కేంద్ర మంత్రి షెల్జా మంత్రి పదవికి రాజీనామా చేశారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీకి సేవలు అందించేందుకు వీలుగా
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి షెల్జా మంత్రి పదవికి రాజీనామా చేశారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీకి సేవలు అందించేందుకు వీలుగా ఆమె కేబినెట్ నుంచి వైదొలిగినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అజయ్ మాకెన్ కూడా గతేడాది కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ పదవిని తీసుకున్నారు. మరికొందరు మంత్రలు ఇదే బాటలో నడిచే అవకాశముందని భావిస్తున్నారు.
రాజ్యసభ పదవీకాలం ముగిసిన షెల్జాకు కాంగ్రెస్ మరోసారి అవకాశం కల్పింది. హర్యానా నుంచి షెల్జా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. షెల్జా కేంద్ర మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు. 1990ల్లో పీవీ నరసింహారావు మంత్రి వర్గంలో కూడా షెల్జా పనిచేశారు.