Junior lawyer
-
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది: సీఎం జగన్
-
రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లా నేస్తం నిధులు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 2,807 మంది యువ న్యాయవాదులకు రూ.7 కోట్ల 98 లక్షలను వారు ఖాతాలోకి సీఎం జమ చేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ వైఎస్సార్సీపీ అందిస్తుంది. రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
న్యాయ సాయం అందించడంలో.. పేదలకు మీరే నేస్తం: సీఎం జగన్
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వృత్తిలో నిలదొక్కుకునేలా.. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్.. ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. ఇంకా బాగా ఉపయోగపడాలని.. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా.. గుంటూరు బార్ అసోసియేషన్‌లో జూనియర్ అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది. మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్. – రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు ఎంతో ఉపయోగం.. జూనియర్ అడ్వొకేట్‌గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. – అరవింద్, అడ్వొకేట్, విజయవాడ -
‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను.. మీరు చాలా సాయం చేశారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన న్యాయవాదులు ఏమన్నారంటే, వారి మాటల్లోనే సార్, నమస్కారం, నేను గుంటూరు బార్ ఆసోసియేషన్ లో జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాను, మా బాబాయి కూలీ పనులు చేస్తూ తన పిల్లలతో పాటు చదివించారు, నేను లా చదువుతాననగానే ఒప్పుకుని లా చదివించారు, చదువు పూర్తవగానే గుంటూరు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు, స్పందనలో అప్లికేషన్ పెట్టగానే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అకామిడేషన్ ఇప్పించారు, మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి వస్తుంది, విద్యా కానుక వస్తుంది, మా తమ్ముడికి విద్యా దీవెన వస్తుంది, పిన్నికి చేయూత వస్తుంది, నేనే కాదు కుటుంబ సభ్యులు అందరూ మీ పథకాలు పొందుతున్నారు, నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను, థ్యాంక్యూ సార్. -రత్న కుమారి, న్యాయవాది, గుంటూరు సార్, నేను 2020 నుంచి జూనియర్ అడ్వకేట్ గా బెజవాడ బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ ప్రారంభించాను, చిన్నప్పటి నుంచి ఈ వృత్తి అంటే ప్రేమ, ఇష్టం, దీనికి మా కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన చెందారు, కానీ నేను లా ప్రాక్టీస్ ప్రారంభించేసరికి మీరు అధికారంలోకి రావడం, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వకేట్స్ లబ్ధిపొందుతున్నారు. నేను ఈ పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి శాంక్షన్ చేశారు, మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మీరు ఇస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది, నాలాగా లబ్ధిపొందుతున్న వారందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్, మా అడ్వకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది, ధ్యాంక్యూ సార్. -అరవింద్, అడ్వకేట్, విజయవాడ చదవండి: ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు: సీఎం జగన్ -
YSR లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్
-
‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం చెల్లింపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మార్చి నుంచి జూన్ వరకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. (‘సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు’) -
వైఎస్సార్ లా నేస్తం ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసి చూపించారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని జగన్ ప్రారంభించారు. లబ్ధిదారులైన న్యాయవాదుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం ప్రారంభోత్సవంలో ఏపీ బార్‌కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, వైస్ ఛైర్మన్ రామజోగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వర్రావు, ఆర్.మాధవి, బార్‌కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, వి.బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ లా నేస్తం వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ లా నేస్తం పథకానికి అర్హులు - జీవో జారీ చేసిన నాటికి 35 ఏళ్ల లోపు వయసున్న, బార్ కౌన్సిల్ రోల్స్‌లో నమోదైన జూనియర్ న్యాయవాదులు - 2016, ఆ తర్వాత ఉత్తీర్ణులైన లా గ్రాడ్యుయేట్లు 1970 మంది జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వైఎస్సార్ లా నేస్తం కింద అర్హులైన 1970 మంది జూనియర్ న్యాయవాదులకు నవంబర్ నెలకు చెల్లించాల్సిన స్టైఫండ్ రూ.98.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జూనియర్ న్యాయవాదికి రూ.5 వేల చొప్పున చెల్లించనున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి వైఎస్సార్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ చెల్లించేందుకు రూ.5.30 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
యువరానర్..!
‘పోలీసోడే కాదు... పోలీసోడి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది’ అని ‘విక్రమార్కుడు’ చిత్రంలో పోలీస్ పాత్రలో రవితేజ చెప్పిన డైలాగ్‌కి విజిల్స్ పడ్డాయి. మరి... ఓ చిన్న సైజ్ న్యాయవాదిగా ‘యువర్ ఆనర్...’ అంటూ తన దైన స్పీడ్ డైలాగ్స్‌తో అదరగొడితే... విజిల్స్‌తో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. రవితేజ లాయర్ పాత్ర చేయనున్నారని ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. గత ఏడాది విడుదలైన ‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ సినిమా ఇంకా సెట్స్‌కి వెళ్లలేదు. దాంతో తదుపరి చిత్రం ఏంటి? అనే చర్చ సాగుతోంది. నూతన దర్శకుడు చక్రితో సినిమా చేయడానికి రవితేజ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది తెలియాల్సి ఉంది. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం ఫిలిం నగర్లో రవితేజ ‘మణిదన్’ అనే తమిళ చిత్రం రీమేక్‌లో నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. హిందీలో బొమన్ ఇరానీ, అర్షద్ వార్షీ ప్రధాన తారలుగా మూడేళ్ల క్రితం వచ్చిన ‘జాలీ ఎల్ఎల్బి’ చిత్రమే ‘మణిదన్’గా తెరకెక్కింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం అక్కడి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంది. ఓ సీనియర్ లాయర్‌తో పోరాడే ఓ జూనియర్ న్యాయవాది చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఇప్పటివరకూ రవితేజ న్యాయవాది పాత్ర చేయలేదు. ఒకవేళ ఈ చిత్రం రీమేక్‌లో ఆయన నటిస్తే, అప్పుడు ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త లుక్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే, ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు.