ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్‌జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్‌కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు.
‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్‌ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
AI भारत सहित दुनिया को बदल रहा है।
सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।
जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024
ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment