Selja
-
హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు
చండీగఢ్: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టిక్కెట్ పంపిణీలో భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై మహిళా నేత కుమారి సెల్జా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఇంకా ప్రచారానికి సిద్ధం కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపులో భూపేంద్ర సింగ్ హుడా తన వర్గం మినహా మిగిలిన నేతలందరినీ విస్మరించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మహిళా నేత సెల్జా తాను ఉక్లానా నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆమెకు ఆ స్థానం కేటాయించలేదు. ఉక్లానా నుంచి సెల్జా మేనల్లుడు హర్ష్‌కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనా అందుకు సెల్జా అంగీకారం తెలుపలేదు.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కుమారి సెల్జాకు సన్నిహితంగా భావించే 90 మంది అభ్యర్థుల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్ దక్కింది. ఇందులో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు. 90 మందిలో 78 మంది అభ్యర్థులు హుడా వర్గానికి చెందినవారు కాగా, ఏడుగురు సెల్జా, ఇద్దరు సూర్జేవాలా వర్గానికి చెందినవారు. మరికొందరు అభ్యర్థులను హైకమాండ్ ఎంపిక చేసింది.హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉందని, లోక్‌సభలో బీజేపీ బలం సగానికి తగ్గిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇది కూడా చదవండి: #SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు! -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్‌ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్‌కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్‌లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది. -
సరైన సమయంలో రాహుల్ కి బాధ్యత
జైపూర్: రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన సరైన సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి దూరమవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అదే సమయంలో పార్టీలో కీలక స్థానంలో పనిచేయడానికి ప్రియాంక గాంధీకి స్వాగతం పలికారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. 2017 లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ సోనియా, రాహుల్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాధిస్తుందని సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ డీఏ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. -
కేంద్ర మంత్రి షెల్జా రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి షెల్జా మంత్రి పదవికి రాజీనామా చేశారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీకి సేవలు అందించేందుకు వీలుగా ఆమె కేబినెట్ నుంచి వైదొలిగినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అజయ్ మాకెన్ కూడా గతేడాది కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ పదవిని తీసుకున్నారు. మరికొందరు మంత్రలు ఇదే బాటలో నడిచే అవకాశముందని భావిస్తున్నారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన షెల్జాకు కాంగ్రెస్ మరోసారి అవకాశం కల్పింది. హర్యానా నుంచి షెల్జా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. షెల్జా కేంద్ర మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు. 1990ల్లో పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో కూడా షెల్జా పనిచేశారు.