ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి | MLC Pochampally Srinivasa Reddy Responds To Farmhouse Controversy | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి

Published Thu, Feb 13 2025 4:07 PM | Last Updated on Thu, Feb 13 2025 4:51 PM

MLC Pochampally Srinivasa Reddy Responds To Farmhouse Controversy

సాక్షి, హైదరాబాద్‌: ఫామ్‌హౌస్‌ వివాదంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. ఫామ్‌హౌస్‌ తనదేనని.. రమేష్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి..  తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.

ఫామ్‌హౌస్‌ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్‌ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్‌ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

 

 

 


 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement