Pochampally
-
ఫామ్‌హౌజ్‌కి పోయి 8 ఏళ్లు అవుతోంది: పోచంపల్లి
సాక్షి, హైదరాబాద్: ఫామ్‌హౌస్ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫామ్‌హౌస్ తనదేనని.. రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.ఫామ్‌హౌస్ కోడిపందాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫామ్‌కు యజమానికిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా కూడా చేర్చారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ తీవ్ర కలకలం రేపింది. కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్-3 అండ్ గేమింగ్ యాక్ట్, సెక్షన్-11 యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఫామ్‌హౌస్‌ను శివ కుమార్ వర్మ లీజ్‌కు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ఆ షాపులపై రంగు పడింది
భూదాన్ పోచంపల్లి: పేటెంట్ హక్కు కలిగి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి విక్రయిస్తున్న పలు వస్త్ర దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 8న సాక్షి దినపత్రికలో ‘ఇక్కత్‌కు ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 12 చేనేత వస్త్రాల షోరూంలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అక్కడి షాపుల్లో విక్రయిస్తున్న ఇక్కత్ ప్రింటెడ్, పవర్‌లూమ్‌లపై తయారైన వస్త్రాలను సీజ్ చేసి సంబంధిత షాపు యజమానులకు నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. దినపత్రికలలో వచ్చిన కథనానికి స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోచంపల్లిలో సీజ్ చేసిన వస్త్రాలను చెన్త్నెలోని ల్యాబ్టెస్టింగ్కు పంపిస్తామని, ప్రింటెడ్ వస్త్రాలు అని తేలితే నిందితులు స్థానికులైతే కేసు నమోదు చేస్తామని, లేదా ఇతర రాష్ట్రాలలో తయారైనవిగా తేలితే అక్కడి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. హ్యాండ్లూమ్ మార్కు తప్పనిసరి స్వచ్ఛతకు నిదర్శనమైన హ్యాండ్లూమ్ మార్కు, సిల్క్మార్క్తో పాటు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ట్యాగ్ చేసిన చేనేత వస్త్రాలను మాత్రమే పోచంపల్లి వస్త్ర వ్యాపారులు అమ్మాలని వెంకటేశం కోరారు. దాడుల్లో జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్, డీఓలు ప్రసాద్, సంధ్యారాణి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు -
‘కేంద్రంలో సంకీర్ణమే.. బీఆర్ఎస్ లేకుండా ఎవరూ ప్రధాని కాలేరు’
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికలపై సంచలన కామెంట్స చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి పర్యటనలో ఉన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్నకు ప్రతీక మగ్గం. సీఎం కేసీఆర్‌కు నేతన్నల కష్టాలు తెలుసు. నేతన్నల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరిట పొదుపు పథకం తీసుకొచ్చాం. రైతుబీమా తరహాలో నేతన్నకు బీమా తెచ్చాం. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్లే సాధ్యమైందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు. ఉప్పల్‌లో హ్యాండ్లూమ్ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. మాది కోతల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. 2001లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు. ఇది కూడా చదవండి: నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు.. వైన్స్ టెండర్లు మాత్రం క్లియర్.. కేసీఆర్ సర్కార్ బీజేపీ ఫైర్ -
పోచంపల్లిలో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
-
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సుమన్, గరీమా చౌహాన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లిలో మొదలైంది. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా చివరి షెడ్యూల్లో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో 100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
జనగామలో జగడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతున్న ఎమ్మెల్సీ
జనగామ గులాబీ గూటిలో ముసలం ముదిరిందా?... సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెడుతుంది ఎమ్మెల్సీలేనా?... ఇంటిపోరుతో సతమతం అవుతున్న ముత్తిరెడ్డి సీటుకు ఎసరు పెట్టారా?...అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. గ్రూప్ రాజకీయాలతో గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్న పుల్లల రాయుడు ఎవరు?.. జనగామ జగడానికి కారణం ఏంటీ? ఉద్యమాల ఖిల్లా జనగామలో బీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యతిరేక వర్గం తాజా ఆడియో సంభాషణ కలకలం సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన సీటును పదిలపర్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి, మరోవైపు వ్యతిరేక వర్గం వ్యూహాలు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రసవత్తరంగా జనగామ రాజకీయం ఇదే సమయంలో స్వపక్షంలోని స్థానికులు గ్రూప్ కట్టి స్థానికతను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ అందుకు ఆజ్యం పోస్తున్నట్లు తాజా ఆడియో వైరల్ తో స్పష్టమౌతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి స్థానికేతరుడనేది అడొస్తే.. పట్టభద్రుల స్థానానికి మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కలిసేందుకు జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి పలువురితో సంప్రదింపులు జరపడం హాట్ టాఫిక్‌గా మారింది. పోచంపల్లి'.. లేదంటే 'పల్లా'కు జై జనగామ నుంచి పోటీ కోసం ఇప్పటికే యాదగిరిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిల పేర్లుండగా.. తాజాగా తెరమీదకు ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు వచ్చింది. ఈ మేరకు జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పలువురు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో నర్మెట జెడ్పీటీసీ సభ్యుడు ఎం.శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. చదవండి: పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై జడ్పీ చైర్మన్ ఆడియో వైరల్ కలకలం 'పల్లా రాజేశ్వర్ రెడ్డి లోకల్ వాడు.. జనగామ నియోజకవర్గం నుంచి నిలబడమని మనం సపోర్ట్ చేద్దాం.. ఇంకొకటి ఏమిటంటే మొత్తం జనగామ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి.. కాబట్టి 4 మండలాల వారు (చేర్యాల, మద్దూరు, దులిమిట, కొమురవెల్లి) వస్తారో రారోగాని నువ్వు, మన 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ కేసీఆర్ సార్‌కు ఇవ్వాలి. అన్ని నేను చూసుకుంటా.. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు.. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వమందాం.. మన ఆలోచన ఇది. నువ్వు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చెయ్యి, సారుతోటి మంచిగా మాట్లాడు. మీకు అంతా అనుకూలంగా ఉంటది. అందరూ ఒకే అంటారు అని చెప్పు.. నర్మెట సీను ఫోన్ చేస్తాడని చెప్పిన మన తమ్ముడే, మీరంటే పడి చస్తాడని చెప్పిన నువ్ కూడా అదే విధంగా మాట్లాడు.. మళ్లీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు' అంటూ జెడ్పీటీసీ శ్రీనివాస్‌తో మాట్లాడిన పాగాల సంపత్ రెడ్డి ఆడియో రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ముత్తిరెడ్డికి ఇంటిపోరు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. ఇటీవల తన కూతురు తుల్జా భవానిరెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా చేర్యాలలో తండ్రి ఇచ్చిన స్థలాన్ని కూడా మున్సిపాలిటీకి ధారాదత్తం చేశారు. ఓ వైపు ఇంటిని చక్కబెట్టుకుంటూనే అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీలోనూ కుంపటి రాజుకుంటోంది. ఆయనంటే ససేమిరా అనే గ్రూపు ఈసారి ఎన్నికల నుంచి తప్పించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తుంది. చదవండి: కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా? ఈ క్రమంలో ముత్తిరెడ్డి వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనను కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆయనతో దిగిన ఫొటో లతోపాటు కార్యక్రమాలను విస్తృతంగా ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇంత జరుగుతున్నా తన పని తాను చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. 'సిట్టింగ్'గా ఉన్న టికెట్ నాకే, గెలుపు నాదే నంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో తెరపైకి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు రావడం నియోజకవర్గంలో కలకలం సృష్టిస్తుంది. గ్రూప్ రాజకీయాలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి. పుల్లల రాయుడి ఫిట్టింగ్ గ్రూపు రాజకీయాలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతుంది పుల్లల రాయుడిని ప్రచారం సాగుతుంది. అధిష్టానం పెద్దలకు దగ్గరగా ఉండే నాయకుడు అటు జనగామ, ఇటు స్టేషన్ ఘన్పూర్, మరోవైపు వరంగల్ పశ్చిమ లో సిట్టింగ్ ఎమ్మెల్యే లు సీట్లకు ఎసరు పెట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు అంతర్గత విబేదాలకు పుల్లల రాయుడు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు బదులు ఎమ్మెల్సీ కడియం పేరు తెరపైకి రావడం, అటు జనగామలో ముత్తిరెడ్డికి బదులు పోచంపల్లి, పల్లా పేర్లు తెరపైకి తేవడం వెనుక పొలిటికల్ డ్రామాగా ఓరుగల్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా...
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40 వేల కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒడిశాకు చెందిన అధికారుల బృందం రాష్ట్రం లోని చేనేత సంక్షేమ పథకాలను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళి శాఖల అధికారులు, కలెక్టర్లు, చేనేత కార్మికులతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం కింద కరోనా సమయంలో రూ.93 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.10.24 కోట్లతో పోచంపల్లి, ఆలేరు, కనుకుల, శాయంపేట, కమలాపూర్, ఆర్మూర్, వెల్టూర్, వేములవాడలో బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోచంపల్లి హ్యాం డ్లూమ్ పార్కు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించామని, గద్వాల చేనేత పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నేతన్నకు చేయూత కొనసాగింపు.. నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నారాయణపేటలో చేనేత కళాకారుల కోసం కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) నిర్మించేందుకు ఇప్పటికే స్థలం కేటాయించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ స్థలంలో సీఎఫ్‌సీతో పాటు సర్వీస్ సెంటర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత అవార్డు గ్రహీతలకు ఇస్తున్న నగదు పురస్కారాన్ని రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన 18 మంది కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలు అందజేశారు. వీరిలో ఇద్దరికి కేటీఆర్ చేతుల మీదుగా ఇవ్వగా, మరో 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్లు అందజేశారు. వర్చువల్ విధానంలో కేటీఆర్‌తో అవార్డు గ్రహీతలతో సంభాషించి ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత పథకాలపై అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ‘ఆలంబన’ ఆవిష్కరణ చేనేత జౌళి శాఖ రూపొందించిన ‘ఆలంబన యాప్’ను కేటీఆర్ ఆవిష్కరించారు. వర్చువల్ సమావేశంలో యూఎన్డీపీ డిప్యూటీ రెసిడెంట్ నదియా రషీద్, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత జౌళి శాఖ సంచాలకులు శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
వేధిస్తున్న సిబ్బంది కొరత
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. ఏడాది కాలంగా సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో చోటు చేసుకునే సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 28 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 13 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా అరకొర సిబ్బందితో ఉన్న వారిపై పనిభారం పెరిగుతుందని పలువురు వాపోతున్నారు. స్టేషన్ పరిస్థితి ఇలా.. పోలీస్‌స్టేషన్ పరిధిలో 22 గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. కాగా స్టేషన్లో 21 మంది కానిస్టేబుళ్లకు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. 8 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 13 మందిలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద భువనగిరి హెడ్‌క్వాటర్స్‌కు అటాచ్ చేశారు. ఒకరు సీఐ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తుండగా, మరొకరు రోడ్డు ప్రమాదంలో గాయపడి సెలవుల్లో ఉన్నారు. వీరు పోను మిగిలిన 9 మందిలో ఒకరు రైటర్ కాగ, మరొకరు ప్రతిరోజు కోర్టు డ్యూటీకి వెళ్తారు. మరో ఇద్దరికి రెగ్యులర్‌గా స్టేషన్ వాచ్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన ఐదుగురు సిబ్బంది మండలంలో శాంతిభద్రతల విధులతో పాటు, ఇటు ప్రముఖుల బందోబస్తు, హైవేపై చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహించాల్సి వస్తుంది. స్టేషన్లో ఉన్న ఇద్దరు హోంగార్డులు జీపు డ్రైవర్లుగా ఉన్నారు. స్టేషన్లో కనీస సిబ్బంది లేకపోవడంతో సమస్యల పరిష్కారం సైతం మందకోడిగా జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని గ్రామ పోలీస్.. గతంలో ప్రతి గ్రామానికి ఓ పోలీస్ అధికారిని అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దీంతో పల్లెల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా గ్రామాధికారులు పరిష్కరించే వారు. సిబ్బంది కొరతతో గ్రామ పోలీస్ అధికారులు లేకుండా పోయారు. ప్రతి చిన్న సమస్యకు ప్రజలు మండల కేంద్రంలోని స్టేషన్‌కు తప్పడం లేదు. -
పోచంపల్లిలో అమెరికన్ల సందడి
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో శుక్రవారం అమెరికన్లు సందడి చేశారు. రెండు వారాల భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా దేశానికి చెందిన డాక్టర్, లాయర్, జ్వువెల్లరీ డిజైనర్, టీచర్, నర్సు, థెరపిస్ట్‌లు 10 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత గృహాలను సందర్శించి మగ్గాలు, నూలు, చిటికి కట్టడం, అచ్చు అతకం, రంగులద్దకం, డిజైన్ వేయడం తదితర వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. సంక్లిష్టమైన చేనేతలో ఎంతో నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎంతో ప్రాచీనమైన చేనేత కళను కాపాడుకోవాలని అన్నారు. స్థానికులతో మమేకమై వారి జీవన విధానాలు, ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల ఆదరణ, ఫ్రెండ్లీనేచర్ ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నోయెల్ మాట్లాడుతూ భారతదేశ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌ను సందర్శించారని తెలిపారు. అంతర్జాతీయ ఇక్కత్‌కు పేరొందిన పోచంపల్లిని సందర్శనకు వచ్చారని అన్నారు. వీరిలో స్టీవెన్చాంపెగ్నే, లెస్లీ చాంపెగ్నే, షీరా లబెల్లే, జార్జ్ ఆడమ్స్, మైకెల్ వాల్చ్, జాన్ ఫెంటన్, లిండా ఫెంటన్, సూసాన్ మార్టిన్, బన్నీస్టీన్, ఎలీసన్ కెన్వే ఉన్నారు. -
నేతన్నలకు గవర్నర్ నరసింహన్ భరోసా
సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికులకు అన్ని ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీ అమలయ్యేలా చూస్తానని నేతన్నలకు గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా పోచంపల్లిలోని చేనేత మ్యూజియంలో గవర్నర్ బుధవారం చేనేత సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత ఉత్నత్తులకు మార్కెటింగ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నేతన్నలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించేలా చర్యలు చేపడతానన్నారు. చెనేత కార్మికులకు జియో టాగ్ నంబర్ కల్పిస్తామన్నారు. నిఫ్ట్ విద్యార్థులకు వివిధ చేనేత డిజైన్లపై పోచంపల్లిలో శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను,దండు మల్కాపురం గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మేల్యే ప్రభాకర్ రెడ్డితో కలిసి గవర్నర్ సందర్శించారు. -
పోచంపల్లికి మహర్దశ..!
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి): పర్యాటక కేంద్రమైన పోచంపల్లి కి మహర్దశ రానుంది. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పోచంపల్లి అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ద్వారా మూడు కోట్ల రూపాయలను మం జూ రు చేయించారు. గత వారం రో జుల క్రితం హెచ్ఎండీఏ అధికారులు పో చంపల్లిని సందర్శించి చేపట్టే సీసీ రో డ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులను ప రిశీలించారు. అయితే మండల కేం ద్రంలో కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తు న్నా, అభివృద్ధికి మాత్రం నోచుకోక ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఎట్టకేలకు మౌలిక వసతులు ఒనగూరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేపట్టేది ఇక్కడే.... మంజూరైన రూ. 3 కోట్ల నిధులలో రూ. 2 కోట్లు సీసీ రోడ్లు, మరో కోటి రూపాయలు అంతర్గత డ్రెయినేజీలకు ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గాంధీనగర్‌లోని పాతబస్తీ, లక్ష్మణ్‌నగర్ కాలనీ, భావనారుషిపేట, సాయినగర్ కాలనీ, రాంనగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ, మార్కండేయనగర్, నారాయణగిరిలో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. అలాగే రూ. 80లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీ నుంచి చిన్నేటి వరకు, ఇ టు రూ.20లక్షలతో వెంకటరమణ కా లనీ లో అంతర్గత డ్రెయినేజీలు ని ర్మించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూ ర్తికాగానే పనులను చేపట్టనున్నారు. నెరవేరిన హామీ.. పర్యాటక కేంద్రమైన పోచంపల్లిని గతంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. తన నిధులతో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి సీసీ, డ్రెయినేజీలు నిర్మించారు. కానీ పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు పోచంపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 3 కోట్లు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. దాంతో చాలా వరకు ప్రజల సమస్యలు తీరనున్నాయి. – సార సరస్వతీబాలయ్యగౌడ్, ఎంపీపీ, పోచంపల్లి -
చేనేతకు మైక్రోసాఫ్ట్ చేయూత
♦ పోచంపల్లిలో డిజిటల్ రిసోర్స్ సెంటర్ ♦ 24న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వస్త్ర ప్రేమికుల మనసు దోచుకున్న విఖ్యాత పోచంపల్లి చేనేత వస్త్రాలకు చేయూతనందించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. పోచంపల్లిలోని టూరిజం కాంప్లెక్స్‌లో డిజిటల్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నెల 24న ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా(ఆర్ అండ్ డీ)ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్భన్సాలీ కూడా పాల్గొననున్నారు. దేశంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి ఆర్థికంగా బాసటగా నిలవడంతోపాటు అరుదైన సాంస్కృతిక వారసత్వ వస్త్ర సంపదను భావితరాలకు అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. పోచంపల్లిలో ఐసీటీ కేంద్రం.. నేతవస్త్రాలకు ప్రసిద్ధిచెందిన పోచంపల్లి చేనేత వస్త్రాలను అంతర్జాతీయ విపణిలో ఒక్క మౌస్‌క్లిక్‌తో విక్రయిం చేందుకు వీలుగా స్థానికంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) హబ్‌ను మైక్రోసాఫ్ట్ నెలకొల్ప నుంది. ఈ కేంద్రం ద్వారా చేనేత కార్మికులు ఆధునిక సాంకేతిక విధానాలు, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుని వస్త్రాలను విశ్వవ్యాప్తంగా విక్రయించి లబ్ధి పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ కృషిలో మైక్రోసాఫ్ట్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం, చైతన్యభారతి అనే స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకోనున్నాయి. ఈ ఐసీటీ హబ్‌లో నేతన్నలకు సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ అవకాశాలు, ఆన్లైన్లో వస్త్రాలను విక్రయించే విషయాల్లో మెళకువలను నేర్పించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. 24న కొత్త పొదుపు పథకం చేనేతకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పొదుపు పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 24న యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. చేనేతతోపాటు పవర్లూమ్ కార్మికులకూ ఈ పథకం ద్వారా ప్రయోజనాలు కలుగుతా యన్నారు. కొత్తగా తీసుకొస్తున్న ఈ పథకంపై గురువారం ఇక్కడ చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ఉన్న పొదుపు పథకాన్ని పూర్తిగా మార్చేసి నేతన్నలకు అత్యధిక ప్రయోజనాలు కల్పించే దిశగా కొత్త పథకాన్ని ప్రకటిస్తామన్నారు. కార్మికులు 8 శాతం వేతనాన్ని పొదుపు చేసుకుంటుండగా, మరో 8 శాతాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లిస్తోందని చెప్పారు. కొత్త పథకం అమల్లోకి వస్తే మ్యాచింగ్ గ్రాం ట్ను రెట్టింపు చేసి 16 శాతం చేస్తామని వెల్లడించారు. పవర్‌లూమ్స్ కార్మికులకు సైతం 8 శాతం వేతనాల పొదుపుపై 8 శాతం మ్యాచింగ్ గ్రాంట్ చెల్లిస్తామన్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీం(టీఎఫ్ఎస్)ను ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత సహకార సంస్థల పరిధిలో పనిచేస్తున్న వారితో పాటు సొంతంగా పనిచేస్తున్న కార్మికులు, డైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. 18 ఏళ్లు నిం డిన ప్రతి నేతన్న ఈ పథకంలో చేరవచ్చని చెప్పారు. ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను వెంట నే విడుదల చేస్తామని తెలిపారు. ఈ పథకం నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ని ఆదేశించారు. బతుకమ్మ చీరల ధరలు, ప్రొక్యూర్మెం ట్ నిర్ధారించేందుకు కమిటీ వేస్తామని తెలిపారు. పవర్లూమ్ అప్ గ్రెడేషన్ కార్యక్రమం, వర్కర్ టూ ఓనర్ కార్యక్రమాలపై కూడా మంత్రి సమీక్షించారు. -
బైక్‌పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ..
పోచంపల్లి: భారీ వర్షాల కారణంగా పోటెత్తున్న వరదలను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పలువురు వాటిని లెక్క చేయకుండా ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రెప్పపాటు సమయంలో ఆలోచన లేకుండా వ్యవహరించడం మూలంగా నష్టపోతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ భార్యాభర్తలకు భారీ వరద నుంచి ప్రమాదం తప్పింది. స్థానికుల అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు పొర్లుతున్న పోచంపల్లి వాగులో వారు ప్రమాదవశాత్తు పడిపోయి అదృష్టం కొద్ది ప్రాణం దక్కించుకున్నారు. వారు ప్రయాణిస్తున్ బైక్ మాత్రంలో వాగులో వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. బుధవారం భారీ స్థాయిలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కనీసం మూడు గంటలపాటు కురిసిన ఈ వర్షం కారణంగా వాగులు వంకలు ప్రమాదకర స్థితిలో పొంగిపొర్లుతున్నాయి. వాటిని చూస్తేనే గుండెలు జారీ పోతున్నాయి. పోచంపల్లిలోని ఓ వాగు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అది ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో పలువురు దాన్ని దాటేందుకు సంకోచిస్తూ దూరంగా ఉండి పరిశీలిస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు భార్యభర్తలు మాత్రం మూర్ఖంగా ముందుకెళ్లి ఆ వరదలో పడ్డారు. బైక్‌తోపాటు వారు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడగా అక్కడ అప్పటికే ఉన్న ఇతరులు సమయస్ఫూర్తితో వ్యవహరించి బయటకు తీసుకొచ్చారు. బైక్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో అది వరదల్లో కొట్టుకుపోయింది. -
బైక్‌పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ..
-
పోచంపల్లిలో భారీగా నష్టం
భూదాన్‌పోచంపల్లి : మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. రేవనపల్లి చెరువు అలుగుకు గండి పడడంతో చెరువులో ఉన్న సుమారు రూ.15 లక్షల విలువైన చేపలు కొట్టుకుపోయాయి. గౌస్‌కొండ గ్రామంలో చాంద్పాషకు చెందిన పెంకుటిల్లు ధ్వంసమైంది. ఇల్లు కూలి పక్కనే ఉన్న డబ్బా కొట్టుపై పడడంతో అది పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో రూ. 30వేల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. నీటి మునిగిన వరి పొలాలు... పోచంపల్లి, రేవనపల్లి చెరువులు ఉధృతంగా అలుగు పోస్తుండడంతో వాటి కింద ఉన్న సుమారు 100 ఎకరాలకు పైగా వరి పొలాలు నీటి మునిగాయి. సీతావానిగూడెంలో సద్దుపల్లి అంజిరెడ్డితో పాటు సమీప రైతులకు చెందిన సుమారు 10 ఎకరాలు, భీమనపల్లిలో బానోతు హనుమ అనే కౌలు రైతుకు చెందిన 3 ఎకరాలు, ముక్తాపూర్ గ్రామంలోని మూసీ కాల్వ పరివాహకంలో మరో 20 ఎకరాలు వరి నీట మునిగింది. అలాగే పోచంపల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ కాల్వ నుంచి వరద నీరు వస్తుండడంతో మండలంలోని చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నాయి. దోతిగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండలంలో 69.2 వర్షపాతం నమోదైనట్లు ఏఎస్ఓ నర్సిరెడ్డి తెలిపారు. అధికారుల సందర్శన... ఇరిగేషన్ డీఈ రవీందర్, ఏఈ శాలిని, తహసీల్దార్ డి.కొమురయ్య, ఆర్ఐ నిర్మల, వీఆర్వో చెక్క నర్సింహ, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్య, సింగిల్‌విండో చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, గోదాస్ యాదగిరి బుధవారం గండిపడిన రేవనపల్లి చెరువు అలుగు గండిని పరిశీలించారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండి పూడ్చివేస్తామని డీఈ రవీందర్ తెలిపారు. మూడో విడత మిషన్ కాకతీయలో కట్ట, అలుగు, తూము మరమ్మతులు చేపట్టుతామన్నారు. -
భూదాన్‌పోచంపల్లిలో వడగళ్ల వాన..
భూదాన్‌పోచంపల్లి(నల్గొండ జిల్లా): భూదాన్‌పోచంపల్లి పరిధిలో గురువారం వడగళ్లవాన కురిసింది. వడగళ్ల వర్షం కారణంగా సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. జలాల్పురం గ్రామంలో ఓ చెట్టు మీద పిడుగుపడింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటిపై పడ్డాయి. సకాలంలో అక్కడే ఉన్న మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. -
పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పర్యాటక కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు తెలిపారు. గురువారం ఆయన పోచంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ టూరిజం శాఖ, ఇండియన్ ట్రస్ట్ ఫర్ రూరల్ హెరిటేజ్ డెవలప్మెంట్(ఐటీఆర్హెడ్డీ) సంయుక్త భాగస్వామ్యంతోనే పోచంపల్లి గ్రామీణ టూరిజం పార్క్‌ను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు(ఐడియల్ డెస్టినేషన్ సెంటర్) తెచ్చేందుకు పాటుపడుతున్నామన్నారు. అందులో భాగంగానే ప్రతి శని, ఆదివారాలు పోచంపల్లికి విదేశీయులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విదేశీయులను ఆకర్షించేలా పోచంపల్లిలో చేనేత, చేతి వృత్తులతో పాటు గ్రామీణ వంటకాలు, చెరువులో బోటింగ్, లేజర్ షో, తెలంగాణ కళలు, గిరిజన నృత్యాలు, గ్రామీణ ప్రజల ఆచారాలు వారికి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే పోచంపల్లి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలిపి టూరిజం క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి టూరిజం బస్సులు నడిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే సూరజ్ కుంభమేళాలో మొట్టమొదటి సారిగా తెలంగాణ థీమ్స్ స్టేట్ పేరిట చేనేత ఎగ్జిబిషన్ ఏర్పా టు చేస్తున్నామని పేర్కొన్నారు. జూలై మాసంలో ఫ్రాన్స్‌లో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో టూరిజం శాఖను అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని చెప్పారు. ప్రజలు కూడా పర్యాటక శాఖకు సహకారం అందించాలని కోరారు. అనంతరం జిల్లా పర్యాటక శాఖ అధికారి మహీధర్ మాట్లాడుతూ మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లా ప్రణాళికలో పోచంపల్లి టూరిజం పార్క్‌లో చేనేత ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ హెరిటేజ్ అసోసియేషన్ ఫర్ రూరల్ టూరిజం అంబాసిడర్ యమునా పాఠక్, పర్యాటక శాఖ ఆర్ఎం సత్యకుమార్‌రెడ్డి, పోచంపల్లి పర్యాటక కేంద్రం ఇన్చార్జ్ అంజనేయులు తదితరులు ఉన్నారు. -
అకాల వర్షం.. అతలాకుతలం
భువనగిరిటౌన్, న్యూస్‌లైన్,భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆది వారం కురిసిన అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో నీరు చేరడంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్హాల్లో పార్కింగ్ చేసిన కారుపై కొబ్బరి చెట్టు కూలిపడడంతో పూర్తిగా ధ్వంసమైంది. అలాగే వడగండ్ల వానకు వరి నేలవాలింది. సుమారు 400 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంజ్ మార్కెట్ యార్డులో 100 బస్తాల ధాన్యం తడిసిపోయింది. మండల పరిధిలోని తుక్కాపురం, అనాజీపురం, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, రామకిష్టాపురం, రాయగిరి, బస్వాపురం, కూనూరు, ముత్తిరెడ్డిగూడెం, బీఎన్ తిమ్మాపురం గ్రామాల్లో వరితో పాటు మామిడికి నష్టం వాటినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో అంధకారం పోచంపల్లి : ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పోచ ంపల్లి మండలం పెద్దరావులపల్లిలో కరెంట్ తీగలు తెగిపోయాయి. పలు గ్రామాల్లో స్తంభాలు నేలకూలడంతో అంధకా రం నెలకొంది. కప్రాయిపల్లి, జూలూరు, పోచంపల్లి, జలాల్పురం గ్రామాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.