న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా గట్టిగా అరుస్తూ మాట్లాడిన ఓ న్యాయవాదిపై బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి కోర్టును ఎవరూ భయపెట్టలేరని హెచ్చరించారు. న్యాయస్థానంలో అనుచితంగా ప్రవర్తించడం తగదని తేల్చిచెప్పారు. ‘‘నువ్వు లాయర్‌గా సాధారణంగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటావు? బిగ్గరగా అరుస్తూ మాట్లాడి మమ్మల్ని భయపెట్టడం నీవల్ల కాదు. నా 23 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే పద్ధతి ఇదేనా? న్యాయమూర్తుల ముందు ఎప్పుడూ ఇలాగే అరుస్తావా? నేను మరో ఏడాది లోగా పదవీ విరమణ చేయబోతున్నా. కోర్టులో లాయర్లు ఇష్టానుసారంగా మాట్లాడడం చూడాలని నేను కోరుకోవడం లేదు. నీ గొంతు తగ్గించు’’ అని సదరు లాయర్‌కు తేలి్చచెప్పారు. దీంతో ఆ లాయర్ వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు నుంచి, జస్టిస్ చంద్రచూడ్ నుంచి క్షమాపణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment