అమెరికాకు రండి.. మోడీకి ఒబామా ఫోన్!
అమెరికాకు రండి.. మోడీకి ఒబామా ఫోన్!
Published Sat, May 17 2014 12:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
పార్లమెంట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయాన్ని బీజేపీకి అందించిన ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడిని అమెరికా అధ్యక్షుడు
బరాక్ ఒబామా అభినందించారు. శుక్రవారం రాత్రి మోడికి ఒబామా ఫోన్ చేసి...భారత, అమెరికా సంబంధాలు, ప్రపంచ ఆర్ధిక పరిస్థితిపై చర్చించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ చిరస్మరణీయమైన విజయాన్ని అందించారని మోడిపై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు.
మోడీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారత్ ఓ కీలక భూమికను పోషిస్తుందనే విశ్వాసాన్ని ఒబామా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికాలో పర్యటించాలని మోడీని ఒబామా ఆహ్వానించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీకి అమెరికా వీసాను తిరస్కరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటించాలని వైట్ హౌజ్ ఆహ్వానంపై మోడీ సానుకూలంగా స్పందించారు.
Advertisement
Advertisement