అప్పుడు ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్షం లేదు: వెంకయ్య
అప్పుడు ప్రభుత్వం.. ఇప్పుడు ప్రతిపక్షం లేదు: వెంకయ్య
Published Mon, May 19 2014 12:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ప్రభుత్వముందా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైందని.. అందుకే ప్రతిపక్ష స్థానం హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా ఓటర్లు తీర్పు నిచ్చారని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. యూపీఏలో ప్రభుత్వం మనుగడ లేదని.. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి కూడా స్థానం లేదు అని వెంకయ్య అన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగదల, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు లోనయ్యారని వెంకయ్య అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలకు నరేంద్రమోడీ భరోసా ఇచ్చారని.. విశ్వాసం కలిగించారన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెసేతర ప్రభుత్వానికి భారీ మెజార్టీని కట్టబెట్టారని ఆయన అన్నారు.
బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్ కుమార్ మనోవ్యధకు గురవుతున్నారన్నారు. రాజకీయ లబ్ది కోసం రాజీనామా ఆస్త్రం జేడీ(యూ)కు ఎలాంటి ప్రయోజనం కలిగించిందని వెంకయ్య విమర్శించారు.
Advertisement