లక్నో: ఉత్తప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని సోనౌరా గ్రామంలోని కొందరు ప్రజలకు ఓ హృదయవిదారకర ఏడుపు వినిపించింది. ఎవరో చిన్న బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేక ఏడుస్తున్నట్లు తోచింది. దాంతో గ్రామస్తులు ఆ ఏడుపు వినిపించే దిశగా ప్రయాణం చేసి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర ఆగారు. చుట్టూ పరికించి చూడగా ఇసుక, మట్టి కలిసిన ఓ దిబ్బ దగ్గర వారి చూపు ఆగిపోయింది. అక్కడ వారికి ఓ పసికందు కాలు కనిపించింది. దాంతో జనం జాగ్రత్తగా ఆ దిబ్బను తవ్వి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. వెంటనే ఆ పసివాడిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని శుభ్రం చేసి తగిన చికిత్స చేశారు. ప్రస్తుతం పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని.. కాకపోతే కాస్తా బురదను మింగాడని ప్రమాదం ఏం లేదని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment