Barak Obama
-
అమెరికా విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్‌పై ట్రంప్ సీరియస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ సమీపంలో ప్యాసింజర్ విమానం, హెలికాప్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదానికి గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ పాలసీ విధానాలే కారణమని కామెంట్స్ చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడుతామని, మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికాలో గత అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్లు ఆకాశ భద్రతా ప్రమాణాలకు సంబంధించి రాజీపడ్డారు. కానీ, మేము మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒబామా, బైడెన్, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే మొదటి ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, మేము సమర్థులైన వారినే కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్ఏఏకు తాత్కాలిక కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో సుపీరియర్ ఇంటెలిజెన్స్ అవసరం అయ్యే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అనర్హులను నియమించినట్లు ట్రంప్ విమర్శించారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించారు. ఈ ప్రమాదం చాలా మందిని కుదిపేసిందన్నారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై దీని ప్రభావం ఉందని తెలిపారు. అలాగే, ప్రమాదంలో బాధితుల కోసం నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌ను అభినందించారు.ఇక, అంతకుముందు.. బాధితులకు ట్రంప్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు. అలాగే, విమాన ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్రమాదం తనను ఎంతో వేదనకు గురిచేసిందన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో జరిగిన సంభాషణల టేపులను తాను విన్నానని తెలిపారు. విమానం సరైన మార్గంలోనే వెళ్లిందని, పైలట్ తప్పిదం లేదని పేర్కొన్నారు. అయితే అదేసమయంలో హెలికాప్టర్ అదే ఎత్తులో ఎగిరిందని, దీంతో పెను ప్రమాదం జరిగినట్లు తెలిపారు. -
ట్రంప్‌పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు. -
గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈనెల రెండో వారంలో ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఆయనను రిపబ్లిక్‌డే వేడుకకు మోదీ ఆహ్వానించారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు. అయితే, భారత్ ప్రతీ ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ దేశాల నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా భారత్ ఆహ్వానాన్ని అంగీకరించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు బైడెన్ కూడా మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా రెండో అధ్యక్షుడిగా బైడెన్ నిలుస్తారు. #PMModi has invited #US President Joe Biden as Chief Guest for the 2024 Republic Day Parade.#IADN pic.twitter.com/N8Rao4EBJC — Indian Aerospace Defence News - IADN (@NewsIADN) September 20, 2023 ఇది కూడా చదవండి: సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, దార్శనికుడు రతన్ టాటా ఆదర్శ జీవితానికి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. అవ్వడానికే ఐకానిక్ పర్సనాలిటీ, బిలియనీరే కానీ, సింప్లిసిటీకి పెట్టింది పేరు. విలాసాలకు, ఆడంబరాలకు దూరంగా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని ఆయనకు ఫాలోయర్ల సంఖ్య మిలియన్లలోనే. ట్విటర్లో 12.4 మిలియన్ల ఫాలోయర్లుండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో, 8.5 మిలియన్ల మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో టాటా ట్రస్ట్‌ను(1919లో స్థాపించిన ఛారిటబుల్ ట్రస్ట్)ఫాలో అవుతున్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) రతన్ టాటా ఫాలో అవుతున్న ఆ ముగ్గురు రాజకీయ నాయకుల్లో ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంకొకరు ఆప్ నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాగా, మూడవ వారు, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా ఉన్నారు. దీంతోపాటు పీఎంవో ట్విటర్ హ్యండిల్, బ్రిటన్ పీఎంవో, అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ, కార్నెల్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బ్లూమ్బెర్గ్లను కూడా ఫాలో అవుతారు. ముఖ్యంగా బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, బోమన్ ఇరానీని రతన్‌టాటా ఫోలో అవుతుండటం విశేషం. వివేక్ ఒబెరాయ్ 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌లో బొమన్ ఇరానీ రతన్ టాటా పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇంకా మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రా, సమీర్, ఆటో డిజైనర్ ఇయాన్ కల్లమ్, ప్రణయ్ రాయ్,సింగపూర్ పీఎం లీ సియన్ లూంగ్, ల్యాండ్ రోవర్ (అమెరికా) జాగ్వార్, టాటా నానో, ఆటోకార్ ఇండియా, MIT మీడియా ల్యాబ్, BBC బ్రేకింగ్ న్యూస్, ఫైనాన్షియల్ టైమ్స్, ది ఎకనామిస్ట్, ది హిందూ, ఎన్ రామ్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఆయన మనసు దోచిన ఖాతాలన్నమాట. (నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్వర్క్ త్వరలో) -
మిచెల్ ఒబామాపై జో బైడెన్ కామెంట్స్.. ఖంగుతిన్న అమెరికన్లు..!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పులో కాలేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆదివారం అమెరికా అణుసబ్మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్‌లో బైడెన్ తప్పుగా వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రసంగిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్‌ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారని ప్రశంసించారు. అయితే, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ తప్పుగా ఉపాధ్యక్షురాలు అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Does Biden think Michelle Obama was Vice President? pic.twitter.com/SyzKLsu378 — Benny (@bennyjohnson) April 2, 2022 -
ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఒకరు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్‌కి ప్రెసిడెంట్ మరొకరు. వీరిద్దరు ఓ సమావేశంలో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థ సీఈవోని చూస్తూ.. తమ దేశానికి చెందినది అంటే తమ దేశానికి చెందినది అంటూ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఈ ఆరుదైన ఘటన 2009లో చోటు చేసుకుంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశం సాధిస్తున్న ప్రగతిని అక్కడి కంపెనీల పనితీరుని ప్రధాని మన్మోహన్‌కి వివరిస్తున్నారు బరాక్ ఒబామా. ఈ క్రమంలో పెప్సీ కంపెనీ వంతు వచ్చింది. 2009లో పెప్సీ కంపెనీకి గ్లోబల్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఇంద్రానూయి ఉన్నారు. ఆమెను చూడగానే ప్రధాని మన్మోహన్సింగ్ ఈమె మాలో ఒకరు అని ఒబామాతో అన్నారు. వెంటనే స్పందించిన బరాక్ ఒబామా ‘ ఆహ్! కానీ ఆమె మాలో కూడా ఒకరు’ అంటూ బదులిచ్చారు. శక్తివంతమైన రెండు దేశాలకు చెందిన అధినేతలు తనను మాలో ఒకరు అంటూ ప్రశంసించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ ఇంద్రనూయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. భారత సంతతికి చెందిన ఇంద్రానూయి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల పాటు పెప్సీ కంపెనీలో పని చేశారు. అందులో 12 ఏళ్ల పాటు సీఈవోగా కొనసాగారు. ఆమె సీఈవోగా ఉన్న కాలంలో పెప్పీ కంపెనీ రెవెన్యూ 35 బిలియన్ల నుంచి 63 బిలియన్లకు చేరుకుంది. తొలి గ్లోబల్ మహిళా సీఈవోగా ఇంద్రనూయి రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత ఇటీవల లీనా నాయర్ ఛానల్ సంస్థకు గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. -
‘వైట్‌హౌజ్‌లో సిగరెట్లు తాగేవాడిని’
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు పని ఒత్తిడి తట్టుకోలేక రోజుకు ఎనిమిది లేదా తొమ్మిది సిగరెట్లు తాగే వాడిని. ఒక రోజు సిగరెట్ తాగుతూ మాలియాకు పట్టుబడ్డాను. అంతే సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయానికి వచ్చాను’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వైట్‌హౌజ్ జీవితానికి సంబంధించిన గత స్మృతుల్లో వెల్లడించారు. అలా సిగరెట్ మానేయడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చిందో కూడా అందులో ఆయన వివరించారు. ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ‘మీరు సిగరెట్ తాగుతారా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయనెప్పుడూ సూటిగా సమాధానం ఇవ్వలేదు. (చదవండి : రాహుల్ గాంధీకి ఆ పట్టుదల లేదు : ఒబామా) సిగరెట్ తాగుతూ తన పెద్ద కూతురు మాలియాకు పట్టుబడ్డానని గత స్మృతుల్లో వెల్లడించిన ఒబామా.. మీడియాకు మాత్రం ఎప్పుడు పట్టుబడలేదు. అదే మాలియా స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ రెండు, మూడు సార్లు మీడియాకు దొరికి పోయారు. ఒబామా ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉన్నప్పుడు తన తండ్రి కుటుంబ సభ్యుల ముందు తాగేవారు. 1987లో ఆయన తన కుటుంబ సభ్యుల ఇంటి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్న ఫొటోలు నేటికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ అలవాటుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే ఒబామా స్వస్తి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా శ్వేత భవనంలోకి అడుగు పెట్టాక పని ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ స్మోకింగ్ మళ్లీ మొదలు పెట్టానని, రోజుకు 8,9 సిగరెట్లు తాగే వాడినని ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరిట ఆయన రాసిన స్మృతుల్లో చెప్పారు. రోజుకు 8,9 కాదు, పది సిగరెట్లు కూడా తాగే వారని ఆయన భార్య మిషెల్లీ ఒబామా తెలిపారు. ఆయన రాసిన పుస్తకం నవంబర్ 17వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. ఒబామా తాను వైట్‌హౌజ్‌లో గడిపిన రోజుల నాటి స్మృతులతోపాటు తన కుటుంబంలో ఎదురైన ఒడుదుడుకుల గురించి కూడా ఆ పుస్తకంలో ఆయన వెల్లడించారట. -
ప్రకృతి లాగే దేశ రాజకీయాలు మారుతున్నాయి
కాలిఫోర్నియా : గురువారం ఉదయం కాలిఫోర్నియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అడవిలో కార్చిచ్చు అంటుకొని అగ్ని కీలలు ఎగిసిపడి బారీగా మంటలు అంటుకున్నాయి. దీంతో నీలం రంగులో ఉండాల్సిన ఆకాశం మొత్తం నారింజ రంగులోకి మారింది. ఈ దృష్యాలను అమెరికన్లు తమ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీళ్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు. బరాక్ ఒబామా ఫోటోలను షేర్ చేస్తూ రాజకీయ కోణంలో చేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒబామా ట్వీట్ చేశారు. (చదవండి :వ్యాక్సిన్ పంపిణీపై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు) 'వెస్ట్ కోస్ట్ ప్రాంతమంతటా మంటలంటుకొని వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ప్రకృతి ప్రకోపంతో మారిపోయినట్లే దేశ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు మన దేశాన్ని రక్షించడమనేది బ్యాలెట్ చేతుల్లో ఉంది. ప్రకృతిని కాపాడుకోవడానికి బాధ్యత అనే ఓటు ఎంత అవసరమో.. రాజకీయాల్లో కూడా ఓటుకు అంతే పవర్ ఉంటుంది. దానిని సక్రమ మార్గంలో వినియోగించండి.' అంటూ కామెంట్ చేశారు. కాలిఫోర్నియాలో మరోసారి కార్చిచ్చు కాలిఫోర్నియాలో మరోసారి అడవులను కార్చిచ్చు దహించివేస్తోంది. తాజాగా, చెలరేగిన దావానలంలో లక్షలాది ఎకరాల్లో అడవి దగ్ధమైంది. బారీగా చెలరేగిన మంటల కారణంగా సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఓరెగాన్‌లో వందలాది గృహాలు మంటలకు కాలిబూడిదయ్యాయని కాలిఫోర్నియా గవర్నర్ కేట్ బ్రౌన్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉపశమనం లభించే సూచనలు కనిపించడంలేదని, గాలులు బలంగా వీస్తుండటంతో పట్టణాలు, నగరాలకు మంటలు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు పట్టణాలు గణనీయంగా దెబ్బతిన్నాయని చెప్పిన బ్రౌన్.. ఎన్ని గృహాలు మంటలకు ఆహుతయ్యాయనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ, అత్యవసర నిర్వహణ అధికారులు 4,70,000 ఎకరాలకు పైగా అడవులు కాలిబూడిదవుతున్నట్టు తెలిపారు. -
ఫిల్లీ గర్ల్
ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ‘ఫిల్లీ గర్ల్’! అమెరికా ఎన్నికలు అయ్యాక.. ట్రంప్ (ఒకవేళ) ఓడిపోయాక.. బైడెన్ కొత్త అధ్యక్షుడయ్యాక.. ఫిల్లీ గర్ల్ అనే మాట మీరు వింటారు. ఆ ఫిల్లీ గర్ల్.. జిల్ బైడెన్. యు.ఎస్. కొత్త ప్రథమ మహిళ! జిల్ ట్రేసీ పవర్ గర్ల్. ఫిలడెల్ఫియా మెట్రోపాలిటన్ ఏరియాలో పెరిగిన అమ్మాయిల్నెవర్నీ ఆ పట్టణం ఎంతోకాలం పూర్తి అమాయకత్వంతో ఉంచదు. జిల్ ట్రేసీలా న్యూజెర్సీలో పుట్టి వచ్చిన అమ్మాయిల్నైనా సరే, వాళ్లెప్పుడు టీనేజ్‌లోకి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పదహారేళ్లు వచ్చేటప్పటికే జిల్ ట్రేసీ కూడా ఫిల్లీ గర్ల్ అయిపోయింది. అంటే.. ఫిలడెల్ఫియా సమర్పించిన పవర్ గర్ల్ అన్నమాట! ఆ వయసుకే ఫిలడెల్ఫియా స్పోర్ట్స్ టీమ్‌లోని కళ్లన్నీ జిల్ ట్రేసీ మీద పడ్డాయి. కాస్త తొందరపాటు ఉత్సాహంతో ముందుకు వచ్చిన ప్లేబాయ్ చూపుల్ని ట్రేసీ తన నొప్పించని తృణీకారపు నవ్వుతో పక్కకు తోసేసేది. అందం కాదు ఆ అమ్మాయిలోని గురుత్వాకర్షణ. టఫ్‌గా ఉంటుంది. అది నచ్చేది అబ్బాయిలకు. ‘టఫ్ కుకీ ఫిల్లీ గర్ల్’ అని పేరు కూడా పెట్టేశారు. ఫిజికల్‌గా, క్విజికల్గా ఉన్నవాళ్లను.. ముఖ్యంగా అమ్మాయిల్ని.. ‘టఫ్ కుకీ’లు అనడం ఫిలడెల్ఫియా పరాజిత బాలుర నిస్సహాయ నైజం. పదిహేనేళ్ల వయసులో ట్రేసీ న్యూజెర్సీలో వెయిట్రెస్‌గా చిన్న ఉద్యోగాన్ని వెతుక్కున్నప్పుడే స్లాట్లాండ్ యాస లో ఆమె మాట్లాడే ఫిలడెల్ఫియా ఇంగ్లిష్‌కు సహచరులు ఆమెను ప్రేమించడం మొదలు పెట్టీ పెట్టగానే భగ్న హృదయులైపోయారు. ట్రేసీకి తల్లి నుంచి వచ్చిన ఆకర్షణీయమైన యాస అది. గృహిణి ఆమె. తండ్రి బ్యాంకు ఉద్యోగి. ట్రేసీ తర్వాత నలుగురూ చెల్లెళ్లే. పద్దెనిమిదేళ్లకే ట్రేసీ డిగ్రీ పూర్తయింది. పందొమ్మిదేళ్లకు పెళ్లి చేసుకుంది. బిల్ స్టీవెన్సన్ అతడి పేరు. ఫుట్‌బాల్ ప్లేయర్. ఫిలడెల్ఫియా స్పోర్ట్ టీమ్‌లో ఆమె మనసును గెలిచినవాడు. మనసును గెలిచాడే గానీ, మనసును తెలుసుకోలేకపోయాడు! పెళ్లయ్యాక ఐదేళ్లే కలిసి ఉన్నారు! మూడో వ్యక్తి ప్రవేశం తన భార్యను తన నుంచి వేరుచేసిందని నాలుగు రోజుల క్రితం కూడా అన్నాడు స్టీవెన్సన్. ఆ మూడో వ్యక్తి.. జో బైడెన్. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. స్టీవెన్సన్తో విడాకులు తీసుకున్న రెండేళ్లకే జో బైడెన్‌ను పెళ్లి చేసుకున్నారు జిల్ ట్రేసీ. ఈ ఎన్నికల్లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. జిల్ ట్రేసీ అమెరికా ప్రథమ మహిళ అవుతారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రార్థనామందిరంలో (చాపెల్) 1977 లో జో బైడెన్, జిల్ ట్రేసీల పెళ్లి జరిగింది. బైడెన్‌కు అప్పటికే పిల్లలు ఉన్నారు. భార్య, కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయి, ఇద్దరు కొడుకులతో ఒంటరిగా ఉన్న సమయంలో ట్రేసీ అతడికి పరిచయం అయ్యారు. రెండోసారి పెళ్లి అయేనాటికి ఆమె వయసు 26. బైడెన్‌కు 34 ఏళ్లు. వీళ్లిద్దరికీ ఒక కూతురు. ఇప్పటికి ముగ్గురు పిల్లల పెళ్లిళ్లూ అయిపోయాయి. పెద్దకొడుకు బ్యూ బైడెన్ పేరున్న లాయర్. బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాడు. చిన్నకొడుకు హంటర్ బైడెన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్. కూతురు ఆష్లీ సోషల్ వర్కర్. ట్రేసీతో పెళ్లయ్యేనాటికే జో బైడెన్ కౌంటీ కౌన్సిల్ సభ్యుడు. ఈ నలభై మూడేళ్ల కెరీర్లో అతడి అత్యున్నత స్థాయి అమెరికా ఉపాధ్యక్ష పదవి. బరాక్ ఒబామాతో కలిసి ఎనిమిదేళ్లు ఆ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. జిల్ ట్రేసీ మాత్రం తనకెంతో ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లోనే ఉండిపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు అయ్యాక కూడా ‘ద్వితీయ మహిళ హోదా’ను వార్డ్‌రోబ్‌లో పడేసి, రోజూ కాలేజ్‌కి వెళ్లి రావడం మాత్రం ఆమె మానలేదు. విల్లింగ్టన్లోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ గా ఆమె ఉద్యోగ జీవితం మొదలైంది. ప్రస్తుతం ఆమె నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్. బైడెన్ ఒక్కో మెట్టూ రాజకీయాల్లో ఎదుగుతూ ఉంటే జిల్ ట్రేసీ అధ్యాపక వృత్తికి అవసరమైన ఒక్కో డిగ్రీ పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆమె.. తన భర్త అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా తను మాత్రం కాలేజ్‌కి వెళ్లొస్తుంటాననే చెబుతున్నారు! ఆమెలోని ‘ఫిల్లీ గర్ల్’.. తనను ఆరాధించిన వారిని సున్నితంగా నిరాకరించిన విధంగానే వైట్ హౌస్ ఇచ్చే గొప్ప హోదా కన్నా, ఇంగ్లిష్ ప్రొఫెసర్ అనే గుర్తింపునే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. -
యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు అతడే..
వాషింగ్టన్ : ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి భయాందోళనకు గురవుతుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం రాజకీయ వేడి సెగలు పుట్టిస్తోంది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించే అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవర్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికాకు తదుపరి ప్రెసిడెండ్ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ అంటూ జోస్యం చెప్పారు. బిడెన్ విధానాలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒబామా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (అంతకంటే పీడకల మరొకటి ఉండదు: ట్రంప్) మరోవైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై ఒబామా ఇదివరకే విమర్శల దాడి ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకుంటే అమెరికన్ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని ఇదివరకు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రాట్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఒబామా పాల్గొంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా బిడెన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-ఒబామా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. -
సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇది అత్యధిక పోటీ ఉండే సెనేట్ రేసుల్లో ఒకటి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించారు. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ కూడా ఉన్నారు. 48 ఏళ్ల ఎంఎస్ గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. సారా గిడియాన్‌ను అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి. ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. కాల్సిన్కు 44 శాతం లీడ్ ఉండగా సారా గిడియాన్ పోటీతో అది 39 శాతానికి పడిపోయింది. గిడియాన్ తండ్రిది భారత్, తల్లిది అమెరికా. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందని ఒబామా ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని ఒబామా అన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్‌గా వ్యవహరిస్తున్న సూసన్ కాలిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సారా ఒకవేళ నవంబర్‌లో ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందుతారు. సారా గిడియాన్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్‌కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయిన సంగతి తెలిసిందే. చదవండి: అన్నంత పని చేసిన ట్రంప్! -
ఆస్కార్ 2020 : కొరియోత్సవం
ప్రపంచ సినిమాల తీర్థస్థలి – ఆస్కార్ వేడుకలో– ఈసారి మన గాలి వీచింది. మన ఖండపు దేశానికి అభిషేకం జరిగింది. హాలీవుడ్ పండితులు దక్షిణ కొరియా సినిమా ‘పారసైట్’కు మరో మాట లేనట్టుగా టెంకాయ్ కొట్టి దండం పెట్టారు. నాలుగు అవార్డులు సమర్పించుకున్నారు. హాలీవుడ్ పెత్తనాన్ని కొరియన్ సినిమా ఓడించిన సందర్భం ఇది. కొరియా భాష గెలిచిన సన్నివేశం ఇది. నిజంగా ఇది ఆసియావాసుల గెలుపు. మన గెలుపు. ‘తలచినదే జరిగినదా? జరిగేదే తలచితిమా?’ అని పాడుతున్నారు ఆస్కార్ అవార్డులను తీక్షణంగా అనుసరించేవాళ్లు. అవును.. ఈ ఏడాది ఆస్కార్‌లో ఆశ్చర్యాలు పెద్దగా లేవు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. గెలుస్తారు అనుకున్న విజేతల పేర్లే ప్రకటించబడ్డాయి. ‘పారసైట్’ హవా ఉంటుంది అనుకున్నారు. అదే జరిగింది. ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ స్పీచ్ వినబోతున్నాం అనుకున్నారు. అలాగే అయింది. ఇలా ఆస్కార్ వేడుక జరగక ముందు జరిగిన చర్చల్లో ఊహించినవి ఊహించినట్టే ఎక్కువ శాతం జరగడం ఓ విశేషం. మరి విషయానికి వస్తే... 92వ అకాడమీ అవార్డుల వేడుక ఆదివారం సాయంత్రం లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది. గత ఏడాది జరిగిన 91వ ఆస్కార్ వేడుకలానే ఈసారి కూడా వ్యాఖ్యాత లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న ‘జోకర్’ కేవలం రెండు అవార్డులతో సరిపెట్టుకుంది. ‘ది ఐరిష్ మేన్’, ‘1917’, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాలు ఒక్కోటి పది నామినేషన్లు చొప్పున దక్కించుకుంటే ‘1917’ మూడు అవార్డులు, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ రెండు అవార్డులు, ‘ది ఐరిష్ మేన్’ ఒక్క అవార్డు గెలుచుకున్నాయి. ఆరు విభాగాల్లో నామినేషన్లు పొందిన ‘పారసైట్’ ఈ ఏడాది అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుపొందింది. ఇంగ్లిష్‌లో తెరకెక్కించని ఒక సినిమాకు ‘ఉత్తమ చిత్రం’ అవార్డు రావడం 92 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఆ విధంగా ‘పారసైట్’ చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. సౌత్ కొరియాకి తొలి ఆస్కార్ తీసుకెళ్లిన ఘనత కూడా ఈ సినిమాదే. ఉత్తమ సహాయనటిగా తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు లారా డెర్న్. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘మ్యారేజ్ స్టోరీ’ సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఈ ఆస్కార్ అవార్డు ఆమెకు బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. లారా ఫిబ్రవరి 10న జన్మించారు. ఆస్కార్ వేడుక ఫిబ్రవరి 9న జరిగింది. ‘‘బర్త్‌డే వేడుకలు కొంచెం ముందస్తుగా మొదలయ్యాయి’’ అని పేర్కొన్నారు లారా తోటి నటులు. ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్ పిట్ తన తొలి ఆస్కార్ అందు కున్నారు. ఉత్తమ సినిమాటో గ్రాఫర్‌గా ‘1917’ చిత్రానికిగాను రోజర్ డీకిన్స్ అవార్డు అందుకున్నారు. ‘బ్లేడ్ రన్నర్ 2049’ (2017) చిత్రానికి ఆయన తొలి ఆస్కార్ దక్కించుకున్నారు. మళ్లీ దక్కింది ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ ఓక్విన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారని అందరూ ఊహించినట్టే ఉత్తమ నటిగా రెనీజెల్ వెగర్ గెలుస్తారని కూడా ఊహించారు. ఆస్కార్‌కు ముందు జరిగిన ‘బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్, ఎస్ఏజీ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్) ల్లో ‘జూడి’ చిత్రానికిగాను అవార్డును అందుకున్నారు రెనీజెల్ వెగర్. హాలీవుడ్ ఐకాన్ జూడి గార్లాండ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జూడి’. జూడి పాత్రను పోషించినందుకుగాను నటి రెనీజెల్ వెగర్ ఆస్కార్‌ను అందుకున్నారు. ఈ అవార్డును అందుకుంటూ తనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలందర్నీ గుర్తు చేసుకున్నారు రెనీజెల్. ‘‘జూడి గార్లాండ్ ఆస్కార్‌ను అందుకోలేకపోయారు. ఆమె వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ అవార్డు లభించిందని అనుకుంటున్నాను. మనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలే మనలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురాగలరు. మనల్ని ఏకం చేయగలరు’’ అన్నారు రెనీజెల్. ఆమెకు ఇది రెండో ఆస్కార్. గతంలో ‘కోల్డ్ మౌంటేన్’ చిత్రానికి సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. సాహో బాంగ్ జూన్ హూ ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ హూ ఒక కల నెరవేరింది. చరిత్ర సృష్టింపబడింది. ఆస్కార్ అవార్డు కోసం కొరియా ప్రయత్నం ఫలించింది. ఆస్కార్ నుంచి ప్రశంసగా చిన్న జల్లు కోరుకుంటే జడివానే కురిపించింది. ఇటీవలే కొరియన్ సినిమా నూరేళ్ల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నో ప్రపంచ స్థాయి సినిమాలను, ప్రపంచస్థాయి ప్రతిభను ఇంతకాలంగా ప్రదర్శిస్తూనే ఉంది. అయినప్పటికీ కొరియన్ కళామతల్లికి నైవేద్యంగా పెట్టడానికి ఆస్కార్ లేకుండాపోయింది. ఆ దేశపు దర్శకులు పార్క్ చాన్ ఊక్, జాంగ్ హూన్, కిమ్ జీ ఊన్, లీ జూ–ఇక్ ఆస్కార్ తీసుకొస్తారనుకున్నా గతంలో నిరాశే మిగిలింది. కానీ ఆ లోటుని బాంగ్ జూన్ హూ తీర్చేశారు. ప్రస్తుతం కొరియా అంతా బాంగ్ జూన్ çహూను ‘సాహో’ అని కీర్తిస్తోంది. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘పారసైట్’ చిత్రం ఈ ఏడాది నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. మొత్తం 6 విభాగాల్లో (ఉత్తమ చిత్రం, విదేశీ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్) నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రం 4 అవార్డులు (ఉత్తమ చిత్రం, దర్శకుడు, విదేశీ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగల్లో) కైవసం చేసుకుంది. సుమారు 50 మిలియన్ల జనాభా ఉండే దేశం సౌత్ కొరియా. విస్తీర్ణంలో చూసుకుంటే చాలా చిన్నది. ఇరుకైనది. చోటు కోసమే అందరి పోటీ అంతా. నీకు మరింత చోటు కావాలంటే మరింత ధనికుడివై ఉండాలన్నది అక్కడి సిద్ధాంతం. సినిమా ఎప్పుడూ సమాజానికి అద్దమే అంటారు. అవును.. ‘పారసైట్’ కూడా అద్దమే. కొరియన్లో తయారైన అద్దం. కొరియాలో జరుగుతున్న వర్గ వివక్షను చూపెట్టిన అద్దం. ‘పారసైట్’లో కిమ్ కుటుంబం చాలా పేదది. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత. మరోవైపు పార్క్ కుటుంబం చాలా డబ్బున్నది. అవసరమైన ప్రతీ పనికి పనివాళ్లను నియమించుకునేంత. చాలా తెలివిగా పార్క్ ఫ్యామిలీలోకి ప్రవేశిస్తారు కిమ్ కుటుంబ సభ్యులు. ఆ తర్వాత జరిగే కథాంశమే ‘పారసైట్’. రెండు భిన్న జాతులకు చెందిన జీవుల మధ్య సావాసం ఏర్పడినప్పుడు, ఒక జీవి రెండోదానికి నష్టం కలిగిస్తూ లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే దాన్నే పరాన్న జీవి (పారసైట్) అంటారు. క్లుప్తంగా కథనంతా టైటిల్లోనే చెప్పారు దర్శకుడు బాంగ్ జూన్ హూ. ‘‘కొరియా పరిస్థితులను ఆధారం చేసుకుని తయారు చేసిన కథ ఇది. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇది కేవలం కొరియన్ సమస్య కాదు ప్రపంచంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య’’ అంటారు బాంగ్. ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాక ‘‘ఉత్తమ విదేశీ చిత్రానికి అవార్డు అందుకున్నప్పుడే ఈసారికి మన కోటా అయిపోయిందిలే అనుకున్నాను. కానీ థ్యాంక్యూ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లేకి అవార్డులు వచ్చాయి. నేను సినిమా గురించి నేర్చుకుంటున్న సమయంలో ‘మన పని ఎంత వ్యక్తిగతమైనది అయితే అంత సృజనాత్మకంగా ఉంటుంది’ అని మార్టిన్ స్కోర్సిసీ చెప్పిన మాటలు నాలో ఉండిపోయాయి. నేను మార్టిన్ సినిమాల ద్వారా చాలా నేర్చుకున్నా. గెలవడం సంగతి పక్కన పెట్టండి, ఆయనతో కలసి నామినేషన్ పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవేళ అకాడమీ వాళ్లు అనుమతి ఇస్తే ఈ అవార్డుని ఐదు భాగాలు చేసి ఈ విభాగంలో (దర్శకులు) నామినేట్ అయిన అందరికీ వాటా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రాత్రంతా తాగుతూనే కూర్చుంటాను’’ అని ప్రసంగాన్ని ముగించారు బాంగ్. జోకర్ బన్ గయా హీరో ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్ ‘ప్రతిభకు పట్టాభిషేకం జరగడం ఆలస్యం అవుతుందేమో కానీ జరక్కుండా మాత్రం ఉండదు’... ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ పేరుని ప్రకటించినప్పుడు ఎంతో మంది అనుకున్న మాట ఇది. గతంలో ‘ది మాస్టర్’, ‘వాక్ ది లైన్’, ‘గ్లాడియేటర్’ చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు ఓక్విన్. ఆస్కార్ తనదే అని ఆశగా ఎదురుచూశారు. నిరాశే ఎదురయింది. ఈసారి మాత్రం ఉత్తమ నటుడు ఓక్విన్ ఫీనిక్సే అని ముక్తకంఠంతో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కారణం ‘జోకర్’గా ఆయన నటన ముగ్ధుల్ని చేయడమే. ముఖానికి రంగేసుకుని కామెడీ చేసేవాడే మనందరికీ తెలిసిన జోకర్. కానీ తనలోని ట్రాజెడీని తెలియజెప్పిన చిత్రం ‘జోకర్’. కామిక్ బుక్స్‌లో బ్యాట్‌మేన్ ఎదుర్కొన్న విలన్ జోకర్. బ్యాట్‌మేన్ చిత్రాల్లో చాలా ఏళ్లుగా ఈ పాత్రను చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అసలెవరీ జోకర్? అతని పుట్టుపూర్వోత్తరాలేంటి? అతను అలా మారడానికి (తయారవడానికి) కారణాలేంటి? అనే విషయాలను ప్రస్తావిస్తూ ‘జోకర్’ సినిమాను రూపొందించారు దర్శకుడు టాడ్ ఫిలిప్ (ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ పొందారు కూడా). ‘జోకర్’ కథ విషయానికొస్తే... సందర్భంతో పనిలేకుండా పగలబడి న వ్వుతుండే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతుంటాడు ఆర్థర్ ఫ్లెక్ (ఓక్విన్ ఫీనిక్స్). స్టాండప్ కమేడియన్ అవ్వాలన్నది అతని ఆశ. కానీ అతను నివసిస్తున్న గోతమ్ సిటీలో అప్పటికే నిరుద్యోగం, క్రైమ్ పెరిగిపోయి ఉంటుంది. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన మానసిక æస్థితి తనని ఎలాంటిగా మనిషిగా మార్చాయి? తను ఎంచుకున్న మార్గమేంటి? అనే కథాంశంతో ‘జోకర్’ సినిమా తెరకెక్కింది. చట్ట విరుద్ధమైన పనులు చేసేందుకు ప్రేరేపించేలా ఉందని కొద్దిపాటి కాంట్రవర్శీ కూడా ఈ సినిమాను చుట్టుకుంది. అయినప్పటికీ విపరీతమైన జనాదరణ లభించింది. ఓక్విన్ నటనకు ఆస్కార్ అతని ఇంటికొస్తుంది అనే ప్రశంసల జల్లు కురిసింది. ఈ మధ్య జరిగిన ‘బాఫ్తా’, ‘క్రి టిక్స్ ఛాయిస్ అవార్డ్స్’, ‘ఎస్ఏజీ అవార్డ్స్’, ‘గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్’ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎన్వలప్స్‌లో కూడా ఓక్విన్ ఫీనిక్స్ పేరే ఉంది. కొత్త ప్రపంచం తయారు చేద్దాం ఓక్విన్ తన ప్రసంగంలో ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కొన్ని సీరియస్ సమస్యలను చర్చించారు. ‘‘ప్రస్తుతం మనందరం లింగ వివక్ష, వర్ణ వివక్ష, జంతు హక్కులు వంటి సమస్యలపై పోరాడుతున్నాం. ఒక జాతి (అది దేశం అయినా, వర్ణం అయినా, వర్గం అయినా సరే) మరో జాతిని కంట్రోల్ చేయొచ్చు, వాళ్లను దోచుకోవచ్చు అనే నమ్మకానికి విరుద్ధంగా పోరాడుతున్నాం. మనం చేసే ప్రతీ పనిలో ప్రేమ, కరుణ అనేవి ముఖ్య ఉద్దేశాలైతే మనందరం కలసి అందరికీ ఉపయోగపడే ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేయవచ్చు. గతంలో నేను చాలాసార్లు స్వార్థంగా ప్రవర్తించాను. కానీ ఈ హాల్లో (ఆస్కార్ థియేటర్లో వాళ్లను ఉద్దేశిస్తూ) ఉన్నవాళ్లు నాకు రెండో అవకాశం ఇచ్చారు. మనం తిరిగి పుంజుకోవడానికే ఈ రెండో అవకాశం’’ అని పేర్కొన్నారు ఫీనిక్స్. సూట్‌గా చెప్పారు అవార్డు ఫంక్షన్ జరిగేది ప్రతిభను పురస్కరించుకోవడానికే అయినా హంగూ ఆర్భాటాలను ప్రదర్శించడానికి కూడా. కాని ఓక్విన్ ఆ హంగు లేకుండా గత అవార్డు ఫంక్షన్లకు వేసుకున్న సూట్‌నే వేసుకొచ్చారు. ఏం అని అడిగితే ఎందుకూ... అనవసర ఖర్చు అని తేల్చేశారు. ఒబామాకి ఆస్కార్ బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా నిర్మాణ సంస్థలో రూపొందిన ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. వాళ్ల నిర్మాణ సంస్థ ‘హయ్యర్ గ్రౌండ్’ నిర్మించిన తొలి డాక్యుమెంటరీ ఇది. ‘‘ఉత్తమ కథలన్నీ చాలా తక్కువ సందర్భాల్లోనే శుభ్రంగా, పర్ఫెక్ట్గా ఉంటాయి. నిజాలన్నీ అలాంటి కథల్లోనే దాగుంటాయి’’ అని ట్వీట్ చేశారు ఒబామా. ఈ అవార్డు ఫంక్షన్‌కి ఒబామా హాజరు కాకపోవడంతో ఈ సినిమా కో డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. గ్లామర్ గౌన్లు ఆస్కార్ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అంటే.. రెడ్ కార్పెట్‌పై స్టార్స్ ‘క్యాట్‌వాక్’. డిజైనర్ గౌన్లు, నగలతో చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్లుగా తయారై వస్తారు. ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న సింథియా ఎరివో తెలుపు రంగులో మెరిశారు. నగలేవీ ధరించకుండా సింపుల్‌గా వచ్చేశారామె. సిల్క్ గౌనులో నటి, గాయని స్కార్లెట్ జోహాన్సన్ అందరి కళ్లూ తనవైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన 27 క్యారెట్ల వజ్రపు చెవి దుద్దులు ఓ ఎట్రాక్షన్. లైట్ పింక్ కలర్లో తళుకులీనుతున్న బ్రీ లార్సన్ గౌన్ చూశారు కదా. çపూసలు, రాళ్లతో ఈ గౌనుని డిజైన్ చేశారు. మొత్తం 1200 గంటలు పట్టిందట. అంటే.. ఈ గౌను తయారీకి 50 రోజులు పట్టింది. ఇంకా నటి పెనిలోప్ క్రూజ్ నలుపు రంగు గౌను, నడుముకి ముత్యాల బెల్ట్‌తో, ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చార్లెస్ థెరాన్ నలుపు రంగు గౌనులో.. ఇలా తారలందరూ రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చిన వేళ కాలం స్తంభించిపోతే బాగుండు అనిపించే చిలిపి ఆలోచన రానివాళ్లు ఉండరేమో. విజేతల వివరాలు ఉత్తమ చిత్రం: పారసైట్ ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్ (జోకర్) ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ (జూడి) ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) ఉత్తమ సహాయనటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ) ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ çహూ (పారసైట్) ఉత్తమ సంగీతం: హిల్డర్ (జోకర్) బెస్ట్‌మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: ఐయామ్ గాన్నా లవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్) ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారసైట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్: బాంబ్ షెల్ ఉత్తమ డాక్యుమెంటరీ: అమెరికన్ ఫ్యాక్టరీ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్) బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్‌స్టోరీ 4 బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బాంగ్ జూన్ (పారసైట్) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్) బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917 బెస్ట్ సినిమాటోగ్రఫీ: 1917 బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ లిటిల్ ఉమెన్ తెల్ల రంగు ఆధిపత్యం ఆస్కార్ అవార్డ్స్ విజేతల ఎంపికలో జరుగుతున్న ‘వర్ణ వివక్ష’పై ఐదేళ్లుగా ‘ఆస్కార్ సో వైట్’ అంటూ అవార్డు కమిటీ వివాదాలు ఎదుర్కొంటోంది. మహిళా డైరెక్టర్ల నామినేషన్ విషయంలోనూ వివాదం జరుగుతోంది. అందుకే ఈసారి ‘వెరీ మేల్.. వెరీ వైట్’ అంటూ పలువురు బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. డైరెక్టర్ల విభాగంలో పురుషాధిక్య ధోరణి కనబడుతోందని, మొత్తం అవార్డుల ఎంపిక పరంగా తెల్ల జాతీయుల ఆధిక్యం కనబడుతోందని సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. 2017లో 18, 2018లో 13, 2019లో 15 మంది నల్ల జాతీయులకు నామినేషన్ దక్కింది. ఈసారి సంఖ్య బాగా తగ్గింది. జస్ట్ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ఒకే ఒక్క నల్ల జాతీయురాలికే నామినేషన్ దక్కడం బాధాకరం అని నామినేట్ అయిన ‘సింథియా ఎరివో’ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల విషయంలోనే కాదు.. రెడ్ కార్పెట్ దగ్గర కూడా వర్ణ వివక్ష ఉందని, తెల్ల రిపోర్టర్ల హవానే ఉందన్నారామె. బ్లాక్ రిపోర్టర్స్కి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రతిభకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని, రంగుకి కాదని అన్న సింథియా ‘వైట్ రిపోర్టర్స్’కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. లోలా అనే బ్లాక్ ఫిమేల్ రిపోర్టర్ని పలకరించి, ‘నేను మాట్లాడాలి’ అంటూ చిన్న చాట్ సెషన్లో పాల్గొన్నారు. మహిళా దర్శకులు ఎక్కడ? హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఏ భాషలో అయినా ఇరవై ముప్పై మంది మేల్ డైరెక్టర్లు ఉంటే నలుగురైదుగురు ఫిమేల్ డైరెక్టర్లు ఉంటారు. ఆ ఉన్న తక్కువమందికి ప్రోత్సా హం దక్కకపోతే? ఇదే విషయాన్ని సూచిస్తూ నటి, దర్శక–నిర్మాత నటాలీ పోర్ట్మేన్ ఆస్కార్ అవార్డుల జాబితాలో నామినేట్ కాని మహిళా దర్శకుల పేర్లను తన డ్రెస్ మీద కుట్టించుకున్నారు. ఆమె డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ చేసిన పేర్లలో ‘హస్లర్స్’ చిత్రదర్శకురాలు లోరెనీ స్కఫారియా, ‘ది ఫేర్వెల్’ దర్శకురాలు లులు వ్యాంగ్, ‘లిటిల్ ఉమన్’ దర్శకురాలు గ్రెటి గెర్విగ్ తదితరులవి ఉన్నాయి. ఆస్కార్ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ కాత్రిన్ బిజెలో, లీనా వెర్ట్ముల్లర్, జేన్ కాంపియన్, సోఫియా కొప్పోలా, గ్రెటి గెర్విగ్.. ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు. వీళ్లల్లో 82వ ఆస్కార్ అవార్డ్స్ (2010)లో ‘ది హర్ట్ లాకర్’ చిత్రానికి గాను కాత్రిన్ బిజెలో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ని సొంతం చేసుకున్నారు. లేడీ డైరెక్టర్ల విభాగంలో తొలి ఆస్కార్ అందుకున్న దర్శకురాలు ఆమే కావడం విశేషం. ఈ రికార్డ్ భవిష్యత్తులో వేరే లేడీ డైరెక్టర్‌కి దక్కే ఆస్కారం లేదని, ఎందుకంటే అకాడమీ కమిటీ వివక్ష చూపిస్తోందని అర్థమవుతోందనే విమర్శలు ఉన్నాయి. అసలు ఫిమేల్ డైరెక్టర్స్‌కి నామినేషన్ దక్కడమే గగనం అనే పరిస్థితి. గడచిన పదేళ్లల్లో 2018లో ‘లేడీ బర్డ్’ సినిమాకిగాను గ్రెటా గెర్విగ్ నామినేషన్ దక్కించుకున్నారు.. అంతే. జాలీ బిల్లీ నటుడు, గాయకుడు బిల్లీ పోర్టర్ కొంచెం జాలీ టైప్. అమ్మాయిలా డ్రెస్ చేసుకుని సరదాపడేంత జాలీ మేన్. గతేడాది ఆస్కార్ అవార్డ్ వేడుకకు బిల్ నలుపు రంగు గౌనులో హాజరయ్యారు. ఈ ఏడాది కూడా అమ్మాయిలా డ్రెసప్ అయి వచ్చారు. జూలియా బటర్స్ విశేషాలు ►యాంగ్ లీ (2012, లైఫ్ ఆఫ్ పై) తర్వాత ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నది బాంగ్ జూన్ హూ మాత్రమే. ►గతంలో ‘జోకర్’ పాత్రను పోషించినందుకు ఉత్తమ నటుడిగా (2008) హీత్ లెడ్జర్ ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు ఓక్విన్ ఫీనిక్స్. ►‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’తో ఆకట్టుకున్న బాల నటి జూలియా బటర్స్ ఆస్కార్స్ వేడుకకు సాండ్విచ్ తెచ్చుకుంది. ‘‘కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లో ఏమీ పెట్టరు లేదా నాకు నచ్చేవి ఏమీ ఉండవు. అందుకే సాడ్విచ్ తెచ్చుకున్నాను’’ అని చెప్పింది జూలియా. -
ఆ ఫోటోతో నవ్వులపాలైన ట్రంప్..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఉదయం పోస్ట్ చేసిన ఓ ఫోటో దుమారం రేపింది. ఈ ఫోటోపై ట్విటర్ యూజర్లు ట్రంప్‌ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ట్రంప్ చవకబారు వ్యక్తిత్వానికి ఈ పోస్ట్ సంకేతమని ట్రోల్ చేశారు. ఇంతకీ ట్రంప్ పోస్ట్ చేసిన ఫోటో పరిశీలిస్తే మార్ఫింగ్ చేసిన ఆ ఇమేజ్‌లో ట్రంప్ ఒక గది హాలు మూలన నిలబడి, కిటికీకి ఒక స్తంభంపై వాలగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాలీవుడ్ చలనచిత్రాలలో గూఢచారుల తరహాలో కిటికీ బయట నుంచి బైనాక్యులర్ల ద్వారా అతనిని చూస్తున్నట్టుగా ఉంది. ఈ కిటికీ భూమికిపైన కొన్ని అంతస్ధులపైన ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోను ట్రంప్ పోస్ట్ చేసిన వెనువెంటనే నెటిజన్లు తమదైన కామెంట్స్‌తో అమెరికా అధ్యక్షుడిని ఇరకాటంలోకి నెట్టారు. అభిశంసనకు గురయ్యే అధ్యక్షుడు ఎలా ఉంటారో ఒబామా చూడాలని అనుకుని ఉంటారని ఓ ట్విటర్ యూజర్ కామెంట్ చేయగా, మీరెంత అపహాస్యమైన ఉద్దేశాలతో ఉన్నారో మీకు అర్ధమైందా అని మరో యూజర్ ట్రంప్‌కు గడ్డిపెట్టాడు.ఒబామా అంటే ట్రంప్‌కు ఎప్పుడూ అసూయేనని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈ పోస్ట్ ట్విటర్లో కనిపించిన అరగంటలోనే 17,000 సార్లు రీట్వీట్ కావడం గమనార్హం. చదవండి : ‘అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే’ -
నేను నీకు పాలివ్వలేను: ఒబామా
హవాయి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే దర్శనమిస్తుంటాడు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన్ను అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఆయనకు అమెరికాలోనే కాదు పలుదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన ఓ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆడించిన వీడియో వైరల్‌గా మారింది. ఒబామా హవాయి రాష్ట్రంలోని కనైలిలో ‘కనేహే క్లిప్పర్ గోల్ఫ్ కోర్సు’కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ తల్లి తన చిన్నారిని ఎత్తుకుని అదే గోల్ఫ్ కోర్సులో ఆడిస్తోంది. ఒబామా వెళ్లి వారిని పలకరించాడు. ‘ఎవరీ పాప?’ అంటూ చిన్నారి రిలేను ఆమె తల్లి దగ్గరనుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ పాపకు ఎన్ని సంవత్సరాలని ఒబామా అడగగా పాపాయి తల్లి మూడు నెలలని సమాధానమిచ్చింది. ఆ తర్వాత శిశువును ముద్దు చేస్తూ ఆడిస్తూ ‘నేను నీకు పాలివ్వలేను’ అంటూ పాపాయితో జోక్ చేశాడు. అనంతరం ఆమె నుదుటిపై ప్రేమగా ఓ ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ అనూహ్య చర్యతో పాపాయి తల్లి టిఫానీ ఉక్కిరిబిక్కిరైపోయింది. మాజీ అధ్యక్షుడిలా కాకుండా సాదాసీదాగా వచ్చి, సామన్యుడిలానే పలకరించి వెళ్లిపోయాడని ఆ తల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా ఇప్పటివరకు ఈ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. President Obama gracefully walked up and asked to hold my niece Riley. He was golfing in Hawaii. My niece is the GOAT period. #Hawaii #obama #President #MichelleObama pic.twitter.com/u6gmhGqzx4 — Andrea Jones (@itsanicholle) December 19, 2019 -
ఒబామా మెచ్చిన తలపాగా
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జివాన్‌దీప్. శాన్ డియాగోకు చెందిన ఈయన ఎల్‌జీబీటీక్యూలు జరుపుకునే ప్రైడ్ మంత్ ఉత్సవాల్లో భాగంగా ధరించిన ఇంద్ర ధనుస్సు రంగుల తలపాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను ముగ్ధుడిని చేసింది. ప్రైడ్ మంత్ ఉత్సవాలు ప్రారంభమైన జూన్ 1న జివాన్‌దీప్ ట్విట్టర్లో పెట్టిన ఈ ఫోటోకు లక్షకుపైగా లైకులు 15వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. బైసెక్సువల్ అయిన జివాన్ ఈ ఫోటోకు ‘బై సెక్సువల్ బ్రెయిన్ సైంటిస్టయినందుకు గర్వంగా ఉంది. నా గుర్తింపునకు సంబంధించిన అన్ని అంశాలను(తలపాగా, గడ్డం) వ్యక్తీకరించగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే స్వేచ్ఛను ఇతరులు కూడా ప్రదర్శించేలా చూసేందుకు కృషి చేస్తాను’అని కేప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోకు తాజాగా ఒబామా కూడా లైక్ కొట్టారు. ‘జివాన్‌దీప్ మీరు గర్వపడే పని చేశారు . ఈ దేశంలో గేలకు మరింత సమానత్వం కల్పించేందుకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు...అన్నట్టు.. మీ తలపాగా అద్భుతంగా ఉంది. అందరికీ ప్రైడ్ మంత్ శుభాకాంక్షలు.’అని ఒబామా ట్వీట్ చేశారు. జూన్ 4న ఒబామా చేసిన ఈ ట్వీట్‌కు 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో ఎల్జీబీటీక్యూలకు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. 1969 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ లు ప్రైడ్ మంత్ జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం అమెరికాలోని గ్రీన్విచ్ గ్రామంలోని ఒక బారులో గేలు సంబరాలు చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా గేలు హక్కుల కోసం ఉద్యమించారు.ఫలితంగా ఇతరులతో పాటు సమానంగా హక్కులు సాధించారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతీ జూన్‌లో ఎల్‌జీబీటీక్యూలు ప్రైడ్ మంత్ నిర్వహిస్తారు. -
రెయిన్బో టర్బన్; చాలా బాగుంది!
తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించిన జీవన్‌దీప్ కోహ్లి అనే సిక్కు యువకుడిని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఈ మేరకు..‘ జీవన్‌దీప్ నువ్వు చాలా గర్వపడాలి. ఇలా చేయడం ద్వారా ఈ దేశంలోని సమానత్వ భావనను మరింత ఇనుమడింపజేశావు. నీ టర్బన్ చాలా బాగుంది. అందరికీ హ్యాపీ ప్రైడ్ మంత్’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ విషయమేమిటంటే.. 1968, జూన్ 28 తెల్లవారుజామున గే హక్కుల కార్యకర్తలపై పోలీసులు రైడ్ చేశారు. సమానత్వం కోసం పోరాడుతున్న తమను ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తూ వారంతా పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. స్టోన్వాల్ అల్లర్లుగా పిలువబడే ఈ ఉదంతం.. ఎల్జీబీటీ హక్కులను ప్రముఖంగా ప్రస్తావించిన ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రతీ ఏడాది జూన్‌ను ప్రైడ్మంత్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాండియాగోలో నివసించే జీవన్‌దీప్ కో్హ్లి..‘ నేను బైసెక్సువల్ అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతాను. ఈ విధంగా నా గుర్తింపును బయటపెట్టుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నాలాగే అందరికీ ఇలాంటి స్వేఛ్చ లభించేందుకు నా వంతు కృషి చేస్తా అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఎల్జీబీటీ వర్గాన్ని ప్రతిబింబించే ఇంద్రధనుస్సు రంగులతో కూడిన టర్బన్ ధరించాడు. దీంతో కోహ్లి ధైర్యానికి ఫిదా అయిన ఒబామా అతడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. You've got a lot to be proud of, Jiwandeep. Thanks for everything you do to make this country a little more equal. Turban looks great, by the way. Happy Pride Month, everybody! https://t.co/SO7mgnOkgl — Barack Obama (@BarackObama) June 4, 2019 -
‘ఆ విషయంలో ట్రంప్‌ని ఎన్నటికి క్షమించను’
వాషింగ్టన్ : నా భర్త పౌరసత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేసి నా కుటుంబానికి భద్రత లేకుండా చేశాడు. ఈ విషయంలో ట్రంప్‌ను ఎన్నటికీ క్షమించలేను అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బర్తర్’ థియరి పేరుతో తన కుటుంబం పట్ల ట్రంప్ ప్రవర్తన గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో పలు విషయాల్ని ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ 2011 సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బర్తర్’ థియరిని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఒబామాను ఉద్దేశిస్తూ ‘ఎందుకు నీ బర్త్ సర్టిఫికేట్‌ను చూపించడం లేదం’టూ ట్రంప్ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది అమెరికా రాజకీయాల్లోనే పెను సంచలనం అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోక ఈ అంశానికి మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు ట్రంప్. ‘ఒబామా ముస్లిం అనుకుంటాను. అందుకే తన బర్త్ సర్టిఫికేట్‌ని చూపించడం లేదం’టూ ఆరోపించారు. ఈ విషయాలన్నింటి గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ట్రంప్ లాంటి జాత్యహంకార వ్యక్తిని తానేప్పుడు చూడలేదన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల తన కుటుంబ భద్రతకు ముప్పు వాటిల్లిందని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ ప్రచారం చేసిన ‘బర్తర్’ థియరీ చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎవరైనా మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ట్రంప్ మాటలను విశ్వసించి మా మీద ద్వేషం పెంచుకుని.. ఏ చాకో.. గన్నోతీసుకుని మా కుటుంబం మీద దాడి చేయడానికి వస్తే మా పరిస్థితి ఏంట’ని ప్రశ్నించారు. అందుకే ఈ విషయంలో తాను ఎప్పటికి ట్రంప్‌ని క్షమించలేనని తెలిపారు. మూడు భాగాలుగా వస్తోన్న బికమింగ్ పుస్తకాన్ని నవంబర్ 14న విడుదల చేయనున్నారు -
‘ఆ ఫొటో కావాలనే ఎడిట్ చేశా..’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో తీసిన ఫొటోలను కావాలనే ఎడిట్ చేశానని అమెరికా ప్రభుత్వ ఫొటోగ్రాఫర్ తెలిపారు. 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేషనల్ పార్క్ సర్వీస్‌లో జనవరి 20, 2017న భారీ సభను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను చూసిన ట్రంప్, తనను పిలిచి ఒబామా సమావేశం ఫొటోల కంటే తన సమావేశంలో ప్రజలు తక్కువగా ఉన్నట్లు కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారని సదరు ఫొటోగ్రాఫర్ విచారణలో పేర్కొన్నారు. ట్రంప్ సూచనమేరకే.. ఖాళీగా ఉన్న ప్రదేశం కనపడకుండా, సభా ప్రాంగణమంతా జనాలతో నిండి ఉన్నట్లుగా ఫొటోలను తానే క్రాప్ చేశానని ఆయన పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అధిక సంఖ్యలో ప్రజలు రోడ్లమీదకి వచ్చి నిరసన తెలిపిన విషయం తెలిపిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశానికి భారీగా ప్రజలు హాజరయ్యారని, ఆయనపై ఎటువంటి వ్యతిరేకత లేదంటూ.. ట్రంప్ మాజీ పత్రికా కార్యదర్శి సమావేశానికి సంబంధించిన ఫొటోలను సాక్ష్యంగా చూపారు. ఈ క్రమంలో అవన్నీ ఎడిటెడ్ ఫొటోలంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ విమర్శలు నిజమేనని ఫొటోగ్రాఫర్ మాటల ద్వారా నిరూపితమైంది. -
ట్రంప్‌ను పిలువకుంటే.. ‘టైమ్బాంబ్’ పేలినట్టే!
త్వరలో జరగనున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల రాచరిక వివాహం బ్రిటన్, అమెరికా మధ్య దౌత్య వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఈ వేడుకకు ఆహ్వానించి.. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను పిలువకపోతే.. ‘డిప్లమాటిక్ టైమ్బాంబ్’ బద్దలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత బ్రిటన్-అమెరికా దౌత్యబంధం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా రాచకుటుంబం రంగంలోకి దిగింది. హ్యారీ పెళ్లి సందర్భంగా వివాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రిన్స్ హ్యారీ బరాక్ ఒబామాను స్నేహితుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను పెళ్లికి అతిథిగా ఆహ్వానించే అవకాశముందని కథనాలు వచ్చాయి. అదే సమయంలో ఈ వివాహం బ్రిటన్ అధికారిక వేడుక కాకపోవడంతో ట్రంప్‌ను పిలిచే అవకాశం లేదని సన్నిహితులు తెలిపారు. అయితే, ఒబామాను పిలిచి తనను పిలువకపోవడం ట్రంప్ అవమానంగా భావించే అవకాశముందని, తనకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఆయన తాజా బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో పర్యటించాలని గతంలో ట్రంప్ భావించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో హ్యారీ పెళ్లి జరుగుతుండటం, తనకు ఆహ్వానం అందకపోవడం ట్రంప్ తలవంపులుగా భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామాను ఈ పెళ్లికి ఆహ్వానిస్తే.. దౌత్యవివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఒబామాను కూడా పిలువకూడదని నిర్ణయించినట్టు బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
క్యాస్ట్రో ఈజ్ డెడ్!: ట్రంప్
క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ దారుణంగా స్పందించారు. 'క్యాస్ట్రో ఈజ్ డెడ్' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఓ అధ్యక్షుడిగా క్యాస్ట్రో కఠోరంగా శ్రమించారని, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. క్యూబా చరిత్రలో కొత్త అధ్యాయానికి క్యాస్ట్రో తెరలేపారని కొనియాడారు. క్యూబా పైనా, ప్రపంచం పైనా క్యాస్ట్రో ప్రభావాన్ని చరిత్రే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. మరో వైపు అమెరికా కఠిన నిర్భందాలను ఎదుర్కొని బలీయమైన దేశంగా క్యూబాను క్యాస్ట్రో చేశాడని గత సోవియట్ అధ్యక్షుడు గోర్భచెవ్ అన్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఓ శకానికి క్యాస్ట్రో చిహ్నం అని రష్యా అధ్యక్షుడు వ్లాధిమిర్ పుతిన్ పేర్కొన్నారు. Fidel Castro is dead! — Donald J. Trump (@realDonaldTrump) November 26, 2016 -
ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్..!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్రరాజ్యంతో అనుకున్న ఒప్పందాలన్నింటినీ త్వరత్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో సైనిక నిఘాకు ఉద్దేశించిన ప్రిడేటర్ డ్రోన్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతోపాటు పలు రక్షణ, అణు ప్రాజెక్టుల ఒప్పందాలు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్స్‌ను తమకు అమ్మాలని భారత్ గత జూన్‌లో అమెరికాను కోరింది. ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుతం సంప్రదింపులు పురోగతి సాధించాయని, ఒబామా పదవిలోంచి దిగిపోయేలోగా ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యే అవకాశముందని భారత అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మారిన మోదీ వ్యూహం! భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఒబామా కూడా అమెరికా విదేశీ దౌత్యవ్యూహంలో ఘననీయమైన మార్పును తీసుకొచ్చి.. మధ్యప్రాచ్యం నుంచి ఆసియా మీదకు దృష్టి కేంద్రీకరించారు. భారత్‌కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్న రష్యాను భారత్ పక్కనపెట్టేలా అమెరికా ఒప్పించగలిగింది. ఇందుకు ప్రతిగా భారత్‌కు అత్యున్నత సైనిక సాంకేతికత అందించడంతోపాటు బిలియన్ డాలర్లు విలువ చేసే అణురియాక్టర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్‌లో భారత్‌కు స్వభ్యత్వం వచ్చేలా చూసింది. దీంతో భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్లు అమ్మేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కోసం అమెరికా రక్షణమంత్రి అష్టన్ కార్టర్ ఈ ఏడాది చివర్లో భారత్‌కు వచ్చే అవకాశముంది. భయపెడుతున్న ట్రంప్ 'అమెరికా ఫస్ట్' అమెరికా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన విదేశీ విధానంలో 'అమెరికా ఫస్ట్' అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు. ఆయన ప్రకటనలు ఇటు భారత్‌లోనూ, అటు ఆసియాలోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఆసియాకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఒబామా వ్యూహం నుంచి ట్రంప్ తప్పుకోవచ్చునని వినిపిస్తోంది. ట్రంప్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌కు ఇస్తున్న రక్షణ సహకారంపై సందేహాలు రేకెత్తించారు. వారికి నేరుగా ఆయుధసాయం చేయడం కంటే.. సొంతంగా అవే అణ్వాయుధాలు రూపొందించుకునేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా విధానంలో ఆసియాకు ప్రాధాన్యం తగ్గొచ్చునని, ఇది పరోక్షంగా ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పారిస్ ఒప్పందానికి సై !
పారిస్ శిఖరాగ్ర సదస్సులో నిరుడు డిసెంబర్లో దాదాపు 200 దేశాల మధ్య కర్బన ఉద్గారాల తగ్గింపుపై కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికకు అనుగుణంగా దాన్ని ధ్రువపరుస్తున్నట్టు మన దేశం మహాత్ముడి జయంతి రోజున ప్రకటించింది. దీంతో ఇంతవరకూ అలా ధ్రువీకరించిన 60 దేశాల సరసన మనమూ చేరాం. ఈ దేశాలన్నీ 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33నుంచి 35 శాతాన్ని తగ్గించాల్సి ఉంటుంది. 2030నాటికి దీన్ని సాధించాలి. అందుకోసం మన దేశమైతే ఇప్పుడు వినియోగిస్తున్న శిలాజ ఇంధనాల శాతంలో 40శాతం కోత విధించుకోవాలి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రారంభించాలి. ప్రపం చంలో 55 శాతానికి మించి కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న 55 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ఒప్పందం ఆచరణలోకి రావాలంటే కనీసం ఈ దేశాల ఆమో దం తప్పనిసరి. వాస్తవానికి ఇంతవరకూ ధ్రువీకరించిన దేశాలు సంఖ్యాపరంగా చూస్తే 61 అయినా...వీటి వల్ల కలిగే కాలుష్యం 51.8 శాతం వరకూ ఉంది. పారిస్ సదస్సులో ఒడంబడికకు ఆమోదం తెలిపిన 196 దేశాల్లో ఒక్కొక్కటే ఈ జాబితాలో చేరుతుండటంవల్ల చాలా త్వరగానే మిగిలిన 3.2 శాతం పూర్తవుతుందని చెబు తున్నారు. గడువు ప్రకారం నవంబర్ 1 కల్లా ఆ దేశాలన్నీ ధ్రువీకరణ లాంఛనాన్ని పూర్తిచేయాల్సి ఉంది. 12 శాతం ఉద్గారాలకు కారణమవుతున్న యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఆ దిశగా అడుగులేస్తున్నది. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అందరికన్నా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొందరపడు తున్నారు. తన పదవీకాలం వచ్చే జనవరితో పూర్తవుతున్నందున ఈలోగానే దీన్ని అయిందనిపించాలన్నది ఆయన ఆరాటం. ఈ విషయంలో మన దేశంతోసహా చాలామంది ఆయనను సానుభూతితో అర్ధం చేసుకుని సహకరిస్తున్నట్టు కనబడుతూనే ఉంది. వాస్తవానికి గత నెలలో చైనాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా...అంతకన్నా ముందు ఆగస్టులో అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెరీ మన దేశంలో పర్యటించినప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెనువెంటనే పారిస్ ఒడంబడిక ధ్రువీకరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. పారిస్‌లో అంగీకరించి తీరా లాంఛనంగా ధ్రువీకరించవలసి వచ్చే సరికి ఎందుకీ జాప్యమని కొందరు ప్రశ్నించారు. వారిద్దరూ అందుకు రెండు కార ణాలు చెప్పారు. పారిస్ ఒడంబడిక అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టా లంటే రాగల పదేళ్ల కాలంలో లక్ష కోట్ల డాలర్లు(సుమారు రూ.66.55 లక్షల కోట్లు) అవసరమవుతాయి. కాలుష్యాన్ని వడబోసే హరిత సాంకేతికత(గ్రీన్ టెక్నాలజీ) కోసం వెచ్చించాల్సి వచ్చే సొమ్ము దీనికి అదనం. కనుక అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా లక్ష్యాన్ని సాధించాలంటే... సంపన్న దేశాల చేయూత అవసరం. అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో తమ సభ్యత్వం సంగతి ముందు తేల్చాల న్నది మరో డిమాండ్. ఎన్ఎస్జీలో చేరితే అణు విద్యుత్ రంగంలో సత్వర ప్రగతి సాధ్యమవుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుం దని మన దేశం భావిస్తోంది. ఈ అంశాల్లో విస్పష్టమైన హామీలు దొరక్కుండానే పారిస్ ఒడంబడికను ఇప్పుడు ధ్రువీకరించారు. అయితే ఎన్ఎస్జీ సభ్యత్వం, సం పన్న దేశాల ఆర్ధిక సాయం తదితరాలతో పారిస్ ఒడంబడిక ధ్రువీకరణను మన దేశం ఏనాడూ ముడిపెట్టలేదని కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే అంటు న్నారు. పారిస్ ఒడంబడిక వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, తమ మంత్రిత్వ శాఖ చూస్తున్నాయని...వివిధ స్థాయిల్లో సమాలోచనల వల్లే ఒడంబడిక ధ్రువీక రణలో ఆలస్యమైందని ఆయన సంజాయిషీ ఇస్తున్నారు. అంతేకాదు...దానికి సంబ ంధించి ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వారి వారి వ్యక్తిగతమైనవని అంటున్నారు. ఇది అన్యాయమైన మాట. విధానపరమైన అంశానికి సంబంధించి విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ జాన్ కెరీ వద్ద తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఎలా చెప్పగలుగుతారు? జీ-20 వేదికపై నీతిఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా తన సొంత వాదన ఎందుకు వినిపిస్తారు? ఆ స్థాయి వారు మాట్లాడాక అవి వారి వ్యక్తిగతమని తేల్చడం సరికాదు. ఆ రెండింటి విషయంలో ఎందుకని మన పట్టు సడలించుకున్నామో చెబితే సబబుగా ఉండేది. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదన్న వాదనతో ఎవరూ విభేదించడం లేదు. నిజానికి పారిస్ ఒడంబడిక దాని తీవ్రతను అవసరమైన స్థాయిలో పట్టిం చుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ ఒడంబడిక 2050నాటికి భూతాపం పెరుగుదల ను కనీసం 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలన్న సంకల్పాన్ని ప్రకటిం చినా... దాన్ని చేరుకోవడానికిచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఒడంబడిక అమలు కావలసిందే. అయితే బొగ్గు వాడకంలో 29 శాతంతో చైనా అగ్రభాగాన ఉండగా అమెరికా 16 శాతంతో, యూరప్ 10శాతంతో దాని తర్వాత ఉన్నాయి. ఉండటానికి మనం నాలుగో స్థానంలో ఉన్నా మన వినియోగం 5 శాతం మాత్రమే. కర్బన ఉద్గారాల వాటా దామాషాలో కోత విధింపు కూడా ఉంటే సంపన్న దేశాలపై అధిక భారం పడేది. కానీ పారిస్ శిఖరాగ్ర సదస్సులో సంపన్న దేశాలు పేచీకి దిగి అందరికీ సమాన బాధ్యత ఉంటుందని వాదించాయి. స్వచ్ఛ ఇంధనం కోసం చేసే కృషికి తమ వైపుగా ఆర్ధిక చేయూతకు, హరిత సాంకేతికత అందుబాటులో తీసుకొచ్చేం దుకు సిద్ధమేనని చెప్పి ఒడంబడికపై సంతకాలు చేయించాయి. కానీ ఆ విషయంలో ఇంకా తగినంత స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో మనం ధ్రువీకరణ లాంఛనాన్ని పూర్తి చేస్తే అవి తమ హామీలను నెరవేరుస్తాయా? 2030కల్లా మనం విద్యుదుత్పాదనలో పునరుత్పాదక ఇంధన వనరుల శాతాన్ని 40 శాతానికి పెంచాలి. ఇందుకోసం థర్మల్ కేంద్రాలను బాగా తగ్గించి సౌరశక్తి, అణు విద్యుత్, పవన విద్యుత్, జలవిద్యుత్ వనరులవైపు మళ్లాలి. మనపై ఇంత భారం ఉన్న నేపథ్యంలో సంపన్న దేశాల నుంచి స్పష్టమైన హామీ రాకుండా ధ్రువీకరణ సబబైందేనా? ఆలోచించాలి. -
ఉప్పు, నిప్పుల మధ్య కీలక ముందడుగు
వాషింగ్టన్ డీసీ: దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా ఉన్న అమెరికా,క్యూబా సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఐదు దశాబ్దాల అనంతరం క్యూబాలో అమెరికా రాయబార కార్యాలయం తెరుచుకోనుంది. జెఫ్రీ డిలారెంటిస్ ను క్యూబాలో అమెరికా రాయబారిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.50 ఏళ్ల అనంతరం క్యూబాలో అంబాసిడర్‌ను నియమించడం గర్వంగా ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. క్యూబా, అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జెఫ్రీని అభినందించారు.ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ పూరిత పరిస్థితులను పరిష్కరించడంలో ఒబామాతో కలిసి జెఫ్రీ కీలకపాత్ర పోషించారు. దాదాపు 90 ఏళ్ల అనంతరం ఈ యేడాది మార్చిలో అమెరికా అధ్యక్షుని హోదాలో ఒబామా క్యూబాలో పర్యటించారు. దీంతో ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడంలో కీలక ముందడుగు పడింది. -
అహంకారం స్థానే సహకారం
అమెరికా అధ్యక్షుడు ఒబామా తన పొరుగుదేశం క్యూబాని సందర్శించడం చారిత్రాత్మకం. అభినందనీయం. పొరుగునే తొంబైమైళ్ళ దూరాన ఉన్న దేశాన్ని, అమెరికా అధ్యక్షుడు పర్యటించడానికి దాదాపు తొంబైఏళ్ళు పట్టడం విదేశాంగ విధానాలో్ల కరడుగట్టిన హ్రస్వదృష్టికి నిదర్శనం. దేశాల మధ్య సైద్ధాంతిక భేదాలు శతృత్వ భావనల్ని ప్రేరేపించడం వల్ల చివరకు ఇరువర్గాలూ నష్టపోవడమేకాక ప్రపంచ శాంతి ఎండమావిగా తయారైంది. తన పక్కనే ఉన్న చిన్న దేశం క్యూబాపై అమెరికా తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించి ఇన్నాళ్ళూ శత్రు పూరిత వైఖరిని ప్రదర్శించింది. అందుకు ముఖ్యకారణం పాలనలో తనకు భిన్నమైన సిద్ధాంతాన్ని అవలంభిస్తోన్న దేశాన్ని మెడలు వంచి తన దారికి తెచ్చుకోవాలన్న అహంకార పూరిత వైఖరి. దశాబ్దాలపాటు సాగిన ఆర్థిక ఇబ్బందుల్ని లెక్క చెయ్యకపోవడమేగాక వైద్య, ప్రజారోగ్య రంగాల్లో, మానవ వనరుల అభివృద్ధిలో ముందంజ వేయడం క్యూబా విజయం. అయితే ప్రస్తుతం అహంకార వైఖరి స్థానే సహకారం, సుహృద్బావం ప్రోది చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు మొదటి అడుగు వేయడం మేలిమలుపు. ఉమ్మడి ప్రయోజనాలకు, తద్వారా ప్రపంచ శాంతికి దేశాలు తమతమ సిద్ధాంతాలకు, స్వప్రయోజనాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరముంది. ఆ దిశగా జరిగిన ఈ ప్రయత్నానికి అందరూ మద్దతు పలకాలి. దశాబ్దాలుగా క్యూబాపై మనం అమలుపరిచిన ఏకాకి విధానం ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి క్యూబా ప్రజలకు మరింత దగ్గరవడం ద్వారానే ఇరుదేశాల సంబంధాలను మార్చగలం అని హిల్లరీ క్లింటన్ చెప్పారు. దీన్ని కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ పాటిస్తే అమెరికా, క్యూబా రెండింటికీ ప్రయోజనం కలిగిస్తోంది. - డా ॥డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం 9440836931 -
ప్రజాస్వామ్యానికి ‘ట్రంప్’ముంపు
ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీయుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహమ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్‌కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచారంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసినదేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో కలసి గడచిన గురువారం ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు కనిపించారు. ఆయన చురుకైన మేధ అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన పరిమిత డిమాండ్లకు అతీతంగానే ఆలోచిస్తున్నదని స్పష్టంగానే అనిపిస్తుంది. శ్వేత సౌధంలో రెండు దఫాలు కొలువైనప్పటికీ ఒబామా తాత్వికుడైన అమెరికా అధ్యక్షునిగా అవతరించలేకపోయారు. అయితే అధ్యక్షునిగా చివరి దశను పూర్తి చేసుకుంటున్న ఈ కాలంలో మాత్రం సుదీర్ఘకాలంగా అమెరికా రాజకీ యాలలో పూరించకుండా ఉండిపోయిన వెలితిని భర్తీ చేయబోతున్నారు. ఎన్నికైనవారు, కొన్ని విపరీత మినహాయింపులు కాకుండా- తెలివైనవారే అయి ఉంటారు. కానీ వీరిలో కొద్దిమంది మాత్రమే మేధావులు. ఒబామా త్వరలోనే అమెరికాకు చెందిన పిన్న వయస్కుడైన పెద్ద రాజనీతిజ్ఞుడు కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన రుజువు ఈ విలేకరుల సమావేశంలోనే కనిపించింది. ఎన్నికల ప్రచారంలో అరుపులూ, కేకలతో హడావిడి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే, అమెరికా- కెనాడా సంబంధాలు ఎలా ఉంటాయి అని ఒక విలేకరి ప్రశ్నించాడు. ఇప్పటికే ఈ అంశం మీద అమెరికాలో ఒక చతురోక్తి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఆ పరిస్థితే వస్తే కెనడా అమెరికాకు మరోసారి అద్భుతమైన వలసగా మారు తుందన్నదే ఆ చతురోక్తి. అయితే రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి, ట్రంప్ అవకాశాలు మెరుగుపడుతూ ఉండడంతో, ఈ చచ్చు చతురోక్తి కాస్తా, అమెరికావాసుల పాలిట పీడకల స్థాయికి చేరుతోంది. ఒబామా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆలోచనకు కూడా రాని కొన్ని అంశాలు ఎందుకు ఎలా పరిగణించదగినవిగా ప్రాముఖ్యంలోకి వచ్చాయి? అధ్యక్ష పదవికి ఎన్నికైన నాటి నుంచి తాను ఏది చెప్పినా, ఏది చేసినా కూడా తప్పే అన్నట్టు రిపబ్లికన్ పార్టీ నిరాఘాటంగా ప్రతికూల ప్రచారం చేయడమే ఇందుకు కారణమని ఒబామా చెప్పారు. ఏ అంశాన్ని కూడా దానిలోని మంచిచెడ్డల మేరకు పరిశీలించలేదు. తాను ఏం చేసినా అది తప్పే. ఒబామాకు ముందు అధ్యక్షులైన వారు కూడా విమర్శలను ఎదుర్కొనకపోలేదు. కానీ వారిలో ఎవరూ ఇలా పరాయి ముద్రతో బాధపడలేదు. ఒబామా ‘ద్వేషం’ అన్న మాటను ఉపయోగించలేదు. కానీ ఆ అర్థం స్ఫురించే విధంగానే మాట్లాడారు. అలాగే ఆయన జాతి గురించిన ప్రస్తావన కూడా చేయలేదు. అయితే తనను ‘ఆక్రమణదారుడు’గానే భావించారన్నట్టు నర్మగర్భంగా చెప్పారు. అసలు ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీ యుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహ మ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్‌కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. అయితే ఈ మతిభ్రమించిన వాచాలత్వాన్నీ, అవాస్తవాలను అమెరికన్లు విశ్వసించలేదు. అందుకే ఒబామా రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారు. కానీ చాలామంది రిపబ్లికన్లు ఈ ధోరణిలోనే వ్యవహరించారు. అందుకే వారు ఇంత వికృతంగా, ఇంత దుస్సాహసంతో మాట్లాడుతున్నప్పటికీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపు మొగ్గారు. ఇప్పుడు నమ్మకం కుదరక రిపబ్లికన్ పార్టీ తనను తను గిల్లుకుని చూసుకుంటోంది. అయినా వాస్తవం ఏమిటంటే, ట్రంప్ వారి సృష్టే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవ రిైైనైనా వెర్రి రాజకీయాలు ఊరిస్తూనే ఉంటాయి. కానీ అసభ్య పిల్లచేష్టలతో ఎవరూ మనుగడ సాధించలేరు. ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచా రంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసిన దేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు. తాజాగా జరిగిన ఉదంతాన్నే తీసుకుందాం. ఈ ఘట్టంలో అపఖ్యాతిని మూటగట్టుకున్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా దేశం నుంచి పారిపోవడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇందులో గమనించవలసిన సున్నితమైన సత్యం ఏమిటంటే, మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ అనే మునిగిపోతున్న విమానయాన సంస్థకు కాంగ్రెస్ అధి కారంలో ఉండగానే ప్రభుత్వ బ్యాంకుల నుంచి నిధులు కుమ్మరించేందుకు అనుమతి లభించింది. ఫిబ్రవరి 21, 2012న ఎస్పీఎస్ పన్ను, సంజయ్ సింగ్ అనే ఇద్దరు పత్రికా రచయితలు రాసిన నివేదిక నుంచి ఇక్కడ ఒక అంశాన్ని ఉదహరిస్తున్నాను. భారతీయ స్టేట్ బ్యాంక్ ‘‘విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ మునిగిపోకుండా కాపాడడానికి మంగళ వారం రూ. 1500 కోట్లు విసిరింది. ఆదాయ పన్ను శాఖ కూడా తన విధా నాన్ని సరళం చేసుకుంది. నష్టాలలో ఉన్న ఆ సంస్థను కాపాడేందుకు ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలో భాగంగా స్తంభింప చేసిన ఆ విమానయాన సంస్థ ఖాతాలు తిరిగి చెలామణిలోకి రావడానికి అంగీకరించింది.’’ మాల్యాకు ప్లాటినమ్ చెమ్చాతో అన్నీ నోటికందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆయన మీద చర్యలు మొదలైనది నిజానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే. ప్రస్తుత వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇంక ఏమాత్రం సాధ్యం కాదని తెలుసుకున్న తరువాతే మాల్యా హడావిడిగా దేశం విడిచి వెళ్లారు. అతడి మీద చర్యలకు బ్యాంకులకు కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడితో ఈ కథ అయిపోయిందని అనుకోవద్దు. చట్టం దృష్టి చాలా విస్తృతమైనది. మాల్యా ఆచూకీ తెలిసి, హాజరు కావలసిన తేదీకి అతడు కోర్టుకు రాని పక్షంలో ఈ దృష్టిని ప్రభుత్వం కాపాడగలిగితే దాని విస్తృతికి లోటుండదు. ఒబామా ప్రత్యేకంగా చెప్పినట్టు, అసలు బాధ అమెరికా తన విలువలు, ఇంగిత జ్ఞానం- ఈ రెండింటినీ కోల్పోవడం గురించినది కాదు. రిపబ్లికన్ పార్టీ తనకు తాను చేసుకున్న గాయాల నుంచి కోలుకుంటుందా లేదా అన్నదే. ప్రజాస్వామ్యంలో విశ్వసనీయమైన ప్రభుత్వం ఎంత అవసరమో, పొందికైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ఒక సామెత చెబుతారు, దేవతలు కాలు మోపడానికి కూడా భయపడే చోటికి అవివేకులు వెళతారట. అయితే ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, అక్కడ అవివేకులు కూడా అభ్యర్థులవుతారు. కానీ ఓటర్లు అంత దయకలిగిన వారేమీ కాదు. కానీ మూర్ఖులను సంతోషంగా భరిస్తున్న రాజకీయ పార్టీలు మాత్రం విశ్వసనీయత విషయంలో చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి -
'ఎందుకు ఏడ్చానో.. నాకే ఆశ్చర్యంగా ఉంది'
వాషింగ్టన్: గన్ కల్చర్ కారణంగా మృతిచెందిన అమాయక చిన్నారులను గుర్తుచేసుకొని పబ్లిక్‌గా కన్నీరు పెట్టుకున్న అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా.. తాను అలా ఏడవడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు. అగ్రరాజ్య అధినేత దీనిపై మాట్లాడుతూ.. 'నేను అలా కన్నీరు పెట్టుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. అయితే నేను వాస్తవవికతతో ప్రవర్తిచాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే.. చిన్నారుల మరణం నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. నేను అధ్యక్షుడిగా గా ఉన్న కాలంలో కనెక్టికట్‌లో చిన్నారుల కాల్చివేత ఘటన జరిగిన రోజే అత్యంత చెత్త రోజు' అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా దేశంలోని గన్ కల్చర్ కారణంగా బలి కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ తన వద్ద మాత్రం గన్ లేదని ఒబామా వెల్లడించారు. -
అధ్యక్షా.. మీరు అదుర్స్!
అమెరికా అధ్యక్షుడు బరాక్.. ఓ అగ్రరాజ్యానికి అధినేతగానే కాదు.. వ్యక్తిగతంగానూ మనసున్న నేతగా పేరు గడించారు. ఈ కొత్త ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియబోతున్నది. ఈ సందర్భంగా 2015లో ఒబామా అధికార హోదాలో నిర్వహించిన కార్యకలాపాలనే కాదు.. వ్యక్తిగతంగా కుటుంబసభ్యులతో, వైట్‌హౌస్ సిబ్బందితో, ప్రజలతో మమేకమై.. ఓ సామాన్యుడిలా పంచుకున్న మధురస్మృతులను పీటీ సౌజా ఫొటోల్లో బంధించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్ అయిన సౌజా కొత్త సంవత్సరం సందర్భంగా ఒబామాకు చెందిన వందకుపైగా ఫొటోలను ప్రచురించారు. బ్లెడీ సండే 50వ దినోత్సవ వేడుకగా బహిరంగ సభలో భార్య మిషెల్ చేతిని ఆప్యాయంగా పట్టుకోవడం మొదలు.. హలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ సిబ్బంది పిల్లలకు విందు ఇవ్వడం వరకు ఒబామాలోని మానవతా కోణాన్ని పట్టిచ్చే ఎన్నో అందమైన ఫొటోలు ఇందులో ఉన్నాయి. కూతురు మాలియాతో ప్రేమగా గడుపడం, తనకన్నా చాలా పొడగరి అయిన ఎన్బీఏ ఆటగాడు షాక్విల్ ఓనియల్తో నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం, పౌరుహక్కుల 50 దినోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా పౌరులతో చేతులు కలిపి ర్యాలీలో పాల్గొనడం, భార్య మిషెల్‌తో ప్రేమగా గడుపడం వంటి వైవిధ్యభరితమైన ఒబామా ఫొటోలు చూడొచ్చు. అలాగే ఒబామా భార్య మిషెల్ బాక్సింగ్ చేయడం, కుటుంబంతో, బయట ఒబామా సన్నిహితంగా పంచుకున్న అనుభూతులకు చెందిన ఫొటోలను సౌజా ప్రచురించారు. . -
నవాజ్ షరీఫ్ రాయని డైరీ
ఒబామా ముఖం చిట్లిస్తే చూడలేం. చిట్లింపులు, చిటపటలు లేకుండా ఒబామాతో చర్చల్ని ముగించుకొస్తే ఇక్కడ అపోజిషన్ వాళ్ల ముక్కుల్ని ముఖాల్ని చూడలేం. యు.ఎస్. వెళ్లే ముందు సొంతపార్టీవాళ్లు కూడా చెప్పారు.. ఏదైనా సాధించుకు రమ్మని. ఏమిటి సాధించుకు రావడం? సాగనిస్తేనా ఒబామా? ఎకానమీ అంటాడు, ట్రేడ్ అంటాడు. ఎడ్యుకేషన్ అంటాడు, డిఫెన్స్ అంటాడు, హెల్త్ అంటాడు, క్లైమేట్ చేంజ్ అంటాడు. ఇండియా అనగానే టాపిక్ ఛేంజ్ అంటాడు! ఓవల్ ఆఫీస్‌లో ఒబామాతో కూర్చుని మాట్లాడుతున్నాను. నిజానికి నేను మాట్లాడ్డం లేదు. వింటున్నాను. నా దగ్గర మాట్లాడ్డానికి ఒకే ఒక పాయింట్ ఉంది. ఒబామా దగ్గర ఉన్నది కూడా ఒకటే పాయింట్ కానీ తిప్పి తిప్పి ఆ ఒక్క పాయింటే మాట్లాడుతున్నాడు. నన్ను నా పాయింట్ దగ్గరికి రానివ్వడం లేదు. చేతులు కలుపుకుని, స్నేహపూర్వకంగా సైడ్ బై సైడ్ కూర్చున్నాక మొదలు పెట్టాడు ఒబామా. మనది డెబ్బై ఏళ్ల స్నేహం అన్నాడు. అది మరింత బలోపేతం కావాలి అన్నాడు. ఈ సమావేశం మరిన్ని సమావేశాలకు ప్రేరణ అవ్వాలి అన్నాడు. గంటన్నర గడుస్తున్నా అంటున్నదే అంటున్నాడు. పూలబొకేని రెండు చేతులతో పట్టుకున్నట్లు, నవ్వుని నా ముఖంతో ఎత్తిపట్టుకుని నేనూ వింటున్నదే వింటున్నాను. రెండేళ్ల క్రితం కూడా ఇదే అక్టోబర్‌లో, ఇవే తేదీల్లో అమెరికాలో ఉన్నాను. అప్పుడూ ఇంతే. అమెరికాతో బాగున్న రిలేషన్స్ గురించి తప్ప, ఇండియాతో బాగోలేని రిలేషన్స్ గురించి ఆయన మాట్లాడలేదు! అమెరికన్ ప్రెసిడెంటుతో కలసి కూర్చున్నంత సేపూ, బయట పాక్ ప్రతిపక్షాలు రహస్యంగా వైట్‌హౌస్ గోడలకు చెవులు ఆన్చి వింటున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు.. ఎప్పుడు అమెరికా వెళ్లినా! ‘ఏమిటి ఆలోచిస్తున్నారు’ అన్నాడు ఒబామా. య్యస్. మాట్లాడే చాన్స్ దొరికింది. నా పాయింట్ నేను చెప్పాలి. పాక్ హిస్టరీలో ఇదో టర్నింగ్ పాయింట్ కావాలి. ‘కశ్మీర్ మీద ఈసారైనా ఓ హామీ తెస్తానని నా దేశ ప్రజలకు మాట ఇచ్చాను మిస్టర్ ప్రెసిడెంట్’ అన్నాను. పెద్దగా నవ్వాడు ఒబామా. ‘వియ్ ఆర్ ఫ్రెండ్స్’ అన్నాడు! ‘మళ్లీ ఎప్పుడు రావడం?’ అన్నాడు. ‘పాకిస్తాన్లో పండే మామిడిపండ్లు రుచిగా ఉంటాయట కదా’ అన్నాడు. వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేశాను. అమెరికా నుంచి వచ్చాక ఎందుకనో మోదీజీ పదే పదే గుర్తుకు వస్తున్నారు. పాక్‌లో జరిగే సార్క్ సమావేశాల వరకైనా నా మనసు ఆగలేకపోతోంది. నిరుడు సెప్టెంబర్‌లో ఆయనకు పదిహేను బుట్టల మధురమైన మామిడి పండ్లు కానుకగా పంపించాను. అలా పంపుతూ ఉంటే.. ఏనాటికైనా ఆయన నా కోసం ఒక బుట్ట కశ్మీర్ ఆపిల్స్ పంపించకుండా ఉంటారా?! - మాధవ్ శింగరాజు -
సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం
అలాస్కా : భూగోళంపై నానాటికి పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, సముద్రాలు అల్లకల్లోలంగా మారుతున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఏదో రోజు మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుందనే హెచ్చరికలూ విన్నాం. ఇప్పుడు కళ్లారా చూసే రోజులొస్తున్నాయి. మొన్నటి వరకు చుట్టూరా నిశ్చలమైన నీలి సముద్రపు కెరటాలు, పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికా అలాస్కా రాష్ట్రంలోని కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలసిపోనుంది. ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కివలిన గ్రామం ఇప్పుడు కేవలం ఎనిమిది నుంచి పదడుగుల దూరానికి చేరింది. 2025 నాటికి కచ్చితంగా ఆ గ్రామం సముద్ర గర్భంలో పూర్తిగా కలసిపోతుందని ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించిన అమెరికా ఆర్మీ పటాలం ఇంజనీర్లు తేల్చి చెప్పారు. ఆర్కటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. అందులో ప్రస్తుతం 403 మంది నివసిస్తున్నారు. ఆ గ్రామం ఎలాగూ మునిగిపోతుందని తెలిసి అలాస్కా ప్రభుత్వం అక్కడ మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి పెట్టుబడులు పెట్టినా అవి సముద్ర జలాల్లో కలిసిపోతాయని భావిస్తోంది. ఒకప్పుడు పండ్లతోటలు, తిమింగళాల వేటపై బతికిన అక్కడి ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. అంతో ఇంతో స్తోమత కలిగిన వాళ్లు అలాస్కా నగరం వైపు వలసపోగా, నిర్భాగ్యులు అక్కడే ఉండిపోయారు. ఎక్కడకు పోవాలో, ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతున్నారని 'ది లాస్ ఏంజెలిస్ టైమ్స్' వెల్లడించింది. ఆ దీప గ్రామాన్ని 1847లో రష్యా నేవీ కనుగొన్నది. 1960లో అక్కడ ఎయిర్ స్ట్రీమ్‌ను అమెరికా ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు పొడవాటి బీచ్‌లతో, ప్రకృతి రమనీయతతో అలరారుతుండేది. అర్కెటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో చెలరేగిన తుఫానుల కారణంగా బీచ్‌లన్నీ మాయం అవుతూ వచ్చాయి. సముద్రం ఆటుపోట్లను అరికట్టేందుకు సముద్రం ఒడ్డున 2011లో నిర్మించిన అడ్డుగోడలు కూడా ఇటీవలి తుఫానులకు కొట్టుకుపోయాయి. భూతాపంపై జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం అలాస్కా నగరానికి చేరుకున్నారు. భూతాపోన్నతికి ప్రత్యక్ష సాక్షిగా బలవుతున్న తమ గ్రామాన్ని పట్టించుకుంటారేమోనని ఆ గ్రామస్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. -
భేషైన ఒప్పందం
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవినుంచి వైదొలగబోతున్న బరాక్ ఒబామా ప్రపంచానికీ, తన దేశ ప్రజలకూ ఒక విలువైన బహుమతినిచ్చారు. ఇరాన్ అణు ఒప్పందం సాకారం కావడంలో కీలకపాత్ర పోషించారు. దాదాపు రెండు వారాల పాటు వియెన్నాలో జరిగిన చర్చలు ఫలించి కుదిరిన ఈ ఒప్పందం కింద తన అణు కేంద్రాల తనిఖీకి ఇరాన్ అంగీకరిస్తే... మూడున్నర దశాబ్దాల నుంచి ఆ దేశంపై అమలవుతున్న కఠినమైన ఆంక్షలను ఎత్తేయడానికి అగ్రరాజ్యాలు ఒప్పుకున్నాయి. ఈ రెండు వారాల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తన సైనిక స్థావరాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తనిఖీ చేసేందుకు ససేమిరా అంటే... ఇరాన్‌పై సడలించాల్సిన ఆంక్షలపై అగ్రరాజ్యాలు మంకుపట్టు పట్టాయి. ఒక దశలో ఈ చర్చలు విఫలమవుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ రెండు పక్షాలూ తమ తమ వైఖరులను సడలించుకున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న వైషమ్యాలే ఈ సమస్యకంతకూ మూలం. దీనికి మూడున్నర దశాబ్దాల చరిత్ర ఉంది. తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఇరాన్ పాలకుడు మహ్మద్ రెజా పహ్లావీని 1979లో జరిగిన విప్లవంలో పదవీచ్యుతుణ్ణి చేయడంతో కుంగిపోయి ఉన్న అమెరికాకు వెనువెంటనే మరో దెబ్బ తగిలింది. టెహ్రాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయంపై విద్యార్థులు దాడిచేసి అనేక మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించడానికి జరిగిన చర్చలు, సైనిక చర్య విఫలమయ్యాక 444 రోజుల తర్వాత బందీలకు విముక్తి లభించింది. ఆనాటి నుంచీ ఇరాన్‌పై అమెరికా కత్తిగట్టింది. 1988లో ఇరాన్‌కు చెందిన ప్రయాణికుల విమానాన్ని అమెరికా కూల్చేయడంతో 290మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అది సైనిక విమానమని అమెరికా వాదించింది. ఇరాన్‌పై తాను విధిస్తూ వచ్చిన ఆంక్షలు సరైన ఫలితాలనీయడంలేదని భావించిన అమెరికా దీన్ని 2002లో ప్రపంచ సమస్యగా మార్చింది. అది రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమం చేపట్టిందనీ, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదని ఆరోపించి ఆ ప్రాతిపదికన భద్రతామండలి ద్వారా ఆంక్షలు విధింపజేసే ఎత్తుగడలకు పూనుకుంది. తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఇరాన్ నిరాకరించడంతో భద్రతామండలి 2006లో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. 2012 నుంచి ఇవి మరింత కఠినమయ్యాయి. ఇవన్నీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుంగదీశాయి. ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల్లో సింహ భాగం నిలిచిపోవడం...అమెరికా బ్యాంకుల్లో ఉన్న వేల కోట్ల డాలర్ల డిపాజిట్లు, బంగారం నిల్వలు స్తంభించిపోవడంతో ఇరాన్‌కు సమస్యలు పెరిగాయి. నిరుద్యోగం తీవ్రంకాగా... నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. విద్యుత్ కొరతతో సతమతమైంది. ఇన్ని ఆంక్షలమధ్యా ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగించింది నిజానికి ఈ విద్యుత్ సంక్షోభంనుంచి బయటపడేందుకే. తమ దేశం గురించి మాత్రమే కాక... మొత్తం పశ్చిమాసియా దేశాలను భాగస్తుల్ని చేసి అణు కార్యక్రమంపై చర్చించాలని, ఆ చర్చ అంతిమంగా అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలనీ ఇరాన్ వాదిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అప్రకటిత అణ్వస్త్రాలు ఉన్నందువల్ల అమెరికా దీనికి సిద్ధపడలేకపోయింది. అయితే గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. పశ్చిమాసియా క్రమేపీ చేజారుతున్న వైనాన్ని పశ్చిమ దేశాలు పసిగట్టాయి. ఇరాక్‌లో సంపూర్ణ వైఫల్యమూ, సిరియాలో చేతులు కాలడం వగైరా పరిణామాలన్నీ వాటిని పునరాలోచనలో పడేశాయి. మొత్తం అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపేయాలని పట్టుబడుతూ వచ్చినవారు దాన్ని పరిమి తంగా కొనసాగించుకునేందుకు అంగీకరించింది అందుకే. ఇరాన్ తన సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యను తగ్గించుకోవడం, శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో చాలా భాగాన్ని తొలగించడం, ప్లుటోనియం ఉత్పత్తిని నిలిపేయడంవంటివి చేయాలని మంగళవారం కుదిరిన ఒప్పందం నిర్దేశిస్తున్నది. అలాగే, ఐఏఈఏ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది. మరోపక్క ఇరాన్‌పై ఉన్న ఆంక్షలన్నీ దాదాపు తొలగి పోతాయి. వాస్తవానికి ఇరాన్ ఆచరణ చూశాకే ఒక్కొక్కటిగా ఆంక్షల్ని తొలగిస్తామని పశ్చిమ దేశాలు తొలుత చెప్పాయి. అయితే ఇరాన్ ఒప్పుకోలేదు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడే ఏ చర్చలైనా ఫలిస్తాయని స్పష్టంచేసింది. పర్యవసానంగా ఆయుధాలపై ఉండే ఆంక్షలు అయిదేళ్లు, క్షిపణులపై ఉండే ఆంక్షలు ఎనిమిదేళ్లు కొనసాగుతాయని... మిగిలినవన్నీ వెనువెంటనే సడలిస్తామని పశ్చిమ దేశాలు ఒప్పుకోక తప్పలేదు. అయితే, ఈ ఒప్పందానికి అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి. ఒబామా కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై ఆయన ప్రత్యర్థి పక్షం రిపబ్లికన్ పార్టీ గుర్రుగా ఉంది. దాన్ని కాంగ్రెస్‌లో ఓడిస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ సైతం దీన్ని చారిత్రక తప్పిదమంటూ బుసలు కొడుతున్నది. అటు ఇరాన్ కూడా సైనిక స్థావరాల తనిఖీకి షరతులతోనే అంగీకరించింది. వారు తనిఖీ చేస్తామని ఇచ్చే ప్రతిపాదనలను సవాల్ చేసే అధికారాన్ని ఉంచుకుంది. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించే పక్షంలో 65 రోజుల్లో ఆంక్షల పునరుద్ధరణ ఉంటుందన్న షరతును ఇరాన్ అంగీకరించింది. ఇరాన్లో ఛాందసవాదులు సైతం ఈ ఒప్పందంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుత ఒప్పందానికి దారితీసిన కారణాలేమైనా కావొచ్చుగానీ... ఓపిగ్గా వ్యవహరిస్తే, సంప్రదింపులను కొనసాగిస్తే ఎంతటి జటిలమైన సమస్యకైనా పరిష్కారం లభించకపోదని రుజువైంది. ఈ ఒప్పందం సక్రమంగా అమలైతే పశ్చిమాసియా రూపురేఖలే మారిపోతాయి. అటు అరబ్ దేశాలూ, ఇటు ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నా ఈ ప్రాంతంలో ఇరాన్ ప్రాధాన్యత పెరుగుతుంది. ఐఎస్ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇరాన్ తోడ్పాటు అత్యవసరమని అమెరికా భావిస్తున్నది. తాజా పరిణామాలతో ఏర్పడే వైరుధ్యాలను చాకచక్యంగా వినియోగించు కోగలిగితే మన దేశానికి లబ్ధి చేకూరుతుంది. ఇరాన్‌తో భిన్న రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలేర్పడతాయి. -
ఒబామా ఇఫ్తార్ విందు
వాషింగ్టన్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ ముస్లింలతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తోసహా పలు ఇస్లామిక్ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఏ మతానికి చెందిన వారినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని వ్యతిరేకించడంలో అమెరికన్లందరూ ఐక్యంగా నిలబడతారని ఒబామా పేర్కొన్నారు. అందరం కలసికట్టుగా అభివృద్ధి పథంలో పయనించడమే లక్ష్యంగా ముందుకెళుతూ.. ఖురాన్లో ప్రవచించిన శాంతి మంత్రాన్ని పాటించాలని కోరారు. -
మోదీ, ఒబామా 'మన్ కీ బాత్' ప్రారంభం
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలసి పాల్గొన్న మన్ కీ బాత్ రేడియో ప్రసంగ కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం రికార్డ్ చేసిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి 8 గంటలకు మ ప్రసారం చేశారు. ప్రజలు పంపిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చేదే మన్ కీ బాత్ కార్యక్రమం. ఇన్ని రోజులు మోదీ పాల్గొనేవారు కాగా మంగళవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో ఒబామా పాల్గొనడం ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా మీతో నేను మాట్లాడుతున్నాను.. ఈ రోజు విశిష్ట అతిథి ఒబామా వచ్చారంటూ మోదీ అన్నారు. -
ఒబామా రాకపై నిరసన
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యూసీఐ (సీ), ఎంసీపీఐ (యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్థూపం నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్నివారు ముట్టిడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ, తదితరులు పాల్గొన్నారు. పలు కార్యకర్తలతో పాటు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఒబామా రాకను వ్యతిరేకిస్తూ న్యూడెమెక్రసీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను రాంనగర్ చౌరస్తాలో దహనం చేశారు. -
ఒబామా పర్యటనపై నేడు లెఫ్ట్ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఏడు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యూసీఐ (సీ), ఎంసీపీఐ (యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్థూపం నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన తెలపనున్నారు. ఒబామా పర్యటన సందర్భంగా దేశానికి నష్టం కలిగించే 63 ఒప్పందాలపై గతంలో ఉన్న నిబంధనలను తొలగించే కుట్ర జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. -
ఒబామా గో బ్యాక్..
26న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత్‌కు ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోదీ దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టారని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. ఒబామా పర్యటనకు నిరసనగా జనవరి 26న భారత్ బంద్, తెలంగాణ రాష్ట్ర బంద్ పాటించాలని బుధవారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. -
25 నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
-
గణతంత్ర వేడుకల అతిథిగా ఒబామా
వార్తల్లో వ్యక్తులు: ఇద్దరు భారతీయులకు సెయింట్‌హుడ్ హోదా పోప్ ఫ్రాన్సిస్ భారత్‌కు చెందిన ఇద్దరికి నవంబరు 23న వాటికన్లో సెయింట్‌హుడ్ హోదా ప్రకటించారు. వీరితో పాటు ఇటలీకి చెందిన మరో నలుగురికి ఈ గౌరవం లభించింది. కేరళకు చెందిన ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా (1805-1871), సిస్టర్ యూఫ్రేసియా (1877- 1952)లు సెయింట్‌హుడ్ పొందారు. వీరిని మహిమాన్వితులుగా, బాధితులకు సాంత్వన కలిగించే ఆరాధ్యదైవాలుగా పోప్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల అతిథిగా ఒబామా 2015లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఒబామా భారత్‌లో పర్యటిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది. ఒబామా హాజరైతే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి అవుతుంది. యూపీఎస్సీ సారథిగా దీపక్ గుప్తా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా జార్ఖండ్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి దీపక్‌గుప్తా నియమితులయ్యారు. ఆనవాయితీ ప్రకారం యూపీఎస్సీ సభ్యులే ఈ హోదాను అలంకరిస్తారు. అయితే ఈసారి యూపీఎస్సీ వెలుపలి వ్యక్తిని నియమించారు. ఇలా జరగడం ఇది మొదటి సారి. అవార్డులు ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి-2014కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంపికైంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)తో అద్భుతమైన విజయాన్ని సాధించడం, అంతరిక్షాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఇస్రోను ఎంపిక చేసినట్లు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన ఏర్పడిన న్యాయ నిర్ణేతల బృందం తెలిపింది. నేహా గుప్తాకు అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి భారత-అమెరికన్ నేహాగుప్తా (18)కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతి-2014 లభించింది. భారత్‌లో అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. పిల్లల హక్కుల కోసం కృషి చేసినవారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2012లో పాకిస్థాన్ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్ ఈ అవార్డును అందుకున్నారు. గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు 2014 సంవత్సరానికి లోక్‌నాయక్ పురస్కారానికి ఎంపిక య్యారు. ఈ అవార్డును లోక్‌నాయక్ ఫౌండేషన్ 2005 నుంచి అందిస్తోంది. అచ్యుతా సమంతకు గుసి శాంతి బహుమతి సంఘ సంస్కర్త, కిట్,కిస్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అచ్యుతాసమంత 2014 గుసి శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన గుసి పీస్ ప్రైజ్ ఇంటర్నేషనల్ దీన్ని అందిస్తోంది. జీవ కారుణ్య వాదం, విద్య ద్వారా పేదరిక నిర్మూలనలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. జాతీయం గోవాలో అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం 45వ అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం గోవాలోని పనాజీలో నవంబరు 20న ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవాల్లో 79 దేశాలకు చెందిన 178 చిత్రాలను ప్రదర్శిస్తారు. ప్రారంభ చిత్రంగా ఇరాన్‌కు చెందిన ద ప్రెసిడెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు. 2 జీ దర్యాప్తు నుంచి రంజిత్‌సిన్హా ఉద్వాసన 2 జీ కుంభకోణం కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు నవంబరు 20న కేసు విచారణ నుంచి తప్పించింది. కొంతమంది నిందితులను రంజిత్‌సిన్హా కేసునుంచి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాజ్యంపై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. టైమ్ అత్యుత్తమ ఆవిష్కరణగా మంగళ్యాన్ భారత్ చేపట్టిన మంగళ్‌యాన్‌ను ఈ ఏడాది అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణించింది. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం సాంకేతిక అద్భుతమని, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు సాధించని ఘనతను భారత్ సెప్టెంబరు 24న సొంతం చేసుకుందని ప్రశంసించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ నవంబరు 20న ఆమోదించింది. ప్రస్తుతమున్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో దీన్ని చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే పథకం ప్రధాన లక్ష్యం. దేశంలో తొలి ఎబోలా కేసు నమోదు దేశంలో తొలి ఎబోలా కేసు ఢిల్లీలో నమోదైంది. లైబీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన 26 ఏళ్ల భారత్‌కు చెందిన వ్యక్తికి ఎబోలా సోకినట్లు అధికారులు గుర్తించారు. బాధితుణ్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉంచి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయం బాల్య వివాహాలపై ఐరాస తీర్మానం బాల్య వివాహాలను నివారించాలని ప్రభుత్వాలకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి తొలిసారిగా నవంబరు 21న తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని కెనడా, జాంబియా ప్రవే శ పెట్టాయి. ఇందుకు సంబంధించి చట్టాలను తీసుకురావాలని అన్ని దేశాలను కోరాయి. నైగర్, బంగ్లాదేశ్, భారత్‌లలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబరు 18న ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భారత ప్రధాని ప్రసంగించడం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతోపాటు ఉగ్రవాదంపై ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సామాజిక భద్రత, శిక్ష ఖరారైన ఖైదీల బదిలీ, పర్యాటకంతో పాటు ఐదు ఒప్పందాలు కుదిరాయి. నవంబరు 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు. ఆ దేశ ప్రధాని బయనీ మరామతో చర్చించారు. ఫిజీకి రూ. 500 కోట్ల రుణంతోపాటు అభివృద్ధి సాయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో అడుగుపెట్టారు. 1981లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఫిజీలో పర్యటించారు. బార్సిలోనాలో స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో నాలుగో స్మార్ట్‌సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వచ్చే 20 ఏళ్లలో భారత పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెంకయ్య నాయుడు అన్నారు. నేపాల్‌లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు ఈ ఏడాది అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు నేపాల్‌లోని లుంబినీ వేదికైంది. నవంబరు 15 నుంచి 18వరకు ఈ సదస్సు జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ 2070 నాటికి ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ఐరాస ప్రమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచదేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 2100 నాటికి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్లను శూన్యస్థితికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యునెప్) నవంబరు 19న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని నవంబరు 17న ఒడిశాలో చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత వైమానిక దళం ప్రయోగించింది. ఇది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు. నవంబరు 20న రెండు ఆకాశ్ క్షిపణులను ఒకేసారి ఎగురుతున్న లక్ష్యాలను నిర్దేశించి పరీక్షించారు. ఇందులో ఒకటి వేగంగా కదులుతున్న మానవ రహిత వాహనం బన్షీని నాశనం చేసింది. రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో 11 కి.మీల దూరంలో ఎగురుతున్న ఆ లక్ష్యాన్ని 2.5 మాక్వేగంతో ఆకాశ్ ఢీకొంది. రెండో క్షిపణిని 24 కి.మీ పరిధిలో 5.5 కి.మీ ఎత్తులో కదులుతున్న లక్ష్యంపై ప్రయోగించారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలు నవంబరు 20న హామీనిచ్చాయి. ఉద్గారాల తగ్గింపు, భూతాపం ఎదుర్కొనేందుకు పేదదేశాలకు సాయంగా ఈ నిధులను అందజేస్తారు. స్వచ్ఛమైన ఇంధన అవసరాలు, గ్రీన్టెక్నాలజీ సమకూర్చడం, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కరవు బారి నుంచి కాపాడుకునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిధుల్ని సమకూరుస్తున్నాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రధాన కేంద్రం దక్షిణ కొరియా. బిగ్ బ్యాంగ్ ప్రాజెక్టులో చేరిన మద్రాస్ ఐఐటీ విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపుతున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేరింది. బిగ్‌బ్యాంగ్ యంత్రంగా పేరొందిన లార్జ్ హాడ్రన్ కొలైడర్లోని కంపాక్ట్ మ్యువాన్ సోలినాయిడ్‌లో పూర్తిస్థాయి సభ్యత్వాన్ని తీసుకుంది. ఈ ప్రత్యేకతను సాధించిన తొలి ఐఐటీగా గుర్తింపు పొందింది. రాష్ట్రీయం ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్‌కు జాతీయ పురస్కారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు 2012-13 జాతీయ ప్రతిభ పురస్కారం లభించింది. నవంబరు 18న ఢిల్లీలో జరిగిన రెడ్‌క్రాస్ జాతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కృష్ణా జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి దీన్ని అందుకున్నారు. ఏయూకి ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ పురస్కారం జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఆంధ్ర విశ్వ విద్యాలయం మూడు విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుంది. నవంబరు 19న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా ఏయూ వైస్ ఛాన్స్లర్ జీఎస్ఎన్ రాజు వీటిని అందుకున్నారు. ఏపీ జెన్కోకు స్కాచ్ 2014 అవార్డు ఏపీ జెన్కోకు స్కాచ్ 2014 అవార్డు లభించింది. దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో భాగస్వామి అవుతూనే మెరుగైన పనితీరు కనబరిచినందుకుగాను ఈ అవార్డు ను ప్రకటించారు. క్రీడలు బీసీసీఐ అవార్డులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2014 అవార్డులను నవంబరు 18న అందించింది. కల్నల్ సి.కె.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారానికి భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఉత్తమ అంతర్జాతీయ భారత క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ ట్రోఫీ)గా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా రెనౌద్ లావిల్లేనీ, వాలెర్ ఆడమ్స్ 2014 వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా పురుషుల విభాగంలో పోల్‌వాల్ట్ ఆటగాడు రెనౌద్ లావిల్లేనీ (ఫ్రాన్స్), మహిళల విభాగంలో షాట్‌పుట్టర్ వాలెరీ ఆడమ్స్ (న్యూజిలాండ్) ఎంపికైనట్లు ఐఏఏఎఫ్ నవంబరు 21న మొరాకోలో ప్రకటించింది. చెస్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ చెస్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. సోచిలో నవంబరు 23న ముగిసిన పోటీలో భారత్‌కు చెందిన విశ్వనాథన్ ఆనంద్‌ను కార్ల్సన్ ఓడించి టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ బ్రిటన్‌కు చెందిన మెర్సిడెజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ అబుదాబి గ్రాండ్ ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అబుదాబిలో నవంబరు 23న జరిగిన రేసులో సాధించిన విజయంతో 2014 ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. అతనికిది రెండో ప్రపంచ టైటిల్. స్విట్జర్లాండ్‌కు డేవిస్‌కప్ టైటిల్ స్విట్జర్లాండ్‌కు రోజర్ ఫెదరర్ తొలి డేవిస్‌కప్ టైటిల్ అందించాడు. లిల్లె (ఫ్రాన్స్)లో నవంబరు 23న జరిగిన ఫైనల్లో డేవిడ్ గాస్క్వెట్ (ఫ్రాన్స్)ను ఫెదరర్ ఓడించి టైటిల్ సాధించాడు. - ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, కరెంట్ అఫైర్స్ నిపుణులు -
అమెరికాలో పండనున్న ‘పటేళ్ల’ పంట
అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజికవర్గాలలో గుజరాత్‌కు చెందిన పటేల్ కమ్యూనిటీ ఒకటి. ఆ దేశంలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు)లో సగం వరకు వీళ్లే నిర్వహిస్తున్నారు. 20వ శతాబ్దికి ముందు ఎలాంటి వ్యాపార చరిత్ర లేని పటేళ్లు పరదేశంలో హోటల్ రంగంలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే ఒక విశేషం. ఇప్పుడు అమెరికా వలస విధానంపై ఆ దేశాధ్యక్షుడు ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ పటేళ్ల పంట పండించనుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను పాఠశా లలో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు అమెరికాకు వెళ్లేందుకు వీసాకోసం దర ఖాస్తు చేస్తూ తన చివరి పేరును మార్చు కున్నాడు. అతడు పటేల్. అదే పేరుతో దరఖాస్తు చేసినట్లయితే తన వీసాను తిరస్కరించే అవకాశం ఖచ్చితంగా ఉం దని అతడు భావించాడు. అది నిజమో కాదో నాకయితే తెలీదు (నేను కూడా 16 సంవత్సరాల వయసులోనే దరఖాస్తు చేసి వీసా పొందాను). కానీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పటేళ్లు అప్పటికే చాలామంది ఉండేవారన్న మాట నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా అమెరికా వలస విధానంలో ప్రకటించిన మార్పు అమెరికాలోని అక్రమ వలస దారులకు ప్రత్యేకించి 5 లక్షల మంది భారతీయుల ప్రతిపత్తిని చట్ట బద్ధం చేయనుంది. వీరిలో చాలామంది గుజరాత్‌కి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందినవారే. వలసవిధానంలో మార్పుచేస్తూ ఒబామా ఇచ్చిన ఆదేశం 41 లక్షలమంది అమెరికా సంతతి పిల్లల తల్లిదండ్రులకు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చిన 3 లక్షల మంది పిల్లలకు వరంగా మారిందని మీడియా సమాచారం. అమెరికాలో నివసిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న నిపుణత కలిగిన వలస ఉద్యోగులు, పట్టభద్రులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సదవకా శాన్ని కల్పిస్తూ ఒబామా వలస విధానంలో విస్తృత మార్పులను ప్రకటించారు. అమెరికాను ఇతర ప్రపంచ దేశాల కంటే ముందు నిలపడంలో మరింత పారదర్శకతతో వ్యవహరించడానికి ఇది వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1.5 లక్షల మంది పటేళ్లు ఉన్నారని అంచనా. అయితే చాలామంది పటేళ్లు తమ చివరి పేర్లకు అమిన్ వంటి పేర్లను ఉపయోగిస్తున్నం దున వీరి సంఖ్య 2 లక్షల వరకు ఉండవచ్చు. అమెరికాలో ఉన్న పటేల్ వర్గీయులలో చాలామంది చట్టబద్ధంగా వచ్చినవారే. అమెరికాలో అత్యంత విజయవంతమైన సామాజిక వర్గాలలో వీరిదీ ఒకటి. అమెరికాలోని మొత్తం మోటల్స్ (హోటళ్లు) లో సగం వరకు భారతీయులు.. అందులోనూ పటేల్ సామాజికవర్గమే నిర్వహిస్తోం దని 1999లో తుంకు వరదరాజన్ అనే విలేకరి న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు. పటేళ్లు ఎవరంటే, ‘వైశ్యులు లేదా వర్తకులు. అరేబియన్ సముద్రం పక్కన ఉండే భారతీయ రాష్ట్రం గుజరాత్లో మధ్యయుగాల్లో రాజులకు చెల్లించవలసిన పదో వంతు పన్నును లెక్కించడానికి వీరిని నియమించేవారు. వీరి మూలం గుజరాత్. వీరి రక్తంలోనే వ్యాపారం నిండి ఉంటుందని భారతీయులలో చాలా మంది ప్రజల నమ్మకం. పటేళ్లు కూడా దీన్ని నమ్ముతున్నట్లే కనిపిస్తారు’ అని ఆ విలేకరి రాశారు. ఇది నిజం కాదు. స్వయంగా పటేల్ వర్గీయులే నమ్మేసేటంత స్థాయిలో వారు తమ గురించి తాము తారస్థాయిలో ప్రచారం చేసుకున్నట్లు చెప్పుకునే కల్పనాగాథల నుండి ఇవి పుట్టుకొచ్చాయి. వాస్తవానికి పటేళ్లు కూడా పాటిల్, రెడ్లు, యాదవులు, గౌడలు, జాట్లు వంటి ఇతర రైతాంగ కులాల్లో భాగమైన రైతులు. నాలుగు కిందిస్థాయి సవర్ణులు లేదా గుర్తింపు పొందిన కులాల నుండి వీరు వచ్చారు. మనుస్మృతిలో వీరిని శూద్రులుగా పేర్కొన్నారు. అయితే పటేళ్లు ఈ నాలుగు సామాజిక బృందాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వీరు శాకాహారులు, పైగా వీరు వ్యాపారంవైపు మొగ్గు చూపారు. అయితే వీరికి వ్యాపారం ఒక వారసత్వంగా రాలేదు. 20వ శతాబ్దికి ముందు వీరికి ఎలాంటి వ్యాపార చరిత్రా లేదు. కానీ జైన్ వ్యాపారుల ఆధిపత్యంలో ఉన్న గుజరాత్లో వ్యాపార సంప్రదాయాన్ని వీరు పుణికిపుచ్చుకున్నారు. అయితే పటేళ్లు హార్డ్‌వేర్ స్టోర్లు, పెట్ షాపులు, ఔషధ విక్రయ సంస్థలలో ప్రవేశించకుండా మోటల్స్‌లో తమ అదృష్టాన్ని ఎందుకు చూసుకున్నారు అనే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ రచయిత వరద రాజన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక కారణం ఏదంటే మోటల్స్ వ్యాపార స్థాయి విభిన్నమైనది. పైగా మోటల్స్ను విస్తరించుకోవచ్చు. రెండో కారణం ఏమిటంటే మోటల్స్ వ్యాపారం పటేళ్లకు ద్వంద్వ గుర్తింపును తెచ్చిపెడుతుంది. మోటల్స్ కౌంటర్ నుంచి వీరు అమెరికాతో వ్యవహరిస్తారు. కౌం టర్ వెనుక కిచెన్‌లో కధీ-బాత్ (గుజరాత్ ఆహారం) వంట వండ టం, టెలివిజన్లలో రామాయణం, బాలీవుడ్ సినిమాలను చూడటం ద్వారా వీరు అమెరికాలోనే భారత్‌ను పునఃసృష్టి చేయగలరు. మోటల్ వ్యాపారం మేధస్సు కంటే కష్టపడటం అవసరమైన వ్యాపారం. పటేళ్లు దాన్నే కోరుకున్నారు. అందుకనే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న పటేల్ సైతం ఆ దేశానికి సంపద లాంటి వాడు. ఎందుకంటే అతడు తనకు, తన కమ్యూనిటీకి కట్టుబడి ఉంటాడు తప్పితే దేశానికి అతడు ఉపద్రవం, కంటకం కాదు. పైగా, పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ వలస ప్రజలకు పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల కంటే మించిన మంచి పేరుంది. దీనికి ఒక కారణం ఏమిటంటే సాధారణంగా వలస భారతీయులు ఉన్నత సామాజికవర్గానికి సంబంధించిన వారై ఉండటం. పైగా అన్ని అర్హతలూ కలిగిన వృత్తి జీవుల్లా కనిపిస్తారు. మరొక కారణం ఏమిటంటే ప్రత్యేకించి యూరప్‌లోని పాకిస్థానీ, బంగ్లాదేశీ వలస దారులలో చాలామంది తీవ్ర మతాభినివేశం కలిగి ఉన్నారు. వీరు అరబ్ బృందాలతో జత కట్టారు. దీంతో వీరు హానికరంగా తయారయ్యారు. వీరిలో నిరుద్యోగం పరాకాష్టకు చేరింది. దీంతో పాకిస్థానీ, బంగ్లాదేశీ వలసదారులను ఆతిథ్య దేశం లేదా ఖండం ఒక ఉపద్రవంగా చూస్తోంది. నా పాకిస్థానీ మిత్రుడొకరు ఇటీవల ఒక విషయం చెప్పారు. ప్రత్యేకించి అమెరికాలో ఉన్న కొంతమంది పాకిస్థానీయులు ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో ముడిపడి ఉంటే వచ్చే సమస్యలనుండి తప్పించుకోవడం కోసం ఫక్తు భారతీయుల్లా వ్యవహరిస్తున్నారట. మరోవైపున యూరప్‌లోని ఉపఖండ రెస్టారెంట్లలో చాలా వాటిని బంగ్లాదేశీయులు సమర్థవంతంగా నడుపుతున్నారు కానీ ఇవి ఇండియన్ రెస్టారెంట్లుగా గుర్తింపు పొందాయి. బంగ్లాదేశ్ అంటే ఎక్కడుంది, వాళ్లెవరు అనే పరిజ్ఞానం లేకపోవడం వల్ల కావచ్చు.. యూరప్‌లో ఇండియన్ బ్రాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మూడో కారణం ఏమిటంటే భారతీయ ఆహారంగా పశ్చిమ దేశాలకు పరిచితమైనది బెంగాలీ ఆహారమే. ఈ నేపథ్యంలో అమెరికా వలస విధానంపై ఒబామా జారీ చేసిన తాజా డిక్రీ మూడు ఉపఖండ బృందాలకూ దోహదపడు తుంది కానీ, భారతీయులు ప్రత్యేకించి పటేళ్లకే ఇది ఎక్కువగా ఉపకరిస్తుంది. పటేల్ కమ్యూనిటీకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా ఇది మంగళకరమైన వార్తే. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ -
ప్రత్యామ్నాయ విధానాలే ప్రతిపక్షానికి ఊపిరి
త్రికాలమ్: ఈతరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృదయాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. ‘ఒక మిత్రుడు వస్తున్నాడు.’ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే సందర్భంగా మన అతిథిగా ఢిల్లీకి రాబోతున్నాడని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో రాసుకుంటే ప్రపంచానికి తెలిసింది. అంతవరకూ అమెరికా దౌత్యాధికారులకు కానీ భారత ఉన్నతాధికారులకు కానీ తెలియదు. భారత గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా విదేశీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే ఆనవాయితీ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచీ ఉంది. అమెరికా అధ్యక్షుడు రావడం మాత్రం ఇదే ప్రథమం. దేశంలో మారుతున్న రాజకీయ సంస్కృతికీ, ప్రపంచంలో పెరుగుతున్న భారత దేశ పేరుప్రఖ్యాతులకీ ఈ ఉదంతం అద్దంపడుతోంది. ఒబామా వంటి అగ్రదేశా ధినేత ఢిల్లీకి రావడానికి అంగీకరిస్తే ఆ వార్త వెల్లడించడానికి పెద్ద హంగామా జరుగుతుంది. ఏ రకమైన ఆర్భాటం లేకుండా కేవలం ట్విట్టర్లో ప్రకటించడం ద్వారా ఇంత ప్రధానమైన వార్తను వెల్లడించడం మోదీ ప్రవేశపెట్టిన కొత్త సంస్కృతి. మోదీ ఆహ్వానాన్ని ఆమోదించడమే కాదు, చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షలమంది భారతీయుల ఉనికికి చట్టబద్ధత కల్పిస్తూ, వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి ఒబామా చూపిన ప్రత్యేక శ్రద్ధ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇంటగెలిచిన మోదీ రచ్చ గెలవడం ప్రపంచ దేశాలలో భారత్‌కు ప్రత్యేకస్థాయిని సమకూర్చుతోంది. మోదీ ఇంటాబయటా సాధిస్తున్న విజయాల వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. కొత్త పరిణామాల వెల్లువ మునుపెన్నడూ ఊహించని పరిణామాలు ఇప్పుడు దేశంలో, దేశం వెలుపలా జరుగుతున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ముఖ్యమైన పాత్రధారిగా అవతరించడం, అక్కడ అన్ని రాజకీయ పార్టీలూ భాజపాని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించి విమర్శనాస్త్రాలు సంధించడం కొత్త పరిణామం. ఇంతకాలం వింటే విడ్డూరంగా. అతిశయోక్తిగా అనిపించే వాదనలూ, ప్రతిపాదనలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ప్రపంచ హిందూ మహాసభ (వరల్డ్ హిందూ కాంగ్రెస్)కు 50 దేశాల నుంచి విదేశీ భారతీయులు వచ్చారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే బృహత్తరమైన భూమికను భారతీయులు పోషించవలసిన సమయం ఆసన్నమైనదని దలైలామా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఇతర వక్తలు ప్రకటించారు. ‘మనవాళ్లు ఈ విషయం రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పారు’ అంటూ శ్రీలంక నుంచి వచ్చిన అతిథి అన్నప్పుడు చాలామంది సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ ఆర్థికాంశాలపైనా, మీడియా పైనా, వ్యవస్థల నిర్మాణంపైనా, ఇతర అంశాలపైనా జరిగిన చర్చలలో ఛాందసం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎట్లా ప్రగతిపథంలో దూసుకుపోవాలన్న ఆరాటం ఉంది. దాదాపు 15 వందల మంది సభ్యులలో కాషాయాంబరాలలో కనిపించినవారు పాతికమందికి మించి లేరు. సభికులందరూ తమతమ రంగాలలో విజయాలు సాధించిన లబ్దప్రతిష్టులు. ఈ సభలో చోదకశక్తి రుషీకేశ్ ఆశ్రమానికి చెందిన విజ్ఞానానందస్వామి. ఖరగ్‌పూర్ ఐఐటీలో పట్టభద్రు డైన తర్వాత పదేళ్లపాటు గురుముఖంగా సంస్కృతం అభ్యసించి, సన్యాసం స్వీకరిం చి రెండు పర్యాయాలు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేసిన వ్యక్తి. వివేకానందుడు ఎక్కడ వదిలిపెట్టాడో విజ్ఞానానందుడు అక్కడ అందుకున్నాడు. ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతికరంగాలలో భారత బావుటా ఎగరవేయాలంటూ ప్రబోధించే ఆధునిక స్వామి. హరియాణాలో అరెస్టయిన రాం పాల్ వంటి దొంగస్వామి కాదు. ప్రపంచ హిందూ మహాసభ వెనుకా, మోదీ అమె రికా, ఆస్ట్రేలియా పర్యటనలలో దిగ్విజయంగా జరిగిన ఎన్ఆర్ఐ సభల వెనుకా ఎంతో ప్రయాస ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కృషి ఉంది. లక్షలాదిమందితో వ్యక్తి గత సంబంధాలు పెట్టుకొని వాటిని రాపాడి కాపాడుకున్న నెట్వర్కింగ్ వ్యవస్థ ఉంది. హిందూ సమాజంలో, హిందువుల ఆలోచనా సరళిలో సంభవిస్తున్న పెను మార్పులకు సంకేతం. ఆధునిక భావజాలానికి ఆహ్వానం ఇటువంటి దశలో కొత్త, పాత ఆలోచనల మధ్య ఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణ ప్రభావం భాజపాలో సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాతా వచ్చిన పరిణా మాలలో చూడవచ్చు. పోటీకి తట్టుకోలేక పక్కకు తప్పుకున్న పెద్దతరం నాయ కులూ, కొత్త నాయకత్వాన్ని ఆమోదించి దారికొచ్చిన పాతకాపులూ ఉన్నారు. మొన్న టిదాకా హిందూమత సంరక్షకుడిగా తనను తాను భావించుకొని ప్రత్యర్థులపైన గర్జించి, లంఘించిన సింఘాల్ వంటి అద్వానీతరం నాయకులు మోదీ ఆధునిక పోక డలను అభినందిస్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత ఎనిమిది వం దల సంవత్సరాలకు దేశంలో సిసలైన హిందువులు ప్రభుత్వంలోకి వచ్చారని సింఘాల్ ప్రపంచ హిందూమహాసభలో అన్నాడు. వాజపేయి నాయకత్వంలోని మొదటి ఎన్డీఏ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కనుక, మనుగడకోసం రాజీలు అనివా ర్యం కనుక దాన్ని హిందువుల పాలనగా లెక్కవేయలేదు. పృథ్వీరాజ్ తర్వాత మోదీనే. మోహన్ భాగవత్ సైతం ఆధునిక భావజాలానికీ, సృజనాత్మకతకూ పెద్ద పీట వేస్తున్నారు. సామాజిక సమరసతకూ, ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన, అణచివేతకు గురైన దళితులనూ, ఆదివాసీలనూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావాలన్న సంక ల్పం ఉన్నది. వివేకానంద, గోల్వాల్కర్, అంబేద్కర్ల భావజాలాలను కలబోసి తర తరాలుగా లొంగని సామాజిక సమస్యలకు సామరస్యవంతమైన పరిష్కారం కను గొనాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నవతరం ఆకాంక్షలు ఎలాంటివి? ఈ రోజున దేశ జనాభాలో 60 శాతానికి పైగా 35 సంవత్సరాలలోపు వయస్సు వారు. ఇందిర ఆత్యయిక పరిస్థితి తర్వాత పుట్టిన తరం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత కళ్లు తెరిచిన తరం. ఒకటి లేదా రెండు ఎన్నిక లలోనే ఓటు హక్కు వినియోగించుకున్న తరం. ఐటీ రంగంలో విప్లవ ఫలితాలను సంపూర్ణంగా వంటబట్టించుకున్న తరం. వీరు అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని తరగతులలో ఉన్నారు. వీరికి ఆర్థికం అత్యంత ప్రధానం. సామాజికానికి ద్వితీ య స్థానం. మోదీ స్వాతంత్య్రానంతరం పుట్టిన తొలి ప్రధాని. యువతరం ఆశలూ, ఆకాంక్షలూ, ప్రాథమ్యాలూ తెలిసిన తెలివైన రాజకీయ నాయకుడు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా రాజకీయావతారం ప్రారంభించి భారత ప్రధాని వరకూ సాగించిన ప్రస్థానంలో తనను తాను మార్చుకోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతంగా ప్రణాళికలు రచించడం, శక్తివంచన లేకుండా అమలు చేయడం కనిపిస్తుంది. ఆయన ఎదిగిన క్రమంలో అవధులు మీరిన ఆత్మవిశ్వాసం నియంతను తలపించే సంద ర్భాలు లేకపోలేదు. సరికొత్త ధోరణులకు చొరవ చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అవినీతి మకిలం అంటని ప్రభుత్వం ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఒకరిద్దరు మంత్రులు తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కనిపెట్టే కనికట్టు మోదీ దగ్గర ఉంది. కేంద్రమం త్రులకు స్వేచ్ఛ లేదనీ, ఐఏఎస్ అధికారులే చక్రం తిప్పుతున్నారనీ, ప్రధాని కార్యా లయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా అదుపాజ్ఞలలో సమస్త యంత్రాంగం నడుస్తున్నదనే మాట ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. మంత్రులనూ, అధికారులనూ కట్టడి చేసే పని మిశ్రాకి అప్పగించి మోదీ జాతీయ, అంతర్జాతీయ రంగాలలో కొత్త చొరవల గురించీ, సరికొత్త ధోరణుల గురించీ ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి కాకుండానే అంతర్జాతీయంగా తనకూ, తన దేశానికీ ఒకస్థాయిని సంపాదించడంలో సఫలీకృతుడైనట్టు చెప్పవచ్చు. జాతీ య రంగంలో లెసైన్స్, పర్మిట్ రాజ్ నడ్డిని పీవీ-మన్మోహన్సింగ్ ద్వయం విరిచేసిన తర్వాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఉత్పాదకరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న పట్టుదల పెరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. ఓటర్లకు వరాలు లేకుం డా, ఉచితాలు ఇవ్వచూపకుండా ఎన్నికలలో ఘనవిజయం సాధించవచ్చునని నిరూపించిన ఘనత కూడా మోదీదే. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానంటూ ఎన్నికల ప్రచా రంలో మోదీ చేసిన వాగ్దానం అతిశయోక్తికి పరాకాష్ఠ అయినప్పటికీ అన్నీ ఉచితంగా ఇస్తానంటూ వాగ్దానం చేయకుండానే భాజపాకి చరిత్రలో మొదటిసారి లోక్‌సభలో 280 పైచిలుకు స్థానాలు సంపాదించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా సంక్షేమ వాగ్దానాలు లేకుండానే మూడో సారి గెలిచింది. వాగ్దానాల వెల్లువ ప్రవహిం పజేసిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, హరియాణాలలో మట్టికరిచింది. ఈ తరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృద యాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. వాస్తవాల జోలికెళ్లని కాంగ్రెస్ తన విజయాన్ని మోదీ సరిగానే అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా విఫలమైనట్టున్నది. సార్వత్రిక ఎన్నిక లలో ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కశ్మీర్లో భాజపా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ప్రచారం చేస్తోంది. శుక్రవారంనాడు సోనియాగాంధీ కశ్మీర్ సందర్శించారు. ఆ పార్టీకి ఈ ఎన్నికలలో గెలవాలనే కోరిక కూడా ఉన్నట్టు కనిపించదు. నిజానికి ఆ పార్టీ నాయ కత్వం ఆత్మపరిశీలన చేసుకుంటున్నది. దాదాపు రెండు మాసాలుగా రాహుల్ ఆధ్వ ర్యంలోనే సమీక్షా సమావేశాలు నిత్యం జరుగుతున్నాయి. రాబోయే ఏఐసీసీ సమా వేశంలో రాహుల్‌గాంధీని పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని సోనియా సంకల్పించారు. ప్రియాంకకు సహాయక పాత్రే కానీ ప్రధాన పాత్ర ఉండదు. సంక్షేమ పథకాలను రద్దు చేయడం ద్వారా పేదలకు మోదీ దూరం అవుతారనీ, హిందూత్వ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చి ముస్లింల ఆగ్రహానికి గురవుతారనీ, కార్మిక చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులకు కోపం తెప్పిస్తారనీ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా పేదలూ, ముస్లింలూ, దళితులూ తిరిగి తమ పార్టీ పరిష్వంగంలోకి వస్తారని ఆశిస్తున్నారు. అంతేకానీ సంపద సృష్టించడం ఎట్లానో, కొత్త తరం కోరుకుంటున్న సుపరిపాలన అందించడం ఎట్లానో, అవినీతి మరక లేని వారికి పార్టీలో స్థానం కల్పించడం ఎట్లానో ఆలోచించడం లేదు. అన్ని రాష్ట్రాలలో అవినీతిపరులుగా, అసమర్థులుగా పేరుమోసిన నాయకులే పార్టీని నడిపిస్తున్నారు. నలభై ఏళ్లలోపు యువకులు పార్టీలో కనిపించరు. వామపక్షాలలో కూడా అంతర్వీక్షణం మొదలైంది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది వామపక్షాల నాయకులూ కూర్చొని వామపక్ష సానుభూతిపరుల, మేధావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భాజపాను ఓడించి అధికారంలోకి రావా లంటే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలనూ, సరికొత్త అభివృద్ధి వ్యూహాలనూ ప్రతిపాదించాలి. ఆ పని చేయకుండా పాతపాటే పాడుతూ కూర్చుంటే నవతరానికి అర్థం కాకుండా వ్యర్థమై బుట్టదాఖలైపోతారు. - కె. రామచంద్రమూర్తి -
ఒబామా బస చేసిన హోటల్ వద్ద ఇద్దరి అరెస్ట్!
బ్రిస్బేన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస చేసిన హోటల్ వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు సూట్ కేసులతో బ్రిస్బేన్ లోని మారియట్ హోటల్ వద్ద అనుమానస్పందంగా తిరగడం పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు. జీ20 సమావేశాల్లో పాల్టొంటున్న ఒబామా ప్రస్తుతం మారియట్ హోటల్ లో బస చేశారు. -
ఘనంగా దీపావళి
అమెరికా విదేశాంగ శాఖలో తొలిసారిగా వేడుకలు న్యూఢిల్లీ/వాషింగ్టన్: దీపాల పండుగ దీపావళిని గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పాక్, బ్రిటన్ తదితర విదేశాల్లోని హిందువులు, సిక్కులు తదితర భారత సంతతి ప్రజలూ వేడుకలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. 2009లో వైట్‌హౌస్‌లో దీపావళిని తొలిసారి నిర్వహించినందుకు తనకు గర్వంగా ఉందన్నారు. గురువారం అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలోని చారిత్రక బెంజమిన్ ఫ్రాంక్లిన్ గదిలో ఆ శాఖ మంత్రి జాన్ కెర్రీ తొలిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆయన దీపం వెలిగించారు. భారత్ అమిత శక్తిసామర్థ్యాలున్న దేశమని కొనియాడారు. కాగా, సరిహద్దులో పాక్ కాల్పుల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేకున్నా పాకిస్థాన్, దీపావళిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలకు స్వీట్లు పంపింది. -
కెనడా కాల్పుల ఘటనపై ఒబామా ఆరా!
ఒట్టావో: కెనడా పార్లమెంట్ ఆవరణలో అగంతకుడు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరా తీశారు. కాల్పుల ఘటన తర్వాత కెనెడా రాజధాని ఒట్టావోలో నెలకొన్న పరిస్థితులను ఒబామాకు వైట్ హౌజ్ అధికారులు వివరించారు. అగంతకుల జరిపిన కాల్పుల ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డ కెనెడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ... బరాక్ ఒబామాతో ఫోన్ లో సంభాషించారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ఒబామా!
షికాగో: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వినియోగించుకోవడం పౌరుడి ప్రథమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. నాకు ఓటు వేయడమంటే చాలా ఇష్టం అని ఒబామా వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటు వేశాననే విషయాన్ని ఒబామా చెప్పడానికి నిరాకరించారు. ఎన్నికల రోజు కోసం వేచి చూడకుండా ఈ సంవత్సరంలోనే ఓటు వినియోగించుకోవాలని ఓటర్లకు ఒబామా, డెమెక్రాటిక్ నేతలు విజ్ఞప్తి చేశారు. 2014 మధ్యంతర ఎన్నికల కోసం ఆరంభంలోనే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కమ్యూనిటి సెంటర్ లో ఒబామా ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు. -
29, 30 తేదీల్లో ఒబామాతో మోడీ భేటీ
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శ్వేతసౌధంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. మోడీతో ఒబామా రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయించడం.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి నిదర్శనమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తొలిసారిగా మోడీ, ఒబామాల మధ్య జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇరువురు నేతలు ఈనెల 29, 30 తేదీల్లో భేటీ అవుతారని శ్వేతసౌథం ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
హాస్యనటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య!
ఒబామా, కమల్‌హాసన్ తదితరుల సంతాపం లాస్ ఏంజెలిస్: మరపురాని నటనతో కోట్లాది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఇకలేరు. ఆయన సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్లో సొంతిట్లో ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విలియమ్స్ మధ్యాహ్నం అపస్మారకంలో ఉన్నారని తెలుసుకుని అత్యవసర వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. విలియమ్స్ శ్వాసకు అవరోధకం కల్పించుకుని, బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విలియమ్స్ కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆయన ప్రచారకర్త మారా బాక్స్బామ్ తెలిపారు. ‘గుడ్‌విల్ హంటింగ్’, ‘డెడ్ పొయెట్స్ సొసైటీ’, ‘గుడ్‌మార్నింగ్, వియత్నాం’ తదితర చిత్రాల్లో మనసు కదిలించే నటనతో విలియమ్స్ ప్రేక్షుకుల హృదయాలను గెలుచుకున్నారు. నాలుగుసార్లు ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందిన ఆయన ‘‘గుడ్‌విల్ హంటింగ్’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన తెలివైన మానసిక వైద్యుడి పాత్ర పోషించారు. భారతీయ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘అవ్వై షణ్ముగి’(తెలుగులో ’భామనే సత్యభామనే’) చిత్రం.. విలియమ్స్ చిత్రం ‘మిసెస్ డౌట్ఫైర్’ అనుకరణ. వెల్లువెత్తిన సంతాపం..: విలియమ్స్ మృతిపై హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అభిమానులు పెను విషాదంలో మునిగిపోయారు. ‘ఆయన గొప్ప హాస్యనటుడు. మానవ హృదయంలోని ప్రతికోణాన్ని స్పృశించారు. మనల్ని నవ్వించారు, ఏడిపించారు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. విలియమ్స్ మరణం గురించి బాధపడకుండా ఆయన పంచిన నవ్వులను గుర్తు చేసుకోవాలని ఆయన భార్య సుసాన్ పేర్కొన్నారు. విలియమ్స్ నాటకప్రదర్శనలు అత్యుత్తమమని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. విలియమ్స్ మగవాడి దుఃఖానికి గౌరవాన్ని సంపాదించిపెట్టారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్, షబానా ఆజ్మీ తదితర సినీ ప్రముఖులు కూడా నివాళులర్పించారు. -
'ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడండి'
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్ లో పర్యటించేలా చేయాలని యూఎస్ వాణిజ్యశాఖ సహాయకార్యదర్శి అరుణ్‌కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ తో అరుణ్‌కుమార్ భేటి అయ్యారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పలు వాణిజ్య పరమైన అంశాలపై అరుణ్ కుమార్ చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని అరుణ్ కుమార్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. దేశ పర్యటనలో ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని అరుణ్ కు కేసీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది. -
ఇఫ్తార్ విందులో బరాక్ ఒబామా!
వాషింగ్టన్: అమెరికాలోని వైట్ హౌజ్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన వార్షిక ఇఫ్తార్ విందులో అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గోన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్నఒబామా.. ఇజ్రాయిల్, పాలస్టీనాల పరస్పరదాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య పరస్పరదాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతోందని ఒబామా అన్నారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు పాలస్తీనా, ఇజ్రాయిల్ ఏమాత్రం మేలు చేస్తాయనుకోవడం లేదని.. అంతేకాకుండా ఏ ఒక్కరికి లాభం చేకూర్చదని ఆయన అన్నారు. 2012లో ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల ఒప్పందానికి కట్టుబడేలా చర్యలు తీసుకోవాలని ఒబామా సూచించారు. పౌరులపై రాకెట్ దాడులు చేయడాన్ని ఏ దేశం కూడా హర్సించదన్నారు. -
ఒబామా, పోప్ ల తర్వాత మోడీ దే అగ్రస్థానం!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఓ అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్ సంఖ్య ఉన్న ప్రపంచ అగ్రనేతల్లో మోడీ మూడవ స్థానంలో నిలిచారు. ప్రధమ స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ల తర్వాత నరేంద్రమోడీ మూడవ స్థానంలో ఉన్నారు. గతవారం నాలుగవ స్థానంలో ఉన్న మోడీ.. ఇండోనేషియా అధ్యక్షుడు ఎస్ బీ యుదోయోనో ను వెనక్కి నెట్టారు. ట్విటర్ లో మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 5.09 మిలియన్లు. దేశ ప్రజలకు చేరువయ్యేందుకు మోడీ సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో కూడా ఒబామా తర్వాత 18.9 మిలియన్ల 'లైక్'లతో మోడీ దూసుకుపోతున్నారని ఫేస్ బుక్ సీవోవో షెరిల్ సాండ్ బర్గ్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఒబామాకు లాడెన్ దయ్యం పడితే ఎలా..
మాఫియా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుత ధ్యాస దెయ్యాల చుట్టే తిరుగుతోంది. దయ్యాల కథలతో ప్రేక్షకులను భయపెట్టించేలేకపోయిన వర్మ తన ప్రయత్నానికి ఇంకా పుల్ స్టాప్ పెట్టే దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా ఐస్ క్రీమ్ చిత్రంతో మరోసారి తన హారర్ చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదలుతున్న వర్మకు మరో దయ్యాల కథ బుర్రలో పుట్టింది. తాజాగా తన దయ్యాల కథను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ దయ్యంగా మారి ఒబామాను పట్టేసి.. చనిపోయిన అల్ ఖైదా తీవ్రవాదులు వైట్ హౌజ్ ను ముట్టడించే కథ ఎలా ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు. A great idea for hollywwood horror film ..Osama Bin Laden's ghost posesses Obama and all dead Alqaeda terrorists haunt the White House— Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2014 -
నెత్తురోడుతున్న ఇరాక్
* బాగ్దాద్ చేరువలో రెబల్స్ ఇరాక్ సార్వభౌమత్వం * తీవ్ర ప్రమాదంలో ఉందన్న ఐరాస * సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు * తిక్రిత్, మోసుల్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులు బాగ్దాద్: ఇరాక్ నెత్తురోడుతోంది. భద్రత బలగాలను, ప్రభుత్వ మద్దతుదారులను ఊచకోత కోస్తూ జీహాదీ తిరుగుబాటుదారులు బాగ్దాద్ దిశగా దూసుకెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో జీహాదీలు, ప్రభుత్వ భద్రతాబలగాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇందులో తమదే పైచేయంటూ ఇరు వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, ‘ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత తీవ్ర ప్రమాదంలో ఉన్నాయ’న్న ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నికోలాయ్ మ్లదెనోవ్ మంగళవారం చేసిన ప్రకటన సున్నీ తిరుగుబాటుదారులైన ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్(ఐఎస్ఐఎల్)’ దళాల ఆధిక్యతను చెప్పకనే చెబుతోంది. రాజధాని బాగ్దాద్‌కు 60 కి.మీ.ల చేరువకు చేరుకున్నామని, బాగ్దాద్‌తో పాటు, షియాల పవిత్రనగరం కర్బలాను త్వరలో స్వాధీనం చేసుకుంటామని తిరుగుబాటుదారులు చెబుతుండగా.. వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని, గతంలో జీహాదీలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కూడా తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నామని ప్రభుత్వ దళాలు ప్రకటిస్తున్నాయి. అయితే, ఇప్పటికే తిక్రిత్, మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న ఐఎస్ఐఎల్ జీహాదీలు.. బాగ్దాద్‌కు ఉత్తరంగా అనేక ప్రాంతాలపై పట్టు బిగించాయి. షియాలు మెజారిటీగా ఉన్న కిర్కుక్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాయి. బాగ్దాద్‌కు దగ్గర్లో ఉన్న బాకుబాను, షియాల ప్రాబల్యం అధికంగా ఉన్న తల్ అఫార్ పట్టణంలో అత్యధిక భాగాన్ని జీహాదీలు అధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల బాగ్దాద్ ముట్టడిని ఇరాక్ ప్రభుత్వ భద్రతాదళాలు నిలువరించలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బఖుబా నుంచి తిరుగుబాటుదారులను తరిమేశామని భద్రతాదళాలు తెలిపాయి. ఇరువర్గాల పోరులో తిరుగుబాటుదారులు, భద్రతాదళాలతో పాటు 50 మందివరకు పౌరులు మరణించారని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. తిరుగుబాటు కారణంగా వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాగా, సున్నీ తిరుగుబాటుదారులకు సౌదీ అరేబియా మద్దతిస్తోందంటూ ఇరాక్ మంగళవారం ఆరోపించింది. ఇరాక్‌లోని షియాల ప్రభుత్వం సున్నీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిందని, అందుకే ఈ తిరుగుబాటని సున్నీల రాజ్యమైన సౌదీ అరేబియా ప్రకటించిన మర్నాడే ఇరాక్ ఈ ఆరోపణలు చేసింది. ఒబామా సమాలోచనలు ఇరాక్ పరిస్థితిపై జాతీయ భద్రతకు సంబంధించిన ఉన్నతస్థాయి సలహాదారులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం చర్చలు జరిపారు. తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు చేయాలనే విషయంపై అమెరికా తర్జనభర్జనలు పడుతోంది. బాగ్దాద్‌లోని తమ ఎంబసీ, అక్కడి అమెరికన్ల భద్రత కోసం 275 మంది సైనిక సిబ్బందిని ఇరాక్‌కు పంపించింది. ఇరాక్‌కు మద్దతుగా ఇరాన్‌తో కలసి సైనిక చర్య చేపట్టే విషయాన్ని యూఎస్ తోసిపుచ్చింది. కానీ ఇరాన్‌తో ఇరాక్ పరిస్థితిపై వియెన్నాలో చర్చలు జరిపింది. మరోవైపు, పలు దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నాయి. కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్ న్యూఢిల్లీ: ఇరాక్‌లోని భారతీయుల భద్రత కోసం న్యూఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడివారి సమాచారం కోసం +91 11 23012113, +91 11 23014104 నంబర్లలో సంప్రదించవచ్చని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరాక్‌లో దాదాపు 10 వేలమంది భారతీయులున్నారు. తిక్రిత్‌లో కేరళకు చెందిన 46 మంది నర్సులు, మోసుల్‌లో మరో 40 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఈ రెండు నగరాలు తిరుగుబాటుదారుల అధీనంలోనే ఉన్నాయి. భారత ప్రభుత్వ అభ్యర్థనపై అంతర్జాతీయ రెడ్ క్రెసెంట్ సంస్థ సభ్యులు తిక్రిత్‌లోని భారతీయ నర్సులతో మాట్లాడారు. వారు క్షేమంగానే ఉన్నారని నిర్ధారించారు. ఆ నగరాల నుంచి వారిని తరలించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. అలాగే, ఇరాక్‌లోని హింసాయుత ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన భారతీయులను రక్షించేందుకు ఇరాకీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేసే విషయంలో సాధ్యాసాధ్యాలను భారత్ ఆలోచిస్తోంది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశాల మేరకు అధికారులు అత్యవసరంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఇరాక్ పరిస్థితిని సుష్మాస్వరాజ్ స్వయంగా సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. బాగ్దాద్‌లోని భారత దౌత్యకార్యాలయం ఇరాక్ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో ఉందన్నారు. ఎందుకీ సంక్షోభం.. ఇరాక్‌లో 97% ముస్లింలున్నారు. వారిలో 60% - 65% అరబ్ షియాలుంటారు. 15 నుంచి 20 శాతం అరబ్ సున్నీలుంటారు. దాదాపు 17% కుర్దులుంటారు. ఇరాక్‌లోని కుర్దుల్లోనూ సున్నీలే అత్యధికులు. ఇరాక్‌లో షియాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండగా, సున్నీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. దేశ ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమైన కుర్దులు ప్రస్తుత తిరుగుబాటులో పాలుపంచుకుంటున్నారు. సద్దాంహుస్సేన్ పాలన అనంతరం అమెరికా కనుసన్నల్లో నూరి అల్ మాలికి ప్రధానమంత్రిగా బలహీనమైన షియా అనుకూల ప్రభుత్వం ఇరాక్‌లో ఏర్పడింది. ఆ ప్రభుత్వం మైనారిటీలైన సున్నీలు, కుర్దుల పట్ల నిర్దయగా, వివక్షాపూరితంగా వ్యవహరించడం ప్రారంభించింది. దాంతో వారిలో అసంతృప్తి పెరిగి, తిరుగుబాటుకు దారితీసింది. వారితో సద్దాంహుస్సేన్ ప్రభుత్వంలోని ఆర్మీ అధికారులు, పక్కదేశం సిరియాలోని తిరుగుబాటుదారులు జతకలిశారు. దాంతో ఇరాక్ మున్నెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. -
మోడీకి అమెరికా ఆహ్వానం!
సంపాదకీయం: అవసరాలు తీరడం ముఖ్యమా, ఆదర్శాలు పాటించడం ముఖ్యమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘తెలివైనవారు’ అవసరాలవైపే మొగ్గుతారు. ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశానికి ఆహ్వానించడం ద్వారా అమెరికా ఇప్పుడు సరిగ్గా ఆ తెలివితేటలనే ప్రదర్శించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే సెప్టెంబర్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుతానని మోడీ వర్తమానం పంపారు. వాస్తవానికి న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశా లకు మోడీ వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మన ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలవడం సాధారణంగా జరిగేదే. కానీ, అందుకు భిన్నంగా ఈసారి వాషింగ్టన్లో ఇరు దేశాల అధినేతలూ శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నారు. విదేశాంగ విధానంలో కొత్త దోవను పరుస్తున్న మోడీ ఆ వరుసలో తీసుకున్న మరో కీలకమైన నిర్ణయమిది. సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం... అంటే 2005లో అమెరికా నరేంద్రమోడీకి ఉన్న వ్యక్తి గత వీసాను రద్దుచేయడంతోపాటు ఆయనకు దౌత్యపరమైన వీసాను నిరాకరించింది. 2002లో జరిగిన గుజరాత్ నరమేథంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పాత్రపై ఆరోపణలు వచ్చాక ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా బాటలోనే బ్రిటన్, ఇతర యూరోప్ దేశాలు కూడా వ్యవహ రించాయి. 2005లో బ్రిటన్ వెళ్లాలనుకున్నప్పుడు మోడీకి ఆ దేశం వీసా నిరాకరించింది. మోడీ ప్రధాని పదవిని అధిష్టించిన తర్వాత అమెరికా వెనక్కు తగ్గక తప్పలేదు. నరేంద్ర మోడీ విషయంలో అమె రికా అప్పట్లో వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలొచ్చాయి. దేశంలో ఏ న్యాయస్థానమూ మోడీని తప్పుపట్టనప్పుడు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ఏ ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని పలువురు ప్రశ్నించారు. పోనీ ఇదే సూత్రాన్ని అమెరికా అందరికీ వర్తింపజేసివుంటే అది వారి విధానమని సరిపెట్టుకోవచ్చు. కానీ, తమకు అనుకూలంగా ఉన్న అధినేతలు నియంతలైనా సరే వారి చర్యలను చూసీచూడనట్టు ఊరుకుంటుంది. వారికి రెండు చేతులా సహాయసహకారా లను అందిస్తుంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎల్లకాలమూ నిలబడలేవు. నరేంద్ర మోడీకి విశేషజనాదరణ ఉన్నదని సర్వేల్లో తేలినప్పుడే పలువురు విశ్లేషకులు ఆయన ప్రధాని అయితే అమెరికాతో ఎలాంటి సంబంధాలు ఉంటాయోనన్న సందేహం వెలిబుచ్చారు. తొమ్మిదేళ్లుగా తనపై నిషేధం విధించిన దేశంతో మోడీ ఏ రకంగా వ్యవహరిస్తారన్న అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఆయన అంటీముట్టన ట్టుగా ఉండిపోవచ్చునని, అదే జరిగితే అటు అమెరికాకు, ఇటు మనకూ కూడా పరిస్థితి ఇబ్బందికరంగానే మారవచ్చునని అనుకు న్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేసిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడేని అరెస్టుచేయడం... కరడు గట్టిన నేరస్తులను ఉంచిన సెల్లో ఆమెను నిర్బంధించడం లాంటి చర్యల తర్వాత ఇరు దేశాల సంబంధాలూ అట్టడుగు స్థాయికి దిగజా రాయి. ఈ ఉదంతానికి ప్రతీకారంగా మన దేశం కూడా కఠినంగా వ్యవహరించింది. అమెరికా దౌత్య సిబ్బందికి సమకూర్చే ప్రత్యేక సౌక ర్యాలను రద్దుచేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రధా ని అయితే భారత్-అమెరికా సంబంధాలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ, ఒబామా ఆహ్వానాన్ని రెండో ఆలోచన లేకుండా అంగీకరించడంద్వారా నరేంద్రమోడీ విశాల దృక్ప థాన్నే ప్రదర్శించారు. నిజానికి మోడీకి దేశంలో అనుకూల వాతావర ణం ఉన్నదని చూచాయిగా తెలిశాక యూరోప్ దేశాలు ఆయనతో సర్దు బాటుకు ప్రయత్నించాయి. అమెరికా కంటే ముందే మేల్కొని ఆయన వద్దకు ప్రతినిధి బృందాలను పంపడంలాంటి చర్యలు తీసుకున్నాయి. అమెరికా మాత్రమే ఏమీ పట్టనట్టు ఉండిపోయింది. అమెరికా రాయ బారి నాన్సీ పావెల్ ఫిబ్రవరిలో మోడీని కలవకపోలేదుగానీ అప్పటికే ఆలస్యమైంది. ఆమె చురుగ్గా వ్యవహరించకపోవడంవల్ల భారత్‌లో తన ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందని భావించి అమెరికా పావెల్‌ను మొన్నటి ఏప్రిల్‌లో ఇక్కడినుంచి తప్పించింది. యూపీఏ తొలి దశ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అప్పట్లో అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదు ర్చుకోవడం కోసం మన్మోహన్సింగ్ తన ప్రభుత్వాన్నే పణంగా ఒడ్డారు. కానీ, యూపీఏ రెండో దశ పాలనలో ఆ ఒప్పందానికి అనుగు ణంగా తీసుకొచ్చిన అణు పరిహార చట్టం తమ సంస్థల ప్రయోజ నాలను దెబ్బతీసేలా ఉన్నదని అమెరికా భావిస్తున్నది. ముఖ్యంగా అణు ప్రమాదం సంభవించిన సందర్భాల్లో ఆ రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థనుంచి గరిష్టంగా రూ. 1,500 కోట్లు వసూలు చేయాలన్న సెక్షన్ 17(బీ)ని రద్దుచేయాలని కోరుతున్నది. అందుకు మన దేశం ససేమిరా అనడంతో కినుక వహించింది. అలాగే పన్ను విధానాల్లో అనిశ్చితి తొలగించమని, ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో మరింత ఉదారంగా ఉండాలని అడుగుతున్నది. ఇరుగుపొరుగుతో సంబంధాల మెరుగుదలకు మోడీ చేస్తున్న కృషి పర్యవసానంగా భవిష్యత్తులో ఆయన చైనాకు దగ్గర కాగలరన్న భయమూ అమెరికాలో లేకపోలేదు. అందుకు ప్రతిగా అమెరికా-భారత్-జపాన్ త్రైపాక్షిక సహకారం దిశగా ఆయనను ఒప్పించాలని... చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఇది అవసరమని ఆ దేశం అనుకుంటున్నది. ఇవన్నీ నెరవేరాలంటే మోడీకి సన్నిహితం కావడమే ఉత్తమమని అమెరికా భావిస్తున్నది. కనుకనే ఆయనపై ఉన్న నిషేధాన్ని తొమ్మిదేళ్ల తర్వాత తొలగించింది. తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా... తానింతకాలమూ పాటించినవి ద్వంద్వ ప్రమాణాలని గుర్తించి అమెరికా ఈ పని చేసివుంటే మరింత బాగుండేది. -
ఒబామా నడిచొస్తే..!
వాషింగ్టన్: ఒబామా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు.. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు... చుట్టూ అంగరక్షకులతో.. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణించే ఆయన తన కార్యాలయం వైట్‌హౌజ్‌కు ఒక సామాన్యుడిలా నడిచి వచ్చి ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రొటోకాల్‌ను కాదనుకొని సమీపంలోని యూ.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ నుంచి వైట్‌హౌజ్‌కు నడుచుకుంటూ వెళ్లారు. మార్గం మధ్యలో తారసపడిన యాత్రికులు, పిల్లలు, దుకాణదారులను పలకరించారు. ఓ మహిళ అయితే ఇదంతా చూసి షాక్‌కు గురైంది. ఇది నిజమేనా అంటూ ఒబామానే ప్రశ్నించింది. మరికొందరు అధ్యక్షుడితో కలసి ఫొటోలు కూడా దిగారు. -
మోడీకి ఒబామా ఆహ్వానం
వాషింగ్టన్: భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించారు. ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఆయన మోడీకి ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునేందుకు వీలు చూసుకుని అమెరికా రావాల్సిందిగా మోడీని ఒబామా ఆహ్వానించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. మోడీతో ఒబామా సంభాషించడం ఇదే మొదటిసారి. కాగా, అమెరికా పర్యటనకు వచ్చేటట్లయితే మోడీ, భారత ప్రభుత్వాధినేత హోదాలో ఏ-1 వీసా పొందేందుకు అర్హుడవుతారని అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. -
అమెరికాకు రండి.. మోడీకి ఒబామా ఫోన్!
-
అమెరికాకు రండి.. మోడీకి ఒబామా ఫోన్!
పార్లమెంట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయాన్ని బీజేపీకి అందించిన ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందించారు. శుక్రవారం రాత్రి మోడికి ఒబామా ఫోన్ చేసి...భారత, అమెరికా సంబంధాలు, ప్రపంచ ఆర్ధిక పరిస్థితిపై చర్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ చిరస్మరణీయమైన విజయాన్ని అందించారని మోడిపై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారత్ ఓ కీలక భూమికను పోషిస్తుందనే విశ్వాసాన్ని ఒబామా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికాలో పర్యటించాలని మోడీని ఒబామా ఆహ్వానించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీకి అమెరికా వీసాను తిరస్కరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటించాలని వైట్ హౌజ్ ఆహ్వానంపై మోడీ సానుకూలంగా స్పందించారు. -
ఒబామా కుమార్తెలను వెంబడించిన కారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తెలు ప్రయాణిస్తున్న వాహ న శ్రేణిని ఓ కారు వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటనతో వైట్‌హౌస్ ప్రధాన ద్వారాలను కొద్దిసేపు తాత్కాలికంగా మూసివేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఒబామా కుమార్తెలు మాలియ, సాషా వస్తున్న వాహన శ్రేణిని ఓ కారు వెంబడిస్తూ.. వైట్ హౌస్‌లోకి ప్రవేశించేయత్నం చేసింది. దీంతో సంబంధిత కారును అడ్డుకుని.. డ్రైవర్‌ను భద్రతా దళాలు అదుపుతోకి తీసుకున్నాయి. అధికారులు కారును పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అందులో ఎటువంటి వస్తువులు దొరకలేదు. ఈ సమయంలో ఒబామా వైట్ హౌస్‌లోనే ఓ కీలక సమావేశంలో ఉండటంతో అధికారులు వైట్ హౌస్ ద్వారాలను తాత్కాలికంగా మూసేశారు. -
పంచామృతం: ఇష్టమైన పుస్తకం
పుస్తకం అంటే జేబులో పట్టేసే పూదోట... తెలియని లోకాలకు ఎగరేసుకుపోయే మాయాతివాచీ... జీవితంలోని వెలుగు నీడల్లో సుఖదుఃఖాల్లో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో మనల్ని అక్కున చేర్చుకొని ఓదార్చి, స్ఫూర్తిని పంచేదే పుస్తకం. అలాంటి పుస్తకాల్లో కొన్ని మనసుకు మరింతగా హత్తుకుపోయేవి ఉంటాయి. అమితంగా అలరించే ఆ పుస్తకాలను కలకాలం దాచుకోవాలనిపిస్తుంది. ఫేవరెట్ పుస్తకమని చెప్పాలనిపిస్తుంది. ఈ విషయాన్ని కొందరు చదువరులైన సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారు తమకు బాగా ఇష్టమైన పుస్తకం గురించి ఇలా చెప్పారు... లిలియన్ వాట్సన్ రాసిన ‘లైట్ ఫ్రమ్ మెనీ లాంప్స్’ స్ఫూర్తిని పంచే ఖజానా లాంటి పుస్తకం. స్టీఫెన్ ఆర్ కోవే, డేవిడ్ కే హ్యాచ్‌లు రాసిన ‘ఎవ్రీడే గ్రేట్‌నెస్’ కూడా నాకు బాగా ఇష్టమైన పుస్తకం. - అబ్దుల్‌కలాం అమెరికాలో పుట్టి పెరిగిన ఒక ఆఫ్రోఅమెరికన్ కథ అయిన ‘సాంగ్ ఆఫ్ సోలోమన్’ నాకు బాగా ఇష్టమైన పుస్తకం. టోనీమోరిసన్ రచించిన ఈ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ స్థాయికి తగిన నవల ఇది. - బరాక్ ఒబామా ఆండ్రూ అగస్సీ ఆటోబయోగ్రఫీ ‘ఓపెన్’ అంటే నాకు చాలా ఇష్టం. అగస్సీ కూడా అందరిలాంటి మనిషే.. అయితే ఆయన ఒక ఛాంపియన్‌గా ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు వాటిని ఆయన అధిగమించిన తీరు చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది. - విరాట్ కొహ్లి నా బ్యాగులో ఎప్పుడు వెదికినా ఏదో ఒక నవల ఉంటుంది. శరత్చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ల పుస్తకాలు బాగా ఇష్టం. అరుంధతిరాయ్ రచించిన ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ బాగా ఇష్టమైన పుస్తకం. - శ్రీయ మనిషిలో భావోద్వేగాలను అధ్యయనం చేసి లోతైన విశ్లేషణలా ఎమిలీజోలా రాసిన ‘థెరేసే రాకిన్’ నాకు బాగా ఇష్టమైన నవల. - కేట్ విన్స్లెట్ -
ఓడిపోయిన ఒబామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓడిపోయారు.. అది కూడా కెనడా ప్రధాన మంత్రి స్టీఫెన్ హార్పర్ చేతిలో.. గెలిచిన హార్పర్‌కు రెండు కేసుల బీర్‌ను బహుమతిగా పంపించారు కూడా. ఒబామా ఏంటి.. కెనడా ప్రధాని చేతిలో ఓడిపోవడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. కానీ, ఓడిపోయింది ఒక పందెంలో మరి. రష్యాలోని సోచిలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ ‘ఐస్ హాకీ’ సెమీఫైనల్స్‌లో కెనడా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల కింద కెనడాలోని మెక్సికోలో ఒక సదస్సులో కలిసినప్పుడు... కెనడా ఓడిపోతుందని ఒబామా, గెలుస్తుందని హార్పర్ పందెం కట్టారు. ఇందులో గెలిచిన హార్పర్‌కు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ గార్డెన్లో సేకరించిన తేనెతో తయారు చేసిన ‘హనీ పోర్టర్, హనీ బ్లాండే’ బ్రాండ్ల బీర్లను ఒబామా పంపించారు. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్విట్టర్లో వెల్లడించింది. ‘‘ఒబామా నాతో వరుసగా పందాలు ఓడిపోతున్నారు. పందెంగా కాసినవన్నీ పంపుతూనే ఉన్నారు’’ అని హార్పర్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
'అమ్మ' జయలలితపై వీరభక్తి అదిరింది!
ఎన్నికలు సమీపిస్తున్నా.. కొత్త సినిమా విడుదలైనా.. అభిమానుల చేసే సందడి అంతా ఇంతా ఉండదు. ఏదైనా సందర్భం వచ్చిందంటే ఇక అధినేతల్ని, వారి అభిమాన తారల్ని ఆకట్టుకోవడానికి అభిమానులు చేసే ఫీట్లు ఒక్కోసారి అతిగా స్పందించారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ ప్రమేయం లేకుండానే అభిమానులు చేష్టలు కొన్నిసార్లు సినీ తారలకు, రాజకీయ నేతల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటుంది. రాజకీయ నేతల్ని, సినీ తారల్ని దృష్టిని ఆకర్షించడానికి చోటా నాయకులు హద్దు మీరి ప్రవర్తించే తీరు అన్నివర్గాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సినీతారగా లక్షలాది అభిమానుల్ని సంపాదించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జన్మదినం సందర్భంగా తమిళ తంబీలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పురచ్చి తలైవరిని ఆకట్టుకోవడానికి పార్లమెంట్ నమూనాలో భారీ కేకును తయారు చేయించి అధినేత్రిని ఖుష్ చేసిన సంగతి మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల్లో మరి కొందరు మరో అడుగు ముందేసి ఏకంగా ప్రపంచ అగ్రనేతలందరూ.. జయలలితను ఏకంగా కీర్తిస్తున్నట్టు కోయం బత్తూరులో వెలిసిన ఫ్లెక్సీ విమర్శలకు దారి తీస్తోంది. ప్రపంచ అగ్రనేతల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నార్త్ కోరియా డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్, సర్కోజిలాంటి అగ్రనేతలు జపం చేస్తున్నట్టు అభిమానులు ఫెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) ఓ మూలకు నెట్టడం గమనార్హం. భావి ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న జయలలిత వీరభక్తులు చేసిన ఈ తాజా వ్యవహారం తమిళ తంబీలు ఏది చేసినా అతిగానే ఉంటుందనే వాదనకు మరింత బలం చేకూర్చింది. -
ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... తాను విదేశీ నాయకులకిచ్చే విందుల విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేదు. అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ఐదుగురు అత్యంత ప్రముఖ నేతలకు ఇచ్చిన విందుల వ్యయమెంతో తెలుసా? దాదాపు రూ. 9.62 కోట్లు. అందులో సింహభాగం అంటే రూ. 3.55 కోట్లు ఖర్చుతో విందు ఇచ్చింది ఎవరికో తెలుసా? మరెవరికో కాదు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు. సమాచార హక్కు కింద సీబీఎస్ న్యూస్ 13 నెలల క్రితం చేసిన విన్నపానికి అమెరికా విదేశాంగ ఇచ్చిన గణాంకాలే ఇందుకు సాక్షి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదట పర్యటనకొచ్చిన విదేశీ నేత అయిన మన్మోహన్‌సింగ్‌కు 2009, నవంబర్ 24న ఘనంగా విందు ఇచ్చారు. ఇందుకైన ఖర్చు 5.72 లక్షల డాలర్లు అంటే దాదాపు 3.55 కోట్ల రూపాయలు. అంతేకాదు ఇలా ఒబామా నుంచి అత్యంత ఖరీదైన విందు పొందిన తొలి ఐదుగురు విదేశీ నేతల్లో మన్మోహనే అగ్రస్థానంలో ఉన్నారు. -
బైక్ 1 భలే..
చూడ్డానికి మామూలు సైకిల్లాగేనే కనిపిస్తున్నా.. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడు ఒబామా కోసం తయారుచేసిన సైకిల్. చిలీకి చెందిన ఆక్స్ఫర్డ్ కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంతకీ ఎందుకు: గల్ఫ్ యుద్ధం జరిగి 24 ఏళ్లవుతున్న సందర్భంగా నాటి యుద్ధానికి స్మారకంగా సదరు కంపెనీ బైక్ 1ను ఒబామాకు పంపుతోంది. ప్రత్యేకతలు: 8 గేర్లు, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, ఒబామా ఉపయోగించే బ్లాక్‌బెర్రీ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు చార్జింగ్ పాయింట్, ఎల్ఈడీ లైట్లు, గ్రీజు, ఆయిల్ అవసరం లేని చెయిన్ వ్యవస్థ. అన్నింటికన్నా ముఖ్యంగా ‘న్యూక్లియర్ బటన్’. ఒబామా ఎక్కడికెళ్లినా, అతనితోపాటు న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ ఒకటి ఉంటుంది. అందులో దేశ అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించే లాంచింగ్ కోడ్స్ ఉంటాయి. బైక్ 1లోనూ ఆ బ్రీఫ్‌కేస్ పెట్టుకోవచ్చు. కొసమెరుపు: చమురు కోసం నాడు జరిగిన గల్ఫ్ యుద్ధానికి గుర్తుగా.. ఒబామాకు త్వరలో బైక్ 1 ను పంపనున్న ఆక్స్ఫర్డ్.. పనిలోపనిగా అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ.. చురకలేసింది. ఒబామా దీన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాలకు మరింత ప్రాచుర్యం తెస్తారని ఆశిస్తున్నామని చెబుతూ.. ‘‘మనమందరమూ సైకిల్‌నే ఉపయోగిస్తే.. భవిష్యత్తులో చమురు కోసం యుద్ధాలు జరగనే జరగవు’’ అంటూ చిన్నగా వాతపెట్టింది. -
యుద్ధం కోసం‘ శాంతి’
వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఎవరికి? ఇస్తారో లేదో గానీ ఇవ్వాల్సింది మాత్రం నిస్సంశయంగా బరాక్ ఒబామాకే. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు 2009లో ఆ పురస్కారాన్ని అందుకున్నారనే శంక అనవసరం. రెడ్ క్రాస్ మూడు సార్లు ఆ పురస్కారాన్ని అందుకుంది. నిన్న సిరియాపై యుద్ధాన్ని విరమించిన ఒబామా... నేడు ఈ చేత్తో ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకొని, ఆ చేత్తో అఫ్ఘానిస్థాన్‌తో భద్రతా ఒప్పందంపై అంగీకారానికి వచ్చారు. వచ్చే ఏడాది అఫ్ఘాన్ నుంచి సేనల ‘ఉపసంహరణ’కు దారి తెరిచారు. నోబెల్ శాంతికి ఇంతకన్నా అర్హతలు కావాలా? 2009లో ఆయనకు నోబెల్ ఇచ్చినది ఎక్కువ యుద్ధాలను ప్రారంభించినందుకేనని వాదించే వాళ్లు తక్కువేమీ కాదు. అలాంటి వాళ్లను సంతృప్తి పరచడానికేనన్నట్టుగా మంగళవారం అమెరికా బీ-52 యుద్ధ విమానాలు చైనా ‘గగనతల రక్షణ గుర్తింపు ప్రాంతం’లోకి (ఏడీఐజెడ్) ప్రవేశించి కాలు దువ్వాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్నాయని అనుకుంటుండగా... 4,500 కిలో మీటర్ల దూరంలో మరో అగ్నిగుండాన్ని సృష్టిస్తానని ఒబామా హామీని ఇచ్చారు. జెనీవాలో ఇరాన్‌కు, ఐదు భద్రతా మండలి శాశ్వత దేశాలకు మధ్య అణు ఒప్పందం కుదిరిన రోజునే, నవంబర్ 24నే చైనా... తూర్పు చైనా సముద్ర ప్రాంత ఏడీఐజెడ్ను ప్రకటించింది. తమకు తెలియకుండా తమ గగన తలంలోకి ప్రవేశించే విమానాలను కూల్చే హక్కు తమకు ఉన్నదని ప్రకటించింది. రెండు రోజులైనా గడవక ముందే అమెరికా... చైనా హక్కుల ప్రకటనను బేఖాతరు చేసి కాలుదువ్వి, సవాలు విసిరింది. చైనాకు అతి సమీపంలోని దియాయు (సెనెకాకు) దీపుల విషయంలో గత కొంతకాలంగా జపాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఒకప్పుడు చైనాను దురాక్రమించిన జపాన్ ఆ దీవులపై తన వలసవాద హక్కుల కోసం పట్టుబడుతోంది. చైనా అవి తమవేనని వాదించడమే గాక తరచుగా ఆ దీవులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి చూపుతోంది. జపాన్‌కు అమెరికా అండ ఉన్న మాట నిజమే. అయినా అది ఇలా ప్రత్యక్షంగా రంగ ప్రవేశం చేసి తనకు ధీటైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న చైనాకు సవాలు విసరడం జపాన్ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘ఒప్పందం కోసం సిరియా బలి’ఈ పరిణామాలు ఇరాన్ అణు ఒప్పందం సమయంలోనే జరగడం కాకతాళీయం కాదు. ఇరాన్ అణు ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపాటు ‘సమంజసమే.’ ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివే తకు దారి తెరచిన జెనీవా ఒప్పందం ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి ఉన్న ‘అస్తిత్వ ప్రమాదాన్ని’ నిర్లక్ష్యం చేసిందని ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందుకే అది ఇరాన్‌కు ‘లొంగుబాట’ని, దాని అణు బాంబు కార్యక్రమానికి పచ్చజెండా చూపడమేనని మండిపడుతున్నారు. ఒకవిధంగా చూస్తే నెతన్యాహూ అంటున్నది నిజమే. ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కుదించుకున్నా, అంతర్జాతీయ శల్య పరీక్షలను అనుమతించినా... రెండు దశాబ్దాలుగా అమెరికా, ఇజ్రాయెల్ కోరుతున్నట్టు దాని అణు కార్యక్రమం పూర్తిగా నిలిచి పోదు. ఇరాన్ అణు ఒప్పందం కోసం అమెరికా ‘సిరియాను బలిపెట్టిందని’ ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు చేస్తున్న ఆరోపణను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఆ ఆరోపణే అమెరికా విదేశాంగ విధానంలో వస్తున్న పెనుమార్పులను అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది. అమెరికా రక్షణశాఖ పెంట గాన్ సలహాలను పెడచెవిన పెట్టి సెప్టెంబర్‌లో ఒబామా సిరియాపై యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో రష్యా, చైనాలతో ఘర్షణకు దిగడానికి సిద్ధపడలేక వెనుదిరగాల్సి వచ్చింది. అమెరికా దురాక్రమణ జరగక సిరియా ‘ప్రజాస్వామ్యం’ ఏమైపోతోంది? అసద్ ప్రభుత్వ సేనలు బలం పుంజుకున్నాయి. నానా గోత్రీకులైన ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలు సహా తిరుగుబాటు దళాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక దశలో రష్యా మధ్యవర్తిత్వంతో గద్దె దిగడానికి కూడా అంగీకరించిన అసద్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు! ఇంతకూ ‘సిరియా బలికి’ ఇరాన్ అణు ఒప్పందానికి ఉన్న సంబంధం ఏమిటి? ‘శాంతి’ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇరాన్, అమెరికా వైరం సమస్యను అణు సమస్యగా చూస్తున్న వారు జెనీవా ఒప్పందంతో అమెరికా సాధించిన రెండు కీలక ప్రయోజనాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఒకటి, ఇరాన్ తన చమురు పరిశ్రమ సహా ఆర్థిక వ్యవస్థను అమెరికా, ఈయూ దేశాలకు తెరవడానికి ఆంగీకరించడం. ఆర్థికమాంద్యంతో, ఇం దన సమస్యతో సతమతమవుతున్న ఈయూకు ఇది ప్రత్యేకించి కీలకమైనది. ఇక రెండవది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలతో ముడిపడినది. విశాల మధ్యప్రాచ్యంగా పిలిచే అఫ్ఘానిస్థాన్ నుంచి సిరియా వరకు ఉన్న ప్రాంతంలో సుస్థిర పరిస్థితులను నెలకొల్పడంలో అమెరికాకు సహకరిస్తానని అది వాగ్దానం చేసింది. అంటే సిరియాలో అధ్యక్షుడు అసద్ స్థానంలో అమెరికా ప్రయోజనాలకు కూడా హామీని కల్పించే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కు కృషి చేయడం. సిరియా సంక్షోభకాలం అంతటా అసద్‌కు మద్దతుగా నిలిచిన ఇరాన్... అమెరికాతో నెయ్యం కోసం అతన్ని బలిపెట్టే అవకాశం లేదు. పైగా రష్యా ప్రమేయం లేకుండా సిరియాలో అధికార మార్పిడికి అవకాశాలు తక్కువ. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పాటుకు ఇరాన్ సహాయపడగలుగుతుంది. 2001లో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పాటులో ఇరాన్ కీలక పాత్ర వహించింది. ఇటు సిరియాలోనూ అటు అఫ్ఘాన్‌లోనూ కూడా పలుకుబడి గల ఇరాన్ నేడు సైతం అఫ్ఘాన్ ‘శాంతి’లో కీలక పాత్రధారిగా నిలుస్తుంది. అందరూ అంటున్నట్టుగా ఇరాన్ జెనీవా ఒప్పందానికి కట్టుబడుతుందా లేదా అనేది ప్రశ్న కానే కాదు. ఆ ఒప్పందమేమీ దాని అణు శక్తి కార్యకలాపాలను పూర్తిగా నిషేధించేది కాదు. ఆరునెలల తర్వాైతైనా అలాంటి ఒప్పందం కుదిరే అవకాశం లేదు. కాకపోతే ఇరాన్ ఈ రెండు అంశాలలో మాత్రం మాట నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం అఫ్ఘాన్ ‘సుస్థిరీకరణ’కు సహకరించాల్సి వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్, సౌదీలు ఒబామాపై తమ ఆరోపణ ను ‘అఫ్ఘాన్ కోసం సిరియాను బలి పెట్టారు’ అని సవరించుకోవాలి. 2024 వరకు అఫ్ఘాన్‌లో తిష్ట గత ఏడాది విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ అఫ్ఘాన్ తాలిబన్లతో జరిపిన చర్చలు విఫలమైనప్పటి నుంచి అమెరికా పశ్చిమ ఆసియా విధానం మారుతోంది. అప్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్‌ని కాదని స్వయంగా తాలిబన్లతో శాంతి చర్చలకు దిగిన అమెరికా లెంపలు వేసుకుంది. అప్పటి నుంచి కర్జాయ్నే నమ్ముకుంది. ఎట్టకేలకు కర్జాయ్ అమెరికా సేనలు అప్ఘాన్లో మరో పదేళ్లు పాటు నిలిపి ఉంచడానికి అంగీకరించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో సరిగ్గా జెనీవా చర్చల సమంలోనే , ఈ నెల 20న ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందానికి అప్ఘాన్ తెగల మండలి ‘లోయా జిర్గా’ ఈ నెల 24నే ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందంపై ఇప్పుడు సంతకాలు చేసేది లేదని, వచ్చే ఏడాది నూతన అధ్యక్షుడే సంతకాలు చేస్తారని కర్జాయ్ తిరకాసు పెట్టారు. దీని అంతరార్థం... 2024 వరకు అప్ఘాన్లో అమెరికా సైన్యం నిలిపి ఉంచాలంటే వచ్చే ఏడాది కర్జాయ్ గానీ ఆయన ఆమోదించినవారు గానీ అధ్యక్షులు కావాలి. తాలిబన్లు ఈ భద్రతా ఒప్పందాన్ని, రానున్న ఎన్నికలను కూడా తిరస్కరిస్తున్నారు. కాబట్టి అఫ్ఘాన్ మారణ హోమం కొనసాగుతూనే ఉంటుంది. అప్ఘాన్లో కర్జాయ్ తెర ముందో వెనుకో ఉండి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి ఇరాన్ అండదండలు కావాలి. అందుకు దానికి పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. అప్ఘాన్ ‘సుస్థిరీకరణ’ వ్యూహంలో భాగంగానే అమెరికా ఇరాన్ పట్ల తన వైఖరిని మార్చుకుంది. ఇరాన్ నూతన అధ్యక్షుడు హసన్ రుహానీ పట్టువిడుపుల కారణంగానే అణు ఒప్పందం కుదిరిందని బావిస్తున్నవారు పొరబడుతున్నారు. ఆయన గద్దెనెక్కింది ఆగస్టులో కాగా అమెరికా మార్చిలోనే ఇరాన్‌తో సఖ్యతకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఒమన్‌లో అమెరికా విదేశాంగశాఖ ఉప మంత్రి విలియం బరన్స్ సహా అత్యున్నత స్థాయి అధికారుల బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సాగించింది. ఆ తర్వాత ఇరాన్ ఎన్నికలకు ముందు మేలో విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒమన్‌లో రహస్యంగా అణు ఒప్పందానికి ‘ప్రాతిపదికను’ తయారు చేసిన విషయం రచ్చకెక్కింది. ఇటు అఫ్ఘాన్‌లో రష్యా, చైనాల ప్రాబల్యానికి కళ్లెం వేయడానికి, అటు తనకు ప్రత్యర్థిగా నిలుస్తున్న చైనాకు బుద్ధి చెప్పడానికి ఇరాన్ తురుపు ముక్కను ఒబామా ప్రయోగించారు. ఫలితం వేచి చూడాల్సిందే! - పిళ్లా వెంకటేశ్వరరావు -
పశ్చిమాసియాలో శాంతి వీచిక!
సంపాదకీయం: రెండోసారి గద్దెనెక్కాక అపశ్రుతులు వినడమే అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తొలిసారి ఇది తీపి కబురు. తన అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలకు తలొగ్గే ఒప్పందంపై ఇరాన్ ఆదివారం సంతకం చేసింది. అమెరికా, మరో అయిదు దేశాలకూ... ఇరాన్‌కూ మధ్య జెనివాలో సంతకాలయ్యాయి. మూడున్నర దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందంలో భాగస్వాములు కావడం ఇదే తొలిసారి. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య మూడునెలలుగా సాగుతున్న చర్చలు ఈ ఒప్పందాన్ని సాకారం చేశాయి. దశాబ్దాలుగా అమెరికా విధిస్తూ వచ్చిన కఠినమైన ఆంక్షలనుంచి కాస్తయినా వెసులుబాటు లభించేందుకు ఈ ఒప్పందంతో ఇరాన్‌కు అవకాశం ఏర్పడింది. రెండేళ్లక్రితం ఇరాన్ యురేనియం శుద్ధిని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాక పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్, ఇతర పాశ్చాత్య దేశాలు కత్తులు నూరాయి. దారికి రాకపోతే దాడులు తప్పవని హెచ్చరించాయి. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందేనని ఇరాన్ చెప్పిన మాటలను ఆ దేశాలు విశ్వసించలేదు. ఒక దశలో యుద్ధం అనివార్యం కావొచ్చన్న స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆరుదేశాలకూ, ఇరాన్‌కూ కుదిరిన ఈ ఒప్పందం ఒక రకంగా ఉద్రిక్తతలను ఉపశమింపజేస్తుంది. వాస్తవానికి ఇరాన్ అణు కార్యక్రమం రహస్యమైనదేమీ కాదు. 1967లో టెహ్రాన్ లో అణు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సాయపడింది అమెరికాయే. అమెరికాకు ప్రీతిపాత్రుడైన ఇరాన్ షాను అక్కడి విద్యార్థి విప్లవం 1979లో పదవీచ్యుతుణ్ణి చేసే వరకూ రెండు దేశాలమధ్యా సన్నిహిత సంబంధాలుండేవి. అటు తర్వాత ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు మొదలయ్యాయి. ఏ అంతర్జాతీయ సంస్థనుంచీ ఇరాన్‌కు అప్పుపుట్టకుండా చేయడం, తమ దేశంలో ఇరాన్‌కు ఉన్న వేల కోట్ల డాలర్ల బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర ఆస్తుల్ని స్తంభింపజేయడం వంటి చర్యలకు అమెరికా పూనుకుంది. అది ఉత్పత్తి చేస్తున్న చమురును ఏ దేశమూ కొనకూడదన్న ఒత్తిళ్లూ ఎక్కువయ్యాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సైతం ఇరాన్ అణు కార్యక్రమానికి పూనుకున్నది. అయితే, ఈ అణు కార్యక్రమంపై చర్చలకు తాను సిద్ధమేనని ఇరాన్ ఆదినుంచీ చెబుతూనే వచ్చింది. ఈ చర్చలు పశ్చిమాసియాలో పూర్తి అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలన్నది ఇరాన్ వాదన. ఇరాన్‌కు పొరుగున ఉన్న ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అణ్వస్త్రాలున్నందువల్ల ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరించలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేయాలన్న అమెరికా, పాశ్చాత్య దేశాలు ఒక మెట్టు దిగొచ్చాయి. యురేనియం శుద్ధిని 5 శాతానికి మించనీయొద్దని ఈ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇప్పటికే నిల్వ ఉన్న శుద్ధిచేసిన యురేనియంను పలచన చేయాలని లేదా ఆక్సైడ్‌గా మార్చాలని ఒప్పందం సూచించింది. ఇరాన్ వద్దనున్న సెంట్రిఫ్యూజుల సంఖ్యను పెంచకూడదని కూడా స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తన వంతుగా ఒక మెట్టు దిగింది. మొత్తంగా అణ్వస్త్ర నిషేధానికి దారితీసేవిధంగా చర్చలుండాలన్న తన షరతును సడలించుకుంది. ఒప్పందం పర్యవసానంగా ఇకపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది. దశాబ్దకాలం నుంచి కొనసాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమానికి ఈ ఒప్పందం ద్వారా తొలిసారి అడ్డుకట్ట వేయగలిగామని అమెరికా సంతృప్తిపడుతుండగా, స్తంభింపజేసిన ఖాతాల్లోని 400 కోట్ల డాలర్ల చమురు అమ్మకాల సొమ్ము తన చేతికొస్తుందని... బంగారం, పెట్రోకెమికల్స్, కార్లు, విమానాల విడిభాగాలపై ఉన్న ఆంక్షలు సడలుతాయని ఇరాన్ ఊపిరిపీల్చుకుంటున్నది. అయితే, ఈ ఒప్పందం సిమెంటు రోడ్డుమీది ప్రయాణంలా సాఫీగా సాగి పోతుందని చెప్పడానికి వీల్లేదు. పాశ్చాత్య ప్రపంచంతో ఎలాంటి రాజీకైనా ససేమిరా అంగీకరించని ఛాందసవాదుల ప్రాబల్యం ఇరాన్లో బలంగానే ఉంది. అలాగే, ఇరాన్ పై బలప్రయోగం చేసి పాదాక్రాంతం చేసుకోవాలి తప్ప, ఆ దేశంతో చర్చలేమిటని ప్రశ్నించే ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశంగా ఉంది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు వెలువడిన వెంటనే ‘ఇది చరిత్రాత్మక ఒప్పందం కాదు... చరిత్రాత్మక తప్పిదం’ అంటూ బుసలుకొట్టింది. ఇకనుంచి ఈ ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారబోతున్నదని ఆందోళనవ్యక్తం చేసింది. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా వంటి ఇరాన్ శత్రుదేశాలు ఇజ్రాయెల్ అభిప్రాయంతో గొంతు కలిపాయి. ఇలాంటి ప్రమాదాలున్నాయి గనుకే రానున్న ఆరునెలలూ కీలకమైనవి. ఇప్పుడు కుదిరిన జెనీవా ఒప్పందం తాత్కాలికమైనదే. దీని ప్రాతిపదికన రానున్న ఆరునెలల కాలంలో మరిన్ని చర్చలు కొనసాగి సమగ్రమైన, శాశ్వత ఒప్పందం సాకారం కావాల్సి ఉంది. అది జరిగాకే ఇరాన్‌పై ఇప్పుడున్న ఆంక్షలన్నీ పూర్తిగా తొలగే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పర్యవసానంగా లాభపడే దేశాల్లో మన దేశమూ ఉంటుంది. ఇరాన్ నుంచి నేరుగా చమురును చేరేసే ఇరాన్-పాకిస్థాన్- ఇండియా (ఐపీఐ) పైప్‌లైన్ ప్రాజెక్టు నుంచి మన దేశం మధ్యలోనే వైదొలగింది. ఇందుకు భద్రతాపరమైన కారణాలను చూపింది. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా ఆ ప్రాజెక్టులో మళ్లీ చేరే అవకాశం ఉంది. అలాగే మన దేశంనుంచి ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయి. అయితే, దశాబ్దాలుగా పరస్పర అవిశ్వాసంతో, శత్రుత్వంతో రగిలిపోతున్న దేశాల మధ్య సంపూర్ణ సదవగాహన ఏర్పడటం అంత సులభం కాదు. అందుకు చాలా సమయం పట్టవచ్చు. అది సాకారం కావడానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధితో వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా పశ్చిమాసియాలో ఇన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానా లను సవరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెదిరింపుల ద్వారా ఏమైనా సాధించగలమన్న అభిప్రాయాన్ని అది మార్చుకోవాలి. అందుకు అది ఏమేరకు సిద్ధపడుతుందన్నదాన్నిబట్టి ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలు ఏర్పడతాయి. -
చిదంబర పలుకులు
రోజూ చచ్చేవాడి కోసం ఏడ్చేవాడు ఎవడు అన్నట్టు... ఏళ్ల తరబడి అనునిత్యం అనుభవించక తప్పని శిక్షగా మారిన ధరల పరుగు పందేన్ని ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. అందుకేనేమో పట్టించుకోవాల్సిన వారు ఎట్టకేలకు పెదవి విరిచి ‘చిదంబర’ రహస్యాన్ని విడమరిచారు. చిల్లర ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం కాదు కదా, వాటి పరుగు జోరుకు కళ్లెం వేయడం కూడా తమ వల్ల కాదని, ఆ మాట కొస్తే ఎవరి వల్లా కాదని ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం తేల్చేసారు. వినియోగదారుల ధరల సూచీపై ఆధారపడి లెక్కగట్టే రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో అంతకు ముందటి మాసంతో పోలిస్తే 10.09 శాతం పెరిగింది. హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 7 శాతం పెరి గింది. ఈ ఒక్క నెల్లోనే కాదు గత ఐదేళ్లుగా నెలకు 10 శాతం ఎక్కువ ధరలు చెల్లించి ప్రజలు నిత్యజీవితావర వస్తువులను కొసుక్కోవాల్సి వస్తోంది. ధరలతో పాటూ పరుగు తీసి ఎంత ధరంటే అంతా చెల్లించి చస్తున్నారు. చెల్లించనే లేని వాళ్లు కొనుక్కోలేక చస్తున్నారు. ఎవరికి ఏ చావు రాసి పెట్టి ఉంటే అదే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి మన ప్రధాని మన్మోహన్సింగ్ వరకు అంతా మనలాంటి వర్థమాన దేశాల ప్రజలు ఆదాయాలు పెరిగి, తెగ తినడమే ఆహార ధర ల పెరుగుదలకు కారణమని తేల్చారు. మనసులోని మాట పైకి చెప్పకూడని ఎన్నికల కాలం కాబట్టో ఏమో చిదంబరం ఆ మాట అనలేదు. కానీ ఆహార ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమని చెప్పుకొచ్చారు. ఇక విశ్లేషకులంతా ఉల్లి, కూరగాయల ధరలదే ఈ పాపమంతా అని నిర్ధారించారు. కూరగాయల ధరలు అసాధారణంగా 45.67 శాతం పెరిగిన మాట నిజమే. మరి తిండిగింజలు గత నెల కంటే 12.01 శాతం ఎందుకు పెరిగినట్టు? ముద్దంటూ ఉంటేగా నంజుకోడానికి కూర ముక్క కావాల్సింది? గంజి కాసుకోడానికైనా ఇన్ని గింజలుండాలే? పళ్లు ఇప్పటికే ధనవంతుల విలాసంగా మారి వెక్కిరిస్తున్నాయి. కూరగాయలు వాటి పక్కకే రెక్కలు కట్టుకు పోతున్నాయి. ఇది పట్టదా? అని అడగడానికి లేకుండా చిల్లర ధరల పెరుగుదల జోరు తగ్గించడం తేలికేమీ కాదని, ఆ మాటకొస్తే అసలు ఇప్పట్లో సాధ్యం కాదనేది చిదంబరం చెప్పిన రహస్యం. మరో ఐదేళ్లో, పదేళ్లో సామాన్యుల అరికాళ్ల కింద మంటలు భగభగ మండుతూనే ఉంటాయని ఆయన తేల్చేసారు. ఆ మంటలు ఆర్పే ఫైరింజన్లు మోడీ దగ్గర కూడా లేవని చెప్పకుండానే అర్థమై పోయేలా అసలు సంగతి కూడా చెప్పారు. ఆహార పదార్థాల గిరాకీతో పోలిస్తే సరఫరా తక్కువగా ఉండటమే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు కార ణమని, కాబట్టి అది తగ్గాలంటే ఉత్పత్తిని పెంచడమే పరిష్కారమని సెలవిచ్చారు. సరఫరా పెరగడానికి ‘పెద్ద ఎత్తున పెట్టుబడులు, మదుపులు, ఉత్పత్తి, సరఫరా సదుపాయాలు వగైరా’ అవవసరమని అన్నారు. నిజమే ఉత్పత్తి పెరగనిదే సరఫరా పెరగదు. కానీ చిదంబరం చెబుతున్నట్టుగా ఉల్లి ధర రూ. 100, రూ.150 కి చేరడానికి కారణం సరఫరా తగ్గడమేనా? తగ్గిన సరఫరాతో పోలిస్తే ధర పది రెట్లకు పైగా ఎందుకు పెరిగింది? నిన్నిటి ఉల్లి సరే ఇప్పుడు బీహార్, పశ్చిమబెంగాల్లో పలు ప్రాంతాల్లో ఉప్పును రూ. 100 నుంచి 150లకు అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నవారి సంగతేమిటి? దొంగ నిల్వదారులే, వ్యాపారులే ఏలికలకు రాజపోషకులనేది బహిరంగ రహస్యమే కాబట్టి ఈ ఎన్నికల విరాళాల కాలంలో వారు అసలే కనబడకపోవడం ‘న్యాయమే’. ఏదేమైతేనేం, అధిక ధరల గుదిబండ దించడానికి మనకు చిదంబరం దీర్ఘకాలిక పరిష్కారం చూపారు. అందుకోసమే చిందంబరం ఇప్పటికే ఇచ్చిన సంస్కరణల డోసులతోనూ, విదేశీ బ్యాంకుల రాకతోనూ, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతోనూ వచ్చిన విదేశీ పెట్టుబడులు ఉత్పత్తి రంగంలోకి పోలేదెందుకు? గత ఏడాది 1 శాతం నామాత్రపు వృద్ధిని సాధించిన పారిశ్రాకమిక రంగం ఆగస్టులో 0.5 శాతం వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకో ఆర్థిక మంత్రి చెప్పరు. దీపావళికి అమ్మకాలు లేక కళ తప్పిన అధిక ఆదాయ వర్గాల వినియోగవస్తు మార్కెట్లు చెబుతాయి. ఈ పండుగల సీజన్లో పేద వర్గాల్లాగే, అధిక ఆదాయవర్గాలను కూడా కొనుగోళ్లకు దూరంగా ఉంచినది ద్రవ్యోల్బణమేనని పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చి చెప్పింది. అది దాని లెక్కల్లో సిగరెట్లు, ఎల్పీజీ వ్యంట గ్యాస్ వంటి వస్తువులను కూడా అధిక ఆదాయవర్గాల వస్తువులుగా లెక్కించింది. అంటే మధ్యతరగతిలోని ఉన్నత వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరికీ నేడు ద్రవ్యోల్బణం సెగ తగులుతున్నదన్న మాటే. చిదంబరం చిలుక పలుకులు బాగున్నా, సార్వత్రిక ఎన్నికల వైతరణిని దాటించ లేవు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
టైమ్స్ జాబితాలో మాలియా, మలాలా
2013 యువ ప్రభావశీలుర జాబితా విడుదల న్యూయార్క్: టైమ్స్ మాగజైన్ రూపొందించిన అత్యంత ప్రభావశీలురైన యువత జాబితా-2013 లోని తొలి 16 మందిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా, పాక్‌లో బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న మలాలా యూసఫ్జాయ్ల పేర్లు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తమ అసాధారణమైన కృషి, అభినివేశాలతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన పలువురు యువ గాయకులు, క్రీడాకారులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లోని ప్రముఖులతోపాటు అసాధారణ మేధస్సు కనబరచిన బాలలు, యువ రచయితలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. విస్తృత జీవితానుభవం కలిగిన పెద్దల మాదిరిగా పరిణతితో, హుందాగా వ్యవహరిం చడంలో మాలియా(15), ఆమె చెల్లెలు సాషా సుప్రసిద్ధులు. పురుష స్వలింగ సంపర్కులకు వివాహ హక్కు కల్పించడం వంటి అనేక అంశాలలో తన కుమార్తెలు తన ఆలోచనలను ప్రభావితం చేశారని ఒబామా తరచూ తన ప్రసంగాల్లో పేర్కొంటూ ఉంటారు. -
పాక్ ‘శాంతి’ రగడ
అమెరికా, పాకిస్థాన్‌ల కలహాల కాపురం ఇలా కుదటపడిందో లేదో అలా మళ్లీ రచ్చకెక్కింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ గత నెలలో (20-23) అమెరికాలో పర్యటించారు. పాక్ భూభాగంపై అమెరికా ద్రోన్ విమాన దాడులను తక్షణమే నిలిపివేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరారు. ఇరు దేశాలకు సంతృప్తిని కలిగించిన ఆ పర్యటనలో ఒబామాకు పట్టనిది అది ఒక్కటే. అందుకు నవాజ్ చింతించిందీ లేదు. 2014లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్ర్కమణ తదుపరి ద్వైపాక్షిక సహకారానికి వీలుగా పరిస్థితిని చక్కదిద్దగలిగామని ఒబామా ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది. వారం తిరిగే సరికే కథ అడ్డం తిరిగినట్టయింది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు కలిసి అమెరికాపై నిప్పులు కక్కుతున్నాయి. కార ణం నవంబర్ 2న జరిగిన మరో ద్రోన్ దాడి. అమెరికా 2004 నుంచి పాక్ వాయవ్య ప్రాం తంలోని ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత తెగల ప్రాంతంలోనూ ద్రోన్ దాడులు సాగిస్తూనే ఉంది. పాక్ నుంచి అప్ఘాన్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై దాడుల పేరిట వందలాదిగా అమాయక పౌరులను బలిగొంటోంది. గ్రామాలకు గ్రామాలనే బుగ్గి చేస్తోంది. అమెరికా అధికారిక ప్రకటనల ప్రకారమే ఒక్కో మిలిటెం టును హతమార్చడానికి సగటున పది మంది పౌరులు బలి కావాల్సివస్తోంది. ఇంతకూ నవాజ్ ప్రభుత్వం అలకకు కారణం ద్రోన్ దాడుల కొనసాగింపు కానేకాదు... ఆ దాడిలో పాక్ తాలిబన్‌గా పిలిచే ‘తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్’ (టీపీపీ) అగ్రనేత హకీముల్లా మెహసూద్ మృతి చెందడం. ద్రోన్ దాడుల్లో హతమవుతున్న పౌరుల గురించి మొసలి కన్నీళ్లు కార్చే పాక్ ప్రభుత్వం... ‘అత్యంత ప్రమాదకర ఉగ్రవాది’గా అమెరికా ముద్ర వేసిన హకీముల్లా హతమైనందుకు రభస చేయడంలో అర్థం లేకపోలేదు. నవాజ్ ప్రభుత్వం హకీముల్లాతో శాంతి చర్చలు నడుపుతోంది. సహచరులతో శాంతి చర్చలపై సంప్రదింపుల కోసమే ఉత్తర వజీరి స్థాన్‌కు అతను వచ్చాడు. ఆ సమావేశంపై అమెరికా ద్రోన్ దాడికి పాల్పడింది. ఇది ‘శాంతి ప్రక్రియని హత్య చేయడమే’నని పాక్ హోంమంత్రి చౌధరీ నిస్సార్ సోమవారం మండిపడ్డారు. అఫ్ఘాన్‌లోని అమెరికా, నాటో సేనలకు పాక్ గుండా జరిగే సరఫరాలను వెంటనే నిలిపివేయాలని తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని అధికారపార్టీ అదే. హకీముల్లా హత్యతో శాంతి చర్చలకు విఘాతం కలిగిందని నవాజ్ పార్టీ (పీఎమ్ఎల్-ఎన్) ఆందోళన చెందుతోంది. ‘శాంతి చర్చలు పాక్ అంతర్గత సమస్య’ని, వాటితో తమకు ఎలాం టి సంబంధం లేదని అమెరికా తేల్చిపారేసింది. అదే సూత్రం ప్రకారం పాక్ మిలిటెన్సీ సమస్య కూడా ఆ దేశ అంతర్గత వ్యవహారమే కావాలి. ఎవరి అనుమతితో అమెరికా ద్రోన్ దాడులతో జోక్యం చేసుకుంటున్నట్ట్టు? దానికి ఎవరి అనుమతి అక్కర్లేని మాట నిజమే. కానీ కనీసం 2007 నుంచి పాక్ ప్రభుత్వ అనుమతితోనే ద్రోన్ దాడులు సాగుతున్నాయని ఇటీవలే ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఇక హకీముల్లా హత్యకు సంబంధించి... నవా జ్ ప్రభుత్వ ఆగ్రహానుగ్రహాలతో అమెరికాకు పనిలేదు. అందుకు ‘ఇవ్వవలసిన వారి’ అనుమతే ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ కయానీ కూడా ‘శాంతి’నే కోరుతున్నారు. కాకపోతే శ్రీలంక తరహాలో ముందుగా తాలిబన్లను సైనికంగా నిర్మూలించాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ చేత్తో శాంతి చర్చల కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహ ణకు నవాజ్‌కు పచ్చజెండా చూపి, మరో చేత్తో హకీముల్లా ఆనుపానులు అమెరికాకు అం దేట్టు చేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏకూ, పాక్ సైన్యం, ఐఎస్ఐలకూ మధ్య ఈ విషయంలో ఉన్న సహకార సంబంధాలను కూడా ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. కయానీతో ఏకీభవించే మితవాద రాజకీయ పక్షాలు విస్పష్టంగా ‘మంచి మిలిటెంట్లు’, ‘చెడ్డ మిలిటెంట్లు’ అనే విభజన రేఖను గీసా యి. అఫ్ఘాన్‌లో మాత్రమే దాడులకు పాల్పడే సలాఉద్దీన్ అయూబీ, హఫీజ్ గుల్ బహదూర్, హఖానీ గ్రూపులు మంచి మిలిటెంట్లు. పాక్‌లో బాంబు దాడులకు, ఆత్మహుతి దాడులకు పాల్పడే టీపీపీ చెడ్డ మిలిటెంట్లు. ఇక భారత్‌లో దాడులకు పాల్పడే ‘లష్కరే తోయి బా’, ‘లష్కరే జంగ్వీ’, ‘జైషే మొహ్మద్’ సం స్థలు ముఖ్య ‘వ్యూహాత్మక సాధనాలు లేదా మిత్రులు’. అఫ్ఘాన్‌లోనే దాడులకు పాల్పడే మిలిటెంట్లతో అమెరికాకు పేచీ. శాంతి చర్చలతో టీపీపీ ప్రధాన రాజకీయ స్రవంతిలోకి రావడం కయానీ లాంటి సైనిక నేతల ఆధిపత్యానికి ప్రమాదం. అందుకే అమెరికా, కయానీలకు మధ్య మునుపెన్నటికంటే బలమైన ఏకీభావం నెలకొంది. ‘శాంతి హత్య’తో అమెరికా పాక్ బంధానికి వచ్చిన ముప్పేమీ లేదు. నవాజ్ నిమిత్తమాత్రుడు. - పి.గౌతమ్ -
అమెరికాకు ‘సిరియా’ కళ్లెం
విశ్లేషణ: సిరియాపై రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో ఒబామా జూదమాడారు. అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సివచ్చింది. మిత్రులను దూరం చేసుకోవాల్సివస్తోంది. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్య రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలను సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సివస్తోంది. కట్టుకున్నోడు కొట్టాడు, అత్త కొట్టింది, ఆడబిడ్డ కొట్టింది, నేనూ నాలుగు తగిలించి పోతే పోలా... అని దారినపోయే దానయ్య కూడా కొట్టి పోయాడట వెనుకటికో ఇల్లాలిని. అలా తయారైంది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిస్థితి. లేకపోతే అమెరికా సైన్యం అండ లేనిదే బతికిబట్టగట్టలేని రాచరిక సౌదీ ఆరేబియా... భద్రతా మండలి సభ్యత్వాన్ని గెలుచుకున్న వెంటనే తిరస్కరించేదా? ఈ నెల 18న దౌత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగలిగేదా? సిరియా అంతర్యుద్ధంలాంటి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో ఐరాస ైవె ఫల్యానికి నిరసనగానే సౌదీ ఈ అసాధారణ చర్యకు పాల్పడిందనేది పైకి చెప్పే సాకు. నిజానికి అది అమెరికాపై ఆగ్రహ ప్రకటన. సౌదీకి కాబోయే అమీర్‌గా భావిస్తున్న ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ (‘బందర్ బుష్’)... ‘ఇది ఐరాసకు పంపుతున్న సందేశం కాదు, అమెరికాకు పంపుతున్న సందేశం’ అని స్పష్టం చేశారు. రసాయనిక ఆయుధాల నిర్మూలన పేరిట సిరియాపై సైనిక చర్యతో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సర్వం సిద్ధం చేసుకొని కూడా అమెరికా వెనుకడుగు వేయడమే సౌదీ ఆగ్రహానికి కారణం. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రాబల్యానికి మూల స్తంభాల్లో ఒకటిగా, చిరకాల మిత్ర దేశంగా ఉన్న తమను అమెరికా ఒంటరిని చేసిందని సౌదీ భావిస్తోంది. సెప్టెంబర్‌లో అతి నాటకీయంగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్... ఇంద్రజాలికుడు టోపీలోంచి పావురాన్ని తీసినట్టు సిరియా రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేసే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అంతే ఠక్కున ఒబామా సైనిక చర్యను విరమించారు. మధ్యప్రాచ్యంలోని చిరకాల సన్నిహిత మిత్రులను అమెరికా దూరం చేసుకోవాల్సి వచ్చింది. నమ్మశక్యం కానివిగా కనిపించే ఈ పరిణామాల తదుపరి మధ్యప్రాచ్య రాజకీయాలలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ‘సిరియా’ మలుపు... పుతిన్ గెలుపు సెప్టెంబర్‌లో సిరియాపైకి అమెరికా ఐదు డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను ఎక్కుబెడితే... ప్రతిగా రష్యా తన క్షిపణి విధ్వంసక ‘మాస్క్వా’ క్రూయిజర్ సహా పదకొండు యుద్ధనౌకలను రంగంలోకి దించింది. వాటికి తోడు చైనా యుద్ధ నౌకలు కూడా నిలిచాయి. సిరియాపై దాడికి బదులు చెప్పడానికి సిద్ధమయ్యాయి. 1962 నాటి ‘క్యూబా మిస్సయిల్ సంక్షోభం’తో సరితూగక పోయినా ఆ తదుపరి ప్రపంచం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిని ఎరుగదు. ‘గుర్తు తెలియని వారు’ సిరియాపై రెండు క్షిపణులను ప్రయోగించగా అవి గురితప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ ‘గుర్తు తెలియని’ క్షిపణులు స్పెయిన్‌లోని నాటో సైనిక శిబిరం నుంచి ప్రయోగించిన అమెరికా తయారీ టామ్‌హాక్ క్షిపణులనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఇక వాటిని రష్యా నిర్వీర్యం చేసిన తీరుపై భిన్న కథనాలున్నా గల్ఫ్ దేశాల మీడియా అది రష్యా పనేనని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇంతకూ ఒబామా ఎందుకు వెనుకడుగు వేశారు? లిబియాపై రష్యా చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. అలాగే సిరియాపై కూడా అది వెనక్కు తగ్గక తప్పదని ఒబామా ప్రభుత్వం భావించింది. ప్రపంచ మీడియా పండితులంతా దానికి వంత పాడారు. అయితే ఒక్క విషయాన్ని మరిచారు. నాటి రష్యాకు వెన్నెముకలేని ద్మిత్రీ మెద్వదేవ్ అధ్యక్షుడు కాగా నేటి అధ్యక్షుడు పుతిన్! పదమూడేళ్లుగా పుతిన్ రష్యా పూర్వప్రాభవాన్ని సంపాదించడానికి చేస్తున్న కృషినంతటినీ సిరియాలో సమాధి చేసుకోడానికి సిద్ధపడలేదు. సిరియాపై సైనిక చర్యను సహించడమంటే ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడికి దిగడానికి అనుమతించడమేనని పుతిన్‌కు బాగా తెలుసు. అందుకే తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధపడ్డారు. 70 శాతం అమెరికన్లేగాక, జర్మనీవంటి కీలకమైన యూరోపియన్ దేశాలు సైతం వ్యతిరేకిస్తుండగా సుదీర్ఘ యుద్ధానికి ఒబామా సిద్ధంగా లేరు. అయినా రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో సర్వం ఒడ్డి జూదమాడారు. ఆయన అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నమ్మకమైన మిత్రులనుకున్నవారిని అందరినీ దూరం చేసుకోవాల్సి వస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఒబామా రష్యా, చైనాలతో తలపడాల్సి వచ్చేసరికి తోక ముడిచారు. పరువు దక్కించుకోడానికి రష్యా ‘హామీ మేరకు’ సైనిక చర్యను విరమించారు. ‘నమ్మక ద్రోహం’ హడావిడిగా ఇరాన్ నూతన అధ్యక్షుడు హస్సన్ రుహానీతో ఒబామా మొట్టమొదటిసారిగా పోన్లో సంభాషించారు. దీంతో రష్యా ప్రతిపాదనకు అసద్ తల ఊపారు, అమెరికా కనుసన్నల్లోని ‘ఫ్రీ సిరియన్ నేషనల్ ఆర్మీ’ ఠక్కున అసద్‌తో శాంతి చర్చలకు అంగీకరించింది. రెండేళ్ల క్రితం నాటి రష్యా పాత ప్రతిపాదన... సిరియాపై జెనీవాలో శాంతి చర్చలకు తెరలేచింది. ఇరాన్‌తో అణు చర్చలకు కూడా హఠాత్తుగా దారి తెరచుకుంది. చకచకా జరిగిపోయిన ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలోని అమెరికా నమ్మకమైన మిత్రులంతా ఖంగుతిన్నారు. ఇరాన్, అమెరికాల మధ్య సయోధ్య కుదిరితే దానిపై ఆంక్షల ఎత్తివేత తథ్యం. అదే జరిగితే ప్రాంతీయ శక్తిగా ఇరాన్ సౌదీకేగాక, ఇజ్రాయెల్‌కు కూడా గట్టి పోటీదారవుతుంది. సిరియా, ఇరాన్ యుద్ధాలపై ఆ రెండు దేశాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. సౌదీ, ఖతార్‌లు సిరియాలోని అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద మూకలకు అపారంగా నిధులను సమకూర్చాయి. అమెరికా ైవె ఖరిని సౌదీతో పాటూ దాని నేతృత్వంలోని గల్ఫ్సహకార మండలి దేశాలన్నీ నమ్మక ద్రోహంగా పరిగణిస్తున్నాయి. భద్రతారాహిత్యానికి గురవుతున్నాయి. జూలైలో రష్యాతో రహస్య ఆయుధాల ఒప్పందం కోసం ప్రయత్నించిన బందర్ బుష్ నేడు తిరిగి రష్యా వేపు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఒంటరిగానైనా ఇరాన్ అణుకర్మాగారాలపై దాడులు చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా అరబ్బు దేశాలకు ‘ఆదర్శ నమూనా’గా అమెరికా కీర్తించే టర్కీ కూడా ఒబామాపై ఆగ్రహంతో ఉంది. సిరియాలో అసద్ పాలనను అంతం చేయడానికి పట్టుబట్టిన టర్కీ ప్రధాని రెసెప్ తెయ్యిప్ ఎర్డోగాన్ అమెరికా నూతన వైఖరితో తమ దేశ భద్రతపట్ల ఆందోళన చెందుతున్నారు. సహజంగానే ఇరాన్... రష్యా, చైనాలతో సత్సంబంధాల ద్వారా సిరియా నుంచి ముప్పును నివారించుకోవాలని ప్రయత్నిస్తోంది. నాటోలోని ఏకైక ముస్లిం మెజారిటీ దేశమైన టర్కీ నేడు నాటోయేతర క్షిపణి రక్షణ వ్యవస్థలపై ఆధారపడటం అవసరమని భావిస్తోంది. ఈయూలో చేరుతానని ఊరిస్తున్న ఎర్డోగాన్ యూరోపియన్ కంపెనీలను కాదని... క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం (ఎఫ్డీ-200) 300 కోట్ల డాలర్ల కాంట్రాక్టును చైనాకు కట్టబెట్టారు. పైగా ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నందుకుగానూ అమెరికా ఆంక్షలకు గురైన చైనా కంపెనీ సీపీఎమ్ఐఈసీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరోవంక ఈ నెల మొదటి వారంలో ఎర్డోగాన్ ప్రభుత్వం ఇరాన్‌తో సత్సంబంధాలకు పటిష్టమైన ‘వారథి’ని నిర్మించింది. ఇజ్రాయెల్ తరఫున గూఢచారులుగా పనిచేస్తున్న పది మంది ఇరానీయుల జాబితాను ఇరాన్‌కు అందజేసింది. దీంతో అమెరికా టర్కీకి తమ పేట్రియాట్ క్షిపణుల సరఫరాను నిలిపివేసిందనేది వేరే సంగతి. అమెరికా గూటి చిలుక అనుకున్న ఎర్డోగాన్ రెక్కలు గట్టుకొని కొత్త మిత్రులను అన్వేషించుకుంటున్నారు. దెబ్బ మీద దెబ్బ సిరియా సమస్యపై ఒబామాకు ‘నాకింగ్ పంచ్’ను (పడగొట్టే దెబ్బ) రుచి చూపించిన పుతిన్ అదే ఉత్సాహంతో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీస్తున్నారు. మధ్య ఆసియా ప్రాంతంలోని ఒకప్పటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్కుల చమురు సంపదపై రష్యా ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి అమెరికా, ఈయూలు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికి ఇదే సమయమని భావించారు. అందుకే యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధంగా ఉన్న ఉక్రేనియాకు హెచ్చరికను జారీ చేశారు. నవంబర్ చివర్లో ఈయూతో జరిగే సమావేశంలో ఉక్రెయిన్ ఆ ఒప్పందంపై సంతకాలు చేస్తే తమ ‘కస్టమ్స్ యూనియన్’ సభ్యత్వంపై ఆశ వదులుకోక తప్పదని తేల్చేశారు. ఉక్రెయిన్ విదేశీ వాణిజ్యంలో 36 శాతం వాటా రష్యా, బెలారస్, కజకిస్థాన్లతో కూడిన ఆ కూటమితో జరిగేదే. రష్యా కూడా ఈయూకు ప్రధాన వాణిజ్య భాగస్వామే. మిత్రుని మిత్రుడు మిత్రుడు కానవసరం లేదు. పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే. రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ జనాభాలో సగం మంది రష్యాతో అనుబంధానికే ప్రాధాన్యం ఇస్తారు. రష్యా మాట పెడ చెవిని పెడితే రష్యా జాతీయుల ఆధిక్యత ఉన్న తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తితే రష్యా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రధాని మెద్వదేవ్ స్పష్టం చేశారు. ఇది బ్లాక్ మెయిల్ కాదని, రష్యాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతి చర్యని ముక్తాయించారు. మధ్య ఆసియాలో రష్యన్ భల్లూకం తిరిగి పంజా విసురుతున్న సమయంలో అమెరికా ఆ ప్రాంతంలోని తమ ఏకైక సైనిక స్థావరాన్ని ఎత్తివేయక తప్పడం లేదు. క్రిజిగిస్థాన్ ప్రభుత్వం అమెరికా సైనిక స్థావరం కొనసాగింపునకు అంగీకరించలేదు... ఎందుకో చెప్పనవసరం లేదు. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్యపు రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలన్నిటినీ సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సి వస్తోంది. ఇదంతా రష్యా తిరిగి బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన ఫలితమో, చైనా అగ్రరాజ్యంగా మారిన ఫలితమో కాదు. అమెరికా ‘సామ్రాజ్య’ ప్రాభవం అస్తమిస్తున్న సూచన. -
అమెరికాలో అక్టోబర్ సంక్షోభం
ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలిగించేటట్టు ఉంది. నష్టనివారణ చర్యలు కోసం అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ‘ఎడ్వర్డ్ స్నోడెన్‌కు కృతజ్ఞతలు’ రెండురో జుల క్రితం అమెరికా పౌరులు కొందరు కేపిటల్ హిల్ అనేచోట ఊరేగింపుగా వెళుతూ ఇచ్చిన నినాదాలలో ఇదొకటి. ఇప్పుడు స్నోడెన్ అమెరికాకు ప్రథమ శత్రువన్న సం గతి ప్రపంచమంతటికీ తెలుసు. ‘ఈ సామూహిక గూఢచర్యం పనులు ఆపాలి!’ అని కూడా ఆ పౌర బృందం ఆక్రోశించింది. ఒక వ్యవస్థగా అమెరికాను స్వదేశీయులే ఎంత చీదరించుకుంటున్నారో చెప్పడానికి ఇదిచాలు. సందర్భం కూడా తలవంపులు తెచ్చేదే. తనకు అత్యంత ఆప్తమైన యూరప్ ఖండ పాలకుల ఫోన్ల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ అమెరికా అడ్డంగా దొరికిపోయింది. ఈ అక్టోబర్ 24న లండన్ నుంచి వెలువడే ‘గార్డియన్’ ప్రచురించిన ఒక వార్తా కథనం అగ్రదేశంలో అక్టోబర్ సంక్షోభానికి బీజం వేసింది. ‘2006, అక్టోబర్’కు చెందిన ఒక కీలక పత్రమే ఈ కథనానికి కేంద్రబిందువు. ప్రపంచంలో 200 మంది ప్రముఖుల, ప్రముఖ సంస్థల సెల్‌ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ చిరునామాలను సేకరించి, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)వారి సమాచారాన్ని రహస్యంగా తెలుసుకుంటున్న సంగతిని ఆ పత్రం రుజువు చేస్తోంది. ఎన్ఎస్ఏ మాజీ కాంట్రాక్టర్ అయిన స్నోడెన్ విడుదల చేసిన రహస్య పత్రాల గుట్టలలోనిదే ఇది కూడా. ‘గార్డియన్’ దీనిని అదను చూసి ప్రచురించింది. యూరోపియన్ యూనియన్ సమావేశాల కోసం ఆయా దేశాల అధినేతలంతా బ్రస్సె ల్స్‌లో సమావేశమవడానికి కాస్త ముందు ఆ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. అమెరికా గూఢచర్యానికి పాల్పడిన సంగతి తిరుగు లేకుండా రుజువు చేసింది. ఈ 200 మంది ఫోన్లు, ఈమెయిల్ చిరునామాలలో జర్మనీ చాన్సలర్ ఏంజెలినా మెర్కెల్ ఉపయోగించే మొబైల్ నెంబరు కూడా ఉంది. ఇది ఆ దేశానికి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. చరిత్ర సృష్టిస్తూ తను అధ్యక్షునిగా ఎన్నికైనపుడు (2011) ఒబామా పిలిచిన యూరప్ నుంచి ఆహ్వానించిన తొలి అతిథి మెర్కెల్. ఇప్పుడు ఆమె అమెరికాను నిలదీయాలని గట్టిగా కోరు కుంటున్నారు. బ్రస్సెల్స్ ఏర్పాటైన ఈయూ సమావేశం కూడా చర్చనీయాంశాలను పక్కన పెట్టి అమెరికా విపరీత చర్య గురించే ఎక్కు వగా ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలి గించేటట్టు ఉంది. నష్ట నివారణ చర్యలు చేప ట్టాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మెర్కెల్ మొబైల్ నుం చి ఎన్ఎస్ఏ సమాచారం సేకరిస్తున్న సంగతి తనకు తెలియదని, ఈ విషయం బహిర్గత మైన వెంటనే అధ్యక్షుడు ఒబామా అమాయ కత్వం నటించారు. అయితే గూఢచర్యం సం గతి 2010 సంవత్సరం నుంచి ఒబామాకు తెలుసునని జర్మనీ పత్రిక ‘బిల్డ్ ఏఎం సోన్టా గ్’ ఒక బాంబు పేల్చింది. మెర్కెల్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ వినే పనిలో అమెరికా గూఢచారి శాఖ ఉద్యోగి ఒకరు ఉన్నారని 2010లోనే ఎన్ ఎస్ఏ అధిపతి కీత్ అలెగ్జాండర్ ఒబామాకు నివేదించిన సంగతిని జర్మనీ పత్రిక వెల్ల డించింది. ఈ సంగతి విని ఒబామా ‘ఇంకాస్త సమాచారం కూడా సేకరించండి!’ అని ఆదే శించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మెర్కె ల్ నమ్మదగిన జర్మన్ కాదని ఒబామా నమ్మక మట. అమెరికా గూఢచర్యం గురించి జర్మనీ ఇప్పటికే అక్కడి అమెరికా రాయబారిని పిలిచి చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాల మీద శ్వేత సౌధం అధికార ప్రతినిధి కెయిట్లిన్ హేడెన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినా, ఒక పాత సత్యం కొత్తగా వెల్లడించారు. విదేశాలకు సం బంధించిన సమాచారాన్ని అమెరికా గూఢ చారి సంస్థలు సేకరించడం మామూలేనని ఆయన సెలవిచ్చారు. మెర్కెల్ నుంచి కాదు, ఆమెకు ముందు అధ్యక్ష పదవిలో ఉన్న జెరార్డ్ ష్రోడర్ ఫోను సమాచారం కూడా అమెరికా విన్న సంగతి కూడా బయటపడింది. సెప్టెం బర్ 11,2001 దాడుల తరువాత అమెరికా నిగూఢత, జవాబుదారీతనాలకు సంబంధిం చిన మొత్తం విలువలను విడిచిపెట్టేసిందని స్నోడెన్ పత్రం వ్యాఖ్యానించింది. దీని ఫలి తమే కావచ్చు, అమెరికా ఈయూకు చెందిన కార్యాలయాలు, ప్రముఖులకు చెందిన ఐదు లక్షల ఫోన్ కాల్సును రహస్యంగా సేకరిం చిందని తేలింది. 35 మంది ప్రపంచ ప్రముఖ రాజకీయ ప్రముఖులలో మెర్కెల్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా వాన్ రోసెఫ్, మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో వంటి వారి కాల్స్ ఎన్ఎస్ఏ చాటుగా వింటున్నదని ఆరోపణలు వచ్చాయి. ఇంకా రష్యా, ఇరాన్, రష్యా నాయకుల కాల్స్ కూడా ఆ సంస్థ లక్ష్యంగా ఎంచుకుంది. రష్యా, బ్రెజిల్ ఇప్ప టికే దీని మీది మండిపడుతుండగా, అమెరికా ఇక నమ్మకమైన దేశమేనని రుజువు చేసుకునే పని ఆ దేశానిదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యా ఖ్యానించారు. ఈ సంవత్సరాంతంలోగా ఈ అంశం మీద అమెరికాతో చర్చలు జరపాలని మెర్కెల్ అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికాను వెలివేసే ఉద్దేశం వీరికి ఎంతమా త్రమూ లేదు. ఇప్పుడు బహుశా ప్రపంచం అంతా ఎదురు చూసేది ఒక అంశం కోసమే కావచ్చు. అది- కేపిటల్ హిల్ తరహా ఊరేగిం పులు బలపడాలి. తమ ప్రభుత్వం మీద ఆ పౌరులు వినిపిస్తున్న వ్యతిరేక నినాదాలకు పదును రావాలి. - కల్హణ -
విద్యలో భారత్ మనల్ని అధిగమిస్తోంది: బరాక్ ఒబామా
న్యూయార్క్: గణితం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, చైనా అత్యుత్తమ విద్యను అందిస్తూ.. అమెరికాను దాటిపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి బీజింగ్ వరకు వందల కోట్ల మందికి ఉత్తమ విద్య అందించేందుకు ఆ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. బ్రూక్లిన్‌లో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తూ భారత్, చైనాల పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. -
‘ముప్పు’తిప్పల భారతం
బైలైన్: మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. శాంతి సాధనకు బలం తప్పనిసరి. పాక్‌కు నేడు మనకంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అని 1962 వరకు మనం భావించాం. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సురక్షితమైన మార్గానికి హామీని కల్పిం చడం కోసం బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు పలు వ్యూహాత్మక, ఆర్థిక నజరానాలు సమర్పించుకున్నారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌నే ఖంగు తినిపించిన ఒబామా ఈ నజరానాలపై భారత్ ఎలా స్పందిస్తుందోనని నిద్రను కరువు చేసుకోవాల్సిన అవసరమేముంటుంది గనుక. ఒబామా సెప్టెంబర్‌లో మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు విందు ఇచ్చి చక్కటి చిరునవ్వుతో సాగనంపారు. అక్టోబర్‌లో నవాజ్ షరీఫ్‌కు ఆయన అందించిన వంటకాల జాబితా భారత ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడేది కాదు. పాక్ అణు పాటవాన్ని, భారత అణు పాటవాన్ని ఒకే గాటన కట్టి ఆయన దక్షిణ ఆసియా సుస్థిరతను చాటారు. అంతా సజావుగా సాగితే ఇది అమెరికా, పాక్‌ల మధ్య అణు ఒప్పందానికి కూడా దారితీయవచ్చు. పాక్‌ను మన్మోహన్ ‘ఉగ్రవాద భూకంప కేంద్రం’గా పేర్కొన్నారు. అయితే అదేమీ ఒబామా చెవికెక్కలేదు. సరికదా భారత్ ఇంకా ఎదగాలని, కాశ్మీర్ సమస్యపై చర్చలు జరపాలని నవాజ్‌తో కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశారు. కాకతాళీయంగా అదేసమయానికి నాకు ‘ఇండియా ఎట్ రిస్క్: మిస్టేక్స్, మిస్కన్సెప్షన్స్ అండ్ మిస్ఎడ్వెంచర్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీ’ అనే జస్వంత్‌సింగ్ కొత్త పుస్తకం అందింది. లోతైన అవగాహనతోనూ, విశ్వసనీయంగానూ జస్వంత్ ఆ పుస్తకాన్ని రచించారు. అదే వారంలో నవాజ్ వాషింగ్టన్లో ఉండగా, జస్వంత్ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నారు. రష్యా రాజధాని మాస్కో నుంచి ఆయన అక్కడికి వెళ్లారు. జస్వంత్‌సింగ్ ఉన్నత సైనికాధికారే కాదు పెద్ద మనిషి. ఆయన ట్రిగ్గర్‌పై వేలు వేశారూ అంటే ఎప్పుడోగానీ గురి తప్పదు. భారత్ వ్యూహాత్మక సంస్కృతిని పెంపొందింపజేయలేదు. కాబట్టే మన దేశ భద్రత ముప్పును ఎదుర్కొంటోంది. ఒక సమగ్ర భావజాలంగా అభివృద్ధి చెందకుండానే నిలిచిపోయిన కొన్ని సమున్నతైనైతిక భావాలపై ఆధారపడి జవహర్లాల్ నెహ్రూ ఒక మూసలాంటి విధానాన్ని తయారు చేశారు. వాస్తవికత తన సదుద్దేశాలకు వ్యతిరేకంగా నిలిచినప్పుడలా ఆయన వాస్తవికతను తిరస్కరించారు. దేశ విభజన శాంతిని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసించారు. కాబట్టే పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించారు. స్వతంత్రం తదుపరి కొన్ని వారాల్లోనే కాశ్మీర్ కోసం పాక్ నిష్కారణంగా యుద్ధం ప్రారంభించింది. దీంతో ఆయన విధానాలు మతి మాలినవిగా మారాయి. శాంతి మంచిది అని ఆయన భావించారు కాబట్టే భారత సైన్యాన్ని దాని యుద్ధ లక్ష్యాలను పరిపూర్తి చేయకుండా నివారించారు. పాక్‌కు కాశ్మీర్ గేట్ అయిన ముజఫరాబాద్ వరకు మన సేనలు కదం తొక్కకుండా వారించారు. అందుకు బదులు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరారు. నాటి కాల్పుల విరమణ ఫలితంగా నేటికీ మన దేశం నెత్తురోడుతూనే ఉంది. చైనా కథ స్వల్పంగా భిన్నమైనదేగానీ అంతటి నషాన్ని కలుగజేసింది. చైనా తన మార్గాన్ని అనుసరించి అలీనోద్యమంలో భాగస్వామి అవుతుందని, శాంతి ప్రవక్తగా తన హోదాను ధృవీకరిస్తుందని నెహ్రూ ఆశించారు. కాబట్టే టిబెట్‌ను వ దిలి పెట్టేశారు. మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా 1950లో టిబె ట్ను దురాక్రమించింది. ఆ సమయంలో నెహ్రూ ‘జన చైనా రిపబ్లిక్‌తో సంబంధాలకు భారత్ చాలా విలువనిస్తుంది’ అంటూ బీజింగ్‌లోని భారత రాయబారి కేఎమ్ ఫణిక్కర్కు సలహా ఇచ్చారు. ఆ సూచను ఫణిక్కర్ గ్రహించారు. నెహ్రూ అతి తరచుగా చైనా ముందు మోకరిల్లుతున్నారని ఢిల్లీలోని మన విదేశాంగ శాఖ సైతం భావించింది. ఆచరణ ప్రాధాన్యమైన వాస్తవిక దృష్టిగల సర్దార్ పటేల్ భవిష్యత్తును స్పష్టంగా గ్రహించగలిగారు. టిబెట్‌పై నెహ్రూ వైఖరిపట్ల తన అసమ్మతిని తెలుపుతూ ఆయన ఒక సుదీర్ఘ లేఖను రాసారు. చైనా ప్రభుత్వం పంపిన ఒక టెలిగ్రాం ‘పూర్తి అమర్యాదకరంగా ఉంది. చైనా సైన్యం టిబెట్‌లో ప్రవేశించడం పట్ల మన నిరసనను లెక్కలేనట్టుగా అది తోసిపుచ్చిన తీరే కాదు, విదేశీ శక్తుల ప్రభావాలే మన వైఖరిని నిర్ణయించాయనే నిరాధారమైన ఆరోపణతో అది తన చర్యను సమర్థించుకోవడం కూడా అమర్యాదకరమైనదే. చైనా మాట్లాడుతున్న భాష ఒక మిత్ర దేశం మాట్లాడుతున్నట్టు గాక శత్రువుగా మారగల దేశం మాట్లాడుతున్నట్టుంది’ అని ఆయన ఆ లేఖలో అన్నారు. 1962 నాటి హిమాలయ యుద్ధ పరాజయం తదుపరి నెహ్రూలోని భవిష్యత్తును దర్శించగల ద్రష్ట వెయ్యిసార్లు మరణించారు. అమెరికా పెట్టిన షరతులన్నిటికీ తలొగ్గి ఆయుధాల కోసం ఆయన దాన్ని అర్థించ వలసి వచ్చింది. పాక్ సరిహద్దుల్లోని భారత బలగాలను బాగా తగ్గించి, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలనేది ఆనాడు అమెరికా విధించిన షరతుల్లో ఒకటి. ఆ విషయం ఒబామాకు కూడా బాగానే తెలుసు. మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. కానీ శాంతి సాధనకు బలం కలిగి ఉండటం తప్పనిసరి. మిగులు సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమనే బ్రిటన్ విధానాన్ని స్వతంత్ర భారతం విడిచిపెట్టేసింది. కాగా పాక్, చైనాలు మిగులు సైనిక సామర్థ్యం విలువను గుర్తించాయి. పాక్‌కు నేడు మన కంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. అలాగే అవి ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలు కూడా ఎక్కువ. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అంటూ 1962 వరకు భారత్ సైన్యం ప్రాధాన్యాన్ని దాదాపు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది. గత ఆరు దశాబ్దాలుగా భారత్, పాక్, చైనా, రష్యా, అమెరికాల మధ్య వ్యూహాత్మక అనుసంధానాలు నిలకడగా నిలిచినవీ కావు, సరళ రేఖలుగా సాగుతున్నవీ కావు. ఏ దేశం బలహీనమైన లింకు అనేదే అన్ని కాలాల్లోనూ పెద్ద ప్రశ్నగా ఉంటోందనేది స్పష్టమే. వ్యూహాత్మకమైన కథనం అంటే నీతి కథ కాదు. ద్వంద్వవాదం అంటే వంచన కాదు ప్రతి దేశమూ ప్రతి అనుబంధపు బలాన్నీ ఎప్పటికప్పుడు తిరిగి కొలవాలని చూస్తూనే ఉంటుంది. ఆధునిక భారతదేశం ఒక విలక్షణమైన జన్యువును పెంచి పోషించుకుంటూ వచ్చింది. అది ఏదో ఒక సమున్నత ఆశయాన్ని సాధించాలనే తపనతో మన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేస్తోంది. మన్మోహన్ ఒక దశాబ్దమంతా పాక్‌తో శాంతి కోసం పాకులాడారు. అయితే బలహీనంగా వణికే కాళ్లతో మనం ఎవరితోనూ కరచాలనం చేయలేం. వాస్తవ ప్రపంచం ఉదాసీనంగా భుజాలెగరేసి ఇతరత్రా తన ఏర్పాట్లేవో తాను చేసుకుంటుంది. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
‘5+1’ చరిత్ర సృష్టిస్తుందా?
ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఇరాన్ అణు సమస్యపై తన నూతన వైఖరికి కట్టుబడితే అణు సంక్షోభం మటుమాయమై పోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం చిత్తభ్రాంతి. అలా కనిపించేట్టు చేయడం కనికట్టు. జెనీవాలో మంగళ, బుధవారాల్లో జరిగిన ఇరాన్ అణు చర్చలపై పాశ్చాత్య మీడియా కథనాలను చూస్తుంటే... అది చిత్తభ్రాంతికి గురయ్యిందా? లేక కనికట్టును ప్రదర్శిస్తోందా? అని అనుమానం రాక మానదు. జర్మనీగాక ఐదు భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు (5+1) ఇరాన్‌తో జరిపిన చర్చలు ఆశావహంగా జరిగిన మాట నిజమే. కాకపోతే ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రొహానీ చొరవ అందుకు కారణమనడమే ఈ అనుమనాన్ని రేకెత్తిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావెద్ జారిఫ్ ‘వినూత్న’ ప్రతిపాదనలను (జారిఫ్ ప్యాకేజీ) బహిరంగపరచలేదు. అవే ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని సుసాధ్యం చేస్తున్నాయని మీడియా అంటోంది. ‘దుష్టరాజ్యం’ ఇరాన్‌తో అమెరికా ‘స్నేహ బంధానికి’ అవకాశాలను సైతం కొందరు విశ్లేషకులు చూస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్లు చర్చల్లో గొప్ప పురోగతిని చూస్తుంటే... ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి! మూడు దశాబ్దాలకు పైగా అమలవుతున్న దుర్మార్గమైన ‘ఆంక్షలను పూర్తిగా వినియోగించుకోకుండానే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించకముందే సడలింపులకు అంగీకరించడం చారిత్రక తప్పిదం’ అని మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఆ ‘చారిత్రక తప్పిదం’ చేయడానికి అమెరికా సిద్ధపడింది కాబట్టే జెనీవా చర్చల్లో పురోగతి సాధ్యమైంది! అంతర్జాతీయ అణుశక్తి సంఘం నిబంధనలకు లోబడి ఇరాన్ అణు కర్మాగారాలలో జరిగే తనిఖీలతో పాటూ ఆ దేశంపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేయడం కూడా జరగాలనేది ‘జారిఫ్ ప్యాకేజీ’లోని ప్రధానాంశం. ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఇజ్రాయెల్ డిమాండునే ముందు షరతుగా పెట్టి అమెరికా గత ఏడు దఫాల చర్చలు విఫలం కావడానికి కారణమైంది. ఆ షరతును నేడు అమెరికా ఉపసంహరించింది. ఫలితంగా వచ్చే నెలలో జరగనున్న చర్చల్లో అమెరికా ఇరాన్‌కు ఉన్న ‘అనుల్లంఘనీయమైన అణు హక్కులను’ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఒబామా అందుకు సిద్ధమే. చర్చలకు ముందే ఇరాన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తమ ‘రెడ్ లైన్’ అదేనని స్పష్టం చేశారు. నిజానికి నేటి ప్రతిపాదనలన్నీ ఇరాన్ 2001 నుంచి చేస్తున్నవే. సుప్రీంనేత ఆయతుల్లా ఖమేనీ మధ్యప్రాచ్యంలో పూర్తి అణ్వస్త్ర నిషేధాన్ని ప్రతిపాదించారు! నిజంగానే అణు బాంబులున్న ఇజ్రాయెల్ కోసం అమెరికా అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఇరాన్ తమ అణు హక్కుల గుర్తింపునకు బదులుగా అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని విరమించుకోడానికి సిద్ధంగా ఉంది. ‘నిరర్థకమైన ఇరాన్ సంక్షోభానికి’ ఇకనైనా స్వస్తి పలికి, ‘అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఇరాన్ అణు హక్కులను గుర్తించి’ సమస్యను పరిష్కరించాలనేది ఒబామా నూతన వైఖరి. ఊగిసలాటకు మారుపేరైన ఒబామా ఈ నూతన వైఖరికి కట్టుబడితే ఇరాన్ అణు సంక్షోభం మటుమా యమైపోతుంది. ఆయన ఆ సాహసం చేయగలిగితే మధ్యప్రాచ్యంలోని బలాబలాల సమతూకంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టినవారవుతారు. ఇజ్రాయెల్, సౌదీల వంటి పాత ‘నమ్మకమైన’ మిత్రులను దూరం చేసుకోవాల్సి రావచ్చు. ఇంతవరకు ఆ ప్రాంతంలో అమెరికా విధానానికి ఇజ్రాయెల్, సౌదీలే ప్రధాన ఆధారం. సౌదీ కాబోయే రాజుగా భావిస్తున్న బందర్ బిన్ చర్చల్లో తమకు స్థానం కల్పించనందుకు గుర్రుగా ఉన్నారు. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతంటే అరబ్బు ప్రపంచంలో తమ ప్రాబల్యం అంతరించిపోవడమేనని భావిస్తున్నారు. ప్రాం తీయ శక్తిగా ఇజ్రాయెల్ స్థానానికి ముప్పు తప్పదని నెతన్యాహూ ఆందోళన. ఇరాన్‌తో సయోధ్య ఇంధన సమస్యకు పరిష్కారం కాగలదని ఈయూ దేశాల ఆశ. ఏకైక అగ్రరాజ్యం తన మధ్యప్రాచ్య విధానాన్ని సమూలంగా మార్చుకునే చారిత్రక సన్నివేశం కోసం రష్యా, చైనాలు వేచి చూస్తున్నాయి. సిరియాపై యుద్ధాన్ని విరమించి ఇప్పటికే ఇజ్రాయెల్, సౌదీల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఒబామా అడుగు వెనక్కు వేయకుండా ఉంటారా? - పి. గౌతమ్ -
అమెరికా చెప్పిందే వేదం!
విశ్లేషణ: ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగనతలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడలువంచుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అమెరికా పర్యటన ముగించు కుని తిరిగి వచ్చారో లేదో, ఆ దేశం కొంప కొల్లేరయింది. మన్మోహన్‌ది ఐరన్లెగ్గా? లేదా, మన దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొని వెళ్లి అక్కడ కలరా వ్యాధిలా అంటించి వచ్చారా? ఈ రెండూ కాదు. మరేమిటి? పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కరోజైనా చర్చించకుండా, చివరి రోజు, ఆఖరు నిమి షంలో ఆమోదముద్ర పడిందనిపించారు. కానీ, అమెరికా వారు మన పార్లమెంటు సభ్యులకన్నా రెండాకులు ఎక్కువే చదువుకొన్నట్లున్నారు. వాళ్లు ససేమీరా, మేము వ్యతిరేకి స్తాం, నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతో వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి. కింది సభలో ఒబామాకు మెజారిటీ ఉంది. పైసభలో పెత్తనం రిపబ్లిక్ పార్టీదే. ఇంతకు లడాయి ఎందుకు ఏర్పడిందంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక బిల్లు పెట్టి, దానికి నిధులు కేటాయించి బడ్జెట్ తయారు చేయగా దానిని రైటిస్టులైన రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. అలాగని ఒబామా లెఫ్టిస్టు ఏమీ కారు. రెండు పార్టీలూ పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థించేవే. మన దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌లోనే (వైఎస్ జమానాలో తప్ప) కొట్టుకు చావటం లేదూ? అయినా ఈ వ్యాస పరిమితుల్లో రిపబ్లికన్లదే ఐరన్ లెగ్. భారత్‌పై నిఘా నేత్రం ప్రధాని అమెరికా పర్యటనకు ముందు కొద్ది మాసాల క్రితమే ఆ దేశ నిఘా నేత్రం మన దేశం మీద పడిందని, అటు అమెరికాలో భారతదేశ కార్యాలయం నుంచి మన విదేశీ శాఖకు మధ్య, అలాగే ఉభయ దేశాల వ్యాపార సంస్థల మధ్య, రాజకీయ నాయకుల మధ్య జరిగే సంభా షణలు, ఇ-మెయిల్స్ లాంటివన్నింటినీ అమెరికా గూఢ చారి సంస్థ రహస్యంగా వింటున్నదని ఆ నిఘా వ్యవస్థలో పనిచేసిన స్నోడెన్ బాంబు పేల్చాడు. ఆ సమాచారంలో రక్షణశాఖ గురించి కూడా వివరాలున్నాయి. అంటే మన దేశ రక్షణ రహస్య సమాచారమంతా అమెరికా గుప్పిట్లో ఉందన్నమాట. బడ్జెట్ సమయంలో ఈ శాఖ మీద చర్చ నిషిద్ధం. స్వతంత్రం వచ్చినప్పుడు, రక్షణ, విదేశాంగ, కరెన్సీ సంబంధిత విషయాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనూ, మిగతా శాఖలన్నీ రాష్ట్రాల పరిధిలోనూ ఉం టాయని ప్రకటించారు. ఇప్పుడు మన రక్షణశాఖ రహ స్యాలన్నీ అమెరికాలో గూఢచారిశాఖ చేతికి చేరాక అది రహస్యమెలా అవుతుంది? మన దేశ రక్షణ గురించి మన కు తెలియదు, ఇతర దేశాలకు తెలుసు. అమెరికా పాకి స్థాన్‌ను పరోక్షంగా సమర్థిస్తూ వచ్చినప్పుడు, రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేయలేదని, లేదా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సయోధ్య ఏర్పడకుండా ఆ సమాచారాన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నదనేది తిరుగులేని సత్యం. ఇదేమీ రహస్యం కాదు. ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి రక్షణశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2005లోనే అమెరికా వెళ్లి ఈ శాఖ గురించి ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత అమెరికా మన దేశం మెడకు ఉచ్చు బిగిస్తూనే ఉంది. గగన తలం, భూఉపరితలం మీద, సమ్రుదంపై సంయుక్తంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి ఆ శాఖ సీనియర్ అధికారులు వచ్చి మన దేశ ప్రధాని మెడ లువంచుతూనే ఉన్నారు. మొన్న మొన్ననే ప్రధాని అమె రికా వెళ్లి, కొత్త రక్షణ ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. రక్షణశాఖల సమాచారాన్ని సేకరించడంలో మరో ముఖ్యై మెన కోణం భారత్-చైనా సంబంధాలు. అమెరికాకు చైనా కొరకురాని కొయ్య. ప్రపంచాధిపత్యం కోసం అది కంటు న్న కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి. అమెరికా కనుసన్నల్లోనే... 1999లో ఆర్థిక సంస్కరణల పేరుతో దేశంలో ప్రవేశిం చినా, అది కేంద్ర ప్రభుత్వం వరకే పరిమితమైంది. రాష్ట్రా ల్లోకి ప్రవేశం లభించలేదు. దుర్భిణీ వేసిచూస్తే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించగా గాలం వేసి పట్టుకున్నారు. తన సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకును గట్టిగా వాటే సుకున్నారు. రాష్ట్రాల్లో ప్రవేశించడానికి అమెరికాకు (ప్రపం చ బ్యాంకు సృష్టే) అవకాశం లభించింది. కేంద్రం మీద ఉడుంపట్టును సాధించిన తర్వాత చంద్రబాబును బుట్టలో వేసుకోవడంతో, త్వరత్వరగా రాష్ట్రాలు ఆ వలలో చిక్కుకొనిపోయాయి. అప్పు చేస్తేనే అభివృద్ధి అనే పరి స్థితిని సృష్టించగా, ప్రస్తుతం దేశం, రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాయి. ప్రస్తుతం ఇండియా జుట్టు అమెరికా చేతుల్లో చిక్కుకొనిపోవడమే కాకుండా, పరిపా లనా యంత్రాంగాన్ని కూడా ప్రభావితం చేసింది. ఇప్పు డు గ్రామంలో చెరువు తవ్వాలన్నా, హైదరాబాద్ నగరం లో కొన్ని బస్సులు తిరగాలన్నా కూడా ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుతోనే సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మా దేశంలో ఇలా అంతర్గత విషయాల్లో తలదూర్చటం భావ్యమా అని ఒబామాను ప్రశ్నించే దమ్ము మాట అటుం చి, మన ప్రధాని కనీసం ఆ ప్రస్తావనైనా చేశారా? ఎందు కంటే సంస్కరణలు ప్రవేశపెట్టింది ఆయనే. ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన ఆంధ్రుడే. ఆయనే పీవీ నర సింహారావు. ఫలితంగా దేశం ఇవాళ ఇంతగా దిగజారడా నికి కారణం ఈ ప్రధానే. ప్రధాని భారతీయుడే కాని ఆలో చనలు, ఆచరణ అమెరికావి. ఏమి సాధించారు? అమెరికా వెళ్లి మన ప్రధాని ఒబామాతో ఏమి చర్చిం చారు? (గుసగుసలాడారంటే వాస్తవానికి దగ్గరగా ఉం టుంది) ఆ చర్చలతో దేశానికి ఏమి సాధించారని చూడ బోతే- ఒకటి కొత్త రక్షణ ఒప్పందం, రెండు గుజరాత్లో అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు. తన కల నిజం కావాలంటే చైనాను దెబ్బతీయాలి. ఇండియాను బుజ్జగించి అమెరికా సైనికస్థావరాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకుంటే, చైనా అడ్డు తొలగించుకోవచ్చుననే తన వ్యూహంలో భాగంగా అది ఇండియాను దువ్వు తోంది. చైనా-భారత్ సరిహద్దులో చెదురుమదురుగా జరిగే సంఘటనలను ఆసరా చేసుకుని భారత్-చైనా సంబంధాలను చెడగొట్ట డానికి అమెరికా వేసుకున్న వ్యూహంలో భాగంగానే భారత్‌తో కొత్తగా రక్షణ ఒప్పం దం చేసుకుంది. కానీ ఇటీవల ఏర్పాటైన బ్రిక్స్‌లో ఇటు మనదేశం, అటు చైనా సభ్యులు కావటం అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోతుందని ఈ శతాబ్దం ప్రారంభంలో ఆర్థిక శాస్త్ర వేత్తలు ప్రకటించారు. ప్రపం చంలో జరుగుతున్న పరిణా మాలు చూస్తే అది నిజం కాబోతుందనే నమ్మకం కలుగు తుంది. కాగా మన రక్షణ శాఖను అమెరికా నిఘా నేత్రం నుంచి తప్పించడానికి తగు చర్యలుతీసుకోకపోగా, దేశాల మధ్య అలాంటివి జరగటం మామూలేనని మన రక్షణ శాఖ మంత్రి స్పందించటం దేశ రక్షణ పట్ల ప్రభుత్వం ఎంత నిష్పూచీగా, నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఇంత ప్రమాదకర పరిస్థితిలో దేశం ఉండగా, ప్రధాని అమెరికాతో ఒప్పందం చేసుకొని రావటం దేశానికి వెన్నుపోటు పొడవడమే. స్నోడెన్ వెల్లడించిన విషయం నిజమా! నిజమైతే అది మంచిది కాదు అనైనా అడక్కపోవడం క్షంతవ్యం కాదు. ‘బహుళ’ ప్రయోజనమే మిన్న అమెరికా-భారత్ సంబంధాల్లో రక్షణ రంగం ఒక్కటే కాదు. ప్రపంచ బ్యాంకు విండో ద్వారా, అమెరికా చొరబ డని మంత్రిత్వశాఖ, రాష్ట్రంగాని లేవే. ఈ గొడవలన్నీ ప్రజ లకు పట్టవు. కొన్నేళ్ల క్రితం రష్యాలో జరిగిన అణు విస్ఫో టనం తర్వాత, అమెరికాలో ఈ యంత్రాలను తయారు చేసే బహుళజాతి సంస్థలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో పాటు జపాన్ విస్ఫోటనం కూడా వర్దమాన దేశాల్లో భయం పుట్టించింది. ఫలితంగా అణు విద్యుత్ కేంద్రా లను తయారు చేసే అమెరికా కార్పొరేట్ సంస్థల్లో గుబులు ప్రారంభమైంది. తమకు మార్కెట్ కల్పించాలని ఆ సం స్థలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తేగా, ఆ ప్రభుత్వం భారతదేశం మీద తన రాజకీయార్థిక పెత్తనాన్ని ఉపయో గించి సూత్రప్రాయంగా అంగీకరింపచేసింది. అయితే ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే నష్టాన్ని యంత్రాలు తయారు చేసే కంపెనీలు భరించాలనే వాదన ప్రారంభ మైంది. మేము ఇంతే ఇస్తాం అని వాళ్లు, పూర్తిగా భరించాలని మన దేశం పట్టుపట్టారు. ఆ విషయమైనా ప్రధాని ఒబామాతో చర్చించారా? ప్రధాని అసలే మిత భాషి. ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన చేయక పోగా, గుజరాత్లో అణు కేంద్రం ఏర్పాటుకు అంగీకరిం చారంటే, ఆయనకు దేశ రక్షణకన్నా, బహుళ జాతి సంస్థల లాభనష్టాలు గురించే ఎక్కువ పట్టింపు. ఈయనను మళ్లీ ప్రధానిగానూ, ఆయన ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌నూ వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం. -
రెక్క విప్పుతున్న జపాన్ ‘డేగ’
చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లాగే అబే కూడా ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. అంతర్జాతీయ వాణిజ్యం చైనా ప్రధాన అస్త్రం. జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. ‘ఒకే పర్వతంపై రెండు పులులు మనలేవు.’ప్రాచీన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల చైనాపై విరుచుకుపడ్డారు. విపరీతంగా పెరిగిపోతున్న జపాన్ రక్షణ వ్యయం పట్ల గత నెల చివర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జపాన్ ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద సైనిక బడ్జెట్గల దేశం. ఈ ఏడాది అది సైనిక దళాలపై 5 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేయనుంది. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో (జీడీపీ) 10 శాతాన్ని సైన్యంపై ఖర్చు చేస్తుండగా, తాము 3 శాతాన్నే ఖర్చు చేస్తున్నామని అబే అక్కసు. ప్రపంచంలోని మూడవ అతి పెద్ద దేశమైన చైనాతో 65వ స్థానంలో ఉన్న జపాన్ రక్షణ వ్యయాన్ని పోల్చడం అర్థరహితం. చైనా గత కొన్నేళ్లుగా 10 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుండగా, జపాన్ ఈ ఏడాదే వృద్ధి బాట పట్టింది. ప్రపంచంలోని రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని చైనా నుంచి తిరిగి దక్కించుకోగలమని అబే విశ్వాసం! అందుకే అబే ‘ఆసియా పర్వతంపై’ చైనా స్వేచ్ఛా విహారాన్ని సహించలేకుండా ఉన్నారు. ఆయన తరచుగా జపాన్ ‘గత వైభవాన్ని’ గుర్తుచేసుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఇతర దేశాలపై సాగించిన దురాక్రమణ యుద్ధాలకు ఒకప్పటి ప్రధాని తమీచి మురయామా క్షమాపణలు చెప్పడాన్ని సమర్థించడం లేదని అబే సెలవిచ్చారు. అసలు ‘దురాక్రమణ’ అంటేనే ఎవరూ ఇదమిత్థంగా నిర్వచించలేదని వాదించారు. ‘వివిధ దేశాల మధ్య ఘటనలు మనం ఎక్కడ నిలబడి చూస్తున్నాం అనే దాన్ని బట్టి విభిన్నంగా కనిపిస్తాయి’ అని అన్నారు. 1910 నుంచి 1945 వరకు జపాన్ కొరియాను దురాక్రమించి, అత్యంత పాశవిక అణచివేత సాగించింది. 1931-37 మధ్య అది చైనాలోని సువిశాల భాగాన్ని ఆక్రమించింది. ఒక్క నాంకింగ్లోనే రెండు లక్షల మంది చైనీయులను ఊచకోత కోసింది. 1941లో పెరల్ హార్బర్ (అమెరికా) దాడితో ప్రారంభించి థాయ్‌లాండ్, మలయా, బోర్నియా, బర్మా, ఫిలిప్పీన్స్‌లపై దండెత్తింది. ఆసియా దేశాల మహిళలను సైన్యపు లైంగిక బానిసలుగా దిగజార్చిన హేయ చరిత్ర నాటి జపాన్‌ది. జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం అది ‘యూనిట్ 731’ను ఏర్పాటు చేసింది. కొరియా, చైనా, రష్యా తదితర దేశాలకు చెందిన లక్షలాది మందిని ‘ప్రయోగాల’ కోసం హతమార్చింది. అబే ఆ స్థానం నుంచి ‘గత వైభవాన్ని’ చూస్తున్నారు. ఈ ఏడాది ‘731 యూనిట్’ సంస్మరణ సభకు హాజరై ‘731’ అని ప్రముఖంగా రాసి ఉన్న యుద్ధ విమానం కాక్‌పిట్‌లో ఎక్కి మరీ ఫొటోలు దిగారు! ‘అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి బెదిరింపులను లేదా బలప్రయోగాన్ని జపాన్ శాశ్వతంగా తిరస్కరిస్తుంది’ అనే రాజ్యాంగంలోని నిబంధనకు తిలోదకాలివ్వడానికి ‘దేశ రక్షణకు చట్టపరమైన ప్రాతిపదిక పునర్నిర్మాణ సలహా మండలిని’ అబే నియమించారు. జపాన్ ‘రక్షణకు’ ఇప్పటికే ఐదు లక్షల సేనలతో త్రివిధ దళాలున్నాయి. ఆత్యాధునిక క్షిపణులు తప్ప సకల సాయుధ సంపత్తి ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులపై ఫిలి ప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు చైనాకు మధ్య వివాదాలు రగులుతున్నాయి. జపాన్ ఇదే అదనుగా ఒకప్పటి తన వలసవాద అవశేషమైన సెనెకాకు దీవులను ‘జాతీయం’ చేసి చైనాతో కయ్యానికి కాలుదువ్వింది. ఆ సాకుతో చైనా బూచిని చూపి అబే దేశాన్ని సైనికీకరించాలని యత్నిస్తున్నారు. తనలాగే అమెరికా సైనిక స్థావరాలున్న దేశమైన ఫిలిప్పీన్స్‌తో జపాన్ చేయి కలిపింది. భారత్‌తో సైనిక సహకారానికి ఉవ్విళ్లూరుతోంది. అణు వ్యాపా ర భాగస్వామ్యంతో భారత్‌ను అమెరికా, జపాన్ల చైనా వ్యతిరేక వ్యూహంలో భాగస్వామిని చేయాలని అశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలాగే అబే కూడా వర్తమాన ప్రపంచ పరిణామాలకు వెనుకబడిపోయారు. చైనా ‘శాంతియుతంగా’ ఆధిపత్యపోరు సాగిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం దాని ప్రధాన అస్త్రం. ప్రపంచ వాణిజ్యం లో చైనాదే అగ్రస్థానం. జపాన్ విదేశీ వాణిజ్యంలో సైతం అమెరికా తర్వాత ద్వితీయ స్థానం చైనాదే. ఏటా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ 30,000 కోట్ల డాలర్లు! జపాన్‌తో పాటు తూర్పు ఆసియా దేశాలన్నీ నేడు చైనాతో వాణిజ్యంపై ఆధారపడి ఉన్నాయి. గత వారం ఇండోనేసియాలోని బాలీలో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో (ఎపెక్) చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ కేంద్ర బిందువుగా నిలవడం అదే సూచిస్తోంది. చైనాను చూసి కాకపోయినా జర్మనీని చూసైనా అబే ‘శాంతియు తం’గా ఆర్థిక ప్రాభవం కోసం ప్రయత్నించడం ఉత్తమం. - పిళ్లా వెంకటేశ్వరరావు -
మా బిల్లులను చెల్లిస్తాం: బరాక్ ఒబామా
వాషింగ్టన్: అమెరికా తన బిల్లులను చెల్లిస్తుందని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చారు. రుణ పరిమితిని పెంచితే, ఆర్థిక మార్కెట్లు కుదేలవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించినా, ఒబామా ఈ మేరకు భరోసా ఇవ్వడం గమనార్హం. అమెరికా ఇప్పటి వరకు తన బిల్లులను చెల్లిస్తూ వచ్చిందని, ఇకపై కూడా చెల్లిస్తుందని ఒబామా చెప్పారు. ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామిక దేశంలోనూ బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ప్రపంచ నేతల్లో పలువురు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికన్ కాంగ్రెస్‌లోని ఒక పార్టీ తమ పంతం నెగ్గకుంటే పరిస్థితిని తలకిందులు చేస్తుందనే అపోహలో పలువురు ప్రపంచ నేతలు ఉన్నారని, ముఖ్యంగా 2011 నాటి పరిణామాల దృష్ట్యా వారు కలత చెందుతున్నారని అన్నారు. అయితే, దివాలా తీసే పరిస్థితి వాటిల్లుతుందని ఎవరూ తమను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, వారు బెదిరింపులకు దిగితే చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ బోహ్నెర్కు ఫోన్ ద్వారా తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వల్పకాలానికి రుణ పరిమితిని పెంచేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఒబామా చెప్పారు. వారం రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలకాల్సిందిగా రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదం మరికొంతకాలం కొనసాగగలదని ఒబామా అభిప్రాయపడ్డారు. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలోని కీలక ఉగ్రవాద నేతలు హతమైనప్పటికీ, ఉగ్రవాదం బెడద మరికొంత కాలం కొనసాగవచ్చని అన్నారు. లిబియాలో అమెరికన్ బలగాలపై జరిగిన దాడికి కుట్ర పన్నిన అల్‌కాయిదా నాయకుడు అబు అనస్ అల్ లిబీని చట్టం ముందుకు తెస్తామని అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు సైనిక వ్యూహాలే కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలు అవసరమని చెప్పారు. -
ముగింపు పలకాలి... : ఒబామా
వాషింగ్టన్: అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదించడంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో మొదలైన షట్‌డౌన్ ఐదో రోజూ కొనసాగింది. అత్యవసర సర్వీసులు మినహా మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగలేదు. అధికార డెమోక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందో తెలియడంలేదు. కాగా, తన మానసపుత్రిక ‘ఒబామాకేర్’ బీమా బిల్లుపై వెనక్కి తగ్గేది లేదని అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఏ విధమైన మార్పులు, చేర్పులు లేకుండా బిల్లును ఆమోదించాలని ప్రతిపక్షాలకు మరోసారి సూచించారు. ప్రస్తుత షట్‌డౌన్ పరిస్థితి వల్ల రుణాలు చెల్లించకపోతే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అందుకే బడ్జెట్‌ను ఆమోదించి ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని తన వారాంతపు సందేశంలో ప్రతిపక్షాలను కోరారు. మరోవైపు జీతాలు కోరకుండా పనిచేయాలని ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని చట్టాల చట్రంలో ఎంతోకాలం బంధించలేరని, పుట్టబోయే బిడ్డని ఆపడం వారి వల్ల కాదని చెప్పారు. అయితే ఈ నెల 17 లోపు రుణపరిమితి పెంపుపై అమెరికా చట్టం చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా, షట్‌డౌన్ ముగిసిన తర్వాత సుమారు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు షట్‌డౌన్ కాలానికి జీతాలు చెల్లించేందుకు అమెరికా ప్రతినిధుల సభ అంగీకరించింది. రిపబ్లికన్ల ఆధిక్యం గల ప్రతినిధుల సభ శనివారం ఈ మేరకు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. -
ఒబామా కొలువులో మరో భారతీయుడు
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మరో అత్యున్నత పదవి లభించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా కేరళకు చెందిన అరుణ్.ఎం.కుమార్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. క్లిష్టపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాను గాడిన పడవేయడానికి ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వరకు అరుణ్ కుమార్ కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యునిగా ఉన్నారు. శుక్రవారం అసిస్టెంట్ సెక్రటరీగా, అమెరికా విదేశీ వాణిజ్యసేవల విభాగం, అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అరుణ్ గత నెల వరకు వెస్ట్‌కోస్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అధిపతిగా పనిచేశారు. 2007-2013 మధ్య అమెరికా-భారత వ్యవహారాలను పర్యవేక్షించారు. కేరళ వర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో పట్టా పొందిన అరుణ్ అమెరికా వెళ్లి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్మెంట్లో డి గ్రీ పుచ్చుకున్నారు. -
అమెరికాలో అదే ప్రతిష్టంభన
వాషింగ్టన్: వార్షిక బడ్జెట్ ఆమోదం పొందని నేపథ్యంలో అమెరికాలో నెలకొన్న ఆర్థిక ప్రతిష్టంభన, రాజకీయ సంక్షోభం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఒబామాకేర్’ వైద్య పాలసీపై కాంగ్రెస్‌లో తలెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో మంగళవారం మొదలైన ‘షట్‌డౌన్’ ప్రభావం అగ్ర రాజ్యంపై తీవ్రంగా పడుతోంది. రక్షణ, తపాలా వంటి అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇంకా మూతబడే ఉన్నాయి. దాదాపుగా 8 లక్షల పై చిలుకు ప్రభుత్వోద్యోగులు ‘వేతనం లేని సెలవులు’ గడుపుతున్నారు. జాతీయ పార్కులు, ప్రముఖ పర్యాటక స్థలాలు, కార్యాలయాలతో పాటు ప్రభుత్వ వెబ్సైట్లు కూడా మూగబోయే ఉన్నాయి. అక్టోబర్ 17 లోగా సమస్య పరిష్కారం కాకపోతే అమెరికా ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండని పరిస్థితి తలెత్తనుంది! కానీ డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మాత్రం పరిస్థితికి కారణం మీరంటే మీరంటూ పరస్పరం నిందారోపణలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీనిపై ఒబామా, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య గురువారం జరిగిన భేటీ కూడా ఎటూ తేలకుండానే ముగిసింది. షట్డౌన్కు దారితీసిన పరిస్థితులతో తాను తీవ్రంగా విసిగిపోయానని ఒబామా అన్నారు. అమెరికా సర్కారునే దివాలా తీయించేలా ఉన్న ఈ పరిణామాలపై పెట్టుబడిదారులతో పాటు వాల్‌స్ట్రీట్ కూడా ఆందోళన చెందాలంటూ హెచ్చరిక స్వరం విన్పించారు. అయితే, ‘రిపబ్లికన్లతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో నా పదవీకాలంలో చాలాసార్లు పట్టువిడుపులతో వ్యవహరించాను. అందుకే నన్ను మరీ మెతక మనిషిగా కూడా అంతా భావిస్తుంటారు. ఈసారి మాత్రం నేనెలాంటి ఒత్తిళ్లకూ లొంగేది లేదు. బడ్జెట్‌ను కాంగ్రెస్ తక్షణం ఆమోదించి సమస్యకు ముగింపు పలకాలి’’ అని సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుకు తాత్కాలికంగానైనా సరే, ముందుగా ఆమోదం పడాల్సిందేనన్నారు. ఈ విషయమై రిపబ్లికన్లతో ఎలాంటి బేరసారాలకూ సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. -
షట్‌డౌన్‌ను ముగించండి: బరాక్ ఒబామా
వాషింగ్టన్: ప్రతిపాదిత ఆరోగ్య బీమా పాలసీకి, బడ్జెట్‌కు అమోదం లభించక ప్రభుత్వ కార్యాలయాలు మూసివేతకు దారి తీసిన పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడానికి అవకాశం లేకుండా రిపబ్లికన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా బిల్లులు ఆమోదించాలని, డ్రామాలు ఆడకుండా ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌కు సూచించారు. ‘ఈ షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితులు ఘోరంగా మారతాయి. చాలా కుటుంబాలు ఇబ్బంది పడతాయి.’ అని చెప్పారు. అందుకే బడ్జెట్‌కు ఆమోదం తెలిపి సంక్షోభానికి తెరదించాలని కాంగ్రెస్‌ను కోరారు. కానీ, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆర్థిక వ్యవస్థపై భారీగా భారం మోపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా షట్డౌన్కు ముగింపు పలకడానికి బుధవారం చర్చల కోసం కాంగ్రెస్ సభ్యుల్ని ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. మరోవైపు బడ్జెట్ విషయంలో రిపబ్లికన్స్, డెమోక్రాట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా షట్‌డౌన్ రెండో రోజూ కొనసాగింది. లక్షలాది మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ ఎన్ఐహెచ్లో షట్‌డౌన్ ప్రభావంతో కేన్సర్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. 75 శాతం మంది ఉద్యోగులు సెలవుల్లో ఉండడంతో కొత్త పేషెంట్లను ఎన్ఐహెచ్ అనుమతించట్లేదు. షట్‌డౌన్ ప్రభావం వల్ల వచ్చే వారం జరగాల్సిన ఒబామా మలేసియా, ఫిలిప్పీన్స్ పర్యటన రద్దయింది. -
అమెరికా షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికా శ్వేతసౌధం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒబామాకేర్ హెల్తపాలసీకి కాంగ్రెస్‌లో చుక్కెదురైంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరుతో ప్రఖ్యాతి పొందిన ఈ పథకంపై ప్రతిష్టంభన ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెంటనే మూసివేయాలని వైట్‌హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత అమెరికాలో ప్రభుత్వ సంస్థలు మూతపడనున్నాయి.ప్రతిపౌరుడికి హెల్తపాలసీ ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిన బిల్లుకు నిధులు సమకూర్చే అంశంపై అటు సెనేట్‌లోనూ, ఇటు ప్రతినిధుల సభలోనూ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో బడ్జెట్ ఆమోదించాల్సిన చివరి రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. బడ్జెట్ ఆమోదించకుండానే సభ ముగిసింది. ఒబామాకేర్ విషయంలో రిపబ్లిక్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగినా ఏవిధమైన ఒప్పందం కుదరలేదు. అంతకు ముందు ఈ వ్యయ బిల్లును సెనేట్ తిప్పిపంపింది. దీనిపై ప్రతిష్టంభన తొలగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రిపబ్లికన్లు సెనేట్ను కోరారు. అయినా అది కార్యరూపం దాల్చలేదు. సెనేట్‌లో మెజారిటీగా ఉన్న డెమోక్రాట్ సభ్యుల లీడర్ హ్యారీ రీడ్ దీనిని ఒక గేమ్ ప్లాన్‌గా అభివర్ణించారు. చర్చలు జరుగుతున్న సందర్భంలో షట్‌డౌన్ ప్రతిపాదనలు రావడంతో ‘తలపై గన్ను పెట్టి బెదిరిస్తే తాము చర్చల్లో పాల్గొనేది లేదని’ చెప్పారు. సెప్టెంబర్ 30తో పూర్తయే ఆర్థిక సంవత్సరం చివరి రోజున కొత్త బడ్జెట్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయినా ఎక్కువగా నిధులు ఖర్చయ్యే ఒబామాకేర్పై కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. ‘కాంగ్రెస్ తన బాధ్యతను నిర్వర్తించలేదు. బడ్జెట్‌ను ఆమోదించడంలో విఫలమైంది. మళ్లీ నిధులు ఇచ్చే వరకూ ప్రభుత్వం షట్‌డౌన్ చేయాలి’ అని ఒబామా వీడియో సందేశమిచ్చారు. కాంగ్రెస్ సభ్యులపై కూడా ఆయన విరుచుకు పడ్డారు. ‘మీరు చేసే పనికి మీకు డబ్బులు రావు. ఏమనుకున్నారో అదే చేస్తున్నారు. న్యాయ సూత్రాలు మీకు నచ్చవు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రక్షణ వ్యవస్థకు మాత్రం అత్యవసరనిధి నుంచి నిధులు సమకూరుస్తామని తెలిపారు. ఈ షట్‌డౌన్ వల్ల సైనికులకు, వారి కుటుంబాలకు తలెత్తే ఇబ్బందులను తొలగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. ఇక షట్డౌన్పై బడ్జెట్ డెరైక్టర్ సిల్వియా మాథ్యూస్ బర్వెల్కు మార్గదర్శకాలు అందాయి. అత్యవసర కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు మధ్యంతర బడ్జెట్‌ను ఆమోదించేలా తీర్మానం చేయాలని కాంగ్రెస్‌కు సూచించాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా, ఒబామా కేర్‌ను అంగీకరిస్తే ప్రభుత్వం భరించలేనంత నిధులు ప్రతిపాదిత కార్యక్రమానికి కేటాయించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ పాలసీలో మెడికల్ డివైస్ ట్యాక్స అనే విధానం వల్ల ఇతర దేశాల వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ పక్షాలు చెప్పాయి. షట్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలందించే సంస్థలు తప్ప ఇతర సంస్థలు మూసివేస్తారు. ఈ సమయంలో ఉద్యోగులకు జీతాలు కూడా అందవు. మూసివేత ప్రభావం 8 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా పడనుంది. కోర్టు వాదనలు కూడా వాయిదా పడ్డాయి. ఈ షట్‌డౌన్ సమయం ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఒక నెల సాగినా జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో 1996లో బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. ప్రస్తుత షట్‌డౌన్ నోటీస్ ప్రభావం ఆయిల్ ధరలపై వెంటనే పడింది. సోమవారం 54 సెంట్లు తగ్గగా మంగళవారం నాటికి అది మరింత క్షీణించి మరో 35 సెంట్లు పడిపోయింది. బ్యారెల్ 101.99 డాలర్ల ధర పలికింది. ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడుతుందని, అందుకే ధరలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. 68 శాతం వ్యతిరేకత ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలన్న నిర్ణయాన్ని అమెరికాలోని 68 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల పాటు మూత పడ్డా అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అయితే మిగిలిన వారు ఇది మంచినిర్ణయమేనని కొనియాడారు. ఈ చర్య అమెరికా భవిష్యత్‌ను దెబ్బకొట్టడమేనని డెమోక్రాటిక్, రిపబ్లిక్ పార్టీల అభిమానులు అభిప్రాయపడ్డారు. భారత్‌పై ప్రభావం అమెరికా షట్‌డౌన్ ప్రభావం భారత్‌పై పెద్ద ఎత్తున పడుతుందని ఈఈపీసీ ఇండియా చెప్పింది. అత్యవసర సర్వీసులకే అమెరికాలో మినహాయింపు ఉన్నందున కమర్షియల్ పోర్టుల్లో దిగుమతులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇది అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా చెప్పారు. అమెరికా దిగుమతుల్లో 12-14 శాతం భారత్ నుంచే ఉంటాయని, వీటిలో ఇంజనీరింగ్ ఉత్పత్తులు 20 శాతంగా ఉన్నాయని తెలిపారు. 2012-13లో 36 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు భారత్ చేసిందని ఆయన వెల్లడించారు. మూతబడే కార్యాలయాలు: 19 మ్యూజియంలు, గ్యాలరీలతో పాటు అన్ని జాతీయ జూపార్కలు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, యోసెమైట్, అల్కట్రాజ్ లాంటి నేషనల్ పార్కలు. ఉద్యోగులపై ప్రభావం: డిఫెన్స- 4 లక్షలు, వాణిజ్యం-30 వేలు, ఎనర్జీ-12,700, రవాణా-18,481 ఇతర సంస్థలు: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, జాతీయ భద్రత, అణు ఆయుధాలు, ఇంధన సంస్ధలు, ఫెడరల్ రిజర్వ, న్యాయ వ్యవస్థ ప్రభావం పడని సంస్థలు: పోస్టల్ డిపార్టమెంట్, విద్యాసంస్థలు, డిఫెన్స్ -
మన్మోహన్‌ను ‘పల్లె మహిళ’ అనలేదు: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మో„హన్ సింగ్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై రేగిన వివాదానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెరదించారు. తాను మన్మో„హన్ను ఎన్నడూ ‘పల్లె మహిళ’(దెహతీ ఔరత్) అని అనలేదని లండన్‌లో విలేకర్లతో అన్నారు. ఈమేరకు పాక్ పత్రికలు మంగళవారం వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా మన్మో„హన్ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పిన నేపథ్యంలో.. నవాజ్ ఓ ఇంటర్వ్యూలో మన్మో„హన్ పల్లె మహిళలా ఫిర్యాదు చేశారని అన్నట్లు వార్తలు రావడం తెలిసిందే. -
పాక్‌తో మాటా మంతీ!
సంపాదకీయం: ఎప్పటిలాగే చర్చలకు ముందు అధీనరేఖ వద్దా, జమ్మూ-కాశ్మీర్‌లోనూ కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నా న్యూయార్క్ లో భారత-పాకిస్థాన్ అధినేతల సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా పాకిస్థాన్ గురించి మన్మోహన్ ఆయనకు ఫిర్యాదుచేశారని వార్తలు వెలువడినా... దాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్‌ను ‘చాడీలుచెప్పే పల్లెటూరి పడుచు’తో పోల్చారని కాసేపు వదంతులు వచ్చినా ఈ సమావేశం సామరస్యవాతావరణంలోనే జరిగింది. ఆగస్టు నెలలో అధీనరేఖ వద్ద గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై పాకిస్థాన్ సైనికులు దాడిచేసి ఐదుగురిని బలితీసుకున్నారు. ఈ ఘటనను మరిచిపోకముందే సరిగ్గా చర్చలకు మూడురోజుల ముందు పాక్ భూభాగంనుంచి వచ్చిన ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు. ఈ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపవద్దని బీజేపీ డిమాండ్చేసింది. ఒకపక్క ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోపక్క కాల్పులవిరమణను ఉల్లంఘిస్తూ ధూర్తదేశంగా తయారైన పాకిస్థాన్‌తో చర్చలేమిటన్నది ఆ పార్టీ ప్రశ్న. మన పొరుగున ఎవరుండాలో, వారు ఎలా ప్రవర్తించాలో మనం నిర్దేశించలేం. అయితే, ఆ పొరుగు సరిగా లేనప్పుడు దాన్ని దారికి తీసుకు రావడానికి అన్ని పద్ధతుల్లోనూ ప్రయత్నించకతప్పదు. అలాంటి ప్రయత్నాల్లో చర్చలు కూడా భాగమే. సమస్య తలెత్తుతున్నది గనుక చర్చలు వద్దనడం సరైన తర్కం అనిపించుకోదు. సమస్యలున్నప్పుడే చర్చల అవసరం మరింత పెరుగుతుంది. మన్మోహన్, నవాజ్ షరీఫ్‌ల చర్చలు ఒకరకంగా సానుకూలంగా జరిగినట్టే లెక్క. ఇలాంటి సమావేశాలు ‘ఉపయోగమేన’ని మన దేశం వ్యాఖ్యానించగా, ఈ చర్చలు ‘నిర్మాణాత్మకంగా, అనుకూలవాతావరణంలో’ జరిగాయని పాకిస్థాన్ ప్రకటించింది. అధీనరేఖ వద్ద పాకిస్థాన్ తరచు కాల్పులవిరమణను ఉల్లంఘిస్తుండటం, వారి సైన్యం ఉగ్రవాదులకు అండదండలివ్వడంవంటి అంశాలను మన్మోహన్ షరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. అధీనరేఖవద్ద కాల్పులవిరమణ కొనసాగించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏంచేస్తే బాగుంటుందో నిర్ణయించడానికి త్వరలో ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స డెరైక్టర్ జనరల్స (డీజీఎంఓలు) సమావేశం జరగాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. ఆ సమావేశం జరిగి, విధివిధానాలు నిర్ణయమై అమల్లోకివస్తే తదుపరి చర్చలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఈ సమావేశం పర్యవసానంగా ఇరుదేశాధినేతల విస్తృత చర్చలకు అవసరమైన ప్రాతిపదిక ఏర్పడలేదన్నదే మన దేశం అవగాహన. అది నిజమే కూడా. క్షేత్రస్థాయిలో తగినంత సామరస్యత ఏర్పడకుండా చర్చల కోసం చర్చలు... ఇక్కడేదో జరుగుతున్నదని చెప్పుకోవడానికి కలవడమూ వంటివి అర్ధంలేనివి. పాకిస్థాన్‌తో సమస్య ఎక్కడంటే... అక్కడి పౌర ప్రభుత్వం ఇచ్చే హామీలకు ఎలాంటి విలువా ఉండదు. భారత్‌తో సఖ్యతకు అక్కడి ప్రభుత్వం ముందడుగేసినప్పుడల్లా పాక్ సైన్యం దాన్ని వమ్ము చేస్తుంటుంది. మన దేశంతో చర్చలనేసరికి అధీనరేఖ రక్తసిక్తంకావడం, జమ్మూ-కాశ్మీర్లో ఏదోచోట ఉగ్రవాదులు చెలరేగి పోవడం ఇందుకే. తన సైన్యాన్ని తప్పుబట్టడం సాధ్యంకాదు గనుక అక్కడి ప్రభుత్వం నీళ్లు నములుతుంటుంది. వాస్తవానికి పాక్ వైపునుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాద ముఠాలకు ప్రోత్సాహం వంటివి ఆగితే రెండు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు, సహకరించుకోవాల్సిన అంశాలూ చాలా ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, సియాచిన్, సర్‌క్రీక్ వివాదాలు, సింధు నదీజలాల ఒప్పందానికి సంబంధించిన అంశాలు, ఇరుదేశాలమధ్యా పెరగవలసిన వ్యాపార, వాణిజ్య సంబంధాలు, సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణావంటివి అందులో ముఖ్యమైనవి. ఈ అంశాలన్నిటిలో ఎంతో కొంత ప్రగతి సాధించ… గలిగితే క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. రెండు దేశాలూ ఆర్ధికంగా బలపడటానికి అవి దోహదపడతాయి. కానీ, రెండు దేశాలమధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడకుండా పాకిస్థాన్‌లో బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ ధోరణిని నవాజ్ షరీఫ్ ఎంతవరకూ నియంత్రించగలరనే సందేహాలున్నా ఆయన ప్రధాని పదవిని స్వీకరించిన వెంటనే మాట్లాడిన మాటలు అందుకు సంబంధించి కొంత ఆశను కల్పించాయి. తమ గడ్డనుంచి ఇకపై ఉగ్రవాదులకు సహకారం అందబోదని ఆయన ప్రకటించారు. భారత్‌తో సామరస్యత నెలకొల్పుకుంటే విద్యుత్ కొనుగోలు అవకాశం ఏర్పడుతుందని, అందువల్ల తమ దేశంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని షరీఫ్ భావిస్తున్నారు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో తమ పౌరుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక విచారణ సంఘాన్ని ముంబైకి పంపడం, సాక్ష్యాధారాలను సేకరించడం కూడా ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారన్న నమ్మకాన్ని కలిగించింది. అయితే, నవాజ్ షరీఫ్ అధికారంలో ఇంకా కుదురుకోవాల్సే ఉంది. ఆయన అధికారంలోకొచ్చి వందరోజులు దాటుతుండగా ఇంచుమించు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. త్వరలో ఖాళీ అవుతున్న సైనిక దళాల ప్రధానాధికారి పదవికి తన విధేయుణ్ణి ఎంపిక చేసుకోగలిగితే వీటిని నియంత్రించడం సులభమవుతుందని, అప్పుడు పాలనపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుందని నవాజ్ షరీఫ్ విశ్వసిస్తున్నారు. అది ఎంతవరకూ సాధ్యమవుతుందో ఇంకా చూడాల్సే ఉంది. ఈలోగా పాకిస్థాన్‌తో చర్చించడంద్వారా, అంతర్జాతీయంగా ఆ దేశంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకురావడంద్వారా సరిహద్దుల్లో సామరస్యత ఏర్పడేందుకు మనవైపుగా కృషి జరుగుతూనే ఉండాలి. సమస్యల పరిష్కారానికి ఇంతకు మించిన మార్గంలేదు. -
సంస్కరణలతోనే రాజకీయ వాస్తవికత
ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగం న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మన్మో„హన్ సింగ్ ఉద్ఘాటించారు. దాని కోసం వెంటనే ఐరాసలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. అప్పుడే ప్రస్తుత రాజకీయ వాస్తవికత వెల్లడవుతుందన్నారు. శనివారం ఐక్యరాజ్యసమితి సర్యసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రతా మండలి పునర్నిర్మాణం, అందులో సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అయితే దానికి చైనా మోకాలడ్డుతోందన్నారు. మండలిలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించాలని, అది కూడా భవిష్యత్‌కు చాలా అవసరమని చెప్పారు. బహుళ దేశాల భాగస్వామ్యం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రతకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఐరాసలో సంస్కరణలకు అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం రావాలన్నారు. భద్రత గురించి ఐరాసపై ఉన్న అనుమానాలు తొలగాలంటే సంస్కరణలు తప్పనిసరి అని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి ఐరాస మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలపై ఎలాంటి ఉపేక్ష చూపించరాదన్నారు. విశ్వశాంతి, భద్రత కోసం సంక్లిష్టమైన సవాళ్లను అదిగమించడానికి, అది సైబర్ నేరాలైనా, ఉగ్రవాదమైనా అంతర్జాతీయ ఏకాభిప్రాయం రావాలన్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్‌పై కూడా నిప్పులు చెరిగారు. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమన్నారు. పాక్ భూభాగంపై రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలన్నారు. అయితే కాశ్మీర్‌తో సహా ఇతర సమస్యలను దై్వపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని చెప్పారు. అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలపైనే అధారపడి ఉంటుందని చెప్పారు. కాగా, పేదరికాన్ని పారదోలడానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సభ్య దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందిపైగా పేదరికంలో మగ్గుతున్నారని, వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందచేయడం ద్వారా పేదరికం తగ్గించాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా దేశాలకు ఐరాస అందించాలని సూచించారు. ఇక సిరియా సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యకు మిలటరీ చర్యలు పరిష్కారం కాదని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి బహుళ దేశాల సదస్సును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అయితే రసాయన ఆయుధాల వినియోగాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను దై్వపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నారు. ఇక అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలు పూర్తిగా అంగీకరించాలని, నిర్ణీత కాలంలో, వివక్ష లేకుండా అది పూర్తి చేయాలని కోరారు. -
భారత్, అమెరికా ‘అణు’బంధం
వాషింగ్టన్: పౌర అణు విద్యుత్‌పై భారత్, అమెరికా తొలి వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయాన్ని వెల్లడించారు. పౌర అణు విద్యుత్‌లో ఇరు దేశాలు విశేష ప్రగతి సాధించాయని ఈ సందర్భంగా ఒబామా చెప్పారు. భారత్‌లో న్యూక్లియర్ ప్లాంట్ నెలకొల్పడానికి ఎన్పీసీఐఎల్, అమెరికా కంపెనీ వెస్టింగ్‌హౌస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరిన తర్వాత తొలి వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఒబామా.. భారత్ ప్రాంతీయ శక్తి కాదని, ప్రపంచ శక్తిగా మారిందని కొనియాడారు. ఉగ్రవాదానికి ఇప్పటికీ ప్రధాన కేంద్రం పాకిస్థానే.. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇప్పటికీ ప్రధాన కేంద్రంగానే కొనసాగుతోందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ఆదివారం జరగనున్న సమావేశంపై పెద్దగా అంచనాలు వ్యక్తం చేయలేదు. భారత ఉపఖండంలో ఉగ్రవాదం ఇంకా ఉధృతంగా ఉందన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో న్యూయార్క్‌లో జరగనున్న సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. జమ్మూలో గురువారం జరిగిన జంట ఉగ్రదాడుల అనంతరం స్వల్ప వ్యవధిలోనే ఈ సమావేశం జరగనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాడుల నేపథ్యంలో సమావేశాన్ని రద్ధు చేసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అఫ్ఘానిస్థాన్, పాక్ సహా తమ ప్రాంతంలోని పరిస్థితిపై ఒబామా, తాను చర్చించామని తెలిపారు. ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పాక్ ఉందన్న వాస్తవాన్ని తెలియజెప్పేందుకు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరించామన్నారు. పెద్దగా అంచనాలు లేకున్నప్పటికీ పాక్ ప్రధానితో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. సిరియా, ఇరాన్ విషయంలో అమెరికా ఇంకో అవకాశం ఇవ్వడం పట్ల ఒబామాను ప్రధాని మెచ్చుకున్నారు. ఇలాంటి చర్యలకు భారత్ సంపూర్ణంగా మద్దతు పలుకుతుందన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో 60లక్షల భారతీయులు ఉండడమే దీనికి కారణంగా చెప్పారు. కాగా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లపై మన్మోహన్, తాను చర్చలు జరిపినట్లు ఒబామా కూడా వెల్లడించారు. ఉపఖండంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను శాంతియుతంగా తగ్గించేందుకు వీలుగా తాము అభిప్రాయాలను పంచుకున్నామన్నారు. పాక్‌తో సంబంధాలు బలపడేందుకు మన్మోహన్ సింగ్ చేస్తున్న యత్నాలను ఒబామా ప్రశంసించారు. అంతకుముందు ఇరు నేతలు వైట్‌హౌస్‌లో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. మూడేళ్ల విరామం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ ఇదే. ప్రధాని వెంట విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతాసింగ్, అమెరికాలో భారత రాయబారి నిరుపమారావు కూడా ఉన్నారు. జమ్మూలో గురువారం ఉగ్రవాదుల జంట దాడుల నేపథ్యంలో.. పాక్ భూభాగం నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదంపై భారత్ ఆందోళనను మన్మోహన్ సింగ్ అమెరికాకు తెలియజేశారు. విదేశీ ఐటీ నిపుణులను నియంత్రిస్తూ ఇటీవల అమెరికా తీసుకొచ్చిన కఠిన వలస నిబంధనలు, వాణిజ్యం సహా పలు ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. -
నేడు ఒబామాతో ప్రధాని మన్మోహన్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నేడు సమావేశం కానున్నారు. వైట్ హౌస్‌లో జరిగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే విధంగా చర్చలు జరగనున్నాయి. ఒబామా, మన్మోహన్ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంతో పాటు పౌర అణు ఒప్పందం అమలు కూడా ప్రధాన ఎజెండాగా ఉండనుంది. చర్చల అనంతరం రక్షణ రంగంతో పాటు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో భారత ఐటీ నిపుణులపై ప్రభావం చూపించే అమెరికా వీసా నిబంధనల్లో మార్పు ప్రతి పాదనలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. దక్షిణాసియాలో తాజా పరిస్థితులు, అఫ్ఘానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ, సిరియా తదితర అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. 2009 తర్వాత ఒబామా, మన్మోహన్ భేటీ కావడం ఇది మూడోసారి. దశాబ్దకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని, అమెరికా.. భారత్‌కు కీలక భాగస్వామిగా మారిందని అమెరికా పర్యటనకు ముందు ప్రధాని వ్యాఖ్యానించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి తన పర్యటన దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు ఒబామా సైతం మన్మోహన్‌తో భేటీకి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ఒబామాతో భేటీ తర్వాత న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి మన్మోహన్ హాజరవుతారు. ఆ తర్వాత 29న న్యూయార్క్‌లో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ భేటీ కానున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి ఉగ్రవాద దాడులపై భారత్ ఆందోళనను మన్మోహన్ పాక్ కొత్త ప్రధానికి తెలియజేస్తారని భావిస్తున్నారు. -
మసాచుసెట్స్ జడ్జిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దక్షిణాసియాకు చెందిన మరో వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతి మహిళ ఇందిరా తల్వానీని మసాచుసెట్స్ జిల్లా జడ్జిగా నియమించారు. ఫస్ట్ సర్క్యూట్‌కు నామినేట్ అయిన తొలి సౌత్ ఏషియా మహిళ ఇందిరానే. ఆమె ప్రస్తు తం బోస్టన్లోని సీగల్రోయిట్మాన్లో భాగస్వామిగా పనిచేస్తున్నారు. సివిల్ లిటిగేషన్ కేసుల్లో రాష్ట్ర, ఫెడరల్ ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. 1988లో ఉత్తర కాలిఫోర్నియా జిల్లా కోర్టు జడ్జి స్టాన్లీ ఏ వెజైల్ దగ్గర లా క్లర్క్‌గా ఇందిరా లీగల్ కెరీర్‌ను ఆరంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, ఒబామా నామినేట్ చేసిన దక్షిణాసియాకు చెందిన వారిలో ఇందిరా మూడో వ్యక్తి కావడం విశేషం. గతంలో దక్షిణాసియాకు చెంది న విన్స్ ఛాబ్రియాను ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జిగా, మనీష్ షాను ఉత్తర ఇల్లినాయిస్ జిల్లా జడ్జిగానూ ఒబామా నియమించిన విషయం తెలిసిందే. -
ఒబామా, మన్మోహన్‌ల విందుకు నీనా దావులూరి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 27న శ్వేతసౌధంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఇస్తున్న విందుకు మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న ప్రవాస తెలుగు అందగత్తె నీనా దావులూరి(24)ని ఆహ్వానించే అవకాశం ఉందని మాజీ దౌత్యాధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషికి గుర్తింపుగా నీనాకు అవకాశం దక్కనుంది. మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతిగా నీనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘అమెరికా పురోగతిలో ప్రవాస భారతీయులు చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. అమెరికా స్పెల్లింగ్ బీ అవార్డును చాలాసార్లు సాధించారు. ఇప్పుడు మిస్ అమెరికా కిరీటాన్ని కూడా. నీనా బాలీవుడ్ తరహా నృత్యాలను అమెరికాకు పరిచయం చేశారు’ అని ఆ అధికారి తెలిపారు. మన్మోహన్సింగ్ ఈనెల 27న వాషింగ్టన్లో ఒబామాతో సమావేశం కానున్నారు. అనంతరం విందు ఏర్పాటుకానుంది. మరోవైపు నీనా ఇంటర్వ్యూ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయ మీడియా నుంచి అభ్యర్థనలు అందుతున్నట్లు మిస్ అమెరికా పోటీ నిర్వాహకులు తెలిపారు. కొద్ది నెలల్లో నీనా భారత్‌లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. -
అరణ్యం: అధ్యక్షుల వారి ఆటవిడుపు... బో!
దేశాధ్యక్షుడి భార్యను ‘ఫస్ట్ లేడీ’ అంటారని తెలుసు. కానీ అతగాడు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కని ‘ఫస్ట్ డాగ్’ అంటారని తెలుసా? అలా పిలిపించుకున్న ఘనత... ‘బో’కి దక్కింది. ఎందుకంటే... దాన్ని పెంచుకుంటున్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరి! పోర్చుగీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన ‘బో’ని సెనేటర్ కెనడీ ఒబామాకు బహూకరించారు. ఒబామాకి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. అప్పటికే వారి ఇంట్లో ఓ మేలుజాతి కుక్క ఉంది. అయినా మరోదాన్ని పెంచుకోవాలని అనుకున్నారు. అయితే దేన్ని పడితే దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు. కారణం... ఒబామా కూతురు మాలియాకి కొన్ని కుక్కల వల్ల తీవ్రమైన అలర్జీ కలుగుతుంది. అందువల్లే ఆమెకు ఇబ్బంది లేకుండా పోర్చుగీస్ వాటర్ డాగ్‌ని తెచ్చుకోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసిన కెనడీ ‘బో’ని తెచ్చి ఇచ్చారట. ఎప్పుడైతే బో తమ ఇంట్లో అడుగుపెట్టిందో, అప్పుడే తమ కుటుంబంలో భాగమైపోయింది అంటారు ఒబామా. తన పిల్లలతో సమానంగా ఆయన కూడా ఈ బుజ్జికుక్కతో ఆడుతూ ఉంటారు. చాలాచోట్లకు దాన్ని వెంటబెట్టుకునే వెళ్తారు. దాంతో బాగా ఫేమస్ అయిపోయింది బో. ఒబామా గారితో పాటు దాని వార్తలు కూడా రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయిట అమెరికా పత్రికల్లో! కొంగలు విడాకులు తీసుకుంటాయా! ప్రపంచంలో మొత్తం పదిహేను రకాల కొంగ జాతులున్నాయి. అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో తప్ప అన్ని ఖండాల్లోనూ కొంగలు కనిపిస్తాయి! కొంగ పిల్లల్ని చిక్స్ అంటారు. కొంగల గుంపును ఫ్లాక్ అంటారు! వీటి పిల్లలు ఎంత త్వరత్వరగా ఎదిగిపోతాయో తెలుసా? పుట్టాక రెండు నెలలు తిరిగేసరికల్లా రెక్కలు పెరిగి, ఆరోగ్యంగా తయారై, ఎగరడం మొదలుపెడతాయి. తమంతట తామే ఆహార వేటకు వెళ్లిపోతాయి! చల్లటి నీటిలో గంటల పాటు కొంగలు నిలబడి ఎలా ఉండగలుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి తమ కాళ్లలోని రక్తనాళాలను నియంత్రించుకునే శక్తి ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ వేగాన్ని పెంచుకోగలవు, తగ్గించుకోగలవు. బయటి వాతావరణాన్ని తట్టుకోవడమనేది శరీరంలోని రక్తప్రసరణను బట్టే ఉంటుంది కాబట్టి చల్లటి నీటిలో ఉన్నా వాటికేమీ కాదు! చూడటానికి సన్నగా ఉన్నా, వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. గోళ్లు చాలా వాడిగా ఉంటాయి. శత్రువు నుంచి తప్పించుకోవడానికి కాలితో తొక్కిపెట్టి, గోళ్లతో రక్కేస్తాయి కొంగలు! కొంగలు నిలబడి నిద్రపోతాయని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమే కానీ... అన్ని కొంగలూ అలా చేయవు. రెండు జాతుల కొంగలు మాత్రమే అలా నిద్రపోతాయి. మిగిలినవి గూళ్లలోనే నిద్రిస్తాయి! కొంగలు జీవితాంతం ఒకే కొంగతో కలసివుంటాయి. తమ జోడీ చనిపోతే ఒంట రిగానే ఉంటాయి. విడాకులు తీసుకున్నప్పుడు మాత్రమే మరోదానికి చేరువవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును... కొంగలు విడిపోతాయి. ఆడకొంగ గర్భం దాల్చడంలో విఫలమైతే అవి విడిపోతాయి. వేరే దానికి దగ్గరై సంతానోత్పత్తికి తిరిగి ప్రయత్నిస్తాయి. ఏది తనకు సంతానాన్ని ఇస్తుందో ఆ ఆడకొంగతోనే మగకొంగ జీవితాంతం ఉంటుందని పరిశోధనల్లో తేలింది! కొంగలు ఇరవై నుంచి నలభయ్యేళ్లు జీవిస్తాయి. ఇన్నేళ్ల పాటు జీవించే పక్షులు కాస్త అరుదనే చెప్పాలి! -
తాత్కాలిక శాంతి!
సంపాదకీయం: ప్రయత్నించాలే గానీ ఏదీ అసాధ్యం కాదు. ‘చేరి మూర్ఖుని మనసు రంజింప రాద’ని భర్తృహరి హితబోధ చేసినా, ఆశ ఉంటుంది గనుక మానవ ప్రయత్నం ఎప్పుడూ ఆగిపోదు. సిరియాపై యుద్ధానికి దిగడం ఆ దేశ ప్రజలకుగానీ, అమెరికాకుగానీ ఉపయోగపడదని ప్రపంచ దేశాలన్నీ చేసిన హెచ్చరికలు అగ్రరాజ్యంలో విజ్ఞత కలిగించినట్టున్నాయి. రష్యా చొరవ ఫలించి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకుపడింది. సిరియాలో ఉన్నాయంటున్న రసాయన ఆయుధాల నిల్వలను నియంత్రణలోకి తీసుకుని ధ్వంసంచేస్తానని రష్యా ఇచ్చిన హామీకి అంగీకరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. సంక్షోభం అంచుల్లో ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు ఈ పరిణామంతో కాస్తంత ఊరట లభించింది. గత రెండున్నరేళ్లుగా సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. పట్టణాలూ, పల్లెలూ రణక్షేత్రాలుగా మారాయి. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటు దళాలు పరస్పరం కలహించుకుంటూ ఊళ్లన్నిటినీ వల్లకాళ్లుగా మారుస్తున్నారు. సిరియా వర్తమాన స్థితికి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బాధ్యత ఎంత ఉన్నదో పాశ్చాత్య దేశాల బాధ్యతా అంతే ఉంది. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన ప్రజాస్వామ్య ఉద్యమం సెగ మిగిలిన దేశాల్లాగే సిరియానూ తాకినా అది త్వరలోనే చేయి దాటిపోవడానికి పూర్తి బాధ్యత పశ్చిమ దేశాలదే. సిరియాలో లభ్యమయ్యే నాణ్యమైన చమురుపై కన్నేసిన పాశ్చాత్య ప్రపంచం ఈ సాకుగా ఆ దేశానికి పొరుగునున్న టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాలద్వారా తిరుగుబాటుదారులను సాయుధం చేసింది. అందులో అల్- కాయిదా అనుకూల వర్గాలు కూడా చేరాయని తెలిసినా తన చేష్టలను మానలేదు. గత నెల 21న సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన రసాయన ఆయుధ ప్రయోగం తర్వాత వందలమంది మరణించడంతో ఎప్పటినుంచో సిరియాపై కాలుదువ్వుతున్న అమెరికాకు సాకు దొరికింది. ఒకపక్క ఆ దాడికి బాధ్యులెవరో, ఏ తరహా రసాయనాన్ని ప్రయోగించారో తేల్చడానికి ఐక్యరాజ్యసమితి బృందం ప్రయత్నిస్తుంటే ఇదే అదునుగా యుద్ధ ప్రకటన చేయడానికి అమెరికా తహతహ లాడిపోయింది. అసద్ వద్ద వెయ్యి టన్నుల రసాయన ఆయుధాలు పోగుపడి ఉన్నాయని, అవన్నీ దేశంలోని 50 పట్టణాల్లో నేలమాళిగల్లో ఉంచారని ప్రకటించింది. ఇందులో నిజమెంతో, కానిదెంతో తేల్చాల్సింది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సంస్థలే తప్ప అమెరికా కాదు. అయినా, అలాంటి సంస్థలతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించింది. ఈ యుద్ధంలో పాలు పంచుకునేందుకు బ్రిటన్ పార్లమెంటు అంగీకరించకపోవడం, ఫ్రాన్స్ పార్లమెంటు సైతం అదే తోవలో వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అమెరికా ముందుకు కదల్లేకపోయింది. రష్యాలో ఈమధ్యే ముగిసిన జీ-20 దేశాల సమావేశం కూడా ఆచి తూచి అడుగేయమని అమెరికాకు నచ్చజెప్పింది. వీటన్నిటి వెనకా ఉన్నది ఒకే కారణం... ఆర్ధికంగా ఉన్న గడ్డు పరిస్థితులు. ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా పుట్టి విస్తరించిన ఆర్ధిక మాంద్యం దెబ్బకు కుదేలైన ప్రపంచ దేశాలు మరో సంక్షోభానికి సిద్ధంగా లేవు. ఎవరిదాకానో అవసరం లేదు... అమెరికా ప్రజలే సిరియాపై యుద్ధసన్నాహాలు చూసి వణికారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనబడుతున్న ఆర్ధిక వ్యవస్థ మళ్లీ చితికి పోతుందేమోనని భయపడ్డారు. రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ ప్రతిపాదనకు చిక్కులు ఏర్పడవచ్చన్న సందేహం ఒబామాకు కలిగింది. తన మేకపోతు గాంభీర్యానికి భంగం కలగకుండా ఈ సమస్యనుంచి బయట పడటం ఎలాగా అని ఆయన ఆలోచిస్తున్నవేళ రష్యా చొరవ తీసుకుని జరిపిన దౌత్యం ఆయనకు అందివచ్చింది. ఇప్పుడు అమెరికా బెదిరించిందని కాదు... మా మిత్ర దేశం ఒప్పించింది గనుక రసాయన ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించామని అధ్యక్షుడు అసద్ చెబుతున్నారు. ఆ ఆయుధాలను నాశనం చేయించే పూచీనాదని రష్యా హామీపడింది. యుద్ధానికి దిగుతామని బెదిరించి ఎవరినీ లొంగదీయలేరని, అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం వెదకాలని రష్యా అంటున్నది. రష్యాకు సిరియాపై ఇంత ప్రేమ ఉండటానికి కారణాలున్నాయి. మధ్యధరా సముద్రంలో రష్యాకున్న ఏకైక నావికాదళ స్థావరం సిరియాలోనే ఉంది. పైగా, రష్యానుంచి భారీయెత్తున ఆయుధాలు కొంటూ అందుకు ప్రతిగా నాణ్యమైన ముడి చమురు సరఫరా చేస్తున్న దేశం సిరియా. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు చమురే ప్రాణంగా మారిన వర్త మాన స్థితిలో అలాంటి ప్రయోజనాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదు. అసలు సిరియాలో ఉన్న రసాయన ఆయుధాలపై ఇంతగా బెంగటిల్లుతున్న అమెరికా ఆ పొరుగున ఇజ్రాయెల్ వద్దనున్న అదే బాపతు ఆయుధాల గురించి ఒక్క మాట మాట్లాడదు. 1993లో అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందంపై సంతకం చేసినా దాన్ని పార్లమెంటు ముందుకు తెచ్చి ఆమోదం పొందని దేశం ఇజ్రాయెల్. ఇంకా చెప్పాలంటే అమెరికా, రష్యాలవద్ద సైతం రసాయన ఆయుధాల గుట్టలున్నాయి. వాటిని ధ్వంసం చేయడానికి గడువు మీద గడువు కోరుతూ కాలక్షేపం చేసిన ఆ రెండు దేశాలూ తుది గడువు 2012ను కూడా దాటబెట్టేశాయి. నిజానికి అమెరికా తదితర దేశాలవద్దనున్న సంప్రదాయిక ఆయుధాలు ఈ రసాయన ఆయుధాలకంటే అత్యంత ప్రమాదకరమైనవి. వాటన్నిటినీ ధ్వంసించకుండా సిరియా వల్లే ప్రపంచానికి ఏదో పెను ముప్పు సంభవించబోతున్నదన్న అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించడం నయ వంచన. ఇప్పటికైతే, యుద్ధ భయం తాత్కాలికంగా తొలగిందిగానీ, ఈ నయ వంచన బట్టబయలై, అందరికీ సమానంగా వర్తించే నియమనిబంధనలు రూపొందినప్పుడే ప్రపంచం సురక్షితంగా ఉండగలుగుతుంది. అంతవరకూ ఏ ఒప్పందాలైనా తీసుకొచ్చేది తాత్కాలిక శాంతిని మాత్రమే. -
మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా
మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు. -
27న ఒబామాతో మన్మోహన్ భేటీ
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగం తేదీ 28కి మార్పు! ఐక్యరాజ్యసమితి, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల 27న భేటీ కానున్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌజ్‌లో జరిగే ఈ భేటీ అనంతరం న్యూయార్క్‌లో నిర్వహించనున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) సాధారణ సభలో ప్రసంగించేందుకు మన్మోహన్ వెళతారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మన్మోహన్ యూఎన్వోలో 27వ తేదీనే ప్రసంగించాల్సి ఉంది. కానీ, ఒబామాతో భేటీ నిమిత్తం దానిని 28వ తేదీకి మార్చారు. ఇప్పటికే రష్యాలో జరుగుతున్న జీ -20 దేశాల సదస్సులో ఒబామా, మన్మోహన్ పాల్గొంటున్నారు. కానీ, అక్కడ ద్వైపాక్షిక చర్చలేమీ జరిపే అవకాశం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
సిరియాపై దాడికి నిర్ణయం తీసుకోలేదు: ఒబామా
సిరియాపై సైనిక దాడి చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. డమాస్కస్‌లో ఈ నెల 21న ఆసాద్ ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడి వందలాది మంది మృతికి కారణమైన నేపథ్యంలో సిరియాపై అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక చర్యలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిరియాపై దాడికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒబామా స్పష్టం చేశారు. పౌరులపై పెద్ద ఎత్తున రసాయన దాడి చేయడం అంతర్జాతీయ విధానాలకు వ్యతిరేకమని పీబీఎస్ న్యూస్ హవర్ ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఆధారాలు సేకరించామని, సిరియాలో ఆందోళకారుల వద్ద అణ్వయుధాలు లేదా రసాయన ఆయుధాలు లేవని అన్నారు. రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వమేనని తేలిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లను సిరియా ఎదుర్కొవలసివుంటుందని ఆయన హెచ్చరించారు. డమాస్కస్‌లో ఈ నెల 21న వందలాది మంది మృతికి కారణమైన రసాయన దాడికి పాల్పడింది సిరియా ప్రభుత్వ బలగాలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జోసఫ్ బిడెన్ కూడా స్పష్టం చేశారు. దాడి సిరియా ఆర్మీ పనేనని ‘నాటో’ కూడా ప్రకటించింది. తమ దేశంపై దాడి చేస్తే దీటుగా ఎదుర్కొంటామని సిరియా, సిరియాపై దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదురువుతాయని రష్యా, ఇరాన్‌లు హెచ్చరించడం తెలిసిందే. సిరియా సమస్యకు దౌత్యమార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ సూచించారు.