farm, following steep fall in price due to #CoronavirusOutbreak. @DeccanHerald @CMofKarnataka @mani1972ias #Coronavid19 Nazeer Makandar pic.twitter.com/OExEPM39ay — Niranjan Kaggere (@nkaggere) March 10, 2020 -
సజీవ సమాధికి సిద్దపడ్డ వృద్ధుడు
-
స్వయంగా సమాధి కట్టుకుని..
సాక్షి, మాచర్ల: ఆధ్యాత్మిక భావన కలిగిన ఓ వృద్ధుడు సజీవ సమాధి అయ్యేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాతిరెడ్డి లచ్చిరెడ్డి తాను సజీవ సమాధికిలో వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడని అంటూ స్వయంగా సమాధి నిర్మాణ పనులు చేపట్టాడు. పది అడుగుల లోతులో దాన్ని నిర్మించి ఇనుప తలుపులు కూడా ఏర్పాటు చేశాడు. బుధవారం మంచి రోజని, తనకు సమాధిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో లచ్చిరెడ్డిని సమాధిలోకి వెళ్లకుండా చూడాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. మాచర్ల రూరల్ సీఐ దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఎస్ఐ లోకేశ్వరరావు గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకొని సమాధిలోకి వెళ్లటం నేరమని కౌన్సెలింగ్ చేశారు. ఆధ్యాత్మిక భావనలతో పదేళ్లుగా లచ్చిరెడ్డి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. -
పూడ్చిపెట్టిన 8 గంటల తర్వాత..
రియో డీ జెనీరో, బ్రెజిల్ : పుట్టుకతోనే మరణించిదనకున్న పాప పూడ్చిపెట్టిన ఎనిమిది గంటల తర్వాత ఏడ్చిన ఆశ్చర్యకర సంఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. జన్మించినప్పుడే బేబీ మరణించిందని అనుకుని పూడ్చిపెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కొద్దిగంటల అనంతరం అటుగా వెళ్తున్న పోలీసులకు ఏడుపు వినిపించింది. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న వారు టార్చ్‌లైట్ వెలుతురులో బేబీని మట్టిలో నుంచి బయటకు తీశారు. అనంతరం శ్వాస ఆడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. -
50 మేకలు సజీవ దహనం
బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జునోని గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మేకలు సజీవ దహనమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంటిలో మంటలు లేవగా పక్కనే ఉన్న మేకల కొట్టానికి అంటుకున్నాయి. అందులో కట్టేసి ఉన్న సుమారు 50 మేకలు అగ్నికీలల్లో చిక్కుకుని మృతి చెందాయి. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. -
ఇద్దరు వ్యక్తుల సజీవదహనం
చందర్లపాడు: తాటిమట్టలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వలిబోయిన వెంకటేశ్వరరావు (35) ఇంటిముందు పందిరి వేసుకునేందుకు తాటాకుల కోసం మునేటి ఒడ్డున ఉన్న పామాయిల్ తోటకు వెళ్లాడు. ఆ తోటకు కావలి కాస్తున్న ధారావత్ అర్జానాయక్ (55) సహాయంతో ఇనుప పైప్‌నకు కొడవలి కట్టి తాటిమట్టలు నరుకుతున్నాడు. ఇనుప పైప్ అదుపుతప్పి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇద్దరూ అక్కడికక్కడే కాలిపోయారు. వెంకటేశ్వరరావు కూలి పనులకు వెళుతుంటాడు. కాగా అర్జానాయక్ ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కండ్రికకు చెందినవాడు. -
సౌదీలో దారుణం.. సజీవంగా 5 భారతీయుల ఖననం
రియాద్: బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియాకు వెళ్లిన ఐదుగురు భారతీయుల జీవితాలు విషాదకర రీతిలో ముగిశాయి. వీరిలో ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడనే కారణంతో ఐదుగురినీ ఘోరాతిఘోరంగా చంపారు. చిత్రహింసలకు గురిచేసి బతికుండగానే ఖననం చేశారు. ఒళ్లు జలదరించే ఈ సంఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుల్లో ఓ వ్యక్తి కోర్టులో ఇచ్చిన వాంగూల్మం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్ ఖతిఫ్లో అలీ హబీబ్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం ఓ మహిళ నుంచి వ్యవసాయ భూమిని గుత్తకు తీసుకున్నాడు. ఇటీవలను పొలాన్ని చదును చేస్తుండగా ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ కేసులో పోలీసులు 25 మందిని అరెస్ట్ చేయగా అసలు విషయం బయటపడింది. 2010లో ఈ నేరం చేసినట్టు ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫామ్‌కు వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అక్కడ ఐదుగురు వ్యక్తుల్ని చేతులు కట్టేసి బంధించారని కోర్టుకు వివరించాడు. వారిలో ఒక వ్యక్తి యజమాని కుమార్తె, ఇతర మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు చెప్పినట్టు తెలిపాడు. తాము మద్యం సేవించి భారతీయులను ఓ గదిలో బంధించి విచక్షణా రహితంగా కొట్టినట్టు చెప్పాడు. అనంతరం వారు కదలకుండా తాళ్లతో కట్టేశామని నిందితుడు కోర్టుకు వివరించాడు. వారిని ట్రక్‌లో తరలించి ఫామ్‌లో 2.5 మీటర్ల లోతున గోతిని తవ్వి బతికుండగానే ఖననం చేసినట్టు చెప్పాడు. వారితో గుర్తింపు కార్డులను పూడ్చివేసినట్టు తెలిపాడు.