న్యాయం చేయాల్సిన వాడే కన్నేశాడు | Advocate Molestation On Women Divorce case Victim | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాల్సిన వాడే కన్నేశాడు

Published Sun, Jan 23 2022 1:55 AM | Last Updated on Sun, Jan 23 2022 4:24 AM

Advocate Molestation On Women Divorce case Victim - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న​ ఓ లాయర్‌ సాయం కోసం వచ్చిన యువతిపై కన్నేశాడు. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆ యువతి(25)కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. తను ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం కూడా చేస్తోంది. కాగా తన భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకునేందుకు సిద్దమైంది. దాంతో గతేడాది జూన్‌లో స్థానికంగా ఉండే ఓ లాయర్‌ను కలిసింది. తన భర్తతో విడాకులు ఇప్పించమని కోరింది. ఇక ఇదే అదనుగా భావించాడు ఆ లాయర్. అతని కన్ను ఆ యువతిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఓ రోజు తన ఆఫీస్‌కు రప్పించుకున్నాడు. అలా ఆ యువతితో చనువు పెంచుకున్నాడు.

అయితే అప్పటికే భర్త నుండి దూరంగా ఉండాలని భావించిన సదరు యువతి ప్రస్తుతం తాను ఉన్న ఇంటి నుంచి మరో ఇంటికి మారాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్ తాను నివసించే ప్రాంతంలో ఓ ఫ్లాటుందని చెప్పడంతో అతడ్ని నమ్మిన యువతి ఫ్లాట్‌లోకి వచ్చి చేరింది. ఇక ఇక్కడే ఆ లాయర్‌ తన వంకర బుద్దిని చూపించాడు. తానొక ప్రోఫెషనల్ వృత్తిలో ఉన్న విషయం కూడా మరిచిపోయి ఆ ఇంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బాధితురాలు దుస్తులు మార్చుకునే వీడియోలను బాధితురాలికి చూపించి తనను బెదిరించి శారీరకంగా లోబరుచుకున్నాడు.

ఇలా తరచూ తన లైంగిక వాంఛను తీర్చుకోసాగాడు. ఇక అప్పటికే తన భర్త కారణంగా మానసిక ఆందోళనకు గురైన తనను ఇలా ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నా అతడు ఆమెను వదల్లేదు. అయితే అతడి వేధింపులు శృతిమించడంతో విసిగిపోయిన బాధితురాలు మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement