lawyer
-
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్‌కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్‌రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్‌రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్‌కు చైర్పర్సన్ గా సరళ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్‌రెడ్డి -
రూ. 5 కోట్ల అప్పు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
సాక్షి, చెన్నై: ఆయన డాక్టరు, ఆమె న్యాయవాది. వీరికి ఇద్దరు పిల్లలు..ఎంతో ఆనందకరంగా ఉన్న వీరి జీవితాన్ని అప్పులు కాటేశాయి. అప్పులు రూ. 5 కోట్లకు చేరడంతో చెల్లించ లేని పరిస్థితులలో జీవితాన్ని కుటుంబం అంతా ముగించేశారు. చెన్నై తిరుమంగళంలో గురువారం ఉదయం ఈఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. చెన్నైలో అన్నానగర్, తిరుమంగళం పరిధిలోని 17వ క్రాస్ స్ట్రీట్‌లోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ ప్లాట్‌లో డాక్టర్ బాలమురుగన్ (52) కుటుంబం నివాసిస్తూ వచ్చింది. ఆయన భార్య సుమతి (47) హైకోర్టులో న్యాయవాది. ఈ దంపతులకు జశ్వంత్‌కుమార్ (19), లింగేశ్కుమార్(17) కుమారులు. పెద్దవాడు ప్లస్–2 ముగించి డాక్టరు కావాలన్న కలతో నీట్‌కు సిద్ధమవుతున్నాడు. రెండవ వాడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. బాల మురుగన్‌కు అన్నానగర్‌లో రెండు, రెడ్ హిల్స్‌లో ఒకటి అంటూ పలు చోట్ల స్కాన్ సెంటర్లు ఉన్నాయి. రుణాలు అధికమై.. గురువారం ఉదయం బాలమురుగన్ డ్రైవర్ విజయ్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకు డాక్టర్ తెరవక పోవడంతో పక్కన ఉన్న ప్లాట్ల వారి సహకారంతో వారి బంధువులకు సమాచారం అందించాడు. వారు తిరుమంగళం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, పోలీసులు ఆ ప్లాట్‌కు చేరుకుని తలుపు పగల కొట్టి వెళ్లి చూడగా ఓ గదిలో ఒకే ఫ్యాన్‌కు సుమతి, చిన్న కుమారుడు లింగేశ్వర్ ఉరివేసుకుని మృత దేహాలుగా బయటపడ్డారు. మరో గదిలో వేర్వేరు ఫ్యాన్లకు బాల మురుగన్, పెద్దకుమారుడు జశ్వంత్‌కుమార్ మృతదేహాలుగా వేలాడుతుండటంతో కలకలం రేగింది. వీరి ఆత్మహత్య సమాచారంతో ఆ పరిసరాలలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్కాన్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, సకాలంలో, నిర్ణీత సమయంలో జీతాలను ఇస్తూ, ఆదరిస్తూ వచ్చిన యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినపోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. విచారణలో స్కాన్ సెంటర్ల విస్తరణ కోసం రూ. 5 కోట్ల వరకు అప్పులు చేసినట్టు వెలుగు చూసింది. నెలకు రూ.5 లక్షల వరకు ఈఎంఐలు కడుతుండటం, మరికొందరికి వడ్డీలు చెల్లిస్తుండటం వెలుగు చూసింది. ప్రస్తుతం వడ్డీ చెల్లించ లేని పరిస్థితులలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగినట్టు గుర్తించారు. అప్పులు కట్ట లేని పరిస్థితులలో తీవ్ర మనోవేదనతో ఉన్న డాక్టర్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో సుమతి, చిన్నకుమారుడు ఒకే ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఉండటంతో వారిని హతమార్చి, ఆతర్వాత పెద్దకుమారుడిని ఉరివేసి హతమార్చి, చివరకు డాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు..!
దుబాయ్‌లో ఉండే ఒక వ్యక్తికి 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను. అతను భారతీయుడే. కానీ తిరిగి చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, స్టేషన్‌కు వచ్చి సెటిల్ చేసుకొని ‘7 లక్షల రూపాయలు కడతాను, అంతకుమించి ఇవ్వలేను’ అని అందరిముందూ ఒప్పుకున్నాడు. మూడు లక్షలు ఇచ్చాడు. నాలుగు లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు. కానీ ఇంతవరకు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి దుబాయ్‌కి వెళ్ళిపోయారు. ‘ఎప్పుడిస్తారు అని అడిగితే కేసులు పెట్టుకోండి మా దగ్గర డబ్బులు లేవు’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆన్లైన్లో ఐదులక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన రసీదు మా దగ్గర ఉంది. ఇదేమైనా సాక్ష్యంగా పనికొస్తుందా? ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు?– చిరంజీవి, మచిలీపట్నంరెండు సంవత్సరాల క్రితం చెక్కు ఇచ్చారు అని చెప్పారు కానీ అది పోస్ట్‌డేటెడ్ చెక్కా లేక డేటు వేయకుండా ఇచ్చారా అనే విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ చెక్కు మీద డేటు వేసి ఉంటే, ఆ డేటు నుంచి మూడు నెలల గడువులోగా చెక్కును డిపాజిట్ చేసి, అది చెల్లకపోతే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. అలాంటి వీలు ఉందో లేదో చూసుకోండి. లేనిపక్షంలో సివిల్ కోర్టును ఆశ్రయించి రికవరీ సూట్ ఫైల్ చేసుకోండి. అప్పు తీసుకున్న నాటినుండి లేదా ఆ లావాదేవీ జరిగిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోగా కేసు వేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లోని లాయర్‌ను సంప్రదించి మీ వద్ద ఉన్న సాక్ష్యాలను, చెక్కును చూపించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి.నేను ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటూ ఆ అపార్ట్మెంట్ కోశాధికారిగా బాగోగులు చూస్తున్నాను. మా దాంట్లో ఒక ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం లేదు. బకాయి పెరిగి΄ోతోంది. ఎన్నిసార్లు అడిగినా ఎదో సాకు చెప్తూ డబ్బు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాడు. అతని నుంచి మెయింటెనెస డబ్బులు రాబట్టడం ఎలా?– గోవిందరాజు, హైదరాబాద్మీ అపార్ట్మెంట్ సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు చెప్పలేదు. ఒకవేళ కోపరేటివ్ సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ అయి ఉంటే, సదరు కమిషనర్ ముందు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, 2001 చట్టం కింద రిజిస్టర్ చేసుకుని ఉంటే... సెక్షన్ 23 ప్రకారం, ఆర్బిట్రేషన్ ద్వారా లేదా సివిల్ కోర్టును ఆశ్రయించడం ద్వారా మీ బకాయిలను వసూలు చేసుకోవచ్చు. బకాయిలు చెల్లించేంతవరకు సదరు ఓనరు ఇల్లు అమ్మడానికి వీలు లేదు అనేటటువంటి ఆర్డర్ కూడా పొందవచ్చు. (చదవండి: జాగ్రత్త పడకుంటే విడాకులే..!) -
జాగ్రత్త పడకుంటే విడాకులే..!
అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుబడిన జేమ్స్ శాక్స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్స్టన్. అమెరికాలో విడాకుల లాయర్‌గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడంతగిన సమయం ఇవ్వకపోవడంసంభాషించకపోవడంమాటల్లేని రోజులను పొడిగించడంఅసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.మంచి తల్లిదండ్రులైతే సరిపోదుచాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్‌ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.ఇలా చేయండి..మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. (చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
అసభ్యంగా పోస్టులు పెడితే వదిలే ప్రసక్తే లేదు...
-
బ్యాంకులో కుప్పకూలిన న్యాయవాది
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్‌లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు. బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్‌పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడేళ్ల లోపు కేసు కావడంతో 41సీ నోటీసులు మాత్రమే ఇవ్వాలి: లక్ష్మీ తరపు లాయర్
-
రఘురామ కృష్ణంరాజు లాయర్ కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్లు మన చుట్టూనే వై..ఫై లా తిరుగుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నమ్మించి నట్టేట ముంచేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా 17జంటలకు టోకరా ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐ మహిళా స్కామర్ పోలీసులకు చిక్కింది. ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి? పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు? భారతీయ సంతతికి చెందిన ప్రీలిన్ మోహానాల్ (53) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తోంది. వివాహాలను ప్లాన్ చేసుకోవాలనుకునే ప్రేమ జంటలను సోషల్ మీడియా ద్వారా వలవేసి పట్టుకునేంది. వారికి అందమైన వెడ్డింగ్ నేషన్స్ చూపిస్తానంటూ వారితో నమ్మబలికేది. ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేకుండా వేదిక కోసం పెద్ద మొత్తాలను ముందుగానే చెల్లించాలన పట్టుబట్టేది. సొమ్ములనురాబట్టేది. తీరా అక్కడికెళ్లాక విస్తుపోవడం ఖాళీ ప్లేస్ ప్రేమ జంట వంతయ్యేది. ఉనికిలో లేని, లేదా కనీస వసతులు కూడా లేని ప్రదేశాన్ని చూసి లబోదిబోమనేవారు. నీళ్లు, కరెంట్ కూడా లేకపోవడంతో వారి కలకాలం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన పెళ్లి సందడి కాస్త జీవితంలో మర్చిపోలేనంత విచారకరంగా మారిపోయేది. ఇలా దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఒకే రోజు ఒకే వేదిక కోసం డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా 17 జంటలను మోసం చేసింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుని, ఈ సంవత్సరం చివరిలో తిరిగి ప్లాన్ చేసుకోవడానికి చాలాకష్టపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి పేరు చెప్పడానికి ఇష్టపడని జంట ఫిర్యాదుతో గుట్టు రట్టయింది. వీరు గత ఏడాది డిసెంబర్లో భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికా (RUSA) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను ట్రాక్ చేసి (జనవరి 7) అరెస్టు చేశారు. నిందితురాలు మోసానికి పాల్పడినట్లు ,ఆమెకు క్రిమినల్ రికార్డ్ ఉందని 20 సంవత్సరాలకు పైగా జరిగిన స్కామ్‌ల చరిత్ర ఉందని నిర్ధారించినట్టు రూసా ప్రతినిధి బలరామ్ చెప్పారు.మరోవైపు ఇది స్కామ్ కాదు, తాను స్కామర్‌ను కాదని ఆమె వాదిస్తోంది. కంపెనీ చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రతీ పైసా తిరిగి చెల్లిస్తానని ప్రతీ జంటకు లేఖలు పంపాననీ తెలిపింది. కానీ భాగస్వాములు అక్టోబర్‌లో వైదొలిగిన కారణంగా సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని స్థానికమీడియాకు తెలిపింది. తొమ్మిది జంటలకు సుమారు 60వేలు దక్షిణాఫ్రికా రాండ్ (రూ.2,72,319) బాకీ ఉందని అంగీకరించి, వాటిని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.అయితే నేరాన్ని అంగీకరించి, బాధితులందరికీ తిరిగి చెల్లిస్తానని ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులు కేడా చెప్పడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయిస్తుందో చూడాలి. -
అనంతపురంలో లాయర్ ఘటనపై అనుమానాలు !
-
అల్లు అర్జున్ ను విచారిస్తున్న చిక్కడపల్లి ఏసీపీ, సీఐ
-
కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్
కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా సరే హీరో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం 6:45 గంటలకు చంచల్‌గూడ జైలు వెనక గేటు నుంచి బన్నీని బయటకు పంపించారు. ఇంటికి వెళ్లకుండా నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బన్నీ వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే బన్నీ లాయర్ ఆశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్)అల్లు అర్జున్‌ని తక్షణమే విడుదల చేయాలని కోర్ట్ ఆదేశించిందని, అయినా సరే రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే జైలులో ఉంచారని బన్నీ తరఫు లాయర్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై చట్టపరంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఇలా బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం చేయడంపై పోలీసులుపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని లాయర్ అశోక్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. బట్టలు మార్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే జైలుకి తీసుకెళ్లేలోపే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ పోలీసులు మాత్రం బెయిల్ పేపర్స్ సరిగా లేవనే కారణంతో రాత్రంతా జైలులోనే ఉంచారు. అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నంబర్ కూడా కేటాయించారు.(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ)#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun's lawyer Ashok Reddy says, " They received an order copy from High Court but despite that, they didn't release the accused (Allu Arjun)...they will have to answer...this is illegal detention, we will take legal action...as of now he… pic.twitter.com/1RgdvA4BK4— ANI (@ANI) December 14, 2024 -
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
సీజేఐ చంద్రచూడ్‌ను ‘సర్ప్రైజ్’ చేసిన A.I. లాయర్
ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్‌కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు. ‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్‌ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.AI भारत सहित दुनिया को बदल रहा है।सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024 ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేత, న్యాయవాది కౌస్తవ్ బాగ్చి మాట్లాడుతున్న సందర్భంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. న్యాయవాదిని గొంతు తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు.ఈసలేం జరిగిందంటే.. కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కౌస్తవ్ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాదిఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్‌ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు.ఇక చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్‌టైమ్ న్యాయవాది, ఫుల్‌టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపిందిఇదిలా ఉండగా మంగళవారం నాటికి నిరసనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ డీవే చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.అలాగే బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని విచారణపై కొత్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సెప్టెంబర 17 వరకు గడువిచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
లాయర్ పై పోలీస్ ఓవరాక్షన్.. చివరికి సీన్ రివర్స్
-
హత్రాస్ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్‌లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు. ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించింది. -
లాయర్‌గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్‌గా తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్‌గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
బాసురీ స్వరాజ్.. డాటరాఫ్ సుష్మ
బాసురీ స్వరాజ్. సక్సస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్ సెల్ కన్వినర్‌గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు... వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు. ‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో... బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్‌లోని వారి్వక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరీన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో–కన్వినర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హరియాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు... సుష్మా స్వరాజ్ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైగలకు మాటలొచ్చాయి
న్యాయవాది అడ్వా సారా సన్ని భారతదేశపు మొట్టమొదటి వినికిడి లోపం గల రిజిస్టర్డ్ ప్రాక్టీసింగ్ లాయర్‌గా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 4న ఆమెకు సహాయం చేయడానికి సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫైడ్ ఇంటర్ప్రెటర్ సేవలను పొందాలని కోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్ 8న కర్ణాటక హైకోర్ట్ రిజిస్టర్డ్ సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడి లోపం ఉన్న న్యాయవాది నుంచి వాదనలు విన్నది. దీంతో అడ్వకేట్ సారా సన్నీతోపాటు కర్ణాటక హైకోర్ట్ కూడా దివ్యాంగులకు ఒక గొప్ప బాసటగా నిలిచినట్లయింది. ఇది న్యాయ నిపుణులకు మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న పౌరులకు కూడా సమగ్ర న్యాయవ్యవస్థకు మార్గం మరింతగా సుగమం చేస్తుంది. జస్టిస్ ఎం నాగప్రసన్న, అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్‌లతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ అడ్వా సన్నీ నమోదును ప్రశంసించింది. ఏఎస్జీ కామత్ మాట్లాడుతూ ‘ఇంటర్ప్రెటర్ ద్వారా హియరింగ్, స్పీచ్ ఇంపెయిర్డ్ అడ్వకేట్ వాదనను విన్న మొదటి హైకోర్టుగా కర్ణాటక హైకోర్టు చరిత్రలో నిలిచిపోతుంది. సారా సన్నీ సంకేత భాషా వ్యాఖ్యాత ద్వారా వినికిడిలోపం, ప్రసంగం బలహీనంగా ఉండటం వల్ల కలిగే వైకల్యాన్ని ఓడించింది. అందుకు సారా సన్నీని అభినందించాల్సిందే. సంజ్ఞా భాషా వ్యాఖ్యాత ద్వారా వాదప్రతివాదనలు జరిగినప్పటికీ ప్రశంసలు రికార్డులలో నమోదు అవుతాయి’ అని తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ‘భారత న్యాయవ్యవస్థలో వివిధ నేపథ్యాల నుండి ఎక్కువ మంది మహిళలు చేరాల’ని పదే పదే ప్రస్తావించారు. ప్రోత్సహించడానికి... అడ్వా సారా సన్నీ కేరళలోని కొట్టాయం వాసి. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నారు. కేవలం స్వీయ ఆసక్తితో మాత్రమే కాకుండా వినికిడి లోపం ఉన్న ఇతరులను కూడా ప్రోత్సహించడానికి న్యాయవాద వృత్తిని ఎంచుకుంది. అడ్వకేట్ సన్నీ ఇప్పుడు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్క్‌లో యాక్టివ్ మెంబర్. సెప్టెంబరు 2023లో న్యాయవాది సన్నీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక కేసు వాదించిన, వినికిడి లోపం ఉన్న మొట్ట మొదటి లాయర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంలో సన్నీ ‘డీవై చంద్రచూడ్ ఓపెన్ మైండ్ ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం తలుపులు తెరిచింది’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సన్నీ కోర్టు సబిమిషన్స్‌లో సహాయం చేయడానికి సంకేత భాషా ఇంటర్‌ప్రెటర్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు గతంలో తన రిజిస్ట్రీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అది అమలు అయ్యింది. వైకల్యాలున్నవారు తమ అడ్డంకులను అధిగమించడంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయ్యింది. -
బీజేపీలో చేరిన సంచలన లాయర్
Nirbhaya Lawyer Seema Kushwaha: సుప్రీంకోర్టు న్యాయవాది, బీఎస్పీ నేత సీమా కుష్వాహా సోమవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్రాస్ సామూహిక అత్యాచారం, శ్రద్ధా వాకర్ హత్య వంటి ల్యాండ్‌మార్క్ కేసుల్లో బాధితుల తరపున వాదించి కుష్వాహా ప్రసిద్ధి చెందారు. ఎవరీ సీమా కుష్వాహ? సీమా కుష్వాహా 2022 జనవరిలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి తరపున వాదించిన తర్వాత కుష్వాహాకు ఎనలేని గుర్తింపు లభించింది. మరోవైపు నిర్భయ జ్యోతి ట్రస్ట్‌ను స్థాపించి అత్యాచార బాధితుల తరపున న్యాయం కోసం వాదించే ప్రచారాన్ని కుష్వాహా ప్రారంభించించారు. కుష్వాహాతో పాటు ఉత్తరప్రదేశ్ లాల్గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీ ఎంపీ సంగీతా ఆజాద్ కూడా బీజేపీలో చేరారు. సంగీత భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా ఆమెతో పాటు కాషాయ శిబిరంలో చేరారు. నిర్భయ అత్యాచారం కేసు 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై 2012 డిసెంబర్లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం, దాడి చేసి రోడ్డు మీదకి తోసేశారు. బాధితురాలు చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 29న మృతి చెందారు. బాధితురాలికి న్యాయం చేయడానికి ఏడేళ్లు పట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులను 2020 మార్చి 20న ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. #WATCH | BSP MP Sangeeta Azad, party leader Azad Ari Mardan and Supreme Court lawyer Seema Samridhi (Kushwaha) join the BJP, in Delhi. pic.twitter.com/oaLN8Hg1Fo — ANI (@ANI) March 18, 2024 -
సీమా హైదర్‌కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్‌లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
గొంతు పెంచి కోర్టును భయపెట్టలేరు: ఓ లాయర్‌పై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా గట్టిగా అరుస్తూ మాట్లాడిన ఓ న్యాయవాదిపై బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి కోర్టును ఎవరూ భయపెట్టలేరని హెచ్చరించారు. న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు. ‘‘నువ్వు లాయర్‌గా సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు? బిగ్గరగా అరుస్తూ మాట్లాడి మమ్మల్ని భయపెట్టడం నీవల్ల కాదు. నా 23 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే పద్ధతి ఇదేనా? న్యాయమూర్తుల ముందు ఎప్పుడూ ఇలాగే అరుస్తావా? నేను మరో ఏడాది లోగా పదవీ విరమణ చేయబోతున్నా. కోర్టులో లాయర్లు ఇష్టానుసారంగా మాట్లాడడం చూడాలని నేను కోరుకోవడం లేదు. నీ గొంతు తగ్గించు’’ అని సదరు లాయర్‌కు తేలి్చచెప్పారు. దీంతో ఆ లాయర్ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు నుంచి, జస్టిస్ చంద్రచూడ్ నుంచి క్షమాపణ కోరారు. -
యువ లాయర్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
ఏఐని వాడాడు.. ఉద్యోగం ఊడింది!
కృతిమ మేధ చాట్‌బాట్ చాట్‌జీపీటీని నమ్ముకుని ఓ యువ న్యాయవాది తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప్రముఖ లా సంస్థలో పనిచేస్తున్న సదరు లాయర్ నిర్ణీత గడువులోగా ఇచ్చిన పనిని పూర్తి చేయాలని బాస్ హుకుం జారీ చేశాడు. సమయం గడిచి పోతుంది. పని కావడం లేదు. పైగా ఒత్తిడి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ న్యాయవాది చాట్‌జీపీటీని వినియోగించి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని మరోసారి స్పష్టమైంది. అమెరికా కొలరాడో కేంద్రంగా న్యాయ సంబంధిత సర్వీసుల్ని అందించే ‘బేకర్ లా గ్రూప్’లో జకారియా క్రాబిల్ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో తన ఆఫీస్ పని నిమిత్తం చాట్‌జీపీటీని వినియోగించడం జకారియాకు పరిపాటిగా మారింది. అయితే ఈ ఏడాది మే నెలలో కాబ్రిల్కు కస్టమర్ల కేసుల్ని కులంకషంగా రీసెర్చ్ చేసి.. గతంలో ఇదే తరహా కేసుల్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ని తయారు చేయాలి. వాటిని కొలరాడో కోర్టులో సమర్పించాల్సి ఉందని, వెంటనే ఆ పనుల్ని పూర్తి చేయాలని బాస్ ఆదేశించాడు. పని భారాన్ని తగ్గించుకుంటూ.. కస్టమర్ల కేసుల్ని రీసెర్చ్ చేసి డ్రాఫ్ట్‌ను తయారు చేసేలా కాబ్రిల్ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. కాబ్రిల్ అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని ఆధారంగా తీసుకుని కొన్ని కేసులకు సంబంధించి ప్రత్యేక డ్రాఫ్ట్‌ను తయారు చేశాడు. అనంతరం తన బాస్‌తో కలిసి.. తయారు చేసిన ఫైల్స్‌ని కొలరాడో కోర్టుకు సమర్పించాడు. కాబ్రిల్ కోర్టుకు సమర్పించిన కేసు ఫైల్స్‌ను చాట్‌జీపీటీని వినియోగించి తయారు చేసినట్లు తేలింది. అంతేకాదు డ్రాఫ్ట్‌లో పలు కీలక అంశాల్ని గతంలో జరిగిన కేసుల్ని ఉదహరిస్తూ చాట్‌జీపీటీని ప్రస్తుత కేసులకు అనుగుణంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లాయి. ఆ సమాధానాలు సరైనవి కాదని తెలిసి కూడా కేసుల్లోని డ్రాఫ్ట్‌లను తయారు చేశాడు. ఇదే అంశాన్ని న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తాను ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని క్రాబిల్ విశ్వసిస్తున్నాడు. చట్టపరమైన సేవల కోసం ఏఐని ఉపయోగించి సొంత కంపెనీని కూడా ప్రారంభించాడు. -
నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... -
చంద్రబాబుకు బెయిల్ కష్టమేనంటున్న న్యాయ నిపుణులు
-
దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..
భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇంటర్ప్రెటర్ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ‘ఇలాంటిది చాలా మునుపే జరగాలి. ఆలస్యం చేశాం’ అని జస్టిస్ చంద్రచూడ్ సారా సన్నీని ఉద్దేశించి అన్నారు.సారా పరిచయం. సెప్టెంబర్ 22 సుప్రీం కోర్టు కేసు నంబర్ పిలువగానే నల్లగౌనులో అడ్వకేట్ సారా సన్ని తన ఇంట్రప్రేటర్ సౌరవ్ రాయ్ చౌదరితో కోర్టు హాల్లోకి ప్రవేశించింది. ధర్మాసనంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ ఆబిది ఫౌండేషన్ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషన్ తరఫున సారా వాదనలు మొదలెట్టింది. వెంటనే కోర్టు హాలు సైలెంట్ అయ్యింది. ఎందుకంటే సారా సైన్ లాంగ్వేజ్ ద్వారా తన వాదనలు వినిపిస్తుంటే వాటిని అంతే వేగంగా ఇంట్రప్రేటర్ కోర్టుకు విన్నవిస్తున్నాడు. అలాగే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను సైన్ లాంగ్వేజ్ ద్వారా సారాకు తెలియచేసి బదులుగా సారా సమాధానాన్ని కోర్టుకు చెబుతున్నాడు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఇలా ఒక ఒక బధిర అడ్వకేట్ మౌనవాదన వినిపించింది. దీనిని చూసిన జస్టిస్ చంద్రచూడ్ ‘ఇప్పటికైనా ఇది సాధ్యమైంది.. ఎప్పుడో జరగాల్సింది’ అన్నారు. కోర్టులో ఉన్న అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సారాను, ఇంట్రప్రెటర్ను మెచ్చుకున్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఒక గొప్ప అనుభూతితో సారా సన్ని కోర్టు బయటకు నడిచింది. ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్ కదా మరి. కేరళ అమ్మాయి సారా సన్ని స్వస్థలం కొట్టాయం. ఆమె తండ్రి సన్ని కురువిల్లా చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి బెట్టి గృహిణి. ఈ దంపతులకు పుట్టిన అబ్బాయి ప్రతీక్ బధిరుడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరూ మళ్లీ బధిరులే. వారిలో ఒకరు సారా మరొకరు మారియా. ముగ్గురు సంతానం బధిరులే అయినా తల్లిదండ్రులు ఆ లోటు వారికి తెలియనివ్వకుండా పెంచారు. కొడుకు అమెరికాలో బధిరుల స్కూల్లో ఉపాధ్యాయుడిగా, మారియా చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. సారా మన దేశంలో మొదటి బధిర అడ్వకేట్ అయ్యింది. వాదనలు చేస్తూ... సారా బాల్యం నుంచి అందరితో తెగ వాదించేది. ఆమెకు చెవుడు ఉండటం వల్ల మాటలు రాలేదు. కాని సైన్ లాంగ్వేజ్‌తో అందరితో తెగ వాదనలు చేసేది. ‘పెద్దయ్యి లాయర్ అవుతుందేమో’ అని సరదాగా తల్లిదండ్రులు అనుకునేవారు. అన్నట్టుగానే జరిగింది. సారా, మారియా ఇద్దరూ బెంగళూరులో చదువుకున్నారు. అక్కడే బి.కాం. చేసి ఒకరు లా వైపు మరొకరు చార్టెర్డ్ అకౌంటెన్సీ వైపు వెళ్లారు. రెండేళ్ల క్రితం సారా లా పట్టా తీసుకుంది. అయితే కర్నాటక కోర్టుల్లో కేసులు వాదించాలంటే ఇంట్రప్రెటర్లకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం– కోర్టు పరిభాష ఇంట్రప్రెటర్లకు తెలియదని కోర్టు భావించడమే. అయితే సారా తన వాదనలను కాగితం మీద రాసి జడ్జికి ఇచ్చేది. ఈ విధానాన్ని జడ్జి ఆశ్చర్యంగా చూసేవారు. మెచ్చుకునేవారు కూడా. సుప్రీం కల ‘ఏ రోజైనా నేను సుప్రీం కోర్టులో వాదించాలని అనుకున్నాను’ అంటుంది సారా. ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిభావంతంగా వాదనలు చేయగలిగింది. ‘దివ్యాంగులు దేనినీ వెలితిగా భావించకూడదు. సాధించాలి. నేను వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. బధిరులు అడ్వకేట్లుగా రాణించగలరు. కాకపోతే వారి కోసం ఇంట్రప్రెటర్ల వ్యవస్థను ప్రభుత్వం తయారు చేయాలి. అంతేకాదు ఇంట్రప్రెటర్ల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది’ అని కోరుతోంది సారా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..
ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులైనా అలవొకగా ఎదుర్కొని సాధించొచ్చు అనేందుకు ఆ మహిళ నిలువెత్తు నిదర్శనం. లా చేసినా.. పరిస్థితులు తలికిందులై హేళన చేసినా.. తగ్గేదే లే అని పొట్ట పోషణ కోసం మగాడిలా కష్టపడింది. మగవాళ్లు చేసే పనిలో దూసుకుపోయింది. అడగడుగున అవహేళనలు, వెక్కిరింతలు, అసహ్యమైన చూపులు అవన్నీ పక్కకు నెట్టి తన మార్గంలో తాను అజేయంగా దూసుకుపోయింది. మహిళలు చేయలేని పని అంటూ ఏమిలేదని అందరిచేత ప్రశంసలందుకోంటోంది యోగితా రఘువంశీ. న్యాయవాది నుంచి ట్రక్ డ్రైవర్‌గా మలుపు తిరిగిన తన జీవన ప్రయాణం గురించి ఆమె మాటల్లో... లాయర్ అయినా యోగితా రఘువంశీ పొట్ట పోషణ కోసం డ్రైవర్‌గా మారింది. అదికూడా ఓ ట్రక్ డ్రైవర్‌గా ఎన్నో వేల మైళ్లు వెళ్లింది. దేశంలో దాదాపు చాలా రాష్ట్రాల సరిహద్దులను చుట్టి వచ్చింది. పురుషులు ప్రాబల్యం అధికంగా ఉన్న ఆ వృత్తిలో మధ్యప్రదేశ్‌కు చెందిన యోగిత రఘువంశీ గత 15 ఏళ్లుగా ఎన్నో మైళ్లు ప్రయాణించారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ దేశంలో సగానికి పైగా ప్రయాణించింది. యోగిత లా, బిజినెస్‌లో డిగ్రీ చేసింది కూడా. అలాగే సెలూన్, డ్రస్ డిజైన్ కోర్సులలో కూడా పనిచేసింది. న్యాయవాద వృత్తిని కొనసాగించాలని భర్త సూచించినా పట్టించుకోలేదు. భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా సంతృృప్తిగా సాగిపోతుంది కదా జీవితం అనుకుంది. అందువల్లే పెద్దగా డబ్బులు వెనకేసుకుంది కూడా లేదు. సరిగ్గా అదే సమయంలో భర్త అకాల మరణంతో ప్రశ్నార్థకంగా మారిన పిల్లల పోషణ ఆమెను స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేసేలా చేసింది. ఇక ఈ వృత్తిలో ఎన్నో మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. పైగా ఆమె ఒక్కోరోజు భోపాల్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 11 వందల మైళ్ల దూరాన్ని కేవలం మూడు రోజుల్లోనే చేసింది. ఆ ప్రయాణంలో ఎన్నో అసభ్యకరమైన వ్యాఖ్యలు, చూపులు, ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోంటూ సాగింది. అలాగే ట్రక్ డ్రైవర్లు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎదుర్కొటున్న వేధింపులను నిర్మొహమాటంగా చెప్పింది. ఆర్టీవోలు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాల కన్నా డ్రైవర్ల నుంచి రాబట్టే మాముళ్లతోనే ఇళ్లను నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. ఓ ప్రముఖ రవాణా సంస్థ ఏఐటీడబ్ల్యూఏ ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా సమక్షంలో ఈ విషయాలన్ని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఈమేరకు యోగితా రఘువంశీ మాట్లాడుతూ..ద్వేషపూరితమైన మనుషుల మధ్య నా కెరియర్ ప్రారంభమైంది. ఇప్పుడూ నాకంటూ ఓ సొంత మార్గాన్ని ఏర్పరుచుకున్నా. అంతేగాదు పురుషుడు ఎక్కువగా ఉండే ఈ రంగంలో నమ్మకమైన శక్తిమంతమైన మహిళగా పేరుతెచ్చుకున్నా. ఒక పక్క నావృత్తి చేస్తూనే..సరిహద్దుల మధ్య ఎదరవుతున్న లింగ వివక్ష, అవినీతిపై పోరాడుతున్నా అని ధైర్యంగా చెబుతోంది యోగితా రఘువంశీ. అతేకాదు ఆమె 2006లో ట్రక్ డ్రైవర్‌గా లైసెన్స్ పొందింది. దీంతో భారతదేశంలో లైసెన్స్ పొందిన తొలి మహిళా ట్రక్ డ్రైవర్‌గా యోగిత ఘనత సృష్టించింది. (చదవండి: మెషీన్స్‌కూ..మదర్‌టంగ్ కావాలోయ్!) -
కత్తి తీసి పోరాడటమే సరైనది.. చంద్రబాబు లాయర్ ఆసక్తికర ట్వీట్
సాక్షి, అమరావతి: స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హైకోర్టు బుధవారం క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం.. ఈ రోజు మా నినాదం ఇదే.. అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తిని ఆయన ఉటంకించారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది’ అని ట్వీట్ చేశారు. Motto for the day pic.twitter.com/gh0VsVYm8G — Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023 ఇదిలా ఉండగా.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బాబు భద్రతపై మరింత శ్రద్ధ -
ఆయన వాదిస్తే మరణశిక్ష కూడా యావజ్జీవం!
నేడు భారతదేశంలో భారీగా ఫీజులు వసూలు చేసే న్యాయవాదులు చాలామందే ఉన్నారు. అయితే వీరిలో రామ్ జెఠ్మలానీ పేరు ముందుగా వినిపిస్తుంది. అత్యధిక ఫీజులు, వివాదాస్పద కేసులు, క్లయింట్ల జాబితా కారణంగా రామ్‌జఠ్మలానీ పేరును నేటికీ తలచుకుంటుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్ర మంత్రినూ తన హవా చాటారు. రామ్ జెఠ్మలానీ 1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్‌లోని షికార్పూర్లో జన్మించారు. తన 17 సంవత్సరాల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్‌తో ఎల్ఎల్బీ పట్టా పొందారు. నాటి బొంబాయి శరణార్థుల చట్టానికి వ్యతిరేకంగా జెఠ్మలానీ పిటిషన్ వేశారు. అమానవీయమైన అంశం అయినందున దీనిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే ఆయన గెలిచిన మొదటి కేసు. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 1959లో నానావతి కేసులో జెఠ్మలానీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నేవీ అధికారి కేవాస్ మాణిక్షా నానావతి తన భార్య ప్రియుడి కాల్చి చంపి, పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ కేసులో కేవాస్ మాణిక్షా నానావతి తరపున న్యాయపోరాటం చేయడం ద్వారా జెఠ్మలానీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1960వ దశకంలో రామ్‌జెఠ్మలానీ హాజీ మస్తాన్‌తో సహా పలువురు స్మగ్లర్ల కేసులను వాదించారు. ఈనేపధ్యంలో రామ్ జెఠ్మలానీ.. స్మగ్లర్ల లాయర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. జెఠ్మలానీ చాలా కాలం డిఫెన్స్ లాయర్‌గా ఉన్నారు. తాను న్యాయవాదిగా మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తానని ఎప్పుడూ చెబుతుండేవాడు. అందుకే ఆయన తన దగ్గరకు వచ్చేవారు నేరస్తులా కాదా అనేది పట్టించుకోలేదని చాలామంది చెబుతుంటారు. కొన్ని కేసులను స్వీకరించేందుకు రామ్ జఠ్మలానీ రూ. 25 లక్షల వరకు తీసుకునేవారని అంటారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది ఆయనే. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కాశ్మీరీ ఉగ్రవాది అఫ్జల్ గురు తరపున కూడా ఆయన వాదించారు. కానీ ఈ కేసులో రామ్ జఠ్మలానీ విజయం సాధించలేదు. జెఠ్మలానీ గతంలో బీజేపీ నేత ఎల్‌కె అద్వానీ తరపునా న్యాయపోరాటం చేశారు. అద్వానీని సమర్థించారు. అంతే కాకుండా అమిత్ షా, లాలూ ప్రసాద్ యాదవ్, యడ్యూరప్ప, జయలలిత, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన రాజకీయ నాయకులపై ఆయన కేసులు పెట్టారు. రాంజెఠ్మలానీ రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.ఆయన రెండుసార్లు బీజేపీ లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా,అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. జెఠ్మలానీ.. కాన్సైన్స్ ఆఫ్ మార్విక్, జస్టిస్ సోవియట్ స్టైల్, బిగ్ ఈగోస్-స్మాల్ మ్యాన్, కాంఫ్లిక్ట్స్ ఆఫ్ లాస్, మార్విక్ అన్‌చేంజ్డ్ అండ్ అన్రిపెంటెంట్ అనే పుస్తకాలను రాశారు. రామ్ జఠ్మలానీ పదవీ విరమణ చేసిన రెండేళ్ల అనంతరం 2019, సెప్టెబరు 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆమె మెడలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్! -
సుప్రీంకోర్టు లాయర్ హత్య.. భర్తే చంపి స్టోర్ రూంలో..
లక్నో: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను భర్తే హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో దాచి, తాను ఇంటి స్టోర్‌రూమ్‌లో తలదాచుకున్నాడు. బాధితురాలి సోదురుడు ఫోన్ చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రేణు సిన్హా(61), అజయ్ నాథ్‌లు భార్యభర్తలు. అజయ్ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. వారు నోయిడాలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని అజయ్ నాథ్ రూ.4 కోట్లకు అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ కూడా కొనుగోలుదారుని వద్ద తీసుకున్నాడు. కానీ బంగ్లా అమ్మడానికి రేణు సిన్హా అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అజయ్ నాథ్.. రేణు సిన్హాను హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి స్టోర్ రూమ్‌లో తలదాచుకున్నాడు. రేణు సిన్హా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆమె సోదరుడు అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. అటు అజయ్ నాథ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఇంటికి వచ్చిన పోలీసులు.. బాత్రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అన్ని రూంలలో చెక్ చేయగా.. స్టోర్ రూంలో నిందితున్ని పట్టుకున్నారు. నిందితున్ని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేణు సిన్హ ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు ఆమె సోదరుడు తెలిపారు. రేణు సిన్హ, అజయ్ నాథ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: లేడీ అనురాధ డ్రగ్స్ దందా -
ఆ విషయాల్లో సిద్ధార్థ్ లూథ్రా సైలెంట్
-
చంద్రబాబు న్యాయవాది..సిద్ధార్థ్ లూథ్రా వాదనలు..
-
ఆరోగ్యం సహకరించడం లేదు..రిమాండ్ కు ఇవ్వొద్దు: చంద్రబాబు లాయర్లు
-
స్కిల్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న లాయర్లు
-
కోర్టు కాంప్లెక్స్‌లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్‌లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు కనీసం వారెంటు చూపించలేదని, అంతేకాకుండా తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్ ఆరోపించినట్లు చెప్పారు. ‘ నన్ను ఓపన్ వాష్‌రూం ఉన్న ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ చెప్పారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. కాగా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ గడువు ఆగస్టు 12న పూర్తికానుండగా, ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో ఇమ్రాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే కనిపిస్తోంది. చదవండి: స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం -
ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు..
లక్నో: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ విజయ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ శాసన సభ్యుడు రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఉమేశ్‌ను అతీక్ అహ్మద్ కుమారుడు మరికొందరితో కలిసి హత్య చేశారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ పాల్ లొకేషన్‌ను లాయర్ విజయ్ షేర్ చేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి లక్నోలోని తాజ్ హోటల్ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ హత్య సంబంధిత వీడియోలు ఉత్తరప్రదేశ్‌లో గతంలో వైరల్ అయ్యాయి. దుండగులు ఉమేశ్ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో మాఫియాను అంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తదనంతర కాలంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని కుమారుడు ఎన్కౌంటర్లో హత్యకు గురయ్యారు. ఉమేశ్ హత్య కేసులో అతీక్ భార్య పర్వీన్ కూడా నిందితురాలుగా ఉన్నారు. 2019లో తాను జైలులో ఉన్నప్పుడే హత్యకు కుట్ర పన్నినట్లు అతీక్ గతంలో వాంగ్మూలాన్ని ఇచ్చాడు. జైలులో ఉన్నప్పుడే పర్వీన్ సందర్శించి ఫోన్‌ను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌తోనే ఉమేశ్ హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించాడు. ప్రస్తుతం పర్వీన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదీ చదవండి: కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య.. -
పర్సు ఇంట్లో మరిచిపోయా.. కాల్ చేస్తే స్విచాఫ్.. న్యాయవాదికే మస్కా కొట్టిన కేటుగాళ్లు
జయపురం(భువనేశ్వర్): ‘సార్.. పర్స్ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్ స్విచాఫ్ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్ పే చేశారు. కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్ చేసి ఫోన్ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
వీడెవండి బాబు.. వారానికి 4 రోజుల పని.. రూ.50 వేల జీతం.. ఇవి సరిపోతాయా సార్!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఎంత బాగా చదివిన ఎన్ని మార్కులు వచ్చినా .. జాబ్‌కు దగ్గరకు వచ్చే సరికి అవన్నీ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే పని చేస్తాయి. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం మన స్కిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అంత కష్టపడి జాబ్ వచ్చాక మనకు నచ్చినట్లు ఉండాలంటే కదరదు. రోజూ 8 గంటల పని.. ఇక ఆఫీసులో క్షణం తీరిక లేకుండా సంస్థను మెప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగి దినచర్య అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతని డిమాండ్లు చూసి ఇంటర్వ్యూర్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్నే సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని ఒక న్యాయవాది ఇటీవల లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఒక ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్య్వూకి వచ్చిన ఆ అభ్యర్థి తనుకు ఉన్న డిమాండ్లతో పాటు రూ. 50,000 జీతం కావాలని చెప్పడట. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. 'లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాను. అతను పని చేయాలంటే.. తనకి వారంలో 4 రోజులు, రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పాడు. అలాగే కోర్టుకు వెళ్లడం కూడా తనకి ఇష్టం లేదని, అందుకే ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగం కావాలని చెప్పాడు. కోల్‌కతలో ఉద్యోగం కాబట్టి జీతం రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. ఈ తరానికి నా ఆశిస్సులు.' అని అన్నారు. కోల్‌కతాలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీ మెర్సెర్ ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023 సర్వే నిర్వహించగా అందులో కోల్‌కతా 211వ స్థానంలో నిలించింది. అంటే చాలా తక్కువ ఉంటుందని దాని అర్థం. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు భారతీయ నగరాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాలలో ఉండి కూడా.. ఒక ఫ్రెషర్ అయ్యిండి అంత ఎక్కువ శాలరీతో పాటు ఇన్ని డిమాండ్ చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా అయితే ఎక్కడ ఉద్యోగం రాదని కామెంట్ చేయగా.. మరికొందరు ఈ డిమాండ్లు సరిపోతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. Interviewed a fresher for a litigation associate post who wants 4 days work week, 4 hrs/day work (because he doesn't like going to court and will only be in chamber he said), and 50K salary in Kolkata. Bless this generation. ❤️ — Jhuma (@courtinglaw) July 23, 2023 చదవండి రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే? -
పోలీసుల అత్యుత్సాహం.. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి..
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం అడ్వకేట్ ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపూరి సుభాష్ రెడ్డి(75)ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గూడూరులో ఉన్న ఎన్ఆర్ఐకు చెందిన 5 ఎకరాల భూమిని స్థానిక రియల్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాసి రామ్ కొనేందుకు కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఎన్ఆర్ఐని పలుమార్లు పీఎస్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆరోపించారు. మాట వినకపోవడంతో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రానా ప్రతాప్.. ఎన్ఆర్ఐని అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించాడని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసేందుకు ఇంటిపై దాడి చేశారని అడ్వకేట్ చెప్పారు. గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారని అన్నారు. ఈ ఘటనపై రేపు డీజీపీకి, హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్ రాపోలు భాస్కర్ తెలిపారు. నిందితునికి ఆశ్రయం కల్పించడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసుల మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ రాణా ప్రతాప్ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషీ! -
మహిళా న్యాయవాది హఠాన్మరణం
తిరువొత్తియూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కన్నవరానికి చెందిన విమల్ కుమార్(50), భార్య భాగ్యలక్ష్మి (47) ఇద్దరూ న్యాయవాదులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం సహా రామేశ్వరం ఆలయానికి వెళ్లేందుకు చైన్నె వచ్చి భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నారు. రైలు కడలూరు జిల్లా పన్రుటికి రాగానే భాగ్యలక్ష్మికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చిందని తెలిసింది. వెంటనే విమల్ కుమార్ ఈ విషయాన్ని రైలులోని టిక్కెట్ ఇన్‌న్‌స్పెక్టర్‌కు చెప్పాడు. తదనంతరం రాత్రి 10.30 గంటలకు, రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ తిరుపాదిరి పులియూర్ రైల్వే స్టేషన్లో ఆగింది (అక్కడ స్టాప్ లేదు). రైలు నుంచి దిగిన వెంటనే భాగ్యలక్ష్మిని అంబులెనన్స్‌లో కడలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. భాగ్యలక్ష్మి గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని వైద్యులు తెలిపారు. -
కవితతో జరిపిన వాట్సాప్ చాట్ విడుదల
-
తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా పద్మ లక్ష్మీ
కేరళకు చెందిన పద్మాలక్ష్మీ తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జడ్జీగా నిలిచిన జోయిత్ మోండల్ తర్వాత పద్మ లక్ష్మీ అనే ట్రాన్స్‌జెండర్ ఆ విజయాన్ని సాధించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెబుతూ..ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆమె గురించి మాట్లాడుతూ..ఆదివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 1500 మందికి పైగా లా గ్రాడ్యుయేట్లలో పద్మాలక్ష్మీ కూడా ఒకరు. ఆమె ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టుభద్రురాలైందని చెప్పారు. తన కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని, ముఖ్యంగా సమాజం నుంచి ఎదురై చీత్కారాలను అధిగమించి అనుకున్న గమ్యానికి చేరుకుని విజయం సాధించిందని ప్రశంసించారు. ఎట్టకేలకు ఆమె అనుకున్న లక్ష్యం సాధించి న్యాయచరిత్రలో తన పేరును నమోదు చేసుకుందన్నారు. ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాక తనలాంటి వాళ్లు ఈ రంగంలో వచ్చేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు మంత్రి రాజీవ్. దీంతో నెటిజన్లు అడ్వకేట్ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కాగా తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి జోయితా మోండల్ తదనంతరం 2018లో ట్రాన్స్‌జెండర్ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని లోక్ అదాలత్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదే మూడో ట్రాన్స్‌జెండర్ జడ్జిగా గౌహతి నుంచి స్వాతి బిధాన్ నియమితులయ్యారు. View this post on Instagram A post shared by P Rajeev (@prajeevofficial) (చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి) -
ఖైదీని చూడడానికి వెళ్లిన లాయర్ అరెస్టు.. అసలు ట్విస్ట్ ఏంటంటే!
తిరువొత్తియూరు(చైన్నె): చైన్నె పుళల్‌జైలులో ఖైదీని చూడడానికి వెళ్లిన నకిలీ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సెంట్రల్ పుళల్‌లో సుమారు 3 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వీరిని న్యాయవాదులు తరచూ వచ్చి సంప్రదించి వెళుతుంటారు. శుక్రవారం సాయంత్రం రామాపురం పెరియార్ రోడ్డుకు చెందిన సతీష్ కుమార్ (38) అనే వ్యక్తి ఖైదీని చూడడానికి వచ్చాడు. ఆ సమయంలో నడవడికలపై జైలర్‌కు అనుమానం రావడంతో గుర్తింపు కార్డు చూపించమని కోరాడు. అది నకిలీదని, అతను న్యాయవాది కాదని తెలిసింది. అతనిపై జైలు అధికారులు పుళల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని పుళల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పుళల్ పోలీసు ఇన్స్పెక్టర్ షణ్ముగం సంబంధిత వ్యక్తిని విచారిస్తున్నారు. అతను 2013లో తిరువేర్కాడులో జరిగిన హత్య కేసుకు సంబంధం ఉన్న వ్యక్తి అని తెలిసింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న నకిలీ న్యాయవాది ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. న్యాయవాది పేరుతో ఇంకా ఎక్కడెక్కడ మోసం చేశాడన్న దానిపై విచారిస్తున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
బీజేపీపై కవిత లాయర్ సంచలన వ్యాఖ్యలు
-
అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని ఉమెన్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి 70 మంది భూకబ్జాదారులు, రౌడీలు చొరబడి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నం.85, 86లో వెయ్యి గజాల స్థలం 1990 నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి, ఆయన భార్య సురేఖారెడ్డి ముదిగంటి ఆధీనంలో ఉంది. ఇందులో ఇల్లు కట్టుకొని కొడుకు భరత సింహారెడ్డితో కలిసి ఉంటున్నారు. ప్రభుత్వానికి క్రమబద్దీకరణ కోసం కూడా దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించారు. అయితే పరమేశ్వర్‌రామ్ అనే విశ్రాంత గ్రూప్–1 అధికారి ఈ స్థలం తనదేనంటూ వాదిస్తూ అదే ప్రాంతంలో ఉండే ప్లాట్ నంబర్ 91కి చెందిన పత్రాలతో విశ్వనాథ్‌రెడ్డి ప్లాట్‌ను మరొకరికి డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు రూ.15 లక్షలు తీసుకొని ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి అర్ధరాత్రి 70 మంది గూండాలను తీసుకొని కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించి కారంపొడి పొట్లాలు చల్లుతూ వీరంగం సృష్టించాడు. దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన వాచ్‌మెన్‌తో పాటు విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీల్లో కొందరు పారిపోగా, మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. శనివారం బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' -
కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు.. నటుడిపై సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య ఆలియా సిద్ధిఖీతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పాస్‌పోర్ట్ సమస్యలతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలియా ముంబయి బాంద్రాలోని సిద్ధిఖీ ఇంటికి తిరిగొచ్చింది. అయితే ఆమెకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ నవాజుద్దీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలియా ఆరోపించింది. కనీసం అన్నం కూడా తిననివ్వడం లేదని.. వాష్‌రూమ్‌కు వెళ్లనివ్వట్లేదని వాపోయింది. తాజాగా తన లాయర్‌తో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ దాదాపు రెండేళ్లుగా తన భార్య ఆలియా సిద్ధిఖీతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆలియా తరఫు న్యాయవాది రిజ్వాన్ స్టేట్మెంట్ సంచలనంగా మారింది. ఆలియా న్యాయవాది స్టేట్మెంట్లో రాస్తూ..' నా క్లైంట్‌ను అవమానిస్తున్నారు. ఆమెకు ఆహారం తిననివ్వడం లేదు. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వట్లేదు. ఆమె చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచారు. ఆస్తి విషయంలో కావాలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేయిస్తామని బెదిరించారు. ప్రతి రోజూ పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. నవాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు గత ఏడు రోజులుగా నా క్లయింట్‌కు ఆహారం లేదు. ఆమె ఉన్న హాలులో సీసీ కెమెరాలను అమర్చారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా మైనర్లు.' అంటూ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్-ఆలియాల వివాహం నవాజుద్దీన్, ఆలియా 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షోరా, కుమారుడు యాని సిద్ధిఖీ ఉన్నారు. 2021లో ఆలియా నవాజుద్దీన్ విడాకుల నోటీసులు పంపించింది. తమ 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. లాక్డౌన్ సమయంలో ఇది ఒక అవకాశంగా భావించానని ఆమె వెల్లడించింది. నవాజుద్దీన్, అతని కుటుంబం గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. -
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది
ప్రపంచంలోనే తొలి రోబో లాయర్ కేసును లాయర్ మాదిరిగా సలహాలిచ్చి కేసును వాదించుకునేలా గైడ్ చేస్తుంది. 2015లో జాషువా బ్రౌడర్ అనే శాస్త్రవేత్త రోబో లాయర్ని రూపొందించారు. ఆయన డూనాట్‌పే లీగల్ సర్వీస్ చాట్‌బోట్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీని స్థాపించి న్యాయ సేవలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ స్మార్ట్‌ఫోన్‌లో రన్ అవుతోంది. నిజ జీవితంలోని కేసులన్నింటిని హెడ్‌ఫోన్ సాయంతో విని తన క్లయింట్‌కి సలహలు, సూచనలు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఈ రోబో లాయర్ తొలుత కేసులకు సంబంధించిన జరిమానాలు, ఆలస్యంగా చెల్లించే రుసుమలు విషయంలో వినియోగదారులకు చట్టపరమైన సలహాలు అందించేది. ఇప్పుడూ ఏకంగా కేసును లాయర్ మాదిరిగా టేకప్ చేసి క్లయింట్‌ని తగిన విధంగా గైడ్ చేసి వాదించుకునేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ రోబో యూకేలోని ట్రాఫిక్ టిక్కెట్‌కి సబంధించిన ప్రతివాది కేసును వచ్చే నెలలో వాదించనుంది. ఈ కేసుకు సంబంధించి రోబోకి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని బ్రౌడర్ అన్నారు. ఫిబ్రవరిలో యూకే కోర్టులో ఈ కేసు విచారణ జరగనున్నట్లు తెలిపారు. కోర్టులో సమాచారాన్ని ప్రాసెస్ చేసి, వాదనలను విశ్లేషించి తన క్లయింట్‌కి తగిన సలహాలిస్తుంది. ఒక వేళ ఈ కేసు ఓడిపోతే జరిమాన కట్టడానికి సదరు సంస్థ అంగీకరించినట్లు సమాచారం. పార్కింగ్, బ్యాంకులకు, కార్పొరేషన్, బ్యూరోక్రసీకి సంబంధించిన కేసుల విషయమై కోర్టులో దావా వేయడం, వాదించడం వంటి వాటిల్లో ప్రజలకు సాయం చేస్తోంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతోంది. దీనివల్ల క్లయింట్‌కి కోర్టు ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే యూకేలో న్యాయవాదిని నియమించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని, పైగా సుమారు రూ. 20 వేల నుంచి లక్ష రూపాయాల వరకు ఖర్చు పెట్టాలని బ్రౌడర్ చెబుతున్నారు. అంతేగాదు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో ఇంకా చాలా మంది మంచి లాయర్లు ఉంటారు, కానీ చాలా మంది లాయర్లు డాక్యుమెంట్లను కాపీ చేసి పేస్ట్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ఈ రోబో లాయర్ చెక్ ్పెడుతుందని ఆనందంగా వెల్లడించారు సైంటిస్ట్ బ్రౌడర్. ఐతే ఈ రోబో లాయర్ యూకేలోని ఏకోర్టులో ఏ క్లయింట్ తరుఫున వాదిస్తుందన్నది శాస్త్రవేత్త వెల్లడించలేదు. Here it is! The first ever Comcast bill negotiated 100% with A.I and LLMs. Our @DoNotPay ChatGPT bot talks to Comcast Chat to save one of our engineers $120 a year on their Internet bill. Will be publicly available soon and work on online forms, chat and email. pic.twitter.com/eehdQ5OXrl — Joshua Browder (@jbrowder1) December 12, 2022 (చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..షర్ట్ లేకుండా పిడిగుద్దులతో..) -
సంతోష్ ఎప్పుడు వస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ విచారణకు ఎప్పుడు వస్తారో చెప్పేదెవరని హైకోర్టు ధర్మాసనం.. బీజేపీ తరఫు న్యాయ వాదిని ప్రశ్నించింది. హాజరుపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బి.శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రామచంద్రరావు, కేంద్రం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ చిదంబరేశ్, ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు. పార్టీ ప్రతినిధుల్లా మాట్లాడకూడదు.. ‘సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం కోసం 16వ తేదీ నుంచి సిట్ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. సంతోష్ కావాలనే నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన కార్యాలయంలోని వారికి సిట్ వాటిని అందజేసింది. ఆయనపై అనేక అనుమానాలున్నాయి. విచారణకు రాకుండా జాప్యం చేయడం మూలంగా సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని ఏజీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్. రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బహిరంగపర్చిందని ఆరోపిం చారు. బీఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నా రని తెలిపారు. ఈ క్రమంలో సంతోష్ అసలు విచా రణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఎప్పుడు హాజరవుతారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమ కు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని ఆయన చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరుకా లేనని సిట్‌కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరు పట్ల న్యాయమూర్తి అభ్యంత రం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు. వృత్తి నిపుణుల్లా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. ఆవేశానికి లోనుకావొద్దన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వాలని ఏజీని న్యాయమూర్తి కోరగా, ఇంకా రాలేదని చెప్పారు. ఉత్తర్వులు వచ్చాకే విచారణ జరుపుతామంటూ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు. సిట్‌పై తేల్చాల్సింది ఈ ధర్మాసనమే.. తిరిగి విచారణ ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఏజీ న్యాయమూర్తికి అందజేశారు. ‘సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినా సంతోష్ విచారణకు హాజరుకాలేదు. బీఎల్ సంతోష్ తరఫున న్యాయవాదులెవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నెల 19న అరెస్టు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్ స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ సాగించే వెసులుబాటు కల్పించాలి’ అని ఏజీ విజ్ఞప్తి చేశారు. విచారణ కోసమే 41ఏ నోటీ సులు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు రద్దు చేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. బీజేపీ కీలక నేత అయిన సంతోష్‌ను అరెస్టు చేస్తే.. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చిదంబరేశ్ నివేదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏజీ బదులిచ్చారు. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలని డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిట్ భవితవ్యాన్ని తేల్చే అధికారం ఈ ధర్మాసనానిదేనని చెప్పారు. సిట్ ఉండాలా?. వద్దా ? కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా సీబీఐకి బదిలీ చేయాలా?.. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఈ ధర్మాసనానికి ఉందన్నారు. హైకోర్టు జడ్జి దర్యాప్తును పర్యవేక్షించగలరా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు జఠ్మలానీ బదులిస్తూ.. పర్యవేక్షించవచ్చని.. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముగ్గురు నిందితులు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సిట్ వేధిస్తోంది: శ్రీనివాస్ విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 25న సిట్ ఎదుట హాజరైతే సరిపోతుందని తెలిపింది. అలాగే తనకు సిట్ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని కోరారు. ఇదీ చదవండి: రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు -
టికెట్ ఎందుకు బుక్ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్ పలువురికి 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమీప బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. సిట్ సభ్యులైన సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కళ్మేశ్వర్, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ వేర్వేరుగా సాయంత్రం 6:30 గంటల వరకూ ఆయనను సుమారు 8 గంటలపాటు విచారించారు. శ్రీనివాస్ ఫోన్ కాల్‌డేటాతోపాటు, ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలించి, వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం. గత నెల 26న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో హరియాణాకు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్, తిరుపతి స్వామి సింహయాజీలు రహస్య మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు మధ్యాహ్నానికి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ ఇండియా విమాన టికెట్‌ను బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సింహయాజీతో మీకున్న సంబంధం ఏంటని అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సింహయాజీతో పూజలు చేయించడం కోసమే ప్రత్యేకంగా టికెట్ బుక్ చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే శ్రీనివాస్ ఫోన్లోని యూపీఐ లావాదేవీల జాబితాను ముందు పెట్టి విచారించారు. కాగా, విచారణలో శ్రీనివాస్ ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారికీ 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. అరగంట ఫోన్లో ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17 అంతస్తుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్ ప్రశ్నలు, రాబట్టే సమాధానాలు, వారి స్పందన.. ఇలా అన్ని అంశాలూ స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు నందుకుమార్ ఫోన్‌ను విశ్లేషించగా.. గత నెల 26 కంటే ముందు అరగంట సేపు సెల్ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఏం మాట్లాడారు? 26న టికెట్లు బుక్ చేయాలని ఎవరైనా కోరారా? అని లోతుగా విచారించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. శ్రీనివాస్ నుంచి సంతృప్తికర సమాధానాలు రాబట్టలేని అధికారులు.. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం -
‘బ్యాండ్ లేని లాయర్.. బ్యాట్ లేని టెండూల్కర్ ఒక్కటే’
న్యూఢిల్లీ: కోర్టులో వాదించే న్యాయవాదులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తులు నల్ల కోట్ ధరించి ఉంటారు. కోర్టుకు హాజరయ్యే సమయంలో ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలనే అంశంపై కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ యువ న్యాయవాది బ్యాండ్(టై) ధరించకుండా కోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు వినిపించే సమయంలో బ్యాండ్ ధరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ లాయర్‌కు కీలక సూచనలు చేశారు జస్టిస్ డీవై చంద్రచూడ్. ‘కోర్టులో ధరించవద్దు.. అది చాలా అసహ్యంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీ కళాశాలలో నమూనా కోర్టు నిర్వహించాల్సింది. దీనిని నమూనా కోర్టుగా భావించు. లంచ్‌కు వెళ్లేందుకు మాకు 10 నిమిషాల సమయం ఉంది. అన్ని వివరాలను తెలుసుకుని వాదనలు వినిపించు. నీవు వాదించగలవని అనుకుంటున్నాం. మీ సీనియర్ గైర్హాజరైనప్పుడు వాదనలు వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక న్యాయవాది బ్యాండ్(టై) లేకుండా రావటం.. బ్యాటు లేకుండా క్రికెట్ గ్రౌండ్లోకి సచిన్ టెండూల్కర్ రావటం ఒక్కటే.’ అని పేర్కొన్నారు జస్టిస్ డీవై చంద్రచూడ్. అయితే, ఒక యువ న్యాయవాదికి జస్టిస్ డీవై చంద్రచూడ్ సలహాలు ఇవ్వటం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది ఓ యువ న్యాయవాది కోర్టుకు సమర్పించాల్సిన రాతపూర్వక పత్రాన్ని తీసుకురాకపోవటంతో పలు సూచనలు చేశారు. #Courtroomexchange Counsel appears before #SupremeCourt without his band. Justice Chandrachud: A lawyer without his band is like Sachin Tendulkar without his bat. J. Kohli: Well said. Counsel attempts to wear band in Court DYC: Now don’t dress up in Court, that is worse. — Live Law (@LiveLawIndia) September 1, 2022 ఇదీ చదవండి: ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటాపై సుప్రీంకోర్టులో విచారణ -
బీజేపీ యూత్ లీడర్ హల్చల్.. లాయర్ కాలర్ పట్టుకుని దాడి
బీజేపీ యూత్ లీడర్ హల్చల్ చేశాడు. ఓ లాయర్‌పై విచక్షణారహితంగా.. అతడి కాలర్ పట్టుకుని దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా పోలీసులు.. బీజేపీ నేతపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఐసీసీఆర్ ఆడిటోరియంలో బీజేపీ ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఇక, బీజేపీ మీటింగ్ కావడంతో సమావేశంలో పాల్గొనేందుకు స్థానిక నేతలతో పాటుగా ఉత్తర కోల్‌కతాకు చెందిన బీజేపీ యూత్ వింగ్ లీడర్ అభిజిత్ కూడా అక్కడికి వచ్చాడు. కాగా, కాసేపట్లో సమావేశం ముగుస్తుందనగా అభిజిత్ హల్చల్ చేశాడు. ఇక,ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత సమిక్ భట్టాచార్యను కలిసేందుకు సబ్యసాచి రాయ్ చౌదురి అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో సబ్యసాచి రాయ్ చౌదురిని చూసిన అభిజిత్.. ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. సబ్యసాచి రాయ్.. టీఎంసీ నాయకుడని, ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ.. అతడి కాలర్ పట్టుకుని చితకబాదాడు. గట్టిగా అరుస్తూ విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సందర్భంగా చౌదురి.. తాను ఓ లాయర్నని, టీఎంసీ కార్యకర్తను కాదని చెబుతున్నా.. అభిజిత్ పట్టించుకోలేదు. చివరకు.. తనను కలిసేందుకే చౌదురి ఇక్కడకు వచ్చారని.. సమిక్ భట్టాచార్య నిర్ధారించడంతో శాంతించాడు. కాగా, ఈ దాడిపై చౌదురి పోలీసులకు ఆశ్రయించగా.. ఆడిటోరియం వద్ద వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. #RaviVisvesvarayaSharadaPrasad https://t.co/QhHvYVS0yw Kolkata BJP youth leader caught beating man on camera — #RaviVisvesvarayaSharadaPrasad #Telecom #InfoTech (@rvp) August 27, 2022 -
BJP MLA Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్.. నాంపల్లి కోర్టు ఏం సూచించిందంటే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ సాక్షితో మాట్లాడారు. రాజాసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలంటూ వాదనలు వినిపించామని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఒక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయాలంటే 41 సీఆర్పీసీ నోటీసులు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే రాజాసింగ్‌కు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు. తమ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసిందని కరుణ సాగర్ చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం ఎమ్మెల్యేకు సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వీడియోకు సంబంధించి న్యాయస్థానంలో ఎలాంటి వాదనలు జరగలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటివరకు పోలీసులు కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. కేవలం రాజసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలని తమ వాదనలు వినిపించామని, 20 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలకతీర్పు వెల్లడించిందన్నారు. చదవండి: BJP MLA Raja Singh: రాజాసింగ్‌కు రిమాండ్ వ్యవహారంలో ట్విస్టు! -
Rajeshwari Thaman: ప్రాక్టీస్ న్యాయశాస్త్ర
సమాజంలో మనం అన్యాయానికి గురైనప్పుడే న్యాయం గుర్తుకు వస్తే.. మన ఆలోచనల్లోనే అపసవ్యత ఉన్నట్టు. న్యాయం ఏంటో ముందుగానే తెలిస్తే .. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించవచ్చు. మన జీవనంలో పుట్టుక నుంచి మరణం వరకు న్యాయపరమైన హక్కులు, అవగాహన అవసరం. ఈ ఆలోచనతోనే న్యాయం పట్ల సమాజంలో సరైన అవగాహన కల్పించడం కోసం ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’ పేరుతో కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు, జిల్లాల్లోనూ లీగల్ సదస్సులను ఉచితంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ వాసి లాయర్ రాజేశ్వరి థమన్. బేగంపేట్ చికోటి గార్డెన్స్‌లో ఉన్న ఈ లాయర్ని కలిసినప్పుడు తాము చేస్తున్న కృషి గురించి వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘న్యాయం గురించి తెలిస్తే మన చేతిలో కనపడని ఆయుధం మనకు రక్షణగా ఉన్నట్టే. న్యాయరంగంలో ఉన్నవారు ఏదో ఒక స్థాయికే పరిమితమై ఉండలేరు. ప్రాక్టీస్‌లోకి వచ్చిన తొమ్మిదేళ్లకు నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకున్నాను. అలా, ఐదేళ్ల క్రితం న్యాయ రంగంలోకి కొత్తగా వస్తున్నవారికి శిక్షణ ఇస్తే బాగుంటుందని, మా సీనియర్స్‌తో కలిసి చర్చించాం. చదువుకూ–ప్రాక్టీస్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను పోగొట్టాలనుకున్నాం. దీంట్లో భాగంగా వెయ్యి మందికి పైగా జూనియర్ లాయర్లకు ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇదే క్రమంలో లాయర్లకి మాత్రమే కాదు.. సమాజంలో అన్ని వర్గాల వారూ న్యాయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకున్నాం. ఐటీ ప్రొఫెషనల్స్కైతే కాపీరైట్, సైబర్ సమస్యలు, మీడియావారికి ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలనే విషయాలు, కాలేజీ స్టూడెంట్స్‌కి న్యాయ పరంగా ఉన్న హక్కులు, అమ్మాయిలకు రక్షణ చట్టాలు, మహిళలకు ఆస్తికి సంబంధించిన సమస్యలు.. ఇలా ప్రతీ ఒక్కరికీ అవసరమైన న్యాయపరిజ్ఞానం అన్ని చోట్లా అందరికీ అవసరం అనుకున్నాం. దీంతో.. ఎ.పి.సురేష్ అండ్ అసోసియేట్స్‌తో కలిసి.. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, ట్రస్ట్ అండ్ సేప్టీ, లిటిగేషన్, ట్రాన్జాక్షన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్, రాజ్యాంగం, పర్యావరణం, మానవహక్కులు, సైబర్ లా, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో లీగల్ కు సంబంధించిన విషయ పరిజ్ఞానం కలిగించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఐదేళ్లుగా చేస్తున్న ఈ కృషికి మంచి స్పందన వస్తోంది. నోటి మాట ద్వారానే... ఇప్పటి వరకు తెలిసిన వారి ద్వారానే మమ్మల్ని సంప్రదిస్తున్నవారున్నారు. మేమే కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళుతున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, మండల స్థాయిలో లీగల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మాకున్న న్యాయపరమైన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి, దీనికి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. హైదరాబాద్‌లోనే కాకుండా కర్నూలు, విజయవాడ ప్రాంతాల్లోనూ న్యాయశిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో జరిగిన మహిళా దర్బార్‌లోనూ లీగల్ సెల్ నుంచి పాల్గొని, మా వంతుగా ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’ గురించి మహిళలకు వివరించాం. గిరిజనులకు ప్రత్యేకం గిరిజన ప్రాంతాల నుంచి కూడా కొంతమంది లాయర్లుగా వస్తున్నారని తెలుసుకున్నాం. అలాంటి వారు ఎవరున్నారో సమాచారం సేకరించి, నేరుగా వారిని సంప్రదిస్తున్నాం. మారుమూలప్రాంతాల నుంచి వచ్చే అలాంటి వారికి సరైన ప్రోత్సాహం అందించడానికి ప్రయాణ, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. డాక్టర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ, లీగల్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూగా ఉండదు. ఇది గమనించే ఈ రంగంలో న్యాయవిద్య నిరంతరం అందించాలని చేస్తున్న ప్రయత్నం ఇది. అవగాహనే ప్రధానం.. ఒకరోజు 80 ఏళ్ల వయసున్న పెద్దాయన మా ఆఫీసుకువచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి, రిటైర్ అయిన ఆయన తనకు ఈ వయసులో న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుందని చెప్పారు. మూడు రోజులు రెండు గంటల పాటు ఆయన మా క్లాసు విన్నారు. చాలా ఆనందమేసింది. నిజానికి టీనేజ్ నుంచే న్యాయపరమైన విషయాలు తెలుసుకుంటే వారి భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. మద్దతు కోసం వెతుకుతున్నారు.. ఇన్నేళ్ల భారతావనిలో ఇంకా ఈ రంగంలో మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. సపోర్ట్ కోసం చూస్తున్నారు. దీనికి కారణం.. ఇల్లు, పిల్లలు, పెద్దలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆంక్షలు.. ఇంకా ఎన్నో బాధ్యతలు. ఎవరైనా ధైర్యంగా మాట్లాడితే.. ‘ముందు మీ కుటుంబాన్ని చక్కదిద్దుకోండి. తర్వాత బయట సమస్యలు చూద్దురు’ అంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారితే లాయర్లుగా మహిళల సంఖ్య పెరుగుతుంది. అయితే, ఈ రంగంలో మహిళలు వెనుకంజ వేయడానికి కారణాలు లేకపోలేదు. ముందు ఈ రంగంలో వెంటనే పెద్దగా డబ్బులు రావు. ఉదయాన్నే తొమ్మిదింటికి బయటకు వెళితే సాయంత్రం 5 వరకు కోర్టులోనే. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఇంటిపనులు, పిల్లల పనులు, ఆ తర్వాత మళ్లీ రేపటి కేసు గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. దీంతో కుటుంబ పరిస్థితే స్త్రీల ఆశయాన్ని వెనకంజవేసేలా చేస్తుంది. ఇప్పటికీ ఈ రంగంలో ఢీ అంటే ఢీ అనే మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అమ్మాయిలు కూడా సౌకర్యంగా ఉండే ఉద్యోగాల వైపే చూస్తారు. ఇప్పటికైనా న్యాయరంగంలోకి వచ్చేవారు సరైన సబ్జెక్ట్ ఉండేలా, బలంగా వాదించే సమర్థత గలవారుగా ఎదగాలి. ఆ అవగాహన రావడం కోసం చేస్తున్న ప్రయత్నమే ‘ప్రాక్టీస్ న్యాయశాస్త్ర’. మా వర్క్ ద్వారా వచ్చే డబ్బునే ఈ అవగాహన సదస్సుల కోసం ఖర్చుచేస్తున్నాం. ఉన్న జ్ఞానాన్ని కొంత వరకైనా పంచగలిగితే అందరికీ న్యాయం గురించి అవగాహన కలగుతుందన్నదే మా ఉద్దేశ్యం’’ అని వివరించారు ఈ లాయర్. ‘మాకు న్యాయం చేయండి’ అనే వేడుకోలుకు ముందు న్యాయం గురించి తెలుసుకుంటే అన్యాయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం సులువుగా వస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడి లీగల్ క్లాసులకు హాజరైనవారు చెబుతున్నప్పుడు మారబోతున్న సమాజచిత్రం కళ్లముందు ఆవిష్కృతమైంది. – నిర్మలారెడ్డి -
కారుతో ఢీకొట్టి.. కత్తులతో పొడిచి..
ములుగు రూరల్: మైనింగ్ వ్యాపారం చేసే ఓ న్యాయవాది దారుణంగా హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు నడిరోడ్డుపై వెంబడించి మరీ కత్తులతో పొడిచి చంపేశారు. ములుగు జిల్లా భూపాల్‌నగర్ (పందికుంట) స్టేజీ వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. మైనింగ్‌కు సంబంధించిన భూ వివాదాలే ఈ హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును వెనుక నుంచి ఢీకొట్టి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన మాడగుండ్ల మల్లారెడ్డి (54) కొన్నేళ్లుగా హనుమకొండ బాల సముద్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ములుగు జిల్లా మల్లంపల్లిలో పెట్రోల్ బంక్, మైనింగ్ వ్యాపారం ఉన్నాయి. వ్యాపార పనుల నిమిత్తం ఆయన తరచూ మల్లంపల్లికి వచ్చి వెళ్తుంటారు. సోమవారం సాయంత్రం ఆయన ఇన్నోవా వాహనంలో ములుగుకు వచ్చి తిరిగి హనుమకొండకు బయల్దేరారు. పందికుంట స్టేజీ వద్ద ఆయన వాహనాన్ని వెనుక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి తన వాహనం దిగి ఆ కారులోని వ్యక్తులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే కారులోని ఐదుగురు వ్యక్తులు మల్లారెడ్డిపై కత్తులతో దాడికి దిగారు. అది చూసి మల్లారెడ్డి పరుగుపెట్టినా దుండగులు వెంబడించి మరీ కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. ఈ ఘటనలో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత దుండగులు వచ్చిన కారులోనే పరారయ్యారని మల్లారెడ్డి వాహన డ్రైవర్ సారంగం వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూవివాదాలే కారణం! మల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్లారెడ్డికి అక్కడి భూముల విషయంగా కొందరితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి హత్యకు పాత కక్షలు, మైనింగ్‌కు సంబంధించి భూవివాదాలే కారణమై ఉండవచ్చని మల్లంపల్లి వాసులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు. -
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!
చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు. కొంతకాలం నుంచి బాగ్‌లింగంపల్లిలోని మానస ఎన్‌క్లేవ్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్‌లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్‌మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్‌కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ -
సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ..
జైపూర్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది కృష్ణజింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ హైకోర్టులో లాయర్ హస్తిమల్ సల్మాన్ తరుపున వాదిస్తున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో జోధ్‌పూర్ పోలీస్ స్టేషన్లో లాయర్ ఫిర్యాదు చేశారు. దీంతో సల్మాన్ లాయర్‌కు భద్రతను పెంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే లేఖలో చివరన ఎల్బీ, జీవీ అనే అక్షరాలు రాసి ఉండటంతో ఇది గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ల పేర్లను సూచిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో మే 29న పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గత నెలలో సిద్ధూ మూస్ వాలా హత్యకు తనదే బాధ్యత అంటూ ప్రకటించాడు. అంతేగాక మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి ఈ పనిచేసినట్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా సరిగ్గా నెల కిందట కూడా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌లను చంపుతామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై సల్మాన్ బాంద్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. -
వలస కూలీల హీరో.. లాయర్ గాంధీ
వలస ఒప్పంద కూలీలైన ‘గిరిమిటియా’లను ఆ చెర నుంచి విడిపించడం కోసం దక్షిణాఫ్రికాలోనే ఉండిపోయిన లాయర్ గాంధీ.. ఆ పని సాధించాకే తిరిగి ఇండియా వచ్చారు. గాంధీజీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతటి పోరాటం చేశారో అంతటి పోరాటం దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం చేశారు. 1893 మే నెలలో న్యాయవాదిగా వృత్తి ధర్మంతో దక్షిణాఫ్రికాలో ప్రవేశించారు గాంధీ. ఆ పని సంవత్సరంలో అయిపోయింది. 1894లో స్వదేశానికి తిరిగి రావలసి వుంది కానీ ఆ దేశంలో వారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వలన కలిగే నష్టాలేమిటో అక్కడి మన భారతీయులకు వివరించడానికి గాంధీజీ ఆగిపోయారు. అలా గాంధీజీ బిల్లు గురించి చెప్పేసరికి వారంతా గాంధీజీని అక్కడే (దక్షిణాఫ్రికాలో) ఉండిపోయి తమ కష్టాలను నివారించమని కోరారు. దాంతో గాంధీజీ అక్కడే 21 సంవత్సరాలు.. అంటే 1914 వరకూ ఉండిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ప్రధానంగా గిరిమిటియాల సమస్యను పరిష్కరించాడు. ‘గిరిమిటియా’ అంటే ‘ఒప్పంద వలస కూలీ’ అని బ్రిటిష్ అర్థం. పద్ధతి రద్దు కాలేదు ఐదేళ్లు పని చేస్తామని అంగీకరించి ఒప్పందం పత్రంపై సంతకం చేసి భారతదేశాన్ని వదిలి దక్షిణాఫ్రికాకు ఉపాధి కోసం వెళ్లిన వారిని గిరిమిటియాలు అంటారు. అటువంటి గిరిమిటియాలకు 1914లో విధించిన 3 పౌండ్ల పన్ను రద్దు అయినప్పటికీ, ఆ విధానం మాత్రం పూర్తిగా రద్దు కాలేదు. (1916లో మదన్ మోహన్ మాలవ్య పెద్దల కౌన్సిల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. దీనికి సమాధానంగా లార్డ్ హార్డింగ్ తగిన సమయం వచ్చినప్పుడు ఆపుతామని అన్నారు.) గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లే నాటికి ఆ దేశం నాలుగు కాలనీల సమూహం. నేటాల్, కేఫ్, ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్. డచ్చి వారు (బోయర్స్) ట్రాన్స్ వాల్, ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌లోనూ, బ్రిటిష్ వారు నేటాల్, కేఫ్ ప్రాంతాల్లోనూ ఉండేవారు. వీరు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉండేవారు. చివరకు బోయర్స్ వార్తో దక్షిణాఫ్రికా యావత్తూ బ్రిటిష్ వారి వశమయ్యింది. అయితే భారతీయుల న్యాయపరమైన హక్కుల రక్షణకే ఈ యుద్ధం చేశామని బ్రిటిష్ వారు చెబుతూ వచ్చారు. ఇష్టమైతే మరో ఐదేళ్లు దక్షిణాఫ్రికాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఖనిజ సంపద, వజ్రాలు పైకి తీయడానికి శ్వేత జాతీయులకు భారతీయ కూలీల సహాయం విధిగా కావాలి. కనుక భారతీయ కూలీలను కాంట్రాక్టు పద్ధతిమీద దక్షిణాఫ్రికా పంపడానికి ఇండియాలోని బ్రిటిష్ పాలకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటువంటి కాంట్రాక్టు కూలీల జట్టు ఒకటి 1860లో దక్షిణాఫ్రికా చేరింది. కాంట్రాక్టు కాల పరిమితి ముగియడంతోనే వారికి ఇష్టమయితే మరో అయిదు సంవత్సరాల పాటు తిరిగి కూలీలుగా కాంట్రాక్టు లో చేరవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణానికయ్యే ఖర్చుకు ఎంత భూమి లభిస్తుందో అంత భూమిని వారికే కేటాయిస్తారు. ఆ భూమిలో స్థిరపడి వారు అక్కడే సేద్యం చేసుకోవచ్చు. అలా స్థిరపడిన వారి అవసరాలు తీర్చడానికి అచిరకాలంలోనే భారతీయ వర్తకులు కూడా అక్కడ ప్రవేశించారు. ఆ విధంగా దక్షిణాఫ్రికాలో భారతీయ జనాభా పెరిగింది. అవసరం కోసం ఆసరా! 1969లో ఇంకా కూలీలను ఎగుమతి చేయాల్సి వచ్చినప్పుడు ‘కూలీ కాంట్రాక్టు కాల పరిమితి అయిపోవడంతోనే వారు ఆ దేశంలోని సాధారణ చట్టాలను అనుసరించి జీవించడానికి వీలుండాలనీ, ఏ విధమైన నిర్బంధాలు ఉండకూడదని’ బ్రిటన్ స్పష్టం చేసింది. 1858లో విక్టోరియా రాణి ప్రకటనలో కూడా ‘‘మన ఇతర దేశాల ప్రజల వలనే భారతీయులకు కూడా సమాన హక్కులుంటాయి’’అని హామీ ఇచ్చారు. భారతీయ వర్తకులు చౌకగా జీవించగలిగేవారు. అందువల్ల బ్రిటిష్ డచ్ వర్తకులకన్నా తక్కువ ధరకు సరుకులు అమ్మగలిగేవారు. దాంతో భారతీయ వర్తకులు యూరోపియన్ వర్తకులకు బాగా పోటీగా వున్నారని వారు గ్రహించారు. భారతీయ వ్యవసాయదారులు కొత్త రకాలైన కాయలను, పండ్లనూ, చౌకగానూ, విస్తారంగానూ పండించడం మొదలుపెట్టారు. అలా భారతీయుల్ని స్వేచ్ఛగా తమ దేశంలోనికి రానిచ్చినట్లయితే వారు వ్యవసాయంలోనూ, వ్యాపారం లోనూ తెల్లవారిని తుడిచి పెట్టేస్తారేమోనని వారు భయపడ్డారు. అందువల్ల భారతీయులపై అనేక ఆంక్షలను విధించడం ప్రారంభించారు. 1885 లో 3 వ నెంబరు చట్టాన్ని ట్రాన్స్ వాల్ లో ప్రవేశపెట్టారు. ఆసియా వాసులు.. ముఖ్యంగా భారతీయులు పారిశుధ్య కారణాల వల్ల వారికి ప్రత్యేకించబడిన ప్రాంతాలలోనే నివసించాలనీ, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో తప్ప స్థిరాస్తులను సంపాదించుకోకూడదని, వ్యాపారనిమిత్తం వచ్చేవారు లైసెన్సు పొంది రిజిస్టర్ చేయించుకుని రావాలని శాసించింది ప్రభుత్వం. ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతటా భారతీయుల మీద జాతి విద్వేషం, రైళ్లలోనూ, బస్సుల్లోనూ, స్కూళ్లలోనూ, హోటళ్లలోనూ అపారంగా పెరిగిపోయింది. పర్మిట్ లేకుండా భారతీయులను ఒక కాలనీ నుంచి మరో కాలనీకి పోనివ్వలేదు. భారతీయుల సంఖ్య హెచ్చుగా వున్న ‘నేతాల్‘ లో భారతీయుల ఓటు హక్కును రద్దు చేశారు. ఆ క్రమంలో గాంధీజీ ఓడలో దక్షిణాఫ్రికాలోని టయోటా రేవుకు చేరారు. ఓడ దిగక ముందే.. ‘మీరు తిరిగి వెళ్లిపోండి లేకపోతే సముద్రంలో ముంచేస్తాం, తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ ఇచ్చివేస్తాం‘ అని ఓడ ప్రయాణికులను అక్కడివారు హెచ్చరించారు. చివరకు పోలీసు వారి సహాయంతో ఓడ దిగగానే గాంధీజీ పై రాళ్ల దాడి జరిగింది. ఎలానో గాంధీజీ ని పోలీసులు ఇంటికి చేర్చారు. స్థానికులు గాంధీజీ ఇంటి ముందు చేరి ‘గాంధీ ని మాకు అప్పగించండి’ అని గొడవ చేశారు. ప్రిటోరియా లో గాంధీజీకి క్షవరం చేయడానికి క్షురకుడు కూడా నిరాకరించాడు. ఆ విధంగా న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో భారతీయుల కష్టాలను నివారించడానికి గాంధీజీ 21 సంవత్సరాలు పోరాటం చేయాల్సివచ్చింది. ఆ పోరాటం వల్లనే గిరిమిటియా సమస్య కూడా పరిష్కారమయ్యింది. 1914 లో గాంధీజీ భారత్‌కు తిరిగి వచ్చి అకుంఠిత దీక్షతో దక్షిణాఫ్రికా పోరాట అనుభవంతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 1947 లో భారత్ కు స్వాతంత్య్రాన్ని తీసుకురాగలిగారు. – డా. కాశింశెట్టి సత్యనారాయణ,విశ్రాంత ఆచార్యులు (చదవండి: సమర యోధుడు: అనుగ్రహ నారాయణ్ సిన్హా) -
పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
పెదకాకాని(గుంటూరు జిల్లా): చెల్లెలు వరుస అయిన యువతిని మాయమాటలతో మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన న్యాయవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలూరిపేట తూర్పు మాలపల్లికి చెందిన జంగా ప్రతాప్ 2019 నుండి గడ్డిపాడులోని తన చిన్నమ్మ దీనకుమారి ఇంటిలో ఉంటూ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతాప్ తల్లి, దీనకుమారిలు స్వయానా అక్కచెల్లెళ్ల పిల్లలు. గడ్డిపాడులోని దీనకుమారి కుమార్తె దొడ్డా రమాదేవి సిమ్స్ కళాశాలలో బిఫార్మసీ చదువుతుంది. చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. వరుసకు అక్కచెల్లెళ్ల పిల్లలు అయినప్పటికీ వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. జంగా ప్రతాప్ రమాదేవికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. 2021 ఆగస్టు నెలలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రోజు కూడా రమాదేవితో ఫోన్లో మెసేజ్‌ల రూపంలో సంభాషించాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంపై రమాదేవి నిలదీసింది. వరుసకు సోదరుడైన ప్రతాప్ చేసిన మోసానికి మనస్థాపానికి గురై 2021 సెప్టెంబరు నెలలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫోన్ సంభాషణలు, మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగుచూశాయి. జంగా ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాన్ని అంగీకరించాడు. నిందితుడు ప్రతాప్‌ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు తెలిపారు. -
పోలీసులది కట్టుకథ ప్లాన్ ప్రకారమే అంతా చేశారు..!!
-
సిర్పూర్కర్ కమీషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!!
-
దిశ ఎన్ కౌంటర్ తర్వాత హత్యచారాలు ఆగాయా ?? పోలీసులకు గుణపాఠం
-
దిశ ఎన్ కౌంటర్ కేసులో లాయర్ సంచలన నిజాలు..!!
-
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్...కట్టుకథే..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్టుగానే ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న పది మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ చేయాలని తమ నివేదికలో సిఫార్సు చేసింది. కమిషన్ జనవరి 28నే సీల్డు కవర్లో 387 పేజీల సుదీర్ఘ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయగా.. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ సెక్రటేరియట్ శుక్రవారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. కమిషన్ తమ నివేదికలో ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించిన అంశాలతోపాటు 15 సాధారణ సిఫార్సులు కూడా చేసింది. సత్వర న్యాయం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలివీ.. ‘‘పోలీసులపై దాడి కట్టుకథ! పోలీసు అధికారి సైదుపల్లి అరవింద్ గౌడ్‌ను జొల్లు శివ కర్రతో.. మరో పోలీసు అధికారి కె.వెంకటేశ్వర్లును జొల్లు నవీన్ రాళ్లతో కొట్టారని పోలీసుల రిపోర్టులో ఉంది. గాయాలైన పోలీసులను షాద్‌నగర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి కేర్ ఆస్పత్రికి తరలించినట్టు ఉంది. కానీ పోలీసు సిబ్బంది మెడికల్ రికార్డులో, మెడికో లీగల్ సర్టిఫికెట్లో వేర్వేరుగా గాయాల వివరాలున్నాయి. ఒక డాక్యుమెంట్లో వారిని కేర్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంటే.. మరోదానిలో ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేసినట్టు ఉంది. కేర్ ఆస్పత్రిలో చికిత్స విషయానికొస్తే.. ఒరిజినల్ రికార్డులన్నీ సిట్‌కు ఇచ్చారు. కానీ కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టలేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్ కూడా ప్రవేశపెట్టలేదు. నుదుటికి గాయమైన పోలీసుకు సంబంధించి ఒకచోట కుడివైపు అని, మరోచోట ఎడమవైపు అని రాశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయనేది, వారికి ఆస్పత్రిలో చికిత్స అందించారనేది అబద్ధం. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు అపహరించారనేది కట్టుకథ, నమ్మశక్యం కానిది. తుపాకీలను అపహరించారనడానికి ఆధారాలను రూపొందించారు. ఇద్దరు అధికారుల నుంచి తుపాకీలు అపహరించారని ఒకసారి.. ఒక అధికారి నుంచే అపహరించారని పోలీసుల తరఫు సాక్షి వేర్వేరుగా చెప్పారు. నిందితులు కాల్పులు జరిపే అవకాశమే లేదు పోలీసుల నుంచి నిందితులు తుపాకీ అపహరించారనే అంశంలోనూ అనుమానాలు ఉన్నాయి. పోలీసు బెల్టుకు ఉండే పౌచ్ బటన్ తీసి 9ఎంఎం పిస్టల్ ఎలా అపహరించగలిగారు? నిందితులకు ఆయుధాల నిర్వహణ తెలుసనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ సమయంలో సదరు పిస్టల్‌ను ఎలా నిర్వహిస్తారనేది అధికారులు చూపారు. ఆ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంది. తుపాకీలను ఉపయోగించడం తెలియని వ్యక్తి అంత సులభంగా వాడటం చాలా కష్టం. నిందితులు వాటిని వాడటం సాధ్యం కాదు. తుపాకీలో మేగజీన్ (బుల్లెట్లు ఉండే చాంబర్) లోడ్ పొజిషన్లో ఉందని అధికారులు చెప్తున్నారు. తుపాకీ కాల్చాలంటే పైభాగాన ఉన్న స్లయిడ్‌ను లాగడం ద్వారా చాంబర్లోకి బుల్లెట్ క్యాట్రిడ్జ్ వెళ్లేలా చేయాలి. సేఫ్టీ స్విచ్ ఎక్కడ అనేది సూచించే ఆధారాలు రికార్డుల్లో లేవు. శిక్షణ లేని వ్యక్తి సేఫ్టీ స్విచ్‌ను గుర్తించి తుపాకీ కాల్చడం సాధ్యం కాదని బాలిస్టిక్ నిపుణులు చెప్తున్నారు. నిందితులు ఆయుధాలు లాక్కొని వెంటనే కాల్పులు ప్రారంభించారన్న పోలీసుల ఆరోపణలు ఊహకు కూడా అందడం లేదు. పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారా? ఆత్మరక్షణ కోసమా? నిందితులను పట్టుకోవడానికి ప్రతీకార కాల్పులు ప్రారంభించారా అనేది అస్పష్టంగా ఉంది. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారనేది తేలలేదు. కాల్పులు నిజంగానే జరిగాయని చెప్తుండటంపై అనుమానం తలెత్తుతోంది. మృతి చెందిన నలుగురి మొండెం, తలపై తుపాకీ గాయాలున్నాయి. అవి పరిశీలిస్తే పోలీసులు స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్టుగా విశ్వసించాల్సి వస్తోంది. ఎన్నో అంశాల్లో వ్యత్యాసాలు.. ఘటన ప్రాంతానికి సంబంధించి కొన్ని వీడియో ఫుటేజీలు కమిటీకి అందాయి. అవి ఒక ఆర్డర్లో లేవు. పైగా నిడివి తక్కువగా ఉన్న క్లిప్పింగ్‌లు. అవి ప్రాథమిక ఫుటేజీ నుంచి సేకరించినట్టుగా ఉన్నాయి. కమిషన్ ముందు పూర్తి ఫుటేజీ ఎందుకు ప్రవేశపెట్టలేదో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. సెక్షన్ 161 సీఆర్పీసీ కింద ఒకే సాక్షి వాంగ్మూలాన్ని పదేపదే ఎందుకు సేకరించారో కూడా చెప్పలేదు. మృతదేహాలను తరలించిన బస్సుకు సంబంధించి పలు లాగ్‌బుక్స్ ఉన్న అంశంపైనా సమాధానం లేదు. గాయపడిన పోలీసులకు సంబంధించి ఆస్పత్రిలో రికార్డు లేకపోవడం, ఖాళీ అయిన బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు అన్నీ తిరిగి సేకరించకలేకపోవడం, ఘటనాస్థలం నుంచి కాల్చి న బుల్లెట్లనూ సేకరించలేకపోవడం వంటివాటిని కేవలం దర్యాప్తులో లోపాలుగా చెప్పలేం. మృతదేహాలు, ఇతర వస్తువుల స్థానాల్లో కీలక తేడాలు, విచారణ నివేదికలు, క్రైం సీన్ పంచనామాల్లో వ్యత్యాసాలు చూస్తుంటే పోలీసుల వాదన నమ్మశక్యం కాదని నిర్ధారణ అవుతోంది. కస్టడీ అనుమతిలోనూ చట్ట ఉల్లంఘన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించే సమయంలోనూ తీవ్రమైన చట్ట ఉల్లంఘన జరిగినట్టు తేలింది. ఎలాంటి పత్రాలను పరిశీలించకుండానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ముందు ప్రొసీడింగ్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గానీ, పోలీసు అధికారిగానీ లేరు. ఏసీపీ వి.సురేందర్ స్థానంలో ఓ కానిస్టేబుల్ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సందర్భంగా అజ్మల్ కసబ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన సూచనలను గుర్తుంచుకోవాలి. బెయిల్ కోసం దరఖాస్తు/పోలీసు రిమాండ్‌ను వ్యతిరేకించడం/జ్యుడీషియల్ కస్టడీని వ్యతిరేకించడం వంటి అంశాల్లో నిందితులకు న్యాయ సలహా అవసరం. ఘటన నాటికి ముగ్గురూ మైనర్లే.. జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ మైనర్లు.. పాఠశాల రికార్డులను పరిశీలించినప్పటికీ పోలీసులు వారి వయసును నమోదు చేయలేదు. మరణించే నాటికి ముగ్గురు మైనర్లేనని వారి బంధువులు కూడా పేర్కొన్నారు. ఆధార్ కార్డుల్లోనూ వారి పుట్టిన సంవత్సరం 2001గా నమోదై ఉంది. ఆధార్‌కార్డు పుట్టినతేదీకి అధికారిక రుజువు కాదు. ఈ నేపథ్యంలో పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో నమోదు చేసిన విధంగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ప్రాథమిక పత్రంగా ఉండాల్సింది.’’ నిందితులను చంపే ఉద్దేశంతోనే.. రికార్డుల్లోని అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం.. నిందితులు 6.12.2019 నాటి ఘటనలో ఆయుధాలను లాక్కోవడం, కస్టడీ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేయడం, పోలీసులపై దాడి, కాల్పులు జరపడం వంటివి చేయలేదని నిర్ధారించాం. రెండో విషయం ఏమిటంటే నిందితులు 9ఎంఎం పిస్టల్‌తో కాల్చడమనే సందర్భమే తలెత్తలేదు. నిందితులంతా బుల్లెట్ల గాయాల కారణంగానే మరణించారు. వారిపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపిన పోలీసు అధికారుల చర్యలను సమర్థించడానికి వీల్లేదు. షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను 302 ఐపీసీ కింద విచారణ చేయాలి. ఈ అధికారులు ఐపీసీ సెక్షన్ 76, సెక్షన్ 300 ఐపీసీ (3) నుంచి మినహాయింపు పొందలేరు. ఎందుకంటే వారు నిందితులపై కావాలనే కాల్పులు జరిపారనే వాదన నమ్మదగినది. దీని ప్రకారం.. వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్.. ఈ పది మందినీ కూడా ‘సెక్షన్ 302 రెడ్ విత్ 34 ఐపీసీ, 201 రెడ్ విత్ 302 ఐపీసీ, 34 ఐపీసీ’ల కింద విచారించాలి. వేర్వేరు చర్యలు చేసినప్పటికీ నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే వారు ఉన్నారు. ఆ పది మంది పోలీసులు కూడా నలుగురు నిందితులను సురక్షితంగా ఉంచే బాధ్యత కలిగిన వారే. ఏవైనా చర్యలు లేదా లోపాలు ద్వారా ఆ బాధ్యతలో విఫలమైతే.. నిందితుల మృతి పట్ల ఉమ్మడి ఉద్దేశం ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాదు ఎన్కౌంటర్ తర్వాత రికార్డులు తారుమారు చేయడంలో వారి ప్రవర్తన, నిందితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన తీరు చూస్తే వారి ఉమ్మడి ఉద్దేశం స్పష్టమవుతోంది. మాబ్ లించింగ్ (మూక దాడి) ఆమోదయోగ్యం కాదు. అదే విధంగా తక్షణ న్యాయం వంటి ఆలోచన కూడా ఆమోదయోగ్యం కాదు. ఏ సమయంలోనైనా చట్టం నియమాలు బలంగా ఉండాలి. నేరానికి శిక్ష అనేది చట్టం ఏర్పాటు చేసిన విధానం ద్వారానే ఉండాలి. పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టాలి విచారణ సమయంలో గమనించిన అంశాల మేరకు పలు సాధారణ సిఫార్సులు చేయాల ని నిర్ణయించినట్టు కమిషన్ నివేదికలో పే ర్కొంది. ఈ మేరకు 15 సిఫార్సులు చేసింది. ∙మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ∙ శాంతిభద్రతల నుంచి దర్యాప్తు విభాగాన్ని వేరు చేయాలి. ∙అరెస్టు సమయంలో రాజ్యాంగ, చట్టపరమైన అంశాలను తప్పనిసరిగా పాటించాలి. ∙దర్యాప్తు మొత్తం వీడియో రికార్డు చేయాలి. ∙ పోలీసుల శరీరానికి కెమెరాలు పెట్టాలి. ∙ అన్ని కేసుల్లోనూ సీసీ టీవీ ఫుటేజీని తప్పనిసరిగా సేకరించాలి. ∙సాక్షుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. ∙క్రైం సీన్‌పై ఫోరెన్సిక్ నిపుణులకు పూర్తి బాధ్యత అప్పగించాలి. ∙అన్ని ఫోరెన్సిక్ ఆధారాలను వరుస క్రమంలో భద్రపర్చాలి. ∙ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్వహించడాన్ని నివారించాలి. ∙పోలీసు కస్టడీకి దరఖాస్తు చేసిన ప్రతీసారి నిందితుడిని హాజరుపర్చేలా మేజిస్ట్రేట్ ఆదేశించడాన్ని తప్పనిసరి చేయాలి. ∙పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నిందితులకు నోటీసులు జారీ చేయాలి. ∙ సెక్షన్ 176(1–ఏ) కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, 1973 కింద మేజిస్టీరియల్ విచారణ చేయాలి. ∙దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు మీడియా సమావేశాలు నిర్వహించాలి. ∙అసత్య సాక్ష్యాలకు సంబంధించి చర్యలను సరళీకృతం చేయాలి. ఇది కూడా చదవండి: దిశ కేసు హైకోర్టుకు బదిలీ -
రాజీవ్ గాంధీ హత్య కేసు: న్యాయవాది లేకుండానే తన కేసును వాదించుకున్న ఖైదీ
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్ వేలూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఇతని భార్య నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై కాట్పాడిలోని బ్రహ్మపురంలో ఉంటోంది. ఈనేపథ్యంలో తన బంధువులతో కలిసి మాట్లాడేందుకు 6 రోజుల పెరోల్ ఇప్పించాలని మురుగన్ జైలు అధికారులకు వినతిపత్రం అందజేశాడు. అయితే మురుగన్ గదిలో సిమ్‌కార్డు దొరకడం, మహిళా పోలీసుల వద్ద అసభ్యంగా నడుచుకోవడం, వాట్సాప్ వీడియోలో ఇతర దేశాల్లోని బంధువులతో మాట్లాడిన కేసులు పెండింగ్‌లో ఉన్నందున జైళ్లశాఖ పెరోల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగన్ ఈనెల 2వ తేదీ నుంచి దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి జైలులోని వైద్యాధికారులు తరచూ మురుగన్‌కు గ్లూకోస్ ఎక్కిస్తున్నారు. అయితే వాట్సాప్‌లో ఇతర దేశాలకు ఫోన్లో మాట్లాడిన కేసుపై మురుగన్ సోమవారం సాయంత్రం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ వేలూరు కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించిన సాక్షిగా.. జైలు కానిస్టేబుల్ తంగమాయన్ హాజరయ్యారు. ఆ సమయంలో న్యాయవాది లేకుండా మురుగన్ నేరుగా అతని కేసును వాదించుకున్నాడు. జైలు కానిస్టేబుల్ తంగమాయన్‌ను సుమారు అర్ధగంట పాటు మురుగన్ క్రాస్ ప్రశ్నలు వేశారు. అనంతరం ఈ కేసును న్యాయవాది పద్మకుమారి వాయిదా వేశారు. అనంతరం మురుగన్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది -
వీడియో: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్
భోపాల్: ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది. భారతి పటేల్(23) అనే ఆవిడ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్ భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలో ఆమె తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్ వెంటపడి మరీ దాడి చేశాడు. భగవాన్, భారతి పటేల్ వెంట పడుతూ కోర్టు సముదాయంలోనే చితకబాదాడు. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గురువారం ఈ ఘటన జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు భగవాన్ సింగ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ తెలిపారు. Shameful... Lawyer ran and beat woman in Shahdol court premises, woman's child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj — Subham Anand (@anand_subham1) May 6, 2022 -
భార్యను వదిలేసి స్వాతి టీచర్‌తో న్యాయవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్!
సాక్షి, చైతన్యపురి: కన్న కొడుకును చిత్రహింసలు పెట్టాడని భార్య ఫిర్యాదుతో ఓ న్యాయవాదిపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆర్డర్‌పై తన వద్ద ఉన్న కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారని న్యాయవాది ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువురిపై కేసులు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్స్ కాలనీలో నివసించే న్యాయవాది దేవులపల్లి సంతోష్‌కుమార్‌కు ఉమామహేశ్వరితో 11 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి అర్షిత్‌సాయి (10), కల్యాణ్‌సాయి (8) కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది. నాలుగు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇద్దరు కుమారులను సంతోష్‌కుమార్ తన వద్దకు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఉమామహేశ్వరికి ఫోన్‌కాల్ వచ్చింది. తప్పిపోయిన మీ కుమారుడు తమ వద్ద ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఉమామహేశ్వరికి తన పెద్ద కుమారుడు అర్షిత్‌సాయి కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉన్నాయి. తనను తండ్రి సంతోష్‌కుమార్, ఆయనతో పాటు ఉంటున్న టీచర్ స్వాతి తనను చిత్రహింసలు పెట్టారని తల్లికి వివరించాడు. స్వాతి టీచర్ గరిటెతో పొట్టపై వాతలు పెట్టిందని, తండ్రి బెల్ట్‌తో కొట్టాడని చెప్పటంతో ఉమామహేశ్వరి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై కోపంతో తమ కుమారుడిని చిత్రహింసలు పెట్టిన భర్త సంతోష్‌కుమార్, స్వాతిపై చర్యలు తీసుకోవాలని కోరింది. చదవండి: కూతురిపై కన్నేసిన తండ్రి.. కాపాడిన సవతి తల్లి తన కుమారుడు అర్షిత్ సాయిని తాము చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవం కాదని.. కోర్టు అనుమతితో తీసుకొచ్చిన తన కుమారుడిని ఉమామహేశ్వరి, ఆమె సోదరుడు శివకుమార్ బలవంతంగా తీసుకెళ్లారని సంతోష్ కుమార్ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మాధవరావు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యే పేరుతో ఉన్న కారు బీభత్సం.. స్పందించిన బోధన్ ఎమ్మెల్యే -
సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు.. కలకలం రేపుతున్న వ్యక్తి ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ.. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని , అంతేకాకుండా సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీనిపై ముంబయి కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపిస్తూ.. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం కల్పితాలని సల్మాన్ న్యాయవాది కోర్టుకు వివరించాడు. అయితే ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారమని, అందుకోసమే సల్మాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలియజేశాడు. కాగా, సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. -
న్యాయం చేయాల్సిన వాడే కన్నేశాడు
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ లాయర్ సాయం కోసం వచ్చిన యువతిపై కన్నేశాడు. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆ యువతి(25)కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. తను ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. కాగా తన భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకునేందుకు సిద్దమైంది. దాంతో గతేడాది జూన్‌లో స్థానికంగా ఉండే ఓ లాయర్‌ను కలిసింది. తన భర్తతో విడాకులు ఇప్పించమని కోరింది. ఇక ఇదే అదనుగా భావించాడు ఆ లాయర్. అతని కన్ను ఆ యువతిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఓ రోజు తన ఆఫీస్‌కు రప్పించుకున్నాడు. అలా ఆ యువతితో చనువు పెంచుకున్నాడు. అయితే అప్పటికే భర్త నుండి దూరంగా ఉండాలని భావించిన సదరు యువతి ప్రస్తుతం తాను ఉన్న ఇంటి నుంచి మరో ఇంటికి మారాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్ తాను నివసించే ప్రాంతంలో ఓ ఫ్లాటుందని చెప్పడంతో అతడ్ని నమ్మిన యువతి ఫ్లాట్‌లోకి వచ్చి చేరింది. ఇక ఇక్కడే ఆ లాయర్ తన వంకర బుద్దిని చూపించాడు. తానొక ప్రోఫెషనల్ వృత్తిలో ఉన్న విషయం కూడా మరిచిపోయి ఆ ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే వీడియోలను బాధితురాలికి చూపించి తనను బెదిరించి శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇలా తరచూ తన లైంగిక వాంఛను తీర్చుకోసాగాడు. ఇక అప్పటికే తన భర్త కారణంగా మానసిక ఆందోళనకు గురైన తనను ఇలా ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నా అతడు ఆమెను వదల్లేదు. అయితే అతడి వేధింపులు శృతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.. -
బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేకుండా సుప్రీంకోర్టు న్యాయవాది
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘డూ యూ నో.. ఐయామ్ ఏన్ అడ్వకేట్ ’అంటూ బీచ్‌రోడ్‌లో కొంతకాలంగా మతిస్థిమితం లేని ఓ మహిళ అందరినీ పలకరిస్తూ కనిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీఎస్సార్ కాంప్లెక్‌లోని నిరాశ్రయుల వసతిగృహం మేనేజర్ జ్యోతిర్మయి గురువారం సాయంత్రం వరకు ఆమె కోసం వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బీచ్‌రోడ్డులోని బీట్ కానిస్టేబుళ్లకు ఆమె వివరాలు తెలియజేసి.. ఆచూకీ తెలిసిన వెంటనే తమకు చెప్పాలని కోరారు. శుక్రవారం ఉదయం ఆమెను గుర్తించిన పోలీసులు.. వసతి గృహానికి సమాచారం ఇచ్చారు. బీచ్‌రోడ్‌లో మతిస్థిమితం లేని ఆ మహిళ టీ తాగుతుండగా మేనేజర్ మాటామాట కలిపారు. దీంతో ఆమె ‘డూ యూ నో.. ఐయామ్ ఏన్ అడ్వకేట్’అంటూ సెక్షన్లు చకచకా చెప్పటం మొదలు పెట్టింది. అలా నెమ్మదిగా ఆమెను ఆటో ఎక్కించి.. టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని మహిళల నిరాశ్రయ వసతి గృహానికి తీసుకువచ్చారు. ఆమెకు సపర్యలు చేసి దుస్తులు అందజేశారు. ఆహారం పెట్టి ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేని మహిళ ఆళ్ల రమాదేవి ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ఆమె పేరు ఆళ్ల రమాదేవి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ డైరెక్టరీలో నమోదు అయినట్లుగా తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ నంబర్ ఎ–00380, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ నంబర్ డబ్ల్యూబీ/345/1995, బ్లాక్ నంబర్ 55, సౌత్ గణేష్‌నగర్ పి.ఒ అండ్ పీఎస్, శంకర్పూర్, ఢిల్లీ–110092, ఫోన్ నంబర్లు: 98117 36864, 98736 32929 ఉన్నాయని గుర్తించారు. ఆమె అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. రక్షణ కల్పించారు. ఆమెను మానసిక ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జ్యోతిర్మయి తెలిపారు. చదవండి: (Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!) -
పొరుగింటి లాయర్‌పై కక్షతో..
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన డీఆర్డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్ వశిష్ట్ స్థానిక అశోక్ విహార్ ఫేజ్–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక వేశాడు. మార్కెట్లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్ బాక్స్ బాంబు తయారు చేశాడు. ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్ హాజరయ్యే కోర్ట్ నంబర్ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను శనివారం అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. -
వీల్‌చైర్‌లో వకీల్ సాహెబా..
కొత్తగూడెం టౌన్: చదువుకు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించిన ఓమహిళ తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలు మౌనిక ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా మంగళవారం తన ప్రాక్టీస్ ప్రారంభించారు. వీల్‌చైర్‌లో జిల్లా కోర్టుకు వచ్చిన ఆమెకు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. సవాళ్లను అధిగమించి విజయం సాధించిన మౌనిక అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. -
ఆస్తి తగాదాలు.. సొంత అక్కను కిచెన్‌లోకి తీసుకెళ్లి..
సాక్షి, గోల్కొండ( హైదరాబాద్): ఆస్తి తగాదాలతో సొంత అక్కను అంతమొందించిన నలుగురు సోదరులు, ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...టోలిచౌకి ఆడమ్స్ కాలనీకి చెందిన రైసా బేగం హైకోర్టులో న్యాయవాది. ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా సోదరులు మహ్మద్ ఆరిఫ్ అలీ (38), మహ్మద్ రవూఫ్‌అలీ (40), మహ్మద్‌ఆసిఫ్ అలీ (37), మహ్మద్ అసన్ అలీ (36)తో రైసా బేగంకు తండ్రి ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ నలుగురు మహ్మద్ ఆరిఫ్ అలీ భార్య సనీనా బేగం (37) తో కలిసి రైసా బేగంను హతమార్చి అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా మహ్మద్ ఆరిఫ్ అలీ గత నెల 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రైసా బేగం వద్దకు వచ్చారు. ఆస్తుల విషయం పై ఇరువురిమధ్య వాగ్వాదం జరిగింది. కాగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ...మహ్మద్ ఆరిఫ్ అలీ సోదరి రైసా బేగంను కిచెన్ లోకి తీసుకెళ్లి కిందకపడుకోబెట్టి వంట కత్తితో గొంతుకోశాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గోల్కొండ అదనపు ఇన్స్పెక్టర్ ఎస్ మట్టంరాజు నిందితులను శనివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
మహిళపై అత్యాచారం.. నగ్నఫొటోలతో బ్లాక్మెయిల్
తిరువొత్తియూరు: విడాకుల కోసం ఆశ్రయించిన మహిళపై అత్యాచారం చేసి నగ్నఫొటోలతో బ్లాక్మెయిల్ చేసిన న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరువళ్లూర్ సమీపంలోని మనవాళనగర్‌కు చెందిన వివాహిత విడాకులు తీసుకోవడానికి తిరువళ్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది డార్జన్ (44)ని కలిసింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ఇంటికి వచ్చి తీసుకుంటానని న్యాయవాది చెప్పాడు. ఆ తర్వాత మహిళ ఇంటికి వెళ్లిన డార్జన్ శీతలపానియంలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో నగ్న ఫొటోలను తీశాడు. అనంతరం అత్యాచారం చేశాడు. నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి రూ.7 లక్షలు వసూలు చేశాడు. నగదు కోసం పలుమార్లు ఆమెకు బెదిరింపులు ఇచ్చాడు. దీనిపై ఆమె తిరువళ్లూరు మహిళా కోర్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొడైక్కెనాల్లో ఉన్న డార్జన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
ఘోరం: కేసు వాదనకు వచ్చి రాజస్థాన్ లాయర్ దుర్మరణం
కరీంనగర్: ఓ కేసు విషయమై న్యాయస్థానంలో వాదించేందుకు వచ్చిన రాజస్థాన్ న్యాయవాది మృతి చెందారు. కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన న్యాయవాది రాజేశ్ కుమార్ (45) ఓ కేసు విషయమై వాదించేందుకు కరీంనగర్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయిన లాయర్ రాజేశ్ అక్కడి నుంచి ట్యాక్సీలో కరీంనగర్ బయల్దేరారు. మార్గమధ్యలో రేణికుంటకు చేరుకోగానే అతివేగంతో వెళ్తున్న ట్యాక్సీ అదుపు తప్పి స్టేషనరీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన న్యాయవాది రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాక్సీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాదిపై ఆయుధాలతో దాడి
ముంబై: ఓ స్థలం వివాదం విషయంలో వాదోపవాదనలు వినిపిస్తున్న న్యాయవాదిపై కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పట్టపగలు నడిరోడ్డుపై 15- 20 మందికి పైగా దాడి చేయడంతో ఆ న్యాయవాది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ న్యాయవాది ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన న్యాయవాది సత్యదేవ్ జోషి ఓ స్థలం వివాదంపై కేసు స్వీకరించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో తన సహాయకుడు అంకిత్ టాండన్‌తో కలిసి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు న్యాయవాది కారును వెంబడించి పశ్చిమ ముంబైలోని దహిసర్ ప్రాంతంలో అడ్డగించారు. కత్తులు, ఇనుప రాడ్లతో సత్యదేవ్ జోషిపై దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏకంగా 14 మంది ఉండడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఆ ముఠా దాడికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న ఎంహెచ్‌బీ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు బొరివలీకి చెందిన వారుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. నిందితులు మూకుమ్మడిగా న్యాయవాదిపై దాడి చేస్తున్న దృశ్యాలు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. -
సోషల్ మీడియా పోస్ట్.. రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. ట్విస్ట్ ఏంటంటే
కోల్‌కతా: ఒక వ్యక్తి తాను.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ అధికారినంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాస్త వైరల్ గా మారింది. దీంతో అతడిని కలకత్తా పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు, సనాతన్ రే అనే వ్యక్తి కోల్కత్తా హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఆయన గతకొంత కాలంగా తన ఫేస్బుక్లో.. తాను సిబీఐ అధికారినంటూ నకిలీ ప్రోఫైల్ తయారు చేశాడు. అంతటితో ఆగకుండా, సిబీఐ అధికారులకు మాత్రమే ఉండే నీలిరంగు టాగ్‌ను తన వాహనానికి పెట్టుకున్నాడు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ లో పనిచేస్తున్నట్లు పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో, కోల్కత్తా స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్(సిట్) సనాతన్రేను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, సనాతన్ రే హైకోర్ట్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు బయట పడింది. దీంతో, సిబీఐ అధికారినంటూ మోసంచేశాడని సిట్ విచారణలో తెలింది. కాగా, సిట్ అధికారులు, సనాతన్రే పై.. ప్రభుత్వాధికారినంటూ మోసం చేయడం, ఫోర్జరీ, నేర పూరిత చర్య వంటి పలు అభియోగాల కింద కేసులను నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
Career Guidance: న్యాయవాదిగా రాణించాలంటే..?
కెరీర్లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి? ► నైపుణ్యాలుంటే.. చక్కటి అవకాశాలు లభించే కోర్సు.. లా! గతంలో న్యాయ విద్య కోర్సులు అభ్యసించిన వారు కోర్టులకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు కార్పొరేట్ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనా పటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్. ► ఇంటర్మీడియెట్/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్ఎల్బీ/బీకామ్ ఎల్ఎల్బీ/ బీఎస్సీ ఎల్ఎల్బీ/బీబీఏ ఎల్ఎల్బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లా స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్– ఇండియా(ఎల్‌శాట్–ఇండియా); టీఎస్‌లాసెట్/ఏపీలాసెట్ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు. ► అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పొస్టు గ్రాడ్యుయేషన్‌లో.. సివిల్/క్రిమినల్/ కార్పొరేట్/ఎన్విరాన్మెంటల్/కాన్స్టిట్యూషనల్/సైబర్/ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/రియల్ ఎస్టేట్ లా/మీడియా లా/ఇంటర్నేషనల్/బిజినెస్ లా/ట్యాక్స్‌లా.. ఇలా పలు స్పెషలైజేషన్స్ చేయవచ్చు. డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ -
3 నెలలు: అనేక మలుపులు తిరిగిన దంపతుల హత్య కేసు
సాక్షి, మంథని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య జరిగి నేటికి సరిగ్గా మూడు నెలలు గడిచింది. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇబ్బంది సృష్టిస్తున్నారనే కోణంలో న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై కొందరు పట్టపగలే కత్తులతో నరికి చంపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోగలిగారు. గ్రామ కక్షలతోనే తాము హత్యలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అయితే ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు విన్నవించింది. హత్య జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను కనిపెట్టడం పోలీసులకు సులువుగా మారింది. తనపై కత్తులతో దాడి చేసింది కుంట శ్రీను అని హత్యకు గురైన వామన్‌రావు వెల్లడించిన విషయం కూడా వీడియోలో రికార్డు అయింది. హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించారు. అయితే ఈ జంట హత్యలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటినుంచే ఈ హత్యల్లో పుట్ట మధు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు అనేక కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేసు పలుమలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ మధు మెడకు చుట్టుకుంటుందా..? అనే ప్రచారం కూడా జరిగింది. చార్జీషీటు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం రేపింది. అకస్మాత్తుగా జెడ్పీ చైర్మన్ అదృశ్యం కావడంతో కేసు మరింత జఠిలంగా మారింది. వారంరోజులపాటు మధు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పోలీసులు మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మధుతోపాటు ఆయన భార్య పుట్ట శైలజ, మరికొందరిని కూడా విచారించారు. విచారణపై హైకోర్టు పర్యవేక్షణ న్యాయవాద దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. జంట హత్యల కేసును తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణ కోసం కరీంనగర్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే హైకోర్టుకు లేఖ రాసింది. చార్జీషీట్ సిద్ధం న్యాయవాద దంపతుల హత్య జరిగిన నేటికి 90 రోజులు కావస్తుండడంతో పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపి పకడ్బందీగా చార్జిషీట్‌ను తయారు చేసినట్లు తెలిసింది. అందులో ఇంకా ఎవరైనా నిందితుల పేర్లను చేర్చుతారా..? లేదా ఇప్పటివరకు ఉన్నవారినే చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం హత్యల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో కోర్టులో చార్జీషీట్ సమర్పించే అవకాశం ఉంది. చదవండి: లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో అనుమానితుడిగా అరెస్టయిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం, అరెస్టు సంచలనంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజం మార్చిలోనే పడినట్లు అర్థమవుతుంది. పుట్ట, అతని అనుచరులకు సంబంధించి మార్చిలోనే బలమైన ఆధారాలు లభించాయి. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయంలో ఇద్దరు కీలక పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఆధారాలు చేరడంతో మంథనిలో పరి ణామాలు వేగంగా మారాయి. అనేక ఆకస్మిక మా ర్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నుంచి పరిణామాలను పరిశీలిస్తే ఇవన్నీ అవగతమవుతాయి. ఏరోజు ఏం జరిగిందంటే..? ► మార్చి 26: మంథని కోర్టులో బిట్టు శ్రీనుతో వీడియో కాల్ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు. ► మార్చి 31: 2018లో కుంట శ్రీను ఓ హత్యకు రూ.60 లక్షల సుపారీ మాట్లాడిన ఆడియో టేపుపై ఫోరెన్సిక్ విచారణ కోసం పోలీసుల పిటిషన్ ► ఏప్రిల్ 3: మంథని ఇన్స్పెక్టర్గా ఉన్న మహేందర్ బదిలీ. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ► ఏప్రిల్ 16: ఐజీ నాగిరెడ్డికి గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు లేఖ. పుట్ట మధు, పుట్ట శైలజ, పూదరి సత్యనారాయణల పాత్రలపై లోతుగా దర్యాప్తు జరపాలని వినతి. ► ఏప్రిల్ 29: మధు కీలక అనుచరుల్లో ఒకరి విచారణ ► ఏప్రిల్ 30: విచారణకు రావాలని మధుకు నోటీసులు. అదేరోజు రాత్రి నుంచి మధు అదృశ్యం. ► మే 1: మధు కోసం గాలింపు మొదలు. ► మే 6: మంథని నియోజకవర్గంలో ఉన్న రామగిరి, ముత్తారం, బసంత్‌నగర్, మంథని ఎస్సైల బదిలీ. ► మే 7: మంథని ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి బదిలీ ► మే 8: మధు ఏపీలోని రాజమండ్రి సమీపంలో ఉన్నట్లు గుర్తింపు. ► మే 9: భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అదేరోజు సాయంత్రానికి రామగుండం కమిషనరేట్‌కు చేరుకున్నారు. ► మే10: మధును విచారించిన పోలీసులు. గుంజపడుగులో అక్రమ నిర్మాణాల వద్ద గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక ఆధారాలే కీలకం.. ఈ కేసులో మొదటి నుంచి పుట్ట మధు పేరు బలంగానే వినిపిస్తోంది. మార్చిలో దర్యాప్తు వేగం పుంజుకుంది. మే 17న చార్జిషీటు దాఖలు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలోనే పుట్ట మధును విచారణకు పిలవడం గమనార్హం. ఈ క్రమంలో పుట్ట మధు, అతని భార్య పుట్ట శైలజ, మార్కెట్ కమిటీ చైర్మ¯Œ పూదరి సత్యనారాయణలు విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పోలీసులు పలు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. అవి ఏంటంటే..! ► ఫిబ్రవరి 17న గట్టు వామన్ రావు హత్య జరిగిన తరువాత.. నిందితులు కుంట శ్రీను, బిట్టు శ్రీనులు మాట్లాడిన కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) కీలకం కానుంది. ఈ వివరాలు పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. ► వామన్‌రావు మరణవాంగ్మూలం వీడియోలు కూడా కీలకం కానున్నాయి. అందులో ఓ వీడియోలో పుట్ట మధు పేరునూ చెప్పినట్లు ఉంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. ► కుంట శ్రీను రూ.60 లక్షలకు 2018లో సుపారీ ఎవరితో మాట్లాడాడు? అతడు దొరికితే ఎవరి హత్యకు సుపారీ మాట్లాడారు? అన్న విషయాలు వెలుగుచూస్తాయి. ► గుంజపడుగులో శ్రీను అక్రమ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ గతంలో అభ్యంతరం తెలిపింది. అయినా పనులు ఆగలేదు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. బిట్టు శ్రీను వాడిన కారు వివరాలు ఏడాదైనా నంబర్‌ప్లేటు ఏదీ? బిట్టు శ్రీను హత్యకు ఉపయోగించిన కారు విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మారుతీ బ్రిజా కారును 2020 ఫిబ్రవరిలో కొన్నారు. అదే నెల 24న టీఎస్22ఈ1288 నంబరుతో పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వాహనం బిట్టు శ్రీను భార్య తులసిగారి స్వరూప పేరు మీద ఉంది. ఏడాది కిందటేరిజిస్ట్రేషన్ చేసినా హత్య జరిగేరోజు వరకు టెంపరరీ రిజిస్ట్రేషన్ తోనే బిట్టు శ్రీను సంచరించాడు. అదే విధంగా కారుకు ఉన్న నల్ల అద్దాల షీట్ కూడా తీయలేదు. వాస్తవానికి వాహనం అద్దాలకు నల్లఫిల్మ్ ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ కారు కొనుగోలు వెనక ఎవరున్నారు? ఎవరు సమకూర్చారు? అన్న విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
సూసైడ్ నోట్: లాయర్ ఆత్మహత్య.. యోగా టీచర్ హత్య
చెన్నై: భార్య దూరమయ్యింది. పదేళ్ల బిడ్డతో ఒంటరిగా ఉంటున్నాడు. బాధితులకు న్యాయం చెప్పాల్సిన లాయర్ అయ్యుండి.. క్షణికావేశంలో ఓ తప్పు చేశాడు. ఆ తర్వాత తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పదేళ్ల బిడ్డను ఒంటిరి చేసి వెళ్లాడు. ఈ విషాద సంఘటన మధురైలో చోటు చేసుకుంది. సదరు లాయర్ రాసిన సూసైడ్ నోట్ కనిపించకుండా పోయిన ఓ యోగా టీచర్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలు.. లాయర్‌గా పని చేస్తున్న హరిక్రిష్ణన్ అనే వ్యక్తి తన పదేళ్ల కుమార్తెతో కలిసి మదురైలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమలో మంగళవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. హరిక్రిష్ణన్ ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ మరో మిస్సింగ్ కేసు పరిష్కరించడానికి సాయం చేసింది. మిస్సింగ్ కేసు వివరాలు... మదురైకి చెందిన చిత్రదేవి యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గత నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు. దాంతో చిత్రదేవి తండ్రి ఏప్రిల్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగా టీచర్ తండ్రి కన్నయ్య మదురైలోని తిరుమంగళంలో పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక దాన్ని సీఎం సెల్‌కు ఫార్వర్డ్ చేసి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాక తన కుమార్తెకు, లాయర్ హరిక్రిష్ణన్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్స్‌ను పోలీసులకు అందించాడు. చిత్రదేవి తండ్రి వీటిని పోలీసులకు ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మంగళవారం హరిక్రిష్ణన్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సూసైడ్ నోట్లో ఏం ఉంది.. హరిక్రిష్ణన్ ఇంటి దగ్గర లభించిన సూసైడ్ నోట్లో అతడు చిత్రదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమెను చంపి.. తన ఇంటి బాత్రూమ్లో సమాధి చేసినట్లు వెల్లడించాడు. క్షణికావేశంలో ఘాతుకం చేసినప్పటికి ఆ తర్వాత అతడు స్థిమితంగా ఉండలేకపోయాడు. చేసిన తప్పుకు బాధపడుతూ.. తనను తాను క్షమించుకోలేక ఆత్మహత్యచేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో తెలిపాడు. చదవండి: ‘న్యాయవాద దంపతులది ప్రభుత్వ హత్యే’ -
తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో కలకలం రేపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశముంది. ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు. -
వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
-
వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
పాట్నా: కరోనామహమ్మారి కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం కల్పించాయి. ఈ క్రమంలో చాల మంది కంపెనీల మీటింగ్స్, స్నేహితులతో , ఇంట్లోవారితో మాట్లాడటానికి వీడియో కాల్నే ఉపయోగిస్తున్నారు. అయితే, ఇది కొన్నిసార్లు నవ్వును కూడా పుట్టిస్తుంది. తాజాగా, పాట్నాకు చెందిన ఒక న్యాయవాది , సోలీసిటరీ జనరల్‌ల మధ్య వీడియోకాల్‌లో సెషన్ జరుగుతొంది. ఈ క్రమంలో లాయర్‌కు బాగా ఆకలేసినట్టుంది. వెంటనే తనకు నచ్చిన చపాతి తెప్పించుకొని తినడం మొదలెట్టేశాడు. అయితే వీడియోకాల్ ఆఫ్ చేయడం మరిచిపోయాడు. అప్పుడు ఆన్లైన్లో జడ్జి ప్రత్యక్ష మయ్యాడు. లాయర్‌ను చూసి నవ్వుకుంటూ నాక్కుడా చపాతి పంపు అని సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు బుర్ర పనిచేయాలంటే తిండి కూడా ముఖ్యమే...ఆకలేస్తే అంతే మరీ! అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: నల్లపులి, చిరుతల ఫైటింగ్! -
న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్‌రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండటంతోపాటు అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్‌పై వామన్‌రావు గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే మంథని మున్సిపల్ చైర్మన్, మధుకర్ భార్య శైలజ ఎన్నికను సవాల్ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్‌డెత్‌గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్‌రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్ నంబర్ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
న్యాయవాది తలకు గురిపెట్టిన గన్ ఎవరిది?
హిమాయత్‌నగర్: భూ వివాదంలో న్యాయవాదిపై జరిగిన హత్యాయత్నంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా మలక్‌పేటకు చెందిన వైద్యుడికి, ఓ వ్యక్తికి మధ్య భూమికి సంబంధించిన వ్యవహారంపై వాగ్వివాదం జరిగింది. ఆ భూమి ఎలాగైనా తనకే దక్కాలని మలక్‌పేటకు చెందిన డాక్టర్ మాలిక్.. హిమాయత్‌నగర్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌సింగ్ చౌదరిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యాయవాది.. ఆ వ్యక్తితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడంటూ డాక్టర్ మాలిక్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. ఫైల్ అడిగి దాడికి యత్నం.. ఈ నెల 16న హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–7లో నివాసం ఉండే సిద్ధార్థ్‌సింగ్ చౌదరి వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చారు. అపార్ట్మెంట్ వాచ్‌మన్‌కు తాము న్యాయవాదిని కలిసేందుకు వచ్చామని చెప్పి 2వ అంతస్తులోని సిద్ధార్థ్ సింగ్‌చౌదరి వద్దకు మాస్కులు, గ్లౌజులు ధరించి వెళ్లారు. వెళ్లగానే డాక్టర్ మాలిక్ ఫైల్ కావాలని అడిగారు. మీరెవరంటూ న్యాయవాది ప్రశ్నించాడు. ఆలోపే దుండగులు గన్ తీసి న్యాయవాది తలకు గురిపెట్టారు. కత్తులతో పొడిచేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే న్యాయవాది అరుస్తూ.. వారి నుంచి తప్పించుకుని బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చాడు. అతడి అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు, చుట్టుపక్కల వారు రావడంతో.. ఆ ముగ్గురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల అదుపులో నిందితులు! అప్పటికే సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడి చేసేందుకు పాల్పడ్డ దుండగులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు నిందితులు సంఘటనా స్థలానికి కారులో వచ్చారు. ఇద్దరు కారులోనే ఉండగా.. సిద్ధార్థ్ ఇంటిలోకి ముగ్గురు మాత్రమే వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. న్యాయవాది ఇంటి నుంచి 7 బుల్లెట్లు, నాలుగైదు కత్తులను, చిన్నపాటి రాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సుపారీ ఇచ్చిన వైద్యుడు ఘటన జరిగిన వెంటనే డాక్టర్ మాలిక్‌పై సిద్ధార్థ్ చౌదరి ఫిర్యాదు చేశారు. డాక్టర్‌కు సంబంధించిన వారే తనపై దాడి చేశారని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో డాక్టర్ మాలిక్‌కు, మరో వ్యక్తికి మధ్య వివాదం నడుస్తోందని చోటు చేసుకుంటున్నాయి. ఈ భూమి తనదంటే తనదంటూ.. ఇద్దరి మధ్యా కొంతకాలంగా వాగ్వివాదం జరుగుతోంది. అయితే ఈ కేసులో ఎలాగైనా గెలిచి ఆ భూమి దక్కించుకోవాలని డాక్టర్ మాలిక్.. సిద్ధార్థ్ సింగ్ చౌదరిని ఆశ్రయించారు. అయితే న్యాయవాది, తన ప్రత్యర్థితో కుమ్మక్కై కేసు ఓడిపోయేలా చేశాడని డాక్టర్ కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదిని అంతమొందించేందుకు ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. వైద్యుడిని ఈ కేసునుంచి తప్పించేందుకు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ గన్ ఎవరిది..? ఈ ఘటనలో లభ్యమైన గన్ ఎవరిదనే దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. పోలీసులను దీనిపై ప్రశ్నించగా.. వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నా.. ఈ విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేవు. దీంతో సమీపంలోని రెండు కిరాణా దుకాణాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, కారులో ఉన్న మరో ఇద్దరు ఏమయ్యారు.. అసలు ఎందరు అరెస్టయ్యారు..నిందితులను రిమాండ్‌కు పంపారా అనే విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వట్లేదు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! 3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి.. -
లాయర్ దంపతుల హత్య.. రెండు గంటల్లోనే స్కెచ్
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌వేసి.. అమలు చేశారు. తలనొప్పిగా మారిన న్యాయవాది వామన్‌రావును హతమార్చాలని ఎప్పటి నుంచో మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. అయితే కుంట శ్రీనుకు 2 గంటల్లోనే పూర్తి సహకారం అందించి ‘కథ’ముగించింది మాత్రం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను. ఈ నెల 17న ఉదయం 11.30 గంటల తర్వాత న్యాయవాద దంపతులు మంథని కోర్టుకు వచ్చి మధ్యాహ్నం 1.30–2 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 2.30 గంటల ప్రాంతంలో రామగిరి మండలం కల్వచర్ల వద్ద దాడి జరిగింది. వామన్‌రావు దంపతులు కోర్టుకు వచ్చిన తర్వాతే మర్డర్ ప్లాన్ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వామన్‌రావు కోర్టులో ఉన్నంత సేపు అతడి కదలికలను ఎప్పటికప్పుడు నిందితుడు కుంట శ్రీనివాస్‌కు చేరవేయగా, బిట్టు శ్రీనుతో కలసి ఎక్కడ చంపాలనే విషయమై ప్లాన్ చేసి, అమలు చేశారు. కోర్టు దగ్గర రోజూ రెక్కీ తన ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాడని, మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధును ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే కసితో వామన్‌రావును హతమార్చాలని కుంట శ్రీనివాస్ కొంతకాలంగా వేచి చూస్తున్నాడు. గుంజపడుగులో గుడి వివాదం పెరగడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వస్తాడనే ఉద్దేశంతో వారం నుంచి కోర్టు వద్ద రోజుకో మనిషిని ఉంచుతున్నాడు. అందులో భాగంగానే బుధవారం కూడా తన మనిషిని కోర్టు వద్ద ఉంచగా, వామన్‌రావు దంపతులు వచ్చిన విషయాన్ని 12.30 గంటల సమయంలో కుంట శ్రీనివాస్‌కు చేరవేసినట్లు తెలిసింది. అప్పటికే సీఎం జన్మదిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో పాటు పలు గ్రామాల్లో పాల్గొన్న శ్రీనివాస్ మంథనికి చేరుకున్నాడు. వామన్‌రావు వచ్చిన విషయం తెలిసిన వెంటనే మధు మేనల్లుడు.. బిట్టు శ్రీనును కలిసినట్లు తెలుస్తోంది. వామనరావును చంపేందుకు అనువైన స్పాట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. వామన్‌రావు గుంజపడుగుకు వెళ్తే చంపాల్సిన స్పాట్‌తో పాటు హైదరాబాద్ వెళ్తే ఎక్కడ ప్రాణాలు తీయాలో స్కెచ్ వేశారు. బిట్టు శ్రీనుకు చెందిన నల్ల కారును హత్య కోసం వాడుకోవాలని నిర్ణయించుకుని, డ్రైవర్‌గా వీరికి నమ్మకస్తుడైన చిరంజీవిని పిలిపించారు. బిట్టు శ్రీనునే మంథనిలో కొడవళ్లు, కత్తులు అమ్మే దగ్గర రెండు కత్తులు కొని కారులో పెట్టాడు. మూడో నిందితుడు అక్కపాక కుమార్‌ను పిలిపించి తెల్ల కారును ఇచ్చి కోర్టు దగ్గర రెక్కీ కోసం పంపారు. మంథని చౌరస్తాలో నల్లకారుతో కుంట శ్రీనివాస్, చిరంజీవి వేచి ఉన్నారు. 2 గంటల సమయంలో వామనరావు కారు హైదరాబాద్‌కు బయల్దేరుతుందన్న సమాచారం కుమార్ నుంచి రాగానే కల్వచర్ల స్పాట్‌కు వెళ్లి కారు నిలుపుకొన్నారు. వామన్‌రావు కారు రాగానే నల్లకారు అడ్డుగా పెట్టి నరికేశారు. సాక్ష్యం ఉండకూడదనే నాగమణి హత్య వామన్‌రావును చంపాలనే కుంట శ్రీనివాస్ ప్లాన్ వేసినా.. కారులో నాగమణి కూడా ఉండటంతో సాక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమెను కూడా హతమార్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపినట్లు సమాచారం. వామన్‌రావు కారు దిగగానే కుంట శ్రీనివాస్ ఎదురుగా దూసుకెళ్లగా, చిరంజీవి మాత్రం నాగమణి కూర్చున్న వెనుక సీటు వైపు వెళ్లి మెడపై ఒక్క వేటు వేసినట్లు సమాచారం. నాగమణి చనిపోగానే చిరంజీవి కూడా రోడ్డు మీదకు వచ్చి వామన్‌రావుపై దాడి చేశారు. మెడపై, కడుపులో గాయాలతో వామన్‌రావు చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది. చదవండి: (మాయమైపోతున్న మనిషి!) బిట్టు శ్రీను అరెస్టు నాలుగో నిందితుడైన పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కేస్ రీకన్స్ట్రక్షన్ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు ముందు నిందితులను హాజరుపరిచినట్లు సమాచారం. బిట్టు శ్రీనుతో మారిన సీన్ హత్య జరిగిన రోజు వచ్చిన వీడియోలో వామన్‌రావును కుంట శ్రీనివాస్‌తో కలసి కుమార్ చంపినట్లు భావించారు. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్ కూడా ‘సాక్షి’తో చెప్పారు. అయితే కుంట శ్రీనివాస్‌ను విచారించిన తర్వాత బిట్టు శ్రీను ప్రమేయం వెలుగులోకి రావడం, డ్రైవర్ చిరంజీవితో కలసి హత్య చేసినట్లు పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. వామన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకే తొలుత ఎఫ్ఐఆర్లో వసంతరావు, కుంట శ్రీనివాస్, కుమార్‌లను నిందితులుగా చూపించామని, ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ చెప్పిన మాటలతో ఎఫ్ఐఆర్లో చిరంజీవిని, బిట్టు శ్రీనును చేర్చినట్లు శుక్రవారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వివరించారు. పుట్ట మధుకు చుట్టుకుంటోందా? జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్వయాన మేనల్లుడు అయిన బిట్టు శ్రీనును శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మధు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు మంథని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేనల్లుడు శ్రీను.. పుట్ట మ«ధుకు చేదోడు వాదోడుగా ఉంటూ పుట్ట లింగమ్మ ట్రస్టు వ్యవహారాలతో పాటు ఆయన కుటుంబంలో కీలకసభ్యుడిగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు గ్రామ కక్షలుగా పరిగణించిన పోలీసులు కుంట శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో రాజకీయ కోణంపై దృష్టి సారించి.. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకోవడంతో కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం న్యాయవాదుల హత్యలపై సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. జంట హత్యల విషయంలో ప్రతిపక్షాలు దాడి ముమ్మరం చేసిన నేపథ్యంలో వివరాలను సీఎం కేసీఆర్.. డీజీపీని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కాగా, మామ పుట్ట మధుకర్‌కు తెలియకుండా బిట్టు శ్రీను ఏ పనీ చేయడన్న పేరుంది. అలాంటప్పుడు పోలీసు విచారణలో బిట్టు శ్రీను పేరు తెరపైకి రావడం.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మధు చుట్టూ హత్య కేసు ఉచ్చు చుట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: (కారు, కత్తులు సమకూర్చింది అతడే..) వీడియో తీసినవారి కోసం ఆరా న్యాయవాద దంపతుల హత్యకు రెండు వీడియోలు పోలీసులకు కీలకంగా మారడంతో ఆ వీడియోలు చిత్రీకరించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి చేసిన అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావును ఓ వ్యక్తి పలకరించగా మొదట పుట్ట మధు పేరు చెప్పి అటు తర్వాత కుంట శ్రీనివాస్ పేరు.. గ్రామం పేరు చెప్పినట్లు వీడియోలో ఉంది. వామన్‌రావు మరణ వాంగ్మూలంగా పోలీసులు ఆ రికార్డును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రికార్డులో పుట్ట మధు పేరు వినిపిస్తుండటంతో ఆ రికార్డుపై పోలీసులు దృష్టి సారించారు. ఇంకేమైనా వీడియోలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. -
టూల్‌కిట్ వివాదం: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి,న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్‌తో రాజుకున్న టూల్ కిట్ వివాదం మరింత ముదురుతోంది. 'టూల్‌కిట్ కేసు'లో దిశా రవిని అరెస్టు చేసిన ఢిలీ పోలీసులు మరో కీలక చర్య చేపట్టారు. ముంబై హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్, శాంతనులపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం స్పెషల్ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లినపుడు, ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించినట్లు తెలిపారు. కానీ ఆ రోజు సమయాభావం వల్ల నికితను ప్రశ్నించలేదు. మళ్లీ వస్తామని చెప్పామనీ, అప్పటినుంచి నికిత పరారీలో ఉందని ఆరోపిస్తూ వారెంట్ ఇష్యూ చేశారు. నికితా జాకబ్, దిశా రవి ఇతరులు పాల్గొన్న ఒక జూమ్ సమావేశంలో రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, నిరసన కారుల్లో ఆందోళనన పెంచేందుకు కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిశా రవి అరెస్ట్‌ను ఖండించారు. ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడి అని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే థన్‌బర్గ్‌పై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు పర్యావరణ, సామాజిక కార్యకర్త దిశా రవిని ఆదివారం అరెస్ట్ చేశారు. దేశద్రోహ కుట్ర కేసు నమోదు చేసి ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బెంగళూరు ఐటీ సిటీకి చెందిన దిశా రవి రైతు ఆందోళనకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన టూల్ కిట్‌ను దిశా రవి అప్లోడ్ చేశారు. దీని వెనుక ఖలిస్థాన్ అనుకూల సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే టూల్‌కిట్ డాక్యుమెంట్‌లోని రెండు లైన్లను మాత్రమే తాను ఎడిట్ చేశానని దిశా పోలీసు విచారణలో వెల్లడించారు. డాక్యుమెంట్‌లోని అంశాలు అభ్యంతకరంగా ఉన్నందున దానిని తొలగించాలంటూ థన్‌బర్గ్‌ను కోరారని వివరణ ఇచ్చారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో కీలక వ్యక్తిగా దిశ ఉన్నారు. దిశా రవి అరెస్టుపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా కేంద్రం తీసుకొచ్చి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారితీసింది. ఎర్రకోటపై జెండా ఎగురవేయడం వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా గ్రెటా ట్వీట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులు టూల్ కిట్‌ని రూపొందించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. (రైతు ఉద్యమం : దీప్ సిద్దూ అరెస్టు) చదవండి : రైతు ఉద్యమం : వారికి భారీ ఊరట Arrest of 21 yr old Disha Ravi is an unprecedented attack on Democracy. Supporting our farmers is not a crime. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 15, 2021 -
శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని..
ముంబై : శిష్యురాలికి కారు డ్రైవింగ్ నేర్పాలనే ప్రయత్నం ఓ గురువును ఆమెతో పాటు జైలు పాలుచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, వాసై ఈస్ట్ ఫాధర్‌వాడి.. విజయ్ రెసిడెన్షీకి చెందిన లాయర్ బీరేంద్ర మిశ్రా, అతడి శిష్యురాలు వర్షా మిశ్రాకు ఆదివారం కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. మధువన్ ఏరియాకు చేరుకోగానే కారు ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న ఇంద్రేశ్ యాదవ్ కిందపడి స్పృహ కోల్పోయాడు. ( ‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’) దీంతో యాదవ్ చనిపోయాడని భావించిన ఇద్దరు అతడి బాడీని ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే దగ్గర పడేశారు. అయితే యాదవ్‌ను కారులోంచి కిందకు తీసి రోడ్డు పక్కన పడేయటాన్ని ఓ వ్యక్తి చూశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ లాయర్
ఒక వయసు వచ్చాక శరీరంలో వచ్చిన మార్పులు అర్థం కాలేదు..ఇంటి నుంచి, సమాజం నుంచి వచ్చే ఛీత్కారాలు ఎందుకో అర్థం కాలేదు..తనలా ఉండేవారితో కలిసిపోవడానికి వచ్చినవారి ప్రవర్తన అర్థం కాలేదు..అర్థమైంది ఒక్కటే... చదువు మాత్రమే తనకు మనుగడ ఇస్తుందని. తను నమ్ముకున్న చదువే యాచన నుంచి న్యాయవాదిగా మార్చింది. పాకిస్థాన్ మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా స్థానం పొందింది. మన దేశంలో మూడేళ్ల క్రితం జోయితా మొండల్ మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ న్యాయవాదిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ ‘మొదటి’ స్థానాన్ని పాకిస్థాన్‌లో నిషారావు సొంతం చేసుకుంది. సమాజంలో థర్డ్ జెండర్ తన సత్తా చాటుతోంది అని నిరూపిస్తోంది.రెండు రొట్టెల కోసం పాట్లుతన కృషికి ఫలితం లభించినందుకు ఈ రోజు నిషా సంతోషంగా ఉంది. కానీ, ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు సామాన్యమైనవి కావు. 28 ఏళ్ల నిషా మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తనలో వచ్చిన మార్పులకు ఇంటి నుంచి నిరాదరణ, సమాజం నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంది. భరించలేక మరో ఇద్దరు ట్రాన్స్జెండర్లతో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. తనలా ఉండే ట్రాన్స్జెండర్లతో కలిసి కరాచీకి వెళ్లింది. కానీ, తినడానికి తిండి లేక చాలా కష్టాలు పడింది. ‘రోజుకు రెండుసార్లు రొట్టెలు కావాలంటే సెక్స్ వర్కర్ కావాలని సలహా ఇచ్చారు తోటి వాళ్లు. కానీ, ఆ పని నాకు నచ్చలేదు. అదే విషయాన్ని చెప్పి యాచనవైపు వెళ్లాను’ అని చెప్పింది నిషా. ట్రాఫిక్ లైట్ల నుంచి లా కాలేజీ వరకుజీవనోపాధి కోసం ట్రాఫిక్ లైట్ల వద్ద యాచించడం ప్రారంభించింది. ఛీత్కారాలూ భరించింది. ‘కానీ కొన్ని రోజులకు ఈ పని కూడా నచ్చలేదు. అప్పుడే చదువుకోవాలనుకున్నాను. గౌరవమైన జీవనం కావాలనుకున్నాను. ఈ ఆలోచన రాగానే స్కూల్ చదువుతో ఆపేసిన చదువును తిరిగి కొనసాగించాను’ అని తెలిపింది నిషా. పగటిపూట యాచించడం, రాత్రిళ్లు చదువుకోవడం.. ఇదే ఆమె దినచర్యగా మారింది. 2018లో నిషా సింధ్ ముస్లిం లా కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. రావు ఇప్పటివరకు 50 కేసులను వాదించింది. ఆమె క్లయింట్లలో చాలామంది ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. లింగమార్పిడి ప్రజలకు వారి హక్కులను పొందడానికి ప్రయత్నిస్తున్న ఒక ఎన్జీఓ కోసం కూడా ఆమె పనిచేస్తోంది.ట్రాన్స్‌జెండర్స్ ఓల్డేజీ హోమ్యాచన చేసే ట్రాన్స్‌జెండర్ నయాబ్ మాట్లాడుతూ.. ‘నిషా మాతో యాచించడం ద్వారా జీవించేది. కానీ ఈ రోజు తన వల్ల మేమూ ఉత్తమ స్థితిలో ఉన్నాం. ఆమె మాకు అన్ని సమయాలలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అర్ధరాత్రి కూడా ఆమె నుండి సహాయం కోరినా ఎప్పుడూ నిరాకరించదు. ట్రాన్స్‌జండర్లు ముసలివాళ్లు అయ్యాక వారిని పట్టించుకునేవారే ఉండరు. ఆ వయసు వారు ఎంతో దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. అందుకే వారి కోసం ఓ ఓల్డేజీ హోమ్‌ను నిర్మించాలనుకుంటుంది’ అని వివరించింది. చదువు జీవనగతిని మార్చుతుంది. చదువు ఉన్నతస్థితికి చేర్చుతుంది. చదువు జాతి, మత, కులాలకు అతీతంగా ఎదిగేందుకు ఊతం ఇస్తుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు నిషారావు వంటివారు. -
తల్లి విజయం: నటి భావోద్వేగం
అహనా కుమ్రా బాలీవుడ్ నటి, మోడల్. టీవీ సీరీస్‌లలోనూ రాణిస్తోంది. అమితాబ్‌బచ్చన్‌తో కలిసి చేసిన యుద్ద్ టెలివిజన్ సీరీస్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా ద్వారా గుర్తింపు పొందింది. అక్టోబర్ 31న అహనా కుమ్రా ట్విటర్లో చేసిన పోస్ట్‌కు బాలీవుడ్ తారాగణంతో పాటు మరెందరో ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే, ఆ ప్రశంసలన్నీ ఆమె తల్లి సురేష్ బాల్యన్ కుమ్రా గురించి. 40 సంవత్సరాలు పోలీసు అధికారిగా పనిచేసిన బాల్యన్ పదవీ విరమణ పొందిన తర్వాత ఖాళీగా కూర్చోలేదు. 68 ఏళ్ల వయసులో ఎల్ఎల్బి పరీక్షలో 90 శాతం మార్కులు సాధించి న్యాయవాదిగా మారింది. తల్లి సాధించిన విజయాన్ని గురించి అహనా కుమ్రా ప్రస్తావిస్తూ ‘కలలను నెరవేర్చడంలో వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదని మీరు నిరూపించారు. లక్షలాది మందికి ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిచ్చారు. నాకు తెలిసి 34 సంవత్సరాల క్రితం లక్నోలోని కైసర్ బాగ్ కొత్వాలిలో పోలీసు అధికారిగా నియమితులయ్యారు. ముంబైలోని సిబిఐతో విజయవంతం గా పనిచేశారు. రాష్ట్రపతి పతకం పొందారు. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది ఆ తర్వాత వారణాసిలో పనిచేసి, పదవీ విరమణ పొంది ఇంటికి వచ్చారు. ఇంతవరకే మీ గురించి మాకు తెలిసింది. పదవీ విరమణ తర్వాత మీరు, పాపా ఇంట్లో విశ్రాంతిగా కూర్చుని టీవీ చూడటం లేదని ఇప్పుడే మాకు అర్ధమైంది మీ హార్డ్ వర్క్‌తో ఎన్నో గంటలను చదువుకు కేటాయించారు. ఇప్పుడు 90 శాతం మార్కులతో ఎల్ఎల్బీని విజయవంతంగా పూర్తి చేశారు. నా జీవితంలో మీరు తప్ప వేరే ప్రేరణ అవసరం లేదు. 68 సంవత్సరాల వయస్సులో న్యాయవాదిగా మారినందుకు మీ గురించి చాలా గర్వపడుతున్నాను వకీల్ సాహిబా’ అంటూ తల్లి విజయాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది అహనా కుమ్రా. రక్షణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన బాల్యన్ ఈ జీవితంలో ఎప్పటికీ విశ్రాంతి లేదని, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని నిరూపించింది. చదువుకు వయసు అడ్డంకి కాదని కళ్లకు కట్టింది. బాల్యన్ లాంటి నిన్నటి తరం మహిళలు నేటి తరానికి మరింత బలమైన అడుగుగా మారుతున్న తరుణం ఇది. -
హాథ్రస్ ఘటన: అంతా ఆ నలుగురి వైపే
ఆరేళ్లు నడిచింది నిర్భయ కేసు. హాథ్రస్‌కి ఇంకా నడకే రాలేదు. అసలు నడవనిచ్చేలానే లేరు! కోర్టుకు వెళ్తేనే కదా తొలి అడుగు. ఆ అడుగునే పడనివ్వడం లేదు. ఊళ్లోకి దారులన్నీ మూసేశారు. కొన్ని నోళ్లను కూడా!! ‘నిర్భయ’ లాయర్ వచ్చారు. ‘పో.. పోవమ్మా’ అని ఆపేశారు. ఆమె ఆగిపోతారనా?! నిర్భయ లాయర్ మాత్రమే కాదు.. లాయర్ నిర్భయ కూడా.. సీమ! తల్లీకూతుళ్లు పంట పొలంలో పచ్చిక కోస్తున్నారు. కోస్తూ కోస్తూ కూతురు కొంచెం దూరం వెళ్లింది. చిన్నపిల్లేం కాదు, ‘ఎక్కడుందో?’ అని తల్లి వెతుక్కోడానికి. పందొమ్మిదేళ్ల యువతి. సమయం గడిచింది. అలికిడి లేదు. అప్పుడు అనుమానం వచ్చి తలతిప్పి చూసింది. చూపు ఆనే దూరంలోనూ కూతురు కనిపించలేదు. కూతురు స్లిప్పర్స్ మాత్రం కనిపించాయి. తల్లి గుండె గుభేల్మంది. స్పిప్లర్స్ కనిపించాక, మనిషిని ఈడ్చుకెళ్లిన జాడలు కనిపించాయి. ‘తల్లీ’.. అని కూతురు ఏ లోకాన ఉన్నా వినిపించేలా అరచి, ఆక్రోశించింది తల్లి గుండె. సెప్టెంబర్ 14 న ఇది జరిగింది. సామూహిక అత్యాచారంలో ప్రాణం కోసం కొట్టుకుని కొట్టుకుని సెప్టెంబర్ 29 న ఆసుపత్రిలో ఆ కూతురు కన్నుమూసింది. తల్లిని కూడా దగ్గరికి రానివ్వకుండా పోలీసులే కూతుర్ని దహనం చేశారు! హాథ్రస్ ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా. ఆ జిల్లాలోని బుల్గడీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామంలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. సీమ ‘నిర్భయ’ కేసు లాయర్. ఆ కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష పడి, నిర్భయకు కొంతైనా న్యాయం జరిగిందంటే ఆమె వల్లనే. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. హాథ్రస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు! ‘‘ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు’’ అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’’ అని జిల్లా మేజిస్ట్రేట్ అంటున్నారు! జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హాథ్రస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియా ను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్‌లోకే అడుగు పెట్టనివ్వడం లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టాక జిల్లా ఎస్పీని, మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం మాత్రమే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు దక్కిన న్యాయం. ఈ తరుణంలో హాథ్రస్ కేసును తను వాదించడానికి ముందుకు వచ్చిన సీమా సమృద్ధికీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కేసును చేపట్టాలని సీమ కృతనిశ్చయంతో ఉన్నారు. మృతురాలు చనిపోయే ముందు ఆసుపత్రిలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను బట్టి ఆమెపై జరిగింది కేవలం దాడి మాత్రమే కాదు, అత్యాచారం కూడా అని రుజువు చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బహిరంగ సాక్ష్యంగా ఉంది. వీడియో వరకు ఎందుకు? మృతురాలి తల్లి మాటలు చాలవా?! ‘‘ఈడ్చుకెళ్లిన జాడల వైపు నడుచుకుంటూ వెళ్లాను. ఓ చోట నా కూతురు స్పృహలో లేకుండా పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. నోట్లోంచి రక్తం కారుతోంది’’ అని ఆమె చెప్పిన నాలుగు ముక్కలు చాలు సీమ ఆ కేసును వాదించడానికి. సీమది కూడా ఉత్తరప్రదేశే. అక్కడి ఎటావా స్వస్థలం. తండ్రి బలాదిన్ ఖుష్వహ.. బిధిపూర్ గ్రామ మాజీ సర్పంచి. కూతుర్ని ఆమె ఇష్ట ప్రకారం ‘లా’ చదివించాడు. లా తర్వాత జర్నలిజం, పొలిటికల్ సైన్ కూడా చదివారు సీమ. 2012లో నిర్భయ ఘటన జరిగే నాటికి ఆమె ఇంకా విద్యార్థినిగానే ఉన్నారు. తర్వాత రెండేళ్లకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ నలుగురికీ ఉరిశిక్ష పడాల్సిందేనని గట్టిగా వాదించినప్పుడు తొలిసారిగా ఆమె పేరు దేశానికి తెలిసింది. కేసు నడుస్తున్నప్పుడు ‘నిర్భయ జ్యోతి ట్రస్టు’కు ఆమె సలహాదారుగా ఉన్నారు. ఆ ట్రస్టును నెలకొల్పింది నిర్భయ తల్లిదండ్రులు. అత్యాచార బాధితుల న్యాయపోరాటాలకు ఆర్థికంగా తోడ్పాటును అందివ్వడం ట్రస్టు ధ్యేయం. మిగతా సామాజిక అంశాలలో కూడా సీమ చురుగ్గా ఉన్నారు. నిర్భయ దోషులు చట్టంలోని వెసులుబాట్లను ఉపయోగించుకుని చివరి వరకు బయట పడాలని చూసినట్లే, వారిని ఉరికంబం ఎక్కించేందుకు సీమ చివరి వరకు ప్రయత్నించి నిర్భయకు కనీస న్యాయం జరిపించారు. ఇప్పుడీ హాథ్రస్ కేసు స్వీకరించడం కూడా తన ధర్మం అని ఈ న్యాయవాది మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. -
నాకు ట్విటర్ అకౌంట్ లేదు: రియా లాయర్
ముంబై: తనకు ఎలాంటి ట్విటర్ ఖాతా లేదని నటి రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మనేష్ షిండే శనివారం వెల్లడించారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఓ నకిలీ సమచారం సతీష్ మనేష్ షిండే పేరుపై ట్విటర్లో వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని స్ఫస్టం చేశారు. ‘డియర్ ఫ్రెండ్స్.. ట్విటర్‌తో ఇటీవల నా పేరుపై వచ్చిన ఖాతా నాది కాదు. అది నకిలీ ఖాతా. దీనిని ఎవరో అభిమాని క్రియోట్ చేసి ఉంటారని భావిస్తున్నాను. దీని నుంచి వచ్చే నకిలీ సమాచారం, వార్తలకు నేను బాధ్యుడిని కాదు. త్వరలోనే దీనిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని తెలిపారు. సుశాంత్ కేసులో రియా తరపున ఆయన కోర్టు వాదిస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో నేర నిరూపణ కావడంతో రియాను ముంబై మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్స్ కేసులో రియాకు షాక్) ఈ క్రమంలో రియా బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించిన అనంతరం ఆమెను ముంబై హైకోర్టు తరలించవచ్చని షిండే శుక్రవారం తెలిపారు. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తాము హైకోర్టును సంప్రదించడంపై నిర్ణయం తీసుకుంటామని షిండే పేర్కొన్నారు. డ్రగ్ కేసులో నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో అధికారులు రియాను ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ తప్పుడుగా తనను ఈ కేసులో ఇరికించారని రియా తన పిటిషన్లో పేర్కొంది. ఎన్సీబీ అధికారులు ఈ కేసులో తనను ఇరికించేలా తనను బలవంతం చేసి ఒప్పించారని ఆరోపించింది. విచారణ సమయంలో తాను చేసిన నేరాంగీకార ప్రకటనను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ కేసులో సెప్టంబర్ 8న అరెస్టు అయిన రియాను సెప్టెంబర్ 22 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపారు. (చదవండి: రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ) -
మాజీ అడ్వొకేట్ జనరల్ మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండె నొప్పితో నేడు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. రామచంద్రరావు మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. -
కుల్‌భూషణ్ కేసు: లాయర్‌ను నియమించొచ్చు
ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం సమర్పించిన పిటిషన్‌ను ఆ దేశ హైకోర్టు సోమవారం విచారించింది. కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అంతేగాక పాక్ సమర్పించిన రివ్యూ పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ గురువారం విచారిస్తుందని కోర్టు తెలిపింది. అనంతరం పాక్ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కోర్టు భారత్‌కు అనుమతినిచ్చింది. (అడుగడుగునా అడ్డుకున్నారు) కోర్టు రెండు ఆప్షన్స్ ఇచ్చింది. మేం కులభూషణ్ తరఫున న్యాయవాదిని మార్చవచ్చు. లేదా భారత్ అతడి తరఫున ఒక న్యాయవాదిని నియమించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. అయితే కేవలం పాక్ న్యాయవాదులను మాత్రమే నియమించుకునేందుకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. మా దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్నవారిని మాత్రమే కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిగా నియమించడానికి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతానికి భారత న్యాయ ప్రతినిధి ఇంకా ఎవరినీ నియమించలేదు. ఏం జరగనుందో చూడాలి’ అని తెలిపారు. కాగా, కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించాలని కోరుతూ పాక్ జూలై 22న ఇస్లామాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు భారత ప్రభుత్వంతో సహా ప్రధాన పార్టీలను పాక్ సంప్రదించలేదు. -
‘రియాను ఈ రోజు అరెస్ట్ చేస్తారు’
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు హీరో స్నేహితురాలు రియా చక్రవర్తి మీద పట్నాలోని రాజీవ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం ఆరుగురి మీద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం సుశాంత్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. వారు సుశాంత్ తండ్రి మీద ఒత్తిడి తెస్తున్నారు. కేసులో భాగంగా పోలీసులు ఓ 5-6 పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల మీద ఆరోపణలు చేయాలని సుశాంత్ కుటుంబం మీద ఒత్తిడి తెచ్చారు. ఈ కేసుకు, పోలీసులు సూచిస్తోన్న ప్రొడక్షన్ హౌస్‌లకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ప్రొడక్షన్ హౌస్‌లకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయాల్సిన అవసరం సుశాంత్ కుటుంబానికి లేదు’ అన్నారు వికాస్ సింగ్. (ప్రశాంతంగా ఉండు సుశీ...) #Exclusive | Lawyer of Sushant's family Vikas Singh tells TIMES NOW: • No FIR was registered by Mumbai Police • Mumbai cops are pressuring family • Crime has been committed over a period of time • FIR filed after help from Bihar CM Nitish Kumar | #IndiaDemandsSushantTruth pic.twitter.com/WkMUUc9nrA — TIMES NOW (@TimesNow) July 29, 2020 రియా, సుశాంత్‌ను తండ్రితో మాట్లాడనివ్వలేదు వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘అంతేకాక ముంబై పోలీసులు రియాను వదిలి పెట్టండి.. ప్రొడక్షన్ హౌస్‌ల మీద ఆరోపణలు చేయండి అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు మీద ఒత్తిడి తెస్తున్నారు. ముంబై పోలీసులు కేసును దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. లాజికల్ ఎండ్ కోసం ప్రయత్నించడం లేదు. రియా వచ్చాకే సుశాంత్ కుటుంబ సభ్యులు అతడిని కలవలేకపోయారు. నేరం కూడా అప్పుడే ప్రారంభమయ్యింది. రియా ఉద్దేశపూర్వకంగానే సుశాంత్‌ను కొంతకాలం పాటు అతడి తండ్రితో మాట్లాడకుండా ఆపింది. ఈ పరిస్థితులను చూసి ఆందోళన చెందిన సుశాంత్ కుటుంబ సభ్యులు అతడి చుట్టూ ఉన్నవారు మంచి వారు కారని ఫిబ్రవరి 25న బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుశాంత్ కుటుంబం రియాపై సుదీర్ఘమైన కేసు నమోదు చేసింది. ఆమె అతడి మనస్సును ఎలా చేంజ్ చేసింది.. సుశాంత్ ఇంట్లో పని చేసేవారిని, బాడీ గార్డులను మార్చిన అంశం గురించి.. అతడి అకౌంట్ నుంచి డబ్బును ఎలా డ్రా చేసింది.. అతడి క్రెడిట్ కార్డ్స్‌ను ఎలా వాడుకుంది వంటి అంశాల గురించి పోలీసులకు తెలిపారు’ అన్నారు వికాస్ సింగ్. (‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’) సుశాంత్ వాడే మందులను ఆమె నిర్ణయించేది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ‘అంతేకాక సుశాంత్ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు.. కుర్గ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు రియా, సుశాంత్ వెంట లేదు. అతడిని విడిచి పెట్టింది. నిజంగా ఆమె అతడిని జాగ్రత్తగా చూసుకుంటే.. ఎలా వదిలేసి వెళ్తుంది’ అని సుశాంత్ లాయర్ ప్రశ్నించాడు. అంతేకాక ‘రియా అతడిని వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. వైద్యం చేయించింది. కానీ సుశాంత్ కుటుంబ సభ్యులకు దీని గురించి ఏం తెలియదు. వారు ఎప్పుడు అతని వెంట ఆస్పత్రికి వెళ్లలేదు. చివరకు అతను ఏ మందులు తీసుకోవాలన్నది కూడా రియానే నిర్ణయించింది. మా అనుమానం ఏంటంటే సుశాంత్ సాధారణమైన మందులు కాక కొన్ని తీవ్రమైన మందులు వాడి ఉంటాడు అని భావిస్తున్నాం’ అంటూ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బిహార్ పోలీసులు కూడా మొదట్లో భయపడ్డారని లాయర్ తెలిపారు. కానీ తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మంత్రి సంజయ్ జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేశారని తెలిపారు. ఈ కేసును పట్నా పోలీసులు విచారించాలని కోరుతున్నామన్నారు. సుశాంత్ కుటుంబం సీబీపై దర్యాప్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వికాస్ సింగ్ తెలిపారు. రియాను అరెస్ట్ చేయాలని సుశాంత్ కుటుంబం భావిస్తోంది. ఈ రోజు రియాను అరెస్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాం’ అన్నారు వికాస్ సింగ్. (చస్తావా? లేదా చంపమంటావా?) కేకే సింగ్ చెప్పిన వారందరిపై కేసు ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని పట్నా (సెంట్రల్) నగర ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైంది. ఈ సమయంలో ఎవరిని ప్రశ్నిస్తామో చెప్పడం సరైనది కాదు. ఎఫ్ఐఆర్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి చెప్పిన వారందరిపై కేసు నమోదు చేశాము’ అని తివారీ పేర్కొన్నారు. బిహార్ పోలీసులు జూలై 25 న భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద సుశాంత్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. 341 (తప్పుడు సంయమనానికి శిక్ష), 342 (తప్పుగా నిర్బంధించినందుకు శిక్ష), 380 (నివాస గృహంలో దొంగతనం), 406 (నమ్మకాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష), 420 (మోసం మరియు నిజాయితీ లేనివి) సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయినట్లు తెలిపారు. ఈ విషయంపై ముంబై పోలీసులు ఇప్పటికే చిత్రనిర్మాతలు మహేష్ భట్, సంజయ్ లీలా భన్సాలీలతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నించారు. -
పేదింటి పిల్ల
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లికి లోకం తెలియదు. ఇద్దరు చెల్లెళ్లకు ఊహే తెలియదు. తల్లి కోర్టు చుట్టూ తిరుగుతోంది. తిరుగుతోంది.. తిరుగుతోంది. భానుమతి పెద్దయ్యే వరకు.. ‘పరిహారం’ ఆ ఇంటి దరి చేరలేదు! ఆ పేదింటి భానుమతే.. జస్టిస్ భానుమతి. ‘సుప్రీం’ జడ్జిగా నిన్న రిటైర్ అయ్యారు. జూలై 20 జస్టిస్ ఆర్. భానుమతి పుట్టిన రోజు. నేడు ఆమె 66 ఏళ్ల వయసులోకి ప్రవేశించారు. నిన్ననే సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. మూడు రోజుల ముందే.. శుక్రవారం ‘వర్చువల్’గా జరిగిన వీడ్కోలు సమావేశంలో జడ్జిగా తన ముప్పై ఏళ్ల అనుభవంలో ‘అకారణమైన అవరోధాలు అనేకం’ ఎదురైనట్లు చెప్పారు. బహుశా అవి తర్వాత ఎప్పుడైనా పుస్తకంగా రావచ్చు. వీడ్కోలులో మాత్రం ఆ అవరోధాల గురించి ఆమె మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థలోని అనివార్యమైన జాప్యానికి తను, తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లు బాధితులైన ఒక విషయాన్ని మాత్రం పంచుకున్నారు. భానుమతికి ఊహ తెలుస్తున్నప్పుడు న్యాయం కోసం తన తల్లి చేసిన పోరాటాన్ని కళ్లారా చూసిన రోజులు అవి. భానుమతి ‘లా’ చదవడానికి ఆ పోరాటం ఒక ప్రేరణగా పనిచేసి ఉండొచ్చు. జస్టిస్ భానుమతిని మరొక రకంగా కూడా గుర్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్భయ కేసు దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయడంలో న్యాయపరమైన అడ్డంకులు తలెత్తుతున్నందున వారిని ఎవరికి వారుగా ఉరి తీయడానికి అనుమతించమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి, నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న ఆదేశాలను ఇస్తూ.. కళ్లు తిరిగి పడిపోయిన జడ్జి.. భానుమతే. అయితే అది ఆమె బేలతనానికి చిహ్నం కాదు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల అలసటలోంచి వచ్చిన తూలిపాటు. వాస్తవానికి 2014లో ఆమె సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చిన నాటి నుంచి, నలుగురు దోషులకు మార్చి 20 ఉదయం ఉరి శిక్ష అమలయే ముందరి గంట వరకు నిర్భయ కేసులో వాదోపవాదాలు విన్న ధర్మాసనంలో జస్టిస్ భానుమతి ఉన్నారు. ‘ఎ గ్రేట్ జడ్జ్’ అంటారు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ఆమెను. ఇక సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యుంత్ దావే అభిప్రాయంలోనైతే.. ‘ఎ ఫియర్స్లీ ఇండిపెండెంట్ జడ్జ్’! దేనినైనా విభేదించవలసి వస్తే జస్టిస్ భానుమతి ఏమాత్రం సంశయించరని దావే తరచు చెబుతుంటారు. భానుమతి దైవ నిర్ణయం అనే భావనను బలంగా విశ్వసిస్తారు. ‘‘జీసెస్ మనకు ఏదైనా రాసి పెట్టి ఉంటే, దానినిక ఎవరూ మార్చలేరు’’ అని.. వీడ్కోలు సమావేశంలో చెప్పారు ఆమె. హిందూ కుటుంబం ఉంచి వచ్చిన భానుమతి చిన్నతనంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. భానుమతికి బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి బస్సు ప్రమాదంలో చనిపోయారు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లుండేది తమిళనాడులోని ఉతంగరై అనే చిన్న గ్రామంలో. బంధువులు లేరు. తెలిసినవారు లేరు. తండ్రి స్నేహితులు నష్టపరిహారం కోసం భానుమతి తల్లి చేత కోర్టులో కేసు వేయించారు. ఆ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఏళ్ల పాటు భానుమతి తల్లిని కోర్టు చుట్టూ నడిపించింది. నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ‘డిక్రీ’ ఇచ్చినప్పటికీ ఆ పరిహారం అందడానికి పిల్లలు పెద్దవాళ్లు అవవలసి వచ్చింది. ఆ ప్రత్యక్ష అనుభవం భానుమతిని ‘లా’ వైపు మళ్లించినట్లుంది. చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ ప్రభుత్వ ‘లా’ కళాశాలలో చదివారు. ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సుప్రీం కోర్టు వరకు ఎదిగారు. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఇప్పుడు చాలా నయం. కేసు ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోడానికి ఉంటోంది. టెక్నాలజీ వచ్చాక కేసు ఎంత వరకు వచ్చిందీ, కేసులో ఏం జరుగుతోంది అనే సమాచారం అందుబాటులో ఉంటోంది’’ అని అన్నారు జస్టిస్ భానుమతి. ఈ కోవిద్ సమయంలో ప్రత్యక్ష కోర్టు విచారణలపై కూడా ఆమె నిస్సంకోచంగా తన అభిప్రాయం చెప్పారు. జడ్జిల కమిటీ నిర్ణయం ఎలాంటిదైనా.. కోర్టుకు నేరుగా హాజరు కావాలన్న నిబంధన మాత్రం సరికాదు. కేసుల విచారణ కన్నా, మనుషుల ప్రాణాలు ముఖ్యం’’ అన్నారు భానుమూర్తి. ముఖ్య విశేషాలు ► 1988లో సెషన్స్ జడ్జిగా (తమిళనాడు) భానుమతి కెరీర్ మొదలైంది. ► 2003లో మద్రాసు హైకోర్టు జడ్జిగా పదోన్నతి. ► 2013లో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం. ► 2014లో సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ స్వీకారం. ► సుప్రీం కోర్టుకు జడ్జి అయిన ఆరవ మహిళగా, ఐదుగురు జడ్జిలు సభ్యులుగా ఉండే ‘కొలీజియం’ (న్యాయమూర్తుల నియామక సలహా మండలి) లో రెండో మహిళగా గుర్తింపు. కోలీజయంలో మొదటి మహిళ రూమాపాల్ 2006లో పదవీ విరమణ పొందారు. ► ప్రస్తుతం భానుమతి రిటైర్ అవడంతో సుప్రీంకోర్టులో ఇద్దరు మాత్రమే.. ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ.. మహిళా జడ్జిలు ఉన్నట్లయింది. సుప్రీం కోర్టు చరిత్రలోనే ఒకేసారి ముగ్గురు మహిళా సిట్టింగ్ జడ్జిలు ఉండటం ఇదే మొదటిసారి. గత ఏడాది ఆగస్టులో తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై జస్టిస్ భానుమతి చెన్నై వచ్చినప్పటి చిత్రం. -
అప్పటి స్నేహాన్ని ఆసరా చేసుకుని..
చైతన్యపురి: వివాహం చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి యువతిని మోసం చేసిన కేసులో సరూర్‌నగర్ పోలీసు లు ఓ న్యాయవాదిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడకు చెందిన బైడ్ సుభాష్ (50) నగరంలోని ఓ కళాశాలలో 2011–14లో ఎల్ఎల్బీ చదివాడు. తనతో పాటు చదివే ఓ యువ తికి స్కాలర్షిప్ రాకపోవటంతో తమవద్దే ఆశ్రయం కల్పించాడు. అప్పటి స్నేహాన్ని ఆసరా చేసుకుని 2015లో తన నివాసానికి ఆమెను పిలిపించి మత్తు మందు కలిపిన బిర్యానీ తినిపించాడు. మత్తులోకి జారుకున్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమెను నగ్నంగా ఫొటోలు తీసిన అతను వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, స్నేహితులకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. అనంతరం వివాహం చేసుకుంటానని నమ్మించి 2015 నుంచి 2019 వరకు కామేశ్వరరావు కాలనీలో ఓ ఇంట్లో సహజీవనం చేశాడు. ఆమెపై మోజు తీరటంతో పెళ్లి చేసుకోనని ఇంటి నుంచి బయటకు నెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుభాష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సుభాష్ పాత నేరస్తుడని, ఇప్పటికే అతడిపై రెండు కేసులున్నాయన్నారు. -
వలస కార్మికుల కోసం; లాయర్ రూ.25 లక్షలు
ముంబై: ముంబై హైకోర్టు అడ్వకేట్ సాఘీర్ అహ్మద్ ఖాన్ సాఘీర్ అహ్మద్ ఖాన్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు ముంబైలో ఎదుర్కొంటోన్న వెతలను చూసి చలించిపోయారు. పైగా అతను కూడా యూపీవాసే కావడంతో వారిని తరలించేందుకు రూ.25లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ అతడి నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వలస కార్మికులు స్వస్థలాకు చేరుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో మే 15న పిటిషన్ దాఖలు చేశారు. (ఎవరు చెప్పినా ఆగని సెంటిమెంట్ ప్రయాణాలు) దీని కోసం రూ.25 లక్షలు చెల్లించేందుకు సిద్ధమేనంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం డబ్బులు చెల్లించాలనుకుంటున్నారా? అని అహ్మద్ ఖాన్‌ను ప్రశ్నించింది. దీనికి సదరు న్యాయవాది అవునని బదులు చెప్పగా పీఎం కేర్స్ ఫండ్‌పై తనకు నమ్మకం లేని కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో వారం రోజుల వ్యవధిలో డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని వలస కార్మికులను తరలించేందుకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. (వలస కూలీలను అవమానపరిచినందుకు..) ఈ విషయం గురించి న్యాయవాది అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. "తొలుత ఈ విషయం గురించి నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాను. వలస కార్మికుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. కానీ సమాధానమే రాలేదు. పైగా వారిని పంపించే విషయంలో రైలు టికెట్ల ఖర్చు ఎవరు భరిస్తారనేదానిపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. దీంతో నేను టికెట్ల ధరల కోసం రూ.25 లక్షల వరకు జమ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మే 9న యూపీ నోడల్ అధికారికి, ముఖ్యమంత్రికి లేఖ రాశాను. అయినప్పటికీ వారు స్పందించలేదు. ఆఖరుకు నేను ముంబై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్తే.. వాళ్లు ప్రతి వలస కార్మికుడి రెండు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. అదీ ఈ లాక్డౌన్ సమయంలో! దీంతో విసిగిపోయి సుప్రీంకోర్టును ఆశ్రయించాను" అని చెప్పుకొచ్చారు. (ఒక కుటుంబం ఆరు చపాతీలు..) -
సాధువుల హత్యకేసు; లాయర్ మృతి
ముంబై : పాల్గర్ జిల్లా మూకదాడి కేసులో హత్యకు గురైన సాధువుల తరపున వాదిస్తున్న జూనియర్ న్యాయవాది దిగ్విజయ్ త్రివేది బుధవారం రోడ్డు ప్రమదంలో మరణించారు. ఈ కేసు విషయమై కోర్టుకు వెళుతున్న ఆయన ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో దిగ్విజయ్‌తో పాటు ఓ మహిళ కూడా ఉంది. అయితే లాయర్ త్రివేది అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలతో ఆమెను ఆసుపత్రిలో చేర్చించారు. (దొంగల ముఠా అనుమానంతో ముగ్గురి హత్య ) కారు ప్రమాదంపై బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా అనుమనాలు వ్యక్తం చేశారు. పాల్గర్ మూకదాడి కేసులో సాధువుల తరుపున వాదిస్తున్న లాయర్‌పై ఎవరైనా కుట్ర పన్ని ఈ ఘాతానికి తెగ బడ్డారా లేక ఇది యాదృచ్ఛికమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇది వరకే ఫాల్గర్ కేసును లేవనెత్తిన వారిపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రమాదంపై ఆర్టీఓ నుంచి నివేదిక వచ్చాకే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పాల్గర్ కేసులో త్రివేదితో పాటు వాదిస్తున్న మరో లాయర్ పిఎన్ ఓజా పేర్కొన్నారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు ) ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ముగ్గురు సాధువులు హత్యకు గురవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పాల్గార్ జిల్లాలోని దబాధి ఖన్వేల్ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం మీదుగా కారులో సూరత్ వెళ్తున్న ముగ్గురు సాధువులను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో సాధువులను ఉద్దేశ పూర్వకంగానే చంపేసినట్లు బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా ) -
కరోనా కాలం: చెట్టుపైనే మకాం!
తెలుగులో వచ్చిన చెట్టు కింద ప్లీడరు సినిమా చాలా మంది చూసే ఉంటారు. కానీ చెట్టుపైనే నివసించే నల్లకోటాయన్ని చూశారా? కరోనా కాలంలో అలాంటాయన యూపీలో కనిపించారు. హాపూర్: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఎవరికి తోచినట్టుగా వారు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది ఒకరు వినూత్నంగా ఆలోచించి ఏకంగా చెట్టుపైన ఆవాసం ఏర్పచుకున్నారు. చెట్టునే నివాసంగా మార్చుకుని కాలం గడుపుతున్నారు. ముకుల్ త్యాగి అనే న్యాయవాది హాపూర్ సమీంలోని అశోధ గ్రామంలో చెట్టుపై కట్టెలు, గడ్డితో మంచె నిర్మించుకున్నారు. నిచ్చెన సాయంతో దానిపైకి ఎక్కి పుస్తకాలు చదువుతూ, హాయిగా నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు చెట్టునే ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నానని ‘ఏఎన్ఐ’తో ముకుల్ త్యాగి చెప్పారు. తన కుమారుడి సహాయంతో చెట్టుపై మంచె నిర్మించానని వెల్లడించారు. ‘చెట్టుపై ఇల్లు కట్టుకోవాలని మా నాన్న ఆలోచించారు. ఎండిన చెట్ల కొమ్మలను సమానంగా నరికి వీటిని తాడు సహాయంతో సమాంతరంగా కట్టాము. దానిపై గడ్డివేసి మంచెలా తయారు చేశాం. చెట్టుపై కట్టడం గొప్ప అనుభూతి. ఇక్కడ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎటువంటి కాలుష్యం లేకుండా హాయిగా ఉంటుంది. ఈ అనుభూతిని ఎంతో ఆస్వాదిస్తున్నాను’ అని త్యాగి కుమారుడు అన్నారు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికే భోజనం తెప్పించుకుంటున్నానని ముకుల్ వెల్లడించారు. ఇదంతా చూసిన స్థానికులు ‘చరిత్ర పునరావృతం కావడం’ అంటే ఇదేనేమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 410 మంది కోవిడ్ బారినపడ్డారు. కరోనా: మాస్క్ పెట్టుకోలేదని.. -
జడ్జికి కరోనా రానూ: లాయర్ శాపనార్థం
కోల్‌కతా: తనకు అనుకూలంగా తీర్పు రాలేదన్న కోపంతో జడ్జికి కరోనా వైరస్ సోకాలంటూ ఓ న్యాయవాది శపించిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.. కరోనా విజృంభిస్తున్న వేళ కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా న్యాయవాది బిజోయ్, బ్యాంకుకు లోన్ చెల్లించిని వ్యవహారంలో ఓ పిటిషనర్ తరపున కేసు వాదిస్తున్నారు. అయితే లోన్ చెల్లించకపోవడంతో పిటిషనర్‌కు చెందిన బస్సును జనవరి 15న బ్యాంకు వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ సదరు వ్యక్తి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇప్పుడు దీన్ని అత్యవసర విషయంగా పరిగణించి విచారణ చేపట్టలేమని, వేసవి సెలవుల అనంతరం విచారణ జరుపుతామని న్యాయమూర్తి దీపంకర్ దత్తా ఆదేశాలు ఇస్తున్నారు. (బాధితుల కోసం వెళ్తే.. లాయర్ అరెస్టు) ఈ సమయంలో కోపం కట్టలు తెంచుకున్న లాయర్ బిజోయ్ మైక్రోఫోన్‌ను విసిరికొట్టడమే కాక ఎదురుగా ఉన్న టేబుల్‌పై గట్టిగా చరుస్తూ అతనికి అంతరాయం కలిగించారు. పైపెచ్చు జడ్జికి కరోనా సోకుతుందంటూ శాపనార్థం పెట్టారు. దీంతో షాక్‌కు గురైన జస్టిస్ దత్తా వెంటనే తేరుకుని కోర్టు ధిక్కారం కింద సదరు న్యాయవాదిపై చర్యలకు ఆదేశించారు. న్యాయవాది మాటల వల్ల తన భవిష్యత్తు గురించి భయపడట్లేదని, కోర్టు ప్రాధాన్యతే తనకు అన్నింటికన్నా ముఖ్యమైన అంశమని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. (వీడియో కాన్ఫరెన్సింగ్) -
అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తాజాగా తోసిపుచ్చారు. దీంతో మరణశిక్షను తప్పించుకునేందుకు మొత్తం నలుగురు దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు దాదాపు పూర్తి అయ్యాయి. దీంతో నిర్బయ దోషుల ఉరిశిక్షకు లైన్ క్లియర్ అయినట్టుగానే భావించవచ్చు. అయితే రాష్ట్రపతి నిర్ణయంపై పవన్ గుప్తా న్యాయ సమీక్షను కోరే అవకాశం లేకపోలేదు. ఈ నెలలో దోషులను ఉరితీస్తారని ఆశిద్దామంటూ నిర్భయ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజా పరిణామంపై నిర్భయ తల్లిదండ్రుల తరపు వాదిస్తున్న న్యాయవాది సీమా ఖుష్వాహా మాట్లాడుతూ ఇక మిగిలింది ఉరిశిక్ష అమలేనని పేర్కొన్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షకు సంబంధించిన తాజా తేదీని నిర్ణయించేలా ఢిల్లీ కోర్టును అశ్రయించనున్నామని తెలిపారు. అక్షయ్ ఠాకూర్ (31) పవన్ గుప్తా (25) వినయ్ శర్మ (26) ముఖేష్ సింగ్ (32) దోషులందరికి అన్ని అవకాశాలు ముగిసాయి...ఇక ఇపుడు నిర్ణయించే తేదీ తుది తేదీ అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉరిశిక్ష అమలు వివిధ న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. Seema Khushwaha, Lawyer of Nirbhaya's parents: We are moving a fresh application in Delhi court to fix a fresh date for the execution of the four convicts. All the convicts have exhausted their complete rights. The date which will be fixed now will be the final date. pic.twitter.com/UADL2sobsa — ANI (@ANI) March 4, 2020 -
బాధితుల కోసం వెళ్తే.. లాయర్ అరెస్టు
జైపూర్: ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టం నిరసనోద్యమంలో ఒక న్యాయవాదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలో అరెస్టయిన నిరసనకారులకు న్యాయ సహాయం అందించడానికి వెళ్లిన రాజస్థాన్‌కు చెందిన ముస్లిం న్యాయవాది మహ్మద్ ఫైజల్ (24)ను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముస్లిం ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే ముస్లిం సంస్థ సభ్యుడిగా ఫైజల్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఫైజల్‌తో పాటు మరో ముగ్గురు హింసను ప్రేరేపించడంతోపాటు, అభ్యంతరకరమైన కరపత్రాలను పంపిణీ చేశారని ఆరోపించారు. అలాగే నిందితుడు ఫజల్ ఫోన్ డేటాను కూడా స్వాధీనం చేసుకున్నామని షామ్లీ పోలీస్ స్టేషన్ అధికారి ధర్మేంద్ర యాదవ్ చెప్పారు. మరోవైపు ఈ అరెస్టును ఫజల్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లతో సంబంధాలు అంటూ తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. పీఎఫ్ఐకి తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఫైజల్ తండ్రి మహ్మద్ హనీఫ్ వెల్లడించారు. ఫైజల్ విడుదల కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశామని తెలిపారు. ఫైజల్ గత మూడేళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారనీ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సిహెచ్ఆర్ఓ) సభ్యుడుగా కూడా కొనసాగుతున్నారని మానవ హక్కుల న్యాయవాది అన్సార్ ఇండోరి చెప్పారు. ఎన్సిహెచ్ఆర్ఓ ఆదేశాల మేరకు ఫజల్ బాధితులకు న్యాయ సహాయం అందించడానికి యూపీకి వెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని న్యాయవాదులు జాతీయ మానవహక్కుల సంఘం రానా బార్ అసోసియేషన్‌ను కోరినట్టు తెలిపారు. -
మహిళపట్ల గొప్ప మనసు చాటుకున్న జడ్జీ..!
వాషింగ్టన్: మనసుంటే మార్గం ఉంటుందని వాషింగ్టన్‌లోని ఓ కోర్టు జడ్జి నిరూపించారు. తన కళ్లెదుటే ఓ యువ న్యాయవాది ఇబ్బందులు పడుతుండటం చూసి.. ఆమెకు సాయం చేశాడు. అతని గొప్ప మనసును పొగుడుతూ.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. వివరాలు.. జూలియానా లామర్ అనే వివాహిత లాకోర్సు సమయంలో గర్భం దాల్చింది. కోర్సు పూర్తయ్యేనాటికి ఓ పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయవాద వృత్తిని చేపట్టడానికి సిద్ధమైంది. అయితే, జూలియానా అడ్వకేట్‌గా ప్రమాణం చేస్తున్నప్పుడు ఓ చిక్కొచ్చిపడింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు బెకమ్ అల్లరి చేయడంతో.. అతన్ని ఎత్తుకుని ప్రమాణం చేసేందుకు తంటాలు పడింది. జూలియానా ఇబ్బందిని గమనించిన జడ్జీ రిచర్డ్ డింకిన్స్ చిన్నారి బెకమ్ను చేతుల్లోకి తీసుకున్నాడు. ఓ చేతిలో పిల్లాడిని, మరో చేతిలో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని జడ్జీ జూలియానాతో ప్రమాణం చేయించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు. View this post on Instagram This feeling is indescribable. To say you’re going to do something then do it is such an amazing feat. There were a few times during this journey that brought me to my knees asking God for strength and reason. I’m glad he heard every prayer!! I’M A LICENSED ATTORNEY!! ⚖️ Today, I was sworn in to the Tennessee Bar by my mentor, Judge Dinkins, who has helped and guided me into my legal career, and my baby boy Beckham, who motivates me to keep going everyday and has been with me during half of my law school “experience.”❤️Thank you to my Husband for being there during all the late nights, all the suits you’ve ironed 😉, coffee you’ve bought to keep me awake, and taking my laptop to force me to go to sleep. Thank you to my Mom, for believing in me, knowing my potential, and (trying) to make me not be so hard on myself. Thank you all for your love and support. 😬 A post shared by Juliana Lamar, Esq. (@jaydotpett) on Nov 8, 2019 at 4:48pm PST Y'all. Judge Dinkins of the Tennessee Court of Appeals swore in my law school colleague with her baby on his hip, and I've honestly never loved him more. pic.twitter.com/kn0L5DakHO — Sarah Martin (@sarahfor5) November 9, 2019 వీడియో చూసిన వాళ్లలో కొందరు.. సదరు జడ్జీకి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని అభిప్రాయపడగా, మరికొందరు... స్త్రీలను గౌరవించే సమాజం ఉందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి చేసే ప్రయత్నం అని కామెంట్ చేశారు. పిల్లాడు మారాం చేయకపోయి ఉంటే ఇంత గొప్ప మానవీయ దృశ్యం ప్రపంచానికి దక్కేది కాదని.. పిల్లాడు పెద్దవాడైన తర్వాత అతనికి చూపించడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని కొంతమంది లాయరమ్మకు సలహా ఇచ్చారు. -
వకీల్ vs ఖాకీ!
-
న్యాయవాది అనుమానాస్పద మృతి
సింగరాయకొండ: కందుకూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది బలుసు వెంకట నరసింహం (51) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన పాకల రోడ్డులోని పీబీ చానల్ సమీపం సోమరాజుపల్లి పంచాయతీ పొలాల్లో బుధవారం సాయంత్రం జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది. అందిన వివరాల ప్రకారం.. వలేటివారిపాలెం మండలం కొండసముద్రానికి చెందిన నరసింహం వృత్తిరీత్యా న్యాయవాది. కుటుంబ సభ్యులతో కలిసి కందుకూరులో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో నరసింహం మోటారు సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్ కూడా చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించి కందుకూరులోని సీసీ పుటేజీని పరిశీలించారు. ఇంటి నుంచి బయల్దేరిన నరసింహం ఊరు చివరన ఉన్న రమణారెడ్డి పెట్రోల్ బంకు దాటడం గమనించారు. ఆ తర్వాత అతని ఫోన్‌ను ట్రాకింగ్ పద్ధతి ప్రకారం ట్రేస్ చేయగా లాస్ట్ సిగ్నల్ పాకల రోడ్డులో గుర్తించారు. చీకటి కారణంగా ఆ ప్రాంతంలో ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. మళ్లీ గురువారం ఉదయం ఆచూకీ కోసం ప్రయత్నించగా పాకల రోడ్డు నుంచి సోమరాజుపల్లి వెళ్లే రోడ్డు పీబీ చానల్ పక్కన మోటార్ సైకిల్ ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని పొలాల్లో వెతగ్గా వేపచెట్టు కింద నరసింహం మృతదేహం ఉంది. పక్కనే ఓ వాటర్ బాటిల్, చెప్పులు ఉన్నాయి. బాటిల్లో సగం తాగిన బ్లూ కలర్ గుర్తుతెలియని ద్రవ పదార్థం ఉంది. సెల్‌ఫోన్ మాత్రం కనిపించలేదు. పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం విషయం తెలిసి కందుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, సహచర లాయర్లు సంఘటన స్థలానికి చేరుకుని నరసింహం మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా నాయకురాలు, మృతుడి బంధువైన లాయర్ అరుణ కూడా వచ్చి నరసింహం మృతి విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు మాత్రమే తాము సంఘటన స్థలానికి వస్తామని పోలీసులు పేర్కొనడంతో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వీఆర్వో శివశంకర్ ఆ గ్రామ వీఆర్ఏ సింహాద్రిని పంపించడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు న్యాయవాది నరసింహం ఆత్మహత్యకు కారణాలు తెలియ రావడం లేదు. ఆయన ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని సహచర న్యాయవాదులు పేర్కొంటున్నారు. తన తండ్రి మృతి తమను విస్మయానికి గురి చేస్తోందని, ఆయన మృతికి కారణాలు తెలియదని చిన్న కుమారుడు వినయ్ చౌదరి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైటర్ శేషు వివరించారు. -
ముప్పు ఉందని ముందే పసిగట్టాడు
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తున్న న్యాయవాది మహేంద్ర సింగ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందుగానే ఊహించారు. రోడ్డు ప్రమాదం జరగడానికి వారం రోజుల ముందే తుపాకీ లైసెన్స్ కోసం ఉన్నావ్ జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాసిన తాజాగా వెలుగులోకి వచ్చింది. భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున తనకు తక్షణమే తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని జూలై 15న కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తుపాకీ లైసెన్స్ కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని వెల్లడించారు. పోలీసులు, జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తన దరఖాస్తును తిరస్కరించేలా చేసిందని ఆరోపించారు. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు మహేంద్ర సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుత్తం లక్నోలోని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితురాలి లేఖపై సుప్రీంకోర్టు స్పందించింది. కేసు విచారణను 45 రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. బాధితురాలికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. (చదవండి: ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!) -
కోచింగ్ తీసుకుని జడ్జి అయిపోవచ్చా!
సాక్షి, అమరావతి: ‘న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వారు న్యాయవాదిగా అనుభవం సాధించకుండా.. ఓ మూడు నెలలు కోచింగ్ సెంటర్ కెళ్లి కోచింగ్ తీసుకుని.. పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయితే సరిపోతుందా. కోచింగ్ సెంటర్లలో కోర్టు విధులను ఎలా నిర్వహిస్తారో నేర్పిస్తారా?. న్యాయవాదిగా కనీస అనుభవం లేకుండా జూనియర్ సివిల్ జడ్జి అయితే వారు న్యాయవ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లగలరు?. కోర్టు కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో తెలియని వారు జూనియర్ సివిల్ జడ్జిలు అయితే వ్యవస్థ పరిస్థితి ఏమిటి?. ఇటువంటి విధానాన్ని మనం అనుమతిద్దామా?. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనను ఐదేళ్లకు మార్చాల్సిన అవసరం ఉంది’ అని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు గత నెల 17న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు భర్తీ చేసుకునే అభ్యర్థి కనీసం మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలనే నిబంధన విధించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన యు.సురేఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మటం వెంకటరమణతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుకు మూడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టుతో పాటు పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని తెలిపారు. గతంలో ఉమ్మడి హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ, బాంబే తదితర చోట్ల జేసీజే పోస్టుల భర్తీకి పెద్దగా స్పందన రాకపోవడం వల్ల మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధనను సడలించి ఉండొచ్చు. వాస్తవానికి కనీస ప్రాక్టీస్ మూడేళ్లు కాదు.. ఐదేళ్లు ఉండాలి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే వ్యవస్థ పనితీరు తెలుస్తుంది. కోర్టు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తాయి. సీనియర్లు ఎలా వాదనలు వినిపిస్తున్నారు, జడ్జీలు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు, తీర్పులు ఎలా ఇస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా నేరుగా కోచింగ్ సెంటర్‌కు వెళ్లి కోచింగ్ తీసుకుని పరీక్ష రాసి జూనియర్ సివిల్ జడ్జి అయిపోతే ప్రయోజనం ఏముంది? దీని వల్ల వ్యవస్థకు ఏం లాభం?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మూడేళ్ల నిబంధనపై హైకోర్టు వైఖరి ఏమిటో తెలుసుకుంటామంటూ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున హైకోర్టు తరఫు న్యాయవాది తమ వాదనలను వినిపించాల్సి ఉంటుంది. -
పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది, ఎస్ఐల బాహాబాహి
తిరువొత్తియూరు: చెన్నై సమీపంలోని పట్టాభి రాం పోలీసుస్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్, న్యాయవాది పరస్పరం దాడులు చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టాభిరాం పోలీసుస్టేషన్లో జగదీశన్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కేసుకు సంబంధించి ఐనావరంకు చెందిన న్యాయవాది కార్తీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సబ్ ఇన్స్పెక్టర్, న్యాయవాదికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. అనంతరం ఇద్దరు వేర్వేరుగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన జాయింట్ కమిషనర్ జగదీశన్‌ను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తొలగించారు. -
పరీక్ష రాసినోళ్లందరూ ఫెయిలయ్యారు..
సాక్షి, చెన్నై: జిల్లా న్యాయమూర్తి నియామకానికి నిర్వహించిన పరీక్షలో మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జిలు, న్యాయవాదులు సహా అందరూ ఫెయిలైన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి గాను మద్రాసు హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 13న పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీనికి 35 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సున్న న్యాయవాదులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు), సివిల్ కోర్టుల్లో న్యాయమూర్తులుగా, మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులు కలిపి 3,562 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా ఏప్రిల్ 7న నిర్వహించారు. పేపర్–1లో సివిల్ లా కు సంబంధించి, పేపర్–2లో క్రిమినల్ లాకు సంబంధించిన ప్రశ్నలను పొందుపరిచారు. మొత్తం 150 మార్కులకు గాను పరీక్షను నిర్వహించారు. ఇందులో రిజర్వేషన్ ప్రాతిపదికన మార్కులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 150కి గాను 45, బీసీ అభ్యర్థులకు 52.5, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 60కి కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. ప్రిలిమ్స్ పరీక్షకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. దీంతో మే 25,26 తేదీల్లో జరగాల్సిన మెయిన్ పరీక్షకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు న్యాయవాదులు, న్యాయశాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
లా విద్యార్థినిపై న్యాయవాది లైంగిక దాడి
చిలకలగూడ : లా కాలేజీ విద్యార్థినిపై ఓ న్యాయవాది లైంగికదాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పద్మారావునగర్ వెంకటాపురంకాలనీకి చెందిన ఇమ్మినేని రామారావు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఛాదర్ఘాట్కు చెందిన చదువులో భాగంగా సిటీ సివిల్‌కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఈ నేపథ్యవలో ఆమెకు అదే కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావుతో పరిచయం ఏర్పడింది. ఈ సదర్భంగా ఆమెకు తన విజిటింగ్ కార్డు ఇచ్చిన రామారావు ఏమైనా సందేహాలు ఉంటే సహాయం చేస్తానని చెప్పి ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 21న సదరు యువతికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించిన అతను ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషచయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఈనెల 25న రాత్రి మరోమారు ఆమెకు ఫోన్ చేసి తన వద్ద నగ్నచిత్రాలు, వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో బాధితురాలు అతడి ఇంటికి వచ్చి గొడవ చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రామారావు భార్య సుప్రజ బాధితురాలిపై దాడికి దిగడంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆత్మహత్యాయత్నం డ్రామా చిలకలగూడ పోలీసులు అక్కడికి రావడంతో తనను అరెస్టు చేస్తారనే భయంతో రామారావు బాత్రూంలోకి వెళ్లి హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నటించాడు. అయితే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించగా, అతడికి ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు ధృవీకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రామారావుతోపాటు అతడి భార్య సుప్రజపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రామారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతడి భార్య సుప్రజ కోసం గాలిస్తున్నారు. చిలకలగూడ ఠాణాలో రామారావుపై 2016లోనే రౌడీషీట్ నమోదైఉందని, 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సీఐ తెలిపారు. -
న్యాయవాదులకు అండగా జగన్
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: నాయవాదులు సమాజంలో ఒక భాగం. సామాన్యుడి నుంచి ధనంవంతుడి వరకు అందరికీ న్యాయం కావాలంటే న్యాయవాది ద్వారానే కోర్టులో వాదన వినిపించుకోవాలి. న్యాయవాదికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్ధిక చేయూత ఉండదు. క్లయింట్లు ఇచ్చే కనీన నగదుతో కావాల్సిన మౌలిక సౌకర్యాలతో పాటు కుంటుంబ పోషణ సమకూర్చుకోవాలి. అయితే ఆ ఆదాయం కూడా స్థిరం కాదు. మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేధావులకు సాయం చేయలేని ప్రభుత్వాలు సామాన్యులను ఎలా గుర్తిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. వారికి ఇతర వృత్తుల వారిలా సామాజిక భద్రత, సంక్షేమాల అవసరం ఉంది. వారి ఆర్థిక ఇబ్బందులను నల్లకోటుతో కప్పుకుని సగటు మనిషికి న్యాయం కోసం పోరాడుతున్న వృత్తి వారిది. దీనిలో కొత్తగా న్యాయవాద వృత్తికి వచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. వారికి వృత్తి పట్ల ధైర్యాన్ని, సహాయన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇతర వర్గాల వలే న్యాయవాదులకు కూడా సముచిత స్థానం కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు పలుమార్లు ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వారి న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టారు. అంతే కాదు న్యాయవాదులకు అన్ని విధాలా తోడుగా ఉంటున్న గుమస్తాలకు కూడా పలు సమస్యలు ఉన్నాయి. వారు కూడా ఇటీవల ఉద్యమ బాట పట్టారు. న్యాయవాదులకు సంబంధించిన సంఘాలు ఇటీవల ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో కలిశారు. వారి ద్వారా న్యాయవాదుల కష్టాలు, సమస్యలు, పరిష్కార మార్గాలను జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా జూనియర్ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 వంతున ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు. న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు, స్థలాలు మంజూరుకు కృషి చేస్తామని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. అలాగే నోటరీ అడ్వకేట్ల సమస్యలు, రెన్యువల్ విషయంలోనూ, ప్లీడర్ గుమస్తాలకు కూడా తగు న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో న్యాయవాదులకు ధైర్యం వచ్చింది. గతంలో ఏ నాయకుడూ ఇవ్వని భరోసాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటూ న్యాయవాదులంతా సంతోషంలో ఉన్నారు. న్యాయవాదుల ప్రధాన డిమాండ్లు ఇవే.. ∙న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ∙న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ∙ఇల్లు నిర్మించుకునేందకు పథకాలు, రుణాలు మంజూరు చేయాలి. ∙బార్ కౌన్సిల్ అఫ్ అంధ్రప్రదేశ్‌కు మ్యాచింగ్ గ్రాంటును మంజూరు చేయాలి. ∙జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టెపెండ్ ఇవ్వాలి. ∙జూనియర్ న్యాయవాదులకు ఈ లైబ్రరీ, లైబ్రరీ సదుపాయాలు కల్పించాలి. ∙ఉత్తరాంధ్రకు హై కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. ∙న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు కలించాలి. ∙కేసులకు తగిన విధంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. ∙సత్వర న్యాయం కోసం న్యాయమూర్తుల నియామకాలు పెంచాలి. ∙అడ్వకేట్ ఆకాడమీ ఏర్పాటు చేయాలి. ∙న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలి. ∙న్యాయవాదులకు పింఛను సదుపాయం కల్పించాలి. ∙న్యాయవాద గుమస్తాకు రూ.4 లక్షలు సంక్షేమ ఫండ్, ఆరోగ్య బీమా వర్తింప చేయాలి. జగన్ నిర్ణయం హర్షణీయం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా హర్షణీయం. గతంలో ఏ నాయకుడూ న్యాయవాదుల సంక్షేమంపై ఇలా భరోసా ఇవ్వలేదు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తామని జగన్ ప్రకటించారు. దీనిని సక్రమంగా అమలు చేస్తే, చాలామంది న్యాయవాద వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. –పొన్నాడ వెంకటరమణ, జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, శ్రీకాకుళం. న్యాయవాదుల ఉన్నతికి ఊతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు వారి ఉన్నతికి ఊతమిస్తాయి. న్యాయవాదుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆసరాగా దొరుకుతుంది. అదేవిధంగా సత్వర న్యాయం కోసం కోర్టుల సంఖ్య, న్యాయమూర్తుల నియామకాలు కూడా చేపట్టాలి, దీంతో సామాన్యుడికి సత్వర న్యాయం అందుతుంది. –కూన అన్నం నాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, శ్రీకాకుళం ఇళ్ల స్థలాలు ఇస్తామనడం సంతోషం న్యాయవాదులు సమాజంలో ఉన్న వారే. అంతేకాకుండా మేధావి వర్గానికి చెందిన వారు. అయినంత మాత్రాన తగినంత ఆర్థిక స్థోమత వారిలో చాలామందికి ఉండదు. ఇల్లు కట్టుకోవడం కష్టమే. అటువంటి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు, అవసరమైతే రుణాలు ఇప్పిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. –కె జీవరత్నం, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, శ్రీకాకుళం. జిల్లాలో న్యాయవాదులు 6, 500 జూనియర్ లాయర్లు 2,500 జిల్లా కోర్టులో న్యాయవాద గుమస్తాలు 84 జిల్లా వ్యాప్తంగా న్యాయవాద గుమస్తాలు 160 -
ప్రమాదము.. ప్రేమ
మనుషులు ప్రేమలో పడ్తారు. పడడం ప్రమాదమేగా?జరిగింది అదికాదు.. ఒక ఉన్మాదం ప్రమాదమైంది ప్రేమలో పడినవాళ్లు మాత్రం..పడిలేచారు.. లేచి నడిచారు!! ‘‘మీరు మహిళల తరపున నిలబడ్తారని... వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తారని మీ దగ్గరకు వచ్చాను’’‘‘చెప్పండి.. మీకేం హెల్ప్ కావాలి?’’‘‘నాకు విడాకులు కావాలి’’‘‘అయితే అన్ని విషయాలు నిజాయితీగా చెప్పాలి’’‘‘తప్పకుండా’’ఈ సంభాషణ.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘‘ఫైర్‌బ్రాండ్’’ అనే మరాఠీ సినిమాలోనిది. ముంబైలో సక్సెస్ఫుల్ లాయర్.. మహిళా పక్షపాతి. న్యాయం తరపున నిలబడుతుంది. .గృహ హింసకు బలవుతున్న వివాహితులకు తగిన భరణంతో విడాకులు ఇప్పిస్తుంటుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులతో మారు మాట్లాడకుండా.. తమ భార్యలకు ఆస్తిలో వాటా ఇచ్చేలా వాదిస్తుంది. ఆమె తమ కేస్ తీసుకుందంటే చాలు జీవితకాలపు భరోసాతో ఉంటారు స్త్రీలు. అందుకే ఒక బాధితురాలు ఆమెను అలా రిక్వెస్ట్ చేస్తుంది. ఎక్స్‌పార్టీగా పురుషులు తమ ఆటలు ఇక చెల్లవనే నిర్థారణకు వచ్చేస్తారు. తిమ్మిని బమ్మి.. బమ్మిని తిమ్మి చేసైనా సరే గెలుస్తామనే ఆశను తుడిచేసుకుంటారు ప్రతివాది లాయర్లు. అందుకే ఆమె ఫైర్‌బ్రాండ్. అలాంటి ధీశాలి వ్యక్తిగతమైన సమస్యతో సతమతమవుతూ ఉంటుంది. భర్తతో శారీరక చనువును పెంచుకోలేకపోతుంది. ఎందుకలా? ఆ లాయర్ పేరు సుందర్ రా. ప్రొఫెషనల్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంతా మ్యారీడ్ లైఫ్‌తోనే. అలాగని భర్త.. మాధవ్ పాట్కర్ చెడ్డవాడు ఏమీ కాదు. భార్యను అర్థం చేసుకుంటాడు. గౌరవిస్తాడు. ఆర్కిటెక్ట్‌గా తన వృత్తికెంత విలువిస్తాడో అడ్వకేట్‌గా ఆమె వృత్తికీ అంతే విలువిస్తాడు. అయినా ఆమె అతనికి దగ్గరకాలేపోతుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణతో బాధపడ్తుంటుంది. దానిపేరు.. పీటీఎస్డి (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్). స్కూల్లో చదువుకునే రోజుల్లో లైంగిక దాడికి గురవుతుంది సునంద. అది కలిగించిన భయమే పీటీఎస్డి రూపంలో ఇప్పటికీ వెంటాడుతూంటుంది. ‘‘అది ఒక యాక్సిడెంట్ మాత్రమే. ప్రేమ వేరు.. లవ్ వేరు’’ అంటూ ఈ విషయంలో ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తూంటాడు భర్త ఓ స్నేహితుడిలా. అయినా సాధ్యం కాదు సునందకు. సైకియాట్రి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూంటుంది. రాత్రి నిద్ర పోవాలంటే భయం ఆమెకు. రోజూ ఆ పీడకలే. భార్య వ్యథను చూస్తూ నిస్సహాయంగా ఉంటాడు మాధవ్. ఇదిలా ఉండగా.. ఓ రోజు.. దివ్య వస్తుంది సునంద ఆఫీస్‌కు. ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్న క్లయింట్. యవ్వనంలో ఆమె ఫేమస్ మోడల్. ఆనంద్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు ఓ పాప. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఆనంద్‌ది. ఆడవాళ్లతో కూడా స్నేహంగా ఉంటాడు. ఆ తీరును అనుమానిస్తూంటుంది దివ్య. ‘‘నీకు వేరే అఫైర్లున్నాయ’ంటూ రోజూ తగవు పెట్టుకుంటుంది. వాళ్ల పోట్లాటతో కూతురు వణికిపోతూంటుంది. దాంతో పాప అబ్నార్మల్ చైల్డ్ అయిపోతుంది. ఆ బిడ్డ పట్లా అసహనమే దివ్యకు. చివరకు ఆస్తిలో సగం వాటాతో విడాకులు కావాలని భీష్మించుకుంటుంది. పాప కస్టడీనీ డిమాండ్ చేస్తుంది. ఒప్పుకోడు ఆనంద్. ‘‘చీటికిమాటికి మనం ఇలా పోట్లాడుకుంటూంటే పాప హెల్త్ మరింత పాడవుతుంది. నాకే అఫైరూ లేదు.. నన్ను నమ్ము ప్లీజ్’ అంటూ మొరపెట్టుకుంటాడు ఆనంద్. కన్విన్స్ కాదు దివ్య. పాపకేమో తండ్రంటేనే ఇష్టం. తల్లి పట్ల మొండిగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సునంద గురించి తెలుసుకుని ఆమెను కలుస్తుంది దివ్య. ఈ కథ మొదట్లో చెప్పుకున్నట్లు విడాకులు ఇప్పించమని అడుగుతుంది. అబద్ధం తనవైపు బలమైన సాక్ష్యాన్ని సృష్టించుకోడానికి తనే గాజుముక్కతో గాయం చేసుకుని హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ భర్త మీద నేరారోపణ చేస్తుంది దివ్య. ఆనంద్‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. తన ఇన్ఫ్లుయెన్స్, స్నేహితుడి సహాయంతో ఎలాగోలా బయటకొస్తాడు. ఓ లాయర్ని మాట్లాడుకుంటాడు. ఆ వ్యవహారమంతా ఎక్కడ పాప మీద దుష్ప్రభావం చూపుతుందోనని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందామని ప్రతిపాదిస్తాడు భార్యతో. సరే అంటుంది దివ్య. ఆనంద్ తన లాయర్‌తో కలిసి సునంద ఆఫీస్‌కు వస్తాడు. దివ్యా ఉంటుంది. చెప్తారు.. తామిద్దరూ మ్యూచువల్ కన్సెంట్కి వెళ్దామనుకుంటున్నామని. ఓకే అంటుంది సునంద. మళ్లీ అక్కడ ఆస్తి విషయంలో పోట్లాటకు దిగుతుంది దివ్య. అప్పుడే తెలుస్తుంది సునందకు.. ఆనంద్ తనను గాయపరిచాడంటూ దివ్య అబద్ధమాడిందని. ఆమె మీద నమ్మకం పోతుంది సునందకు. ఈ కేస్ నుంచి తప్పుకుంటానని.. ఇంకో లాయర్‌ను మాట్లాడుకోమనీ దివ్యతో చెప్తుంది. ఇంకోసారి అలా జరగదని బతిమాలుకొని సునందను ఒప్పిస్తుంది దివ్య. కోర్టులో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఆ ప్రాభవాన్నంతా కోల్పోయి ఆనంద్ నీడలో మామూలు భార్యగా బతుకుతున్నాననే భావన దివ్య సంయమనం కోల్పోయేలా చేస్తుంది. ఆ విషయాన్నే ఆనంద్ తరపు లాయర్ కోర్టులో చెప్పి.. బిడ్డ కస్టడీని ఆనంద్‌కు ఇప్పించాల్సిందిగా కోరుతాడు. ఆ మాటతో ఆవేశపడిపోయి.. ఒక్కసారిగా భర్తమీద అరిచేస్తుంది దివ్య.. క్రమశిక్షణనుల్లంఘించి. దాంతో ఆమె మానసిక ప్రవర్తనను బేరీజు వేసుకున్న జడ్జి బిడ్డ కస్టడీని ఆనంద్‌కే అప్పగిస్తాడు. ఆ కోపాన్నంతా సునందమీద వెళ్లగక్కుతుంది దివ్య. ఆమెలోని తల్లి మనసును అర్థం చేసుకున్నా దివ్య ప్రవర్తనను సహించదు సునంద. అంతకుముందు.. తన సాహచర్యం, సైకియాట్రి ట్రీట్మెంట్.. ఏదీ ఫలితం చూపించకపోయేసరికి హర్ట్ అవుతాడు మా«ధవ్. కొన్నాళ్లు సొంతూరికి వెళ్దామనుకుంటాడు. తన ఎడబాటు వల్లయినా సునందలో మార్పు వస్తుందేమోనని. అనుకున్నట్టుగానే సునందకు చెప్పకుండా ఊరుకెళ్లిపోతాడు. భార్య ఫోన్ చేసి అడిగితే.. పని మీద ఊరొచ్చినట్టు చెప్తాడు. ఆ రాత్రి.. దివ్య వాళ్లకు విడాకులు మంజూరైన రోజు రాత్రి దివ్య భర్త ఆనంద్.. సునంద వాళ్లింటికి వస్తాడు. కూర్చోని ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటారు. కోర్టులో తన భార్య బిహేవియర్ పట్ల సారీ చెప్తాడు ఆనంద్. అనీజీగా కదులుతుంది సునంద. ఏమైంది అంటాడు ఆనంద్. మెడ, వెన్ను నొప్పి అని చెప్తుంది. ‘‘మీకు అభ్యంతరం లేకపోతే మస్సాజ్ చేయనా? నేను ట్రైన్డ్’’ అంటాడు. ‘‘పర్లేదు.. అదే సర్దుకుంటుంది’’ అంటుంది. కాని ఇబ్బంది పడ్తూంటుంది. ‘‘నేను మస్సాజ్ చేస్తాను ఆగండి’’ అంటూ చనువు తీసుకొని మస్సాజ్ చేస్తుంటాడు. ఆ స్పర్శ ఆమెలో స్త్రీత్వాన్ని తట్టి లేపుతుంది. మానసికంగా ఉపశమనాన్నిస్తుంటుంది. శారీరకంగా సాన్నిహిత్యాన్ని కోరుతుంటూంది. తెల్లవారి.. ఎప్పటిలా కాకుండా చాలా హుషారుగా ఉంటుంది సునంద. భర్తకు ఫోన్ చేస్తుంది త్వరగా రమ్మని. ఆ మాటలోని ఉత్సాహాన్ని, ఆత్రాన్ని గ్రహిస్తాడు భర్త. మాధవ్ ఆశించిన మార్పు సునందలో. బయలుదేరి వస్తాడు. భార్య చొరవను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రాత్రి చెప్తుంది భర్తతో.. ‘‘నా చిన్నప్పటి భయంకరమైన కల.. నిన్న సమాధి అయిపోయింది’’ అంటూ. ‘‘వెరీగుడ్..’’ అంటాడు భర్త ఆనందంగా. ‘‘దీనికి కారణం ఓ వ్యక్తి. నిన్న కలిశాను శారీరకంగా. అప్పుడు తెలిసింది నాకు.. పీడకు, సంతోషానికి మధ్య తేడా’’అని ఆగుతుంది. భర్త మొహంలో రంగులు మారుతుంటాయి.‘‘మాధవ్.. ఏంటలా ఉన్నావ్?’’ అంటుంది కంగారుగా. ‘‘ఏంటో.. నాకు కన్ఫ్యూజన్గా ఉంది’’ అంటాడు భర్త. ‘‘అదేంటీ.. నువ్వే చెప్పావ్‌గా చాలాసార్లు.. యాక్సిడెంట్ వేరు.. లవ్ వేరు అని. నీ మీదున్న నా ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలిసింది..’’ అంటుంది భర్తను హత్తుకుంటూ. ఆమె స్థితిని అర్థం చేసుకునేక్రమంలో భాగంగా భార్య తలను ముద్దు పెట్టుకుంటాడు. సమకాలీన పరిస్థితుల జీవనశైలి.. ప్రమాదాలు.. ప్రేమలు.. ఘర్షణలు.. దుఃఖాలు.. ఆనందాలు అన్నీ రీలై రియల్లైఫ్లా చూపిస్తుంది ఫైర్‌బ్రాండ్. దర్శకురాలు అరుణ రాజె. నిర్మాత.. ప్రియాంక చోప్రా. సునంద రాగా ఉషా జాధవ్ నటించారు. – సరస్వతి రమ -
అడ్డదారి తొక్కిన అడ్వకేట్!
సాక్షి, సిటీబ్యూరో:అతడో న్యాయవాది... ఫైనాన్స్‌పై ఓ హైఎండ్ వెహికిల్ కొన్నాడు... ఇంత వరకు బాగానే ఉన్నా.. అతడికి పుట్టిన ఓ దుర్బుద్ధి కటకటాల్లోకి పంపింది. ఫైనాన్స్ ఎగ్గొట్టడంతో పాటు కారును సొంతం చేసుకోవడానికి చోరీ నాటకానికి తెరలేపాడు. అబిడ్స్ ఠాణాలో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో అతగాడి గుట్టురట్టయింది. శుక్రవారం ఆటోమొబైల్ టీమ్ అధికారులు న్యాయవాది సయ్యద్ సఫియుల్లా హుస్సేనీని అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ముందు బ్యాంకు... ఆపై ఫైనాన్స్ సంస్థ... హస్సేనీ 2016 అక్టోబర్ 18న చాంద్రాయణగుట్టలోని కేబీ మోటర్స్ నుంచి రూ.17.5 లక్షలు వెచ్చించి సెకండ్ హ్యాండ్ కారు (ఏపీ 03 ఏజెడ్ 0001) ఖరీదు చేశాడు. 2017లో రాణిగంజ్‌లో ఉన్న యాక్సస్ బ్యాంకులో వాహన రుణం కోసం దరఖాస్తు చేశాడు. దీంతో అదే ఏడాది ఫిబ్రవరి 19న రూ.10.24 లక్షలు మంజూరయ్యాయి. దాదాపు ఏడాది పాటు వాయిదాలు చెల్లించిన హుస్సేనీ ఆపై ప్రైవేట్ సంస్థ నుంచి రుణం తీసుకోవాలని భావించాడు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని క్లిక్స్ ఫైనాన్స్ ఇండియా అన్ లిమిటెడ్ సంస్థను ఆశ్రయించాడు. పూర్వాపరాలు పరిశీలించిన ఈ సంస్థ అదే నెల 28న రూ.12.67 లక్షలు రుణం మంజూరు చేసింది. ఇందులో రూ.9.24 లక్షల్ని యాక్సిస్ బ్యాంక్‌నకు బదిలీ చేసిన ఈ సంస్థ మిగిలిన రూ.3.42 లక్షల్ని హుస్సేనీ ఖాతాకు పంపింది. అవి మార్చేసి స్వస్థలానికి తరలించి... ఈ ప్రైవేట్ సంస్థకు కేవలం ఒక్క నెల మాత్రమే వాయిదా చెల్లించిన హుస్సేని ఆపై అసలు కథ మొదలెట్టాడు. ఈ వాహనం చోరీకి గురైందని ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలని అనుకున్నాడు. అలా చేస్తే ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత ఫైనాన్స్ సంస్థకు ఇన్సూరెన్స్ సొమ్ము వస్తుందని అనుకున్నాడు. క్లోజ్ అయినందుకు పోలీసులు, సొమ్ము వచ్చినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ వారూ తనను పట్టించుకోరని, కారు సొంతమైపోతుందని పథకం వేశాడు. దీన్ని అమలులో పెట్టేందుకు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని దుకాణాల్లో తన తెల్ల రంగు కారుకు నల్లరంగు వేయించడాడు. రిజిస్ట్రేషన్ నంబర్ సైతం ఏపీ 03 ఏటీ 0567గా మార్చేశాడు. ఈ వాహనాన్ని తన స్వస్థలమైన సంగారెడ్డికి తీసుకువెళ్లి తన షెడ్ వెనుక వైపు రహస్యంగా దాచేశాడు. ‘ఆధారాలు దొరక్కుండా’ ఫిర్యాదు... అబిడ్స్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద పార్క్ చేసిన తన కారు పోయిందంటూ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాలని భావించాడు. అయితే వెంటనే ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే తన బండారం బయటపడుతుందని అనుకున్నాడు. దీంతో నాలుగు నెలల పాటు వేచి చూసి గతేడాది జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి వరకు సీసీ కెమెరాల ఫీడ్ ఉండదుకాబట్టి తాను సేఫ్ అని అనుకున్నాడు. ఈ కేసును రెండు నెలల పాటు దర్యాప్తు చేసిన అబిడ్స్ అధికారులు చివరకు సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఆటోమొబైల్ టీమ్ ఇన్స్పెక్టర్ వి.లచ్చిరాం అనేక అంశాలపై దృష్టి పెట్టారు. వాహనం చోరీ అయితే ఎవరైనా వెంటనే ఫిర్యాదు చేయాలి. నాలుగు నెలలు ఆలస్యంగా పోలీసు వద్దకు రావడాన్ని ఆయన అనుమానించారు. నెల రోజులు కాపుకాసి... దీంతో న్యాయవాది పూర్వాపరాలపై దృష్టి పెట్టారు. ఆయన స్వస్థలమైన సంగారెడ్డిలోని మునిపల్లికీ పలుమార్లు వెళ్లొచ్చారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసులో హుస్సేనీనే ప్రధాన అనుమానితుడిగా భావించిన ఇన్స్పెక్టర్ లచ్చిరాం తన బృందంతో సంగారెడ్డి చుట్టుపక్కల నెల రోజుల పాటు కాపు కాశారు. గురువారం నల్లరంగు కారులో బయటకు వచ్చిన అతగాడిని బుడేరా క్రాస్‌రోడ్స్‌లో పట్టుకున్నారు. వాహనం రంగు, రిజిస్ట్రేషన్ నెంబర్ మారినప్పటికీ ఇంజిన్, ఛాసిస్ నెంబర్లు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది.దీంతో హుస్సేనీని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు వాహనం స్వాధీనం చేసుకుని నగరానికి తరలించారు. -
న్యాయవాది నగ్న నిరసన
అన్నానగర్: తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు భద్రత కల్పించాలని బుధవారం మదురై కోర్టు, కలెక్టర్ కార్యాలయాల్లో ఓ న్యాయవాది నగ్నంగా నిరసన తెలిపాడు. వివరాలు.. మదురై జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డు వద్ద ఓ వ్యక్తి దుస్తులను నగ్నంగా పరిగెత్తాడు. అక్కడున్న పోలీసులు అతన్ని నిలిపి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతను వారికి ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు స్వామి. అడ్వకేట్‌గా పనిచేస్తున్నా. వండియూర్ ప్రాంతంలోని ఓ క్లబ్లో గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐదుగురు హత్య చేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రాణాలకు అపాయం ఉంది. పోలీసులు తగిన భద్రత ఇవ్వాలని కోరాడు. ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత అడ్వకేట్ స్వామిని నగ్న పోరాటం చేయవద్దని హెచ్చరించి పంపారు. ఈ క్రమంలో స్వామి, పోలీసుస్టేషన్ నుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కూడా అతను మళ్లీ దుస్తులను విప్పి నగ్నంగా పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ భద్రతలో ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో అతను వండియూరులో అనుమతి లేని క్లబ్‌ను మూసివేయాలని కేకలు వేశాడు. పోలీసులు స్వామిని విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. -
గొప్ప మానవతావాది పద్మనాభరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నీతి, నిజాయితీ, విలువలకు తుదివరకు కట్టుబడి త్రికరణశుద్ధిగా న్యాయవాద వృత్తిని కొనసాగించిన అరుదైన అతికొద్దిమంది న్యాయవాదుల్లో చాగరి పద్మనాభరెడ్డి ఒకరు. ఉభయ రాష్ట్రాల్లో పద్మనాభరెడ్డి గురించి తెలిసిన ప్రతీఒక్కరూ చెప్పేమాట ఇదే. తాను నమ్మిన విలువలద్వారా ప్రజల హక్కుల్ని కాపాడిన గొప్ప మానవతావాది ఆయన. కేసుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలు ఆపన్నులకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ఆయన్నుంచీ నేర్చుకోవాల్సిన సుగుణాలెన్నో ఉన్నాయని విశ్రాంత న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు ముక్తకంఠంతో చెబుతారు. వామపక్షవాదిగా చివరివరకు ప్రజా ఉద్యమాలకు తన అండదండలు అందించారు. 2013, ఆగస్టు 4న ఆయన తుదిశ్వాసవిడిచారు. ఆయనకు గురువే దైవం.. అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో 1931, మార్చి 18న మధ్యతరగతి కుటుంబంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్‌రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల్ని తాడిపత్రి మున్సిపల్ హైస్కూలులో చదివారు. గుత్తిలోని లండన్ మిషన్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. తరువాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1953లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రాక్టీస్ చేసి 1954లో గుంటూరు(ఆంధ్ర హైకోర్టు)లో, 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఓ.చిన్నపరెడ్డిని ఆయన దైవంగా భావించారు. చిన్నపరెడ్డే తన గురువూ, మార్గదర్శకుడిగా చెప్పేవారు. తాను సాధించినదంతా చిన్నపరెడ్డి చలవేనని, ఆయన చూపిన ప్రేమాభిమానాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఎంతో వినమ్రంగా చెప్పేవారు. సుదీర్ఘ ప్రస్థానం..: పద్మనాభరెడ్డిది న్యాయవాదిగా 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. అంతకాలంపాటు ఆయన క్రిమినల్ లాయర్‌గా న్యాయవ్యవస్థకు సేవలందించారు. ఎంతోమంది న్యాయమూర్తులు తమ సందేహాలను ఆయనద్వారా నివృత్తి చేసుకునేవారు. హైకోర్టులో అరవై వేలకుపైగా కేసులు వాదించిన ఆయన.. ఫీజులతో నిమిత్తం లేకుండా కేసుల్ని వాదించేవారు. ఎన్నడూ ఫీజుకోసం అడిగింది లేదు. ఫీజు ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు ఒకవేళ అప్పోసొప్పో చేసి ఫీజు తెచ్చి ఉంటే.. ఆ విషయాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ డబ్బును వారికే తిరిగిచ్చేవారు. ఒక్కోసారి చార్జీలకు సైతం ఆయన తన జేబులోనుంచి డబ్బుతీసి వారికిచ్చేవారని ఆయన్ను దగ్గరనుంచి చూసిన న్యాయవాదులు చెబుతుంటారు. ఎన్కౌంటర్ల సమయంలో ఎదురుకాల్పులు జరిగినప్పుడు, పోలీసుల కాల్పుల్లో ఎవరైనా చనిపోతే, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న సందేహం హైకోర్టుకు వచ్చింది. సందేహనివృత్తికి వెంటనే హైకోర్టుకు గుర్తుకొచ్చేది పద్మనాభరెడ్డే. ఈ అంశంపై విచారణ జరిపిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా పద్మనాభరెడ్డిని నియమించింది. ఆత్మరక్షణకోసం ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే తీర్పునివ్వడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఆయన వాదనల్ని అంగీకరించిన ధర్మాసనం.. ఎన్కౌంటర్లలో అవతలి వ్యక్తులు మృతిచెందితే అందులో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అపార పరిజ్ఞానం ఆయన సొంతం తనకున్న అపార పరిజ్ఞానంతో కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలను, సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను పద్మనాభరెడ్డి సులభంగా ఎత్తిచూపేవారు. ఇంత పరిజ్ఞానము న్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగానే చెలామణి అయ్యారు. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడిగినా విసుగూ, విరా మం లేకుండా చెప్పడం ఆయనకే చెల్లింది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన కేసుల్ని వాదిం చారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా నివేదికివ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జి కాలేకపోయారు. కానీ ఆయన కుమారుడు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక సీజే గా నియమితులై చరిత్ర సృష్టించారు. -
నాకు ప్రాణహాని.. భారత్‌కు రాను: నీరవ్
ముంబై: బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి భారత్‌లో ప్రాణహాని కలిగే అవకాశం ఉందని, అందుకే ఆయన దేశానికి రాలేకపోతున్నట్లు అతని తరఫు న్యాయవాది శనివారం ఇక్కడి ప్రత్యేక కోర్టుకు విన్నవించారు. విచారణలో భాగంగా నీరవ్ తరఫున లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. అతను దేశానికి వస్తే ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు మూకదాడులు జరిపే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. వీరి వాదనను ఈడీ తోసిపుచ్చింది. ఒకవేళ నీరవ్‌కు నిజంగా ప్రాణహాని కలిగే అవకాశం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి గానీ, ఇలా దర్యాప్తుకు సహకరించపోవడం తగదని పేర్కొంది. -
కథువా కేసు; దీపికా రజావత్‌కు ఊహించని షాక్!
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా సామూహిక అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్న లాయర్ దీపికా రజావత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రాణాలకు తెగించి మరీ ఈ కేసును వాదిసున్న దీపికాకు.. ఇకపై ఆమె సేవలు తమకు అక్కర్లేదంటూ బాధిత కుటుంబం షాక్ ఇచ్చింది. ముస్లిం తెగకు చెందిన చిన్నారి తరపున వాదిస్తున్నందుకు దీపికాను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. కాగా సున్నితమైన ఈ ఘటన కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున పంజాబ్‌లోని పఠాన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో దీపిక కేవలం రెండుసార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారని, ఇలా అయితే తమకు న్యాయం జరగదని చిన్నారి తండ్రి భావిస్తున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా 100 సార్లు కేసు విచారణకు వచ్చిందని, 100 మంది సాక్ష్యులను విచారించినా ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆరోపిస్తూ లాయర్‌ను మార్చుకుంటున్నట్లు ఆయన పఠాన్ కోర్టుకు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. -
‘వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’
‘నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం’ - ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టే వారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు చక్కని ఉదాహరణ దీపికా రజావత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె. అడుగడుగునా అవరోధాలే.. ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికాకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది ఈసడించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. కచ్చితంగా చంపేస్తారు.. నాకు తెలుసు ‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. ఈ ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా. (చదవండి : ‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’) అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను. అంటూ ‘వోగ్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్- 2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్ తన అనుభవాలను పంచుకున్నారు. కేసు పూర్వాపరాలు... కశ్మీర్‌లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చిన ఎమిమిది మంది మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను హత్యచేశారు. బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన 5 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. కథువాకు చెందిన సాంజీరాం, అతడి కొడుకు విశాల్, స్పెషల్ పోలీసు ఆఫీసర్ దీపక్ ఖజురియా, సురీందర్ వర్మ, పర్వేశ్ కుమార్, తిలక్ రాజ్, ఎస్సై అరవింద్ దత్తా తదితరులను నిందితులుగా తేల్చారు. కాగా బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిన కారణంగా ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్‌లోని పఠాన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
కోర్టులో వాదించకుండా అడ్డుకోలేం
న్యూఢిల్లీ: చట్టసభ్యులుగా ఎన్నికైన న్యాయవాదుల్ని కోర్టుల్లో వాదించకుండా అడ్డుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టసభ్యులయ్యాక న్యాయవాద వృత్తిని కొనసాగించకూడదని న్యాయవాద వృత్తి కోసం ఉద్దేశించిన చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ‘చట్టసభ్యులుగా కొనసాగుతున్న వారు అడ్వకేట్స్‌గా ప్రాక్ట్రీస్ చేయకూడదని అడ్వకేట్స్ యాక్ట్, 1961, దాని ఆధారంగా రూపొందించిన నిబంధనలు ఎలాంటి నిషేధమూ విధించలేదు’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధులు ఏ వ్యక్తి, సంస్థ, ప్రభుత్వం, కార్పొరేషన్ లేదా ఇతర సంస్థల్లో పూర్తి స్థాయి ఉద్యోగి కాదు. అందువల్ల ఈ కేసులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన 49వ నిబంధన వారికి వర్తించదు అని స్పష్టం చేసింది. చట్టసభ్యులుగా కొనసాగుతున్నంత కాలం న్యాయవాదులు కోర్టులో వాదించకుండా నిషేధం విధించాలని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. చట్టసభ్యులు పూర్తికాలపు ఉద్యోగులు కారని, వారి మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం లేదంది. ‘చట్టసభ్యులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులు. 1954 నాటి చట్టం కింద వారు జీతం అందుకుంటున్నారు. అలాగే వివిధ నిబంధనలకు అనుగుణంగా అలవెన్స్‌లు పొందుతున్నారు. అయితే ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం, చట్టసభ్యుల మధ్య ఉద్యోగి, యజమాని సంబంధం ఉండదు’ అని తీర్పులో పేర్కొంది. -
ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్..!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ట్రంప్ వద్ద పర్సనల్ లాయర్‌గా పనిచేసిన మైఖేల్ కోహెన్‌ను మన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 ఎన్నికల సమయంలో కోహెన్ ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ జూపి వారిని ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా పనిచేయకుండా చేశారని తెలిపింది. తనతో వ్యక్తిగత సంబంధాలున్న ఇద్దరు మహిళల వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి కోహెన్ పనిచేశాడని కోర్టు వెల్లడించింది. 8 చార్జిషీట్లలో దోషిగా తేలిన కోహెన్‌పై పన్ను ఎగవేత అభియోగాలు కూడా రుజువయ్యాయి. అయితే, కోర్టు విచారణలో ట్రంప్‌కు సంబంధించి కోహెన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, కోహెన్ తరపు లాయర్ లానీ దావిస్ మాత్రం కోహెన్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేశాడని చెప్తున్నారు. కోహెన్ దోషిగా తేలినందున ఈ వ్యవహారంలో ట్రంప్‌కు కూడా చిక్కులు తప్పవని హెచ్చరించారు. కోహెన్ ఒకరికి లక్షా ముప్పై వేలు, మరొకరికి లక్షా యాభై వేల డాలర్లు చెల్లించినట్లు తేలిందని దావిస్ తెలిపారు. మరోవైపు ఇద్దరు మహిళలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. ట్రంప్, ఆయన కుంటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ తరపు న్యాయవాది రూడీ గిలియానీ అన్నారు. ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టి ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. కోహెన్ ట్రంప్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కోహెన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని గ్రహించి అతన్ని ట్రంప్ ఎప్పుడో దూరం పెట్టాడని అన్నారు. -
కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి..
హైదరాబాద్, నాగోలు: శీతలపానీయంలో మత్తు మందు కలిపి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఓ న్యాయవాదిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. ఎల్బీనగర్కు చెందిన మహిళ భర్త బ్యాంకు ఉద్యోగిగి పని చేస్తూ మృతి చెందాడు. దీంతో అతడి ఉద్యోగాన్ని పొందేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. సదరు మహిళ భర్తకు స్నేహితుడైన వైజాగ్ ఈస్ట్‌పాయింట్ కాలనీకి చెందిన న్యాయవాది సోమశేఖర్ తాను సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. ఇందు లో భాగంగా సదరు మహిళ ఇంటికి వెళ్లిన సోమశేఖర్ ఆమెకు తెలియకుండా శీతలపానీయలో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడటమేగాక వీడియోను తీశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వీడియోను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాడేపల్లిగూడెంలో నింది తుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
’చిల్లర’ మనోవర్తి...!
లాయర్ల బుర్ర ఎంత షార్ప్‌గా, నేర్పుగా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ... ఓ న్యాయవాది తనదైన శైలిలో మాజీ భార్యపై కక్ష తీర్చుకున్నాడు. విడాకుల తర్వాత నెలకు రూ.25 వేల చొప్పున మనోవర్తి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సదరు లాయిర్ పట్టించుకోవడం లేదంటూ మాజీ భర్తపై ఆ యువతి పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఆ లాయర్ ప్రాక్టీస్ బాగా నడుస్తోందని, అంతే కాకుండా అతడి పేరిట ఆస్తులు కూడా ఉన్నాయంటూ విన్నవించింది. ఈ నేపథ్యంలో గతంలో పేర్కొన్న విధంగా నెలకు రూ. 25 వేల మనోవర్తి చెల్లించాలని ఆ న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే అసలు డ్రామా అంతా చోటుచేసుకుంది. ఈ మనోవర్తిని నాలుగు వందరూపాయల నోట్లతో పాటు మిగతా మొత్తం (రూ.24,600) ఒకటి, రెండు రూపాయి నాణాలతో కూడిన చిల్లర రూపంలో ఓ సంచిలో పెట్టి అక్కడి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్ అందజేశాడు. తనను వేధించేందుకు ఇదొక కొత్త పద్ధతి అని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని ఆ యువతి వాదించింది. తమ కేసు ఎనో్నసార్లు వాయిదా పడిన తర్వాత ఇప్పుడు చిల్లర రూపంలో డబ్బు ఇవ్వడం న్యాయం కాదని పేర్కొంది.. అయితే తన చర్యను న్యాయవాది సమర్థించుకుంటూ డబ్బును కేవలం వంద, ఐదువందలు, రెండువేల నోట్ల కరెన్సా రూపంలోనే ఇవ్వాలని ఎక్కడా లిఖితపూర్వకంగా రాసి పెట్టి లేదని వాదించాడు. ఈ నాణేలను లెక్కించేందుకు తను ముగ్గురు సహాయకులను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చాడు. నాణేల లెక్కింపునకు సమయం సరిపోక జిల్లా కోర్టు జడ్జీ చివరకు కేసును వాయిదా వేయాల్సి వచ్చింది. -
రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మృతి
దత్తిరాజేరు : బొండపల్లి మండలం బోడసింగుపేట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి బోడిసింగుపేటకు చెందిన న్యాయవాది శంకరరావు (46) కుమారుడు ప్రమోద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గజపతినగరం నుంచి బోడసింగుపేట వస్తుండగా, విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకరరావు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో కుమారుడ్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి భార్య రమాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. -
జెట్టి శ్రీలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య
ఒంగోలు సబర్బన్: దివంగత న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి సతీమణి జెట్టి శ్రీలక్ష్మి (54) గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. జయరాం సెంటర్లోని శ్రీగిరి అపార్టుమెంట్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇది గమనించిన కుటుంబీకులు, స్థానికులు శ్రీలక్ష్మి సంబంధీకులకు సమాచారం అందించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2017 నవంబర్ 12న ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ కృష్ణానగర్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్‌లో బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అప్పట్లో మృతి చెందిన వారిలో శ్రీలక్ష్మి భర్త జెట్టి ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు. కార్తీకమాసంలో విహారయాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందటంతో విషాదయాత్రగా మిగిలిపోయింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు శ్రీలక్ష్మి బోటులో వెళ్లకుండా అప్పట్లో ఒడ్డునే ఆగిపోయారు. అప్పుడు జరిగిన ప్రమాదంతో శ్రీలక్ష్మి కుటుంబం విలవిల్లాడింది. అప్పటి నుంచి భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీలక్ష్మి మనోవేదనతో కుంగిపోసాగింది. అప్పటికి వారి కుమార్తెలు ఎంతో సముదాయిస్తూ వచ్చారు. అయినా భర్త తోడు లేకపోవడం ఆమె మనోవేదన గురవుతూ వచ్చింది. చివరకు ఆయన లేని జీవితం వృథా అనుకుందో.. ఏమో.. చివరకు బలవన్మరణానికి పూనుకుంది. జెట్టి శ్రీలక్ష్మి దంపతులకు సంతానం లేదు. అయినా ప్రభాకరరెడ్డి రక్తసంబంధీకులకు చెందిన ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. వాళ్లిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వారికి వివాహాలు కూడా చేసి స్థిరపరిచారు. ఒక కుమార్తె అమెరికాలో స్థిరపడగా, రెండో కుమార్తె బెంగుళూరులో స్థిరపడింది. ఇటీవలే కుమార్తెలు వచ్చి దగ్గరుండి మరీ సపర్యలు కూడా చేశారని బంధువుల నోట వస్తున్న మాటలు. తల్లికి ఎంతో ధైర్యం చెప్పారు. అవేమీ ఆమెలో మనోస్థైర్యం నింపలేదు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి భర్త చెంతకు చేరింది. -
అబద్ధం నిజం
కథాసారం పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు. ‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’ ‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’. అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు. బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు. ‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్. ‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్. ‘నా పందెం ఇరవై లక్షలు’. ‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’. అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’. అప్పటి పందెం గురించి బ్యాంకర్ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’. ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్ ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు. అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు. రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు. ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్ నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకీని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకీ పేలింది. పదో ఏడాది తర్వాత లాయర్ తన టేబుల్ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు. చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు. .... ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’. పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’. గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్ వెలుగుతోంది. బందీ టేబుల్ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్ జాగ్రత్తగా తాళం మీది సీల్ చించి, చెవితో తాళం తీశాడు. తుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు. ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’. ‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మి«థ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’. చదవగానే బ్యాంకర్ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్. బ్యాంకర్ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు. (ఆంటన్ చెహోవ్ (1860–1904) రష్యన్ కథ ‘ద బెట్’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్ ఒకరు.) -
న్యాయవాదిపై సీఐ దాడి
అనంతపురం న్యూసిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, న్యాయవాది గోవిందరాజులుపై నాల్గవ పట్టణ సీఐ శ్యామ్‌రావు దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం గోవిందరాజు, అతని సోదరుడు శివశంకర్, మరో వ్యక్తి దివాకర్ రుద్రంపేట బైపాస్ సమీపంలో ఉన్న సండే కార్ బజార్ షోరూంకు బైక్‌లో వెళ్లారు. మొదట దివాకర్ బయటకు రాగా, ఆ సమయంలో అక్కడికి చేరుకున్న నాల్గవ పట్టణ సీఐ ‘ఏం రా..? దొంగకార్లు అమ్ముతున్నారంట’ అని వారిని నిలదీశారు. ‘సార్ దొంగ కార్లు అమ్మే ఖర్మ మాకేం పట్టిందని సీఐకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో దివాకర్‌ను సీఐ కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న గోవిందరాజు సీఐకి నచ్చజెప్పే క్రమంలో అతనిపై చేయి చేసుకున్నారు. తాను న్యాయవాదినని, ఇలా చేయడం సరైన పద్ధతికాదని అనగా ‘ఎవరైతే నాకేం? నేను చెప్పిందే వేదం’ అంటూ విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయపడ్డ గోవిందరాజులు సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సీఐపై కేసు నమోదు చేయాలి న్యాయవాది గోవిందరాజులుపై విచక్షణారహితంగా దాడిచేసిన సీఐ శ్యామ్‌రావుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అనంత వెంటకరామిరెడ్డి డిమాండ్ చేశారు. సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందరాజులను ఆయన పరామర్శించారు. జిల్లాలో అధికార పార్టీ నేతలు ప్రజలపై దాడులు, వసూలు చేస్తున్నా నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ నాగిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపైనే దాడి చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితేమిటన్నారు. సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఐపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ స్పందించకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. గోవిందరాజులను పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, పార్టీ నగరాధ్యక్షులు చింతా సోమశేఖర్ రెడ్డి, నేతలు గౌస్‌బేగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
కథువా రేప్ కేసు లాయర్‌కు బెదిరింపులు
-
కథువా రేప్ కేసు లాయర్‌కు బెదిరింపులు
జమ్మూ : ‘న్యాయ వ్యవస్థపై, లాయర్లపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఉండాలంటే వారి చేతుల్లో కూడా న్యాయదండాలు ఉండాలేమో!’ అని కశ్మీర్‌లోని కథువా జిల్లాలో దారుణంగా సామూహిక అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక తరఫున కేసును వాదిస్తున్న దీపికా సింగ్ రజావత్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. బాలిక కేసును వాదించకుండా, ఆ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా ఆమెకు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆమె అసహనంతో ఈ వ్యాఖ్య చేశారు. ఆమెకు బెదిరింపులు ఎదురైనవి ఎవరి నుంచో కావు. సాక్షాత్తు జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ సతాథియా నుంచి. ఈ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా మొదటి నుంచి అడ్డుకుంటున్న భూపిందర్ సింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన తనను తీవ్రంగా బెదిరించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు ఆమె ఆ తర్వాత తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. తాను ఎవరి పక్షం కానని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు... అందరి కేసులను వాదిస్తానని చెప్పారు. పిల్లలకు జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటుందో తాను ఊహించగలనని, తనకు ఓ ఐదేళ్ల పాప ఉందని, భూపిందర్ సింగ్‌కు కూడా ఓ పాప ఉండే ఉంటుందని ఆమె అన్నారు. బాలిక గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం నాడు జమ్మూలో బంద్ నిర్వహించిన హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం నాడు కూడా తన ఆందోళనను కొనసాగించింది. బాలిక రేప్ కేసును స్థానిక క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సవ్యంగానే దర్యాప్తు జరుపుతున్నారని, కేసును మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే నేడు కేసును సీబీఐకి అప్పగించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నదని రజావత్ ఆరోపించారు. తనను బెదిరించడంపై తాను జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. -
హైకోర్టులో భారీ ర్యాలీ
హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలో ఏపీ న్యాయవాదులు భారీ ర్యాలీ తీశారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు సంఘీభావంగా ర్యాలీ తీస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.హోదా వచ్చేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు. -
భోజనంలో బొద్దింక : రూ.84 లక్షలు కట్టండి..!
ముంబై : విమానంలో వెళ్లే సమయాల్లో కొన్ని సంస్థలు ప్రయాణికులకు భోజనం అందిస్తాయి. ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ ఆ భోజనంలో బొద్దింక వస్తే.. ఆ భోజనం తీసుకున్న వ్యక్తి లాయర్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కరెక్ట్ మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే సీన్ జరిగింది. భోజనంలో బొద్దింక రావడంతో ఆ న్యాయవాది ఏకంగా రూ.87 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ముంబై మిర్రర్ ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందని యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది గత నెల తన 40వ పుట్టిన రోజు జరుపుకోవడానికి భార్య సురిచి తోపాటు మరో 18 మంది స్నేహితలతో కలిసి ఎమిరేట్స్‌కు చెందిన విమానంలో మురాకోలోని కాసాబ్లాంకా నుంచి ముంబై ప్రయాణిస్తున్నారు. ఈసందర్భంగా సంస్థ బొద్దింక ఉన్న భోజనాన్ని ఇక్బాల్‌కు అందించింది. దీంతో ఆగ్రహించిన న్యాయవాది రూ.87లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ విమాన సంస్థకు నోటీసులు పంపించారు. ఈ సంఘటనతో తాను మానసికంగా బాధపడినందుకు నష్టపరిహారం రూ.50లక్షలు, తనకు తగిన సమయానికి ఆహారం అందివ్వనుందుకు రూ.30లక్షలు, తన భార్య ప్రయాణపు టికెట్లు రూ.7 లక్షలు, ఇలా మొత్తం రూ.87లక్షలను ఏప్రిల్ రెండో వారంలోపు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ప్రయాణికులు ఆరోగ్యం పట్ల విమాన సంస్థ బాధ్యతారాహిత్యంగా పనిచేస్తోందంటూ మండిపడిన ఇక్బాల్ అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాలని అన్నారు. ఆయన 17 ఏళ్ల నుంచి లండన్‌కు చెందిన అంతర్జాతీయ న్యాయ మండలిలో పనిచేస్తున్నారు. -
టాలీవుడ్ నటి ఆరోపణలు.. చిక్కుల్లో సిద్ధిఖీ
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్(సీడీఆర్)లో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన భార్యపై ప్రైవేట్ డిటెక్టివ్‌తో నిఘా వేయించి, ఆమె కాల్ డేటా సేకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ కేసులో రిజ్వాన్‌పై టాలీవుడ్ నటి ఒకరు సంచలన ఆరోపణలు దిగారు. రిజ్వాన్ తన కాల్ డేటాను కూడా దొంగిలించాడని నటి ఆకృతి నాగ్‌పాల్ ఆరోపిస్తున్నారు. తెలుగులో చిన్న చిన్న పాత్రలు, బాలీవుడ్లో చిత్రాలతోపాటు మోడల్‌గానూ ఆమె గుర్తింపు పొందారు. సోమవారం థానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె రిజ్వాన్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు తన వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కూడా ఓ కారణమని ఆమె అంటున్నారు. అనిల్ మిస్త్రీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆకృతి.. కాపురంలో కలతలు రేగటంతో 2014లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనిల్‌కు స్నేహితుడు అయిన రిజ్వాన్ తన కాల్ డేటాను దొంగిలించి తన భర్తకు అందజేసి ఉంటాడని ఆమె అనుమానిస్తున్నారు. ‘నా వైవాహిక జీవితం నాశనం కావటానికి రిజ్వాన్ కారణం. అతను అనిల్‌కు చిన్ననాటి స్నేహితుడు. పైగా విడాకుల సమయంలో ప్రొత్సహించి మరీ మరో యువతితో అనిల్‌కు మరో సంబంధం కుదిర్చాడు. సీడీఆర్ వ్యవహారం వెలుగులోకి రావటంతో నా అనుమానాలు నిజమనే భావిస్తున్నా. రిజ్వాన్‌కు అండగా ఉంటున్నవారిని కూడా విడిచిపెట్టకండి’ అని ఆకృతి చెబుతున్నారు. రిజ్వాన్ ఓ ప్రముఖ బాలీవుడ్ నటి డేటాను ఆమె భర్తకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు ఆకృతి ఆరోపణలతో కాల్ రికార్డింగ్ డేటా స్కామ్ పెద్ద వ్యవహారమే అయి ఉంటుందని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. రిజ్వాన్ పాత్ర గనుక నిజమని తేలితే నవాజుద్దీన్‌కు కూడా కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే ఈ స్కామ్‌లో పలువురి వీఐపీల హస్తం ఇందులో ఉందని చెబుతున్న పోలీసులు.. వారి పేర్లు వెల్లడించేందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. -
దుర్భాషలాడుతూ..కాళ్లతో తన్నుతూ..
నంద్యాలవ్యవసాయం : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నంద్యాల పట్టణంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ నాయకుడి మేనల్లుడు కంకణం కట్టుకున్నాడు. మహా దీక్ష శిబిరంపై దాడి చేసి హల్చల్ సృష్టించాడు. తన వాహనానికి అడ్డయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషకు దిగాడు. శిబిరం ముందు ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుతూ న్యాయవాదులతో వాదనకు దిగాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఇద్దరు న్యాయవాదులపై చెప్పుకాళ్లతో తన్ని బీభత్సం సృష్టించాడు. అతని వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై చేయి చేసుకునేంత పని చేశారు. ఇంత జరుగుతున్నా న్యాయవాదులు మాత్రం సంయమనం పాటించి అతన్ని అక్కడి నుంచి పంపించి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బార్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోమవారం మహాదీక్ష శిబిరం వద్దకు పలు ప్రజా సంఘాల, అఖిలపక్ష పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారు. వందలాది మంది శిబిరం వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నూనెపల్లె వైపు నుంచి శ్రీనివాససెంటర్ వైపు కారులో వెళ్తున్న స్థానిక టీడీపీ కౌన్సిలర్ వాకాశివశంకర్‌యాదవ్ మేనల్లుడు వేణు యాదవ్ కారు కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. సహనం కోల్పోయిన ఆయన కారుదిగి ‘‘మీ దీక్షలతో ఒరిగేముంది.. ఎవరి కోసం చేస్తున్నారు’’ అంటూ అసభ్యకరంగా తిడుతూ..శిబిరం వద్ద ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుకుంటూ న్యాయవాదులపైకి దూసుకొచ్చాడు. న్యాయవాదులు తేరుకొనేలోపే ఇద్దరిపై చెప్పుకాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించాడు. దీక్షలో కూర్చున్నవారు సైతం లేచి వచ్చే పరిస్థితి నెలకొంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక దీక్షలో కూర్చున్నవారు అయోమయానికి గురయ్యాడు. వేణుయాదవ్ వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై దుర్భాషలకు దిగారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా బూతు మాటలతో వాగ్వాదం చేశారు. చివరకు తన మనుషులను పిలిపించి దీక్షా శిబిరాన్ని తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తనతో వాగ్వాదానికి దిగినవారి అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమస్య తీవ్రతరం అవుతుండటంతో సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని వేణు యాదవ్‌ను బుజ్జగిస్తూ దీక్షా శిబిరం నుంచి పంపించారు. దీక్ష భగ్నానికి కుట్ర... గత 40రోజులుగా హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు శాంతియుత వాతావరణంలో చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు అనూహ్య స్పందన లభిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ప్రజల నుంచి సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీనిని ఓర్వలేని అధికార పార్టీ నాయకులు దీక్ష భగ్నానికి కుట్ర పన్నారని పలువురు న్యాయవాదులు సోముల నందీశ్వరరెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రతాపరెడ్డిలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఏర్పాటైతే సీమ వాసులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాము దీక్షలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. తమపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది గిట్టని వారి పనేనని బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ అన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే దాడి చేశారని, పోలీసులు తప్పక చర్యలు తీసుకోవాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లెస్వామిరెడ్డి అన్నారు. -
పోలీసుల తీరుపై న్యాయమూర్తి సీరియస్
లీగల్ (కడప అర్బన్) : ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై జి ల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సే వాధికార సంస్థ చైర్మన్ గోకవరపు శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సోమవారం తమ చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ∙ప్రొద్దుటూరు పట్టణం త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో పసుపులేటి శ్రీను అనే పదవ తరగతి విద్యార్థిపై నాగరాజు అనే కానిస్టేబుల్ దాడి చేశాడని మూడు రోజులుగా మీడియాలో కూడా వస్తోందని, ఎవరికైనా ఫిర్యాదుచేస్తే ఎన్కౌంటర్ చేస్తానని లేదా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని బాలుని తల్లి పద్మావతి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. డీఎల్ఎస్ఏ పరిధిలో ఫిర్యాదును స్వీకరించి ప్రొద్దుటూరు త్రీటౌన్ ఎస్ఐ, బాధ్యులైన సిబ్బందికి నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే మానవ హక్కుల ఉల్లంఘన, జువైనల్ జస్టిస్ యాక్టును ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ∙కడపలో ఎస్పీ డ్రైవర్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొంది మృతి చెందిన సుబ్బన్న భార్య రాజమ్మ (75) అనే వృద్ధురాలికి సంబంధించిన డబ్బును దాదాపు రూ. 10 లక్షలు కుటుంబ సభ్యులే తీసుకుని ఆమెను నిర్మల వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈ క్రమంలో వృద్ధురాలి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారి మధ్య రాజీ కుదిర్చి లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించామన్నారు. ఆమెకు సంబంధించిన డబ్బును రూ. 10 లక్షలు జిల్లా కోర్టులోని ఎస్బీఐలో డిపాజిట్ చేయించి ఆమె తదనంతరం ఆమె వారసులకు చెందేలా చేశామన్నారు.∙జమ్మలమడుగుకు చెందిన ఓ వృద్ధురాలిని ఇద్దరు కుమారులు పట్టించుకోలేదని, పక్కింటి వారు తమకు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును స్వీకరించి ఆమెను రిమ్స్‌లో చేర్పించేందుకు ప్రయత్నించామన్నారు. అంతలోనే ఆమె కుమారులు వచ్చి తాము చూసుకుంటామని చెప్పారన్నారు. తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. నేడు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛ భారత్ లెవెన్త్ బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో వంద మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు జిల్లా కోర్టు ఆవరణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో జిల్లా కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. -
ఎఫ్బీలో స్నేహితుడై.. ఆపై వెంటపడి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వివాహితను వేధించిన లాయర్‌ను లంగర్‌హౌజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చార్మినార్ ఖిల్వాత్ ప్రాంతానికి చెందిన లాయర్ మీర్జా మౌజం బైగ్ (31)పై లంగర్‌హౌజ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. మొదట ఫేస్బుక్లో పరిచయమైన బైగ్.. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిశాడని, ఇప్పుడు తనను లైంగికంగా వేధిస్తూ వెంటాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈవెంట్ మేనేజర్ కావడం వల్ల వృత్తిపరంగా తాను బైగ్తో కలిసి కొన్ని పార్టీలకు హాజరయ్యానని, ఈ క్రమంలో అతను తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని, అతడు స్నేహితులతో కలిసి ఫేస్బుక్లో తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడని ఆమె తెలిపింది. బైగ్ యూత్ కాంగ్రెస్ నేతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ‘అతను ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి.. తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెను బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు’ అని పోలీసులు తెలిపారు. బైగ్ తన స్నేహితులు జీషాల్ అలీ ఖాన్, మెహ్రాజ్ పటేల్, మహ్మద్ లుఖ్మన్‌లతో ఆమె వ్యక్తిగత విషయాలు చర్చించి.. వారి ద్వారా ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేశాడని, అంతేకాకుండా తన స్నేహితుడు షైక్ అహ్మద్ పర్వేజ్ ద్వారా బాధితురాలి భర్తకు ఈ పుకార్లు చేరవేశాడని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు బైగ్‌ను విచారణకు పిలిచామని, హాజరుకాకపోవడంతో మంగళవారం అరెస్టు చేశామని తెలిపారు. అయితే, తనకు అస్వస్థతగా ఉందని అతను ఆస్పత్రిలో చేరాడని, అనంతరం పోలీసులు తనను విచారణ సందర్భంగా కొట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. -
అవకాశమిస్తే అదరగొడతాం..
హుజూరాబాద్: అమ్మాయిని ఒకలా.. అబ్బాయిని ఒకలా చూడడం మంచిది కాదు. కొడుకైనా ..కూతురైనా ఒక్కటే అనే భావన ఉండాలి. మహిళలను ప్రోత్సహించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమని హుజూరాబాద్‌కు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కంకణాల విజయారెడ్డి అన్నారు. ఇటు న్యాయవాద వృత్తి, అటు రాజకీయాల్లో రాణిస్తున్న విజయారెడ్డి మహిళా వివక్ష, సాధికారతపై ‘సాక్షి’తో మాట్లాడారు. భర్త ప్రోత్సాహంతో.. మాది నల్గొండ జిల్లా. పెళ్లికి ముందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా ను. డాక్టర్ కావాలని ఎంసెట్ కూడా రాశాను. కానీ సీటు రాలే దు. పెళ్లి తర్వాత హుజూరాబాద్‌లో విద్యానికేతన్ స్కూల్ ప్రారంభించి.. పదేళ్లపాటు నడిపాను. అప్పటికే మా ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు కూడా న్యాయవాది కావాలనే ఆసక్తి కలిగింది. ఓ వైపు స్కూల్ నడుపుతూనే మరో వైపు ఎల్ఎల్బీ పూర్తి చేశాను. 1990లో న్యాయవాది పట్టా అందుకొని హుజూరాబాద్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాను. ఆ రోజుల్లో మహిళా న్యాయవాదిని హుజూరాబాద్ కోర్టులో నేను ఒక్కరినే. నా భర్త ప్రోత్సాహంతోనే ఈ వృత్తిలో రాణించాను. కోర్టులో కూడా తోటి న్యాయవాదులు ప్రోత్సహించే వారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన మూడేళ్లలోనే హుజూరాబాద్ కోర్డులో మొట్టమొదటి ఏజీపీగా నియామకమయ్యాను. అప్పట్లో భర్తల చేతిలో వివక్షకు గురైన బాధితుల కేసులను వాదించి, వారికి అండగా నిలిచాను. వంటింటి నుంచి బయటకు రావాలి మహిళలు భర్త చాటు భార్యగా, వంటింటికే పరిమితం అనే భావన ఉండకూడదు. మగవాళ్ల మాదిరిగానే మహిళలు కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అప్పుడే సమాజంలో నెలకొన్న అసమానతలు కొంత మేరకైనా తొలుగుతాయనేది నా భావన. మా నాన్న కట్ట రాంచంద్రారెడ్డి(మాజీ ఎమ్మెల్సీ) వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాను. 2004లో హుజూరాబాద్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. వృత్తిలోనైనా, రాజకీయంగానైనా స్వతహాగానే నిర్ణయాలు తీసుకుంటాను. మా ఆయన భగవాన్‌రెడ్డి, పిల్లల ప్రోత్సాహం చాలా ఉంది. అసమానతలు, అవరోధాలను అధిగమించినప్పుడే మహిళలు రాణిస్తున్నారు. ఇదంతా బాలికల అక్షరాస్యతతోనే సాధ్యమవుతుంది. -
మహిళల హక్కుల రక్షణకే వృత్తి చేపట్టా..
నల్లగొండ లీగల్ : ‘మహిళా హక్కుల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. వాటిని మహిళలకు తెలియజేసి, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాద వృత్తిని చేపట్టా’ అని చెబుతోంది.. నల్లగొండకు చెందిన న్యాయవాది జి.మనీషా. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ‘సాక్షి’ వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నేను బీ.ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కార ణం మా నాన్న మాల కొండారెడ్డి కూడా న్యాయవాది కావడంతోనే ఈ వృత్తిపై ఆసక్తి పెరిగింది. 2011లో నెట్టెంపాడు ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న (ప్రస్తుత నల్లగొండ జాÆ ‡ుుంట్ కలెక్టర్) సి.నారాయణరెడ్డితో వివాహం జరిగింది. నా భర్త ప్రోత్సాహంతో 2016లో లా డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం నల్లగొండ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. సత్వర న్యాయం సమన్యాయమే ధ్యేయంగా భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. మహిళను ప్రోత్సహిస్తే ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంది. ప్రజలకు చట్టాలపై అవగాహ న తీసుకురావడానికి న్యాయవిజ్ఞాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలు పరిష్కారం కావడానికి కోర్టుల్లో ఎక్కువ సమయం పడుతుంది. పెరుగుతున్న కేసుల రద్దీకి అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. కక్షిదారులకు సమ్మతి మేర కు లోక్ అదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఇటీవల పెద్ద సంఖ్యలో మహిళలు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయమందించడం సంతోషకరం. మహిళలు చట్టాలపై అవగాహన కలిగించాలి మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రావడం జరిగింది. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ చట్టాల ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు. – దువ్య గీత, న్యాయవాది, నల్లగొండ లాయర్ కావాలనే.. పేదలు, మహిళలు, బాలల హక్కులను కాపాడానికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినా, వదులుకుని న్యాయ విద్యనభ్యసించి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నా. పట్టుదలతో చదివి న్యాయవాదిని అయ్యా. మహిళలకు న్యాయ సాయం అందించడంతో పాటు వారి హక్కులను తెలియపరుస్తున్నా. – మామిడి ప్రమీల, న్యాయవాది, నల్లగొండ బాల్యంలోనే అన్యాయంపై ప్రశ్నించేదాన్ని.. కోదాడఅర్బన్ : ఏ విషయంలో అన్యాయం జరిగిందని అనిపిస్తే దానిపై చిన్నతనంలోనే ప్రశ్నించేదానిని. బీఎస్సీ చదివిన నేను స్వతహాగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నా. 1988–91 మధ్య కాలంలో గుంటూరులోరి ఆంధ్రా క్రిస్టియన్(ఏసీ) కాలేజీలో బీఎల్ కోర్సు పూర్తి చేశా. అనంతరం ఆరునెలలు హైదరాబాద్‌లో పనిచేశా. 1992 నుంచి నేటివరకు కోదాడ కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నా. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే కావడంతో నేను న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుత తరం అమ్మాయిలు ధైర్యంగా ఉండి, క్లిష్ట పరిస్థితులను ఎదిరించే విధంగా తయారుకావాలి. న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించవచ్చు. బాధితులకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, న్యాయవాది, కోదాడ పెండింగ్ కేసులను పరిష్కరించాలి వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలి. మహిళల హక్కుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటి అమలులో లోపాల వల్ల నేటికి మహిళలు సకాలంలో న్యాయం పొందడం లేదు. చట్టాలను అమలు పర్చాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. – ఎన్.సంధ్యారాణి, న్యాయవాది, నల్లగొండ న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో న్యాయసేవాధికార సంస్థతో పాటు ప్రభుత్వ కృషి ఉండాలి. న్యాయవాదిగా పనిచేస్తూ మహిళల తరఫున నిలబడాలనే తపనతోనే ఈ వృత్తిని ఎంచుకున్నా. న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. – ఎం.ప్రగతి, న్యాయవాది, నల్లగొండ -
ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి..
కోరుట్ల: మహిళలపై వివక్ష ఇంటి నుంచే పోవాలి. ఆడపిల్ల అనే చిన్నచూపు చూడొద్దు. అప్పుడే వారు ఉన్నత చదువులతో సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. స్త్రీలు చేస్తున్న వివక్షపై పోరాటానికి మద్దతుగా నిలిస్తే సమాజాభివృద్ధి కూడా సాధ్యమంటున్నారు కోరుట్లకు చెందిన న్యాయవాది మామిడిపల్లి విజయలక్ష్మి. మహిళలపై వివక్ష ఎలా కొనసాగుతుంది..ఎలా దూరం చేయాలనే అంశాలను ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్న సమస్యలే.. మూడేళ్ల క్రితం న్యాయవాది కోర్సు పూర్తి చేశా. ఏడాదిన్నరగా ప్రాక్టిస్ చేస్తున్నా. ఇంత తక్కువ వ్యవధిలోనే మహిళలకు సంబంధించిన వివక్ష కేసులు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. అన్నీ చిన్నచిన్న సమస్యలే. ఓ భర్త భార్య అందంగా ఉందని తరచూ గుండు కొట్టిస్తూ ఆమెను అనాకారిగా ఉంచే ప్రయత్నం చేసిన కేసును పరిశీలించా. పెళ్లి చేసుకునే సమయంలో అందంగా ఉండాలంటారు. తర్వాత ఇలా ఇబ్బంది పెడతారు. రంగు..రూపు..సంతానం..ఎక్కువ చదువు వంటి ఎన్నో చిన్నపాటి సమస్యలతో మహిళలను భర్తలు ఇబ్బందులు పెడుతున్న కేసులు అనేకం చూశాను. ఈ వివక్ష రూపుమాపడానికి సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావాలి. వివక్ష అంతానికి మహిళలు చేసే పోరాటానికి మద్దతుగా నిలవాలి. ఆర్థికంగా బలోపేతం కావాలి మహిళలు సైతం ఒకరిపై ఆధారపడి బతికే పరిస్థితి నుంచి వాళ్ల కాళ్లపై వారు నిలబడాలి. ఆడపిల్లలు చిన్ననాటి నుంచి సమాజంలో ఎదురవుతున్న అవరోధాలు అధిగమించడం కష్టమే. కానీ వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఇల్లు.. పరిసరాలు.. సమాజం ఎక్కడిక్కడే ఆడపిల్లల చుట్టూ గిరిగీసి చిన్నచూపుతో వ్యవహరిస్తున్న ఫలితంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళలపై వివక్ష.. రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రావడం కీలకం. తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో వివక్ష చూపకపోతే వారి కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. ఇంటిలో నుంచి మొదలయ్యే వివక్షను తల్లిదండ్రులు దూరం చేస్తే చాలు.. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు. -
విద్యతోనే మహిళలకు గౌరవం
సంగారెడ్డిజోన్ : స్వశక్తి, విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని.. ఇందుకు సమాజ ఆలోచనా విధానంలోనూ మార్పులు రావాలని ప్రముఖ న్యాయవాది శైలజ పేర్కొన్నారు. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఎంచుకున్న న్యాయవాది వృత్తిలో రాణిస్తున్నారు. ఆమె మాటల్లో మరిన్ని వివరాలు.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణరెడ్డి, జయప్రద దంపతుల మూడో కుమార్తె నేను. లెఫ్ట్ భావజాలం కలిగిన నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ప్రధాన ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్న అమ్మే మమ్మల్ని పెంచింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా మమ్మల్ని చదివించింది. అమ్మే నాకు రోల్ మోడల్. తన జీవితాన్నే మాకు పాఠంగా నేర్పింది. వేర్వేరు కుటుంబల నుంచి వచ్చి ఆదర్శ వివాహం చేసుకున్నామని అమ్మె మాకు చెప్పేది. ఈక్రమంలో భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మాకిచ్చింది. నాటి ప్రముఖ రచయిత శరత్ సాçహిత్యం ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. విద్యార్థి దశలో లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అమ్మనాన్నల వల్ల నిజాయితీగా బతకడం నేర్చుకున్నా. ఎమ్మెల్యే కోటాలో హైదరాబాద్‌లో ఫ్లాట్ ఇస్తే తిరస్కరించాం. 1985లో సంగారెడ్డిలో నేను న్యాయవాద వృత్తిని చేపట్టిన సమయంలో మహిళలు ఎవరూ లేరు. నా సీనియర్ కుటుంబ స్నేహితుడు చల్ల నరసింహారెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశా. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ.. నిజాయితీగా పని చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. కుటుంబంతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండటం వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా. సమస్యల పరిష్కారానికి చట్టాలు సమస్యలు ఎన్ని ఉన్నయో.. వాటి పరిష్కారానికి అన్ని చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబాల ఆలోచనలో మార్పులు రావాలి. ఆడపిల్లలు అన్న చిన్నచూపు ఉండకూడదు. హంగు, ఆర్భాటం మధ్య వివాహాలు చేయడం వల్ల ఖర్చులు పెరిగి ఆడపిల్ల వివాహాన్ని తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. మోసపోతున్న బాలికలు కిశోర దశలో ఉండే సందిగ్ధం, ఆకర్షణ వల్ల బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. సమాజంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బాధితులకు చట్టపరమైన రక్షణ, సమాజ సహకారంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. -
నాన్న ప్రోత్సాహంతోనే..
మెదక్‌జోన్: ‘ఆడపిల్లవు నీకెందుకు ఉన్నత చదువులు అని మేనత్తలు, బంధువులు వారించినా.. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని ఆడ, మగ చదవాల్సిందే అని నాన్న ప్రోత్సహించారు. ఆయన ప్రోత్భలంతోనే నేడు న్యాయమూర్తిగా రాణిస్తున్నా.’ అని మెదక్ జూనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ తెలిపారు. ఆమె మాటల్లోనే మరిన్ని వివరాలు.. మేము ఐదుగురు సంతానం మాది హైదరాబాద్. తండ్రి రజాక్, తల్లి సిరాజ్ నస్రీన్. మేము ఐదుగురు సంతానం. వీరిలో నలుగురుం ఆడపిల్లలం. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అందులో నేను మూడో సంతానం. అమ్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నాన్న లా చదివి వ్యాపారంలో స్థిరపడ్డారు. మా ఐదుగురినీ ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ పూర్తి అయిన తర్వాత లా చదివే సమయంలో.. ‘ఆడపిల్లకు ఉన్నత చదువులు ఎందుకు.. చదువు మాన్పించు..’ అంటూ మా మేనత్త, బంధువులు నాన్నకు చెప్పారు. కానీ, నాన్న మాత్రం చదువుతోనే వాళ్లు సొంతంగా నిలబడతారని చెప్పారు. దీంతో నేను లండన్‌లో ఎల్.ఎల్.ఎం. పూర్తి చేశా. తర్వాత మొదటిసారి పరీక్ష రాసి జడ్జీగా ఎంపికయ్యా. ఇల్లాలికి చదువు చాలా అవసరం ప్రతి ఇల్లాలికి చదువు రావాలి. పిల్లలను పెంచడంలో తండ్రి కన్నా తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లికి చదువు వస్తే పిల్లల భవిష్యత్తు మరింత తీర్చిదిద్దవచ్చు. కుటుంబ బాధ్యతలు సైతం సక్రమంగా నిర్వహించే వీలుంటుంది. ప్రస్తుతం ఆడపిల్లలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. చదువుతోనే విజ్ఞానం పెరుగుతుంది.. అంతేకాదు తమ హక్కుల గురించి మహిళలు తెలుసుకునే వీలుంటుంది. చదువంటే ఉద్యోగం కాదు ఉన్నత చదువులు అనగానే కొందరు తల్లిదండ్రులకు మంచి ఉద్యోగం వస్తుంది అని ఆలోచిస్తారు. కానీ, చదువంటే ఉద్యోగం కాదు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. విజ్ఞానం పెరిగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. మంచి ఉద్యోగం సాధించేలా మాత్రమే చదివించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. చట్టాలపై అవగాహన అవసరం మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం. విడాకులు, మెయింటనెన్స్, వరకట్న వేధింపులు, గృహహింస లాంటి కేసుల్లో మహిళలు అధికంగా కోర్టుకు వస్తున్నారు. కానీ, కోర్టుకు వచ్చే మహిళల్లో 90 శాతం మందికి చట్టాలపై అసలు అవగాహన లేదు. కొన్ని సందర్భాల్లో ఈ విషయం నన్ను చాలా బాధిస్తుంది. మహిళలకు చట్టాల మీద అవగాహన కలగాలంటే చదువే ఏకైక మార్గం. వృత్తిలో సంతోషం నాన్న ఎంతో ఇష్టంతో లండన్‌లో నన్ను ఎల్.ఎల్.ఎం. చదివించారు. ఆ తర్వాత మొదటి పరీక్షలోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యా. సుమారు 18 నెలలుగా న్యాయమూర్తి వృత్తిలో కొనసాగుతున్నా. పట్టుదలతో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఉన్నత శిఖరాలు చేరడం కష్టమేమీ కాదు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. -
బోర్డర్ బోర్డర్
ఉదయాన్నే తయారై.. చీర సవరించుకుని సజావుగా నల్ల కోటు వేసుకుని అద్దం ముందు నిలబడింది. అబ్బ! అచ్చం న్యాయం నిలబడినట్లే ఉంది! కానీ అద్దంలో.. తన చుట్టూ కంచె కనబడింది! తను ఆ బోర్డర్‌ను దాటగలదా? ‘ఆర్డర్..ఆర్డర్.. అడ్డు తొలగండి’ అనే జడ్జిగారి ఆదేశాన్ని ఎప్పటికైనా తను వినగలదా? లేక.. మహిళా అడ్వకేట్లు సమన్యాయానికి బోర్డర్‌లోనే ఉండిపోతారా? స్వాతంత్య్ర సంగ్రామంలో ముందు నిలిచిన మహిళలెందరో న్యాయవాదులేనని చదివి, న్యాయవాదిగా ఉంటే ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం ఉండదనీ న్యాయవాద వృత్తిలోనికి అడుగుపెట్టాను. నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఈ వృత్తిని ఎంచుకున్నాను. కానీ నాది రాంగ్ ఇంప్రెషన్ అని త్వరలోనే అర్థం అయ్యింది! నన్ను చిల్లర లాయరన్నారు. బీదాబిక్కీ కేసులు తప్ప ఈమెకెవరిస్తారు కేసులన్నారు. అసలు ఈ ప్రొఫెషన్ నుంచే తరిమికొట్టాలనుకున్నారు. ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నానో అక్కడే తలెత్తుకొని నిలబడ్డాను. నాకు పొలిటికల్ సపోర్ట్‌లేదు. నా తాత ముత్తాతలెవరూ న్యాయమూర్తులు కారు. న్యాయవాదులూ కారు. నాకు నేనుగా ఈ వృత్తిలోకి అడుగుపెట్టాను.హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాక కానీ నాకర్థం కాలేదు. న్యాయవాద వృత్తిలో ఆడవాళ్లు కొనసాగడమంటే మగ లాయర్లకి అసిస్టెంట్స్‌గానే కొనసాగాలి తప్ప స్వతంత్రంగా ఎదగనివ్వరని. ఎన్నేళ్లయినా ఆడవాళ్లు అక్కడ జూనియర్స్గానే ఉంటారు తప్ప వారికన్నా మేం అద్భుతంగా కేసులు వాదించగలమనీ, మాకు టాలెంట్ ఉందనీ వారు గుర్తించరు. కాదు గుర్తించనట్టు నటిస్తారు. అసలు మా సీనియర్స్ మాదాకా కేసులు రానివ్వరు. నోట్స్ నాది.. వాదన వేరొకరిది! అలాంటి మేల్ డామినేటెడ్ వ్యవస్థలో నాకు నేనుగా ఎదిగేందుకు ఎంత కష్టపడ్డానో చెప్పలేను! ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్త లోనే మా బాస్ అప్పజెప్పిన కేసుని ఇంటికి తెచ్చుకునేదాన్ని. ఇంట్లో పని ముగించుకుని అంతా నిద్రపోయాక రాత్రంతా మేల్కొని ఉండి, కేసు వివరాలు చదివి ప్రతి విషయాన్ని నోట్స్ రాసుకుని అరటిపండు ఒలిచి ఇచ్చినంత సులభంగా కేసుని విడమర్చి నా సీనియర్ ముందు పెట్టేదాన్ని. దాన్ని నా సీనియర్ వాదించాల్సిందిపోయి నా నోట్స్‌ని నాలాంటి మరో మగ జూనియర్కిచ్చి.. ‘కేసు చాలా విపులంగా రాసి వుంది నోట్స్‌లో, నువ్వు వాదించు’ అని ఇచ్చేవాడు! కేసుగురించి ఒక్కముక్క తెలియకపోయినా నా నోట్సు తీసుకుని ఒక పురుష న్యాయవాది వాదించగలిగినప్పుడు కేసుని అమూలాగ్రం చదివిన నేను వాదించలేనా? నాన్ కో–పరేషన్ చేశాను నిజానికి మా గురువుగారికి (ప్రముఖ క్రిమినల్ లాయర్ ఆయన) నేను బాగా వాదించగలనని తెలియడానికే చాలా కాలం పట్టింది. నాకు వాదించే అవకాశం మా సీనియర్స్ రానిస్తేగదా నేనేం చేస్తానో తెలిసేది? అలాంటి ఒక రోజు రానే వచ్చింది. మా సీనియర్స్ నా వరకు కేసులు రాకుండా కట్టుదిట్టం చేశారు. అంతే. నేను నాన్–కోపరేషన్ చేశాను. హాయిగా కూర్చొని సుప్రీంకోర్టు కేసులను స్టడీ చేసేదాన్ని. ఆఫీసుకొచ్చే కేసులు చదవడం మానేశాను. అది మా బాస్ గుర్తించారు. ఒక రోజు సడన్‌గా మా గురువుగారు నన్ను పిలిచారు. ఓ కేసు నా ముందు పెట్టి ‘‘చదివావా ఇది?’’ అని అడిగారు. చదవలేదని చెప్పకుండా, చదువుతానని చెప్పాను. అది ఒక మర్డర్ కేసు. ఆయన ఒకేసారి రెండు కేసులు వాదించాల్సి వచ్చింది. ఒక కేసు నన్ను వాదించమని అడిగారు. ఆయనకు నామీద నమ్మకమే కానీ మిగిలిన వాళ్లు కల్పించిన అపోహలు కూడా ఉంటాయి కదా. ఆనందంగా ఒప్పుకున్నాను. కేసు గెలుస్తామని ఆయన ఊహించలేదు కానీ, శిక్ష తగ్గించొచ్చని భావించారు. అయితే నేను కేసు గెలవడంతో ఆయన చాలా ఆనందించారు. గెలుపు మగాళ్లకు మాత్రమే సాధ్యం కాదని, అప్పుడే నిరూపించాను. మొదటి కేసులో ‘చచ్చి’గెలిచాను నేను టేకప్ చేసి, వాదించిన మొదటి కేసు నాకింకా గుర్తుంది. అది డబుల్ మర్డర్ కేసు. ఆ కేసులో నిందితుడి తండ్రి మా తాతగారి దగ్గర పనిచేశాడు. అతను నా దగ్గరికొచ్చి కేసు వాదించమని అడిగాడు. ‘‘ఎవరో ఒకరు వాదిస్తార్లే. నీకెందుకు. వదిలెయ్’’ అన్నారు మావాళ్లు. మన ఊరికి సంబంధించిన వాళ్లని మర్డర్ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ వాదిస్తే మన పరువే పోతుందన్నారు. ‘‘అయినా క్రిమినల్ విషయాల్లోకి నువ్వెందుకు?’’ అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. నాన్న కూడా.. ‘‘ఈ కేసు ఎందుకులేమ్మా’’ అని వారించారు. అయినా నేనూర్కోలేదు. ‘‘గయోపాఖ్యానం పురాణ కాలక్షేపానికా? లేక జీవితానికి అన్వయించుకోవడానికా నాన్నా?’’ అని ప్రశ్నించాను. కేసు ఒప్పుకున్నాను. శాయశక్తులూ ఒడ్డాను. అలా నా మొదటి కేసు గెలిచాను. ఆ తరువాత నాకర్థం అయ్యింది. అక్కడెవ్వరూ మనకు సపోర్ట్ చేయరు. మనల్ని మనమే గెలిపించుకోవాలి. నిరూపించుకోవాలి. అణిగిమణిగి ఉంటే ఫరవాలేదు. కానీ వారికి పోటీగా ఎదిగితే మాత్రం కొత్త ఆశల చిగుళ్లను నిర్దాక్షిణ్యంగా కత్తిరించేస్తారు. క్యారెక్టర్‌పై ముద్ర వేస్తారు ఇక్కడ వివక్షనుంచి దూరంగా వెళ్లేందుకు ఓ నాలుగేళ్లు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా Ðð ళ్లిపోయాను. నాలుగేళ్లకి మళ్లీ తిరిగొచ్చాను. ఆ తర్వాత లీగల్ ఎయిడ్ పానల్ మెంబర్ని అయ్యాను. ఇక్కడ పేదవాళ్ల పక్షాన, డబ్బులు లేని వారి పక్షాన వాదించినప్పుడు.. చిల్లర కేసులు అని హేళన. కూలినాలోళ్ల కేసులు వాదిస్తానని ఎద్దేవా చేయడం. వాళ్లు తప్ప నాదగ్గరికెవ్వరూ రారట. 2009లో మా సీనియర్స్‌తో ఈక్వల్‌గా ఫైలింగ్స్ వచ్చాయి. అంతే ఇండిపెండెంట్ అయిపోయాను. క్రిమినల్ విభాగంలో ఓ మహిళ అత్యధిక కేసులు వాదిస్తే ఏమౌతుంది? వాళ్ల (పురుష లాయర్ల)కి ఒళ్లు మండుతుంది. అంతగా వినకపోతే బ్యాడ్ క్యారెక్టర్‌గా ముద్రవేస్తారు. ఈమె డబ్బుకోసం ఇదంతా చేస్తోందని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. నాకు కేసులు ఇవ్వండి అని నేనెప్పుడూ దేబిరించలేదు. నాకు నేనుగా ఎదిగాక క్లైంట్సే నా దగ్గరికొచ్చి వాదించమని అడిగారు. ఫలానా గాయత్రీగారైతే బాగా వాదించగలరని వారిలో నమ్మకం కల్పించగలిగాను. నోరెత్తడానికి లేదు! స్త్రీలలో ఎంతో ఆంబిషన్ ఉంటే తప్ప పురుషాధిపత్య వృత్తుల్లోకి రారు. ఇప్పటికీ ఏ పోస్టులైనా ముందుగా వరించేది మగవాళ్లనే. స్త్రీలు అసలు అక్కడ లెక్కలోకేరారు. అడ్వకేట్ కమ్యూనిటీలో మహిళలు నోరెత్తడానికి లేదు. భయంకరమైన ఇన్జస్టీస్. సమన్యాయాన్ని అందించాల్సిన చోట అసమానత్వం. న్యాయాన్ని పంచాల్సిన చోట అన్యాయం. ఇది ఎవ్వరూ రాసి ఉంచరు. మాట్లాడరు. కానీ అలా అణచివేత జరిగిపోతూ ఉంటుంది అంతే. ►న్యాయవాదులుగా స్త్రీలు ఉండడమంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చేందుకో, పాస్ఓవర్ (కేసుకి సీనియర్ లాయర్ అటెండ్ అవలేని పరిస్థితుల్లో వాయిదావేయమని కోరడం)లు అడగడానికో తప్ప కేసులు వాదించడానికి పనికిరారు అన్నంతగా ఉంటుంది వివక్ష. అలా ఎప్పటికోగానీ నాకు కేసు వాదించే అవకాశాన్ని ఇవ్వలేదు. అసమాన సమాజంలో ఆత్మగౌరవం కోసం ఆమె ఆరాటపడ్డారు. రాజ్యాంగ నిర్మాతలు మొదలు స్వాతంత్య్ర సంగ్రామంలో పేరుగాంచిన నేతలెందరో న్యాయవాద వృత్తిని నెరిపిన వారేనని భావించి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ అక్కడా అసమానతల అడ్డుగోడలు ఆమెను ముందుకు సాగనివ్వలేదు. అయినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. అన్ని అడ్డంకులనూ దాటుకుని పురుషన్యాయాన్ని సవాల్ చేస్తూ ఓ క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన దైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తోన్న గాయత్రీ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చదువుకొని అసమానతల అడ్డుగోడలను తొలగించుకొని అంచెలంచెలుగా ఎదిగివచ్చిన క్రమాన్ని సాక్షితో పంచుకున్నారు. - గాయత్రీరెడ్డి, క్రిమినల్ లాయర్, హైకోర్టు -
నకిలీ నోట్ల కేసులో న్యాయవాది అరెస్ట్
తిరుపతి క్రైం: తిరుపతి నగరంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ న్యాయవాదితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఈస్టు సబ్ డివిజనల్ ఇన్చార్జి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం ఈస్టు పోలీసు స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలచెరువు రోడ్డులోని పళణి థియేటర్ సమీపంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఈస్టు సీఐ శివప్రసాద్, ఎస్ఐలు షేక్షావలి, ప్రవీణ్‌కుమార్ తమ సిబ్బందితో దాడి చేశారని పేర్కొన్నారు. ఇందులో దొంగనోట్లు చెలామణి చేస్తున్న వైఎస్సార్ జిల్లాకు చెందిన న్యాయవాది రామచంద్రరావును అరెస్టు చేశామన్నారు. అతను తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటూ స్థానిక కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపారు. స్నేహితుడి సాయంతో దొంగనోట్లను చెలామణి చేస్తున్నట్టు వివరించారు. అతని వద్ద ఉన్న దొంగనోట్లు రూ.17,500తోపాటు చెన్నారెడ్డికాలనీలో ఉన్న ఇంట్లో ఉంచిన రూ.4.80 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందిన నాగాహరిప్రసాద్ ద్వారా వచ్చినట్టు విచారణలో చెప్పాడన్నారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అతని నుంచి రూ.2 లక్షల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరి వద్ద నుంచి మొత్తం రూ.4,97,500 దొంగనోట్లు, రూ.3.28 లక్షల ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
కారు స్పీకర్ ఆర్డర్ చేస్తే.. ఇటుక వచ్చింది!
సాక్షి, అన్నానగర్: ఆన్లైన్ ద్వారా కారుస్పీకర్‌ను బుకింగ్ చేయగా కొరియర్ పార్శిల్లో ఇటుక వచ్చింది. ఈ ఘటన తూత్తుక్కుడి సమీపంలోని ముల్‌లైక్కాటులో చోటుచేసుకుంది. న్యాయవాది సెవ్వకుమార్ తన కారు స్పీకర్ కోసం గత 1వ తేదీన(జనవరి01) ఆన్లైన్ బుకింగ్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం సదరు సంస్థ నుంచి వచ్చిన ఆ పార్శిల్ని ప్రైవేట్ కొరియర్ సంస్థ కార్మికుడు సెల్వకుమార్‌కు అందజేశాడు. సెల్వకుమార్ స్పీకర్ ధర రూ. 5వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నాడు. ఆ పార్శిల్ తెరిచి చూడగా అందులో ఇటుక ఉంది. కొరియర్ సంస్థకు ఫోన్ చేయగా వారు సరిగ్గా సమాధానమివ్వలేదు. దీనిపై ఆయన మల్తైయాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొరియర్ సంస్థ యజమానిని విచారణ చేశారు. సదరు కంపెనీ యజామాని సెల్వకుమార్‌కు నగదు తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
నటుడు విజయ్ ఆత్మహత్య కేసు: లాయర్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: గత నెల 11న యూసుఫ్‌గూడలోని తనప్లాట్లో కమెడియన్ విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లాయర్ శ్రీనివాస్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విజయ్‌సాయి భార్య వనితారెడ్డి ఇంకా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఆమెకు మరో నోటీసు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు సిద్ధమవుతున్నారు.