Infant baby
-
ఫుడ్ సపోర్టింగ్
చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ... అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది.త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు... ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా. -
శిశువును గాయపరిచిన ఎలుక.. చికిత్స పొందుతూ శిశువు మృతి!
నాగర్‌కర్నూల్ క్రైం: ఎలుక కరవడంతో గాయపడిన శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములకు చెందిన శివ కుటుంబం జిల్లాకేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో నివాసం ఉంటోంది. శివ దంపతులకు 40 రోజుల క్రితం బాలుడు జన్మించడంతో భార్య, కుమారుడు నాగనూలులోని అత్తగారింటిలో ఉంటున్నారు. శనివారం సాయంత్రం బాలుడి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న శిశువు శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..?
లండన్: వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
కుటుంబాన్ని చంపి తగులబెట్టి.. మృతుల్లో ఆరు నెలల పసికందు..
జోధ్‌పూర్: రాజస్థాన్ లో హోరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జోధ్‌పూర్ సిటీకి సమీపంలోని చౌరాయి గ్రామంలో కొంతమంది ఆగంతకులు ఒక కుటుంబంలోని నలుగురిని అత్యంత కిరాతకంగా చంపి దహనం చేశారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఇంటిలోంచి పొగలు వస్తుండటంతో అనుమానమొచ్చింది స్థానికులు పోలీసులకి సమాచారమందించి ఆ ఇంటిలోకి వెళ్లి చూస్తే అప్పటికీ ఆ కుటుంబంలో అందరూ కాలిపోయి విగతజీవులుగా మారినట్టు తెలిపారు. మృతుల్లో పునారామ్(55), భావ్రీ దేవి(50), దాపు(మేనకోడలు) ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇంటి ప్రాంగణంలోకి వెళ్లి చూస్తే మరో హృదయవిదారక దృశ్యం.. వారి కుమార్తె ఆరు నెలల పసికందు బూడిద కుప్పగా మిగిలి ఉంది. వీరందరినీ మొదట గొంతు కోసి తర్వాత తగలబెట్టారని చెబుతున్నారు పోలీసులు. ఈ హత్యలకు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదని పునారామ్ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని వెళ్లదీసే వాడని తెలిపారు. బహుశా వ్యక్తిగత కక్షలే ఈ హత్యలకు కారణమై ఉంటాయని చెబుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దొరికిందే అవకాశం ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిష్టితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 రేప్ లు 7 మర్డర్లు జరిగాయని అన్నారు. రాజస్థాన్ లో శాంతి భద్రతలు ఎప్పుడో మంట కలిసిపోయాయని.. ముఖ్యమంత్రి చూస్తే ఎమ్మెల్యేలే నా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని పొగుడుకుంటూ ఉంటారన్నారు. ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు అహంకారం నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట.. -
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత
పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అయితే వివాహం తర్వాత కొంత మంది దంపతులకు సంతానం కలగడం ఆలస్యం కావడంతో డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరికి పిల్లలు పుడితే.. మరికొందరి ప్రయత్నాలు విఫలమై దత్తత లాంటివి వాటితో పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైన పెళ్లైన దంపతులకు పిల్లలు లేకపోతే వారి పడే మనోవేదన వర్ణణాతీతమనే చెప్పాలి. అలాంటిది ఓ తల్లి మాత్రం తనకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టినప్పుడు కూడా అంతే కఠినంగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉండగా ఆమె తన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో.. తొలుత ఆమె పోలీసుల విచారణకు సహకరించలేదు. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు లభ్యం కాగా చివరికి తన పసిపిల్లలను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. ఈ హత్యల గురించి తనకు తెలియదని మహిళ భర్త తెలిపాడు. తన భార్య తనకు రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు చెప్పిందని అతను చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్‌లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిడిల్‌క్లాస్ భర్త.. రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. జాబ్ వచ్చాక మరొకడితో -
అంతా మిస్టరీగా ఉంది.. కుళ్లిన శవాల మధ్య సజీవంగా నవజాత శిశువు!
నాలుగు రోజులు వయసున్న ఓ నవజాత శిశువు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ జిల్లా సహరాన్ పుర్ కు చెందిన కాసిఫ్ , ఆనమ్ దంపతులు టర్నర్ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆనమ్ జూన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. అదేరోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా ఆ ఇంట్లోనే గత మూడు రోజులుగా ఆ దంపతులు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి నాలుగు రోజుల వయసున్న చిన్నారి కూడా సజీవంగా కనిపించింది. తక్షణమే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాసిఫ్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా కాషిఫ్‌కు ఇది రెండో పెళ్లి వివాహమని స్థానికులు చెబుతున్నారు. మృతుడి మొదటి భార్య నుస్రత్ అందించిన అదనపు సమాచారం ప్రకారం, గత రెండు మూడు రోజులుగా కాసిఫ్‌తో సంప్రదించడానికి ఆమె ప్రయత్నించిన అది కుదరలేదని తెలిపింది. జూన్ 10వ తేదీ రాత్రి 11 గంటలకు చివరిసారిగా కాసిఫ్‌తో మాట్లాడినట్లు నుస్రత్ పోలీసులకు చెప్పింది. గతంలో ఒకరి వద్ద తీసుకున్న రూ. 5 లక్షల అప్పు గురించి కాసిఫ్ తనతో చెప్పాడని నుస్రత్ చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: మణిపూర్‌లో మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు -
అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్
కీసర: నెలలు పూర్తిగా నిండకుండా.. గుండె చప్పుడు లేకుండా అప్పుడే పుట్టిన మగబిడ్డకు సీపీఆర్ చేసి కీసర 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. వివరాలివి. కుందన్‌పల్లిలోని కోళ్లఫాంలో పనిచేసే ఆర్తికుమారి పురిటినొప్పులతో కీసరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నెలలు పూర్తిగా నిండకపోవడం.. పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనందున గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గర్భిణిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈఎంటీ చిత్రం రవి వాహనంలోనే ఆమె సుఖప్రసవం చేశారు. పుట్టిన మగబిడ్డ బరువు తక్కువగా ఉండి నాడి, శ్వాస గుండెచప్పుడు లేకపోవడం గమనించి ఈఆర్సీపీ వైద్యుడు మహీద్‌ను ఫోన్లో సంప్రదించారు. ఆయన సూచన మేరకు బిడ్డకు సీపీఆర్ చేసి అంబు బ్యాగ్‌తో శ్వాస అందిస్తూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని పేర్కొని 108 సిబ్బందిని అభినందించారు. -
వార్డుబాయ్ తప్పిదం... ఆడ బిడ్డకు బదులు మగ బిడ్డను ఇవ్వడంతో
సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్): వార్డుబాయ్ చేసిన తప్పిదంతో పిల్లలు మారిపోయి గందరగోళం నెలకొన్న సంఘటన మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన జ్యోతి కుటుంబం అల్మాస్‌గూడలో నివాసం ఉంటోంది. జ్యోతి మంగళవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే సిబ్బంది తల్లికి బిడ్డను చూపించారు. మార్డుకు మార్చే సమయంలో వార్డు బాయ్ రమ్య అనే మహిళకు జన్మించిన మగబిడ్డను జ్యోతి పక్కన పడుకోబెట్టాడు. ఇది గమనించిన జ్యోతి బంధువులు ఆడపిల్ల పుట్టిందని చెప్పి మగ పిల్లాడిని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించడంతో.. జరిగిన పొరపాటును గుర్తించి ఆడపిల్లను వారికి అప్పగించారు. ఇదేమని జ్యోతి బంధువులు ప్రశ్నించడంతో వార్డు బాయ్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బంధువులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు -
శిథిలాల కింద 90 గంటలపాటు సజీవంగా 10 రోజుల పసికందు
-
ఏపీ: బాలభీముడు @5.8 కేజీలు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు వంద పడకల ప్రభుత్వాస్పత్రిలో ఒక మహిళ 5.8 కేజీల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన నాగిరెడ్డి భార్య తేజస్వినిని మూడో కాన్పులో భాగంగా శనివారం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాన్పు కష్టమయ్యే అవకాశం ఉన్నందున వెంటనే గుంతకల్లు లేక ఆదోనికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆమెను గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రసూతి వైద్యురాలు సుజాత ఆధ్వర్యంలో దాదాపు గంట పాటు శ్రమించి సాధారణ కాన్పు చేశారు. పుట్టిన మగబిడ్డ 5.8 కేజీల బరువున్నాడు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. హైరిస్క్ అయినప్పటికీ ఎటువంటి సమస్య రాకుండా సాధారణ కాన్పు చేసినందుకు వైద్యురాలికి తేజస్విని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యో పాపం.. పసికందును రేకుల ఇంటిపై వదిలివేత
సాక్షి, హైదరాబాద్: కన్నబిడ్డను చూసి నోరులేని మూగజీవి సైతం మురిసిపోతుంది. తనివితీరా బిడ్డను చూసుకుని పురిటి నొప్పులను సైతం మరిచిపోతుంది. ప్రపంచంలో తెంచుకోలేనిది పేగు బంధం అంటారు. అలాంటిది ఓ తల్లి తన కన్నబిడ్డ పేగు సైతం ఎండకముందే ఆ బంధాన్ని తెంచేసుకుంది. తల్లి చనుబాల రుచిని సైతం ఎరగని చిన్నారిని ఓ రేకుల ఇంటిపై ఉంచి వెళ్లిపోయారు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల డివిజన్ డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఓ ఇంటిపై ఉన్న యువకుడు.. కింద నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దాలను విన్నాడు. కిందకు చూడగా ఓ రేకుల ఇంటిపై పసికందు కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో చిన్నారిని రేకుల ఇంటి నుంచి కిందకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పసికందుకు షాపూర్‌నగర్‌లో ప్రథమ చికిత్స అందించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
Hyderabad: నేనేమి చేశాను నేరం!
సాక్షి, ఉప్పల్: నెలన్నర వయస్సున్న ఆడ శిశువును చెట్ల పొదల్లో వదిలేసిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పల్ హెచ్ఎండీఎ లే అవుట్ భగాయత్ లేఅవుట్ డీమార్టు వద్ద చెట్ల పొదల్లో ఆదివారం ఓ చిన్నారిని గుర్తించిన వాకర్స్ 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టంనిమిత్తం గాం«దీకి తరలించారు. అయితే.. చనిపోయిన శిశువును వదిలేసి వెళ్లారా.. లేక బతికి ఉండగానే వదిలేసి వెళ్లారా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్.. ఆ ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. చదవండి: అంబేద్కర్ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన -
సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
HYD: పాతబస్తీలో దారుణం.. ఆసుపత్రిలో డ్యాన్స్‌లతో హంగామా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేశారు. వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీ చేసుకున్నారు. డీజేలతో డ్యాన్స్‌లు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వేడుకల్లో మునిగిపోయారు. ఈ సమయంలో పురిటి నొప్పులతో ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. పార్టీలో లీనమై ఎంజాయ్ చేశారు.ఈ క్రమంలో శిశువు మృతిచెందింది. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతి చెందిన శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్.. -
పక్కా సమాచారంతో స్ట్రింగ్ ఆపరేషన్.. ఆ ముఠా గుట్టురట్టు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: ఖమ్మం కేంద్రంగా శిశు విక్రయాలు సాగిస్తున్న ముఠా కార్యకలాపాలను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టీఓ), చైల్డ్‌లైన్ బృందం బట్టబయలు చేసింది. నవజాత శిశువులతో పాటు అప్పుడే పుట్టిన పసికందులను విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో రంగంలోకి దిగిన బృందం తమకు పిల్లలు కావాలని ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఆతర్వాత డబ్బు చెల్లిస్తామని నమ్మబలుకుతూ ముఠా గుట్టు రట్టు చేయడం విశేషం. ఈమేరకు ముఠా సభ్యులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేయగా వివరాలిలా ఉన్నాయి. పిల్లలు లేని దంపతులే టార్గెట్ వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగని దంపతులు అధికారికంగా దత్తత ప్రక్రియపై అవగాహన లేక ఇతరులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదునుగా రంగంలోకి దిగిన ముఠా, పిల్లలను పోషించలేని వారి నుంచి తీసుకుని రూ.లక్షల్లో నగదు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో జిల్లాకేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన ఉప్పతల పుల్లారావు, అద్దంకివారి వీధికి చెదిన మోదుగు మేరీ నవజాత శిశువులు, చిన్న పిల్లలను అమ్ముతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్ – 1098 కోఆర్డినేటర్ కువ్వారపు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన చైల్డ్‌లైన్ ఉన్నతాధికారులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ నవీన్, సీడీపీఓ కవితకు తెలిపారు. ఈమేరకు మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు అనూష, నరసింహారావు, భాస్కర్‌ను బృందంగా ఏర్పాటుచేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయించారు. వీరు ముగ్గురు మేరీతో పరిచయం పెంచుకుని తమకు పాప కావాలని కోరారు. ఎంత నగదైనా చెల్లిస్తామని చెప్పడంతో ఆమె పలువురు పసిపిల్లల ఫొటోలను వాట్సాప్‌లో పంపించి ధర కూడా వెల్లడించింది. ఇటీవల ఓ పాపను విక్రయించినట్లు చెబుతూ బాండ్ పేపర్లపై రాసిస్తామని, భవిష్యత్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పగా అన్ని వివరాలు రికార్డు చేశారు. ఇంతలోనే ఖమ్మం జెడ్పీ సెంటర్లోని ఓ ఆస్పత్రిలో కొణిజర్ల మండలానికి చెందిన మహిళ మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, ఆమె డిశ్చార్జి కాగానే పాపను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.4లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు ఇవ్వాలని సూచిస్తూ నగదుతో జెడ్పీ సెంటర్‌కు రావాలని చెప్పింది. ఇందుకు ఒప్పుకున్న అనూష బృందం నగదు, బాండ్ పేపర్లతో సోమవారం సాయంత్రం జెడ్పీసెంటర్‌కు వెళ్లగా ఖమ్మం టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పుల్లారావు, మోదుగు మేరీతో పాటు వీరికి సహకరించిన తలారి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, శిశువును విక్రయించేందుకు ముందుకొచ్చిన ఆమె తల్లి, ఓ ఆస్పత్రి ఉద్యోగి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా శిశు విక్రయాల వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించిన చైల్డ్‌లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ప్రతినిధులను చైల్డ్‌లైన్ డైరెక్టర్ ఎంఎల్.ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతీరాణి తదితరులు అభినందించారు. చదవండి: రాజాసింగ్‌కు షాక్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ∙ -
నాలుగు నెలల బాబు కోసం ఇద్దరి తల్లుల వివాదం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్లో నాలుగు నెలల బాబుకోసం ఇద్దరు తల్లుల మధ్య వాగ్వివాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలూరు గ్రామానికి చెందిన ఇందిర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తనకు బాబు పుట్టగానే రూ.40 వేలకు ఆకుల కొండూరుకు చెందిన సునీతకు విక్రయించింది. అయితే ఇందిర గురువారం తన బిడ్డ తనకు కావాలని సునీత తల్లితో కలిసి నివసించే ఆనంద్‌నగర్‌లోని ఇంటికి వెళ్లింది. సునీతతో వాగ్వివాదానికి దిగి ఇంటి ముందు బైఠాయించింది. సమాచారం తెలుసుకున్న 5వ టౌన్ పోలీసులు విచారణ జరిపి బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా పోలీసు స్టేషన్లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
అమానుషం: ఎవరిదీ పాపం.. మరుగుదొడ్డి వద్ద శిశువు మృతదేహం
తిరువళ్లూరు(చెన్నై): ఓ ప్రైవేటు వైద్యశాల ఆవరణలో ఆడశిశువు మృతదేహం మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. చోళవరం అత్తిపట్టులో ఎంఎంఆర్వీ వైద్యశాల ఉంది. ఇక్కడ సాధారణ, అత్యవసర సేవలకు చిక్సిత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాల ఆవరణలోని ఓ మరుగుదొడ్డి వద్ద ఆడశిశువు మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్టు గుర్తించి చెన్నై వైద్యశాలకు తరలించారు. కాగా నవజాత శిశువును మరుగుదొడ్డికి సమీపంలో పడేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మరో ఘటనలో.. కూలిన విద్యుత్ స్తంభం తిరుత్తణి: తిరుత్తణి శివారులోని కాశినాధ పురం దళితవాడలో హై ఓల్టేజీ విద్యుత్ స్తంభంపై పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పడి విద్యుత్‌స్తంభం కూలింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో ఇళ్ల ముందు ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభం కూలిన సమయంలో వీధిలో ప్రజలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం కూలిన విద్యుత్ స్తంభం తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దుస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. చదవండి: తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష -
హృదయ విదారకం: చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం
తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగత జీవిగా మారిందో పసికందు. అప్పుడే పుట్టిన పాపాయికి.. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని చూడక ముందే కన్నుమూసింది. సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పడే పట్టిన ఓ పసికందు మృతదేహం చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించేందుకు రాగా చెత్తకుప్పల పక్కనే ఉన్న మూటలో చిన్నారి మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువుని చంపి మూటలో కట్టి చెత్త కుప్పలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: Extra Marital Affair: వాటర్‌మెన్‌తో పరిచయం, భర్తతో కలిసి ఉండలేక.. -
పిల్లల కోసం అడ్డదారులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పిల్లలు కలగలేదని కుమిలిపోవాల్సిన అవసరం లేదు. వారికోసం అడ్డదారులు తొక్కనవసరం లేదు. సన్మార్గంలోనే పిల్లలను దత్తత తీసుకోవచ్చు. చట్టబద్ధంగా అన్ని హక్కులు పొందవచ్చు. అయినా కొందరు మాత్రం పక్కదారి పడుతున్నారు. చట్టం, సమాజం దృష్టిలో నేరస్తులవుతున్నారు. తాజాగా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో అపహరించిన పసికందుతో పట్టుబడిన దంపతుల దుస్థితి ఇదే. గ్రామస్తులను నమ్మబలికి.. స్థానికుల కథనం ప్రకారం కవిటి మండలం కొత్తవరకకు చెందిన రైతు కుటుంబం మాదిన రాజేష్, లక్ష్మీప్రసన్నకు పిల్లలు కలగలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అడ్డదారి తొక్కారు. ఈ క్రమంలో స్థానికులను నమ్మబలికించారు. గుజరాత్, తదితర రాష్ట్రాల్లో పిల్లల కోసం మంచి వైద్యం అందిస్తున్నారని స్థానికులకు చెప్పి కొన్ని నెలల క్రితం ఊరు విడిచి వెళ్లారు. అక్కడ చేసిన వైద్యంతో గర్భం దాల్చి, బిడ్డను కన్నారని చెప్పుకుని సొంతూరికి వస్తున్నామంటూ గ్రామస్తులకు సమాచారమిచ్చారు. ఈ లోపు మార్గమధ్యలో కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పోలీసుల జరిపిన తనిఖీల్లో పసికందుతో పట్టుబడ్డారు. వారి కన్న బిడ్డతో వెళ్తే పోలీసులు పట్టుకోవడమేంటని సందేహం రావచ్చు. కానీ వారి చేతిలో ఉన్న పసికందు వారిది కాదు. విశాఖపట్నం కేజీహెచ్‌లో వేరొక తల్లికి జన్మించిన బిడ్డను మధ్యవర్తుల ద్వారా అపహరించి తీసుకొచ్చిన పసికందు అది. ఇంకేముంది పోలీసులకు చిక్కారు. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎదుర్కొని, జైలు పాలు కావల్సిన పరిస్థితి. పసికందును అపహరించి తీసుకొచ్చిన లక్ష్మీ ప్రసన్న గతేడాది జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దత్తత విధానమే మేలు.. సంతానం కలగని దంపతులు జిల్లాలో ఉన్న శిశు గృహ(ప్రత్యేక దత్తత సంస్థ)ను సంప్రదించి పిల్లలను దత్తత తీసుకోవచ్చు. అవాంఛిత గర్భం, రోడ్డు పక్కన దొరికిన పిల్లలు.. తదితర శిశువులను చేరదీసి శిశుగృహలో అలనాపాలనా చూస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి పిల్లల్ని దత్తత తీసుకుందామనుకుంటే ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి.జీn వెబ్సైట్లో దరఖాస్తు చేస్తే చాలు సీరియల్ పద్ధతిలో జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ శిశు గృహల్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఉంది. అంతా చట్టబద్ధంగా జరుగుతుంది. మన జిల్లాలోని శిశుగృహలో ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వారు మధ్యవర్తులను నమ్మి మోసపోవడం కంటే శిశు గృహను సంప్రదిస్తే మంచిదని జిల్లా పిల్లల సంరక్షణ అధికారి కె.వి.రమణ విజ్ఞప్తి చేస్తున్నారు. -
భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో సహజీవనం.. చిన్నారి పాలకోసం ఏడుస్తోందని..
Enraged Man Kills Girlfriends Two-year Old Daughter: ఇటీవలకాలంలో చాలా రకాల నేరాలు గురించి విని ఉన్నాం. ఆస్తుల కోసం లేక వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు గురించి విన్నాం. కానీ పసిపాప అని కూడ కనికరం లేకుండా పాల కోసం ఏడుస్తోందని కోపంతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ముంబైలోని భయందార్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. విషయంలోకెళ్తే.. .22 ఏళ్ల పూజా వాఘ్ అనే వివాహిత తన భర్త నుంచి విడాకులు తీసుకుని స్నేహితుడు ఆదిల్ మునావర్ ఖాన్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే ఆమెకు ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తన తండ్రి వద్ద ఉంటుంది. పైగా ఆమె తన భర్తతో విడాకులు తీసుకునేటప్పటికీ మూడు నెలల గర్భవతి. ఈ మేరకు ఆమె జనవరి 2020లో సోనాలి అనే పాపకు జన్మనిచ్చింది. అయితే పూజా క్యాటరింగ్ కంపెనీలో పనిచేస్తోంది. ఒకరోజు ఆమె ఉద్యోగానికి వెళ్లే నిమిత్తం ఆమె ప్రియుడు ఖాన్ వద్ద చిన్నారి సోనాలిని ఉంచి వెళ్లింది. అయితే ఖాన్ ఆ చిన్నారి పాల కోసం ఏడుస్తోందని కోపంతో కొట్టాడు. ఆ తర్వాత ఖాన్ వాఘ్కి ఫోన్ చేసి తాను ఫోన్లో గేమ్ ఆడుతుండగా పాప కింద పడిపోయిందని చెప్పాడు. అంతేగాక టెంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని తెలిపాడు. దీంతో పూజా హడావిడిగా ఆస్పత్రికి చేరుకోగానే పాప అప్పటికే చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అయితే పోస్ట్‌మార్టంలో పాప మృతి అసహజమైనదని, ఊపిరాడక చనిపోయినట్లు ధృవీకరించారు. దీంతో భయందార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఖాన్ని అరెస్టు చేశారు. (చదవండి: నకిలీ పురాతన వస్తువుల పేరుతో దాదాపు రూ.9 కోట్లు కొట్టేశారు!) -
హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీ డాక్టర్ లేడని నర్సులే..
సాక్షి, హైదరాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి నర్స్‌లు శస్త్ర చికిత్స చేయడంతో శిశువు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ డివిజన్ అపురూపా కాలనీకి చెందిన జగదీష్, భార్గవిలు భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్‌లోని లయన్స్‌క్లబ్ ఆస్పత్రిలో చేరింది. రాత్రి 7 గంటల సమయంలో పురి టి నొప్పులు తీవ్రమయ్యాయి. అయితే ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు జ్యోత్సా్న, రాణిలు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయగా శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ప్రస్తుతం భార్గవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి భర్త జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే..
కొచ్చి: శిశువు జన్మించి నెల కూడా కాకుండానే కర్కశంగా చంపేసిందో ఓ తల్లి. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మొదట ఆ శిశువుకి ఆరోగ్యం సరిగాలేని కారణంగానే మరణించిందని అనుకున్నారు, కానీ ఆ తల్లి ప్రవర్తన పై అనుమానం రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు నిజాలు బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఆ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో కొన్నిరోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది. ఇక చేసేదేమి లేక ఆ బిడ్డ తల్లి శిశువుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి, వారి సూచించిన మేరకు పలు పరీక్షలు, మందులు కూడా తీసుకుని ఇంటికి రావడం ఇదే పనిగా మారింది. అయినా ఆ శిశువుకి ఏ మాత్రం అనారోగ్యం తగ్గకపోవడం, మరో పక్క ఏడూస్తూనే ఉండడంతో బిడ్డ మరింతగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో మరో సారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఆ శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్‌కు శిశువు హఠాత్తుగా మరణించడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోస్ట్‌మార్టం తర్వాత, ఒక పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడగా, పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు శిశువు తల్లిని విచారించగా... పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని, ఈ విషయం తెలిసినప్పటికీ తాను అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఆ శిశువుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను కొంత మానసిక అసౌకర్యానికి గురైనట్లు, చివరికి కోపంతో తానే కొట్టడంతో శిశువు చనిపోయిందని అంగీకరించింది. చదవండి: ఏమైందో..ఏమో? పిల్లలు నిద్రపోతుండగా గ్యాస్ సిలిండర్ బెడ్రూంలోకి తీసుకువచ్చి.. -
పసికందును రైలులో వదిలేసి.. ప్రియుడితో కలిసి
సాక్షి, ముంబై: పసికందును లోకల్ రైలులో వదిలేసి పారిపోయిన ఓ మహిళతో పాటు ఆమె ప్రియుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసులు అందించిన వివరాల మేరకు.. నవంబర్ 20వ తేదీన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చివరి లోకల్ రైలు టిట్వాల రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ రైలులోని మహిళల బోగీలో విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసుకు ఓ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో పసికందు ఉండటంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కల్యాణ్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అన్ని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించగా, అర్ధరాత్రి తరువాత కోపర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన ఓ మహిళ డోంబివలి స్టేషన్లో దిగిపోయినట్లు గుర్తించారు. రైలు ఎక్కే సమయంలో ఆమె చేతిలో ఉన్న సంచి డోంబివలిలో దిగే సమయంలో లేదు. ఆమె కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రైలు ఎక్కే సమయంలో ఆమె చేతిలో ఉన్న సంచి రంగు, టిట్వాల స్టేషన్లో పసికందుతో లభించిన సంచి రంగు ఒకటే కావడంతో పోలీసులకు ఆమెపై అనుమానం మరింత బలపడింది. దీంతో ఆమె రైలు ఎక్కిన కోపర్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మహిళ కావచ్చని భావించిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. సుమారు 20 రోజుల పాటు కోపర్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. చివరకు దేవిచ్యా పాడాలో ఆమె పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా తొలుత తనకేమీ తెలియదని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ పసికందును తానే వదిలి వెళ్లినట్లు అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పసికందును నేరుల్ ప్రాంతంలోని విశ్వ బాలుర సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.