సీనియర్ లాయర్లకు సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచన
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు.
ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు.
న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు.
శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment