
మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండి
సమీప గ్రామస్తుల నుంచి విజ్ఞప్తుల వెల్లువ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను సైతం విలీనం చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. 56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 స్కై్వర్ కిలోమీటర్ల పరిధిని 12 జోన్లుగా విభజించి.. భావినగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలోని 36 గ్రామాలను తొలగించి, ఫ్యూచర్‌సిటీ డెవలెప్‌మెంట్ అథారిటీలో విలీనం చేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ డెవలెప్‌మెంట్ అథారిటీ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేసింది. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆర్‌ఆర్‌ఆర్(ఆమనగల్లు) వరకు 330 ఫీట్ల రేడియల్ గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణ చేపట్టింది. అంతర్జాతీయ హంగులతో సుమారు 30 వేల ఎకరాల్లో కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కూడా విలీనం చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కొన్ని గ్రామాల ప్రజలైతే ఏకంగా అఖిలపక్షంగా ఏర్పడి ధర్నాలకు సైతం దిగుతుండడం విశేషం.
బతుకులు మారతాయనే..
ఐటీ, ఇండ్రస్టియల్ పరిశ్రమల రాకతో సమీప భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కనీస అభివృద్ధికి నోచుకోని తమ గ్రామాలను కొత్తసిటీలో కలపడం ద్వారా తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయనే ఆశ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాగా ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్‌సిటీ కోసం ఇప్పటికే 13,973 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. తాజా గా మరికొంత భూమిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కృత్రిమమేథ (ఏఐ) సిటీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వాణిజ్య భవనం సహా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, క్రికెట్ స్టేడియం తదితర ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఇందులో చోటు కలి్పంచనుంది. ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో కొత్తగా మహేశ్వ రం మండలం రావిర్యాల గ్రామం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 275.12 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 350.22 ఎకరాల భూసేకరణకు నోటిఫి కేషన్ జారీ చేసింది. అదనంగా తిమ్మాపూర్‌లో 600 ఎకరాలు, పంజాగూడలో 300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కన్సల్టెన్సీకి నోటిఫికేషన్
మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లోని 14 గ్రామాల మీదుగా వెళ్లే గ్రీన్‌ఫిల్డ్ రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఫేజ్–1లో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్‌ఖాన్ పేట వరకు 19.02 కిలోమీటర్ల మేర రూ.1,665 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఫేజ్–2లో భాగంగా మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమనగల్లు ఆర్‌ఆర్‌ఆర్ వరకు 22.30 కిలోమీటర్లు రూ.2,365 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న టెక్నికల్ బిడ్‌లను ఆహ్వానించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా హద్దురాళ్లను నాటే పనిలో నిమగ్నమయ్యారు. మార్చి 21న టెక్నికల్ బిడ్స్ తెరవనున్నారు. తాజాగా రోడ్డు నిర్మాణ సమయంలో పనులు పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సరీ్వసులకు టెండర్లు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
⇒ మహేశ్వరం మండలంలో 31 పంచాయతీలు ఉండగా, వీటిలో హర్షగూడ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయింది. తాజాగా తుమ్మలూరు, మహబత్‌నగర్‌ను ఫోర్త్‌సిటీలో విలీనం చేశారు. ఇదే మండలం నుంచి మరికొన్ని విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి.
⇒ కందుకూరు మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, పులిమామిడి, ధన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావుద్ గూడతండా, పెద్దమ్మతండా పంచాయతీలను సైతం ఫోర్త్‌సిటీలో కలపాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment