కౌడిపల్లి, న్యూస్‌లైన్ : కల్తీ కల్లు సరఫరా చేస్తున్న దుకాణంపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సీసాలను ధ్వంసం చేయడంతో పాటు సీహెచ్, డైజోఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూకుట్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో మెదక్, సంగారెడ్డి ఈఎస్‌టీఎఫ్ (ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్‌ఫోర్స్) అధికారులు అరున్‌కుమార్, సైదులు, నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు సుమారు 40 మంది సిబ్బంది దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణంలో సోదాలు చేసి కల్లును రసాయన పరీక్షలు నిర్వహించారు. దీంతో కల్తీని తేలడంతో కల్లు సీసాలు, పెట్టెలు, డ్రమ్‌తో పాటు కల్లు కలిపే సిమెంట్ తొట్టిని ధ్వంసం చేశారు. అనంతరం కల్లు యజమాని దుర్గగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా 15 కిలోల సీహెచ్ (క్లోరోహైడ్రెడ్), 500 గ్రాముల డైజోఫాం లభించడంతో వాటిని సీజ్ చేశారు. దీంతో పాటు కల్లు దుకాణం లెసైన్స్ హోల్డర్ శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేశారు. కల్లు విక్రయదారులు శేఖర్‌గౌడ్, రవిగౌడ్‌లను అదుపులోనికి తీసుకుని నర్సాపూర్‌కు తరలించారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన అధికారులు
గ్రామంలో ఈనెల 7న కల్లు దుకాణంపై దాడులు చేసిన సంఘటనలో ఎక్సైజ్ అధికారులపై గౌండ్ల కులస్తులు దాడి చేసి గాయపరచిన సంఘటన తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తలో భాగంగా గురువారం ఎక్సైజ్ అధికారులు సుమారు 40 మంది సిబ్బందిఓ వచ్చి దాడులు నిర్వహించారు.
కల్లు దుకాణంపై ఎక్సైజ్ దాడులు
Published Fri, Apr 18 2014 12:29 AM | Last Updated on Fri, Aug 17 2018 5:07 PM
Advertisement
Advertisement