గుంటూరు: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కిడ్నాప్ గురైన చిన్నారి ఆచూకీ లభించింది. ఆదివారం జన్మించిన శిశువు మాయం కావడంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి ఆచూకీ దొరికింది. మరియమ్మ అనే నిందితురాలు శిశువుతో తెనాలిలో సంచరిస్తుండంగా పోలీసులకు చిక్కింది. ఆమెపై 153, 153 ఎ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఉదయాన్నే కిడ్నాప్ కు గురైన అనంతరం శిశువు తల్లితండ్రులు మనోహార్, సులోచనలు వారి బంధువులు ఆసుపత్రి అంతా గాలించారు. అయిన శిశువు జాడ తెలియలేదు. దాంతో ఆ విషయాన్ని వారు ఆసుపత్రిలోని వైద్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సలహా మేరకు ఆ శిశువు తల్లితండ్రులు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే తమకు మరియమ్మ అనే మహిళపై అనుమానం ఉందని ఆ శిశువు తల్లితండ్రులు పోలీసులు తెలిపారు.