
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లా నేస్తం నిధులు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 2,807 మంది యువ న్యాయవాదులకు రూ.7 కోట్ల 98 లక్షలను వారు ఖాతాలోకి సీఎం జమ చేయనున్నారు.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ వైఎస్సార్‌సీపీ అందిస్తుంది.
రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందించింది.
ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్?
Comments
Please login to add a commentAdd a comment