ఇంత జాప్యమా?
ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణంలో ఆలస్యంపై తుమ్మల అసహనం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొత్త క్వా ర్టర్లను సకాలంలో నిర్మించకపోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భవన సముదాయాన్ని తనిఖీ చేశారు. మార్చి 31లోగా పనులు పూర్తి చేసి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్నా ఆచరణలో విఫ లమవడంతో రెండుసార్లు అధికారులు గడువు పొడగించారు. చివర కు మే 31 నాటికి పూర్తి చేసి అప్పగిం చాల్సిందిగా చెప్పారు. కానీ అప్పటిలోగా పూర్తయ్యే అవకాశం లేకపోవటాన్ని తుమ్మ ల గుర్తించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈపాటికే భవన సముదాయాన్ని సిద్ధం చేసి అప్పగిస్తామని స్పీకర్‌కు హామీ ఇచ్చా మని, మూడోసారి గడువు పొడగించినా అప్ప ట్లోగా పూర్తి చేయలేని దుస్థితి నెల కొందని, ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థపై ఎందుకు చర్య తీసుకోవటం లేదని నిలదీశారు.