హవాయి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే దర్శనమిస్తుంటాడు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన్ను అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఆయనకు అమెరికాలోనే కాదు పలుదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన ఓ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించిన వీడియో వైరల్‌గా మారింది. ఒబామా హవాయి రాష్ట్రంలోని కనైలిలో ‘కనేహే క్లిప్పర్ గోల్ఫ్ కోర్సు’కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ తల్లి తన చిన్నారిని ఎత్తుకుని అదే గోల్ఫ్ కోర్సులో ఆడిస్తోంది. ఒబామా వెళ్లి వారిని పలకరించాడు. ‘ఎవరీ పాప?’ అంటూ చిన్నారి రిలేను ఆమె తల్లి దగ్గరనుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఈ పాపకు ఎన్ని సంవత్సరాలని ఒబామా అడగగా పాపాయి తల్లి మూడు నెలలని సమాధానమిచ్చింది. ఆ తర్వాత శిశువును ముద్దు చేస్తూ ఆడిస్తూ ‘నేను నీకు పాలివ్వలేను’ అంటూ పాపాయితో జోక్ చేశాడు. అనంతరం ఆమె నుదుటిపై ప్రేమగా ఓ ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ అనూహ్య చర్యతో పాపాయి తల్లి టిఫానీ ఉక్కిరిబిక్కిరైపోయింది. మాజీ అధ్యక్షుడిలా కాకుండా సాదాసీదాగా వచ్చి, సామన్యుడిలానే పలకరించి వెళ్లిపోయాడని ఆ తల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటివరకు ఈ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు.
President Obama gracefully walked up and asked to hold my niece Riley. He was golfing in Hawaii. My niece is the GOAT period. #Hawaii #obama #President #MichelleObama pic.twitter.com/u6gmhGqzx4
— Andrea Jones (@itsanicholle) December 19, 2019
Comments
Please login to add a commentAdd a comment