సాక్షి, తెనాలి(గుంటూరు) : ఆ తల్లికి ఏం కష్టమెచ్చిందో... ఏమో రోజుల శిశువును వైద్యశాలలో వదిలేసి వెళ్లిపోయింది. బిడ్డ కోసం ఎవరూ రాకపోవటంతో వైద్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం తెనాలి అమరావతి ఫ్లాట్‌లకు చెందిన దాసరి మహేశ్వరి గతనెల 29న జిల్లా వైద్యశాలలో ఆడశిశువును ప్రసవించింది. బిడ్డ నెలలు తక్కువగా పుట్టటంతో ఎస్‌ఎన్‌సీయూ వార్డులోని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఈనెల 10వ తేదీన మహేశ్వరిని వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో ఆమె బిడ్డను ఇంక్యుబేటర్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా బిడ్డ కోసం ఎవరూ రాకపోవటంతో గమనించిన వైద్యులు, సిబ్బంది అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో వారు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ సీఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment