చండీగఢ్: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టిక్కెట్ పంపిణీలో భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై మహిళా నేత కుమారి సెల్జా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఇంకా ప్రచారానికి సిద్ధం కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో భూపేంద్ర సింగ్ హుడా తన వర్గం మినహా మిగిలిన నేతలందరినీ విస్మరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళా నేత సెల్జా తాను ఉక్లానా నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆమెకు ఆ స్థానం కేటాయించలేదు. ఉక్లానా నుంచి సెల్జా మేనల్లుడు హర్ష్‌కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనా అందుకు సెల్జా అంగీకారం తెలుపలేదు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కుమారి సెల్జాకు సన్నిహితంగా భావించే 90 మంది అభ్యర్థుల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్ దక్కింది. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు. 90 మందిలో 78 మంది అభ్యర్థులు హుడా వర్గానికి చెందినవారు కాగా, ఏడుగురు సెల్జా, ఇద్దరు సూర్జేవాలా వర్గానికి చెందినవారు. మరికొందరు అభ్యర్థులను హైకమాండ్ ఎంపిక చేసింది.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని, లోక్‌సభలో బీజేపీ బలం సగానికి తగ్గిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: #SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
Comments
Please login to add a commentAdd a comment