'ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడండి'
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్ లో పర్యటించేలా చేయాలని యూఎస్ వాణిజ్యశాఖ సహాయకార్యదర్శి అరుణ్‌కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ తో అరుణ్‌కుమార్ భేటి అయ్యారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పలు వాణిజ్య పరమైన అంశాలపై అరుణ్ కుమార్ చర్చించినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని అరుణ్ కుమార్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. దేశ పర్యటనలో ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని అరుణ్ కు కేసీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది.