Telangana News: శిశువును గాయపరిచిన ఎలుక.. చికిత్స పొందుతూ శిశువు మృతి!
Sakshi News home page

శిశువును గాయపరిచిన ఎలుక.. చికిత్స పొందుతూ శిశువు మృతి!

Published Mon, Dec 25 2023 12:54 AM | Last Updated on Mon, Dec 25 2023 10:45 AM

- - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఎలుక కరవడంతో గాయపడిన శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన శివ కుటుంబం జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో నివాసం ఉంటోంది. శివ దంపతులకు 40 రోజుల క్రితం బాలుడు జన్మించడంతో భార్య, కుమారుడు నాగనూలులోని అత్తగారింటిలో ఉంటున్నారు.

శనివారం సాయంత్రం బాలుడి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న శిశువు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement