Angry
-
కూటమిని అనవసరంగా గెలిపించాం : మహిళలు
-
KSR Live Show: మోదీ మీటింగ్ మీద ఉన్న శ్రద్ధ.. భక్తులపై ఉంటే ఇంత ఘోరం జరిగేదా !
-
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
-
మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్‌ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్‌బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్‌బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్‌పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్‌బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
చండీగఢ్: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టిక్కెట్ పంపిణీలో భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై మహిళా నేత కుమారి సెల్జా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఇంకా ప్రచారానికి సిద్ధం కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో భూపేంద్ర సింగ్ హుడా తన వర్గం మినహా మిగిలిన నేతలందరినీ విస్మరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళా నేత సెల్జా తాను ఉక్లానా నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆమెకు ఆ స్థానం కేటాయించలేదు. ఉక్లానా నుంచి సెల్జా మేనల్లుడు హర్ష్‌కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనా అందుకు సెల్జా అంగీకారం తెలుపలేదు.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కుమారి సెల్జాకు సన్నిహితంగా భావించే 90 మంది అభ్యర్థుల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్ దక్కింది. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు. 90 మందిలో 78 మంది అభ్యర్థులు హుడా వర్గానికి చెందినవారు కాగా, ఏడుగురు సెల్జా, ఇద్దరు సూర్జేవాలా వర్గానికి చెందినవారు. మరికొందరు అభ్యర్థులను హైకమాండ్ ఎంపిక చేసింది.హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని, లోక్‌సభలో బీజేపీ బలం సగానికి తగ్గిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇది కూడా చదవండి: #SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు! -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతుల ఆగ్రహం
-
Gujarat: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిరసనకారుల విధ్వంసం
గుజరాత్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్గావ్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ కరణ్‌రాజ్ వాఘేలా ఉమర్గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్‌గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
త్రిపుర: ‘మా ఇళ్లు దగ్ధమౌతుంటే మీరెక్కడున్నారు?’
త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు. STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.READ: https://t.co/qbcXkrArtBVIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024 -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
అమేథీలో బీజేపీకి ఎదురుగాలి?
యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్‌పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్సింగ్ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కూడా తొలగించారని, రమణ్‌సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్‌లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్‌పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్‌ను స్కూల్‌కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్ళారు. పేరెంట్స్‌తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్‌లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్‌లో హింసాత్మక ప్రోగ్రామ్‌లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్‌లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్‌లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్‌ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
Akash Anand: మేనల్లుడికి షాకిచ్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆకాష్ ఆనంద్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్‌ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు. -
నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
-
'కోపం' ఇంత ప్రమాదకరమైనదా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
"తన కోపమే తనకు శత్రవుతన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌతన సంతోషమె స్వర్గముతన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ"! అన్న పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చాలామంది దీన్ని పాటించలేరు. కోపం శక్తి అలాంటిది. మెరుపుదాడిలా వచ్చేస్తుంది. అయితే ఈ కోపం వల్ల శత్రవులు పెరుగుతారు అని తెలుసుకున్నాం గానీ ఇది ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదకరమైనదే అట. కోపం కారణంగా శత్రుత్వం ఏర్పడి మనఃశాంతి కరువయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని విన్నాం గానీ. కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ కోపం గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేగాదు ఆ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి ప్రచురితమయ్యింది. శాస్త్రవేత్తలు కేవలం కొన్ని నిమిషాల కోపం ఆరోగ్యానికి చేటని, అది రక్తనాళాల పనితీరుని మార్చగలదని గుర్తించారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. కోపం తీవ్రతపై గుండెపోటు ప్రమాదం ఆధారపడి ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. కొద్దిపాటి కోపం హృదయ ఆరోగ్యాన్ని దారుణంగా దిగజారుస్తాయని అన్నారు. అందుకోసం కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్‌లోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ తదితర పరిశోధక బృందం సుమారు 280 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. వారిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక సముహాన్ని విచారం, ఆందోళన, కోపానికి గురయ్యే సంఘటనలకు గురి చేశారు. ఆ సముహం ఎనిమిది నిమిషాల వరకు ఈ స్థితిని ఫేస్ చేశారు. అలాగే వారందర్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకునేలా ఒకటి నుంచి 100 అంకెలు లెక్కపెట్టమన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తీవ్ర కోపానికి గురయ్యి బ్యాలెన్స్ తప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల రక్త నమునాలను పరిశీలించగా..కోపాన్ని నియంత్రించుకున్న వారికంటే..కోపానికి గురయ్యిన వారిలో రక్తనాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గడం గుర్తించారు పరిశోధకులు. అందులోనూ అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ తీవ్ర కోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఈజీగా పడుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ భావోద్వేగాలు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలో నిర్థారించారు. ఈ అధ్యయనం మానవుని మానసిక స్థితి, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పరిశోధకులు. అంతేగాదు ఈ పరిశోధన గుండె ఆరోగ్యం భావోద్వేగాలు, ఒత్తిడిని నిర్వహించడంపైనే ఆధారపడి ఉంటుందనేది హైలెట్ చేసిందని పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
"బయటికి పో..!" బండారు పై బాబు ఫైర్
-
బాబుపై భగ్గుమన్న శ్రీకాకుళం టీడీపీ
సాక్షి, శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ మూడో జాబితా ఆ పార్టీలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట ఆశావహులకు మొండి చేయి ఇస్తూ.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ప్రదర్శించారు. దీంతో అధినేత తీరుపై అసహనం ప్రదర్శిస్తున్నారు కార్యకర్తలు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు. చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయం పై లక్ష్మీదేవి అసంతృప్తితో రగిలపోతున్నారు. అనుచరులతో చర్చలు జరిపిన అనంతరం.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. -
జనసేనలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి
-
కార్యదర్శిపై మంత్రి పొన్నం ఆగ్రహం! ఎంపీడీవోకు ఆదేశాలు
కరీంనగర్: ప్రజాపాలన దరఖాస్తును చించేసిన పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. చిగురుమామిడికి చేరుకున్న మంత్రి సర్దార్‌సర్వాయిపాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించారు. మండలంలోని 17 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. బొమ్మనపల్లి గ్రామ ముఖ్యకార్యకర్తల సమావేశంలో అల్లెపు కనకయ్య తన ఆవేదనను మంత్రికి చెప్పుకున్నాడు. ప్రజాపాలనలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోగా జీపీ కార్యదర్శి రమణారెడ్డి దరఖాస్తు చించేశాడని, బొమ్మనపల్లి గ్రామం కాదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడని చెప్పాడు. మంత్రి వెంటనే జీపీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తును ఎందుకు చించావని, ప్రజలకు సేవచేయాల్సిందిపోయి ఇలాంటి పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సస్పెండ్ చేస్తామని, కనకయ్య ఇంటికెళ్లి దరఖాస్తు స్వీకరించాలని ఆదేశించారు. అంతటితో ఆగకుండా మండలపరిషత్ అభివృద్ధి అధికారి ఎం. నర్సయ్యకు ఫోన్ చేసి తక్షణమే పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేమే సేవకులమైనప్పుడు, ఉద్యోగులు కూడా సేవకులే అని అన్నారు. గ్రామాల్లో తప్పనిసరి పర్యటిస్తానని, అత్యవసరాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జెడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రవీందర్, అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్‌కుమార్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిసంఖ్యలో హాజరయ్యారు. ఇవి చదవండి: గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు