పోచంపల్లికి మహర్దశ..! | 3 crores funds released for pochampally tourism development | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 9:15 AM | Last Updated on Fri, Jan 19 2018 9:15 AM

3 crores funds released for pochampally tourism development - Sakshi

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి): పర్యాటక కేంద్రమైన పోచంపల్లి కి మహర్దశ రానుంది. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పోచంపల్లి అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ద్వారా మూడు కోట్ల రూపాయలను మం జూ రు చేయించారు. గత వారం రో జుల క్రితం హెచ్‌ఎండీఏ అధికారులు పో చంపల్లిని సందర్శించి చేపట్టే సీసీ రో డ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులను ప రిశీలించారు. అయితే మండల కేం ద్రంలో కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తు న్నా, అభివృద్ధికి మాత్రం నోచుకోక ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఎట్టకేలకు మౌలిక వసతులు ఒనగూరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనులు చేపట్టేది ఇక్కడే....
మంజూరైన రూ. 3 కోట్ల నిధులలో రూ. 2 కోట్లు సీసీ రోడ్లు, మరో కోటి రూపాయలు అంతర్గత డ్రెయినేజీలకు ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గాంధీనగర్‌లోని పాతబస్తీ, లక్ష్మణ్‌నగర్‌ కాలనీ, భావనారుషిపేట, సాయినగర్‌ కాలనీ, రాంనగర్‌ కాలనీ, వెంకటరమణ కాలనీ, మార్కండేయనగర్, నారాయణగిరిలో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. అలాగే రూ. 80లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీ నుంచి చిన్నేటి వరకు, ఇ టు రూ.20లక్షలతో వెంకటరమణ కా లనీ లో అంతర్గత డ్రెయినేజీలు ని ర్మించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూ ర్తికాగానే పనులను చేపట్టనున్నారు.

నెరవేరిన హామీ..
పర్యాటక కేంద్రమైన పోచంపల్లిని గతంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. తన నిధులతో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి సీసీ, డ్రెయినేజీలు నిర్మించారు. కానీ పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారు.  

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
పోచంపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 3 కోట్లు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. దాంతో చాలా వరకు ప్రజల సమస్యలు తీరనున్నాయి.  – సార సరస్వతీబాలయ్యగౌడ్, ఎంపీపీ, పోచంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement