
అబద్ధాల చిట్టాతో ఢిల్లీలో తిరుగుతున్నారు
జేఏసీ చైర్మన్ కోదండరాంపై ఎమ్మెల్సీ కర్నె ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఢిల్లీలో అబద్ధాల చిట్టా పట్టుకుని తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో కోదండరాం అబద్ధాలతో ఎవరినీ మెప్పించలేరని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,45,000 కోట్లు అప్పులు తెచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అప్పులు తీర్చగలిగే వారికి ఎవరైనా అప్పులు ఇస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా ? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే అప్పులు తెస్తున్నామన్న విషయం కోదండరామ్‌కు తెలియదా అని ప్రశ్నించారు.