Arun Kumar
-
సూపర్ సిక్స్ అడిగితే.. డైవర్షన్ రాజకీయాలా?: అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనాన్ని పచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. సూపర్ సిక్స్ అడిగితే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.‘‘ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పథకాల గురించి అడిగితే సంపద సృష్టి తర్వాతనే అమలు చేస్తామని అంటున్నారు. చంద్రబాబు ఆర్ధిక అరాచక వాది. కాగ్ లెక్కలను కూడా తప్పుగా మార్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనులను మాపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లోమీడియా ఉందని ఎలా చెప్పినా జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. 7 నెలల్లోనే లక్షా 13 వేల కోట్ల అప్పు చంద్రబాబు చేశారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు’’ అని అరుణ్‌కుమార్ నిలదీశారు.వైఎస్ జగన్ హయాంలో నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఏపీ ఉంది. ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి అడిగితే డబ్బులు లేవంటున్నారు. చంద్రబాబు మోసగాడనీ, ఆయన్ను నమ్మవద్దని జగన్ అనేకమార్లు చెప్పారు. జగన్ మాటలతో ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి’’ అని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘బాబు మోసాలను పవన్ ప్రశ్నించరా?’ -
చంద్రబాబు దావోస్ పర్యటన ఫ్లాప్
-
చంద్రబాబు దావోస్ టూర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అరుణ్‌కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దావోస్ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. దావోస్ పర్యటన పేరుతో చంద్రబాబు బృందం పెద్ద ఎత్తున ప్రజాధనంను దుర్వినియోగం చేసిందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండిపడ్డారు. కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాలేక పోయారని ఆక్షేపించారు.చంద్రబాబు, నారా లోకేష్ ప్రచార ఆర్భాటానికే దావోస్ పర్యటన పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనకు ఎంత ఖర్చు చేశారు? ఎందరు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు? ఎన్ని కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి? అన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.దావోస్ పర్యటనకు కొత్త అర్థం:సీఎం దావోస్ పర్యటనపై ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు?. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తల ముందు ఎలా ప్రజెంట్ చేశారోనని ఎదురు చూశారు. కానీ, తీరా దావోస్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, మీడియా ముందు మాట్లాడింది చూసి ప్రజలు అవాక్కయ్యారు. దావోస్ అంటే కేవలం పెట్టబడులు కావు. నెట్ వర్కింగ్. పది మందిని కలవడం. అందరితో మాట్లాడటం. కాఫీలు తాగడం. అందరితో ఫోటోలు దిగి వాటిని మీడియాకు విడుదల చేయడం.. అంటూ చంద్రబాబు చెప్పడం నివ్వెర పరుస్తోంది. దావోస్ పర్యటన అంటే పెట్టుబడులు మాత్రమే కాదు, నెట్ వర్కింగ్ అని కొత్త అర్ధం చెబుతున్నారు. చంద్రబాబు వల్లనే..:14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అనేకసార్లు దావోస్ వెళ్లారు. ఈసారి పర్యటనలో ఒక్క పారిశ్రామికవేత్తతో అయినా ఎంఓయూ చేసుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 2 లక్షల కోట్లు, మహారాష్ట్రలో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కానీ, చంద్రబాబు బృందం మాత్రం ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేక పోయింది. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదా? దావోస్ పర్యటనపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. టీవీ ఛానల్స్‌కు కోట్ల రూపాయలు ఇచ్చారు. యథేచ్ఛగా ప్రజాధనంతో పెయిడ్ మార్కెటింగ్ చేసుకున్నారు. ఇంత చేసినా చంద్రబాబు పాలనపై పారిశ్రామికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఏపీలో పెట్టుబడులకు సాహసించ లేదు.లోకేష్ ప్రమోషన్ కోసమే..:నారా లోకేష్‌ను రాజకీయ వారసుడుగా, కాబోయే సీఎంగా ప్రచారం చేసుకునేందుకే చంద్రబాబు దావోస్ పర్యటన. పారిశ్రామికవేత్తలతో 32 సమావేశాల్లో పాల్గొన్నామని చంద్రబాబు చెబుతుంటే, కాదు 38 మీటింగ్స్‌లో పాల్గొన్నట్లు లోకేష్ చెబుతున్నారు. అందులో 20 కంపెనీలు మనదేశానికి చెందినవే. మరో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవి. ఆయా కంపెనీలతో సమావేశాలకు దావోస్ దాకా వెళ్ళాలా?.జగన్ తమ హయాంలో ఒకేసారి దావోస్ వెళ్ళారు. ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. గ్రీన్ ఎనర్జీ, ఇథైనల్ ఫ్యాక్టరీల వంటివి తీసుకువచ్చారు. అయినా ఆనాడు ఎల్లో మీడియా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తూ, కథనాలు రాసింది. ఇప్పుడు అదే చంద్రబాబు, ఈసారి దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణలో పూర్తిగా విఫలం కావడంతో.. ఆ టూర్‌కు ఆయన పూర్తిగా కొత్త అర్ధం చెబుతున్నారు. తన మీద నమ్మకం లేక పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోయినా, దానిపై ప్రజల దృషి మరల్చేందుకు ఏవేవో కొత్త బాష్యాలు చెబుతున్నారు.చంద్రబాబు ఘోర వైఫల్యం:దావోస్‌లో చంద్రబాబు బృందం ఎవరితో తమ మొదటి సమావేశం నిర్వహించిందని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ సోమాజీగూడలోని స్టోన్ క్రాఫ్ట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులతో మొదటి సమావేశం జరిగింది. 150 ఎకరాల భూమి ఇస్తే దానిలో గోల్ఫ్ కోర్ట్ పెడతామనే అంశంపై చర్చించారు. దీన్ని బట్టి చంద్రబాబు బృందం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.దావోస్‌లోని అంతర్జాతీయ వేదికపై నుంచి మన రాష్ట్రంలోని వనరులు, మానవ నైపుణ్యాలు, ప్రగతిదాయకమైన ఆర్థిక విధానాలు, ఉత్తమ పాలన, పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను గురించి మాట్లాడి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. కానీ దీనికి బదులుగా రాష్ట్ర ఐటీ మంత్రి దావోస్ వేదికపైన మాట్లాడుతూ మా భవిష్యత్ నేత నారా లోకేష్, ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నాం అంటూ మాట్లాడటాన్ని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యంతో విన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఇస్తామో చెప్పకుండా తమను తాము పొగుడుకుంటూ మాట్లాడిన మాటలను చూసి అందరూ నవ్వుకున్నారు. చివరికి దావోస్ వేదికపై నుంచి జగన్‌గారిపై విమర్శలు చేశారు.దావోస్ పర్యటనలపై చంద్రబాబు గొప్పలు:రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలని నిర్ధేశించాల్సిన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కేవలం ప్రచారం ఎలా చేసుకోవాలి అనే దానిపైనే దృష్టి పెట్టింది. సీఎంగా దావోస్ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెబుతుంటారు. ఆనాడు ఐటీకి తానే ఆరాధ్యుడిని అన్నారు. ఇప్పుడు ఎఐకి ప్రాముఖ్యతను కల్పించింది తానే అని చెప్పుకుంటున్నారు.తాను దావోస్ వెళ్తుండడం చూసి మిగిలిన సీఎంలు కూడా తనను అనుసరించారని, ఆనాటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ తనను చూసే దావోస్ వచ్చారని చెబుతున్నారు. అలాంటప్పుడు బెంగుళూరు ఐటీ హబ్‌గా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఎందుకు వెనుకంజలో ఉందో చంద్రబాబు చెప్పాలి. దావోస్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ అంటే పాకిస్తాన్‌లోని హైదరాబాదా అని అడుగుతుండేవారు అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా?ఎప్పుడూ ఆర్భాట ప్రకటనలే..వచ్చింది లేదు:2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్ పర్యటన సందర్భంగా 2016లో దావోస్‌లో 32 ఎంఓయులపై సంతకాలు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అందులో 95 శాతం ఎంఓయులన్నీ నకిలీవే. 2017లో మళ్ళీ దావోస్ వెళ్ళి ఏపీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాను చేస్తానని చెప్పారు. వైజాగ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీలో రూ.4,550 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే అది ఒక డెడ్ ప్రాజెక్ట్ అయింది. 2018లో దావోస్ వెళ్ళి అమరావతిని స్కిల్ హబ్ చేస్తానని చెప్పారు.కానీ, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు పాల్పడ్డారు. 2017లో దావోస్ వెళ్ళి వచ్చి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాను, పారిశ్రామికవేత్తలు అమరావతికి రావాలని ఆహ్వానించారు. తీరా అవరావతి ల్యాండ్ పూలింగ్ స్కాంలో ఇరుక్కుపోయారు. 2019లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడారు. గతంలో తన ప్రభుత్వంలో ప్రతిఏటా ఏదో ఒక అంశంపై మాట్లాడి ప్రచారం చేసుకున్నారు.ఇప్పుడు 2024లో దావోస్‌కు వెళ్ళి వచ్చి బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంథన వనరులు అని మాట్లాడుతున్నారు. మీ కంటే ముందే గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ 2019–24 వరకు బ్లూ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడటమే కాదు పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు కూడా తీసుకువచ్చారు. ఆదానీ గ్రూప్‌తో రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. రూ.37 వేల కోట్లతో గ్రీన్ కో సంస్థతోగ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇదే ప్రాజెక్ట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అని కొనియాడారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. పనులు:వాటర్ వేస్, బ్లూ ఎకనామీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. రామాయపట్నంలో 19 బెర్త్‌లతో 138 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా పనులు చేశాం. ఇక మచిలీపట్నం పోర్ట్‌లో నాలుగు బెర్త్‌ల్లో మొదటి రెండు దశలు పూర్తి చేశాం. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్, కాకినాడ గేడ్ వే పోర్ట్ పనులు కూడా మా హయాంలోనే చేశాం.ఇవి కాకుండా పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ప్రారంభించాం. మొదటి దశలో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను ప్రారంభించాం. జువ్వలదిన్నెలో 88 శాతం పనులు పూర్తిచేశాం. నిజాంపట్నంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. రెండోదశలో ఊడుగంట్లపాలెం, పుడిమాడిక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప వంటి హార్బర్ల పనులు ప్రారంభించాం.మార్కెటింగ్ ఏజెంట్‌గా..:అన్ని పనులు చేసిన మేము, ఏనాడూ రాష్ట్రంలో బ్లూ ఎకానమీ గురించి మీలాగా ప్రచారం చేసుకోలేదు, ఆచరణలో చూపించాం. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, వైఎస్సార్ జిల్లా చక్రాయిపాలెం వద్ద 400 మెగావాట్ల ప్రాజెక్ట్, సత్యాసాయి జిల్లా ముదిగుంపు వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనకానపల్లి, రాప్తాడ్ లో 1050, బొమ్మనహళ్ళలో 850 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే. జగన్ చేసిన పనులను చెప్పుకునేందుకు మీరు దావోస్ వెళ్లారని అర్థం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు తనను తాను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్ ప్రగతిని ప్రచారం చేసే మార్కెటింగ్ ఏజెంట్‌గా మారిపోయారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. -
‘మొండితోక’ సోదరులపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నిత్యం ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమార్ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నారు. దీంతో.. 2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దాడి జరిగిందంటూ అప్పట్లో నానా హంగామా చేశారు.కానీ, అది వర్కవుట్ కాలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తాజాగా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గతంలో నమోదుచేసిన సెక్షన్–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీరును తప్పుపడుతూ సెల్ఫ్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మరిన్ని అరెస్టులు ఉంటాయని, మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అది కట్టు కథే.. అప్పుడే బట్టబయలునిజానికి.. అప్పట్లో చంద్రబాబు పర్యటన అంతా పక్కాగా ప్రణాళికతో నిర్వహించారు. నాడు నందిగామలో రోడ్డుషో జరుగుతున్న దారిలో ఆయన భద్రతాధికారిపై ఎవరో రాయి విసిరారని రాద్ధాంతం చేశారు. ఇంతలో మధుబాబు అనే వ్యక్తి తనకు గాయమైందంటూ చంద్రబాబు వద్దకు రావడం, ఆ వెంటనే దాడి జరిగిందని చంద్రబాబు ప్రకటించడం జరిగిపోయింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా.. బాధితుడు దాడిపై కాలయాపన చేసి రెండోరోజు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాలేదు. మధుబాబుకు గాయమైందని చెబుతున్న గడ్డం ప్రాంతంలో వాపులేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే, కెమెరా ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌లో ఎక్కడా దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో చంద్రబాబు ఆరోపణ అవాస్తవమని తేలిపోయింది. అయినా ఇప్పుడు మొండితోక సోదరులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు కోసం, నాటి సంఘటనను మళ్లీ ఉపయోగించుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. -
హామీల అమలెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.వైఎస్సార్సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్లో చెప్పలేదన్నారు.ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్లో మొదటిలోనే మొదలుపెట్టారని, ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు. -
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్‌స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్‌డ్రైవ్‌ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్‌డ్రైవ్‌లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్‌డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్‌కుమార్‌ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్‌డ్రైవ్‌లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన డేటాను అరుణ్‌కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్‌కుమార్‌కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
లోకం పచ్చగా ఉండాలంటే..!?
సమాజం ఎంత ఆధునికంగా మారితే ప్రకృతి అంత తీవ్రంగా ధ్వంసం మవుతున్నదనేది చరిత్ర చెబుతున్న పాఠం. అడవులను విచక్షణారహితంగా నరకడం, తిరిగి చెట్లను నాటాలనే బాధ్యతను విస్మరించడం, అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వాడటం, కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోవటం వంటి వివిధ కారణాల వల్ల పర్యావరణం కలుషితమయ్యి నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేస్తోంది. దీంతో మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది.నేడు త్రాగడానికి మంచినీరు, శ్వాసించడానికి ఆక్సిజన్ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది మనం గర్వంగా చెప్పుకునే 5జీ ప్రపంచం. మనమంతా ఈ అవనిపై అతిథులం అనే సత్యాన్ని చాలామంది గ్రహించలేపోతున్నారు. భవిష్యత్ తరాలకు బతుకునీయాలంటే, బతుకు ఉండాలంటే ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రకృతితో స్నేహం చేయాలి. పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి.మనం నాటే చెట్ల ఎదుగుదలే మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. చెట్లను నాటినట్లు నటించడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. జల వనరులను సంరక్షించాలి. అడవులను కాపాడుకోవాలి. సౌర విద్యుత్ వినియోగం పెంచాలి. వాయు కాలుష్యం తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి. ఓజోన్ పొరను కాపాడాలి.సాంకేతికంగా ఎదుగుతూనే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలి. భావి పౌరులైన విద్యార్థులకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ప్రకృతి ప్రాణంతో ఉంటేనే మనమంతా జీవంతో ఉంటాము. లేదంటే ప్రకృతి ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. ‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన అంతులేని కోరికలను కాద’ని ఏనాడో గాంధీజీ అన్నారు. కాబట్టి మనిషి ప్రకృతిని దురాశతో కొల్లగొట్టి ధ్వంసం చేయకుండా అవసరం మేరకే దానిపై ఆధారపడాలి. అప్పుడు లోకం పచ్చగా ఉంటుంది. – ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్ -
ఏ ప్రభుత్వం వచ్చినా విభజన హామీలపై దృష్టి పెట్టాలి
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. నేటికీ విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విభజన సమస్యలపై దృష్టి సారించాలి’ అని మాజీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రభుత్వాలు కాపాడలేకపోయాయి. 9, 10 షెడ్యూళ్ల ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి ఆస్తులు రూ.1,42,601 కోట్లలో విభజన హామీల ప్రకారం 58 శాతం నిధులు ఏపీకి రావాలి.ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏపీకి తీరని అన్యాయం జరుగుతోంది. రిసోర్స్ గ్యాప్ రూ.32,652 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉండగా.. రూ.5,617 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్రం.. రూ.1,750 కోట్లే ఇచ్చింది. ఏపీకి రూ.6,700 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి చేయాల్సి ఉంది. కానీ రాష్ట్రం అడిగితే ఇచ్చామని కేంద్రం లోక్‌సభలో చెప్పింది. కేంద్రమే ఇచ్చిందని రాష్ట్ర శాసనసభలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది.అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఇచ్చారా? అడగకుండా ఇచ్చారా? వంటి అంశాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఎక్కడా లేదు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారకులు ఎవరు? అధికారుల వైఫల్యమా? తదితర విషయాలు తేల్చకుండా రాజకీయ నాయకులను బాధ్యులను చేయడం సరికాదు. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో నేను వేసిన పిటిషన్‌పై వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల సమయం ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే అమరావతికి వచ్చేసి సొంత దుకాణం పెట్టింది. దీంతో రాష్ట్ర పరిస్థితి దారుణంగా మారింది’ అని అన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.ఇక, బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.ఇదిలాఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ.. -
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
-
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
రైల్వేలకు సంతృప్తికరంగా నిధులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిధులు కేటాయించారని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో దక్షిణ మధ్య రైల్వేకి రూ.14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంత వాటా రూ.5,071 కోట్లని, గత బడ్జెట్ కంటే 14.7 శాతం నిధులు అధికంగా కేటాయించారని వివరించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చనున్నట్లు వివరించారు. ఈసారి పీఎం గతిశక్తి కింద పలు ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. కవచ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ సారి రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు. తాజా బడ్జెట్లో నిధులు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇది మధ్యతరం మాత్రమేనని, పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్ – డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టు కింద రూ. 770.12 కోట్లతో 54.65 కిలోమీటర్లు అభివృద్ధిచేయనున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సారి రెండు బైపాస్ లైన్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, ఇందులో కాజీపేట్ బైపాస్ లైన్ 10.65 కిలోమీటర్లు, వికారాబాద్ మార్గంలో 2.8 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కేటాయింపులు దాదాపు 20 రెట్లు పెరిగాయని తెలిపారు. -
వికారాబాద్–కృష్ణారైల్వే లైన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో సీఎంను అరుణ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే వివేక్ కె.టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యుడు వందన చవాన్, కనకమేడల రవీంద్రకుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్‌సభ సభ్యుడు వీణాదేవి, జస్బీర్సింగ్ గిల్, రఘురామ కృష్ణరాజు ఉన్నారు. -
హైదరాబాద్‌లో ప్రమాదం.. మల్యాలలో విషాదం!
కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన యువకుడు మృతిచెందాడు. కొత్త సంవత్సరం రోజున గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన నేదూరి అరుణ్‌కుమార్(28) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో నాలుగేళ్ల క్రితమే గ్రామాన్ని వదిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. జీవనోపాధి కోసం పాల ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై షాపునకు వెళ్తుండగా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మీనర్సవ్వ, భార్య అనిత ఉన్నారు. ఇవి చదవండి: తాను నడుపుతున్న లారీ.. తనకే మృత్యు శకటమై.. -
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయని బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అరుణ్‌కుమార్ మిశ్రా సమక్షంలో గురువారం ఆమె బాధ్యతలు చేపట్టారు. న్యాయవాది, సామాజికవేత్త అయిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తా నని విజయభారతి పేర్కొన్నారు. -
బిగ్ బాస్ షో నిర్వహించే వారిదే తప్పు: న్యాయవాది అరుణ్
-
రైల్వేలో ఎలక్ట్రిక్ విప్లవం
సంప్రదాయ డీజిల్ ఇంజిన్లను రైల్వే శాఖ వేగంగా వదిలించుకుంటోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. భారతీయ రైల్వేలో కీలక జోన్లలో ఒకటిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే, ఏకంగా వేయి కరెంటు ఇంజిన్లను వినియోగంలోకి తెచ్చి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ) ప్రొపల్షన్ సిస్టంతో ఉన్న 1,000వ ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే పట్టాలెక్కించింది. దూరప్రాంతాలకు నడిచే దాదాపు అన్ని కీలక రైళ్లను ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంజిన్లతోనే నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ ఇంజిన్‌కు సహస్రాశ్వ అన్న పేరు పెట్టారు. దీన్ని లాలాగూడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ తనిఖీలో భాగంగా జోన్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ ప్రారంభించారు. సాక్షి, హైదరాబాద్: రైలు మార్గాలను విద్యుదీకరించటం ద్వారా ఆధునికతకు శ్రీకారం చుట్టిన రైల్వే ఇప్పుడు డీజిల్ ఇంజిన్లను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది. వాటిని కేవలం రైలు యార్డులు, ఇతర చోట్ల కోచ్‌లను పార్క్ చేయటానికి తరలించడం లాంటి పనులకే వినియోగించబోతోంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లను సైతం కరెంటు ఇంజిన్లతోనే నడపటం ద్వారా వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేస్తోంది. డీజిల్ వినియోగాన్ని తగ్గించటం ద్వారా చమురు ఖర్చుకు బ్రేక్ వేస్తోంది. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే కరెంటు ఇంజిన్ల వినియోగం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుంది. ♦ ప్రయాణికుల రైలును ఒక డీజిల్ లోకోమోటివ్‌తో నడిపితే సగటున ఏడాదికి 45 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. అదే గూడ్సు రైలు అయితే 15 లక్షల లీటర్లు ఖర్చు అవుతుంది. ఒక్కో ఇంజిన్ ద్వారా అంతమేర ఇంధనం ఆదా అవుతుంది. ♦ ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రయాణికుల రైలును లాగేందుకు ప్రతి కి.మీ.కు ఆరు యూనిట్ల కరెంటును ఖర్చు చేస్తుంది. డీజిల్‌తో పోలిస్తే ఇది పెద్ద ఆదా అన్నమాటే. ♦ ప్రస్తుతం ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను కూడా ఆధునికీకరించారు. సంప్రదాయ కరెంటు ఇంజిన్ బదులు తాజాగా ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ)ప్రొపల్షన్ సిస్టం ఉన్న ఇంజిన్లు వాడుతున్నారు. బ్రేక్ వేసినప్పుడల్లా ప్రత్యేక మెకానిజం వల్ల కొంత చొప్పున కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ రూపంలో 12.4 శాతం కరెంటు ఆదా అవుతుంది. దాన్ని తిరిగి గ్రిడ్‌కు పంపి.. పునర్వినియోగానికి వీలు కల్పిస్తారు. అంటే.. ఒక ఇంజిన్ సగటున సాలీనా 976 టన్నుల బొగ్గును ఆదా చేస్తుందన్నమాట. ♦ డీజిల్ వినియోగాన్ని నిరోధించటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ప్రతి లోకోమోటివ్ సంవత్సరానికి 2.362 కిలో టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ♦ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వేయి కరెంటు లోకోమోటివ్‌లలో 600 ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ (ఐజీబీటీ)ప్రొపల్షన్ సిస్టం ఉన్న ఇంజిన్లే. మిగతావి సంప్రదాయ ఇంజిన్లు. ♦సంప్రదాయ ఎలక్ట్రిక్ ఇంజిన్ 5000 హెచ్.పీ. సామ ర్థ్యం కాగా, ఆధునిక ఇంజిన్ల సామర్థ్యం 6000 హెచ్.పీ. త్వరలో అన్ని మార్గాల విద్యుదీకరణ దక్షిణ మధ్య రైల్వేలో కొత్త లైన్లు మినహా మిగతా ప్రధాన మార్గాలన్నీ విద్యుదీకరించారు. 6650 రూట్ కి.మీ.మార్గాన్ని విద్యుదీకరించగా, కేవలం 691 కి.మీ. మాత్రమే మిగిలి ఉంది. తెలంగాణకు సంబంధించి అక్కన్నపేట– మెదక్, మనోహరాబాద్–కొత్తపల్లి (సిద్దిపేట వరకు పూర్తి) మార్గాలు మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. 695 రైళ్లు కరెంటువే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లైన్ల విద్యుదీకరణ వేగంగా పూర్తి అవుతుండటం, కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వస్తుండటంతో రైళ్లకు ఎలక్ట్రిక్ ఇంజిన్లనే ఎక్కువగా వాడుతున్నారు. జోన్‌పరిధిలో ప్రస్తుతం 874 రైళ్లను కరెంటు ఇంజిన్లతోనే నడుపుతున్నారు. మరో 695 రైళ్లకు ఇంకా డీజిల్ ఇంజిన్లు వాడుతున్నారు. వీటిల్లో విద్యుదీకరించని మార్గాల్లో నడుస్తున్న రైళ్లు ఉన్నాయి. కొత్తగా కరెంటు ఇంజిన్లు అందుబాటులోకి వచ్చే కొద్దీ డీజిల్ ఇంజిన్ల వినియోగం తగ్గనుంది. మిగతా కొత్త మార్గాలను కూడా విద్యుదీకరిస్తే ఇక డీజిల్ ఇంజిన్ల వినియోగం నామమాత్రమే అవుతుంది. -
AP: గ్యాస్ సిలిండర్ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు
సాక్షి, అమరావతి: గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఫోర్టిఫైడ్ బియ్యంతో ‘ఆరోగ్యం’
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాలు, రక్తహీనత సమస్యలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్‌ను దేశంలోనే అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ఫోర్టిఫికేషన్‌పై మంగళగిరిలో గురువారం ఒక వర్క్‌షాప్ జరిగింది. దేశంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాది పొడవునా వరి సాగవుతోందని, బియ్యం నిల్వల్లో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అవసరాలకు తగ్గట్టు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సైతం ఫోర్టిఫైడ్ బియ్యం ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులతో పాటు మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్నే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. విటమిన్లతో కూడిన ఈ బియ్యాన్ని ప్రజలు ప్లాస్టిక్/చైనా బియ్యంగా అపోహపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి... ముందుగా వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన తీసుకురావాలని సూచించారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ మాట్లాడుతూ.. దేశంలోనే ఫోర్టిఫైడ్ రైస్ నాణ్యత నిర్వహణ వ్యవస్థను కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రతి దశలోనూ పరిశీలించిన తర్వాతే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. లిక్విడ్ టెస్టింగ్ ద్వారా మోతాదు ప్రకారం విటమిన్ల శాతం లేకుంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌ను అప్పటికప్పుడే తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారతీ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఉప కార్యదర్శి ఎస్‌హెచ్.లలన్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ..దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రక్తహీనత మహమ్మారిని అరికట్టడంలో భాగంగా 2019లో 11 రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ.. ప్రస్తుతం 27 రాష్ట్రాలకు విస్తరించిందని వివరించారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. మెక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ (ఎంఎస్సీ) ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఎంఎస్సీ సహవ్యవస్థాపకుడు కుంజ్ బిహారీ, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు తేజస్ ఆచారీ, ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ జేడీ కె.బాలసుబ్రహ్మమణ్యం, అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, హరియాణా, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, లద్దాఖ్, లక్షద్వీప్ మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. -
‘స్కిల్’ విచారణ సీబీఐకి!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై (పిల్) హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలతో పాటు స్కిల్ కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అప్పటి అధికారులు గంటా సుబ్బారావు, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ ఎండీ వికాస్ వినయ్ కన్వీల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, సంజయ్ డాగా, ఐఏఎస్ అధికారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీబీఐకి... ఉండవల్లి తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో రూ.371 కోట్ల ప్రజాధనం ముడిపడి ఉందన్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులందరూ ఇందులో నిందితులుగా ఉన్నారని, ప్రజాప్రయోజనాల కోసం, సమర్థమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ కేసుతో మీకు సంబంధమేంటని ప్రశ్నించింది. మాజీ ఎంపీ అయిన పిటిషనర్‌కు ఇపుడు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, రాష్ట్ర విభజనపైన, పోలవరం విషయంలో కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై వ్యాజ్యాలు వేసి న్యాయపోరాటం చేస్తున్నారని కృష్ణమూర్తి తెలిపారు. సీబీఐ దర్యాప్తును అప్పుడే కోరాం... తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ‘ఈ కుంభకోణంలో వేరువేరు రాష్ట్రాల్లో డబ్బులు భారీగా చేతులు మారాయి. రాజకీయ పార్టీలకూ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి కేబినెట్ సబ్‌కమిటీ సిఫారసుల ఆధారంగా 2020లోనే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కానీ సిట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ సందర్భంగా... కేంద్రాన్ని దీన్లో చేర్చాలని రాష్ట్రం కోరింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి స్వచ్ఛందంగా అంగీకరించింది. కానీ సిట్‌కు సంబంధించి తదుపరి ప్రొసీడింగ్స్ అన్నిటిపైనా స్టే ఇస్తూ... ఇంప్లీడ్ అప్లికేషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. కేంద్రాన్ని సుమోటోగా ఇంప్లీడ్ చేసి... కేసును మళ్లీ హైకోర్టుకు పంపింది. మళ్లీ విచారించాలని, రాష్ట్ర అభ్యర్థన మేరకు కేంద్రం కౌంటర్ గనక అఫిడవిట్ వేస్తే... దాన్ని కూడా విచారించాలని పేర్కొంది’’ అని వివరించారు. తద్వారా సిట్ చూస్తున్న వ్యవహారాలను సీబీఐకి బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదనేది తేటతెల్లమవుతోందని, అందుకే ఆ రెండు పిటిషన్లలో ఇంప్లీడ్ అప్లికేషన్లు వేసిందని వివరించారు. దాడుల హెచ్చరికలు సరికాదు... నిందితుడు చంద్రబాబు తరఫు లాయర్లు వ్యవహరిస్తున్న తీరును ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘నిందితుడి తరఫున వివిధ కోర్టుల్లో హాజరవుతున్న లాయర్లు ప్రభుత్వ న్యాయాధికారుల్ని బెదిరిస్తున్నారు. భౌతికంగా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి న్యాయాధికారులు తమ బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. అది వారి విధి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఈ రిట్ పిటిషన్లో, దర్యాప్తులో ఎలాంటి రాజకీయ కోణమూ లేదు’’ అని వివరించారు. దీంతో కోర్టు వివిధ పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
రాజమండ్రి స్టేషన్లో రైల్వే జీఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా దువ్వాడ–రాజమండ్రి సెక్షన్ల మధ్య రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్, సిగ్నలింగ్ భద్రత వ్యవస్థ అంశాలను పరిశీలించారు. అక్కడ నుంచి రాజమండ్రి స్టేషన్లో పర్యటించి క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, అక్కడి సిబ్బంది బుకింగ్ లాబీ పనితీరును సమీక్షించారు. లోకో పైలట్లు, గార్డుల విధుల నిర్వహణకు సంబంధించిన క్రూ మేనేజ్మెంట్ పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా రన్నింగ్ స్టాఫ్‌ని డ్యూటీకి తీసుకునే ముందు తగిన విశ్రాంతిని అందించడంపై దృష్టి సారించాలని, అలాగే సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా డ్యూటీ నిర్వహణ పద్ధతిని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మల్టిపర్పస్ స్టాల్స్, వన్ స్టేషన్– వన్ ప్రొడక్ట్ స్టాల్స్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల సౌకర్యాలపై సమీక్షించారు. స్టేషన్ ఆవరణలో త్వరలో ప్రారంభం కానున్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా ఆయన సందర్శించారు. ఆయనతో పాటు విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జీఎం అరుణ్‌కుమార్ జైన్‌ను కలిసి పలు రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడి వినతిపత్రాలు అందజేశారు. -
తక్కువ ధరకే నిత్యావసరాల పంపిణీ
సాక్షి, అమరావతి: ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల నమోదైందని, ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆధ్వర్యంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తక్కువ రేట్లకు నిత్యావసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేయగా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. మరోవైపు ధరల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను భారత ప్రభుత్వ వెబ్ సైట్ http://fcain foweb.nic.in/psp లో నమోదు చేయాలని సూచించినట్టు తెలిపారు. ధరల జాబితా ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపు కోసం 24, 26 కిలోల పరిమాణంలో వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని, వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్టు తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కందుల దిగుమతులు మందగించాయన్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి నాణ్యమైన రకాల బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రధాన కారణంగా అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
భద్రతా చర్యలను కచ్చితంగా పాటించాలి
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ప్రయాణికుల అంచనాలకు తగిన విధంగా అన్ని శాఖల అధికారులు రైల్వేశాఖ నిర్దేశించిన విధంగా రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సూచించారు. గురువారం సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్లో విజయవాడ డివిజన్లోని పలు శాఖల అధికారులు, సిబ్బందితో రైళ్ల కార్యకలాపాల్లో భద్రత చర్యలు అనే అంశంపై డీఆర్ఎం షివేంద్రమోహన్, ఏడీఆర్ఎం ఎం.శ్రీకాంత్‌తో కలసి జీఎం అరుణ్‌కుమార్ జైన్ సెమినార్ నిర్వహించారు. సుమారు 200 మంది అధికారులు, సిబ్బంది ఈ సెమినార్లో పాల్గొన్నారు. ముందుగా ఏడీఆర్ఎం శ్రీకాంత్ ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డిపార్ట్మెంట్ వారీగా చేపడుతున్న భద్రత చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ భధ్రత నిర్వహణలో ప్లాన్–బి లేదని, పరిపాలనశాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. రోలింగ్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎంతో విలువైనదని, దాన్ని అమలు చేయాలన్నారు. డీఆర్ఎంతో కలసి లోకో పైలట్లు, సీఎల్ఐ, టీఆర్డీ అండ్ ఎలక్ట్రికల్ సిబ్బందితో సమీక్షించి ఫీల్డ్‌స్థాయిలో వారి ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలో సెక్షన్ కంట్రోలర్స్‌తో సమావేశం నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దళితులను హింసించిన చరిత్ర చంద్రబాబుది
-
‘చంద్రబాబు.. కావాలనే జనాన్ని రెచ్చగొట్టారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సీరియస్ కామెంట్స్ చేశారు. దళిత జాతికి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దళితులను హింసించిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యర్రగొండపాలెంలో కావాలనే చంద్రబాబు జనాన్ని రెచ్చగొట్టారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మాపై దాడి చేయించారు. దళిత జాతిని చంద్రబాబు మోసం చేశారు. కానీ, దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి భారీగా సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. దీంతో, చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యుల గురించి నాలుక కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు, నారా లోకేష్ రాష్ట్రంలో చెరోచోటా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్రలు, రాళ్లతో దాడి చేసింది టీడీపీ నేతలే. ప్రజలందరూ చూస్తుండగానే టీడీపీ నేతలు దాడులు చేశారు. చంద్రబాబు.. దళితులకు క్షమాపణ చెప్పి ఎక్కడైనా తిరగొచ్చు. సురేష్ బాబు శాంతియుతంగా నిరసన చేస్తే రాళ్ల దాడి చేస్తారా?. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అమెరికా వెళ్లిన ఏడు నెలలకే..
మార్టూరు: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో అర్ధంతరంగా తనువు చాలించాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చదవడం కోసం గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ టెక్స్‌పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటుండగా, వారితో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1న అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించకుండా పోవడంతో గదిలోని స్నేహితురాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3వ తేదీన అరుణ్‌కుమార్ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో గుర్తించి స్నేహితులకు, ఇండియాలోని తండ్రి రమేష్‌కు సమాచారం అందించారు. శవ పరీక్ష అనంతరం అరుణ్‌కుమార్ మృతదేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపగా.. శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జొన్నతాళి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్ మృతికి కారణం తెలియదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశించి అమెరికా పంపిస్తే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. సాయంత్రం గ్రామంలో అరుణ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. -
‘వందే భారత్’పై ప్రయాణికుల్లో క్రేజ్
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రజలు ఇందులో ప్రయాణించేందుకు అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారని రైల్వే అధికారులు చెప్పారు. జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన ఈ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. దీని వేళలు విజయవాడ పరిసర ప్రజలకు అనుకూలంగా మారాయి. దీంతో విజయవాడ కేంద్రంగా ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. నెల రోజుల్లో విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్‌కు 8,613 మంది.. రాజమండ్రి, విశాఖకు మరో 9,883 మంది ప్రయాణించారు. విశాఖ వైపు నుంచి 9,742 మంది, సికింద్రాబాద్ వైపు నుంచి 10,970 మంది విజయవాడకు వచ్చారు. మొత్తంగా విజయవాడ స్టేషన్‌కు సంబంధించి రోజుకు సగటున 1,352 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఆకట్టుకుంటున్న సౌకర్యాలు.. వందే భారత్‌లోని ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వేగం, ఏసీతో పాటు ప్రతి కోచ్‌లో రిక్లైనర్ సీట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు, ఎమర్జెన్సీ అలారం బటన్లు, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లున్నాయి. సురక్షిత ప్రయాణం కోసం అన్ని కోచ్‌ల లోపలా, బయట సీసీటీవీ కెమెరాలు, మెరుగైన అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేశారు. ఆధునిక బయో వాక్యూమ్ టాయిలెట్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు ప్రతి కోచ్‌లో పెద్ద డిస్ప్లే యూనిట్లను ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా ‘కవచ్’ పరిజ్ఞానాన్ని కల్పించారు. 140 శాతం ఆక్యుపెన్సీ సంతృప్తికరం.. వందే భారత్ రైలు విశాఖపట్నం–సికింద్రాబాద్ మధ్య రెండు వైపులా పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. ఇరువైపులా దాదాపు 140 శాతం సగటు ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. వేగంతో పాటు ఆధునిక సౌకర్యాలుండటంతో విజయవాడ, సమీప ప్రాంతాల ప్రయాణికులు ఇందులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. – అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ -
గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా రేషన్ సరఫరా
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సరుకు రవాణాకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, ఎండీయూ వాహనం వెళ్లలేని గిరిజన గ్రామాలకు బైక్‌ల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జనవరి నుంచి కందిపప్పు, పంచదార పంపిణీతో పాటు అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల వద్దకే నిత్యావసరాలు డెలివరీ చేసేలా చూడాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో అవసరాన్ని బట్టి కలెక్టర్ కొత్త రేషన్ షాపులు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 45 శాతానికి పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్టు కమిషనర్ తెలిపారు. జనవరి చివరి నాటికి ఖరీఫ్ సేకరణ పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల సొమ్ముతో పాటు మిల్లర్ల బకాయిలనూ వేగంగా చెల్లిస్తున్నట్టు చెప్పారు. 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలకు చెల్లింపులు పూర్తి చేసినట్టు తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం చెల్లించే బకాయిల్లో కొంత మొత్తం వెచ్చించి ఆరబోత యంత్రాలు (డ్రయర్లు) ఏర్పాటు చేయాలని, లేకుంటే.. 2023 ఖరీఫ్ సీజన్ నుంచి ఆయా మిల్లులకు సీఎంఆర్ నిలిపివేస్తామని కమిషనర్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. -
ద.మ. రైల్వే పూర్తిస్థాయి జీఎంగా అరుణ్‌కుమార్ జైన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనే జర్గా కొనసాగుతు న్న అరుణ్‌కుమార్ జైన్‌ను రైల్వే శాఖ పూర్తిస్థాయి జీఎంగా నియమించింది. పదోన్న తితో ఆయనకు పోస్టింగ్ ఇవ్వటంతో సోమ వారం అరుణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన దక్షిణ మధ్య రైల్వేలో ఇన్చార్జి జీఎంగా, అదనపు జీఎంగా, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. -
‘పట్టాలు’ తప్పిన ఎనిమో మీటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే కల్వర్టులపై ఎనిమో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉండగా, మరికొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నవి సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలంటూ సోమవారం సాయంత్రం జరిగిన సమీక్షలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ మీటర్ల ఏర్పాటుతో ఆశించిన ప్రయోజనం లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెళ్లి చూసే పక్షంలో యంత్రమెందుకు? ఎనిమో మీటర్.. ఇది గాలి వేగం ఎంతుందో రికార్డు చేస్తుంది. అలాగే వరదల సమయంలో వరద ఎంతెత్తుతో ఉందో, ఎంత వేగంతో ప్రవహిస్తోందో కూడా రికార్డు చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రైల్వే కార్యాలయానికి దూరంగా ఎక్కడో ఏర్పాటు చేసిన యంత్రం రికార్డు చేసే వివరాలు.. సిబ్బంది అక్కడికి వెళ్లి చూస్తే కానీ తెలియక పోవడం, ఆ మేరకు సాంకేతికతను సమకూర్చుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు తెలుసుకునేందుకు అక్కడి వరకు వెళ్లిన సిబ్బందికి, అక్కడి వరద పరిస్థితి కనిపిస్తుంది కదా.. అంతదానికి ఆ యంత్రం ఎందుకు అన్న ప్రశ్నకు రైల్వే అధికారులు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎనిమో మీటర్లను వినియోగిస్తున్నాయి. వరద సంభవిస్తే దాని వివరాలన్నీ అవి రికార్డు చేయడమే కాదు.. ఆ సమాచారాన్ని సమీపంలోని రైల్వే కార్యాలయానికి చేరవేస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీనికి తగ్గ సాంకేతికతను ఆయా దేశాలు సమకూర్చుకున్నాయి. వాటిని చూసి ఆరేళ్ల క్రితం మన రైల్వే కూడా ఆ సాంకేతికతను సమకూర్చుకోవటం ప్రారంభించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బలార్షా సెక్షన్ల మధ్య రామగుండం సహా కొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి, వాటిని సమీపంలోని రైల్వే కార్యాలయాలతో అనుసంధానించింది. వరద వస్తే ఆటోమేటిక్‌గా ఆ సమాచారం రైల్వే కార్యాలయాలకు రావాలి. కానీ సాంకేతికత వైఫల్యంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. మీటర్లు పనిచేస్తున్నా, వాటి నుంచి సమాచారం రైల్వే కార్యాలయాలకు రావటం లేదు. లోపం ఎక్కడుందో సరిగా గుర్తించి తగు మార్పులు చేయాల్సిన రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించడం లేదు. ఉన్నా, లేకున్నా ఒకటే..! ప్రస్తుత వరదల నేపథ్యంలో, వాటిని రెగ్యులర్‌గా చెక్ చేయాలని జీఎం నుంచి ఆదేశాలందాయి. వరద వచ్చిన వెంటనే అవి కార్యాలయాలకు సమాచారం పంపితే, అక్కడి సిబ్బంది ఆయా మార్గాల్లో వచ్చే రైళ్లను అప్రమత్తం చేసి నిలిపేయటమో, వరద నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవటమో చేస్తారు. తద్వారా రైళ్లకు, ప్రయాణికులకు ముప్పు తప్పుతుంది. కార్యాలయాలకు సమాచారం రాకుండా, సిబ్బందే వాటి వద్దకు వెళ్లి చెక్ చేసి తెలుసుకోవాలంటే అవి ఉన్నా, లేకున్నా పెద్దగా తేడా ఉండదని, వాటి కోసం చేసిన వ్యయం కూడా నిరుపయోగమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్న రైల్వే అధికారులు.. విదేశాల్లో మాదిరిగా ఎనిమో మీటర్లను కార్యాలయాలతో అనుసంధానించే దిశగా చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వలిగొండ దుర్ఘటన జరిగి 17 ఏళ్లు! ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. పెద్ద చెరువు నిండి పొంగి ప్రవహించడంతో ఉన్నట్టుండి కట్ట తెగిపోయింది. గ్యాలన్ల కొద్దీ వరద ఒక్కసారిగా పోటెత్తడంతో సమీపంలోని రైల్వే లైన్ కొట్టుకుపోయింది. అర్ధరాత్రి వేళ దీపావళి సంబరాలకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో కిక్కిరిసిన డెల్టా ప్యాసింజర్ రైలు అక్కడికి చేరుకుంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ట్రాక్ కొట్టుకుపోయిన విషయం తెలియక లోకో పైలట్లు రైలును అలాగే ముందుకు పోనిచ్చారు. అంతే.. పట్టాలు తప్పిన రైలు బోగీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. నాలుగు కోచ్‌లు ఒకదానిపైకొకటి దూసుకుపోయాయి. 114 మంది దుర్మరణం చెందారు. ఇది 2005 అక్టోబర్‌లో నల్లగొండ జిల్లా వలిగొండ సమీపంలో జరిగిన ఘోర దుర్ఘటన. 17 ఏళ్లు గడుస్తున్నా.. రైల్వే ఇప్పటికీ అదే దుస్థితిలో ఉంది. ఎక్కడైనా మెరుపు వరద సంభవిస్తే అప్రమత్తం చేసే వ్యవస్థే లేకపోవడం శోచనీయం. -
సాంకేతిక సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ పరిస్థితులు లేదా విద్రోహ చర్యల వల్ల తలెత్తబోయే ప్రమాదాలను రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంలో నెలకొన్న సాంకేతిక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే.. ఇప్పుడు ఈ విషయంలో స్టార్టప్ కంపెనీల సాయం కోరుతోంది. ఈ మేరకు రూ. 3 కోట్ల వరకు ఆర్థికసాయం, మేధోహక్కుల కల్పన వంటి అంశాలతో కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై దక్షిణమధ్య రైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు బృందంతో చర్చించింది. తొలుత 11 రకాల సమస్యలను స్టార్టప్‌ల ముందుంచింది. దీనికి టీ–హబ్ సానుకూలంగా స్పందించింది. 11 సమస్యలు ఇవే.. 1. విరిగిన పట్టాను గుర్తించే సాంకేతికత కావాలి. 2. పట్టాలపై ధ్వంసమయ్యేంత ఒత్తిడి ఉంటే ముందుగానే గుర్తించగలగాలి. 3. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపు సమస్యను అధిగమించే ఏర్పాటు కావాలి. 4.రైల్వే ట్రాక్ తనిఖీలో కచ్చితత్వం ఉండే వ్యవస్థతోపాటు అన్ని లోపాలను సులభంగా గుర్తించే సాంకేతికత కావాలి. 5. అధిక బరువు వల్ల వ్యాగన్ల చక్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే దాన్ని ముందే గుర్తించే వ్యవస్థ కావాలి. 6. ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌కు సంబంధించి 3 ఫేజ్ కరెంటును వాడే వాటిల్లో సమస్యలు ఆన్లైన్లో గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయాలి. 7. గూడ్సు రైళ్లలో ఎక్కువ సరుకు పట్టేలా వ్యాగన్లను ఎలా మార్చాలి. 8.ట్రాక్‌ను మెరుగ్గా శుభ్రం చేసే సులభ విధానం కావాలి. 9. సిబ్బందికి పునఃశ్చరణ కోర్సులకు సంబంధించి యాప్‌లు రూపొందించాలి. 10.వంతెనల తనిఖీ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా జరిగేలా సాంకేతికత రూపొందించాలి. 11. ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం డిజిటల్ వ్యవస్థ కావాలి. -
నవ వధువు ఆత్మహత్య.. ఆ తగాదాలే కారణమా..?
సాక్షి, నెల్లిమర్ల: పట్టణానికి చెందిన ఓ నవ వధువు శనివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు అందించిన వివరాలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి ఇందిరా కాలనీకి చెందిన వి.భానుశృతి(25)కి విశాఖపట్నంకు చెందిన అరుణ్‌కుమార్‌తో వివాహమైంది. అరుణ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు నెలకొన్నాయి. భర్త వేధిస్తున్నట్లు ఇప్పటికే దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం భానుశృతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే పెళ్లయిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భూమా అఖిలప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు) మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఎరువులు ఫుల్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియా సహా అన్నిరకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. గుంటూరులోని చుట్టుగుంటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద ప్రస్తుత రబీకి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఉన్నట్టు సాగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు ఎరువుల నిల్వలు ఉంచామన్నారు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో యూరియా కొరత ఉన్నట్టు మీడియా ద్వారా తెలిసిందని, అక్కడ అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయం రబీ అవసరాలకు 23.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళికలు వేశామని అరుణ్‌కుమార్ తెలిపారు. ఇందులో యూరియా 9 లక్షల టన్నులని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 6.97 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి రాష్ట్రానికి 12.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని చెప్పారు. ఇందులో ఆదివారం నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని తెలిపారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 1.74 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలిపి మొత్తం 4.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి నెలకు కేంద్రం నుంచి రావాల్సిన 2.95 లక్షల టన్నుల ఎరువులు కేటాయింపులు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 49,736 మెట్రిక్ టన్నుల యూరియా జనవరి నెల సరఫరాలో లోటు కింద కేటాయించిందని చెప్పారు. ఫిబ్రవరి నెలకు మరో 20,500 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. వీటిని తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో తూర్పు గోదావరికి 17,230 మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరికి 18వేల మెట్రిక్ టన్నులు, ఉత్తర కోస్తా జిల్లాలకు 14 వేల మెట్రిక్ టన్నులు, గుంటూరుకు 19,250 మెట్రిక్ టన్నులు, నెల్లూరు జిల్లాకు 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నామని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి రైతు భరోసా కేంద్రాల వ్యవస్ధ ద్వారా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత వచ్చిందని కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక రేట్లపై వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం దుకాణాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా డీలర్లు అక్రమంగా ఎరువుల నిల్వ ఉంచినా, అధిక ధరలకు అమ్మినా టోల్ ఫ్రీ నంబర్ 155251కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 15న రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. -
9 లక్షల టన్నుల ఎరువులు ఆర్బీకేల ద్వారా సరఫరా
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అధిక మొత్తంలో ఎరువులు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. స్థానిక విత్తన పరీక్ష కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 23.45 లక్షల టన్నుల అన్ని రకాల ఎరువులను రబీ సీజన్‌కు కేటాయించిందన్నారు. వీటిలో తొమ్మిది లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. మార్చి, ఏప్రిల్ నాటి అవసరాలను ముందుగానే గుర్తించి రైతాంగానికి అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. కొరతపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మి ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టుకోవద్దని అరుణ్‌కుమార్ చెప్పారు. -
బీపీసీఎల్ చైర్మన్‌గా అరుణ్‌కుమార్ సింగ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో ఈ ఏడాది మేనెల్లో సింగ్ నియామకం జరిగింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ జరిగి, కొత్త యాజమాన్యం వచి్చన తర్వాతే చైర్మన్ నియామకం జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొలుత వర్తా లు వచ్చాయి. రాజ్‌కుమార్ గత ఏడాది పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కే పద్మాకర్ (మానవ వనరుల విభాగం డైరెక్టర్) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీపీసీఎల్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ సింగ్‌ను చైర్మన్‌గా ఎంపికచేస్తూ మే 10న ప్రభుత్వ రంగ సంస్థల నియామక వ్యవహారాల బోర్డ్ నిర్ణ యం తీసుకుంది. ఈవారం మొదట్లో ఆయన ని యామకానికి కేబినెట్ కమిటీ (నియామకాలు) ఆ మోదముద్ర వేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమ లో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఫైనాన్స్ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్ కంపెనీ కొత్త డైరెక్టర్ (ఫైనాన్స్)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్ సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్. విజయగోపాల్ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అనిల్ అగర్వాల్‌సహా మూడు గ్రూప్‌లు కొనుగోలుకు ‘‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్’’ దాఖలు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే వాటా అమ్మకాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, కరోనా వల్ల ఈ ప్రయత్నాలు ఆలస్యం అయ్యాయి. -
‘సంక్షేమ పథంలో సీఎం జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారు’
సాక్షి, అమరావతి: గడిచిన రెండేళ్లలో అనేక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.లక్ష కోట్లకు పైగా నగదును నేరుగా జమ చేసి.. సంక్షేమ పథంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ కేంద్రంగా నిర్వహించిన ‘భారతదేశంలో గిరిజన విధానాలు, కార్యాక్రమాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ ప్రతిబింబాలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్ష మంది గిరిజనులకు 2 లక్షల 30 వేల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయడం గొప్ప రికార్డు అన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. గిరిజనులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలనే సంకల్పంతోనే సీఎం జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా తగిన అభిప్రాయ సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతీయ సదస్సును నిర్వహించాయన్నారు. గిరిజనుల కోసం చేపట్టే ప్రతి పథకం ద్వారా ఫలాలు వారికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు చెప్పారు. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ వైఏ సుధాకర్‌రెడ్డి, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ డి.లక్ష్మి మాట్లాడారు. -
Corona: ఏఎఫ్ఐ మెడికల్ కమిషన్ చైర్మన్ మృతి
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెండిరటా (60) కరోనాతో మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన అరుణ్ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్ఐ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్ సంఘం అరుణ్‌ను నియమించింది. దాంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పనిచేస్తుండటం విశేషం. చదవండి: Monali Gorhe: గంటల వ్యవధిలో తండ్రీకూతురు మృతి -
ఎనిమిది మందితో ప్రేమ పెళ్లి.. వ్యభిచారం చేయాలంటూ!
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారితో సఖ్యతగా మెలిగి ఆ తరువాత వ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి పెంచాడు. గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న అరుణ్.. భార్యలతో కాకుండా తన మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురిచేశాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మీని వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. అయితే అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. కీచక భర్త ఆగడాలపై గత నెలలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక అరుణ్ కుమార్‌కు సంబంధాలున్నాయని, అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులపై డీజీపీ సీరియస్ కాగా నిత్యపెళ్లికొడుకు అరుణ్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. చదవండి: పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే.. -
అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా అరుణ్
బెంగళూరు: ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్‌కు మంచి అవకాశం లభించింది. అమెరికా క్రికెట్ జట్టుకు అతను హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి... తనకు వీసా మంజూరు కాగానే అమెరికాకు వెళ్తానని అరుణ్ అన్నాడు. అరుణ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013–14; 2014–15 సీజన్లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్’ ఘనత సాధించింది. -
నిద్రలోనే తనువు చాలించాడు
భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన భూర్ల అరుణ్‌కుమార్ (41) అమెరికాలో గురువారం రాత్రి మృతి చెం దాడు. జ్వరం, లోబీపీతో నిద్రలోనే తనువు చా లించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. అమెరికాలోని హోస్టన్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్.. రెండు రోజులుగా జ్వరం, లోబీపీ సమస్యతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమెరికా నుంచి కామారెడ్డిలోని తల్లితో భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు మాట్లాడారు. ‘అమ్మా నాకు దమ్ము వస్తోంది.. మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతోంది, రేపు మళ్లీ మా ట్లాడుతా’అని చెప్పాడు. అరుణ్ మందులు వేసుకుని నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతని భార్య రజనీ ఉద్యోగానికి వెళ్లింది. గంట తర్వాత ఫోన్ చేయగా..ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా అరుణ్ పలుకక పోవ డంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..అప్పటికే అరుణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో అరుణ్ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. అమెరికా ప్రభుత్వం సమ్మతిస్తే అరుణ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు హోస్టన్‌లోని ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ సంస్థలు సమాయత్తమయ్యాయి. మృతదేహం ఇండియాకు తేవడం సాధ్యం కాదు పలు దేశాల్లో కరోనా వ్యాధి విజృంభించడం వల్ల అమెరికా నుంచి ఇండియాకు అరుణ్ మృతదేహాన్ని పంపించేందుకు అక్కడి ప్రభుత్వం అను మతివ్వకపోవచ్చని తెలుస్తోంది. అరుణ్ అంత్యక్రియలను అక్కడే నిర్వహిస్తారని చెబుతున్నారు. అరుణ్, రజనీ తల్లిదండ్రులు గురువా రం వేకువ జామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు. -
అమెరికాలో తెలంగాణ వాసి మృతి
సాక్షి, కామారెడ్డి : అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బూర్ల అరుణ్ కుమార్(21) భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బూర్ల చంద్రశేఖర్, పద్మల కుమారుడైన అరుణ్ కుమార్ 16 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడడంతో ఆయన మరణించినట్లు బంధువులు వెల్లడించారు. అరుణ్‌కుమార్‌కు భార్య రజనీ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అరుణ్ కుమార్ మృతదేహాన్ని భారత్ తెప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. -
వలస పాలనకు ప్రతిరూపమీ చట్టం
ఒక విదేశీ శక్తి.. పాలనకు సంబంధించి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? ‘‘జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అని ఏనాడో గాంధీజీ ‘హిందూ స్వరాజ్’లో రాసిన అంశాన్ని జాతి ఎన్నటికీ మర్చిపోకూడదు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇప్పుడు చట్టమైంది. న్యాయస్థానాలు ఈ చట్టాన్ని తోసిపుచ్చినా లేక దాని అమలుపై స్టే విధించినా జాతీయ రాజ్యమైన భారతదేశం స్వభావం గురించి ఇది కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర దేశాల భూభాగాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చి, ఉపశమనం కలిగించి, పౌరసత్వాన్ని మంజూరు చేయడం అనే భావనను ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. సమస్యల్లా ఏమిటంటే, భారత్ వంటి ఉదార ప్రజాస్వామిక దేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని మతం నిర్ణయించవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై మూడు భావధారలు వ్యాప్తి చెందుతున్నాయి. మొదటగా, సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినవారు.. ఇరుగుపొరుగు ఇస్లామిక్ దేశాల్లో మతపర మైనారిటీలను తొక్కిపెడుతున్నారని, వీరికి రక్షణ కల్పించాలనే ప్రాతిపదికను ఎంచుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలను అణిచివేయరు కాబట్టి వీరిని పౌరసత్వ సవరణ బిల్లునుంచి మినహాయించవచ్చని వీరి వాదన. శ్రీలంక హిందువులకు మినహాయింపు ఎందుకు? పైగా, ఇతరదేశాల్లో ప్రత్యేకించి శ్రీలంకలోని హిందూ, ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ఈ బిల్లులో ఎందుకు మినహాయించారు అంటే 1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని లక్షల మంది శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు వారికోసం మరొక నిబంధన చేర్చాల్సిన అవసరం లేదని వీరి వాదన. పైగా, నాటి భారత, పాక్ ప్రధానులు నెహ్రూ, లియాఖత్ మధ్య 1950లో కుదిరిన ఒప్పందానికి భారత్ కట్టుబడగా, పాకిస్తాన్ దాన్ని గౌరవించలేదని వీరు వాదిస్తున్నారు. భారత్‌లోని మైనారిటీలను ఇండియా పరిరక్షిస్తూ రాగా, పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కి వలస వచ్చారని వీరి వాదన. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల జనాభా శాతం బాగా తగ్గిపోతూండగా, భారత్ లోని ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందన్న వాస్తవమే తమవాదనకు నిదర్శనం అని చెబుతున్నారు. అంటే ముస్లింలు కోరుకుంటే ఇస్లామిక్ దేశాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు కానీ ఇతర దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు మాత్రం ఆశ్రయం కోరి భారత్‌కి మాత్రమే రాగలరు కాబట్టి వారి పట్ల జాతి సానుభూతితో ఉండాలని వీరు చెబుతున్నారు. ఇక రెండోవాదన ఈశాన్య భారత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి నుంచి వస్తోంది. భారతదేశంలోకి ఏ మతానికి సంబంధించినవారైనా సరే.. వలస రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వలసలు వెల్లువెత్తితే తమ ప్రాంతం వనరులను ఊడ్చేస్తారని, తమ భాష, సంస్కృతి కూడా క్షీణించిపోతుందని వీరి భయం. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే వలసలు మరింతగా పెరిగి స్థానిక ప్రజలు అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముందని వీరి భావన. అందుకే వలస వచ్చే విదేశీయులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలు చాలావరకు సద్దుమణుగుతాయి. దేశంలో పేలవమైన పాలన, జాతీయ పౌర పట్టిక అమలు సమయంలో తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం చూపడం లేదు. ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, హిందువులు, ముస్లింలు కానీ రానున్న సంవత్సరాల్లో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించడం లేదు. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్థిక దుస్థితి రీత్యా, ఇప్పటికే తక్కువగా ఉన్న ఉద్యోగాలను వలస ప్రజలు కొల్లగొడతారని, స్థానికుల ఆర్థిక అవకాశాలను తగ్గించివేస్తారని ప్రజలు భయపడుతున్నారు. దేశ లౌకిక, సామాజిక నిర్మాణంపైనే దాడి ఇక మూడో వాదన మతపరమైన వివక్ష ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారినుంచి వస్తోంది. ఈ బిల్లు నుంచి ముస్లింలను మినహాయించాలని వీరు కోరుకోవడం లేదు. పైగా ఈ చట్టం దేశ లౌకిక సామాజిక నిర్మాణంపైనే దాడిగా వీరు భావిస్తున్నారు. పొరుగుదేశాలనుంచి అణచివేత కారణంగా భారత్‌కు వస్తున్నవారు మతపర కారణాలతోటే కాకుండా జాతి, భాషా పరమైన కారణాల వల్ల కూడా వలస వస్తున్నారని వీరి వాదన. దారిద్య్రం వంటి ఆర్థిక కారణాలే వలసలను ప్రభావితం చేస్తుం టాయి. పైగా బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి దృష్టి మరల్చడానికి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పైగా ఈ చట్టం దేశంలో మతపరమైన విభజనను మరిం తగా పెంచి ముస్లిం కమ్యూనిటీని ఏకాకులను చేస్తుంది. దేశంలో మతతత్వపరమైన వాతావరణం పెరుగుతున్న తరుణంలో మైనారిటీలు అణచివేతకు పాలబడి రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ముస్లిం పైన అయినా విదేశీయుడిగా ముద్రవేయడమే కాకుండా తాము విదేశీయులం కామని వారే నిరూపించుకోవలసి ఉంటుంది. జాతీయ పౌర పట్టీ ప్రక్రియ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది తగిన డాక్యుమెంటేషన్ కలిగిలేరు. ఇలాంటి వ్యక్తులను పొరుగుదేశాలు అంగీకరించవు కాబట్టి వీరిని శాశ్వతంగా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచాల్సి వస్తుందేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇలాంటి వారి జనాభా కూడా అధికంగా ఉంటోంది. పైగా నిర్బంధ శిబిరాలను ఏర్పర్చి అసంఖ్యాక ప్రజలను వాటిలో పెట్టి నిర్వహించడం భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి కారణంగా ఇంత అదనపు భారాన్ని మోయడం సాధ్యమేనా? ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల మదుపు, ప్రత్యేకించి విదేశీ మదుపులు వెనక్కి పోతాయి. దీనివల్ల ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదముంది. మరోవైపున ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక దాని పూర్వాపరాలను పట్టించుకోకుండా దాన్ని అమలు చేయవలసిందేనా? పైగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో చేసిన వందలాది హామీలలో ఒక ప్రత్యేక హామీ కోసం ప్రజలు పార్టీలకు ఓటు వేయరు కూడా. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పౌరసత్వ సవరణ చట్టం కారణం కాదు. అనేక ఇతర అంశాలు, ప్రత్యేకంగా ఆర్థిక దుస్థితిని నేర్పుగా పక్కన బెట్టేశారు. అందుకే పాలకపార్టీ హిందూ అనుకూల, ముస్లిం అనుకూల వైఖరిలలో ఏదో ఒకదానిని ప్రజలు స్వీకరించే ఎజెండాతో పనిచేస్తోందా? ఏకజాతిగా మనుగడ సాగించలేం! గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆనాడు హిందూ స్వరాజ్‌లో ‘‘ది హిందూస్ అండ్ మహమ్మదియన్స్’ పదవ అధ్యాయంలో గాంధీ ఇలా చెప్పారు. ‘భారత్ ఏక జాతిగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే అనేక మతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విదేశీయులు ప్రవేశించడం అనే ఒక్క కారణం జాతిని ధ్వంసం చేయలేదు. వారు దేశంలో భాగం అవుతారు... జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అందుచేత, దేశాన్ని మతపరంగా విభజించి పాలించాలనే బ్రిటిష్ వలస పాలకుల అసంపూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మనం మతపరంగా విభజించే ఎజెండాను అమలు చేసుకుంటూ పోతున్నామా? ఒక విదేశీ శక్తి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? అరుణ్ కుమార్ (ది వైర్ తోడ్పాటుతో) వ్యాసకర్త మాల్కొమ్ ఎస్ ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, రచయిత -
రైతు భరోసా: కౌలు రైతులకై గడువు పెంపు
సాక్షి, అమరావతి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 40 లక్షల 84 వేల మందికి లబ్ది చేకూరిందని వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. పథకం అమలులో భాగంగా బుధవారం లక్షా ఏడు వేల రైతు కుటుంబాలకు 97 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతీ బుధవారం పథకం కొత్త లబ్దిదారులకు రైతు భరోసా కింద సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. నవంబర్ 15 నాటికి అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 9న రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో తహశీల్దార్, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో అర్హులైన రైతుల అర్జీలు పరిష్కరిస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా డిసెంబర్ 15 వరకు రైతు భరోసా గడువు పెంచినట్లు పేర్కొన్నారు. -
ఏపీలో 13 జిల్లాలకు రూ.13 కోట్లు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించారు. ఇప్పటికే కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించడానికి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పంటకు కనీస మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబానికి తక్షణమే సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి వ్యవసాయశాఖ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించింది. ఇందుకోసం 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున రూ.13 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు రూ. కోటి రూపాయలు చొప్పున వారి గ్రీన్ చానెల్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇక మీదట దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే తక్షణమే వారి కుటుంబాలకు జిల్లా కలెక్టరే స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. -
మరో విడత రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్
సాక్షి, అమరావతి: ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా పధకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వచ్చే రెండు బుధవారాల్లో లబ్ధిదారులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అరుణ కుమార్ స్పష్టం చేశారు. -
‘రాష్ట్రంలో యూరియా కొరత లేదు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూరియా నిల్వలు ఖరీఫ్ సీజన్ అవసరాల మేరకు ఉన్నాయని వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యూరియా నిల్వలపై ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో యూరియాకు కొరత ఎక్కడా లేదని, ప్రస్తుతం రెండు లక్షల టన్నుల యూరియా నిల్వలు మార్క్‌ఫెడ్, డీలర్స్ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు సెప్టెంబర్ మాసంలో రాష్ట్ర వ్యవసాయ అవసరాల నిమిత్తం కేంద్రం మూడు లక్షల టన్నుల యూరియాను కేటాయించిందన్నారు. డీలర్లు అధిక ధరలకు యూరియాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుకు అవసరం లేని ఎరువులను బలవంతంగా అమ్మజూపినా డీలర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే సంబంధిత షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని అరుణ కుమార్ పేర్కొన్నారు. -
ఏవియేషన్ ఎండీగా భరత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా భరత్ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీజేపీ నేతపై దాడి
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్‌పై స్క్రూ డ్రైవర్‌తో దాడి చేసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. భగత్‌సింగ్ కాలనీలో నివసించే అరుణ్‌కుమార్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా అదే బస్తీకి చెందిన టిప్పర్ డ్రైవర్ మురళి నిర్లక్ష్యంగా దూసుకొస్తూ అతడిని ఢీకొట్టాడు. దీనిపై అరుణ్‌కుమార్ ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మురళి అరుణ్‌కుమార్‌పై దాడికి యత్నించడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. అదే బస్తీకి చెందిన తన స్నేహితుడు ఎలక్ట్రీషియన్ అభిలాష్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడికి వచ్చిన అభిలాష్ తన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్‌తో అరుణ్‌కుమార్ మెడపై విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అరుణ్‌కుమార్ వారి నుంచి బయటపడేందుకు యత్నించినా మద్యం మత్తులో అభిలాష్ స్నేహితుడు మురళితో కలిసి అరుణ్‌కుమార్‌ను గట్టిగా పట్టుకుని దాడి చేయడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించగా నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రాత్రి నిందితులను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అరుణ్‌పై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని స్నేహితుడు విష్ణుపై కూడా నిందితులిద్దరూ దాడి చేశారు. -
విలువల పెంపుకోసమే ఎన్నికల్లో పోటీ
దుగ్గొండి/నల్లబెల్లి: రాజకీయాల్లో విలువలు పెం చడానికి జనసమితి పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అరుణ్‌కుమార్‌ను పోటీలో ని లిపిందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం అన్నారు. మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు.. ఎవరూ ఉండకూడదు..ప్రతిపక్షం పలకవద్దు.. అనే రీతిలో నేటి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఆదివాసీల ముద్దుబిడ్డ, ఉన్నత విద్యావంతుడు, విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన అరుణ్‌కుమార్ ట్రంకు పెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ షేక్ జావిద్, మండల నాయకులు నామోజు మురళి, వరికెల బాబురావు పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చట్టాలను పారదర్శకంగా అమలు చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రం లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
సంబంధం చెడగొట్టాడని.. వ్యక్తి దారుణ హత్య
సాక్షి, చిల్పూరు: పెళ్లి సంబందం చెడగొట్టాడనే నెపంతో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోడబండతండా సమీపంలో గత నెల 29న జరిగింది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, కట్కూరు ఎస్ఐ పాపయ్య నాయక్, చిల్పూరు ఎస్ఐ శ్రీనివాస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతిపల్లి గ్రామానికి చెందిన కూరపట్ల అరుణ్‌కుమార్(30)కి భార్య లత, ఏడాది బాబు ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరుకు చెందిన మాధవితో అరుణ్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం పరిచయం ఉండేది. వారి మధ్య తరచు గొడవలు జరగడంతో అతడు, ఆమెను వదిలి లతను వివాహమాడాడు. అనంతరం మాధవికి చిల్పూరు మండలం ఫత్తేపూర్‌కు చెందిన వేల్పుల రవికుమార్‌తో గత నెల 30న పెళ్లి నిశ్చయమయింది. విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్ గతంలో మాధవితో కలిసి తిరిగిన ఫోటోలను, వారు మాట్లాడుకున్న సంభాషణలను పెళ్లికొడుకుకు పంపాడు. దీంతో మాధవిని పెళ్లి చేసుకోనని రవికుమార్ చెప్పాడు. తమ కూతురి వివాహాన్ని అడ్డుకున్నాడని మాధవి తండ్రి రాములు, వారి కుటుంబ సభ్యులు గత నెల 29న చిన్నరాతిపల్లికి వెళ్లి అరుణ్‌కుమార్‌ను పెళ్లికొడుకు వద్దకు వచ్చి అబద్ధం చెప్పానని చెప్పాలంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. అరుణ్‌కుమార్ తల్లి మల్లమ్మ కూడా అదే ఆటోలో వెళ్లింది. బోడబండతండా సమీపంలోకి రాగానే అరుణ్‌కుమార్ పారిపోయాడు. రాములుతో పాటు వెంట వచ్చిన వారు అరుణ్‌కుమార్‌ను వెంబడిస్తూ వెళ్లి దారుణంగా హత్య చేశారు. పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆటో వద్దకు వచ్చి అరుణ్‌కుమార్ తల్లికి మీ కొడుకు తప్పించుకుపోయాడని చెప్పి అదే ఆటోలో వెనక్కి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిన కొడుకు నుంచి సమాచారం రాకపోవడంతో అనుమానంతో కట్కూరు పోలీస్‌స్టేషన్‌లో అరుణ్‌కుమార్ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిని విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితులతో ఘటనా స్థలానికి వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశారు. కేఎంసీ ప్రొఫెసర్ మోహన్ నాయక్ పోస్టుమార్టం చేయగా చిల్పూరు తహశీల్ధార్ శ్రీలత శవ పంచనామా చేశారు. -
15–20 నిమిషాల ముందుగానే రైల్వేస్టేషన్‌లోకి
న్యూఢిల్లీ: విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా ప్రయాణికులు రైలు బయలుదేరేందుకు 15–20 నిమిషాల ముందుగా స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైల్వేస్టేషన్ల ప్రవేశమార్గాలను మూసివేస్తారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లలో దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 202 రైల్వే స్టేషన్లలో ఈ ఏకీకృత భద్రతా వ్యవస్థ(ఐఎస్ఎస్)ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులు ఓసారి లోపలకు వచ్చాక ఎన్ని రైల్వేస్టేషన్లలో ప్రవేశమార్గాలను మూసివేయగలమో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో కొన్నిచోట్ల గోడలు నిర్మించడం, మరికొన్ని చోట్ల ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏకీకృత భద్రతా వ్యవస్థలో భాగంగా ఈ 202 రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, యాక్సస్ కంట్రోల్, బ్యాగేజీ–ప్రయాణికుల స్క్రీనింగ్ వ్యవస్థ, బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పరికరాలను అమరుస్తామని కుమార్ తెలిపారు. సాధారణంగా విమాన ప్రయాణికులు కొన్ని గంటల ముందుగా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారనీ, కానీ తాజా విధానంలో రైల్వే ప్రయాణికులు కేవలం 15–20 నిమిషాల ముందు స్టేషన్‌కు వస్తే సరిపోతుందని వెల్లడించారు. స్టేషన్లోకి వచ్చే ప్రయాణికుల్లో కొందరిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణికుల్ని స్టేషన్ ప్రాంగణం బయటే తనిఖీ చేసి లోపలకు అనుమతిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.385.06 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. -
పోలీస్ కస్టడీ నుంచి నిందితుడి పరార్?
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట పోలీసుల కస్టడీ నుంచి నిందితుడు 1వ వార్డు కౌన్సిలర్ అరుణ్‌కుమార్ గురువారం పోలీసుల కళ్లుగప్పి ఛాకచక్యంగా తప్పించుకుపారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు అరుణ్‌కుమార్‌పై వివిధ వివాదాలకు సంబంధించి ఇదివరకే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా సాయిబాబా మందిరం కాలనీలో నిర్మిస్తున్న ఓ చర్చి విషయంలో తలదూర్చి పాదర్ డేవిడ్‌ను బేదిరించి భయబ్రాంతులకు గురి చేసిన విషయంలో ఈ నెలలో అతనిపై మరో కేసు నమోదైంది. నాలుగు కేసులకు సంబంధించి కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌ను పోలీసులు గురువారం సాయంత్రం 4 గంటలకు అదుపులోకి తీసుకుని విచారించారు. రిమాండ్ రిపోర్టు రాసిన తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుపారిపోయినట్లు సమాచారం. కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌పై 2016లో 384, 379 సెక్షన్ల కింద వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2017లో 448, 447 సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. 2018 జనవరిలో 447, 506 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డిను వివరణ కోరగా కౌన్సిలర్ అరుణ్‌కుమార్‌పై నమోదైన కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. పోలీస్టేషన్లో ఉన్న నిందితుడు అరుణ్‌కుమార్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకి వేళ్లిపోయాడని సమాధానమిచ్చారు. -
నోట్ల రద్దుతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నోట్ల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకూ, ఆర్థిక వ్యవస్థ అంచనాలకూ పొంతనలేదని ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ అన్నారు. ‘నల్లధనం, నోట్ల రద్దు, జీఎస్టీ’అంశంపై గురువారం ఇక్కడ సీపీఎం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు ద్వారా పేదలకు మేలు జరుగుతుందన్న వాదనలో పసలేదని, అది ప్రభుత్వం చేసిన జిమ్మిక్కు మాత్రమేనని తేలిపోయిందన్నారు. నూటికి 93 శాతంగా ఉన్న అసంఘటిత రంగం ఆర్థిక లావాదేవీలు కుంటుబడ్డాయని, దాని ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధిపై పడిందని తెలిపారు. నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెనక్కి రాకపోగా దానిని తెల్లధనంగా మార్చుకునే అవకాశాన్ని ధనవంతులకు కల్పించినట్లు అయిందని ఆరోపించారు. నోట్ల రద్దుతో నగదు చలామణిలో లేకపోవడం వల్ల పెట్టుబడులు తగ్గి, బ్యాంకులు రుణాలివ్వని పరిస్థితి ఏర్పడిందని, ఉత్పత్తి కుంటుపడిందని, ఫలితంగా 25 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికే నోట్ల రద్దు అని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. నల్లధనమంతా విదేశీ బ్యాంకుల్లో, స్థిరాస్తుల రూపంలో, వ్యాపారాల్లో పోగైందని, నగదు రూపేణా ఉన్నది చాలా చిన్న మొత్తమేనని అన్నారు. -
ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలకు టోకరా
పీఎం పాలెం (భీమిలి) : ఏటీఎం కేంద్రంలో జరిగిన మోసంలో ఓ వ్యక్తి రూ.50 వేలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... బిహార్‌కు చెందిన అరుణ్ కుమార్‌కు మధురవాడ అలహాబాద్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. తన ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకోడానికి ఈ నెల 18న సాయంత్రం మధురవాడ ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ డబ్బు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మెషీన్ నుంచి డబ్బులు రాకపోవడంతో అక్కడే ఉన్న వ్యక్తి సహాయం చేసి నగదు తీసి ఇచ్చాడు. అనంతరం వేరే కార్డు అరుణ్‌కుమార్‌కు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో అరుణ్‌కుమార్ ఖంగు తిన్నాడు. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలిస్తే ఆ కార్డు నకిలీదని గుర్తించాడు. జరిగిన మోసంపై బాధితుడు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
చివర్లో పళనికి షాక్.. మరో ఎమ్మెల్యే జంప్
-
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
చెన్నై: అన్నా డీఎంకే రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఈ రోజు తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఎదుర్కొనే బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. కాసేపట్లో బలపరీక్ష జరగనుండగా, పళనిస్వామి శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతుగా ఓటు వేయబోనని ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ప్రకటించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరారు. నిన్నరాత్రి వరకు పళనిస్వామి శిబిరంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అరుణ్ కుమార్ జంప్ కావడంతో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షలో పళనిస్వామి నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీరు సెల్వం శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్న కోయంబత్తూరు ఎమ్మెల్యే నటరాజన్ పన్నీరు సెల్వం వర్గంలో చేరారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు రావడంతో ఈ రోజు బలపరీక్షలో ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. బలపరీక్షలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ విద్యార్థి మృతి
-
అప్పారావును రక్షించేందుకే కమిషన్ వేశారా..
-
అప్పారావును రక్షించేందుకే కమిషన్ వేశారా..
హైదరాబాద్: రోహిత్ వేముల దళితుడని రెవిన్యూ అధికారులు చెప్పినా.. రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ అన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీసీ అప్పారావును రక్షించేందుకే రూపన్వాల్ కమిషన్‌ను వేశారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్చిట్ ఇచ్చిన ఈ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు. కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం కోసం వెతకడం దారుణమని అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య లేఖలో కులవివక్ష గురించి రోహిత్ రాసిన విషయాలు కమిషన్‌కు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనలకు వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతిస్తుందని ఆరుణ్ కుమార్ స్పష్టం చేశారు. -
పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ :జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరై భవనాల డిజైన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రగతి లేదన్నారు. ఇప్పటికే మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే అవి రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. భారీవర్షాల నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక జిల్లాలో ఈనెల 14 నుంచి 22 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు తెలిపారు. 2,459 హెక్టార్లలో వరి, 830 హెక్టార్లలో అపరాలు, 563 హెక్టార్లలో ప్రత్తి, 20 హెక్టార్లలో మిరప నీట మునిగినట్టు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందాయన్నారు. 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు దెబ్బతిన్నాయని, 244 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.52.57 కోట్లు, తక్షణ పనులకు రూ.2.48 కోట్లు అవసరమవుతాయన్నారు.రాజమహేంద్రవరంలోని కుమారీ టాకీస్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపును మూసివేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిపై కలెక్టర్ ఆదేశాలు ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 180 మంది అర్జీదారులు హాజరయ్యారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీలను స్వీకరించారు. -
చైతన్యపురిలో భారీ చోరీ
-
చైతన్యపురిలో భారీ చోరీ
హైదరాబాద్ : మెడికల్ షాపు యజమాని ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి బీభత్సం సృష్టించారు. నగరంలోని చైతన్యపురి ఆర్.కే పురం కాలనీలోని రోడ్ నెంబర్ 5లోని అరుణ్ కుమార్ ఇంట్లో రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోని రూ.1.80 లక్షలతోపాటు బంగారు గాజులు, రెండు బంగారు గొలుసులు, ఓ నక్లెస్ ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అరుణ్‌కుమార్ ఇంటికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. -
మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు దీక్ష విరమణ
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు శనివారం దీక్షను విరమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆయన దీక్షను విరమింపజేశారు. జగ్గయ్యచెరువులో గృహాల కూల్చివేతపై గత ఐదు రోజులుగా పెండెం దొరబాబు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహాల కూల్చివేతపై జేసీని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ విచారణకు ఆదేశించారు. -
కోర్టుకు హాజరైన జబర్దస్త్ టీం
హుజూరాబాద్ : ఈటీవీలో ప్రసారం అవుతున్న బజర్దస్త్ టీంలోని నటులు శుక్రవారం హుజూరాబాద్ సబ్కోర్టుకు హాజరయ్యారు. పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వర్రావు, ఫణి కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. అయితే నిర్మాత ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, మిగతా నటుల తరఫున న్యాయవాది ముక్కెర రాజు పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణకై న్యాయమూర్తి కంచె ప్రసాద్ కేసును జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈటీవీలో 'జబర్దస్త్' కార్యక్రమంలో న్యాయవాద వృత్తిని అగౌరవ పరిచేలా ప్రసారం చేయడం ద్వారా సెక్షన్ 500 ఐపీసీ ప్రకారం నేరం చేశారంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది అరుణ్‌కుమార్ హుజూరాబాద్ సబ్ కోర్టును కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, సినీ నటి, ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు, యాంకర్లు అనసూయ, రష్మీలతోపాటు 22 మందికి సమన్లు జారీ అయ్యాయి. -
'టీడీపీ ప్రభుత్వం బోనులో నిలబడింది'
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ... రోజాను అసెంబ్లీలోని అనుమతిస్తే ప్రభుత్వానికి హుందాగా ఉండేదని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి తీర్పు ఎందుకు అమలు చేయలేదో న్యాయస్థానానికి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ఎందుకు బేఖాతరు చేస్తుందో వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చట్టాలకు పాలకులే విలువ ఇవ్వకపోతే సామాన్యులు ఎలా గౌరవిస్తారని ఆయన ప్రశ్నించారు. శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా టీడీపీ తప్పుమీద తప్పు చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించకపోవడంతో టీడీపీ ప్రభుత్వం బోనులో నిలబడి ఉందని లాయర్ అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. -
సీహెచ్‌ఎన్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పిఠాపురంలోని కమ్యునిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్ఎన్సీ)లో గురువారం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై మండిపడ్డారు. సీహెచ్‌ఎన్‌సీలో కనీసం ఇంజక్షన్లు, సిరంజీలు లేకపోవడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయంలో వైద్యాధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
కాలేజ్ కు మద్యం తాగొచ్చి..
అనంతపురం క్రైం: మద్యం తాగి కళాశాలకు వచ్చిన విద్యార్థి ని లెక్చరర్ మందలించడంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని రాంనగర్ రైల్వేగేట్ వద్ద గురువారం వెలుగు చూసింది. పట్టణంలోని శారదా నగర్‌కు చెందిన ఎస్. అరుణ్‌కుమార్(18) స్థానిక ఇంటలెక్చువల్ పాల్టెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మద్యం సేవించి కళాశాలకు హజరయ్యాడు. అక్కడ స్నేహితులతో సరదాగా గొడవ పడుతున్న సమయంలో తరగతి గదిలోని కిటికి అద్దం పగిలింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థులను పిలిచి మందలించాడు. దీంతో ఇద్దరు విద్యార్థులు తాము చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరారు. అయితే అరుణ్ కుమార్ మాత్రం ఉపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతను మద్యం తాగి ఉన్నాడని గుర్తించిన సదరు ఉపాధ్యాయుడు అతన్ని తన గదికి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ఏం జరిగిందనే విషయం తెలియక పోగా అప్పటి నుంచి అరుణ్ కుమార్ కళాశాలకు రావడం మానేశాడు. నిన్న ఇంట్లోంచి బయటకు వెళ్లిన అరుణ్ రాంనగర్ రైల్వే గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీఆర్పీ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డీఎంహెచ్ఓ .. డిష్యుం డిష్యుం
సాంబమూర్తినగర్ (కాకినాడ) : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సావిత్రమ్మ పనితీరు సక్రమంగా లేదని, ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్‌కుమార్‌కు డీఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాల్సిందిగా కలెక్టర్ ఆ లేఖలో కోరారు. దీంతో డాక్టర్ పవన్ కుమార్ బుధవారం ఉదయం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన రాజమండ్రి పుష్కర పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. కొద్దిసేపటికే డాక్టర్ సావిత్రమ్మ డీఎంహెచ్ఓ చాంబర్‌కు వచ్చి కూర్చున్నారు. తనకు ప్రభుత్వం నుంచి గాని, కలెక్టర్ నుంచి గాని ఎటువంటి లిఖితపూర్వకమైన ఉత్తర్వులు అందలేదని, తాను డీఎంహెచ్‌ఓగానే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. డాక్టర్ పవన్‌కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ఆయన బాధ్యతలు స్వీకరించిన సంగతి తనకు తెలియదన్నారు. కాగా ఇద్దరు అధికారుల మధ్య సిబ్బంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుంటున్నారు. తన వద్దే విధులు నిర్వహించాలని, తన వాహనం ఇచ్చేది లేదని డీఎంహెచ్ఓ డాక్టర్ సావిత్రమ్మ పట్టుబట్టడం వివాదాస్పదమవుతోంది. అంతేకాకుండా ఆమె కలెక్టర్ అరుణ్ కుమార్‌కు వ్యతిరేకంగా సిబ్బందితో చర్చించడం కూడా వివాదాలకు తావిస్తోంది. తనకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నుంచి తాఖీదులు అందేంతవరకూ తానే డీఎంహెచ్‌ఓనని చెబుతూ కలెక్టర్ ఆదేశాలను ఉటంకించడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా కలెక్టర్ అరుణ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేందుకు మంగళవారం రాత్రి డాక్టర్ సావిత్రమ్మ కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే జిల్లా అధికారి కావడంతో పోలీసులు అందుకు తిరస్కరించి, తిప్పి పంపివేసినట్లు కొంతమంది సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
భారత్‌కు ఐదు పతకాలు
న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్‌కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్‌లో నాసిర్ హుస్సేన్‌కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్‌లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
ఏజెన్సీ ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యాచరణ
సాంబమూర్తినగర్ (కాకినాడ) : గిరిజనులకు ఆరోగ్య సేవలపై కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గిరిపుత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం, వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవడం కోసం ఆయా ప్రాంతాల్లోని నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు ప్రత్యేకాధికారుల ను నియమించారు. ఏజెన్సీ, విలీన మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పది మంది ప్రోగ్రాం అధికారులకు ప్రత్యేకాధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వు ల్లో కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని కేంద్రాలను వారంలో ఒక రోజు తనిఖీ చేయాలన్నారు. జాతీ య పథకాలన్నింటినీ పర్యవేక్షించాలని ఆదేశించారు. టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్, ఎన్హెచ్ఎం నిధుల వినియోగం, మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టం, జేఎస్వై, జేఎస్ఎస్కే, శిక్షణ కార్యక్రమాలు, ఆర్బీఎస్కే వంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రత్యేకాధికారులపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రత్యేకాధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ఆశిస్తోం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమాలను హాబిటేషన్లలో నిర్వహించే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి (ప్రతి నెలా 2, 4 మంగళవారాల్లో) తాను ప్రత్యేకాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపా రు. ఇందుకు సంబంధించిన సౌకర్యాలు, వసతులను ప్రత్యేకాధికారులకు కల్పించాల్సిందిగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సావిత్రమ్మను ఆయన ఆదేశించారు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల వారీగా నియమితులైన ప్రత్యేకాధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యేకాధికారి పేరు హోదా కేటాయించిన సీహెచ్‌సీ, పీహెచ్సీ డాక్టర్ సులోచన డీసీహెచ్ఎస్, రాజమండ్రి గంగవరం, పిడతమామిడి, ఎల్లవరం డాక్టర్ పవన్ కుమార్ ఏడీఎంహెచ్ఓ(ఎయిడ్స్,లెప్రసీ) మారేడుమిల్లి, బొందులూరు, గుర్తేడు డాక్టర్ ప్రసన్నకుమార్ ఏడీఎంహెచ్ఓ(టీబీ) పి. గెద్దాడ, దేవీపట్నం, కొండమొదలు డాక్టర్ ప్రసన్నాంజనేయులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ జీడికుప్ప, కుతూరు డాక్టర్ మల్లికార్జున్ ఎన్హెచ్ఎం గౌరీదేవిపేట, నెల్లిపాక, లక్ష్మీపురం డాక్టర్ సత్యనారాయణ పీఓ డీటీటీ అడ్డతీగల, వై.రామవరం, చవిటిదిబ్బలు, దుప్పలపాలెం డాక్టర్ అనిత డీఐఓ నర్సాపురం, వాడపల్లి, ఇందుకూరుపేట ప్రసాదరాజు డెమో జడ్డంగి, లాగరాయి, రాజవొమ్మంగి ప్రసాద్ డీఎంఓ మంగంపాడు, తులసిపాకల, ఏడుగురాళ్లపల్లి -
సినిమా డెరైక్టర్ కారుకు ప్రమాదం
మద్దిపాడు(ఆంధ్రప్రదేశ్): ప్రకాశం జిల్లా మద్దిపాడు-కొష్టాలు మధ్య జాతీయ రహదారిపై తమిళ సినిమా డెరైక్టర్ ముకళంజియం కారు బోల్తా కొట్టి అందులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ (36) మృతి చెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సినిమా డెరైక్టర్ ముకళంజియం తన స్నేహితుని వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వచ్చి తిరుగు ప్రయాణంలో కొష్టాలు సెంటర్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు కుడివైపు ముందు చక్రం పేలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండో వైపు రోడ్డులో నాలుగు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న అరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మద్దిపాడు ఎస్ఐకు సమాచారమందించడంతో కారులోని వారిని 108 ద్వారా రిమ్స్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్‌పాండేకు తీవ్రగాయాలు కాగా, డెరైక్టర్ ముకళంజియం, నటుడు పెరుంజిత్తన్, డ్రైవర్ ఎస్.బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డెరైక్టర్ ముకళంజియం పూమణి, పూందొట్టం, కెలుక్కుమెరుక్కుం, మిటా మెరాస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మృతి చెందిన అరుణ్‌కుమార్ తంజావూరు జిల్లా పాపనాడుకు చెందినవారని తెలిసింది. ముకళంజియంది కూడా తంజావూరే. మద్దిపాడు ఎస్ఐ వి.మహేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాశతో కిడ్నాప్..హత్య
వీడిన అరుణ్‌కుమార్ మర్డర్ కేసు మిస్టరీ నిందితుడి అరెస్టు చందానగర్: గతనెల 23న ద్వారకా టిఫిన్ సెంటర్ సమీపంలో అనుమానాస్పద స్థితి జరిగిన కాపారపు అరుణ్‌కుమార్ హత్య కేసు మిస్టరీని చందానగర్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ డీఐ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన గండి నవీన్ (26) ఎంబీఏ పూర్తి చేశాడు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రూ.2 లక్షలు నష్టపోయాడు. తర్వాత తండ్రి రూ. 20 లక్షలు అప్పు చేసి ఇవ్వగా.. రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో లాభాలు రావడంలేదు. దీనికి తోడు చేసిన అప్పుకు ప్రతి నెల రూ. 40 వేల వడ్డీ చెల్లిస్తుండటంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు ఎవరినైనా కిడ్నాప్ చేయాలని నవీన్ పథకం వేసి.. జూన్ 26న హైదరాబాద్‌కు మకాం మార్చాడు. వెంకటగిరి కాలనీలో ఉంటున్న స్నేహితుల వద్దకు వచ్చాడు. జీఆర్‌ఏ పరీక్షకు కోచింగ్ తీసుకొనే వారు ధనవంతులవుతారని, వారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీలోని బ్రూ క్లిన్ ప్రివ్యూ కోచింగ్ సెంటర్లో చేరాడు. కిడ్నాప్ చేసిన వారిని నిర్భందించేందుకు హౌసింగ్‌బోర్డులో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కోచింగ్ సెంటర్లో మొదట విజయవాడకు చెందిన మహేష్ ధనవంతుడిగా గుర్తించి, పరిచయం పెంచుకున్నాడు. తన ఫ్లాట్‌కు పిలిచి మద్యం తాగించబోయాడు. అతడు నిరాకరించడంతో కిడ్నాప్ పథకం బెడిసికొట్టింది. సాయి అనే విద్యార్థిని తన రూమ్‌కు ఆహ్వానించగా అతను నిరాకరించాడు. ఇదిలా ఉండగా... వైజాగ్‌కు చెందిన కాపారపు శివనాయుడు కుమారుడు అరుణ్ కుమార్ (31) వైజాగ్‌లో నగల షాపు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అనుభవం కోసం తన బంధువుల షాపులో కొన్ని రోజు పని చేద్దామని 3 నెలల క్రితం నగరానికి వచ్చాడు. ఇతనితో ఓ పార్టీలో నవీన్‌కు పరిచయం ఏర్పడింది. అరుణ్ ఆస్తిపరుడిని గ్రహించిన నవీన్ అతడి ని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. పార్టీ ఇస్తానని గత నెల 22న హౌజింగ్ బోర్డులోని తన ఫ్లాట్‌కు ఆటోలో తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో మద్యం బాటిల్ కాన్నాడు. ఫొటోలు చూస్తానని అరుణ్ సెల్‌ఫోన్ తీసుకొని స్విచ్ఛాప్ చేశాడు. తర్వాత మద్యంలో నిద్రమాత్రలు వేసి తాగించాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. అరుణ్ నిద్రలోకి జారుకోగానే..గోనెసంచిలో బంధించి తాళ్లతో బిగించాడు. తర్వాత మేల్కొన్న అరుణ్ పెద్దగా అర్వడంతో కట్టెతో తలపై మోదాడు. మళ్లీ అరవడంతో మరోసారి మోదాడు. దీంతో అతను చనిపోయాడు. కంగారుపడ్డ నవీన్.. మృతదేహాన్నిఎక్కడైనా వదిలేయాలని నిర్ణయించుకొని ఆటోలో ఎక్కించాడు. తర్వాత చందానగర్‌లోని ద్వారకా హాటల్ సమీపానికి మృతదేహాన్ని తీసుకొచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడని అక్కడి వారికి చెప్పాడు. మంచినీళ్లు తెచ్చి తాగిస్తానని చెప్పి మృతదేహాన్ని అక్కడే విచి పారిపోయాడు. ఇలా ఛేదించారు... ‘సాక్షి’లో వచ్చిన ఫొటో ఆధారంగా మృతుని బంధువులు చందానగర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించారు. 23న మధ్యాహ్నం అరుణ్ సెల్‌ఫోన్‌ను నవీన్ స్విచ్ఛాన్ చేశాడు. అరుణ్ ఆచూకీ తెలియక అతని ఫోన్‌కు బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారు. అతని ఫోన్ లాక్ కావడంతో సిమ్‌కార్డు బయటకు తీసి.. తన వద్ద ఉన్న ఫోన్లో వేసి ‘ నేను క్షేమంగా ఉన్నా.. భయపడవద్దు’అని అరుణ్ కుటుంబసభ్యులకు మెసేజ్ చేశాడు. అయితే, పోలీసులు ఆ సెల్‌ఫోన్ గతంలో ఉపయోగించిన నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నవీన్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. -
జొరమొచ్చినా...పట్టించుకోలేదు..!
ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆవేదన పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీపీ, సర్పంచ్ అనంతగిరి : జొరమొచ్చినా పట్టించుకోలేదు...ఆస్పత్రికి తీసుకెళ్లలేదు...ఇంటికెళ్దామన్నా పంపించలేదు....అంటూ శివలింగాపురం ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తుండడంతో జ్వరంతో ఇంటికి వెళ్లలేక, పాఠశాలలో ఉండలేక ఏంచేయాలో తెలియడం లేదన్నారు. స్థానిక ఎంపీపీ పైడితల్లి శనివారం ఆ పాఠశాలను తనిఖీ చేసినపుడు విద్యార్థుల దుస్థితిని గమనించారు. వారం రోజులుగా తాము జ్వరాలతో బాధపడుతున్నా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని విద్యార్థులు తెలిపారు. కాగా ఎంపీపీ తనిఖీ నిర్వహించిన సమయంలో వార్డెన్, హెచ్ఎం కూడా పాఠశాలలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం శివలింగపురం ఆశ్రమ పాఠశాలలో సమర్డి తిరుపతి, మామిడి కృష్ణ, గెమ్మేల జయరాజు, కిల్లో అరుణ్ కుమార్, గరం వికాష్‌లతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇది గమనించిన ఎంపీపీ పైడితల్లి, సర్పంచ్ దుడ్డు సోములు వైద్యాధికారులకు సమాచారం అందించి వైద్య సహాయం అందించారు. ఇదిలా ఉండగా వసతిగృహల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని, సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్ఎం, వార్డెన్లను ఎంపీపీ హెచ్చరించారు. -
'ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడండి'
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాద్ లో పర్యటించేలా చేయాలని యూఎస్ వాణిజ్యశాఖ సహాయకార్యదర్శి అరుణ్‌కుమార్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్క్షప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్ తో అరుణ్‌కుమార్ భేటి అయ్యారు. కేసీఆర్ తో జరిగిన సమావేశంలో పలు వాణిజ్య పరమైన అంశాలపై అరుణ్ కుమార్ చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని అరుణ్ కుమార్ కు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. దేశ పర్యటనలో ఒబామా హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని అరుణ్ కు కేసీఆర్ తెలిపినట్టు తెలుస్తోంది. -
ఆవేశంలో ఆత్మహత్యలు బాధాకరం
వైఎస్సార్ సీపీ నేత మొండితోక అరుణ్‌కుమార్ వీరులపాడు : ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థి ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గనేత డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యిప్పల నాగిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం విజయవాడ కృష్ణా బ్యారేజిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పరిటాల అమృతసాయి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాన్ని శుక్రవారం పెద్దాపురం తీసుకువచ్చారు. మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహానికి అరుణ్‌కుమార్‌తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కోటేరు ముత్తారెడ్డి, బండి జానకీరామయ్య, ఆవుల రమేష్‌బాబు, కోటేరు సత్యనారాయణరెడ్డి, పరిమి కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీరు, మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు రోజూ మాదిరిగానే గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన తన కుమారుడు శవమై రావడం చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి నామకరణం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1994వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దాపురం గ్రామానికి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆ నాటి బహిరంగ సభలో నాగిరెడ్డి కుమారుడిని ఎత్తుకుని యిప్పల రాజశేఖర్రెడ్డిగా నామకరణం చేశారు. ఆ విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు. అమృతసాయి కళాశాలకు సెలవు.... తమ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి యిప్పల నాగిరెడ్డి మృతికి సంతాపం సూచికంగా అమృత సాయి కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్నిసందర్శించి నివాళులర్పిస్తూ కంటతడి పెట్టారు. -
‘మహేశ్’ మాయ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. బంగారంలోన్ పేరిట బ్యాంకులో దాదాపు రూ.3 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితమే ఇది వెలుగులోకి రాగా, సంస్థాగత విచారణ నేపథ్యంలో బయటపడలేదు. ఆన్లైన్లో బినామీ అకౌంట్లను తెరచి, రుణం పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ సూత్రధారులని తెలుస్తోంది. వీరిద్దరినీ ఇప్పటికే సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, సాక్షాత్తూ బ్యాంకు ఎండీ ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణంపై కొత్తగా బ్యాంకు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చాలా ఏళ్లుగా ఇదే తంతు మహేశ్ బ్యాంకులో డిపాజిట్‌దారుల సొమ్మును గత రెండు, మూడేళ్లుగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వీటి వెనుక పెద్ద స్థాయి వ్యక్తులే ఉండడంతో ఎలాంటి చర్యలూ ఉండడం లేదని, తూతూమంత్రపు విచారణ జరుపుతున్నారని బ్యాంకు వర్గాలే అంటున్నాయి. మరోవైపు తాజా కుంభకోణం విషయానికి వస్తే .... బ్యాంకు నిర్వహణలోని లోపాలను ఆసరాగా చేసుకున్న ఖమ్మం బ్రాంచి సిబ్బంది బంగారం రుణం పేరుతో కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఆన్లైన్లో బినామీ అకౌంట్లను తెరిచి బంగారం డిపాజిట్ చేయకుండానే రుణం తీసుకున్నారు. ఈ విధంగా 21 మంది పేర్లతో దాదాపు రూ.3 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు యాజమాన్యం గత 15 రోజులుగా సంస్థాగత విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేసింది. వీరిద్దరిని విచారించేందుకు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి సిబ్బంది వచ్చారు. గత కొన్ని రోజులుగా బ్యాంకు వద్ద హైదరాబాద్‌కు చెందిన సెక్యూరిటీ గార్డులే కాపలా కాస్తుండడం గమనార్హం. అయితే, సస్పెండ్ చేసిన ఇద్దరిలో ఒకరి వద్ద నుంచి ఆస్తులను బ్యాంకు రాయించుకున్నట్టు సమాచారం. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే, మరో ఉద్యోగి కూడా తప్పు చేశాడని విచారణలో తేలినా ఆయన బ్యాంకుకు తిరిగి ఆ మొత్తాన్ని కట్టేందుకు ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కుంభకోణం విషయమై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్టు సీఐ రెహమాన్ తెలిపారు. బ్యాంకు కొత్త మేనేజర్ కనకరాజు ఫిర్యాదు మేరకు జి.అరుణ్‌కుమార్, కె.శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేశారు. బినామీల పేరుతో దాదాపు రూ.1.62 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ విలేకరులకు తెలి పారు. అయితే, దాదాపు రూ.3కోట్ల నిధులు దుర్వినియోగం కాగా, కేవలం రూ.1.62 కోట్లకే కేసు నమోదు చేయడం గమనార్హం. గత రెండు, మూడేళ్లుగా జరుగుతున్న ఈ తతంగంలో పెద్ద చేపలే పడే అవకాశం ఉండడంతో హైదరాబాద్స్థాయిలోని ఉన్నత స్థాయి పోలీసు అధికారుల చేత సిఫారసు చేయించి ఈ ఇద్దరు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకునేలా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కానీ, పోలీసులు బ్యాంకు లావాదేవీలన్నింటిపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, బ్యాంకుకు సంబంధించిన పెద్ద తలకాయలే పట్టుబడతాయని బ్యాంకు వర్గాలంటున్నాయి. -
ఇంజనీర్‌పై దాడి కేసులో ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు (డీజేబీ) అధికారిపై చేయిచేసుకున్నందుకు ఢిల్లీ పోలీసులు దేవ్లీ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. తమ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఆప్ ఎమ్మెల్యే, ఆయన మనుషులు దాడి చేశారని డీజేబీ సంగంవిహార్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే జార్వాల్‌ను అరెస్టు చేశామని డీసీపీ కరుణాకరణ్ తెలిపారు. సంగంవిహార్ ప్రాంతంలో ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ పనులను పర్యవేక్షిస్తున్న జూనియర్ ఇంజనీర్ అరుణ్‌కుమార్‌పై ఎమ్మెల్యే, అతని గూండాలు దాడి చేశారని డీజేబీ ఆరోపించింది. ‘గురువారం ఉదయం ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ ప్రారంభించాం. అయితే డ్రిల్లింగ్‌ను నిలిపివేయవలసిందిగా ఎమ్మెల్యే సన్నిహితుడొకరు అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించకుండా ఏ పని మొదలుపెట్టకూడదని ఆ వ్యక్తి చెప్పాడు. తవ్వకాలను మధ్యలోనే ఆపివేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడమేగాక డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమేర్పడుతుంది. అందుకే అరుణ్‌కుమార్ పనుల కొనసాగింపునకు ఆదేశించారు’ అని డీజేబీ పేర్కొంది. ఆ తరువాత ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే తన మనుషులతో వచ్చి అరుణ్‌కుమార్‌పై చేయిచేసుకున్నారని, ఫలితంగా ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చిందని డీజేబీ తెలిపింది. -
ప్రియురాలు మోసగించిందని ప్రియుడి వీరంగం
తనను ప్రేమించిన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ మండల కేంద్రమైన తాండూరులో గురువారం ఓ యువకుడు కొద్దిసేపు వీరంగం వేశాడు. సదరు యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన ఎం.అరుణ్‌కుమార్ తిర్యాణికి చెందిన యువతితో కరీంనగర్లో ప్రేమాయణం కొనసాగించాడు. సదరు యువతి కరీంనగర్లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో ఆ యువతి తన స్వగ్రామానికి వచ్చి రెండ్రోజుల క్రితం మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్ ఆ యువతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నావంటే తాను నమ్మడం లేదని పేర్కొన్నాడు. తాండూర్ ఐబీకి వస్తే తన భర్తను చూపిస్తానని ఆ యువతి చెప్పింది. దీంతో గురువారం సాయంత్రం భర్తతో కలిసి వచ్చిన ఆ యువతితో అరుణ్‌కుమార్ గొడవకు దిగాడు. తనను మోసగించవద్దని, పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డాడు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపు అరుణ్‌కుమార్ తాండూర్‌లో హల్చల్ చేశాడు. తనకు ఆ యువతే కావాలంటూ కనిపించిన వారికల్లా తన ప్రేమ కథ చెప్పడంతో జనం భారీగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న తాండూర్ అదనపు ఎస్సై రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకుని అరుణ్‌కుమార్‌తో మాట్లాడారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
కల్లు దుకాణంపై ఎక్సైజ్ దాడులు
కౌడిపల్లి, న్యూస్‌లైన్ : కల్తీ కల్లు సరఫరా చేస్తున్న దుకాణంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సీసాలను ధ్వంసం చేయడంతో పాటు సీహెచ్, డైజోఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూకుట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో మెదక్, సంగారెడ్డి ఈఎస్టీఎఫ్ (ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్‌ఫోర్స్) అధికారులు అరున్‌కుమార్, సైదులు, నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు సుమారు 40 మంది సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో సోదాలు చేసి కల్లును రసాయన పరీక్షలు నిర్వహించారు. దీంతో కల్తీని తేలడంతో కల్లు సీసాలు, పెట్టెలు, డ్రమ్‌తో పాటు కల్లు కలిపే సిమెంట్ తొట్టిని ధ్వంసం చేశారు. అనంతరం కల్లు యజమాని దుర్గగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా 15 కిలోల సీహెచ్ (క్లోరోహైడ్రెడ్), 500 గ్రాముల డైజోఫాం లభించడంతో వాటిని సీజ్ చేశారు. దీంతో పాటు కల్లు దుకాణం లెసైన్స్ హోల్డర్ శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు. కల్లు విక్రయదారులు శేఖర్‌గౌడ్, రవిగౌడ్‌లను అదుపులోనికి తీసుకుని నర్సాపూర్‌కు తరలించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అధికారులు గ్రామంలో ఈనెల 7న కల్లు దుకాణంపై దాడులు చేసిన సంఘటనలో ఎక్సైజ్ అధికారులపై గౌండ్ల కులస్తులు దాడి చేసి గాయపరచిన సంఘటన తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తలో భాగంగా గురువారం ఎక్సైజ్ అధికారులు సుమారు 40 మంది సిబ్బందిఓ వచ్చి దాడులు నిర్వహించారు. -
కళోత్సవాలు వాయిదా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అనుకున్నట్టే అయ్యిం. శాతవాహన కళోత్సవాలు మళ్లీ వాయిదాపడ్డాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో కళోత్సవాలు జరగడం లేదని, ఎప్పుడు నిర్వహించేది ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాత వెల్లడిస్తామని ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో చెప్పారు. సుదీర్ఘకాలంగా వాయిదాపడుతూ వస్తున్న కళోత్సవాల నిర్వహణకు తేదీలు ప్రకటించడంతో ఈసారయినా జరుగుతాయని అందరూ అనుకున్నారు. ఈ తరుణంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య గత శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన కోలుకోవడానికి మరో నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతోపాటు ప్రభుత్వం ఆశించిన మేర నిధులు మంజూరు చేయకపోవడం, విరాళాలు సైతం సమకూరకపోవడంతో కళోత్సవాలను వాయిదా వేయడమే మంచిదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో మంత్రి శ్రీధర్‌బాబు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఉత్సవాల నిర్ణయంపై మంత్రిపైనే భారం వేసిన జిల్లా యంత్రాంగం చివరికి ఆయన సూచనలతోనే వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఆరేళ్ల నుంచి అదే దుస్థితి.. జిల్లా చరిత్ర, సంస్కృతిని చాటే శాతవాహన కళోత్సవాలు ఆరేళ్ల క్రితం వైభవంగా జరిగాయి. ఆ తర్వాత ఇప్పటివరకు ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది జనవరిలో కళోత్సవాలు నిర్వహించడానికి అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రణాళిక రూపొందించారు. కానీ వివిధ కారణాలతో నాలుగుసార్లు వాయిదాపడ్డాయి. తర్వాత కలెక్టర్‌గా వచ్చిన వీరబ్రహ్మయ్య నవంబర్ 23,24,25 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించినా అలా జరగలేదు. తాజాగా మరోసారి కళోత్సవాలు వాయిదా వేయడం విశేషం. ఈ నేపథ్యంలో కళాభిమానులకు మళ్లీ అసంతృప్తే మిగిలింది. వచ్చే ఏడాదిలోనైనా ఉత్సవాలు జరుపుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.