ఆ ఫోటోతో నవ్వులపాలైన ట్రంప్‌.. | Twitter Reacts To US President Donald Trumps Latest Post | Sakshi
Sakshi News home page

ఆ ఫోటోతో నవ్వులపాలైన ట్రంప్‌..

Published Fri, Jan 24 2020 10:11 AM | Last Updated on Fri, Jan 24 2020 10:13 AM

Twitter Reacts To US President Donald Trumps Latest Post - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ఉదయం పోస్ట్‌ చేసిన ఓ ఫోటో దుమారం రేపింది. ఈ ఫోటోపై ట్విటర్‌ యూజర్లు ట్రంప్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ట్రంప్‌ చవకబారు వ్యక్తిత్వానికి ఈ పోస్ట్‌ సంకేతమని ట్రోల్‌ చేశారు. ఇంతకీ ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఫోటో పరిశీలిస్తే మార్ఫింగ్‌ చేసిన ఆ ఇమేజ్‌లో ట్రంప్ ఒక గది హాలు మూలన నిలబడి, కిటికీకి ఒక స్తంభంపై వాలగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాలీవుడ్ చలనచిత్రాలలో గూఢచారుల తరహాలో కిటికీ బయట నుంచి  బైనాక్యులర్ల ద్వారా అతనిని చూస్తున్నట్టుగా ఉంది. ఈ కిటికీ భూమికిపైన కొన్ని అంతస్ధులపైన ఉన్నట్టు కనిపిస్తోంది.

ఈ ఫోటోను ట్రంప్‌ పోస్ట్‌ చేసిన వెనువెంటనే నెటిజన్లు తమదైన కామెంట్స్‌తో అమెరికా అధ్యక్షుడిని ఇరకాటంలోకి నెట్టారు. అభిశంసనకు గురయ్యే అధ్యక్షుడు ఎలా ఉంటారో ఒబామా చూడాలని అనుకుని ఉంటారని ఓ ట్విటర్‌ యూజర్‌ కామెంట్‌ చేయగా, మీరెంత అపహాస్యమైన ఉద్దేశాలతో ఉన్నారో మీకు అర్ధమైందా అని మరో యూజర్‌ ట్రంప్‌కు గడ్డిపెట్టాడు.ఒబామా అంటే ట్రంప్‌కు ఎప్పుడూ అసూయేనని మరో నెటిజన్‌ మండిపడ్డారు. ఈ పోస్ట్‌ ట్విటర్‌లో కనిపించిన అరగంటలోనే 17,000 సార్లు రీట్వీట్‌ కావడం గమనార్హం.

చదవండి : ‘అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement