కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సరైన ప్రణాళికలు లేకనే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల నిధులు వృథా అయ్యాయని కలెక్టర్ అహ్మద్ బాబు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో, నాన్ ఏజెన్సీ ప్రాంతా ల్లో కొనసాగుతున్న పంచాయతీ భవనాల నిర్మాణాలపై కలెక్టర్ అసంతృ ప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయ తీ రాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పనులకు కేటాయించిన సుమారు 354 కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయని పేర్కొన్నారు. సీసీరోడ్లు, మురికికాలువలు, లింకురోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ప్రజలకు అ వసరం లేని విధంగా నిర్మాణాలు చేపట్టి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చోడ అసిస్టెంట్ ఇంజినీర్ల పనులు సరిగ్గా లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావును ఆదేశించారు.
క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పనులు పరిశీలించకుండా డబ్బులు చెల్లించిన మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల డీఈలకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. జీపీ భవన ని ర్మాణాలు పూర్తి కాకుండానే డబ్బులు చెల్లించారని, ఇంజినీర్లు బాధ్యతగా పనులు చేయడం లేదన్నారు. ఈ పనులపై విచారించి తనకు తెలపాలని ఎస్‌ఈపీఆర్‌ను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో 82 జీపీ భవనాలు ని ర్మించాల్సి ఉండగా, 38 పూర్తి చేశారని, మిగతా ఎందుకు పూర్తి కాలేదని ఈఈ శంకర్రావును ప్రశ్నించారు. సమాఖ్య భవనాలను త్వరితగతిన ని ర్మించాలన్నారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంద్రసేన్, అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళిక లేకనే నిధులు వృథా
Published Sat, Dec 14 2013 6:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement