funds release
-
TG: రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపిస్తున్నామన్నారు. ‘‘లక్షల మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. నిలబెట్టుకుంటున్నాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘రాజకీయం ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనమే ముఖ్యమని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనడం సంతోషకరం. ఆనాడు నిధులు ఉన్నా గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. విత్తనాలకు సబ్సిడీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంటకు గిట్టుబాటు ధర తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే’’ అని రేవంత్ పేర్కొన్నారు.అనుమానాలను పటాపంచలు చేశాం: డిప్యూటీ సీఎండిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామన్నారు. మిగిలిన బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేయలేకపోయారని.. మాకు 7 లక్షల కోట్లతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ సాధ్యమా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నాం. రైతు భీమా, పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.అదే మా టార్గెట్: మంత్రి తుమ్మలమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆగస్టు నెల నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. నేటితో లక్షన్నర రూపాయల రుణమాఫీ జరగబోతుందన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చిన ఆర్థిక శాఖ కు కృతజ్ఞతలు. ఆయిల్ ఫాం సాగును పెంచుతాం.. కనీసం 5 లక్షల ఎకరాలలో సాగు టార్గెట్ పెట్టుకున్నాం’ అని తుమ్మల అన్నారు. -
YSR ఆసరా పథకం నిధుల విడుదలపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
Live: జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల
-
నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం జమ
-
నాలుగేళ్లుగా ప్రభుత్వం అండగా ఉంటోంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇదని, ఇవాళ 2,807 మంది న్యాయవాదులకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించాం. రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి. కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నాం. పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ♦ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం ♦వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం ♦లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం ♦వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నాం ♦మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం ♦నాలుగేళ్లలో మొత్తంగా వైయస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ రూ.49.51 కోట్లు ♦ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది ♦ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్లో వాళ్లు నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది ♦అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వాళ్ల కోసం వైయస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం ♦అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచుతూ రూ.100 కోట్లు కేటాయింపు చేశాం ♦ఆ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తరఫున వేగంగా అడుగులు పడ్డాయి. ♦643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది ♦ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది ♦మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగింది ♦రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి ఇచ్చి అడ్వొకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది. ♦ఇవన్నీ మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచన చేసి చేయగలిగాం ♦నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను ♦మాట ఇచ్చిన మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేయడం, ఈ నాలుగు సంవత్సరాలుగా చేయగలిగాం అని సంతోషంగా చెబుతున్నా ♦ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్కు నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ ♦ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, మంచి చేసే విషయంలో మానవతా దృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నా ♦దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం -
రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లా నేస్తం నిధులు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 2,807 మంది యువ న్యాయవాదులకు రూ.7 కోట్ల 98 లక్షలను వారు ఖాతాలోకి సీఎం జమ చేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ వైఎస్సార్సీపీ అందిస్తుంది. రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
లెక్కలు తీస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ఏమిటో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ‘ఇది ప్రజాప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి కేబినెట్ సమావేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఈ పదేళ్ల కాలంలో నిధుల విడుదల, ఖర్చు, మిగులు తదితరాలు ప్రజలకు వివరించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖల వారీగా నివేదికలు సేకరించాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, చేసిన ఖర్చులకు సంబంధించి సమాచారం విభాగాధిపతులు సమర్పించడం ఆనవాయితీ. సీఎం ఆదేశాలతో శుక్రవారం పలు విభాగాధిపతులు ఆగమేఘాల మీద ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రత్యేక ఫార్మాట్ రూపకల్పన ! శాఖలవారీగా చేసిన ఖర్చులకు ప్రత్యేక ఫార్మాట్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టు తెలిసింది. 2014 నుంచి ఇప్పటివరకు వార్షిక బడ్జెట్లో జరిపిన కేటాయింపులు, నిధుల విడుదలకు సంబంధించి బడ్జెట్ రిలీజింగ్ ఉత్తర్వులు, చేసిన ఖర్చు, సంవత్సరం వారీగా నిధుల మిగులుకు సంబంధించిన సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చుకు సంబంధించిన అంశాలను పథకాల వారీగా వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతోపాటు మరమ్మతులు తదితరాలను పూర్తిస్థాయిలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కూడిన జాబితాతోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చు వివరాలు కూడా వేరుగా సమర్పించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, సమావేశాలు ముగిసేనాటికి వీటిని ప్రజాక్షేత్రంలో ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పదేళ్ల కాలంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. -
రబీకి ముందే రైతుల ఖాతాల్లో డబ్బు జమ
-
గతంలో మొక్కుబడిగా పథకాల అమలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం. పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా..నా..నా అంటూ వారి మీద ఓనర్ షిప్ తీసుకుంటూ, ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ దాకా జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఈ పథకంలో ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించాం. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురావాలని, పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదు. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ పథకం. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని నాతో చాలా మంది అన్నారు. అందరికీ ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్నారు. నేను ఒకటే అన్నాను. ఓట్లు అన్నది, ఎన్నికలన్నవి సెకండరీ. లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ మోస్ట్ ఇంపార్టెంట్. 10వ తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి ఉండాలని చెబుతామో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశాం. రెండోది 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయి. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నాం. తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తెచ్చాం. తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్ అవుతున్నారు. 10వ తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారు. 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి, ఇంటర్ దాకా అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ చదివిస్తారు. తల్లిదండ్రులకు నష్టం లేదు. అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుంది. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుంది. పూర్తి ఫీజు అందుతుందని, పిల్లలను చదివించగలమని తడుతుంది. వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తుందన్నది తడుతుంది. పిల్లల్ని గ్రాడ్యుయేషన్ వరకు చదివించేందుకు మోటివేట్ అవుతారు. చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యే దాకా పిల్లల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇలా చదివించగలగడం వల్ల జనరేషన్ చేంజ్ వస్తుంది. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తెచ్చాం. గత ప్రభుత్వంలో పదో తరగతి ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేదు. 2018కి పథకమే పక్కన పడేశారు. ఇంత మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదు. ఎక్కడా మోటివేషన్, చిత్తశుద్ధి లేదు. ఈ రోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్, ట్రాన్స్ పరెంట్గా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, మరుసటి నెల కల్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తెచ్చాం. గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే.. కొంత మందికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడిస్తారో తెలియదు. మనం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తున్నాం. అది కూడా పదో తరగతి పాస్ అయ్యుండాలని చెబుతున్నాం. ఇలా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి పోయే కొద్దీ చాలా మందికి మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయం పడుతూ అడుగులు వేస్తున్నాం. దేవుడు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోంది. గొప్ప మార్పుకు చిహ్నం. రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. -
బటన్ నొక్కి జగనన్న చేదోడు సాయం విడుదల చేసిన సీఎం జగన్ !
-
అమెరికాకు తప్పిన షట్‌డౌన్ ముప్పు
వాషింగ్టన్: అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తాత్కాలికంగా తప్పింది. వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుని ఆమోదించడానికి ప్రతిపక్ష రిపబ్లికన్లు ససేమిరా అనడంతో బిల్లులు చెల్లించలేక అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదరకర పరిస్థితులు వచ్చాయి. అయితే శనివారం రాత్రి చివరి క్షణంలో స్వల్పకాలిక బిల్లుకి రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో ఆమోదించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చివరి క్షణంలో తాత్కాలిక నిధుల విడుదల బిల్లుపై సంతకాలు చేశారు. దీంతో దేశంలో వివిధ పథకాలు, సైనికులు, ప్రభుత్వ జీత భద్రతాలకు మరో 45 రోజులు ఢోకా లేదు. ఈ బిల్లు నుంచి ఉక్రెయిన్‌కు అందించే ఆర్థిక సాయాన్ని మినహాయించారు. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 12 గంటల్లోగా ద్రవ్యవినిమయ బిల్లుల్ని ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రతినిధుల సభలో మెజార్టీ కలిగిన రిపబ్లికన్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని ఆమోదించడానికి నిరాకరించారు. ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారే అయినప్పటికీ ద్రవ్య బిల్లుల్ని అడ్డుకుంటే ప్రజలకి ఇబ్బందులకు గురవుతారని నచ్చజెప్పడంతో వారు ఒక్క మెట్టు దిగారు. స్పీకర్ ప్రతిపాదించిన స్వల్పకాలిక బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. -
కాపు నేస్తం 4వ విడత నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
చదువు అనే బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ... ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫా అనే ఈ రెండు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడిపిల్లలు గొప్పగా చదివేటట్టు ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని పేర్కొన్నారు. ‘ఈ రోజు పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా అప్పులు పాలవ్వకుండా బాగా చేయాలని కోరుకుంటారు. అలా జరగాలని ఆశిస్తారు. అలా పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. 18,883 జంటలకు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం. ఈ ఏడాది ఏఫ్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయి వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించలేకపోవడం, అధికారులు తనిఖీకు వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి రకరకాల కారణాలతో.. ఆ పీరియడ్‌లో రానివారుంటే, అలా మిగిలిపోయిన వారిని కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈ రోజు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. గతేడాది అక్టోబరు నుంచి ఈ యేడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసాం. ఇవాళ మూడో విడత ఇస్తున్నాం. ఇవాళ ఇస్తున్నదానితో కలిపి.. ఈ మూడు విడతల్లో రూ.267 కోట్లు .... పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 35,551 జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది మూడునెలలకొకమారు చొప్పున నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుంది. ఒక నెలపాటు వెరిఫికేషన్ పూర్తి చేసి, మూడు నెలలకు సంబంధించిన ఆర్ధిక సహాయం అందజేస్తారు. 86శాతం మంది డిగ్రీ అమ్మాయిలే... ఇవాళ ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే... కొన్ని మనసుకు సంతోషాన్నిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల వివరాల లెక్క చూస్తే.. 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ధి పొంది డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లెమ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులును 86 శాతం మంది చదువుతున్నారు. పదోతరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు. అంటే పెళ్లిళ్లు చేసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టి, చదువుమీద ధ్యాసపెట్టి డిగ్రీలు పూర్తి చేసుకుని, చదువులు పూర్తి చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు 86 శాతం మంది ఉన్నారు. నిజంగా మనం అనుకున్న లక్ష్యం, ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది ఈ లెక్కలు చూసినప్పుడు మనకు అర్ధం అవుతుంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం. ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఎక్కువందికి మేలు జరిగే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మ డిగ్రీవరకు కనీస చదువు ఉండాలి అన్నదే మన తపన. ఇల్లాలి చదువు-తర్వాత తరం పిల్లలకు మేలు... ఇంటి ఇళ్లాలు ఎప్పుడైతే డిగ్రీవరకు చదువుతున్న పరిస్థితి ఉంటుందో.. తర్వాత తరంలో తమ పిల్లలను ఇంకా ఉన్నత విద్యలవైపు నడిపించే పరిస్థితి ఉంటుంది. మనం పెడుతున్న ఈ నమ్మకం వల్ల... పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీవరకు చదివి.. ఆ సర్టిఫికేట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. అవి కూడా మంచి డిగ్రీలు అయి ఉండాలి. భవిష్యత్‌లో వారి జీవితాలు...పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది. గతానికీ నేటికీ తేడా చూస్తే... ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన మార్పులు తీసుకొచ్చింది ? అన్నది ఆలోచన చేస్తే... గత ప్రభుత్వంలో చేశామంటే చేశామన్నట్టు మొక్కుబడిగా చేశారే తప్ప... చిత్తశుద్ధిగా చేయలేదు. పేదల బ్రతుకులు మారాలి. వారికి మంచి జరగాలన్న ఆలోచన ఏ రోజూ జరగలేదు. ఆ రోజు 2018లోనే 17,709 మందికి దాదాపు రూ.68.68 కోట్లు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ రోజుల్లో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తూ... కానీ ఈ రోజు అలా చేయకుండా.. పదోతరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొస్తున్నాం. పదోతరగతిపాస్ అయ్యేలా తల్లిదండ్రులు ప్రోత్సహించేటట్టు అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీనివల్ల చెల్లెమ్మలు పదోతరగతి వరకు కచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు ఎలాగూ ఆగాలి, అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి.. చదువు కొనసాగిస్తూ ఇంటర్ మీడియట్‌కు వెళ్తారు. తద్వారా ఇంటర్లో కూడా అమ్మఒడి డబ్బులు వస్తాయన్నది ఒక ప్రోత్సాహం కాగా.. ఇంటర్ పూర్తి చేస్తారన్నది రెండో అంశం. దానితర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ - విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతోనూ డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులున్నీ రూపాయి ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతుంది. అంతే కాకుండా పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి పాప, పిల్లవాడికి కూడా డిగ్రీలో చేరితే చాలు... వసతి దీవెన అనేపథకం ద్వారా రూ.20 వేలు వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇది మరో ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఒక్కో అమ్మాయి, పిల్లవాడి మీద వాళ్ల డిగ్రీలు పూర్తి చేసేందుకు సంవత్సరానికి మరో రూ.60వేలు ఒక్కొక్కరికి ఇచ్చినట్టవుతుంది. అప్పటికి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండుతాయి. 21 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే... ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే... మైనార్టీలకు గతంలో రూ.50వేలు మాత్రమే ప్రోత్సహకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు షాదీతోఫా కింద ఏకంగా రూ.1లక్ష ఇచ్చి పెళ్లికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు .ఇప్పుడు మనం వారికి ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భవన నిర్మాణకార్మికులు గత ప్రభుత్వంలో రూ.20వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే... మనం ఈరోజు రూ.40వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్టీలకైతే గతంలో రూ.50వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.ఇక బీసీలకైతే గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సాహిస్తున్నాం. పేద పిల్లలు అప్పులు పాలు కాకూడదని.. ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ మనసుపెట్టి ప్రతి పాప, పిల్లవాడు పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చింగా చదువు ఒక్కటే మార్గమని... ఆ చదువుకునేదానికి ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరినీ చదవించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.ఒకవేళ పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోతే... వారిని కచ్చితంగా మరలా మూడు నెలలకిచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ల దగ్గర నుంచి లోపాలను సరిదిద్ది.. తర్వాత దఫాలో వారిని యాడ్ చేయించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వంతో.. దూదేకుల, నూర్ భాషాలకు సంబంధించిన మైనార్టీ సోదరులకు రూ.50వేలు వస్తుందని చెపితే.. వాళ్లు కూడా మైనార్టీలే కదా అని... దాన్ని కూడా సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.1లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.1లక్ష రాని 227 జంటలకు అది కూడా ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ప్రదర్శించాం. అర్హులెవరూ మిస్ కాకూడదు, నష్టపోకూడదనే తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ మన ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నా పిల్లలందరూ బాగా చదవాలని, గొప్పగా చదివి, పేదిరికం నుంచి బయటకు రావాలని చేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ... దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ.. ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్న ప్రతి చెల్లెమ్మకూ, తమ్ముడుకూ, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరిగా.. ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రతిమండలంలో ఒక హైస్కూల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీగా మార్పు చేసి తీసుకొచ్చాం. ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కాలేజీలు ఉండేటట్టుగా.. అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్ కళాశాల. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కూడా ఎక్కడకో వెళ్లి చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి.. కేవలం గ్రామ సచివాలయంలో దరఖాస్తు పెడితే 30 రోజులలోగా వెరిఫికేషన్ చేసి అక్కడే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే గొప్ప మార్పు చేయగలిగాం. మీరు కూడా ఇంకా ఓరియెంటేషన్ చేయడానికి చొరవ తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అని సీఎం ప్రసంగం ముగించారు. -
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
-
4వ విడత జగనన్న అమ్మఒడి
-
ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పది రోజులపాటు ఉత్సవాలు కాగా వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు. చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు! ఇంటింటికీ వెళ్లి.. మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు 2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్‌ల్లో కొనసాగుతున్నాయి. -
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
Updates: ►జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. సీఎం జగన్ ప్రసంగం: ♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు నచ్చరు.. ♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు ♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం ♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో.. ♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం ♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి ♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం ♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం ♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం ♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు ♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది ♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు ♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం ♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత ♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం ♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం ♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం ♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం ♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్ ♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే ♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం ♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. ♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే ♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి ♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు ♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు ♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే ♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు ♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు ♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం ♦గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు ♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు ♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి ♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం ♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం ♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం ♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం ♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం ♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది ♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం ►సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.. కాసేపట్లో నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్‌కు ఘన స్వాగతం ►కొద్దిసేపట్లో మార్కెట్ యార్డ్‌లోని సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ►తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్,ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ►జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లోని హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ► జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ►గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ► జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీ కోర్సులు, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. 40 అంశాలలో నైపుణ్యం పెంపొందించేలా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 1.07 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, 73 వేల మందికి ఇతర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పూర్తి చేసి, సర్టిఫికెట్స్ పంపిణీ చేసింది. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1.75 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ► ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 2018–19 లో 81,813 కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంస్కరణల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి 22,387కు చేరింది. ► 2018–19లో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2020–21 సంవత్సరానికి 37.2కు పెరిగింది. రాబోయే రోజుల్లో జీఈఆర్ శాతం 70కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంది. 2018–19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది. ► 2018–19 లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గణనీయంగా పెరిగి 2021–22కి 85,000 కు చేరడం విశేషం. విద్యా రంగంపై జగన్ ప్రభుత్వం గత 45 నెలల్లో మొత్తం రూ.57,642.36 కోట్లు వెచ్చించింది. ► 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, నాడు –నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తోంది. -
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సీఎం జగన్ పర్యటన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమచేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం జగన్ తిరువూరు పర్యటన నేపథ్యంలో.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ శనివారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారని ప్రశంసించారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెనను చేరువ చేశారని తెలిపారు. ‘గతంలో పేదలకు చదువు భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా పనిచేశాడు. చంద్రబాబు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి జగన్. అందుకే విద్యకు పెద్దపీట వేశారు’ అని పేర్కొన్నారు. విద్యాదీవెన కార్యక్రమం రేపు తిరువూరులో సీఎం ప్రారంభిస్తారు. పేదలు సైతం కార్పొరేట్ స్కూల్స్ లో చదవాలనేది సీఎం ఆలోచన. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నా న్యాయం మా వైపు ఉంది. రూ. 700 కోట్లు రేపు నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నారు. చంద్రబాబు విద్యారంగాన్ని విస్మరించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సీఎం జగన్ తరహాలో ఎవరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ ను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఏపీలోలాగా తమ రాష్ట్రాల్లోని స్కూల్స్‌ను తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నాయి. - ప్రభుత్వ విప్, సామినేని ఉదయభాను చదవండి: రెండు సీట్లకు ఎగిరి గంతేయడమే టీడీపీ స్టైల్! -
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చనుంది. వాటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు ఇది తప్పనిసరి అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.5,000 కోట్ల నిధులను సమకూర్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా, నియంత్రణపరమైన నిధుల అవసరాలను చేరుకునేందుకు వీలుగా వీటికి ఎంత మేర సమకూర్చాలనే దానిపై ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంటుందని సదరు అధికారి తెలిపారు. వాటి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా లేదని, సాల్వెన్సీ మార్జిన్ పెంచేందుకు నిధుల సాయం అవసరమని చెప్పారు. కంపెనీలు తమకు వచ్చే క్లెయిమ్‌లకు చెల్లింపులు చేస్తుంటాయని తెలిసిందే. ఈ చెల్లింపులకు మించి నిధులను బీమా సంస్థలు కలిగి ఉండడాన్ని సాల్వెన్సీ మార్జిన్‌గా చెబుతారు. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం కనీసం 1.5 సాల్వెన్సీ మార్జిన్ అయినా ఉండాలి. -
వైఎస్సార్ ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ బుధవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు. -
మోదీ జీ.. భారత్ కన్నా శ్రీలంక బెటర్ ప్లేస్‌లో ఉంది: కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందని మంత్రి కె.తారక రామా రావు విమర్శించారు. నేతన్నలకు కేంద్రం నోటిమాటలు కాకుండా నిధుల మూటలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ టెక్స్టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అసత్యాలు వల్లె వేయడం మానుకోవాలన్నారు. తెలంగాణలో టెక్స్టైల్ రంగానికి చేయూత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ శనివారం లేఖ రాశారు. కేంద్రం జీఎస్టీ విధింపు వంటి నిర్ణయాలతో నేత కార్మికుల పొట్టకొడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1,552 కోట్ల అంచనా వ్యయంతో చేప ట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక సదుపా యా లు కల్పించేందుకు ముందుకు రాకపోగా, పార్క్‌ను తానే ఏర్పా టుచేసినట్లు అసత్యాలు చెబుతోందని దుయ్యబట్టారు. కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ పథకం కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపా దనపై కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి వెళ్లగా, తెలంగాణలో మరో ఐఐహెచ్ టీ ఏర్పాటు చేయాలన్న వినతిపైనా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుపైనా కేంద్రం నుంచి స్పందన లేదని వెల్లడించారు. బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయండి జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌హెచ్‌డీపీ)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే తెలంగాణ విజ్ఞప్తిని మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. వస్త్ర పరిశ్రమపై విధించిన జీఎస్టీని తగ్గించడంతోపాటు జీఎస్టీ నుంచి చేనేత పరిశ్రమను పూర్తిగా మినహాయించాలన్నారు. రాష్ట్రంలోని మరమగ్గాల ఆధునికీకరణకు అవసరమయ్యే నిధుల్లో 50 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభు త్వం వాటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఊతమివ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు -
చదువు మీద పెట్టే ప్రతిపైసా పవిత్రమైన పెట్టుబడి: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: చదువుల మీద పెట్టే ప్రతిపైసా.. పవిత్రమైన పెట్టుబడి అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి శాపం కాకూడదని కోరుకున్న ఆయన.. పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని చెప్పారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో ప్రసంగించారు ఆయన. సభా ప్రాంగణం నుంచి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చెరగని చిరునవ్వుతో అప్యాయత చూపిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేసే గొప్ప కార్యక్రమం ఇద’’ని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నయ్య వాళ్లకు తోడుగా ఉన్నానని తెలియజేసే ఈ కార్యక్రమం.. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతోందని చెప్పారాయన. మనిషికి చదువే నిజమైన ఆస్తి అని పేర్కొన్న సీఎం జగన్.. చదువులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఆదాయమూ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్.. మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి తల్లి కష్టాన్ని చూశానని.. అందుకే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని ఆయన చెప్పారు. పిల్లలను బడికి పంపిస్తే చాలూ.. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం తమ ప్రభుత్వం అందిస్తుందని.. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మరోసారి ఉద్ఘాటించారు సీఎం జగన్. ఇంకా.. ► ఒక్కో విద్యార్థికి రూ. 12వేలు విలువ చేసే ట్యాబ్‌ను.. సెప్టెంబర్‌లో అందజేస్తాం. ఇందుకోసం రూ.500 కోట్ల ఖర్చు చేయబోతున్నాం. ► ప్రతి క్లాస్ రూమ్‌లో డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తెస్తున్నాం. ► కోడి రామ్మూర్తి స్టేడియం మరమ్మత్తుల కోసం పదికోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. -
స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు. వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు. నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్డీఎస్వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఇండియన్ రైల్వేస్ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ రెవిన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.1.438.08 కోట్లు నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా 17 రాష్ట్రాలకు గురువారం రూ.9,871 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి రూ.1,438.08 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) -
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.581.7 కోట్లు
సాక్షి, అమరావతి: 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు టైడ్ గ్రాంట్ రూపంలో మొదటి విడతగా కేంద్రం మంగళవారం రూ.581.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం 70–15–15 నిష్పత్తిలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనుంది. నిబంధనల ప్రకారం.. టైడ్ గ్రాంట్ రూపంలో ఇచ్చే నిధులను ఆయా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లు గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదల కార్యక్రమాలకు మాత్రమే ఖర్చుపెట్టాలి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,939 కోట్లు కేటాయించారు. అందులో బేసిక్ గ్రాంట్ మొదటి విడతగా రూ.387.80 కోట్లను ఇప్పటికే కేంద్రం విడుదల చేయగా, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు బదలాయించింది. ఇవీ చదవండి: ఏపీ మరో రికార్డు.. రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం -
మాట నిలబెట్టుకున్నాం
-
Telangana: 16 మంది మంత్రులు.. రూ.32 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకోసం ఒక్కో మంత్రికి రూ.2 కోట్ల చొప్పున 16 మంది మంత్రులకు రూ.32 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఈ మొత్తానికి అనుమతి ఇచ్చింది. మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలు, వాటి పరిధిలోని నియోజకవర్గాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల చేసేందుకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి ఆమోదం, అమలు, నిర్వహణ, పద్దుల తదితరాలకు నోడల్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారని.. అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తారన్నారు. చదవండి: మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు -
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు నిధులు విడుదల
-
తెలంగాణకు రూ.1,336 కోట్లు.. ఏపీకి రూ.1,810 కోట్లు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ విధానంతో రాష్ట్రాలకు భారీగా నష్టాలు ఎదుర్కొంటుండగా కేంద్రం పరిహారం కింద విడతల వారీగా అందిస్తోంది. తాజాగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గతేడాది డిసెంబర్లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 3,174.15 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం మరో విడత పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.1,336.44 కోట్లు విడుదల చేయగా.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,810.71 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం విషయమై రాష్ట్రాలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి, ఆర్థికమంత్రులను కలిసి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విడుదల వారీగా జీఎస్టీ పరిహారం విడుదల చేస్తోంది. -
ఇది రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే 90 శాతం వాగ్దానాలను అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. సాక్షి, అమరావతి: ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసం రైతుల్లో కలిగించామన్నారు. మాట చెబితే ఆ మాటపై నిలబడతామనే నమ్మకం కల్పించామని చెప్పారు. 2019 ఖరీఫ్‌కు చెందిన 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లను చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ తొలి దశలో మూడు జిల్లాల్లో ఈ నెల 26 నుంచి చేపడుతున్నామన్నారు. ‘ఈ రోజు నిజంగా మరో ఘట్టం. రైతులకు మంచి చేసే విషయంలో ఎంతో సంతోషం కలిగించేది. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుందన్న నమ్మకం కలుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదు. మొదటిసారిగా ప్రభుత్వంపై విశ్వసనీయత కలుగుతోంది. ఆ నమ్మకం ఇవ్వగలుగుతున్నాం’ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. 18 నెలల్లో 90 శాతం హామీలు అమలు ►ఈ నెలాఖరుకు మన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఎన్నికల హామీలు ప్రకటించి, ఆ తర్వాత దాన్ని పట్టించుకోని వారిని చూశాం. కానీ మనం మన మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి 90 శాతం హామీలు అమలు చేశాం. ► రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ 14.58 లక్షల రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510 కోట్లు జమ చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. ఆర్బీకేలు - రైతు భరోసా ► రైతు భరోసా కేంద్రాల గురించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్నా ఏర్పాటు చేశాం. నవరత్నాలులో తొలి మాట రైతు భరోసా రూ.12,500కు బదులుగా రూ.13,500 ఇస్తున్నాం. నాలుగేళ్లకు బదులుగా 5 ఏళ్లు ఇస్తున్నాం. వరసగా రెండో ఏడాది కూడా జమ చేశాం. ► రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు రైతు భరోసా అందుతోంది. గతంలో ఏం జరిగింది? ►గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015-16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ►2015-18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ►ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ►అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ►వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. వారికి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. అర్హత ఉండి రాకపోతే.. ►అర్హత ఉన్నప్పటికీ ఇప్పుడు లబ్ధి కలగకపోతే కంగారు పడొద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది. అర్హుల జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించాం. ఎవరికైనా మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. 155251 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ►అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా మిగిలి పోకూడదని ఆరాటపడే ప్రభుత్వం ఇది. అందుకే ఈ నెలలోనే వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాం. పలు పథకాల్లో కొత్త వారికి ప్రయోజనం కల్పించాం. రైతుల కోసం ఎన్నెన్నో.. ►గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1180 కోట్లు ఇస్తున్నాం. ►రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ►పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు ►13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షించి, నిర్ధారించి అందిస్తున్నాం. గతంలో ఏనాడూ ఇది జరగలేదు. దీంట్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించి క్వాలిటీ చూడాలని చెప్పాం. 26 నుంచి అమూల్ పాల సేకరణ ►రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ►పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలు ►2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో రూ.3,200 కోట్లతో బత్తాయి, అరటి, మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు, టమాట తదితర పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ►అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మీకు ఏ సమస్య వచ్చినా మీ బిడ్డ తోడుగా ఉంటాడని చెబుతున్నాను. దేవుడు రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ►ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక సీజన్లోనే వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అక్టోబర్‌లో జరిగిన పంట నష్టానికి నెల రోజుల వ్యవధిలోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. అందుకు మీకు రైతుల తరఫున కృతజ్ఞతలు. - కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. పిల్లలు కూడా వదిలేయమన్నారు. రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ. 3,218 వడ్డీ మాఫీ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో లక్షకు రూ.2 వేలు పై చిలుకు మేమే ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్లం. కానీ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. - ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా మీ పట్ల నమ్మకం పెరిగింది గ్రామ సచివాలయాలు ఓ చరిత్ర, అద్భుతంగా పని చేస్తున్నాయి. ఎక్కడ నుంచి ఇన్ని పథకాలకు మీరు డబ్బులు తెస్తున్నారని అడుగుతున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ రాయితీ ఇస్తుందని మీ పనితీరు ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. - విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా రైతుల పాలిట మీరు దేవుడు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. గతంలో ఈ డబ్బులు రెండేళ్లైనా వచ్చేవి కావు. మీ వల్ల అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. - శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా -
రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, తాడేపల్లి: రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని అన్నారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్టు తెలిపారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్టు వెల్లడించారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని, ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపినట్టు సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రైతులకు ఎంత చేసినా తక్కువే.18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చాం. రైతుభరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నాం. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నాం. రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశాం. గత ప్రభుత్వం సున్నవడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల ఆ బకాయిలన్నింటినీ మేమే చెల్లించాం. ఏ సీజన్లో పంట నష్టపోతే.. అదే సీజన్లో రైతులను ఆదుకుంటున్నాం. నెల రోజుల్లోపే రూ.132 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు. -
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
-
సచివాలయం నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణానికి గాను గురువారం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చెన్నై ఆర్కిటెక్ట్స్ ఆస్కార్, పొన్నిలతో భేటీ అయ్యారు. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయ భవనంలో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, సమావేశాల కోసం మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని సూచించారు. -
మార్కెట్‌కు ఆర్బీఐ బూస్ట్
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఆదుకోవడానికి రూ.50,000 కోట్లనిధులు అందుబాటులోకి తెస్తామన్న ఆర్బీఐ ప్రకటన సోమవారం స్టాక్ మార్కెట్‌ను లాభాల బాటలో నడిపించింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ సెన్సెక్స్ 31,500 పాయింట్ల పైకి, నిఫ్టీ 9,200 పాయింట్లపైకి ఎగబాకాయి. సెన్సెక్స్ 416 పాయింట్ల లాభంతో 31,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆర్బీఐ అభయం...: మ్యూచువల్ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులను అందుబాటులోకి తేవడంతో కరోనా వైరస్ కల్లోలంతో అల్లకల్లోలమవుతున్న ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించడానికి మరిన్ని చర్యలను తీసుకోగలమని ఆర్బీఐ అభయం ఇచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఒక దశలో సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్ల మేర లాభపడ్డాయి. ట్రేడింగ్ చివర్లో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు తగ్గాయి. కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి జపాన్ కేంద్ర బ్యాంక్ మరోసారి ప్యాకేజీని ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు 0.2–2% రేంజ్లో పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1–2% రేంజ్ లాభాల్లో ముగిశాయి. మ్యూచువల్ ఫండ్ షేర్ల జోరు... మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు రూ.50,000 కోట్ల నిధులను ఆర్బీఐ అందుబాటులోకి తేనుండటంతో మ్యూచువల్ ఫండ్, ఆర్థిక రంగ షేర్లు జోరుగా పెరిగాయి. నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ 13 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 8 శాతం, శ్రీరామ్ ఏఎమ్‌సీ 5 శాతం చొప్పున ఎగిశాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా మనీ క్యాపిటల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు 6–11 శాతం రేంజ్లో పెరిగాయి. ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 5 షేర్లు మాత్రమే నష్టపోగా మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 6శాతం లాభంతో రూ.407 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ షేర్ బాగా పెరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ► యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ ఆ్యంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం మేర లాభపడ్డాయి. ► ఒక్కో షేర్‌కు రూ.320 (3200 శాతం) స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించడంతో ఫైజర్ షేర్ 11 శాతం లాభంతో రూ.4,891 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ లాభపడినప్పటికీ, ఇంట్రాడేలో వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. సైయంట్, చాలెట్ హోటల్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► సన్ ఫార్మా, లుపిన్, లారస్ ల్యాబ్స్, సిప్లా షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. -
ఆర్బీఐ ‘ఫండ్స్’
ముంబై: డెట్ మార్కెట్లో నిధుల లేమికి ఆర్బీఐ తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ప్రకటించింది. డెట్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఆరు అధిక రిస్క్‌తో కూడిన డెట్ పథకాలను మూసివేస్తూ గత వారం నిర్ణయం తీసుకుంది. గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా అసలే లిక్విడిటీ సమస్య తీవ్రంగా ఉన్న డెట్ మార్కెట్లో ప్రాంక్లిన్ టెంపుల్టన్ నిర్ణయం ఇన్వెస్టర్ల నుంచి మరింత మొత్తంలో ఉపసంహరణలు పెరిగేందుకు దారితీయవచ్చన్న ఆందోళనలతో.. సోమవారం ఆర్బీఐ మార్కెట్లను ఆదుకునే చర్యలతో ముందుకు వచ్చింది. దీంతో ఫండ్స్ సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది. అధిక రిస్క్ విభాగంలోనే సమస్య.. ‘‘కరోనా వైరస్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో ఆటుపోట్లు పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్‌కు నిధుల లభ్యత సమస్యలు ఎదురయ్యాయి. పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా కొన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను మూసివేయడంతో ఈ ఒత్తిళ్లు మరింత తీవ్రతరమయ్యాయి. ప్రస్తుత దశలో అధిక రిస్క్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ విభాగానికే ఈ ఒత్తిళ్లు పరిమితమయ్యాయి. పరిశ్రమలో మిగిలిన విభాగాల్లో అధిక శాతం నిధుల లభ్యత ఉంది’’ అంటూ ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది..? మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్ఎల్ఎఫ్–ఎంఎఫ్) కింద ఆర్బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్‌ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్డ్ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. ఈ నెల 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు అయినా బ్యాంకులు ఈ విండో ద్వారా నిధుల కోసం బిడ్ దాఖలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్స్‌కు రుణాలను అందించడం, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఫండ్స్‌కు నిధుల లభ్యత ఏర్పడుతుంది. బ్యాంకుల నుంచి డిమాండ్ అధికంగా ఉంటే అదనంగా నిధులను అందించే అవకాశం కూడా ఉంటుందని ఏప్రిల్ 23 నాటికి నాలుగు ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకుల నుంచి రూ.4,428 కోట్లను రుణాలుగా తీసుకున్నట్టు యాంఫి గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు.. మ్యూచువల్ ఫండ్స్‌కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్బ్రదర్స్ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్‌లోనూ ఆర్బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది. నిపుణుల భిన్నాభిప్రాయాలు.. ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధుల లభ్యతకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అద్భుతమైనదని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని కొందరు పేర్కొంటే.. రిస్క్ అధికంగా ఉండే డెట్ విభాగంలో పెద్ద ఫలితాన్నివ్వకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. మార్కెట్లలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచే చక్కని చర్యలు ఇవి. – నీలేశ్‌షా, యాంఫి చైర్మన్ సానుకూలమైన ఆహ్వాన చర్య. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను సానుకూలంగా మారుస్తుంది. – నిమేశ్షా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో ఫండ్స్‌కు బ్యాంకులు తమ రుణాలను ఎప్పుడు పెంచుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో అవసరానికంటే ఎక్కువ నిధుల లభ్యతకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ చర్యలు బాండ్ మార్కెట్లకు మేలు చేస్తాయి. నమ్మకాన్ని భారీగా పెంచే బూస్టర్ వంటిది. – ఎ.బాలసుబ్రమణ్యం, ఆదిత్య బిర్లా ఏఎంసీ ఎండీ, సీఈవో లిక్విడిటీ విండో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది. అయితే, నిధుల కటకట ఏర్పడిన, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న పేపర్లకు బ్యాంకులు నిధులు అందిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. – కౌస్తభ్ బేల్‌పుర్కార్, మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ -
నిధుల విడుదలపై బీజేపీ దుష్ప్రచారం: కర్నె
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. నిధుల గణాంకాలను కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా ప్రకటించినా.. బీజేపీ నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ని ధులకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఖండించారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం నుంచి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి మాత్రం రూ. 1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని గురువారం ఓ ప్రకటనలో వెల్లడిం చా రు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన గణాంకాలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ విమర్శిస్తే బీజేపీ నేతలు ఉలికిపడుతున్నారన్నా రు. ప్రగతిశీల రాష్ట్రాలకు నిధులు కేటాయింపు పెంచాలని సీఎం పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. తెలంగాణ కు నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. -
షట్డౌన్కు తాత్కాలిక బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో గత 35 రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్కు పాక్షికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూజువాణీ ఓటుతో ఆమోదించగా, ట్రంప్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో దాదాపు 8,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందనున్నాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 3 వారాల్లోగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలసవిధానంపై ఇరుపార్టీలు ఓ అంగీకారానికి రావాలి. డెమొక్రాట్లకు మినహాయిపు కాదు.. షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లో శుక్రవారం(స్థానిక కాలమానం) నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘వలసల్ని సమీక్షించే హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి ఏడాది కాలానికి అవసరమైన నిధుల్ని కేటాయించే విషయమై ఉభయ సభలతో త్వరలోనే చర్చిస్తా. 35 రోజులుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు పూర్తి నెల జీతాన్ని అందిస్తాం. షట్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నేను తీసుకున్న నిర్ణయం డెమొక్రాట్లకు ఇచ్చిన మినహాయింపు కానేకాదు. సరిహద్దులో బలమైన గోడ లేదా ఉక్కు కంచె నిర్మించడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఫిబ్రవరి 15లోగా ఆమోదయోగ్య ఒప్పందం కుదరకుంటే మళ్లీ షట్‌డౌన్ తప్పదు’ అని అన్నారు. హెచ్1బీ ప్రీమియం ప్రాసెసింగ్ రేపటి నుంచే హెచ్–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. వార్షిక పరిమితి (మొత్తం 85,000) కిందకు వచ్చే అన్ని రకాల హెచ్–1బీ వీసా కోటాలకు ప్రీమియం ప్రాసెసింగ్ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ పరిమితి కిందకు రాని పలు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన హెచ్–1బీ ప్రీమియం ప్రాసెసింగ్ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రీమియం ప్రాసెసింగ్ కింద దరఖాస్తుదారులు నిర్దిష్ట మొత్తంలో ఎక్కువ రుసుమును చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. -
ఎన్నికల వేళ నిధుల పందేరం
విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ప్రజాకర్షక ప్రలో భాలకు తెరలేపింది. మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ప్రలోబపెట్టే చర్యలను ప్రారంభించింది. నాలుగున్నరేళ్లు మిన్నకుండి చివరి ఆరు నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్టు గుర్తింపుపొందేందుకు ఆరాటపడుతోంది. వివిధ పథకాల కింద భారీగా నిధులు కేటాయింపులు చేస్తూ ప్రజలను, అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలో నాలుగు మున్సి పాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ122.23 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడం, పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎన్నికల జిమ్ముక్కుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓటు ఎటు వేస్తామన్నది పక్కనపెడితే... కనీసం పాలన చివరిలోనైనా కాస్తా అభివృద్ధి చేస్తే చాలని ప్రజలు భావిస్తున్నారు. రెండేళ్ల తరువాత సిప్ ప్రణాళికకసరత్తుకు మోక్షం... రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.కోట్లలో కేటాంపులు చేసిన నిధులన్నీ సిప్ (క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ స్కీం)లో అమలు చేసింది. వాస్తవానికి ఈ పథకం అమలు ప్రక్రియ రెండేళ్ల కిందటే తెరపైకి రాగా.. నిద్రమత్తు నటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేటాయింపులు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ122.24 కోట్ల నిధుల్లో విజయనగరం మున్సిపాలిటీకి రూ.64.60 కోట్లు కేటాయించగా... బొబ్బిలి మున్సిపాలిటీకి రూ17.07 కోట్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి రూ19.15 కోట్లు, సాలూరు మున్సిపాలిటీకి రూ.13.06 కోట్లు, నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ 8.36 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఐదు అంశాలపై ఖర్చు చేయాలని ఆదేశించగా.. తాగునీటి కల్పన, రోడ్లు, కాలువల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఉత్తర్వుల్లో సూచిం చింది. మున్సిపాలిటీల వారీగా కేటాయించిన నిధులకు సంబంధించి అభివృద్ధి పనుల జాబితా ప్రతిపాదనలు ఇప్పటికే రప్పించుకున్న ప్రభుత్వం, పబ్లిక్ అండ్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. నాలుగున్నరేళ్లలో జరగనది..నాలుగు నెలల్లో సాధ్యమేనా..? గత నాలుగున్నరేళ్ల కాలంలో మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పట్టణప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అలా కేటాయింపులు చేసిన నిధులు ఇప్పటికీ ఖర్చుకాని పరిస్థితి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక్క నగర పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలకు కనీస అవసరాలైన తాగు నీరు కోసం, పక్కా రోడ్లు, డ్రైన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు లేకపోలేదు. ప్రస్తుత శీతాకాలంలో విజయనగరం మున్సిపాలిటీలో నివసిస్తున్న సుమారు 4 లక్షల మంది ప్రజలు గత రెండు నెలలుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. నాలుగున్నరేళ్లుగా ప్రజల సమస్యలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా నిధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఎన్నికల తాయిలం అంటూ విశ్లేషకులు భావిస్తుండగా... అధికారులు మాత్రం అభివృద్ధికి అవకాశం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. ప్రాంతాల వారీగా కేటాయింపులు ఇలా... జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.122.23 కోట్లు నిధులు మంజూరు చేయగా... అందులో అత్యధికంగా త్వరలో కార్పొరేషన్ హోదా దక్కించుకోనున్న విజయనగరం మున్సి పాలిటీకి రూ.64.60 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో తాగునీటి సరఫరాకు రూ.3కోట్లు, పక్కా రోడ్ల నిర్మాణానికి రూ.22కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.31 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.3.70కోట్లు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.4.90 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. బొబ్బిలి మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం రూ.3.70 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.5.67 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.1.50 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని సూచించింది. పార్వతీపురం మున్సిపాలిటీకి కేటాయించిన నిధుల్లో వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ కోసం రూ.3.70 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.3.90 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.5కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.2.80 కోట్లు కేటాయించాలని సూచించింది. సాలూరు మున్సిపాలిటీకి కేటా యించిన నిధుల్లో రూ.3.70 కోట్లు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కోసం, కాలువల నిర్మాణానికి రూ.5.54 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2.30 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.42లక్షలు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.1.10కోట్లు కేటాయిం చాలని ఆదేశించింది. నెల్లిమర్ల నగర పంచాయతీకి ఇవ్వనున్న నిధుల్లో వివిధ అభివృద్ధిపనులకు రూ.3.70కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.1.61 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.2కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.30లక్షలు, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.75 లక్షలు కేటాయింపులు చేసింది. కేటాయించిన నిధులు వారీగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపించగా... డిసెంబర్ నెలలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా రూ.కోట్లలో కేటాయింపులు చేసిన నిధులన్నీ సిప్ (క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ స్కీం)లో అమలు చేసింది. వాస్తవానికి ఈ పథకం అమలు ప్రక్రియ రెండేళ్ల కిందటే చర్చకు వచ్చింది. పూర్తి కసరత్తు అనంతరం ప్రతిపాదనలు సేకరించిన ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఈ పథకంలో ఇప్పటికే వేసిన రోడ్లుపై రోడ్లు వేయడం, కాలువల పునఃనిర్మాణం చేయకూడదు. కేటాయించిన నిధులకు సంబంధించి డిసెంబర్ నెలాఖరునాటికి టెండర్లు పూర్తి చేయాల్సి ఉంది. – ఎం.ఎం.నాయుడు,కమిషనర్, సాలూరు మున్సిపాలిటీ -
సాయానికి ఆర్నెల్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ.. తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు. -
గాంధీహిల్‌కు మహర్దశ..!
సాక్షి, విజయవాడ: విజయవాడలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన గాంధీహిల్‌పై ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) దృష్టి సారించింది. అథారిటీ పాలకమండలి చైర్మన్, పర్యాటక భాషా సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో గాంధీహిల్‌ను రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గాంధీహిల్ ఫౌండేషన్ ఆధీనంలో గాంధీ కొండ ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, గాంధీ హిల్ ఫౌండేషన్ పరస్పర అంగీకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆధునిక నక్షత్రశాల, పిల్లల రైలు.. గాంధీహిల్‌పై నక్షత్రశాల, పిల్లల రైలు, లైబ్రరీలు ఇప్పటికే ఉన్నాయి. పిల్లల రైలు ఎక్కితే నగరాన్ని చూడవచ్చు. గాంధీహిల్ అభివృద్ధిలో భాగంగా రూ.3.15 కోట్లతో నక్షత్రశాలను మాత్రమే ఆధునికీకరించాలని తొలుత భావించినా, పాలక మండలి సమావేశం నిధుల సమస్య రాకుండా చూస్తామని, అన్ని విభాగాలను ఆధునికీకరించి పర్యాటక భరితంగా తీర్చిదిద్దాలని ఏపీటీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మీనా మాట్లాడుతూ అక్కడి పిల్లల రైలును తిరిగి నడపాలని, అదే క్రమంలో గ్రంథాలయ భవనానికి మెరుగులు దిద్ది ప్రతిఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. సర్వాంగ సుందరంగా కొండ ప్రాంతం ఉండాలని ల్యాండ్ స్కేపింగ్ మంచి ఆర్కిటెక్చర్‌కు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. చిరంజీవి పర్యాటక మంత్రిగా ఉండగానే.. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా సినీనటుడు చిరంజీవి ఉన్నప్పుడు గాంధీ హిల్‌కు రూ.5 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లోనే నక్షత్రశాలను, పిల్లల రైలును ఆధునికీకరించాలని నిర్ణయించారు. అయితే ఈ నిధులను సద్విని యోగం చేసుకోలేదు. ఆ తరువాత కొద్దిపాటి నిధులతో గాంధీహిల్‌ను అభివృద్ధి చేశారు. అయితే అది పర్యాటకులను ఆకట్టుకునే స్థాయికి మాత్రం ఎదగ లేదు. ఈసారి ఏపీటీఏ రంగంలోకి దిగింది. భవానీద్వీపంలో వెలుగుల ఉద్యానవనం.. మరోవైపు భవానీ ద్వీపంలో వెలుగుల ఉద్యాన వనం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ పాలక మండలి నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా పది లక్షలకు పైగా ఎల్ఈడీలతో వెలుగుల ఉద్యానవనం తీర్చిదిద్దనున్నారు. ఈ వెలుగులు కష్ణానదిలో ప్రతిబించించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా మొక్కలతో జంతువులు, పక్షుల ఆకారాలను తీర్చిదిద్దటం మనం చూస్తుంటాం. ఈ వెలుగుల ఉద్యానవనంలో అవన్ని ఎల్ఈడీ వెలుగుల ద్వారానే రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో టూరిజం అథారిటీ సీఈఓ హిమాన్హు శుక్లా మాట్లాడుతూ, వెలుగుల ఉద్యానవనం ప్రపంచ శ్రేణి పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ఉండనుందని, సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల సంబంధించి పలు అంశాలు పాలకమండలి అజెండాలో ఉండగా వాటిని ప్రభుత్వ పరిశీలనకు పంపాలని మీనా నిర్ణయించారు. సమావేశంలో సంçస్థ పాలనా వ్యవహారాల సంచాలకుడు డాక్టర్ సాంబశివరాజు పాల్గొన్నారు. -
రుయాకు మహర్దశ !
తిరుపతి (అలిపిరి) : శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 19.58 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్ వసతులు, భవన నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. ఫైర్ సేప్టీ వ్యస్థతో పాటు ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక బ్యాక్టీరియా ఫ్రీ సిస్టం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి దఫా రుయాకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. అదే విధంగా కాన్పుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి. ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ సాధన కోసం.. రుయా, మెటర్నటీ ఆస్పత్రులను ఆరు నెలల క్రితం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) కమిటీ పరిశీలించింది. పలు లోపాలను గుర్తించి వాటిని భర్తీ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ వ్యవస్థ, భవన నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లో వసతులను సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో రుయా, మెటర్న టీ ఆస్పత్రులు ఎలాగైనా ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. పనులకు త్వరలో శ్రీకారం రుయాలో వచ్చే నెల మొదటి వారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రానుంది. రుయాలో అభివృద్ధి పనుల అనంతరం మరోమారు ఎన్ఏబీహెచ్ సభ్యులు సందర్శించనున్నారు. అభివృద్ధి పనులపై సంతృప్తి చెందితే ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్రిడిటేషన్ సాధిస్తే రుయాకు ఇన్‌పేషెంట్ల సంఖ్య బట్టి నిధులు మంజూరవుతాయి. ఆస్పత్రిలో పరిశీలన రుయా ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్‌కు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన స్థల పరిశీలన, మౌలిక సదుపాయల కల్పన తదితర అంశాలపై ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈలు గురువారం రుయా ఆస్పత్రిని పరిశీలించారు. నూతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్, ఫైర్‌సేప్టీ వ్యవస్థ ఏర్పాటుకు మ్యాప్‌లను పరిశీలించారు. రుయా ఆస్పత్రిని పరిశీలించిన వారిలో ఏపీఎంఎస్ఐడీసీ డిజైన్ ఈఈ నెహ్రూ, ఈఈ నగేష్‌తో పాటు రుయా ఆర్ఏంఓ డాక్టర్ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నబాబు, అడ్మినిస్టేటర్ ఉమాశంకర్ ఉన్నారు. -
కమీషన్లకే నిధుల మంజూరు
ఎల్.ఎన్.పేట: రాష్ట్రంలో సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే నిధులు మంజూరు చేయించడం, రైతుల భూమలు బలవంతంగా లాక్కోవడం, ఆర్థిక నేరాలు(స్కాం), మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. స్థానిక మండల కేంద్రంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల్లో సగం నిధులు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఆ సొమ్ముతోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు దుయ్యబట్టారు. కమీషన్లు ఇచ్చిన పనులకే నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు నిదర్శనమే వంశధార రిజర్వాయర్ నిర్మాణమని తెలిపారు. అందుకే నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. అవసరం లేకపోయినా రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించారని మండిపడ్డారు. అడ్డుకున్న వారినే తప్పుబట్టారు అమరావతి ప్రాంతంలో మంత్రి లోకేష్ తోపాటు పలువురు మంత్రులు, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు వందలాది ఎకరాలను బినామీల పేర్లతో దక్కించుకుని వేలాది కోట్లు వెనకేసుకున్నారని రెడ్డి శాంతి నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ సంస్థ భూములు కూడా అక్రమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు ఎప్పుడూ లేనంతగా ఏపీలో పెరిగి పోయాయని, అనేక సర్వేలు స్పష్టమైందన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్న తహసీల్దారు వనజాక్షినే తప్పుపట్టిన ఘనచరిత్ర ఆధికార పార్టీకి చెందుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ కిలారి త్రినా«థరావు, నాయకులు పెనుమజ్జి విష్ణుమూర్తి, లోచర్ల మల్లేశ్వరరావు, మహంతి రవికుమార్, కొల్ల కృష్ణ, పైల తవిటినాయడు, సవర లకాయ్ పాల్గొన్నారు. -
సిటీ రైల్వే స్టేషన్‌కు మహర్దశ
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు రానున్నాయి. స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రూ.25కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడితే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. పనులను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. 2018–19 బడ్జెట్ నుంచి ఇస్తున్న నిధులను ఏయే అవసరాలకు వినియోగించాలనే అంశాలతో కూడిన అంచనా విలువలను ఈనెల 10వ తేదీలోపు ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంది. దీంతో సివిల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాక్, టెక్నికల్ వంటి విభాగాలు కసరత్తు మొదలుపెట్టాయి. నెరవేరనున్న దశాబ్దాల కల కర్నూలు రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ హయాంలో నగరంలోని నర్సింహారెడ్డి నగర్, ఇందిరాగాంధీ నగర్ మధ్య నిర్మించారు. అప్పట్లో నగర జనాభా, స్థాయిని బట్టి ‘కర్నూలు టౌన్’గా పేరు ఖరారు చేశారు. రైల్వే బోర్డు నిర్ణయం ప్రకారం హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్–ఏ సిటీ పేర్లు పెడితే వాటికి తగ్గట్లుగా స్టేషన్లు అభివృద్ధి చేస్తారు. టౌన్ స్టేషన్ ఉన్న కారణంగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేది. 1995లో కర్నూలు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచారు. అప్పటి నుంచి స్టేషన్ స్థాయిని టౌన్ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించడంలో 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. అయితే ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. సమస్యలు ఇవీ.. కర్నూలు స్టేషన్ సిటీ స్థాయికి అప్‌గ్రేడ్ అయినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ‘సిటీ’గా మారితే నిధులు వరదలా వస్తాయని భావించినా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. ప్లాట్‌ఫాముల్లో కంపు, వెయిటింగ్ హాలు లేక మహిళా ప్రయాణికుల ఇబ్బందులు, తగిన కుర్చీలు లేక కిందే కూర్చుంటున్నారు. ఇరుకైన రోడ్డు, ఒకే అడ్వాన్స్ బుకింగ్ కౌంటరు, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. రోజుకు 10వేల మంది ప్రయాణాలు కర్నూలు స్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి, కొంగూ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ప్రతిరోజు 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 7 ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 10వేల మంది సాధారణ ప్యాసింజర్లు, 800 మందికి పైగా రిజర్వేషన్లతో రాకపోకలు సాగిస్తుండడంతో ఆశాఖకు రూ.10లక్షల వరకు రోజువారి ఆదాయం వస్తోంది. అయినా హాలులో ఫ్యాన్లు, లైట్లు కూడా లేకపోవడం గమనార్హం. 2, 3వ నంబరు ప్లాట్‌ఫాంలలో తాగునీటి సమస్య, ఫ్యాను సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. జరిగే అభివృద్ధి పనులు ♦ కర్నూలు సిటీ స్టేషన్‌కు కేటాయించిన రూ.25కోట్లతో పలు రకాల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వసతులు, సౌకర్యాలు మెరుగుపర్చి సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించారు. ♦ స్టేషన్ ముఖద్వారం రూపురేఖలు మార్చనున్నారు. రెండు ముఖద్వారాలు పెట్టే ఆలోచనలో అధికారులున్నారు. ♦ స్టేషన్ ఆధునికీకరణ, మల్టీ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, షాపింగ్, కమర్షియల్ షాపుల నిర్మాణాలు జరిగే అవకాశాలు. ♦ ఆహ్లాదకరమైన భవనాలు, పార్కు, అన్ని సౌకర్యాలతో విశాలమైన ప్లాట్‌ఫాంలు, అధికార యంత్రాంగానికి తగిన గదులు, సీసీ కెమెరాల నిఘా, పార్కింగ్, వైఫై, ఫౌంటైన్, వీఐపీ లాంజ్, రెస్టు రూమ్‌లు తదితర వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ♦ పట్టాలను క్లీనింగ్ చేసేందుకు వాటర్ ఆప్రాన్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు. ♦ ప్యాసింజరు ఆపరేటింగ్ ఎంక్వైరీ టర్మినల్ (పీఓఈటీ) మిషన్లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.. ఈ మిషన్ ద్వారా మనకు కావాల్సిన భాషలో రైలు వివరాలు, కోచ్ పరిస్థితి, పీఎన్ఆర్ స్టేటస్‌తోపాటు రైలు ఏ స్టేషన్లో వస్తుందో, వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కలర్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. ♦ ప్రస్తుతం తిరిగే రైళ్లుతోపాటు అదనంగా నడపడం, నాన్ స్టాప్లకు స్టాపింగ్ కల్పిండం వంటివి సమకూరే అవకాశాలున్నాయి. -
లైన్లు రెడీ...రైళ్లేవీ?
ఎంఎంటీఎస్ రెండో దశను నిధుల గండం వెంటాడుతోంది. లైన్లు సిద్ధమైనప్పటికీ కొత్త రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం మార్గంలో కొద్ది రోజుల క్రితమే రైల్వే భద్రతా కమిషన్ తనిఖీలు నిర్వహించింది. రైళ్లు నడిపేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అనుమతులు కూడా ఇచ్చేసింది. కానీ కొత్త లైన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు బోగీలు మాత్రం లేవు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండాఉండిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గత బడ్జెట్లో తమ వంతు వాటాగా రూ.430 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో రెండో దశ రూట్లలో రైళ్లు పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో రైల్వే లైన్ల పనులు పూర్తయినప్పటకీ రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్నాయి. ఒక్క 12.5 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్–బొల్లారం లైన్లు మాత్రమే కాకుండా 14 కిలోమీటర్ల పొడవైన మౌలాలి–ఘట్కేసర్, మరో 10 కిలోమీటర్ల పొడవైన పటాన్చెరు–తెల్లాపూర్ లైన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాల్లో పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రైళ్ల కొనుగోళ్లు, స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల్లో జాప్యంనెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి... నగర శివార్లను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు మొదటి నుంచి నిధులు కేటాయించడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు అందజేయకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ సంయుక్త ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన మూడు వంతుల నిధులను అందజేయాల్సి ఉంది. మరో 1/4 వంతు నిధులను రైల్వేశాఖ కేటాయిస్తుంది. సుమారు రూ.630 కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నుంచి అందాల్సి ఉండగా ఇప్పటి వరకు దశల వారీగా రూ.200 కోట్ల వరకే అందజేశారు. వీటితో పాటు, రైల్వేశాఖ నిధులతో కొన్ని లైన్ల విద్యుదీకరణ, డబ్లింగ్ వంటి పనులు పూర్తయ్యాయి. మిగతా పనుల్లో నిధుల కొరత తలెత్తింది. సకాలంలో ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రైల్వేకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని కలిశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు ఇవ్వాల్సిన సుమారు రూ.430 కోట్ల నిధులను అందజేయాల్సిందిగా కోరారు. అలాగే చర్లపల్లి టర్మినల్ కోసం భూమిని కేటాయించాలని, అప్రోచ్ రోడ్డు వేయించాలని కోరారు. నిధులొస్తేనే రైళ్లు.... ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్న సికింద్రాబాద్–బొల్లారం మార్గంలో ప్రతి రోజు కనీసం 20 ట్రిప్పులు నడపాలన్నా ఒక ట్రిప్పుకు 3 బోగీల చొప్పున 15 అవసరమవుతాయి. అలాగే సికింద్రాబాద్ –ఘట్కేసర్, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపాలంటే కొత్తబోగీలు అవసరమే. మొత్తంగా ఎంఎంటీఎస్ రెండో దశ మార్గాల్లో రైళ్లు నడిపేందుకు ఇంజన్లు, బోగీల కోసం కనీసం రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు అందజేస్తే తప్ప కొత్త బోగీలు కొనే పరిస్థితి లేదని, రైల్వేశాఖ తన వంతు నిధులను ఇప్పటికే పూర్తిగా ఖర్చు చేసిందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రైల్వే ఉన్నతాధికారులు జరిపిన సంప్రదింపుల్లో ఎంఎంటీఎస్ రెండో దశతో పాటు చర్లపల్లి టర్మినల్‌పై చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.80 కోట్లతో చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇక్కడ భూమి కొరత ఉంది. ఈ అంశంపైన అధికారులు చర్చలు జరిపారు. మరో టర్మినల్ కోసం సర్వే... చర్లపల్లితో పాటు రెండో టర్మినల్‌గా గతంలో వట్టినాగులపల్లిని ప్రతిపాదించారు. కానీ నగరానికి చాలా దూరంలో ఉన్న వట్టినాగులపల్లి కంటే సమీపంలో ఉండి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఉండే మరో చోట రైల్వే టర్మినల్ కట్టించాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. నాగులపల్లి నుంచి నగరానికి రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పైగా రోడ్డు రవాణా మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపాదించిన హైటెక్‌సిటీ వద్ద కానీ లేదా భూమి లభ్యతను బట్టి మరో చోట కానీ టర్మినల్ నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంయుక్త సర్వే చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. -
ఆర్మీస్థావరాలకు 1,487 కోట్లు
న్యూఢిల్లీ: కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ స్థావరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రక్షణశాఖ రూ.1,487 కోట్లను మంజూరుచేసింది. ఈ ప్రాజెక్టును 10 నెలల్లోగా పూర్తిచేయాలని రక్షణ మంత్రి సీతారామన్ ఆదేశించినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కశ్మీర్లో నియంత్రణ రేఖ, కొన్ని చోట్ల ఆర్మీ స్థావరాలపై ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కాంపోస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆడిట్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటి ఆధారంగా భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్వోపీ) త్రివిధ దళాలకు అందజేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన 600 అత్యంత సున్నితమైన, 3 వేల సున్నితమైన స్థావరాలను గుర్తించినట్లు వెల్లడించాయి. -
పోచంపల్లికి మహర్దశ..!
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి): పర్యాటక కేంద్రమైన పోచంపల్లి కి మహర్దశ రానుంది. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పోచంపల్లి అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ద్వారా మూడు కోట్ల రూపాయలను మం జూ రు చేయించారు. గత వారం రో జుల క్రితం హెచ్ఎండీఏ అధికారులు పో చంపల్లిని సందర్శించి చేపట్టే సీసీ రో డ్లు, అంతర్గత డ్రెయినేజీ పనులను ప రిశీలించారు. అయితే మండల కేం ద్రంలో కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తు న్నా, అభివృద్ధికి మాత్రం నోచుకోక ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ఎట్టకేలకు మౌలిక వసతులు ఒనగూరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేపట్టేది ఇక్కడే.... మంజూరైన రూ. 3 కోట్ల నిధులలో రూ. 2 కోట్లు సీసీ రోడ్లు, మరో కోటి రూపాయలు అంతర్గత డ్రెయినేజీలకు ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గాంధీనగర్‌లోని పాతబస్తీ, లక్ష్మణ్‌నగర్ కాలనీ, భావనారుషిపేట, సాయినగర్ కాలనీ, రాంనగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ, మార్కండేయనగర్, నారాయణగిరిలో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. అలాగే రూ. 80లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీ నుంచి చిన్నేటి వరకు, ఇ టు రూ.20లక్షలతో వెంకటరమణ కా లనీ లో అంతర్గత డ్రెయినేజీలు ని ర్మించనున్నారు. టెండర్ల ప్రక్రియ పూ ర్తికాగానే పనులను చేపట్టనున్నారు. నెరవేరిన హామీ.. పర్యాటక కేంద్రమైన పోచంపల్లిని గతంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. తన నిధులతో కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి సీసీ, డ్రెయినేజీలు నిర్మించారు. కానీ పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులను మంజూరు చేయించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు పోచంపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 3 కోట్లు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు. దాంతో చాలా వరకు ప్రజల సమస్యలు తీరనున్నాయి. – సార సరస్వతీబాలయ్యగౌడ్, ఎంపీపీ, పోచంపల్లి -
సొంత పనులకు లక్షలు ఖర్చు చేసిన సీఎం
సాక్షి, అమరావతి : అసలే ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయింది. ఆమధ్య ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటూ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు సైతం మీడియా ముందు బీద అరుపులు అరిచారు. ఒకవైపు రైతులు రుణమాఫీ అమలు కాక అన్నదాత, అప్పుల బాధలు తాలలేక ఆత్మహత్యలు చేసుకుంటేంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ప్రజా సంక్షేమం కోసం నిధులను విదల్చని ముఖ్యమంత్రి, స్వప్రయోజనాలకు మాత్రం యధేచ్ఛగా ఖర్చుపెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనం కోసం ప్రజల సొమ్మును మరోసారి యధేఛ్చగా ఖర్చుపెట్టారు. ఆయన సొంత ఇంటి నిర్వహణ ఖర్చులకు రూ.7.50లక్షలను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లో ఇటీవలే నిర్మించిన ఇంట్లో, నీటి సరఫరా, శానిటరీ పనులతో పాటు, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్‌కు భద్రత, నిర్వహణకు రూ.7.50 లక్షల నిధులను మంజూరు చేస్తూ తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి సౌకర్యార్థం నిధులు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అది ప్రభుత్వం అందించిన అతిథిగృహం లేదా క్యాంపు కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేసినా ఒక అర్థం ఉంటుందని, కానీ ఇలా సొంత పనులకు ప్రజల సొమ్మును ఉపయోగించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దుర్గం మున్సిపాలిటీకి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరు
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం మున్సిపాలిటీకి రూ. 1.97 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ గురువారం తెలిపారు. దళితుల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరిపై గత నెల 29న ‘నిర్లక్ష్యానికి పరాకాష్ట’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. నివేదికలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టుకున్నారు. మంజూరైన రూ. 1,97,79,000లో నుంచి రూ. 75.77 లక్షలతో తక్షణమే పనులు చేపట్టేందుకు శాఖాపరమైన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసి, టెండర్లు సైతం పిలిచిన ఆరు పనులు తక్షణమే ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు. -
పునాదుల్లోనే ప్రగతి
♦ పంచాయతీ భవనాలకు గ్రహణం ♦ 82 మంజూరు కాగా 15 పూర్తి ♦ నిర్మాణంలో తీవ్ర జాప్యం ♦ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే.. మంజూరైన నిధులు : రూ.9.84కోట్లు ఒక్కో భవన నిర్మాణానికి : రూ.12కోట్లు ఆదిలాబాద్: జిల్లాలో పలు గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయి. భవనాలతో గ్రామాలకు కొత్తకళ వస్తుందని ఆశించిన పంచాయతీ సభ్యులు, గ్రామస్తులకు నిరాశే మిగులుతోంది. ప్రతీరోజు కళ్లెదుటే పిల్లర్లు, మొండిగోడలతో అసంపూర్తి భవనాలు కనిపిస్తుండడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇంజినీరింగ్ అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేయించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది ఈజీఎస్ కింద జిల్లాకు 82గ్రామపంచాయతీ నూతన భవనాలు మంజూరు కాగా రూ.9.84 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షలు కేటాయించారు. అయినా పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. కొనసా.. గుతున్న పనులు.. జిల్లాలో గతేడాది మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామపంచాయతీలుండగా 82 గ్రామపంచాయతీలకు గతేడాది ప్రభుత్వం నూతన –భవనాలు మంజూరు చేసింది. 82 భవనాల్లో 15 పంచాయతీ భవనాలు మాత్రమే పూర్తి కాగా ఇంకా 57 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పది భవనాల పనులు ఇంకా ప్రారంభించకపోవడం శోచనీయం. జిల్లాలో చాలా చోట్ల బేస్మెంట్, పిల్లర్లు, రూఫ్లెవల్లోనే భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు చేపట్టకుండా చేతులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ పనులు పూర్తికావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయకుంటే ఇప్పటికే పనులు పూర్తి చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటే భవన నిర్మాణాలు పూర్తవుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కార్యక్రమాలకు ఇబ్బందులే.. పంచాయతీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇటు పంచాయతీ భవనాలు లేక, అటు సరైన సౌకర్యాలు లేక ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలు, ఇతర కార్యకలాపాలు చెట్ల కింద, ఇతర ప్రైవేట్ స్థలాల్లో నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమ కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. ప్రతీనెల పం పిణీ చేసే ఆసరా పింఛన్లు కూడా లబ్ధిదారులకు చెట్ల కింద, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మి స్తున్న పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేసి సరైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
నాలుగు జిల్లాలు ఖాయం!
ఏర్పాట్లకు నిధులు విడుదల రూ.4 కోట్లు కేటాయించిన సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ జిల్లాల సంఖ్యపై పూర్తి స్థాయి స్పష్టత హన్మకొండ, కాకతీయ జిల్లాలపై ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనలో మన జిల్లా పరిస్థితి సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్, ఫైళ్లు, కంప్యూటర్లు అమర్చుకునేందుకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు జిల్లాకు రూ.4 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఇది పరిపాలన పరమైన అంశమే అయినా... మన జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించడం ఆసక్తి కలిగిస్తోంది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాలో పేర్నొన్నట్లుగా నాలుగు జిల్లాలు ఉండవని... చివరికి మూడు జిల్లాలే ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నిధుల కేటాయింపు ఉత్తర్వులతో నాలుగు జిల్లాలు ఉంటాయనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలని ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. ఇతర జిల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుతూ... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజిస్తారని తెలిసింది. అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన ముసాయిదా అందరినీ ఆశ్చర్యపరిచింది. వరంగల్ జిల్లాను... నాలుగు జిల్లాలుగా పునర్విభజించేలా ముసాయిదాలో పేర్కొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించవద్దని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లాను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. హన్మకొండ స్థానంలో వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు కానుందని తాజాగా చర్చ మొదలైంది. తుది దశలో నాలుగు జిల్లాలు కాకుండా మూడే ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం రూ.నాలుగు కోట్లు విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీంతో నాలుగు జిల్లాలు ఉండడం ఖాయమని స్పష్టత వచ్చింది. అయితే నాలుగో జిల్లా హన్మకొండ పేరుతో ఉంటుందా.. వరంగల్ రూరల్‌గా ఉంటుందా అనేది మరో రెండు వారాల్లో తేలనుంది. -
చేవెళ్ల రైతు బజార్‌కు 50లక్షలు మంజూరు
ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల: మండల కేంద్రంలో ఏర్పాటుచేయనున్న రైతుబజార్‌కు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేవెళ్లకు కూడా మంజూరుచేసిందని తెలిపారు. దీనికి రూ. 50లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినట్లు పేర్కొన్నారు. త్వరలో ఈ రైతుబజార్ పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు ఆయన చెప్పారు. రైతు బజార్ ఏర్పాటైతే దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవచ్చని తెలిపారు. దీంతో వినియోగదారులకు తాజాగా, తక్కువ ధరలకు కూరగాయలు లభించే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలోని గుండం (పుష్కరిణి) ఆధుణీకరణ, మరమ్మతులకోసం ప్రభుత్వం రూ. 35 లక్షలను మంజూరుచేసిందన్నారు. ఈపనులను కాంట్రాక్టరు వెంటనే పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుబజార్ ఆస్థలంలో వద్దు చేవెళ్లలో రైతుబజార్ నిర్మించతలపెట్టిన ప్రతిపాదిత స్థలం అతిపురాతనమైన సుమారు 400 ఏళ్లక్రింద నిర్మితమైన శ్రీబాలాజీ వేంకటేశ్వర దేవాలయం పక్కన ఉందని, అక్కడ నిర్మిస్తే అపవిత్రమయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. రైతుబజార్ ఇక్కడ కాకుండా మరోస్థలంలో నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యాదయ్యకు పలు కాలనీలవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు. ఈ స్థలంలో రైతుబజార్‌ను వ్యతిరేకిస్తూ దేవాదాయ ధర్మాదాయశాఖతో పాటుగా స్థానికంగా ఉన్న పలు కాలనీవాసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, తదితర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారని తెలిపారు. ఈ విషయంపై పునరాలోచించాలని ఎమ్మెల్యేను కోరుతున్నారు. -
వాతావరణ బీమా నిధుల మంజూరు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2015కు సంబంధించి వాతావరణ బీమా పథకం కింద జిల్లాలోని వేరుశనగ రైతులకు కేవలం రూ.108 కోట్లు పరిహారం మంజూరైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్ని మండలాలకు ఎంత మంది రైతులకు పరిహారం మంజూరైందనే వివరాలు వెల్లడికాలేదు. గతేడాది వేరుశనగ పంట సాగు చేసిన 5.40 లక్షల మంది రైతులు ప్రీమియం రూపంలో ఏకంగా రూ.94.50 కోట్లు చెల్లించారు. చాలా మంది రైతులకు చెల్లించిన ప్రీమియం కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. పరిహారం మంజూరైన విషయాన్ని వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ధ్రువీకరిస్తూ గతేడాది హెక్టారుకు సగటున 600 కిలోలకు పైగా పంట దిగుబడులు వచ్చినందున పరిహారం తగ్గి ఉండొచ్చని విశ్లేషించారు. -
రుణమాఫీ రెండో ఏడాది నిధులు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ నిధులను విడుదల చేసింది. తొలి ఏడాది రుణాల మాఫీ నిధులను ఒకేసారి బ్యాంకులకు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి 2 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా రూ. 2,043 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్ సీజన్ కావడంతో రైతులు రుణాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. మిగతా రూ. 2,207 కోట్లు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొత్తం 35.56 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 25 శాతం చొప్పున వరుసగా నాలుగేళ్లలో రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేయనుంది. తొలి ఏడాది రూ.4,086 కోట్లను బ్యాంకులకు విడుదల చేసింది. -
రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల
న్యూఢిల్లీ: 13వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 385 కోట్ల రూపాయలు, తెలంగాణకు 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి గణాంకాల వ్యవస్థ అమలుకు రెండు కోట్ల 60 లక్షల రూపాయలు, పంచాయతీరాజ్ సంస్థలు/ అర్బన్ లోకల్‌బాడీ/ ప్రత్యేక ప్రాంతాలకు 298 కోట్ల 82 లక్షలు, ఎ.సి.ఎ (ఇతర ప్రాజెక్టులకు) 49 కోట్ల 99 లక్షలు, కొత్త రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల దష్ట్యా 33 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. తెలంగాణకు పంచాయతీరాజ్ సంస్థలు/అర్బన్ లోకల్‌బాడీ/ప్రత్యేక ప్రాంతాలకు 73కోట్ల పది లక్షల రూపాయలు, పీఆర్ఐ/యూఎల్బీ/ ప్రత్యేక ప్రాంతాలకు గ్రాంటు కింద 76కోట్ల 77 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. రూ.1,410 కోట్లు రానట్లే సాక్షి, హైదరాబాద్: పదమూడో ఆర్థిక సంఘం గడువు మార్చి 31తో ముగియనుండటంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,410 కోట్ల నిధులకు గండి పడనుంది. ఏప్రిల్ 1 నుంచి 14వ ఆర్థిక సంఘం కేటాయింపులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 1,560 కోట్ల నిధులకు గాను రూ. 150 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన మిగతా బకాయిలపై ఆశలు ఆవిరయ్యాయి. తమకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం లేఖల ద్వారా విజప్తి చేసింది. ఇప్పటి వరకు దాదాపు 40 లేఖలు రాసింది. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం సగం బకాయిలు రూ.1,579 కోట్లకు మంజూరీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 లోగా మిగతా బకాయిలు తెచ్చుకోకపోతే వచ్చే అవకాశం లేకపోవటం... ఆర్థిక సంఘ కాల పరిమితి ముగియనుండటంతో ప్రభుత్వం పట్టు వీడకుండా మరో ప్రయత్నం చేసింది.మిగతా రూ.1,560 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని వారం రోజుల కిందట మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా రూ.150 కోట్లు విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకుందని, మిగతా నిధులు వచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. -
అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌కు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తన వంతు వాటా మొత్తం నుంచి రూ.35.26 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. రూ. 25.26 కోట్లను భూసేకరణ కోసం, మిగతా రూ.10 కోట్లను లైన్ నిర్మాణంలో తన వంతు వాటా కింద విడుదల చేస్తున్నట్టు అందులో పేర్కొంది. 17.20 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త లైన్ కోసం రైల్వేశాఖ 2012-13 బడ్జెట్లో మంజూరీ ఇచ్చింది. ఇందుకు రూ.117.74 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో 50 శాతం ఖర్చు (రూ.58.87కోట్ల)ను రాష్టప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రైల్వేశాఖ దీనికోసం కేవలం రూ.12.10 కోట్లను మాత్రమే మూడు విడతల్లో విడుదల చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కూడా కేవలం రూ.1.75 కోట్లను మాత్రమే రైల్వేకు డిపాజిట్ చేసింది. నిధుల్లేక పోవడంతో రాష్ట్రప్రభుత్వం రూ.35.26 కోట్లను అందజేయాలని నిర్ణయించింది. నిధుల విడుదలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడింది. -
లెక్కలేని తనం!
విజయనగరం మున్సిపాలిటీ :ప్రజా ధనమంటే పంచాయతీ పాలకులకు లెక్కలేకుండా పోయింది. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తూ, వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంత మొత్తంలో నిధులు ఏయే అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారో...? ఎంత మొత్తంలో పక్కదారి పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. పలు పంచాయతీల్లో గ్రామ సభలో తీర్మానం చేయకుండా, ఎటువంటి వివరాలు లేకుండానే భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్టు రెండేళ్లలో భారీగా నిధుల కేటాయింపు సుమారు మూడేళ్ల పాటు నిధులు లేమితో నీరసించిన పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ గ్రాంట్ల కింద కోట్లాది రూపాయలు మంజూరుచేశాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సం ఘం, వృత్తిపన్నుల ఆదాయం, తలసరి గ్రాంట్ ల కింద రూ 16కోట్ల 95లక్షల 88వేల 118 విడుదల కాగా, తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు కింద మరో రూ13కోట్ల 6 లక్షల ఒక వేయి 700, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల కింద జూన్ 26న మరో రూ10.10కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలోని 77 గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్‌ప్లాన్ నిధు ల కింద రూ 46.20 లక్షల విడుదలయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ60 వేలు చొప్పున వీటిని కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో పంచాయతీలకు నిధులు కేటాయింపు జరుగుతున్నా పల్లెల్లో అభివృద్ధి కానరాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిధుల వినియోగంపై జరగని ఆన్లైన్ పంచాయతీలకు వివిధ గ్రాంట్ల కింద విడుదలవుతున్న నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి సదరు పంచాయతీ సర్పంచ్‌కు చెక్ పవర్ ఉంటుంది. అయితే పంచాయతీలో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలో ముందుగా గ్రామ సభలు నిర్వహించి తీర్మానించాలి. అనంతరం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఖర్చు వివరాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలి. తరువాత చెక్‌పై సం తకం చేసి, సదరు చెక్‌ను ట్రెజరీ ద్వారా డబ్బు రూపంలో మార్చుకోవాలి. ఏ పనికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు, వాటి వివరాలను, ఆ మొత్తాన్ని ఆన్లైన్లో నమోదు చే యాలి. అయితే జిల్లాలో ఏ పంచాయతీలో కూడా ఈ పద్ధతిని అనుకరిస్తున్నట్టు కనిపించ డం లేదు. పలువురు సర్పంచ్‌లు, కార్యదర్శు లు కుమ్మక్కై ఇష్టానుసారం నిధులు డ్రా చేయడంతో పాటు నెలల తరబడి అందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేయని పరిస్థితి ఉంది. దీంతో ఏ నిధులు ఎందుకు వినియోగించారో... అసలు వినియోగించారో..? లేదో ? తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలో 2011-13 ఆర్థిక సంవత్సరాల్లో గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర, చినగుడబ, ఉద్దవోలు పం చాయతీల్లో 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, సాధారణ నిధుల కింద కేటాయించిన రూ 5.03 లక్షలు దుర్వినియోగమైయినట్లు గుర్తించి న కలెక్టర్ సంబంధిత కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఈనెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా డెంకాడ మండలం మోదవలస పంచాయతీలో రూ20.47లక్షల వ్యయంతో కూడిన పనులను గ్రామ సభ తీర్మానం, ఎటువంటి ప్రతిపాదనలు లేకండా చేపట్టారన్న ఆరోపణలపై సదరు పంచాయతీ సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ఈనెల 7న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెరకముడిదాం మండ లం బుధరాయవలస సర్పంచ్ బాలి బంగారునాయుడు చెక్ పవర్ రద్దు చేశారు. ఇలా చాలా పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానరాని ఈఓపీఆర్డీల పర్యవేక్షణ : పంచాయతీలో చేపట్టే అన్ని కార్యక్రమాలపై ఈఓపీఆర్డీలు పర్యవేక్షణ చేయాలి. ఇందుకుగానే నెలలో 23 రోజుల పాటు పర్యటించే పంచాయతీల జాబితాను ముందు నెలలోనే తయారుచేసుకోవాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితిలేదు. మండలానికి ఒకరు చొప్పున ఉండే అధికారులు కేవలం ఎంపీడీఓ కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శులే అంతా తామై వ్యవహరించడంతో సర్పంచ్‌లతో చేయికలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి బి.మోహనరావు వద్ద ప్రస్తావించగా.. పంచాయతీల్లో వినియోగిస్తున్న నిధులకు సంబంధించి ఆన్లైన్ నమోదు జరగని మాట వాస్తవమేనన్నారు. ఈ విషయంపై ఈఓపీఆర్డీలతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సక్రమంగా స్పందించడం లేదన్నారు. నిబంధనల మేరకు నిధులు వినియోగించని పక్షంలో వారిపై చర్యలు తప్పవని ఈ విషయంలో కార్యదర్శులే బాధ్యత వహిస్తారని వివరించారు. -
ఎన్నికల నిధులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదల విషయంలో ఆర్థికశాఖ తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విస్మయానికి గురైంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 150 కోట్లు విడుదల చేయాల్సిందిగా సీఈవో కార్యాలయం ఆర్థికశాఖను కోరింది. స్పందించిన ఆర్థికశాఖ శుక్రవారం రూ. 150 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపిణీ చేసింది. తీరా నిధుల కోసం శనివారం ట్రెజరీలకు బిల్లులు సమర్పించటానికి వెళితే.. నిధుల విడుదలపై ఫ్రీజింగ్ విధించారని, బిల్లులను తీసుకోబోమని ట్రెజరీ అధికారులు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మళ్లీ ఆర్థికశాఖను ఆశ్రయించింది. ఎన్నికల నిధులకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు... ఇదిలావుంటే.. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థికశాఖకు పంపింది. ఈ రూ. 850 కోట్లలో సగం నిధులను కేంద్ర ప్రభుత్వం మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 2009లో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు రూ. 450 కోట్ల వ్యయం అయింది. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఇప్పటి ఎన్నికలకు వ్యయం దాదాపు రెట్టింపు అవటం గమనార్హం. -
పంచాయతీలపై ‘పవర్’ పిడుగు
సాక్షి, రాజమండ్రి :గ్రామ పంచాయతీలను కరెంటు కష్టా లు నీడలా వెంటాడుతున్నాయి. ఎన్నికల అనంతరం పంచాయతీలకు నిధులు విడుదలవడం తో తక్షణం కరెంటు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వచ్చే అరకొర నిధులతో కరెంటు బకాయిలు చెల్లిస్తే గ్రామాభివృద్ధి ఎలాగని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నికలు జరగక పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో అప్పట్లో చాలా పంచాయతీలు కరెంటు బిల్లులు చెల్లించలేదు. కొద్ది నెలల కిందట ఎన్నికలు జరి గాయి. సుమారు నెల కిందట 13వ ఆర్థిక సం ఘం, ఇతర నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలని పంచాయతీరాజ్ కమిషనర్ గత నెలలో ఆదేశించారు. ఇదే తడవుగా విద్యుత్తు అధికారులు బిల్లు బకాయిలు తక్షణం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. లేకుంటే మంచినీటి పథకాలు, వీధిదీపాల కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. తాము ఉత్పత్తి సంస్థల నుం చి విద్యుత్తు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని, ఇకపై కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లిం చకపోవడంతో కొన్ని పంచాయతీల్లో బకాయిలు లక్షల్లో పేరుకుపోయాయి. ఇప్పుడొచ్చే అరకొర నిధులతో బకాయిల చెల్లింపు ఎలాగని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బకాయిల తీరిలా.. జిల్లాలో 1,011 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో గత నవంబర్ నాటికి వీధిలైట్లకు రూ.32.36 కోట్ల విద్యుత్తు బకాయిలున్నాయి. వీటిలో మైనర్ పంచాయతీల బకాయిలు రూ.12.25 కోట్లు, మేజర్ పంచాయతీల వాటా రూ.20.11 కోట్లుగా ఉంది. తాగునీటి పథకాలకు మైనర్ పంచాయతీ బకాయిలు రూ.12.15 కోట్లు, మేజర్ పంచాయతీ బకాయిలు రూ.11.14 కోట్లు ఉన్నాయి. మొత్తం నీటి పథకాలకు చెలించాల్సిన బకాయిలు రూ.23.29 కోట్లు కాగా, డిసెంబర్లో మరో రూ.2.5 కోట్లు అదనంగా చేరుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి పైసా వసూలు చేస్తాం పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిల్లో ప్రతి పైసా వసూలు చేస్తామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్ అన్నారు. ఈమేరకు నోటీసులు ఇస్తున్నామన్నారు. గతంలో నిధుల్లేవం టూ బిల్లులు చెల్లించలేదన్నారు. ఇప్పుడు నిధులు వస్తున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చాక కూడా చెల్లించకపోతే కచ్చితంగా సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. -
ఏకగ్రీవ నిధులేవి?
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ ఏకగ్రీవాలను ప్రొత్సాహించింది. కానీ, పంచాయతీలకు కొత్త సర్పంచ్‌లు ఎన్నికై ఐదు నెలలు గడుస్తున్నా నజరానా డబ్బులు రాలేదు. దీంతో పారితోషికంతో చేపట్టాల్సిన పనులు జరగడం లేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. ఏకగ్రీవమైన పంచాయతీలను రెండు కెటగిరీలుగా చేసి ప్రభుత్వం పారితోషకం కింద నిధులు విడుదల చేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేయాల్సి ఉన్నందున అందుబాటులో బడ్జెట్ లేకనే కొంత ఆలస్యం జరుగుతుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. రూ. 5 కోట్లపైనే.. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు జూలై 23,27,31 తేదీలలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు మొదటి వారంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఏకగ్రీవం పంచాయతీలకు నిధులు రావాల్సి ఉంది. ఈ నిధులను మొదట పర్మినెంట్ పనులకు వినియోగిస్తారు. పంచాయతీ భవనం, స్థలానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిరా్మాణం, మురికివాడల్లో సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. ఏకగ్రీవ పంచాయతీలు ఇవే.. బజార్హత్నూర్ మండలంలో రెండు, జైనథ్‌లో ఏడు, తానూర్, తాంసిలలో ఐదు జీపీల చొప్పున 10, తలమడుగు, నేరడిగొండ, భైంసా, ఖానాపూర్‌లలో నాలుగు జీపీల చొప్పున 16, దండేపల్లి, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, కుంటాల, లోకేశ్వరం, మామాడలో మూడు జీపీల చొప్పున 18, బేల, బోథ్, గుడిహత్నూర్, కుభీర్, లక్సెట్టిపేట, నెన్నెల మండలాల్లో రెండు చొప్పున 10 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతోపాటు బెజ్జూర్, చెన్నూర్, దిలావర్పూర్, జైపూర్, కడెం, నార్నూర్, సిర్పూర్(టి), వాంకిడి గ్రామ పంచాయతీలు ఎన్నికయ్యాయి. పనులకు ఉపయోగపడుతాయి గ్రామాల్లో తాగునీటి సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం పనులకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మా గ్రామ పంచాయతీకి రూ.2.60 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పనులు చేపట్టలేకపోతున్నాం. గ్రామ పంచాయతీ భవనం కొత్తది ఉన్నప్పటికీ ఇంకా పర్మినెంట్‌గా ఉండే పనులకు ఉపయోగపడుతాయి. ప్రభుత్వం విడుదల చేస్తే పనులు చేపట్టవచ్చు. - శంకర్, బేల మండలం డొప్టాల సర్పంచ్ త్వరలో వచ్చే అవకాశం ఏకగ్రీవ పంచాయతీలకు అందజేయాల్సిన పారితోషకాల నిధులను ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఎంటైర్ బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఈ నిధులు వస్తాయి. గతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పారితోషకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాల్సి ఉంది. త్వరలో జీపీలకు కేటాయించే బడ్జెట్లో రావచ్చు. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రణాళిక లేకనే నిధులు వృథా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సరైన ప్రణాళికలు లేకనే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల నిధులు వృథా అయ్యాయని కలెక్టర్ అహ్మద్ బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో, నాన్ ఏజెన్సీ ప్రాంతా ల్లో కొనసాగుతున్న పంచాయతీ భవనాల నిర్మాణాలపై కలెక్టర్ అసంతృ ప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయ తీ రాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పనులకు కేటాయించిన సుమారు 354 కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. సీసీరోడ్లు, మురికికాలువలు, లింకురోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు అ వసరం లేని విధంగా నిర్మాణాలు చేపట్టి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చోడ అసిస్టెంట్ ఇంజినీర్ల పనులు సరిగ్గా లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ ఉమామహేశ్వర్‌రావును ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పనులు పరిశీలించకుండా డబ్బులు చెల్లించిన మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల డీఈలకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. జీపీ భవన ని ర్మాణాలు పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారని, ఇంజినీర్లు బాధ్యతగా పనులు చేయడం లేదన్నారు. ఈ పనులపై విచారించి తనకు తెలపాలని ఎస్ఈపీఆర్ను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో 82 జీపీ భవనాలు ని ర్మించాల్సి ఉండగా, 38 పూర్తి చేశారని, మిగతా ఎందుకు పూర్తి కాలేదని ఈఈ శంకర్రావును ప్రశ్నించారు. సమాఖ్య భవనాలను త్వరితగతిన ని ర్మించాలన్నారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇంద్రసేన్, అధికారులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల తరువాత..
సాక్షి, కాకినాడ :ఏలేరు ఆధునికీకరణ కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు మంజూరు చేశారు. పనులకు పరిపాలనామోదం కూడా ఇచ్చారు. ఆయన హఠాన్మరణం తరువాత ఆ పనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వరుస తుపానులు, వరదలతో ఏలేరు రైతులు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేసిందే తప్ప చిత్తశుద్ధితో ఎటువంటి కృషీ చేయలేదు. మెట్ట ప్రాంతం నుంచి తోట నరసింహం మంత్రిగా రాష్ర్ట క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇదే దుస్థితి. ఇటువంటి తరుణంలో మరోసారి ఏలేరు రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఆర్నెల్లలో ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగియనుంది. ఈ తరుణంలో మహానేత మంజూరు చేసిన రూ.138 కోట్ల నిధుల్లో రూ.127.60 కోట్ల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏలేరు ఆధునికీకరణ పనులపై మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కాకినాడ ఎంపీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఏలేరు రిజర్వాయర్ కాలువలు, డ్రైన్ల ఆధునికీకరణ పనుల నిమిత్తం రూ.127.60 కోట్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి పనులు కూడా జరగనప్పటికీ రూ.10 కోట్ల పనులు పూర్తయినట్టు ఈ సమావేశంలో ఇంజనీర్లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఈ పనులు పూర్తయ్యేలోపు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల నిమిత్తం అవసరమయ్యే మరో రూ.155 కోట్ల విలువైన పనులకు అంచనాలు తయారు చేయాల్సిందిగా మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం చూస్తుంటే ఈ పనులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఈ సమావేశ విషయాలను కేంద్ర మంత్రి పళ్లంరాజు కాకినాడలో విలేకర్లకు విడుదల చేశారు.